ticket prices hike
-
‘దేవర’ నిర్మాతలకు ఏపీ హైకోర్టు షాక్!
దేవర సినిమా టికెట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. టికెట్ ధర పెంపును 14 రోజుల కాకుండా 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టికెట్ల రేటును పెంచుకునే వెలుసుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దేవర నిర్మాతలు విజ్ఞప్తి చేశారు. (చదవండి: పరారీలో హర్షసాయి.. పైగా ఇన్ స్టాలో పోస్టులు)దీంతో 14 రోజుల పాటు టికెట్ల రేటు పెంచుకునే వెసులుబాటుతో పాటు రిలీజ్ రోజు ఆరు ఆటలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీ చేసింది. అంతేకాకుండా 9 రోజుల వరకు ఐదు షోలు ప్రదర్శించుకునే వెలుసుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా దేవర టికెట్ ధర పెంపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. ధర పెంపును 14 రోజల వరకు పొడగించడాన్ని తప్పు పట్టింది. పెంచిన ధరలు 10 రోజుల వరకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
Hyderabad: మెట్రో ప్రయాణికులకు షాక్..
సాక్షి, హైదరాబాద్: మెట్రో చార్జీలపై రాయితీని ఎత్తేశారు. కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డులు, క్యూఆర్‌కోడ్‌పైన ప్రయాణం చేస్తున్న వారికి ఇప్పటి వరకు చార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రాయితీపైన కోత విధిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎల్అండ్టీ ప్రకటించింది. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకు అన్ని వేళల్లో 10 శాతం రాయితీ లభిస్తుండగా ఇక నుంచి రద్దీ లేని సమయాలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 12 వరకు మాత్రమే ఈ రాయితీ వర్తించనున్నట్లు అధికారులు తెలిపా రు. ఆఫ్ పీక్ అవర్స్‌లో భాగంగా రాయితీని కుదించినట్లు పేర్కొన్నారు. శనివారం నుంచే ఇది అమల్లోకి రానుంది. దీంతో ప్రతిరోజు మెట్రోలో రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులు ఇక సాధారణ చార్జీలపైనే రాకపోకలు సాగించవలసి వస్తుంది. మరోవైపు గుర్తించిన సెలవు రోజుల్లో కేవలం రూ.59కే అపరిమితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన సూపర్ సేవర్ ఆఫర్ ధరలను సైతం రూ.100కు పెంచింది. దీంతో ఇప్పటి వరకు కేవలం రూ.59 చెల్లించి సెలవు రోజుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణం చేసినవారు ఇక నుంచి ఎస్ఎస్ఓ–99 టిక్కెట్లపైన ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది కూడా శనివారం నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు చెప్పారు. అమాంతంగా పెంచింది. ఈ కొత్త పథకం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతుంది. దీంతో ఆఫర్ టిక్కెట్ల ధరలను సైతం ఏకంగా 40 శాతం పెంచినట్లయింది. 10 లక్షల మంది వినియోగించారు.. ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రవేశపెట్టిన ట్రావెల్యాజ్ యు లైక్ టికెట్ల తరహాలోనే హైదరాబాద్ మెట్రో రైల్ సూపర్ సేవర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. వీకెండ్స్, పండుగలు, ఇతర ప్రత్యేక సెలవు రోజుల్లో అతి తక్కువ చార్జీలతో మెట్రో రైళ్లలో రోజంతా ప్రయాణించే విధంగా అందుబాటులోకి తెచి్చన ఈ సూపర్ సేవర్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఎస్ఎస్ఓ–59 పేరుతో అమల్లోకి తెచ్చిన ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మందికి పైగా ప్రయాణం చేసినట్లు అంచనా. నగరవాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ సందర్శన కోసం వచ్చిన పర్యాటకులు, ఇతర పనులపైన నగరానికి వచ్చిన వారు సైతం ఈ ఆఫర్‌ను వినియోగించుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సూపర్ సేవర్ ధరలను హెచ్ఎంఆర్ఎల్ రూ.100కు పెంచి సూపర్ సేవర్ ఆఫర్ (ఎస్ఎస్ఓ)–99ను ప్రవేశపెట్టింది. అంటే ఇప్పటి వరకు రూ.60తో రోజంతా ప్రయాణం చేసిన వారు ఇక నుంచి రూ.100 చెల్లించవలసి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే ఎస్ఎస్ఓ–59 వినియోగిస్తున్న వారు అదనపు డబ్బులు చెల్లించి ఎస్ఎస్ఓ–99 కోసం వినియోగించవచ్చు. గుర్తించిన సెలవుల జాబితా ఆన్‌లైన్‌లోనూ, అన్ని మెట్రో స్టేషన్లలోనూ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రెగ్యులర్‌గా ప్రయాణించేవారు, సాధారణ ప్రయాణికులు ఎప్పటిలాగే మెట్రో సేవలను వినియోగించుంటారని ఆశిస్తున్నట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ అండ్సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. పెరిగిన రద్దీ మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో నగరవాసులు మెట్రో ప్రయాణం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూడు కారిడార్లలో ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పుల వరకు రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మూడు కారిడార్లలోని 57 స్టేషన్ల నుంచి ఇటీవల వరకు సుమారు 4 లక్షల మంది రాకపోకలు సాగించగా ఇప్పుడు ఆ సంఖ్య 4.4 లక్షలకు పెరిగింది. వేసవి తాపం కారణంగానే కూల్ జర్నీని ఎంపిక చేసుకొనే వారిసంఖ్య పెరుగుతోంది. -
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపునకు అనుమతి
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ మొదలుకానుంది. టాలీవుడ్ బడా హీరోలు పోటీకి దిగుతుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈనెల 12న విడుదల అవుతుండగా, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 13న సంక్రాంతి బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మేకర్స్‌కు తీపికబురు అందించింది. ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. టికెట్‌పై వీరసింహారెడ్డి చిత్రానికి 20 రూపాయలు, వాల్తేరు వీరయ్య చిత్రానికి 25 రూపాయలను పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనిపై జీఎస్టీ పెంపు అదనంగా ఉండనుంది.పెంచిన ధరలు రిలీజ్ డేట్ నుంచి పదిరోజుల పాటు ఉండనున్నాయి. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేకర్స్‌తో పాటు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విమాన చార్జీలను 15% పెంచాలి
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు గణనీయంగా పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల చార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. నిర్వహణ వ్యయాలను తట్టుకునేందుకు చార్జీలను కనీసం 10–15 శాతం పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతేడాది జూన్ నుంచి చూస్తే ఏటీఎఫ్ ధరలు ఏకంగా 120 శాతం పైగా ఎగిశాయని సింగ్ పేర్కొన్నారు. ‘ఇంత భారీ పెంపును తట్టుకునే పరిస్థితి లేదు. మన దగ్గర ఏటీఎఫ్‌పై పన్నులు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వరం పన్నులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి‘ అని ఆయన తెలిపారు. ఇంధన ధరల భారాన్ని ప్రయాణికులకు బదలాయించకుండా గత కొద్ది నెలలుగా తామే భరిస్తూనే ఉన్నామని సింగ్ చెప్పారు. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో 50 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణ వ్యవధిని బట్టి దేశీయంగా విమాన చార్జీలపై కేంద్రం కనిష్ట, గరిష్ట పరిమితులు అమలు చేస్తోంది. ఉదాహరణకు 40 నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టే ప్రయాణాలపై కనిష్టంగా రూ. 2,900 (జీఎస్టీ కాకుండా) కన్నా తక్కువ, గరిష్టంగా రూ. 8,800 (జీఎస్టీ కాకుండా)కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు. కోవిడ్ ఆంక్షలతో దెబ్బతిన్న విమానయాన సంస్థలు నష్టపోకుండా కనిష్ట చార్జీలపై, ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా గరిష్ట చార్జీలపై కేంద్రం పరిమితులు విధించింది. ఏటీఎఫ్ రేటు 16 % పెంపు అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు 16 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు రిటైలింగ్ దిగ్గజాలు గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. దీని ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 19,757 (16.26 శాతం) పెరిగి రూ. 1,41,232.87కి చేరింది. తాజా పెంపుతో లీటరు ఏటీఎఫ్ ధర రూ.141.2కి చేరినట్లయింది. ఈ ఏడాది వరుసగా పది సార్లు రేట్లు పెంచిన చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న స్వల్పంగా 1.3 శాతం (కిలో లీటరుకు రూ. 1,564 చొప్పున) తగ్గించాయి. కానీ అంతలోనే మళ్లీ పెంచడంతో ప్రస్తుతం ముంబైలో ఏటీఎఫ్ రేటు రూ. 1,40,093కి, కోల్‌కతాలో రూ. 1,46,322కి, చెన్నైలో రూ. 1,46,216కి చేరింది. స్థానిక పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజూ, ఏటీఎఫ్ రేట్లను ప్రతి 15 రోజులకోసారి ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఏటీఎఫ్ రేట్లు 11 సార్లు పెరిగాయి. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రెట్టింపయ్యాయి. జనవరి 1న ఏటీఎఫ్ రేటు రూ. 74,022.41గా ఉండగా 91 శాతం (రూ. 67,210.46) మేర పెరిగింది. -
హాలీవుడ్ స్ట్రాటజీతో 'మేజర్'.. సాధారణ రేట్లకే సినిమా
Adivi Sesh Plans Major Movie Nationwide Preview Before Release: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్లలో రిలీజ్ కానుంది. ఈ ప్రివ్యూలను హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో ప్రదర్శిస్తారు. ఇందుకోసం బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రివ్యూస్ చూడాలనుకునేవారు బుక్ మై షో లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా ప్రివ్యూలను హాలీవుడ్లో విడుదల చేస్తారు. సినిమా రిలీజ్‌కు ముందు పలు ప్రధాన నగరాల్లో పది లేదా నెల రోజుల గ్యాప్‌తో ప్రదర్శిస్తారు. తమ సినిమాలకు మరింత పాపులారిటీ తెచ్చుకునేందుకే ఈ తరహా స్ట్రాటజీని వాడతారు. ఇప్పుడు ఇదే టెక్నిక్‌ను తన సినిమా కోసం అడవి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకే ఈ ప్రివ్యూస్ వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా రిలీజ్‌కు ముందే ప్రివ్యూస్ వేయడం దేశంలోనే ఇదే తొలిసారి. చదవండి: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే: మహేశ్ బాబు అలాగే ఈ సినిమా టికెట్ రేట్లపై అడవి శేష్ ఇటీవల స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా 'ఆస్క్ శేష్' సెషన్లో ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది. 'టికెట్ రేట్లను తగ్గించండి. రిపీటెడ్‌గా సినిమా చూసేందుకు వీలుంటుంది. ఫలింతగా ఇండస్ట్రీని కాపాడొచ్చు.' అని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు శేష్ బదులిచ్చాడు. తమ సినిమా టికెట్లు సాధారణ రేట్లతో అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. 'ఇది సాధారణ ప్రేక్షకులు చూడాల్సిన అసాధారణ సినిమా' అని పేర్కొన్నాడు. దీంతో 'ఎఫ్ 3' మూవీ తర్వాత సాధారణ రేట్లకే టికెట్ రేట్లను కేటాయించిన సినిమాగా 'మేజర్' నిలిచింది. చదవండి: ‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
ఆ విషయంలో అందరు నన్ను నిందిస్తున్నారు: దిల్ రాజు
కోవిడ్ అనంతరం పెద్ద సినిమాల టికెట్ల రెట్స్‌ను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే మే 27న రిలీజ్ కాబోతోన్న విక్టరి వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా ఎఫ్ 3కి మాత్రం టికెట్ రెట్స్ పెంచడం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. దీంతో ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చారు. త్వరలో ఎఫ్ 3 మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. చదవండి: ఆ సీన్స్‌తో మళ్లీ రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ! ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ రెట్స్ పెంచడంలో తప్పులేదని, అయితే ఇది అన్ని సినిమాలకు వర్క్ కాదన్నారు. ‘కోవిడ్ సమయంలో సినిమా షూటింగ్ వాయిదా పడటం వల్ల బడ్జెట్ మరింత పెరిగింది. మరోవైపు అదే సమయంలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే సినిమాల చూడటం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారు. అయితే టికెట్ రెట్స్ పెంచడం వల్ల పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందొచ్చు. కానీ, అదే సమయంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు థియేటర్లకు వచ్చేందుకు ధైర్యం చేయలేదనే విషయాన్ని గమనించాను. చదవండి: తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు అంతేకాదు రెండు నుంచి మూడు సార్లు సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఒక్కసారి మాత్రమే థియేటర్‌కు వచ్చారు’ అని ఆయన అన్నారు. అయితే కోవిడ్ అనంతరం టికెట్ రెట్స్ పెరగడంపై ప్రతి ఒక్కరు తనని నిందిస్తున్నారని దిల్ రాజు అన్నారు. ఇది ప్రొడ్యూసర్స్‌తో పాటు హీరోలు కలిసి తీసుకున్న నిర్ణయమని, వారందరి తరపున తాను ఇన్సియేషన్ తీసుకున్నానే విషయం ప్రతి ఒక్కరు గమనించాలన్నాడు. అయితే తాను మాత్రం తన సినిమాను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే థియేటర్లోకి తీసుకువస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. -
నగరంలో కనీస బస్సు చార్జీ రూ.10
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల పిడుగు పడింది. ఆర్డినరీ కనీస చార్జీలను ఏకంగా రూ.5 నుంచి రూ.10కి పెంచారు. ఆ తర్వాత మూడో స్టేజీ నుంచి ఒక టికెట్‌పై రూ.5 పెంచేశారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీలను యథావిధిగా రూ.10 కొనసాగిస్తూనే... మూడో స్టేజీ నుంచి రూ.5 చొప్పున పెంచారు. ఎక్కువ దూరమున్న రూట్లలో కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ చార్జీల పెంపు రూ.5 నుంచి రూ.10 వరకు ఉంటుంది. మెట్రో డీలక్స్ బస్సుల్లో కనీస చార్జీలను రూ.10 నుంచి రూ.15కు పెంచారు. ఆ తర్వాత మెట్రో ఎక్స్‌ప్రెస్ తరహాలోనే చార్జీల పెంపు వర్తిస్తుంది. మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల చార్జీలను కొంతమేరకు తగ్గించనున్నారు. ఈ చార్జీల తగ్గింపుపై మరో వారం రోజుల్లో స్పష్టత రానుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. చార్జీల పెంపు వల్ల గ్రేటర్‌లోని 32లక్షల మంది ప్రయాణికులపై రోజుకు రూ.71 లక్షల భారం పడనుంది. ప్రతినెలా రూ.21.3 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.255.6 కోట్ల వరకు ఈ భారం ఉంటుంది. ప్రస్తుత చార్జీలపై 23.5 శాతం చొప్పున పెంచినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. చిల్లర సమస్యలను అధిగమించేందుకు వీలుగా హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు. చార్జీల పెంపు వల్ల ప్రతిరోజు రూ.76లక్షల ఆదాయం లభించినప్పటికీ.. నష్టాలను పూర్తిస్థాయిలో అధిగమించడం సాధ్యం కాబోదని ఈడీ తెలిపారు. ప్రస్తుతం ప్రతినెలా రూ.45 కోట్ల నష్టం వస్తోంది. చార్జీల పెంపు వల్ల రూ.21.3 కోట్లు అదనంగా లభిస్తుంది. అయినా మరో రూ.23.7 కోట్ల లోటు ఉంటుంది. నష్టాలను పూర్తిగా తగ్గించుకునేందుకు ట్రిప్పులను తగ్గించడంతో పాటు ఉదయం, రాత్రి ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేని సమయాల్లో షటిల్ సర్వీసులను తగ్గించనున్నట్లు ఈడీ పేర్కొన్నారు. అవసరం లేని ట్రిప్పులను తగ్గించడంతో పాటు, అవసరమైన మార్గాల్లో పెంచడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోను 69 శాతం నుంచి 73శాతానికి పెంచుకునేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
మరోసారి చార్జీలు పెంచే అవకాశం
సాక్షి, హైదరాబాద్ : గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ దాదాపు రూ.928 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈసారి అది రూ. వేయి కోట్లకు మించుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. తాజాగా 52 రోజుల పాటు జరిగిన సమ్మె వల్ల పరిస్థితి అంతా అస్తవ్యస్తమై ఆ నష్టం రూ.1,200 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అధికారులు ఇదే విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్‌కు కూడా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నష్టాలు ఈస్థాయిలో నమోదు కాలేదు. అప్పట్లో గరిష్టంగా రూ.718 కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పుడు ఒక్క టీఆఎస్ఆర్టీసీ నష్టాలే రూ.1200 కోట్లకు చేరుకునే స్థితి ఉత్పన్నం కావటం ఆందోళన పరుస్తున్న విషయం. పెరిగిన టికెట్ల ధరలతో రూ.850 కోట్ల మేర ఆదాయం పెరగనుంది. సమ్మె వల్ల అదనపు నష్టం నమోదై ఉండకపోతే ఆర్టీసీ స్థితి మెరుగ్గా ఉండేది. ఇప్పుడు ఆశించిన అదనపు ఆదాయం వచ్చినా నష్టాలదే పైచేయి కానుంది. మరోసారి పెంచే యోచన ప్రస్తుత టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులపై భారం పడనున్నప్పటికీ, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరోసారి కూడా చార్జీలు పెంచే అవకాశం ఉందనిపిస్తోంది. మరో 10 % మేర ధరలను సవరిస్తే నష్టాలను వీలైనంత మేర తగ్గించుకుని బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని అధికారుల అంచనా. మరో ఏడాది తర్వాత ప్రభుత్వానికి చార్జీలు పెంపుపై ప్రతిపాదించాలని యోచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వచ్చినందునే... సాధారణంగా ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు అనగానే ఇటు ప్రజలతోపాటు అటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమనటం సహజం. ఈసారి ఆ స్థాయిలో నిరసనలు లేవు. సమ్మె వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డ జనం, నిరసనల్లో ఆర్టీసీ కార్మికులు చెప్పిన మాటలతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై ఓ అంచనాకొచ్చినట్టు కనిపిస్తోంది. బస్సు చార్జీలు పెంచితే తప్ప పరిస్థితి చక్కబడదన్న మాటలు ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. ఇక రాజకీయ పార్టీలు కొన్ని విమర్శలు చేసినా .. నిరసనల వరకు వెళ్లకపోవటం గమనార్హం. బస్సు చార్జీల పెంపు వల్ల ఇతర వస్తువుల ధరలు కూడా భగ్గుమంటాయన్న ఆందోళన జనంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూరగాయలను బస్సుల్లో తరలిస్తుంటారు. చార్జీల మోతతో వాటి ధరలు కూడా పెంచుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
సిటీ బస్సు ఆదాయం రూ.324 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపు ప్రభావం హైదరాబాద్‌పై భారీగానే పడనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి వస్తున్న నష్టాల్లో సగం వాటా సిటీవే ఉంటున్నాయి. ఆ నష్టాలను వీలైనంత మేర తగ్గించేందుకు కసరత్తు మొదలైన తరుణంలో, చార్జీల పెంపు ఆర్టీసీకి బాగానే కలిసి రానుంది. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచగా, శాతాల్లో అది 18.80 శాతంగా ఉండనుంది. కానీ సిటీ సర్వీసుల వరకు వచ్చేసరికి అది 23 శాతంగా ఉంటోంది. కిలోమీటర్ల లెక్క కాకుండా సిటీలో స్టాపుల ప్రాతిపదికగా ఛార్జీ ల పెంపు ఉంది. పైగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బ స్సులకు రూ.5గా ఉన్న కనిష్ట ఛార్జీని రూ.20కి పెంచారు. నగరంలో ఉన్న బస్సుల్లో వీటి సం ఖ్యే ఎక్కువగా ఉండటం, ప్రయాణికుల సం ఖ్య కూడా వీటిల్లోనే ఎక్కువగా ఉంటుండటం తో ఈ మార్పు కూడా కలిసి రానుంది. వెరసి.. తాజా రేట్ల సవరణతో సిటీ సర్వీసులకు సం బంధించి వార్షికంగా రూ.324 కోట్ల మేర ఆదా యం వస్తుందని అధికారులు అంచనా. సమ్మె ప్రారంభం కావటానికి ముందు నగరంలో టికె ట్ రూపంలో రోజువారీ ఆదాయం సగటున రూ.3.06 కోట్లుగా ఉంది. çసమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనాలను ఆశ్రయించారు. ఇప్పుడు తిరిగి బస్సులు మొ దలైనందున వారంతా సిటీ బస్సుల్లోనే ఎక్కుతారని అంచనా. ఈ ఆదాయం అలాగే ఉంటే టికెట్ల ధరల సవరణ వల్ల నెలవారీ ఆదాయం రూ.27 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకు సిటీలో రూ.45 కోట్ల మేర నష్టం వస్తోంది. తాజాగా సమకూరే అదనపు ఆదాయంతో ఆ నష్టం మొత్తాన్ని రూ.18 కోట్లకు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. -
ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు.. ప్రయాణికులకు షాక్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రేపు(శుక్రవారం) విధుల్లో సంతోషంగా చేరాలని ఆదేశించారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరొచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్ ప్రయాణికులపై భారం మోపారు. టిక్కెట్ చార్జీలు పెంచారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్టు తెలిపారు. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఆర్టీసీ ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోలుకునేందుకు తాత్కాలికంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కార్మిక సంఘాలను క్షమించబోమని అన్నారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా యిచ్చారు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు. ఆర్టీసీ కార్మికులు క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా బోనస్‌లు ఇప్పిస్తానని, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. డిపో నుంచి ఇద్దరితో వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రియలైజ్ కావాలనే తాను సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించానని వెల్లడించారు. కార్మిక నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఆర్టీసీ కార్మికులను మోసం చేశారని విమర్శించారు. అడ్డం పొడవు మాట్లాడి ఇంకా కార్మికులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించానని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సంస్థ బతకాలన్నది తన ఉద్దేశమని, కార్మికుల మంచిచెడులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘మీరు బతకండి.. సంస్థను బతికించండి’ అంటూ ఆర్టీసీ కార్మికులకు హితవు పలికారు. వారం తర్వాత ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిచి స్వయంగా మాట్లాడతానని చెప్పారు. ఆర్టీసీ సంబంధించిన అన్ని వివరాలను వారికి అందజేస్తానని అన్నారు. ఆర్టీసీని ఏం చేయాలో కార్మికులే చెప్పాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులపై తమకు ఎటువంటి కక్ష లేదని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే... ఆర్టీసీపై మేము అనుకున్నది వేరు. బయట సన్నాసులు ప్రచారం చేసింది వేరు. టెంట్ కనిపిస్తే మాట్లాడే వాళ్లు ఏదేదో మాట్లాడి ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారు. ఆర్టీసీ కార్మికులకు అనవసర ఆశలు కల్పించి, ఓట్ల కోసం చలి మంటలు కాచుకున్నారు. సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పడానికి లేబర్ కోర్ట్ అవసరం లేదు. అతి కల్పించింది ఆర్టీసీ కార్మిక నేతలు, ప్రతిపక్షాలే. అడ్డం పొడవు మాట్లాడి కార్మికులను మభ్యపెడుతున్నారు. కేంద్రంలో ఎల్లయ్యకు చెప్తే ఏమవుతుంది? తియ్యటి, పుల్లటి మాటలు తప్ప కేంద్రం నుంచి 5 వందల కోట్లు తెస్తారా? ఆర్టీసీ కార్మికులకు ఒక్క అవకాశం ఇవ్వాలని మంత్రులు చెప్పారు. కార్మికులు ఇప్పటికైనా రియలైజ్ కావాలి. బాధ్యత గల ప్రభుత్వంగా సంస్థ మనుగడ కోసం చార్జీలు పెంచుతున్నాం. ఆర్టీసీని పెట్టుబడుదారులకు ఇవ్వం. ఆరు రోజుల్లో ఢిల్లీ వెళ్లి వచ్చి అన్ని డిపోల నుండి 5 మంది కార్మికులతో స్వయంగా మాట్లాడతా. యూనియన్లను రానివ్వం. చిల్లర మాటలు పట్టించుకోము. -
పండుగ రోజుల్లో చార్జీల మోత!
న్యూఢిల్లీ: డిమాండ్‌కు అనుగుణంగా టికెట్ ధరలు పెంచే డైనమిక్ విధానంలో భాగంగా దీపావళి, దుర్గాపూజ, క్రిస్మస్ వంటి పండుగలతో పాటు వారాంతాల్లో టికెట్ ధరల్ని 10–20 శాతం పెంచాలని రైల్వేశాఖకు ప్రతిపాదనలు అందాయి. తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖాళీ బెర్తులున్న రైళ్లలో టికెట్ ధరలపై 10–30 శాతం రాయితీ ఇవ్వాలని తూర్పు, పశ్చిమ, పశ్చిమ మధ్య రైల్వేజోన్లు సిఫార్సు చేశాయి. ఒకే మార్గంలో వెళ్లే సాధారణ రైళ్లతో పోలిస్తే హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల నుంచి అధికంగా గంటకు ఇంత అని వసూలుచేయాలని జోన్లు ఇందులో ప్రతిపాదించాయి. వీటితో పాటు రాత్రిపూట ప్రయాణించే, పాంట్రీకారు సౌకర్యమున్న రైళ్లలో కూడా ప్రీమియం చార్జీలు వసూలు చేయాలని రైల్వేజోన్లు సిఫార్సుచేశాయి. ప్రయాణికులు ప్రాధాన్యం ఇచ్చే దిగువ బెర్తులు, తలుపుకు దగ్గరగా ఉండే కేబిన్లకు కూడా అధిక చార్జీలు వసూలు చేయనున్నారు. దీంతో పాటు ఒక్కో బెర్త్‌కు అప్‌గ్రెడేషన్ చార్జీల కింద రూ.20 వసూలుచేయాలని ప్రతిపాదించాయి. ప్రీమియం చార్జీలు, రాయితీలపై డిసెంబర్ 31 కల్లా తుదినిర్ణయం తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. 213 రైల్వే ప్రాజెక్టుల్లో పెరిగిన వ్యయం: భారత రైల్వే అమలుచేస్తున్న 353 ప్రాజెక్టుల్లో 213 ప్రాజెక్టుల(60శాతం) అంచనా వ్యయం పలు కారణాలతో పెరిగిపోయిందని కేంద్రం తెలిపింది. 2017 సెప్టెంబర్‌లో ఈ 213 ప్రాజెక్టుల్లో అంచనా వ్యయం రూ.1.61 లక్షల కోట్లు పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ వెల్లడించింది. తొలుత ఈ ప్రాజెక్టుల వాస్తవ వ్యయం రూ.1.21 లక్షల కోట్లుగా నిర్ణయించగా.. వివిధ కారణాలతో రూ.2.83 లక్షల కోట్లకు చేరుకుందని పేర్కొంది. ‘త్రినేత్ర’తో చెక్! సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రమాదాల నివారణకు రైల్వేశాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా దూరంగా ఉండే ట్రాక్ పరిస్థితిని తెలుసుకునేలా ‘త్రినేత్ర’ అనే ప్రత్యేక వ్యవస్థను త్వరలో రైళ్లలో అమర్చనుంది. ఇన్ఫ్రారెడ్, లేజర్ కిరణాలతో పనిచేసే త్రినేత్ర.. దూరంగా ఉండే ట్రాక్‌లో లోపాల్ని, దానిపై అడ్డంకుల సమాచారాన్ని ముందుగానే లోకోపైలెట్‌కు చేరవేస్తుంది. ట్రాక్ స్థితిగతుల్ని లోకోపైలెట్ తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక డిస్ప్లే ఏర్పాటుచేయనున్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో రైళ్లకు తీవ్ర ఇబ్బందిగా మారిన మంచు సమస్యను అధిగమించవచ్చని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. -
రోజుకు ఐదు షోలు.. టికెట్ల ధరల పెంపు!
► హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నిర్మాతల వినతి సాక్షి, అమరావతి ప్రేక్షకులు మరీ ఇబ్బంది పడకుండా టికెట్ల ధరలను పెంచేందుకు తాము చేసిన ప్రతిపాదనలను పరిశీలించాలని సినీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధను కోరారు. అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోడానికి కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధతో సినీ నిర్మాతలు దగ్గుబాటి సురేష్, కళ్యాణ్, దామోదర్, ప్రసాద్‌లు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజుకు ఐదు షోలకు అనుమతి ఇవ్వాలని, టిక్కెట్లను ఆన్లైన్లో మాత్రమే విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆమెను కోరినట్లు తెలిపారు.