రోజుకు ఐదు షోలు.. టికెట్ల ధరల పెంపు!
► హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నిర్మాతల వినతి
సాక్షి, అమరావతి
ప్రేక్షకులు మరీ ఇబ్బంది పడకుండా టికెట్ల ధరలను పెంచేందుకు తాము చేసిన ప్రతిపాదనలను పరిశీలించాలని సినీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధను కోరారు. అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోడానికి కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధతో సినీ నిర్మాతలు దగ్గుబాటి సురేష్, కళ్యాణ్, దామోదర్, ప్రసాద్‌లు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజుకు ఐదు షోలకు అనుమతి ఇవ్వాలని, టిక్కెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆమెను కోరినట్లు తెలిపారు.