బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ మొదలుకానుంది. టాలీవుడ్ బడా హీరోలు పోటీకి దిగుతుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈనెల 12న విడుదల అవుతుండగా, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 13న సంక్రాంతి బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మేకర్స్‌కు తీపికబురు అందించింది. ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. టికెట్‌పై వీరసింహారెడ్డి చిత్రానికి 20 రూపాయలు, వాల్తేరు వీరయ్య చిత్రానికి 25 రూపాయలను పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనిపై జీఎస్టీ పెంపు అదనంగా ఉండనుంది.పెంచిన ధరలు రిలీజ్ డేట్ నుంచి పదిరోజుల పాటు ఉండనున్నాయి. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేకర్స్‌తో పాటు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment