Ticket Prices
-
Hyderabad: ‘జూ’ టికెట్ ధరలు పెరిగాయ్
హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూ పార్కు సందర్శనకు కొత్త టికెట్ రేట్లు ఈ నెల 1 నుంచి (శనివారం) అమలులోకి రానున్నాయి. గతంలో పెద్దలకు వారం రోజుల్లో రూ.70, చిన్నారులకు రూ.45 ఉండగా.. వీకెండ్‌తో పాటు సెలవు రోజుల్లో రూ.80, రూ.55 ఉండగా.. ప్రస్తుతం రెండు కేటగిరీలుగా కాకుండా వారం రోజుల్లో పెద్దలకు రూ.100, చిన్నారులకు రూ.50గా నిర్ధారించారు. వీటితో పాటు జూ సందర్శనలో వివిధ కేటగిరీలకు కూడా రేట్లు పెరిగాయి. కొత్త రేట్లు ఇలా.. గతంలో రూ.120 టికెట్ ఉన్న స్టిల్ కెమెరాకు ప్రస్తుతం రూ.150 వసూలు చేస్తారు. రూ.600 ఉన్న వీడియో కెమెరాకు రూ.1900 పెంచి రూ.2500గా నిర్ధారించారు. ఇక మూవీ కెమెరా షూటింగ్ (కమర్షియల్)కు రూ.10 వేలు, టాయ్ ట్రైన్‌కు పెద్దలకు రూ. 80, చిన్నారులకు రూ.40, బ్యాటరీ వెహికిల్ పెద్దలకు రూ.120, చిన్నారులకు రూ. 70, ఒక గంట పాటు తిరిగే 11 సీటర్ల వెహికిల్‌కు రూ.3000, 14 సీటర్ల వెహికిల్స్‌కు 4000, ఏసీ సఫారీ బస్సు ఒకొక్కరికి రూ. 150, నాన్ ఏసీ బస్సు రూ.100 చొప్పున కొత్త రేట్లు ఉండనున్నాయి. నేవిగేషన్ యాప్‌తో.. అంతేకాకుండా ప్రస్తుతం జూ సందర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా ముందస్తుగానే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మొబైల్ నేవిగేషన్ యాప్‌తో గైడ్ లేకుండానే జూ పార్కును చుట్టి రావచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని జూ సందర్శనకు వెళితే.. అన్ని ఎన్‌క్లోజర్స్‌తో పాటు ఇతర సమాచారం ఇట్టే మన కళ్ల ముందుంటుంది. -
పండుగ బస్సు..‘ప్రత్యేక’ చార్జీ
సాక్షి, హైదరాబాద్: పండుగపూట ప్రయాణికులను సురక్షి తంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. సంక్రాంతిని పురస్కరించు కుని 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. పండుగ సందర్భంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేప థ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను అందుబాటు లో ఉంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా ఈ నెల 19, 20 తేదీల్లో తి రుగు ప్రయాణ రద్దీ దృష్ట్యా కూడా ప్రత్యేక బస్సులు ఏ ర్పాటు చేస్తోంది.హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ బ స్స్టేషన్లు, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రా స్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. కాగా, పండుగపూట నడిపే ప్రత్యేక బస్సుల చార్జీలను ఆర్టీసీ సవరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటిన్నర రెట్ల వరకు ధరలను సవరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. పెంచిన చార్జీలు ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అమలు చేస్తారు.ఈ నెల 10, 11, 12 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 19, 20 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలను అమలు చేస్తామని, స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. ఇదిలా ఉండగా పండుగలు, ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www. tgsrtcbus. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–69440000, 040–23450033 సంప్రదించాలని సూచించింది. -
అప్పుడు భయం ప్రారంభమైంది: ‘దిల్’ రాజు
‘‘గత కొన్నేళ్లుగా నేను నిర్మించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్స్ కాలేకపోయాయి. అనుకున్న రిజల్ట్‌తో సినిమాలు రావటం లేదని నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అనడంతో నాలో తెలియని భయం ప్రారంభమైంది. నాలో స్టోరీ జడ్జ్మెంట్ పోయిందా? మళ్లీ హీరోల కాంబినేషన్ లకే వెళ్లాలా? అని ఆలోచించాను. చిత్ర పరిశ్రమలో విజయాలు ఉంటేనే విలువ ఉంటుంది. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో కచ్చితంగా నేను కమ్ బ్యాక్ అవుతాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు.రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ చేంజర్’ ఈ నెల 10న, వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ నెల 14న విడుదల కానున్నాయి. ఈ సినిమాల నిర్మాత ‘దిల్’ రాజు సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు...⇒ ‘గేమ్ చేంజర్’ నాకెంతో ప్రత్యేకమైన సినిమా. 2021 ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించాను. ఈ మూవీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూశాను. ‘భారతీయుడు 2’ సినిమా తర్వాత శంకర్‌గారి నుంచి వస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్‌చరణ్ నటించిన సినిమా కూడా ఇదే. కాబట్టి ఈ మూవీ విజయం మా ముగ్గురికీ ఎంతో ముఖ్యం. అన్ని వాణిజ్య అంశాలతోపాటు గౌరవంగా ఫీల్ అయ్యే సినిమా ‘గేమ్ చేంజర్’. ⇒ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అని అంటున్నారు. ఈ బజ్ రావటానికి కారణం అనిల్ రావిపూడి. ‘ఎఫ్ 2’ లాగా సూపర్ హిట్ కొట్టాలని కష్టపడ్డాడు. ఈ సినిమా కూడా బిగ్ హిట్ కాబోతోంది. ఏపీలో సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ ధరలపై ఓ స్పష్టత వచ్చింది. ఈ విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని కూడా కలిసి వినతి చేస్తాను. అయితే తుది నిర్ణయం ప్రభుత్వానిదే.మృతులకు సాయంఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి, తిరిగి వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి కుటుం బాలకు హీరో రామ్‌చరణ్ ఐదు లక్షల చొప్పున పది లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే నిర్మాత ‘దిల్’ రాజు కూడా చెరో ఐదు లక్షల చొప్పున పది లక్షలు సాయం అందించడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉంటానని ప్రకటించారు. -
దేవర టికెట్ అధిక ధరలను 10 రోజులకే పరిమితం చేయండి
సాక్షి, అమరావతి: దేవర సినిమా టికెట్లను 14 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆ టికెట్లను మొదటి 10 రోజులకు మాత్రమే అధిక ధరలకు అనుమతినివ్వాలని, సినిమా టికెట్ ధరల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీకి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. వాస్తవానికి జీవో 13 ప్రకారం మొదటి 10 రోజులకే అధిక ధరలకు టికెట్లు అమ్ముకోవాల్సి ఉంటుందని గుర్తుచేసింది. 20 శాతం మేర షూటింగ్ ఏపీలో జరిగిన భారీ బడ్జెట్ చిత్రాలకే అధిక ధరలకు అమ్ముకునే వెసులుబాటు ఉందని, ఈ విషయంలో నిర్మాత ఎలాంటి వివరాలను పొందుపరిచినట్లు కనిపించడం లేదంది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నామని కోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఈ నెల 27న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలను 14 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ నెల్లూరు జిల్లా, కావలికి చెందిన పి.శివకుమార్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
ఎయిర్‌లైన్స్‌కు పండుగే!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సందర్భంగా విమాన ప్రయాణాల బుకింగ్‌లకు ఇప్పటి నుంచే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు మార్గాల్లో 10 శాతం నుంచి 25 శాతం మధ్య టికెట్ ధరలను పెంచేశాయి. దీపావళి సమయంలో ప్రయాణ టికెట్ల ధరలు 10–15 శాతం పెరగ్గా.. ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6–15 మధ్య) కేరళలోని పలు పట్టణాలకు వెళ్లే విమాన సరీ్వసుల్లో టికెట్ ధరలు గతేడాదితో పోల్చి చూస్తే 20–25 శాతం మేర పెరిగినట్టు ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో డేటా తెలియజేస్తోంది. దీపావళి సమయంలో ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, దీంతో విమానయాన టికెట్ల ధరలు గతేడాదితో పోలిస్తే అధికమైనట్టు ఇక్సిగో గ్రూప్ సహ సీఈవో రజనీష్ కుమార్ తెలిపారు. → అక్టోబర్ 30–నవంబర్ 5 మధ్య ఢిల్లీ–చెన్నై మార్గంలో ఒకవైపు ప్రయాణానికి ఎకానమీ తరగతి నాన్ స్టాప్ ఫ్లయిట్ టికెట్ ధర రూ.7,618గా ఉంది. క్రితం ఏడాది నవంబర్ 10–16తో పోల్చి చూస్తే 25 శాతం ఎక్కువ. → ఇదే కాలంలో ముంబై–హైదరాబాద్ మార్గంలో ఫ్లయిట్ టికెట్ ధరలు 21 శాతం పెరిగి రూ.5,162కు చేరాయి. → ఢిల్లీ–గోవా సరీ్వసుల్లో టికెట్ ధరలు 19 శాతం పెరిగి రూ.5,999కు, ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గంలో ఇంతే మేర పెరిగి రూ.4,980గా ఉన్నాయి. → హైదరాబాద్–తిరువనంతపురం మార్గంలో టికెట్ ధరలు 30 శాతం ఎగసి రూ.4,102కు చేరాయి. → కానీ, పండుగల సీజన్లోనే కొన్ని మార్గాల్లో టికెట్ చార్జీలు 1–27 శాతం మధ్య తగ్గడం గమనార్హం. ఉదాహరణకు బెంగళూరు–హైదరాబాద్ మార్గాల్లో టికెట్ ధరలు 23 శాతం తగ్గి రూ.3,383గా ఉంటే, ముంబై–జమ్మూ ఫ్లయిట్లలో 21 శాతం తక్కువగా రూ.7,826కే లభిస్తున్నాయి. → ముంబై–అహ్మదాబాద్ విమాన సరీ్వసుల్లో 27 శాతం తక్కువకే రూ.2,508 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబై–ఉదయ్‌పూర్ మధ్య టికెట్ ధర 25 శాతం తగ్గి రూ.4,890గా ఉంది.విమాన ప్రయాణికుల జోరు దేశీయంగా జూలైలో 1.29 కోట్ల మందికిపైగా విమాన ప్రయాణాలు సాగించారు. 2023 జూలైతో పోలిస్తే ఇది 7.3 శాతం అధికం. అయితే 2024 జూన్‌తో పోలిస్తే గత నెల ప్రయాణికుల సంఖ్య 2.27 శాతం తక్కువగా ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. దేశీయ విమాన ప్రయాణికుల విషయంలో ఇండిగో తన హవాను కొనసాగిస్తూ మార్కెట్ వాటాను జూలైలో 62 శాతానికి పెంచుకుంది. ఎయిర్ ఇండియా వాటా 14.3 శాతానికి వచ్చి చేరింది. విస్తారా వాటా 10 శాతానికి, ఆకాశ ఎయిర్ వాటా 4.7 శాతానికి పెరిగాయి. -
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపునకు అనుమతి
బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ మొదలుకానుంది. టాలీవుడ్ బడా హీరోలు పోటీకి దిగుతుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈనెల 12న విడుదల అవుతుండగా, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 13న సంక్రాంతి బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మేకర్స్‌కు తీపికబురు అందించింది. ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. టికెట్‌పై వీరసింహారెడ్డి చిత్రానికి 20 రూపాయలు, వాల్తేరు వీరయ్య చిత్రానికి 25 రూపాయలను పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనిపై జీఎస్టీ పెంపు అదనంగా ఉండనుంది.పెంచిన ధరలు రిలీజ్ డేట్ నుంచి పదిరోజుల పాటు ఉండనున్నాయి. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేకర్స్‌తో పాటు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పక్కా కమర్షియల్.. బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతు దొరికిపోయిన కమెడియన్!
గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ టికెట్స్‌ను బ్లాక్‌లో అమ్ముతూ దొరికిపోయాడు కమెడియన్ సప్తగిరి. సప్తగిరి ఈ చిత్రంలో తన కమెడియన్గతో నవ్వించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సప్తగిరి బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం సప్తగిరి మారుతి చివాట్లు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇదంత నిజం కాదండోయ్. చదవండి: ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు జూలై 1న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ రేట్స్‌పై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. పక్కా కమరయల్ టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయనా అని ప్రతి ఒక్కరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ రేట్స్‌పై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం ఇలా కొత్తగా ప్లాన్ చేసింది. గీతా ఆర్ట్స్ వారు తమ యూట్యూబ్ చానల్లో షేర్ చేసినీ ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్ టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి దొరికపోయాడు. ఏంటి.. టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్నావా? అని మారుతి అడగ్గా... అవును సర్.. సినిమాల్లోకి రాకముందే చిరంజీవి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అని బదులిస్తాడు. అయితే ఒక టికెట్‌ను ఎంతకు అమ్ముతున్నావని అడగ్గా.. 150 రూపాయలకు అంటాడు. దీనికి కౌంటర్లో కూడా ఇదే రేట్‌కు ఇస్తున్నారు కదా! అంటాడు మారుతి. అది విని షాక్ అయిన సప్తగిరి అంటే పాత రేట్స్‌కే సినిమాను ప్రదర్శిస్తున్నారా? అని ప్రశ్నిస్తాడు. చదవండి: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్ దీంతో మారుతి అవునయ్యా.. ఈ సినిమాను నాన్ కమర్షియల్ రెట్స్‌కే అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్మాత బన్నీ వాసు మూవీ ప్రమోషన్లో చెబుతున్నాడు కదా! అది వినలేదా? అని చెప్పగా. అవునా సర్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు సప్తగిరి. ఇక మూవీ టికెట్ రేట్స్‌పై వివరణ ఇస్తూ మరుతి.. ‘మా పక్కా కమర్షియల్ సినిమా మిమ్మిల్ని మళ్లీ పాత థియేటర్ల వైభవం రోజులకు తీసుకెళ్లడానికి సందడిగా హ్యాపీగా నవ్వుతూ మూవీని ఎంజాయ్ చేసేందుకు పాత రెట్స్‌కే() ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాను థియేటర్లోనే చూడండి. గ్రూపులు వచ్చి మా సినిమాను ఎంజాయ్ చేయండి. పాత టికెట్స్ రెట్స్‌కే మా సినిమాను థియేటర్లో ప్రదర్శించబోతున్నాం’ అంటూ డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే -
సినిమా టికెట్ ధరల నిర్ణయం లైసెన్సింగ్ అథారిటీదే
సాక్షి, అమరావతి: టికెట్ ధరలు, సర్వీసు చార్జీలను లైసెన్సింగ్ అథారిటీ (జాయింట్ కలెక్టర్) మాత్రమే నిర్ణయించగలదని, ప్రభుత్వం కాదని హైకోర్టు పేర్కొంది. టికెట్ ధరలు, సర్వీసు చార్జీల విషయంలో ప్రభుత్వం తన అభిప్రాయాలను తెలియచేయగలదని, నిర్ణయం తీసుకోవాల్సింది లైసెన్సింగ్ అథారిటీనేనని స్పష్టం చేసింది. ఆన్లైన్ టికెట్ల విక్రయం సందర్భంగా సినిమా థియేటర్లు ప్రేక్షకులకు విధించే సర్వీసు చార్జీని టిక్కెట్ ధరలో కలపడానికి వీల్లేదని పేర్కొంది. సర్వీసు చార్జీ విధింపు నిధుల మళ్లింపునకు దారితీయదని తెలిపింది. ఆన్లైన్ టికెట్ల విక్రయ ప్రక్రియ రికార్డవుతుందని, అందువల్ల నిధుల దుర్వినియోగం, మళ్లింపు రిస్క్ ఉండదని పేర్కొంది. ఆన్లైన్ ద్వారా విక్రయించే టికెట్ మొత్తం ధరలో సర్వీసు చార్జీని కలపడాన్ని తప్పుబట్టింది. పాత విధానంలోనే ఆన్లైన్ టికెట్లను విక్రయించుకోవచ్చునని, ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ప్రేక్షకుడిపై సర్వీసు చార్జీ భారం మోపవచ్చని తెలిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ ధరలను ఖరారు చేస్తూ జారీచేసిన జీవోను, సర్వీసు చార్జీని కూడా కలిపి ఆన్లైన్ టికెట్ ధరను నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. క్యూలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే అవసరం లేకుండా, ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ‘ప్రత్యేక సౌకర్యం’ ప్రేక్షకులకు కల్పిస్తున్నామని, ఇందుకు తాము వసూలుచేసే సర్వీసు చార్జీని టికెట్ ధరలో కలపడానికి వీల్లేదని అసోసియేషన్ వాదించింది. ఈ వ్యాజ్యంపై గత వారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరిన విధంగా బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్లను సంప్రదించలేదు ‘సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మల్టీప్లెక్స్ థియేటర్లు భాగం కాదు. ఆ కమిటీ కూడా టికెట్ ధరలు నిర్ణయించే సమయంలో ఈ మల్టీప్లెక్స్ థియేటర్లను సంప్రదించలేదు. వారిని సంప్రదించినట్లుగానీ, వారి అభ్యంతరాలు స్వీకరించినట్లుగానీ చూపేందుకు ఎలాంటి డాక్యుమెంట్‌ను ఈ కోర్టు ముందుంచలేదు. ఈ కోర్టు ప్రాథమిక అభిప్రాయం ప్రకారం ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించినందుకు సినిమా థియేటర్లు ప్రేక్షకుడిపై విధించే సర్వీసు చార్జీని టికెట్ మొత్తం ధరలో కలపడానికి వీల్లేదు. సినిమా హాలులో ప్రవేశానికి చెల్లించే ధరే.. అసలు టికెట్ ధర. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఉపయోగించుకున్నందుకు విధించే చార్జీలను అసలు టికెట్ ధరగా పరిగణించడానికి వీల్లేదు. టికెట్ ధరలను నిర్ణయించే అధికారాన్ని కూడా పిటిషనర్ ప్రశ్నించారు. జీవో 69 ప్రకారం టికెట్ ధరలను నిర్ణయించాల్సింది లైసెన్సింగ్ అథారిటీయే తప్ప ప్రభుత్వం కాదు. గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాల ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ టికెట్ ధరలను నిర్ణయిస్తుంది. ఈ విషయంపై లోతుగా విచారణ జరపాలి..’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అధిక ధరకు 'ఆర్ఆర్ఆర్' టికెట్లు.. ఎక్కడ ? ఎలా ఉన్నాయంటే ?
The Most Expensive RRR Movie Tickets In Mumbai: రౌద్రం.. రణం.. రుధిరం.. యావత్ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూసిన చూసిన చిత్రమిది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం వీక్షించేందుకు సమయం సమీపించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ నటనను చూసేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా విడుదలకు సుమారు నాలుగేళ్లు కష్టపడింది చిత్రబృందం. అయితే ఇప్పుడు ఈ సినిమా వీక్షించడానికి అధిక ధర పెట్టి టికెట్ కొనాల్సిందే. చదవండి: 'ఆర్ఆర్ఆర్'లో అలరించే కీలక పాత్రధారులు వీరే.. ఇప్పటికీ ఈ సినిమా బుకింగ్‌లో ప్రారంభమయ్యాయి. అనేక థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లలో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశారు. ముంబైలో టికెట్ల ధర చాలా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని వర్లీలోని ఒక థియేటర్లో అత్యంత ఖరీదైన 3డీ టికెట్ ధర రూ. 2000గా ఉంది. నగరంలోని ఇతర మల్టీఫ్లెక్స్‌లలో కూడా టికెట్లను రూ. వెయ్యి నుంచి 1500 వరకు విక్రయిస్తున్నారు. అలాగే 2డీలో అత్యంత ఖరీదైన టికెట్ ధర రూ. 1900కు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఈ 3డీ ధర రూ. 2100కుపైగా ఉండగా.. హైదరాబాద్‌లో సుమారు అన్ని థియేటర్లలు, మల్టీఫ్లెక్సులలో టికెట్లను డిస్ట్రిబ్యూటర్లే బ్లాక్ చేసి ఒక్కో టికెట్‌ను రూ. 3 వేలకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ 'ఆర్ఆర్ఆర్' సినిమాను 2డీ, 3డీ ఫార్మాట్లతో పాటు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఫార్మాట్లలోనూ విడుదల చేస్తున్నారు. ఈ ఫార్మాట్లలో మొట్టమొదటిసారిగా విడుదలైన తొలి భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' గుర్తింపు పొందింది. చదవండి: వారణాసిలో 'ఆర్ఆర్ఆర్' త్రయం.. వీడియో వైరల్ -
ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
పవన్ సినిమాను తొక్కేయడమేంటి?: మంత్రి పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్.. వాళ్ల వాళ్ల జీవితాల్లో రాజకీయాలకు వాడుకోని వస్తువు అంటూ ఏదీలేదని ఏకీపారేశారు ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి నాని.. పవన్ కల్యాణ్ కొత్త సినిమా విషయంలో ప్రతిపక్షం చేస్తున్న రాద్ధాంతంపై స్పందించారు. ‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుభవం ఏపాటిదో ఇప్పుడు అర్ధమవుతోంది. ఒక సినిమా రిలీజ్ ఉంటే దానికోసం ఈ తండ్రీకొడుకులు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాని మేం(ప్రభుత్వం) తొక్కడం ఏమిటి?. ఎన్టీఆర్, హరికృష్ణలను మీరూ చేసింది తొక్కడమంటే!. పవన్ సినిమా చూడమంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. టీడీపీ జెండా మోసిన జూ. ఎన్టీఆర్‌ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అంటూ పేర్ని నాని, నారా లోకేష్‌ను నిలదీశారు. జూ. ఎన్టీఆర్ సినిమాను చంద్రబాబు ఒక్కసారైనా ప్రశంసించారా? జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు మీరు ఇలా ఎప్పుడైనా తహతహలాడారా?. కుప్పంలో వన్ సైడ్ లవ్ ఉండదు అన్నావు? ఇదేమి లవ్...ఏ సైడ్ లవ్?. పవన్ కళ్యాణ్ గురించి మేము ఎప్పుడు పట్టించుకున్నాం? అంటూ చంద్రబాబు, లోకేష్‌పై విసుర్లు విసిరారు మంత్రి నాని. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని చంద్రబాబు ప్రతి వ్యవస్థను దిగజరిస్తే వాటిని మేము గాడిలో పెడుతున్నాం. అలాంటి మాపై దిగజారుడు మాట్లాడుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోడానికి, వ్యవస్థ దెబ్బతినడానికి చంద్రబాబు కారణం. బ్లాకులో టికెట్లు అమ్ముతుంటే చూస్తూ ఉండాలా? ప్రభుత్వం నిర్దేశించిన రేటు కాకుండా వేరే రేటు అంటే చట్టాన్నే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా?. ధరలపై ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వంతో సంప్రదించి ధరలను నిర్ణయించుకోండి అని చెప్పారు. సినిమా పెద్దలు వచ్చారు.. జీవో ఇస్తామన్నారు.. ఇప్పుడు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని గౌతమ్‌రెడ్డి మృతితో జీవో ఆలస్యం చట్టాన్ని గౌరవించే పెద్ద మనసు మీకు లేదు. చంద్రబాబు గతంలో మీరు నిజంగా ప్రభుత్వం నడిపారా?. ఇంతకంటే దిగజారే పరిస్థితి లేదు అనుకున్నప్పుడల్లా మరో మెట్టు దిగుతున్నాడు. బ్లాక్ లో టికెట్లు అమ్మాలని ఆందోళన చేయడం ఏమిటి?. ఎప్పుడన్నా మహేష్, చిరంజీవి సినిమాలకి ఇలా ట్వీట్ చేశారా?. మొన్ననే కమిటీ కూర్చుంది. 24నే జీవో రావాల్సి ఉంది. కానీ, గౌతమ్‌రెడ్డి మృతితో ఆలస్యమైంది అంతే. జీవో రావడం రెండు రోజులు ఆలస్యమైతే రచ్చ చేస్తున్నారు. సొంత బావమరిది శవం పక్కన రాజకీయాలు మాట్లాడింది ఎవరు?. గౌతమ్ రెడ్డి మరణిస్తే పరుగెత్తుకొచ్చి దండెసి రెండో రోజే ఆయనపై మాట్లాడిస్తాడు. మనిషి విలువ, మరణిస్తే వచ్చే బాధ చంద్రబాబుకి తెలియదు. ఈ ప్రభుత్వం ఒక ఆప్తుడ్ని కోల్పోయి బాధలో ఉంటే జీవో ఇవ్వలేదంటాడు. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని అఖండ సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్స్ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు ద్వారా కలవడానికి ప్రయత్నం చేశారు. రమ్మంటే రెండు మూడు డేట్లు ఇవ్వాలన్నారు వాళ్ళు. విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నన్ను కలవలేదా...? బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు...నేను సీఎం గారితో మాట్లాడాను. ఆయన రానవసరం లేదు...పెద్దరికం పోతుంది అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఆయనకి ఏమి కావాలో చేసి పెట్టండి అని చెప్పారు. బాలకృష్ణ వ్యతిరేకంగా అలా మాట్లాడి ఉంటారని నేనైతే అనుకోవడం లేదు. సినిమా ఉచితంగా చూపిస్తాను అన్నాయనకు ఇవన్నీ ఎందుకు?. ప్రీరిలీజ్ ఫంక్షన్ ఒక రోజు పోస్ట్‌పోన్ చేసుకున్న వాళ్ళు.. సినిమా మరో రెండు రోజులు వాయిదా వేసుకోవచ్చుగా. ఆ హీరోగారు మైకు పట్టుకుంటే నీతులు చెప్తాడు...మరి ఈ నీతి మాలిన పనులేంటి..? సినిమా బాగుంటే జనం చూస్తారు. పుష్ప చూళ్ళేదా...? నాగార్జున కొడుకు సినిమా వచ్చింది చూసారుగా. అత్తారింటికి దారేది బాగుంది జనం చూసారు. అసలు సినిమాకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది? అని పేర్కొన్నారు మంత్రి. దేశంలో బ్లాక్ మార్కెట్ ను పార్టీలు టీడీపీ, ఏపీ బీజేపీ లే ప్రొత్సహిస్తున్నాయని, బ్లాక్ లో టికెట్లు అమ్మితే తప్పు అని చెప్పాల్సిన వారు.. అదొక హక్కుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లంతా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం అవుతుందన్నారు ఆయన. -
ఇప్పుడు చాలా సంతోషం
సాక్షి, అమరావతి : సినిమా టికెట్ ధరలు, ఇతర సమస్యలపై సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ప్రతిపాదనలు ఉభయ తారకంగా.. ఇటు ప్రేక్షకులు, అటు సినీ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీఎంతో, అనంతరం మీడియాతో వారు మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. సంతృప్తిగా ఉంది : చిరంజీవి పరిశ్రమలో అందరితో మాట్లాడి మీ ముందుకు వచ్చాం. మీ ప్రతిపాదనలు చూశాక మాకు చాలా సంతృప్తిగా ఉంది. కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు మంచి, చెడ్డలు తెలుసుకోవడానికి, మా అభిప్రాయం సేకరించడానికి తొలుత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత కలిసికట్టుగా అందరం వచ్చి అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను, మీ నిర్ణయాలను ఎప్పుడూ గౌరవిస్తాం. మీరు పేదల మనిషి. ఉభయులకీ సామరస్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవడం బాగుంది. మా అందరికీ చాలా వెసులుబాటు కల్పించారు. మీరు తీసుకున్న నిర్ణయాలు పట్ల ఎగ్జిబిటర్ల రంగం చాలా సంతోషంగా ఉంది. అందరం ఇదే అభిప్రాయంతో ఉన్నాం. టికెట్ రేట్లుగాని, ఇతరత్రా విషయాల్లో చాలా ఎక్సర్సైజ్ చేశారు. పెట్టే అమ్మను అన్నీ అడుగుతారు. ఇచ్చే వారినే కోరుతారు. అందుకే మేం కొన్ని కోరికలు కోరుతున్నాం. సినిమా థియేటర్‌కు ప్రేక్షకులను రప్పించడానికి కొన్ని ప్రత్యేకతలు సినిమాలోకి తీసుకురావాల్సి వస్తోంది. విజువల్ ఇంపాక్ట్ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అవి ఉంటేనే కానీ జనాలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనే మూడ్‌లో లేరు. మా సినిమాలు విడుదలైన వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఓటీటీ రూపంలో వస్తోంది. అలాగే పైరసీ ఎప్పటి నుంచో మాకున్న పెద్ద గొడ్డలిపెట్టు. ఇవన్నీ అధిగమించి మేం సినిమాలు తీయాలంటే.. మేం ఖర్చు అధికంగా పెట్టాల్సి వస్తోంది. తెలుగుతనాన్ని, తెలుగు సినిమాను కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి. తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్నల్ని అడుగుతున్నాం. తర్వాత ఐదో షో మన నారాయణ మూర్తి గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది ఉంటే మనకు కొంత వెసులుబాటు ఉంటుంది. అది మీ ముందు పెడితే మీరు ఒప్పుకున్నారు. సీఎంకు ధన్యవాదాలు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, మా ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ పరిశ్రమ కళకళలాడాలంటే చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అందరూ బాగుండాలి. అప్పుడే పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది నటులు, కార్మికులకు చేతినిండా పనిదొరుకుతుంది. ఈ ఉద్దేశంతో ఐదో షోకు మేము అనుమతి కోరితే.. సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప కీర్తి లభిస్తోంది. అందుకు కారణమైన భారీ బడ్జెట్ సినిమాలకు వెసులుబాటు కల్పించే అంశంపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. అందాల నగరమైన విశాఖపట్నంను సినీ పరిశ్రమకు హబ్‌గా మార్చుతామని.. మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి బాటలు వేస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ సమంగా అభివృద్ధి చెందడానికి మా వంతు సహకారం అందిస్తామని సీఎం వైఎస్ జగన్‌కు చెప్పాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంలో ముందు నుంచి ఎంతో చొరవ తీసుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు. సీఎం తీసుకున్న నిర్ణయాలపై ఈనెల మూడో వారంలోగా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేస్తుందని భావిస్తున్నాం. ఇకపై ఎలాంటి సమస్యలు వచ్చినా చర్చలతో సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాం. సినీ పరిశ్రమకు సంపూర్ణ సహకారం సినిమాటోగ్రఫీ, సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ సహకారం అందజేస్తారు. సినీ పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరిశ్రమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చి, పరిష్కారానికి కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సీఎం ప్రత్యేకంగా కమిటీ వేశారు. సినీ ప్రముఖులు ప్రతి సమస్యపైనా సీఎంతో విపులంగా చర్చించారు. పరిశ్రమకు సంబంధించిన వారు, సంబంధం లేని వారు సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నా.. చిరంజీవి వాటిని భరిస్తూ సినీ పరిశ్రమ శ్రేయస్సు కోసం సీఎం జగన్‌తో చర్చలు జరిపారు. పరిశ్రమకు ఉపశమనం కల్పించారు. చిన్న సినిమాలకు సంబంధించి నటుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదనను సీఎం వైఎస్ జగన్ అర్థం చేసుకున్నారు. పండగ, సెలవు రోజుల్లో చిన్న సినిమాలకు అవకాశం కల్పించాలని, అవి బతికేలా చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ పెద్దలను సీఎం కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి ఏ సహకారం కావాలన్నా అందజేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సినిమాలు చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనకు సినీ ప్రముఖులు సానుకూలంగా స్పందించారు. తమకు హైదరాబాద్ ఎంతో ఆంధ్రప్రదేశ్ కూడా అంతేనని, ఇక్కడా భారీ ఎత్తున సినిమాలు చిత్రీకరిస్తామని వారు సీఎంకు హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి దారి చూపిన సీఎం కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చింది. గత రెండేళ్ల నుంచి తీవ్ర సంక్షోభంలో ఉంది. మా కెరీర్లో ఈ రెండేళ్లు చాలా ఇబ్బందికరం. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్.. ఈ తరహా చర్చల వల్ల తొలగిపోతాయి. ఈ రెండేళ్లలో ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉండింది. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. సినీ పరిశ్రమ సందిగ్ధంలో పడిపోయిన తరుణంలో చిరంజీవి ముందడుగు వేసి.. సీఎం జగన్‌తో చర్చించి, సమస్యల పరిష్కారానికి దారి చూపించారు. ఈ రోజు సినీ పరిశ్రమకు సీఎం జగన్ గొప్ప ఉపశమనం కల్పించినందుకు కృతజ్ఞతలు. వారం పది రోజుల్లోనే శుభ వార్త వింటాం. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. – మహేష్‌బాబు, సినీనటుడు ఇండస్ట్రీకి మంచి చేస్తే అందరికీ లాభం గతంలో సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఆడేవి. ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏ స్టార్ సినిమా అయినా హిట్ లేదా ప్లాప్. ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, నటులు మాత్రమే కాదు వేల మంది టెక్నీషియన్లు ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్ గుండెల్లో మీరు ఉండిపోతారు. అందరికీ మేలు జరుగుతుంది. – అలీ, సినీనటుడు సంతోషంగా ఉంది ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఉందనే భ్రమ ఉండేది. ఈ రోజుతో అది తొలగిపోయింది. మాతో మీరు (సీఎం) నేరుగా మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించి సినిమా థియేటర్ యజమాని నుంచి ఎగ్జిబిటర్, నిర్మాత వరకు ఉన్న సమస్యలపై సీఎం జగన్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. సమస్యల పరిష్కారానికి మా ప్రతిపాదనలన్నీ విని.. సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. సినిమా పెద్ద అంటే చిరంజీవికి నచ్చదు. కానీ ఆయన చేసే పనుల వల్ల ఆయనకు పెద్దరికం వచ్చింది. సీఎం వైఎస్ జగన్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యంతో చిరంజీవి చర్చలు జరిపి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. – రాజమౌళి, దర్శకుడు మీరు చేయాలనుకుంటే చేస్తారు చిన్న సినిమాలు బతకాలి. ఇంతకు ముందు నేను చిన్న సినిమాలకు రాసేవాడిని. ప్రేయసిరావే, గాయం, స్నేహితులు.. ఇలాంటి వాటికి రాశాను. శివయ్య నేనే రాశాను. పెద్ద హిట్ అయింది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు. వీటి వల్ల చిన్న సినిమా చచ్చిపోయింది. సీఎం చేయాలనుకుంటే.. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తారు. చిన్న సినిమాలకు మీరు తోడుగా నిలవండి. కేరళలో కూడా చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. సినిమా పరిశ్రమలో 30 వేల మంది టెక్నీషియన్లు ఉన్నారు. – పోసాని కృష్ణమురళి, సినీ నటుడు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్ మాకు సమయం ఇచ్చారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. అందుకు కృతజ్ఞతలు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న చిరంజీవికి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. – ప్రభాస్, సినీనటుడు చిన్న సినిమా బతకాలి సగటు సినిమా బతకాలి. పండుగ వచ్చినా, సెలవులు వచ్చినా.. పెద్ద సినిమాలకే అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమా కూడా బతకాలి. హిట్ అయితేనే సినిమాలు చూస్తారు. చిన్న సినిమాలకు నూన్ షో ఉండాలని కోరుతున్నాం. భారీ సినిమా ఎలాంటి ఫలితాలు అనుభవిస్తుందో.. సగటు సినిమా అలాంటి ఫలితాలు అనుభవించాలి. పండగలు, సెలవుల సమయాల్లో పెద్ద సినిమాలదే హవా. ఆ సమయంలో చిన్న, సగటు సినిమాలు ప్రదర్శించడానికి థియేటర్లు దొరకడం లేదు. థియేటర్లను అడుక్కోవాల్సిన పరిస్థితి. సగటు సినిమా మనుగడ ప్రశ్నార్థకమైన సమయంలో.. సినిమాను నిలబెట్టేలా మహానుభావుడు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమ విరాజిల్లుతుంది. సినీ పరిశ్రమలో ఉత్తమ పనితీరు కనబరిచిన కళాకారులకు ఏటా నంది అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలి. పరిశ్రమ సమస్యలు పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. సీఎంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని.. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చిరంజీవికి కృతజ్ఞతలు. పరిశ్రమ సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. – ఆర్.నారాయణ మూర్తి, సినీనటుడు, దర్శకుడు, నిర్మాత -
సినిమా ఏదైనా ఒకే ధర
సాక్షి, అమరావతి: చిన్న, పెద్ద సినిమాలకు న్యాయం జరిగేలా మంచి పాలసీ తీసుకొచ్చేందుకు కొద్ది రోజులుగా కసరత్తు జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటుతో టికెట్లను ఆన్లైన్ పద్ధతిలో విక్రయించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో షూటింగ్‌లను ప్రోత్సహించేందుకు కొంత శాతం సినిమాను ఇక్కడే నిర్మించాలని కోరారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్ నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, మహి రాఘవ తదితర ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమా చూసే ప్రేక్షకులకు భారం కాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా మార్పు చేశామని తెలిపారు. అన్ని సినిమాలకు అదే రేటుకు ఐదో షోకు అనుమతిస్తున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ► మంచి పాలసీ తీసుకు రావడం ద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని కొద్ది కాలంగా కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ, దీనిపై కమిటీని నియమించాం. ► ఆ కమిటీ తరచూ సమావేశమవుతూ వాళ్ల కొచ్చిన ఫీడ్ బ్యాక్‌ను నాతో పంచుకుంది. ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పాం. సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని, ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్థను క్రియేట్ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. ► మీరన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేనంత వరకు కొద్ది మందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్ది మందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుంది. ► నేను, చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో, హీరోయిన్, దర్శకుడు పారితోషికం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడాలి. అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. భారీ బడ్జెట్ సినిమాలకు వారం పాటు ప్రత్యేక ధర ► హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని చెప్పాం. ► ఏపీలో సినిమా షూటింగ్‌లను ప్రమోట్ చేయడం కోసం.. ఇక్కడ కొంత శాతం షూటింగ్ జరిపి ఉండాలన్న నిబంధనను తీసుకురాగలిగితే మంచి ఫలితం ఉంటుంది. దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని.. దర్శకులు, నిర్మాతలతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కనీసం 20% అని చెప్పారు. ► రేట్లకు సంబంధించినంత వరకు అందరికీ ఒకటే రేట్లు. ఆన్లైన్ పద్ధతిలో టికెట్ల విక్రయం ప్రభుత్వానికి, సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిదనే కోణంలో చూశాం. ► ఓటీటీలతో పోటీ పడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించాం. ఏడాదికి వెయ్యి రూపాయలతో అమెజాన్ మెంబర్ షిప్ ఇస్తోంది. నెలకు సగటున రూ.80 పడుతుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. చిరంజీవి గారితో సుదీర్ఘంగా ఇదే విషయంపై చర్చించాం. అలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అనే ఆలోచనతో రీజనబుల్ రేట్ల దిశగా వెళ్లాం. సినిమా చూసే ప్రేక్షకులకు భారం కాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా ఉండేలా మాడిఫై చేశాం. ► మీరు ఐదో షోను కూడా తీసుకురావాలని అడిగారు. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్ అవుతుంది. ఆ పాయింట్ అర్థం చేసుకున్నాం. అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుంది. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయి. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయి. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లను కూడా మంచి ధరలతో ట్రీట్ చేస్తాం. మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నా. విశాఖపట్నం బిగ్ సిటీ అవుతుంది.. ► తెలంగాణతో పోలిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోంది. తెలంగాణ 35 నుంచి 40% కంట్రిబ్యూట్ చేస్తుంటే.. ఆంధ్రా 60% వరకు కంట్రిబ్యూట్ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, థియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఎక్కువ. ► వాతావరణం బాగుంటుంది. అందరికీ స్థలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపించే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం. ► చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్ చేసుకోవాలి, మనందరం అక్కడికి వెళ్లాలి. ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో మహా నగరాలతో పోటీ పడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చిన్న సినిమాను రక్షించుకుందాం ► రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలి. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలి. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. సినిమా క్లిక్ కావాలంటే పండుగ రోజు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ► ఇక్కడే చిన్న సినిమాను రక్షించుకోవడానికి కూడా కొంత సమతుల్యత అవసరం. పరిశ్రమ నుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలి. ఆ పండుగ రోజు మాకు అవకాశాలు లేవని చిన్న సినిమా వాళ్లు అనుకోకుండా కాస్త సమతుల్యత పాటించాలని విజ్ఞప్తి. -
సినిమాకు మంచి రోజులు
సాక్షి, అమరావతి: తెలుగు సినిమాకు నిజంగా మంచి రోజులొచ్చాయి. ఇటు ప్రేక్షకులకు అందుబాటు ధరలో వినోదాన్ని దగ్గర చేయడంతో పాటు అటు సినీ రంగం అభివృద్ధికి సీఎం జగన్ కొత్త బాటలు వేసే దిశగా అడుగులు ముందుకు వేశారు. సినీ రంగం ఆందోళనకు తెరదించారు. సినిమాలన్నింటికీ ఒకే టికెట్ ధరను అమలు చేయడంతో పాటు చిన్న సినిమాలకు ప్రాణం పోసే నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సినీ రంగం వేళ్లూనుకునేలా కీలక ఆఫర్‌ను సినీ ప్రముఖుల ముందు ఉంచారు. విశాఖను సినీ మణిహారంగా తీర్చిదిద్ది.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే ఊత కర్రగా నిలిచారు. వెరసి తామంతా కష్టకాలం నుంచి బయట పడినట్లేనని సినీప్రముఖులు హాయిగా ఊపిరి పీల్చుకున్న ఆహ్లాదకర, అరుదైన సన్నివేశం గురువారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కనిపించింది. సినీ రంగానికి సంబంధించి కొద్ది రోజులుగా నలుగుతున్న సమస్యలపై గురువారం సినీ ప్రముఖులు సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. తన ప్రతిపాదనలను సీఎం వారి ముందు ఉంచారు. చిన్న, పెద్ద సినిమాలనే వ్యత్యాసాలను, ఒకరి సినిమాకు ఎక్కువ రేటు.. ఇంకొకరి నినిమాకు తక్కువ రేటు అనే వివక్షకు తావు లేకుండా ఒకే టికెట్ ధర ఉండాలన్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలన్నారు. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేసే వెసులుబాటు ఉండాలని చెప్పారు. ఈ ప్రతిపాదనలను సినీ ప్రముఖులు ఆహ్వానించారు. భేటీకి ముందు.. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరల ఖారారుపై సీఎం భారీ కసరత్తు చేశారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా సినీ ప్రముఖుల నుంచి అభిప్రాయాలను తీసుకుని పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకున్నారు. సినీ ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అక్కడికక్కడే సీఎం కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. చిన్న సినిమాకైనా, పెద్ద సినిమాకైనా ఎవరి సినిమాకైనా ఒకే టికెట్ ధరకు ఐదో షోకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. సీనీప్రముఖుల అభిప్రాయం మేరకే ఏ సినిమాౖకైనా, ఎవ్వరి సినిమాకైనా ఒకే టికెట్ ధర ఉండాలన్నారు. పండుగలకు చిన్న సినిమాల విడుదలకు కూడా అవకాశాలు కల్పించాలని సినీ ప్రముఖులను సీఎం కోరారు. తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు రావాలని, స్డూడియోల ఏర్పాటుకు, ఇళ్ల కోసం స్థలాలు కేటాయిస్తామన్నారు. ఈ నిర్ణయాలపై సీఎంతో సమావేశం సందర్భంగా, విలేకరుల సమావేశంలో సినీ ప్రముఖులందరూ సంతోషం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ మొత్తాన్ని, సినీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సీఎం నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. సినిమా టికెట్ ధరలతో పాటు ఇతర నిర్ణయాలకు సంబంధించి ఈ నెలలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. -
సినిమా టికెట్ల ధరలపై ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: మంచు విష్ణు
-
ఆన్లైన్ టికెట్ల విధానంలో తప్పేముంది?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ద్వారా ఆన్లైన్లో విక్రయానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వమే ఆన్లైన్లో టిక్కెట్లను విక్రయిస్తే పన్నుల ఎగవేతను అడ్డుకోవచ్చునని, ఇందుకోసమే ఆ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపింది. దీనివల్ల ఎవరి ప్రాథమిక హక్కులకూ భంగం వాటిల్లదని కూడా తేల్చి చెప్పింది. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్ల విక్రయానికి జారీ చేసిన జీవో 142ను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ టికెట్ల విక్రయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, ఏపీఎఫ్‌డీసీలకు నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆన్లైన్ టికెట్ల విధానాన్ని సవాలు చేస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామని చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఆన్లైన్లో టికెట్లు అమ్మితే తప్పేముందని ప్రశ్నించింది. అది గుత్తాధిపత్యం అవుతుందని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. పన్నుల ఎగవేతను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల థియేటర్ల యాజమాన్యాల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని ప్రకాశ్‌రెడ్డి అనగా, ఈ వ్యవహారంలో ప్రాథమిక హక్కులు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఆన్లైన్లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పటికీ చాలా మందికి తెలియదని ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. దీనిపై ధర్మాసనం విబేధిస్తూ, ‘ఆన్లైన్ గురించి తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు ప్రపంచమంతా ఆన్లైన్ ద్వారానే పనిచేస్తోంది. ఆన్లైన్లో సినిమాలు ఎలా చూడాలో జనాలకు బాగా తెలుసు. మీరు కూడా ఆన్లైన్ ద్వారానే వాదనలు వినిపిస్తున్నారు. ఆన్లైన్ గురించి ప్రజలకు తెలియదనుకోవడం పొరపాటు’ అని వ్యాఖ్యానించింది. ముందు నోటీసులు జారీ చేస్తామని, ఆ తరువాత పూర్తిస్థాయి విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ చేపట్టాలన్న ప్రకాశ్‌రెడ్డి అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించలేదు. జీవో 35పై విచారణ వాయిదా సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను సవాలు చేస్తూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు జీఎల్ నర్సింహారావు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్‌బాబుకు నోటీసులు జారీ చేసింది. తుది విచారణను వాయిదా వేసింది. -
సినిమా టికెట్ ధరలపై సీఎం నిర్ణయాన్ని స్వాగతించాలి
సాక్షి, అమరావతి: పేదవారికి వినోదం భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చిత్ర పరిశ్రమ స్వాగతించాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులను ఇన్ని రోజులుగా కొందరు దోపిడీ విధానాన్ని అవలంభించారని విమర్శించారు. అటువంటి దోపిడీని అరికట్టడం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమని తెలిపారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచిన కారణంగా అటు చిన్న సినిమాలకు, ఇటు పెద్ద సినిమాలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఖాయమని పేర్కొన్నారు. సినిమా థియేటర్లలో తినుబండారల ధరలు, పార్కింగ్ చార్జీలను నియంత్రించాలని, నాసిరకమైన తినుబండారాలు అమ్ముతున్న థియేటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌కు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణపై చర్చ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి శుక్రవారం వర్చువల్‌గా సమావేశమైంది. టికెట్ రేట్లు నిర్ణయించే క్రమంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, సినీగోయర్స్ అసోసియేషన్ సభ్యులతో కమిటీ ప్రాథమికంగా చర్చించింది. ఈ క్రమంలో సభ్యుల సూచనలు, సలహాలను సైతం కమిటీ స్వీకరించింది. వీటిపై సమగ్రంగా చర్చించేందుకు జనవరి 11వ తేదీన మరోసారి సమావేశమవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రేక్షకులపై భారం పడకుండా తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకు హైకోర్టు సూచనల మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. -
మా ఉత్తర్వులు థియేటర్లన్నింటికీ వర్తిస్తాయి
సాక్షి, అమరావతి: లైసెన్స్ జారీ అధికారులైన జాయింట్ కలెక్టర్లను సంప్రదించాకే సినిమా టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలంటూ తాము ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలన్నింటికీ వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టుకొచ్చిన థియేటర్ల యజమానులకే తమ ఉత్తర్వులు వర్తిస్తాయంటూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన పత్రికా ప్రకటనను హైకోర్టు తప్పుపట్టింది. పత్రికాముఖంగా అలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని ఆయనకు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్‌కు సూచించింది. ఈ మొత్తం వ్యవహారంలో అదనపు మెటీరియల్ పేపర్లను కోర్టు ముందుంచేందుకు ప్రభుత్వ న్యాయవాది(హోం) మహేశ్వరరెడ్డి కొంత గడువు కోరడంతో హైకోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీల పరిధుల్లో టికెట్ ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35తో సంబంధం లేకుండా, ఈ జీవో జారీకి ముందున్న విధంగానే టికెట్ ధరలను ఖరారు చేసుకోవచ్చునంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీళ్లపై గత వారం విచారణ జరిపిన ధర్మాసనం.. తాజాగా సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా థియేటర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. జాయింట్ కలెక్టర్‌ను సంప్రదించాకే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలన్న ధర్మాసనం ఉత్తర్వులు కేవలం హైకోర్టును ఆశ్రయించినవారికి మాత్రమే వర్తిస్తాయంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి పత్రికా ప్రకటన జారీ చేశారని తెలిపారు. దీనిపై తాము తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గతవారం తామిచ్చిన ఉత్తర్వుల్లో థియేటర్లు అని స్పష్టంగా పేర్కొన్నామని.. దీని అర్థం రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్లనీ స్పష్టతనిచ్చింది. -
రైల్వే ప్రయాణికులకు తీపి కబురు
Indian Railways Revert Ticket Prices: రైలు ప్రయాణాలు చేసేవాళ్లకు తీపి కబురు అందించింది భారత రైల్వే శాఖ. కరోనా-లాక్డౌన్ తర్వాత ‘స్పెషల్’ పేరిట రైళ్లు నడుపుతూ టికెట్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే కదా. అయితే ప్రయాణికుల ఒత్తిడి మేరకు ఆ ధరలను పాత రేట్లకే సవరించింది. కరోనాకు ముందు ఉన్న టికెట్ రేట్లను తక్షణం అమలులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం హడావిడిగా ఆదేశాలు జారీ చేసింది భారత రైల్వే శాఖ. అంతేకాదు కొవిడ్ స్పెషల్ ట్యాగులను సైతం రైళ్లకు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ వర్తింపు ఉంటుందని తెలిపింది. అయితే పండుగ పూట నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లకు మాత్రం ఈ సవరణ వర్తించదని స్పష్టం చేసింది. అంతేకాదు పూర్థిస్తాయిలో రైళ్లను నడిపించేందుకు (గతంలో నడిచే 1700 రైళ్లు) సైతం రైల్వే శాఖ సిద్ధమైంది. కరోనా ప్రభావంతో రైల్వే వ్యవస్థ కొన్ని నెలలపాటు బంద్కాగా, భారత రైల్వే శాఖ ఆదాయం దారుణంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ సడలింపుల తర్వాత కొన్ని రైళ్లను(ఆల్రెడీ ఉన్న సర్వీసులనే) స్పెషల్ ట్రెయిన్స్ పేరుతో దాదాపు అన్ని రూట్లలో నడుపుతూ.. అన్ని కేటగిరీల సిట్టింగ్‌లను.. ‘రిజర్వేషన్’ కింద మార్చేసి టికెట్ రేట్లను పెంచేసింది. దీంతో రైల్వే ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు.. టికెట్ రేట్లను సవరించాలంటూ అన్ని జోనల్ రైల్వేస్‌కు సూచించింది రైల్వే బోర్డు. అయితే హడావిడిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ అది ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయాన్ని మాత్రం పేర్కొనపోకపోవడంతో గందరగోళం నెలకొనగా.. ఒకటి రెండు రోజుల్లో ఇది అమలులోకి వస్తుందని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే రాబోయే రోజుల్లో జనరల్ టికెట్లకు ‘క్యూ’ సిస్టమ్ ఉంటుందా? లేదంటే పూర్తిస్థాయి ఆన్లైన్ జారీనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒక ప్యాసింజర్‌సెగ్మెంట్ కంటే ట్రాన్స్పోర్టర్ ద్వారా రైల్వే శాఖ ఆదాయం (113 శాతం) పెరగడం విశేషం. -
పారదర్శకత కోసమే ఆన్లైన్ టిక్కెటింగ్
‘‘సినిమా టిక్కెట్ ధరల విషయంలో ప్రభుత్వం (ఆంధ్రప్రదేశ్) వారు మా బాధలు విన్నారు. వాటి పరిష్కార మర్గాల దిశగా ఆలోచిస్తున్నారు’’ అన్నారు నిర్మాత బన్నీ వాసు. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం రేపు రిలీజ్ కానున్న సందర్భంగా బన్నీ వాసు చెప్పిన సంగతలు. ► పెళ్లి చేసుకునేవారు, పెళ్లి చేసుకోవాలనుకునే వారు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా చూస్తే జీవితం పై ఓ క్లారిటీ వస్తుంది. పెళ్లికి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెబుతారు కానీ పెళ్లి జరిగాక భార్యతో భర్త ఎలా ఉండాలో అబ్బాయికి, భర్తతో భార్య ఎలా ఉండాలో అమ్మాయికి చెప్పే తల్లిదండ్రులు తక్కవ. పెళ్లి ముందే కాదు..పెళ్లి తర్వాత కూడా అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా నడుచుకోవాలో తల్లితండ్రులు నేర్పించాలన్నదే మా సినిమా కాన్సెప్ట్. ► ఆన్లైన్ టిక్కెటింగ్ దాదాపు ప్రతి థియేటర్లో రన్ అవుతోంది. ప్రేక్షకులు ఎన్ని టిక్కెట్స్ తీసుకున్నారన్న సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వంవారు అడుగుతున్నారు. మన ఎగ్జిబిటర్స్‌లో చాలామంది పన్నులు కట్టడం లేదు. దాదాపు 300 థియేటర్స్ జీఎస్టీ పరిధిలోనే లేవు. ఎంతసేపూ ఇండస్ట్రీ వైపు నుంచే కాకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎలా పెంచాలన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అప్పుడు ఇండస్ట్రీ వల్ల ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి మాకేమైనా చేసిపెట్టండని ప్రభుత్వాన్ని కోరే వీలుంటుంది. చాలామంది ఎగ్జిబిటర్స్ టాక్స్ పరిధిలోకి రావడం లేదు. ఉన్నవారు కూడా సరైన లెక్కలు చూపించడం లేదనేది ప్రభుత్వం వారి భావన. అందుకే ప్రభుత్వంవారు పారదర్శకత కోరుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే డబ్బులన్నీ ముందు ప్రభుత్వంవారు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కానీ అది కాదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌గారు ఓ రిపోర్ట్ తయారు చేయమ న్నారు. ఆ రిపోర్ట్ వచ్చాక నిర్ణయాలు ఇండస్ట్రీకి సానుకూలంగానే వస్తాయని నమ్ముతున్నాను. -
నష్టాల్లోనూ టికెట్ ధరలు పెంచలేదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీజిల్ ధరలు పెరిగి ఆర్టీసీకి నష్టాలు వస్తున్నా రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చడం కోసం టిక్కెట్ ధరలు ఒక్క పైసా కూడా పెంచడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుముఖంగా లేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రజలపై భారం పడకూడదనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు టికెట్ ధరలు పెంచలేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆర్టీసీ డిపో గ్యారేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ పెట్రోల్ బంక్‌ను శుక్రవారం ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం తప్ప ప్రజలపై భారం మోపడం లేదన్నారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆర్టీసీ బంకుల్లో కేవలం డీజిల్, పెట్రోల్ మాత్రమే కాక నమ్మకం, భరోసా కూడా లభిస్తుందన్నారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల్లో ఆర్టీసీలు నష్టాల్లో ఉండగా మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డీఐజీ కేవీ మోహనరావు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ‘సంఘాల’ గుర్తింపు నిబంధనల సమీక్షకు కమిటీ సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల గుర్తింపు నియమ నిబంధనలను సమీక్షించేందుకు అధికారులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఏపీ సివిల్ సర్వీసెస్ 2001 నిబంధనల ప్రకారం ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లేదా గుర్తింపు ఉపసంహరణ అమల్లో ఉంది. అయితే, ఈ నియమ నిబంధనలను సమీక్షించడంతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులు, కొత్త నిబంధనలు తీసుకురావడంపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక సీఎస్ అధ్యక్షతన రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వివిధ సంఘాల ప్రతినిధులు, నిపుణులతో చర్చించి వీలైనంత త్వరగా సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా పేర్కొంది. -
థియేటర్లలో టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్ చిత్రపరిశ్రమ మీద గట్టిగానే పడింది. మొదటి లాక్డౌన్ తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకున్న థియేటర్లపై కోవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో థియేటర్ల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది. కోవిడ్ దెబ్బకు థియేటర్లు మరోసారి మూతపడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా టికెట్ల ధరలు పెంచాలన్న ఆలోచన కూడా చేస్తోంది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా నేడు (జూలై 27న) న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు.. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి నిబంధనలు రూపొందించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించాడు. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు తెలిపాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈమేరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోం శాఖ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేసింది. -
‘డబ్బు’ల్ దోపిడి.. బస్సెక్కాలంటే భయమేస్తోంది
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులపైన రెట్టింపు భారం మోపుతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన మూడింతలు వసూలు చేస్తున్నారు. ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు చార్జీలను అమాంతంగా పెంచేస్తున్నారు. ఇక స్లీపర్ క్లాస్ బస్సుల్లో విమాన చార్జీలను తలపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ బస్సుల్లో రూ.650 వరకు ఉంటే ఇప్పుడు రూ.1000 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. ఏసీ బస్సుల్లో రూ.2000 నుంచి రూ.2500 వరకు చార్జీలు ఉన్నాయి. స్లీపర్ సదుపాయం ఉన్న ఏసీ బస్సుల్లో మాత్రం రూ.3000 పైనే తీసుకుంటున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అర్జెంట్‌గా విజయవాడకు వెళ్లవలసి వచ్చింది. అప్పటికప్పుడు ట్రైన్లో వెళ్లే అవకాశం లేదు.దీంతో ప్రైవేట్ ఏసీ బస్సెక్కాను. రూ.2200 తీసుకున్నారు... అని మల్కాజిగిరికి చెందిన సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ, ఏపీల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఈ అవకాశాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ బస్సులతో పాటు, రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ట్రావెల్స్ కార్లు, మ్యాక్సీ క్యాబ్‌లలోనూ అడ్డగోలు దోపిడీ కొనసాగుతోంది. సడలింపు వేళలే అవకాశంగా.... ►రెండు రాష్ట్రాల్లో సడలింపు వేళలను అవకాశంగా చేసుకొని ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. ►ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసిన వాళ్లు ఈ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ►ఏపీలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తెలంగాణలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లాక్డౌన్ వేళలను సడలించడంతో పాటు మరో గంట సమయం ప్రజలు ఇళ్లకు చేరుకొనేందుకు వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ►ఈ సడలింపు సమయానికి అనుగుణంగానే ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ట్రావెల్స్ సంస్థలు పోటా పోటీగా బస్సులు నడుపుతున్నాయి. ►బస్సుల్లో పెద్దగా ఆక్యుపెన్సీ లేకపోయినా కరోనా సమయంలో రెండు రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్న నెపంతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ►ఒక ట్రావెల్స్ సంస్థ చార్జీలకు, మరో సంస్థ చార్జీలకు మధ్య ఎలాంటి పొంతన ఉండడం లేదు. ప్రత్యేక అనుమతుల పేరిట వసూళ్లు... ప్రైవేట్ బస్సుల్లో పరిస్థితి ఇలా ఉంటే, మ్యాక్సీ క్యాబ్‌లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు మరో విధంగా దోపిడీకి తెర లేపాయి. పోలీస్ చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక అనుమతులు తీసుకొని బండ్లు నడుపుతున్నట్లు చెప్పి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నా యి. ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వందలాది క్యాబ్‌లలో ఈ తరహా దోపిడీ కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో రూ.1000 వరకు డిమాండ్ చేస్తే ఇప్పుడు రూ.2500 పైనే వసూ లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో అడిగినంత చెల్లించవలసి వస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు. తగ్గిన రైళ్లు... కరోనా సెకెండ్ వేవ్ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ను భారీగా రద్దు చేసింది. ఈ నెల 16వ తేదీ వరకు రెండు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే సుమారు 25 రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే మరో 20 రైళ్లను కూడా రద్దు చేశారు. దీంతో తప్పనిసరిగా బయలుదేరవలసిన వాళ్లు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి -
‘బ్లాక్’కు చెక్.. ఏ సినిమాకైనా, ఏ రోజైనా ఒకటే రేటు
బుకింగ్‌లో రూ.50కి కొన్న టికెట్‌ను.. బయట డిమాండ్ ఉందని రూ.200కు అమ్మితే, దానిని బ్లాక్ వ్యవహారం అంటారు. అలా అమ్మిన వారు బ్లాక్ టికెట్లు అమ్మిన నేరం కింద శిక్షార్హులు. మరి అదే పనిని థియేటర్ల యాజమాన్యాలు అధికారికంగా చేస్తే..? దాన్ని బ్లాక్‌లో విక్రయించినట్లుగా ఎందుకు పరిగణించకూడదు? అధికారికమైనా, అనధికారికమైనా చేసిన పని అదే కదా? ఇదే ఉద్దేశంతో.. ఈ అధికారిక బ్లాక్‌కు కళ్లెం వేయటానికే రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల వారీగా టికెట్లకు నిర్ణీత ధరలను నిర్దేశించింది. సాక్షి, అమరావతి: సినిమా అన్నది ప్రధానంగా వినోదాత్మకం. పేదల నుంచి ధనికుల వరకు దాదాపు అత్యధికులు సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారనేది కాదనలేని వాస్తవం. ఆయా సినీ హీరోలను బట్టి అభిమానుల సంఖ్య ఉంటుంది. తమ అభిమాన కథానాయకుడి సినిమాను తొలి రోజే చూడాలన్న ఉత్సాహం చాలా మంది అభిమానుల్లో ఉంటుంది. ఈ అభిమానాన్ని వీలున్నంత వరకు ‘క్యాష్’ చేసుకోవాలనుకున్న సినిమా వాళ్ల అత్యాశ ఎంతో మంది పేదల జేబులకు చిల్లు పొడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ సినిమా అయినా ఒక్కటే.. సినిమాను సినిమాగానే చూడాలి. ఎవరి సినిమా అయినా.. ఏ రోజైనా.. టికెట్ ధర మాత్రం ఒకటే ఉండాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. తొలి రోజైనా, తొలి మూడు రోజులైనా.. నాలుగో రోజైనా వేసేది అదే సినిమా. అందులో తొలి మూడు రోజులు అదనపు పాటలు, సీన్ల వంటివేమీ ఉండవు. మరి అలాంటప్పుడు తొలి మూడు రోజులూ టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అన్న సగటు ప్రేక్షకుడి ప్రశ్న సబబే అని ప్రభుత్వం ఏకీభవించింది. ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీ నటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని.. తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని స్పష్టం చేసింది. ప్రాంతాల వారీగా టికెట్ల ధర తమ అభిమాన హీరో సినిమా అనో.. లేక పేరున్న దర్శకుడి సినిమా అనో రిలీజైన తొలి రోజో, తర్వాతి రోజో చూడాలనుకుంటారు. ఆ బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఆ రెండు మూడు రోజులూ కొన్ని సినిమాల రేట్లను నాలుగైదు రెట్లు పెంచేయటమేంటన్నది అభిమానుల ఆక్రోశం కూడా. కాకపోతే ఎలాగైనా ఆ రోజే చూడాలన్న ఉద్దేశంతో ఎక్కువ డబ్బులు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. కాబట్టే ఈ అధికారిక బ్లాక్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. ఇలా ప్రాంతాల వారీగా టికెట్లకు ధరలు నిర్దేశించింది. ఇవి అన్ని సినిమాలకూ... అన్ని రోజులూ అమలవుతాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా దీన్ని సమర్థించిన నేపథ్యంలో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై కొత్త సినిమాలకు అదనపు బాదుడు ఉండదనేది పెద్ద ఉపశమనం కలిగించిందని వారి భావన. దీంతోపాటు ప్రతి సినిమా హాలు తగినంత పార్కింగ్ ప్రాంతాన్ని కేటాయించాలని, సహేతుక పార్కింగ్ ధరలను వసూలు చేయాలని, థియేటర్ క్యాంటీన్లలో విక్రయించే వస్తువులు కూడా వాటిపై ఉండే గరిష్ట చిల్లర ధరకు మించి విక్రయించకూడదని స్పష్టం చేసింది. వీటిని ఉల్లంఘిస్తే ఆయా థియేటర్ల యాజమాన్యాలే బాధ్యత వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోలోని ధరల ప్రకారమే ఆదివారం నుంచి సినిమా టికెట్లు అమ్మాలని థియేటర్ల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అధిక ధరలు వసూలు చేస్తే ఆయా థియేటర్ల యాజమాన్యాలపై అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. శనివారం(10వ తేదీ) వరకు అడ్వాన్స్ బుకింగ్‌లో ఇచ్చిన టికెట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు సూచించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులిచ్చింది. వకీల్‌సాబ్ సినిమాకు మొదటి మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. సినీ ప్రేక్షకుల నుంచి అధిక రేట్లు వసూలు చేయకుండా ఉండేందుకే కొత్త మార్గదర్శకాలతో జీవో ఇచ్చినట్లు తెలిపారు. మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా.. సింగిల్ జడ్జి మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లో ఇచ్చిన టికెట్లు మాత్రమే కాకుండా మూడు రోజుల పాటు అన్ని రకాల టికెట్లను అధిక ధరలకు అమ్ముకునేందుకు అనుమతిచ్చారని వివరించారు. థియేటర్ల యాజమాన్యాల తరఫు న్యాయవాది కె. దుర్గా ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల థియేటర్ల యజమానులు నష్టపోతున్నారని వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ఆదివారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని స్పష్టం చేసింది. -
ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కంపెనీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్ మంగళవారం (11న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు కొనసాగే ప్రేమికుల రోజు డిస్కౌంట్లో భాగంగా మొత్తం 10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే ప్రయాణాలపై తాజా డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ వెల్లడించారు. -
ఆర్టీసీలో మరోసారి చార్జీలు పెరగనున్నాయా..?
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీలో మరోసారి చార్జీలు పెరగనున్నాయా..ప్రయాణికులపై భారం పడనుందా..పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల నుంచి గట్టెక్కేందుకు అదొక్కటే పరిష్కారమా...ఆర్టీసీ అధికారవర్గాలు, రవాణా రంగ నిపుణులు అందుకు అవుననే సమాధానం చెబుతున్నారు. ఇప్పటికే వందల కోట్ల నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీపై తాజాగా పెరిగిన డీజిల్ ధరలు మరింత భారాన్ని మోపాయి. దీంతో చార్జీల పెంపు ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది. తెలంగాణ అంతటా సుమారు రూ.928 కోట్ల నష్టాలను ఎదుర్కొంటుండగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఆర్టీసీ నష్టాలు రూ.550 కోట్లకు పెరిగాయి. తాజాగా లీటర్‌కు సుమారు రూ.2.56 చొప్పున పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఆర్టీసీపైన ఏటా రూ.70 కోట్ల వరకు భారం పడనున్నట్లు అంచనా. డీజిల్ పై పెరిగిన ధరలు కేవలం ఇంధన వినియోగంపైనే కాకుండా విడిభాగాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులపైన కూడా ప్రభావం చూపుతాయి. దీంతో నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ భారం నుంచి కొంత మేరకు ఊరట పొందేందుకు చార్జీల పెంపు మినహా మరో గత్యంతరం కనిపించడం లేదని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.‘డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఆ భారం ప్రయాణికులపై పడకుండా జాగ్రత్త వహించాం. ఒకవైపు వందల కోట్ల నష్టాలను భరిస్తూ, మరోవైపు ఏటేటా పెరిగే డీజిల్ ధరల భారంతో ఏ మాత్రం ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది’ అని పేర్కొన్నారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సైతం చార్జీలపైన నిర్ణయం తీసుకొనే స్వతంత్రత ఆర్టీసీకి ఉండాలని ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సహాయం లభించకపోవడంతో చార్జీల పెంపు ప్రస్తావన ముందుకొస్తోంది. అందుకు ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజలపై ఏటా రూ.300 కోట్లకు పైగా భారం... ఆదాయానికి రెట్టింపు ఖర్చు ఆర్టీసీని నిలువునా ముంచుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు రూ.3.5 కోట్ల ఆదాయం లభిస్తే ఖర్చు మాత్రం రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది. రోజుకు సుమారు రూ.కోటి నష్టం వాటిల్లుతోంది. మొత్తం తెలంగాణలోని సగానికి పైగా నష్టాలు హైదరాబాద్‌లోనే వస్తున్నాయి. ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణా, స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సుల కారణంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టాలొస్తున్నాయి. వరుస నష్టాలను దృష్టిలో ఉంచుకొని 2016 లో చార్జీలను పెంచారు. మొదట 10 శాతం పెంచాలని భావించినప్పటికీ కొన్ని రూట్లలో చార్జీల హెచ్చుతగ్గులు, హేతుబద్ధత వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోవడంతో 8.77 శాతం పెంపు అమల్లోకి వచ్చింది. ప్రయాణికులపై కిలోమీటర్‌కు రూపాయి చొప్పున భారం పడింది. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులపై కొద్దిగా తగ్గించి, లగ్జరీ, మెట్రో డీలక్స్, ఓల్వో, గరుడ వంటి వాటిపైన పెంచారు. ఆ ఏడాది పెంచిన చార్జీల వల్ల ప్రజలపైన రూ.250 కోట్లకు పైగా భారం పడింది. ఈ మేరకు ఆర్టీసీకి ఆదాయం లభించినప్పటికీ నష్టాల నుంచి గట్టెక్కేందుకు పెద్దగా దొహదం చేయలేదు. నిర్వహణ భారం అధికంగా ఉండడం, ఇంధన ధరలు, జీతభత్యాల్లో పెంపుదల వంటి అంశాల కారణంగా వరుసగా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.928 కోట్లకు చేరాయి. ఈ మూడేళ్లలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్ధిక సహాయం లభించకపోవడంతో ఆర్టీసీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో కనీసం 10 శాతం చార్జీలు పెరిగినా ఆర్టీసీకి రూ.300 కోట్లకు పైగా ఆదాయం లభించగలదని భావిస్తున్నారు. కానీ ఈ మేరకు ఆ భారాన్ని ప్రజలు మోయక తప్పదు. సుంకం పెంపుతో డీజిల్ భారం రూ.70 కోట్లు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సుంకం పెంపుతో వాటి ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో లీటర్ డీజిల్‌కు రూ.2.56 చొప్పున ఆర్టీసీపైన సుమారు రూ.70 కోట్ల భారం పడనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో రోజుకు 5,30 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2 లక్షల లీటర్లకు పైగా డీజిల్ ఖర్చవుతోంది.ఆర్డినరీ బస్సులు ఒక లీటర్ డీజిల్ వినియోగంపై 5.52 కిలోమీటర్ల వరకు తిరుగుతుండగా, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో ఇది 4.5 కిలోమీటర్ల వరకే ఉంటుంది. ఏసీ బస్సుల్లో ఇంకా తగ్గుతుంది. ఏసీ బస్సులు 2.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. ట్రాఫిక్ రద్దీ, బస్సుల సామర్ధ్యం వంటి అంశాలు కూడా ఇంధన వినియోగంపైన ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు నష్టాలు, మరోవైపు ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం 10 శాతం పెంచినా కొంత మేరకు ఊరట లభించగలదనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
‘సినిమా టికెట్ల ధరలు తగ్గించండి’
సాక్షి, హైదరాబాద్: తగ్గించిన జీఎస్టీ ప్రకారం వెంటనే సినిమా టికెట్ల ధరలు తగ్గించాలని జీఎస్టీ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జనవరి 1 నుంచి రూ.100కు మించి ఉన్న సినిమా టికెట్ల ధరలను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామని, తగ్గించిన ధరల ప్రకారం టికెట్లు అమ్ముతున్నారా? లేదా? అనేదానిపై సినిమాహాళ్లపై శనివారం జీఎస్టీ అధికారుల బృందం దర్యాప్తు చేసిందన్నారు. ప్రసాద్ఐమాక్స్ ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిందని, దీనిపై కేసు నమోదు చేసి ‘యాంటీ ప్రొఫెటీరింగ్ సంస్థ’కు అప్పగించామని చెప్పారు. అన్ని సినిమాహాళ్ల యాజమానులు తగ్గించిన జీఎస్టీ ప్రకారం టికెట్లు అమ్మాలని, తగ్గించని వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ హెచ్చరించారు. -
ఏసీ..దోచేసి!
నగరంలోని బోరబండకు చెందిన చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరంలోని బంధువుల పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సులో వెళ్లాలని భావించి టికెట్లు ఆన్లైన్లో బుక్ చేయాలనుకున్నాడు. గతంలో సిటీ నుంచి అన్నవరం వరకు ఏసీ టికెట్ ధర రూ.975 ఉంటే ఇప్పుడు రూ.2000కు చేరింది. అంటే నలుగురు సభ్యులు కలిసి అన్నవరం వెళ్లి రావాలంటే బస్సు చార్జీలకు ఏకంగా రూ.16,000 చెల్లించాలి. ఇది చంద్రశేఖర్ సమస్య మాత్రమే కాదు.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు సీట్లు లభించక, రైళ్లలో బెర్తులు దొరక్క ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రతిప్రయాణికుడి వ్యధ. ఇలాంటి వారంతా ట్రావెల్స్ ఆపరేటర్ల దోపిడీకి గురవుతున్నారు. పైగా ఒక్కో ఏజెన్సీ ఒక్కోలా చార్జీ వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: సగటు ప్రయాణికుడిని ప్రైవేట్ బస్సులు కూల్‌గా దోచేస్తున్నాయి. వేసవి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ధరలను అమాంతం పెంచేసి జేబులు లూఠీ చేస్తున్నాయి. సాధారణ చార్జీలను రెట్టింపు చేసి మరీ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగరం నుంచి ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలాంటి అదనపు బస్సులను ఏర్పాట్లు చేయలేదు. దక్షిణమధ్య రైల్వే 150కి పైగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న నగర ప్రయాణికులను ట్రావెల్స్ సంస్థలు దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఏసీ స్లీపర్ క్లాస్ బస్సు చార్జీ గతంలో రూ.650 ఉంటే ప్రస్తుతం రూ.1574కు పెరిగింది. వైజాగ్‌కు ఏసీ బస్సు చార్జీ గతంలో రూ.950 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1984కి పెంచారు. ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేక, గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో చార్జీల రూపేణా రూ.వేలల్లో సమర్పించుకోవలసి వస్తోందంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగటు ప్రయాణికుడే బాధితుడు.. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రతిరోజు 650 నుంచి 700 ప్రైవేట్ బస్సులు నడుస్తుంటాయి. నగరంలోని బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్, లకిడీకాపూల్, కాచిగూడ తదితర సెంటర్ల నుంచి ప్రయాణికుల పాయిట్లు ఉన్నాయి. రాష్ట్రస్థాయి కాంట్రాక్ట్ క్యారేజీలుగా గుర్తింపు పొందిన ట్రావెల్స్ బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. దోపిడీని నియంత్రించేదెవరు..? ప్రైవేట్ బస్సు చార్జీలపైన ఎలాంటి అధికారిక నియంత్రణ లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోటారు వాహన నిబంధనల ఉల్లంఘన నెపంతో అప్పుడప్పుడూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేసే రవాణాశాఖ.. చార్జీల నియంత్రణ తమ పరిధి కాదని చేతులెత్తేస్తుంది. పర్మిట్లు లేకుండా తిరిగే బస్సులపైన, అదనపు సీట్లు ఏర్పాటు చేసే బస్సులపైనా కేసులు నమోదు చేస్తారు. సరుకు రవాణాకు పాల్పడినా తరచుగా కేసులు పెట్టి జరిమానాలు విధిస్తుంటారు. కానీ ఇలా వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ వంటి ప్రత్యేక సందర్భాల్లో సాధారణ చార్జీలను రెండు రెట్లు పెంచినా రవాణా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రైవేట్ బస్సుల చార్జీలను నియంత్రించే ఏ వ్యవస్థా ప్రభుత్వంలో లేకపోవడం గమనార్హం. ప్రైవేట్ బస్సుల చార్జీలతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో విమాన చార్జీలే నయమనుకొనే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల్లో టూర్లకు వెళ్లేవారు, తిరుపతి, షిరిడీ, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కనీసం నెల రోజులు ముందుగా ఫ్లైట్ బుక్ చేసుకుంటే ప్రైవేట్ బస్సులకు వెచ్చించే రెట్టింపు చార్జీల ధరల్లోనే హాయిగా విమానయానం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. -
టికెట్ ధరలు పెంచుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాళ్లలో అన్ని తరగతుల టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పెంపుపై ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేసి ఈ వ్యవహారం తేల్చేంత వరకు పెంచిన ధరలు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. పెంపును సంబంధిత అధికారులకు తెలియజేయాలని, ధరల నిష్పత్తిలో పన్ను చెల్లించాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కోర్టు విధించిన షరతులను యాజమాన్యాలు అమలు చేస్తున్నాయో లేదో జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలని, సంబంధిత నివేదికను తమ ముందుంచాలని స్పష్టం చేశారు. ధరల పెంపుపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, నిర్ణయం తీసుకునే వరకు ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలంటూ పలు థియేటర్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ విచారణ జరపగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టికెట్ ధరల సవరణపై 2013లో ప్రభుత్వం జీవో 100ను జారీ చేయగా హైకోర్టు కొట్టేసిందన్నారు. ధరలను నిర్ణయించేందుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శుల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించిందని వివరించారు. 2017 మార్చి 30 లోపు ధరలపై మార్గదర్శకాలు రూపొందించాలని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని.. కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు. -
మేఘాలలో తేలిపోదామా!
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశంలో ఎగురుతున్న విమానం చూసి అందులో మనమెప్పుడు ఎక్కుతామో... అనుకునే రోజులు పోయాయ్! ఇప్పుడు విమానం టికెట్ల ధరలు భారీగా తగ్గిపోయి...గతంతో పోలిస్తే చాలా చవకగానే దొరుకుతున్నాయి. ప్రయాణానికి కనీసం నెల రోజులు ముందు టికెట్లు బుక్ చేసుకున్న సందర్భాల్లో విమాన చార్జీలు ఫస్ట్, సెకండ్ క్లాస్ ఏసీ రైలు టికెట్ల కన్నా తక్కువకే లభిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ సంస్థల మధ్య పోటీ కారణంగా జరుగుతున్న ధరల యుద్ధం వల్ల సమాజంలోని చాలా వర్గాలకు విమానయోగం చేరువైపోయింది. ప్రధాన విమానాశ్రయాల మధ్య ఈ ధరల యుద్ధం పతాకస్థాయికి చేరింది. ధరలు భారీగా తగ్గడంతో ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. రానున్న నాలుగేళ్లలో మన దేశీయ ప్రయాణికుల సంఖ్యలో ఏటా 15 శాతానికి పైగా వృద్ధి ఉండనుందని అంతర్జాతీయ విశ్లేషణ సంస్థలు చెబుతున్నాయి. రైలుకు సవాలు.. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ. 665, థర్డ్ ఏసీ రూ. 1755, సెకండ్ ఏసీకి రూ. 2,555, ఫస్ట్ ఏసీకి రూ. 4,385. ప్రయాణ సమయం రైలు రకాన్ని బట్టి అటుఇటుగా 24 గంటల వరకు పడుతోంది. ఏసీ రైలు చార్జీలతో పోలిస్తే విమానయానమే చవకగా మారింది. విమానంలో ప్రయాణ సమయం రెండున్నర గంటలే. దీంతో రైళ్లలో చాంతాడంత ఉండే వెయిటింగ్ లిస్టు తగ్గిపోయింది. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు మధ్య 9.54 కోట్ల మంది దేశీయంగా విమానయానం చేశారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే 17.30 శాతం ఎక్కువ. గడిచిన సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఏడు విమానయాన సంస్థలు 80 నుంచి 94.2 శాతం మధ్య ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్‌ను నమోదు చేశాయి. దిగివచ్చిన విమానం... ఢిల్లీ–హైదరాబాద్, ఢిల్లీ–ముంబై తదితర మార్గాల్లో ఇప్పుడు విమాన టికెట్లు ప్రయాణానికి కనీసం నెల ముందే కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2 వేలకే లభిస్తున్నాయి. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ సంస్థలిచ్చే క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లూ ఉన్నాయి. ఇండిగో, గో ఎయిర్ తదితర విమానయాన సంస్థల మధ్య పోటీయే ధరలు ఇంతలా తగ్గడానికి ప్రధాన కారణం. చిన్న నగరాలకు కూడా కనెక్టివిటీ పెంచుతూ కొత్త సర్వీసులను కూడా సంస్థలు ప్రారంభిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరి తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరులకు కొత్త సర్వీసులను ఇండిగో ఎయిర్‌లైన్స్ తాజాగా ప్రారంభించింది. అలాగే ప్రాంతీయ విమాన సర్వీసులను చవకగా అందించేందుకు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం కూడా విమానాలకు కొత్త ప్రయాణికులను పరిచయం చేస్తోంది. -
రైల్వే టిక్కెట్ ధరలు తగ్గబోతున్నాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే రైల్వే టిక్కెట్ల ఛార్జీలు త్వరలోనే తగ్గబోతున్నాయి. ఈ-టిక్కెట్లపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ల(ఎండీఆర్)ను ప్రభుత్వం తీసివేయాలని ప్లాన్ చేస్తోంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ప్రయాణికులు ఆన్‌లైన్‌గా టిక్కెట్లను బుక్ చేసుకుంటే, ఎండీఆర్ ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంకులు తాము అందించే డెబిట్, క్రెడిట్ కార్డు సర్వీసులకు ఈ ఛార్జీలను విధిస్తున్నాయి. ఎండీఆర్ ఛార్జీలను పరిష్కరించడానికి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఒక్కసారి ఎండీఆర్ ఛార్జీలు కనుక ప్రభుత్వం తీసివేస్తే, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు టిక్కెట్ ధరలు ఆటోమేటిక్‌గా పడిపోనున్నాయి. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో ఇండియా ఎకానమిక్ సమిట్‌లో మాట్లాడిన గోయల్ ఈ విషయాన్ని తెలిపారు. రైల్వే వ్యవస్థలో 12 నెలల వ్యవధిలోనే మిలియన్ కొద్ది ఉద్యోగాలను సృష్టించనున్నట్టు కూడా పేర్కొన్నారు. టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకుని వృద్ధి పథాన్ని కూడా మార్చనున్నట్టు తెలిపారు. -
బాహుబలి 2 చూశాక సీఎం సంచలన నిర్ణయం
భారీమొత్తంలో డబ్బులు వెచ్చించి మరీ బాహుబలి 2 సినిమాను చూసి వచ్చిన తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని మల్టిప్లెక్సెస్, సినిమా హాలులో ఒక్కో వ్యక్తి నుంచి తీసుకునే టిక్కెట్ గరిష్ట ధరలు 200 రూపాయలకు మించకూడదని మంగళవారం నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన వెలువరిచింది. అన్ని భాషల్లోని సినిమాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ నిబంధనలు మల్టిప్లెక్సెస్ ల్లో గోల్డ్ క్లాస్ స్క్రీన్, గోల్డ్ క్లాస్ సీట్లకు వర్తించవని తెలిసింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్ మూవీ హాల్స్ ను కూడా ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఈ నిర్ణయం వెలువరచడానికి ఒక్క రోజు ముందే సిద్ధరామయ్య వేల రూపాయలకు పైగా వెచ్చించి తన కుటుంబసభ్యులతో కలిసి బాహుబలి-2 సినిమా చూశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తానన్న ఆయనే.. అధిక ధర చెల్లించి సినిమా చూడటంపై కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది. ధరల నియంత్రణపై కన్నడ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. సీఎం అధిక ధర చెల్లించి సినిమా చూడటం వివాదాస్పదమైంది. మార్చి 15న తన బడ్జెట్ స్పీచ్ లో సిద్ధరామయ్య సినిమా టిక్కెట్ రేట్ల నియంత్రణపై నిర్ణయాన్ని ప్రకటించారు. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కన్నడ మూవీలను ఆదుకోవడానికి అడ్మిషన్ ఫీజులను నిర్ణయించడం అవసరమని ఆయన ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇప్పటికే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. నాన్-కన్నడ మూవీలకు ప్రజలు ఎక్కువగా వెచ్చిస్తున్నారని, భారీ మొత్తంలో వసూలు చేస్తున్న టిక్కెట్ ధరలతో వారు త్వరగా తమ పెట్టుబడులను రికవరీ చేసుకుంటున్నారని కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సా.రా గోవింద్ తెలిపారు. భారీగా వచ్చే ఒక్క మూవీతో 40 కన్నడ మూవీలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. -
సినిమా చూపిస్తున్నారు !
• కొత్త బొమ్మ పడిందంటే ధరల మోత • పండగల సమయాల్లో అధికంగా వసూళ్లు • అటకెక్కిన ఆకస్మిక తనిఖీలు.. • కనిపించని కనీస సౌకర్యాలు మహబూబ్‌నగర్ క్రైం : ఏదో కాలక్షేపం కోసం సినిమా చూద్దామని థియేటర్‌కు వస్తే అధిక ధరలతో సమస్యల సినిమా చూపిస్తున్నారు. అంతమొత్తం చెల్లించి లోపలికి వెళ్లినా చెమటలు కక్కాల్సిందే.. విశ్రాంతి సమయంలో ఏమైనా తినాలన్నా.. తాగాలన్నా అక్కడ ఉన్న ధరలతో కళ్లు తిరుగుతున్నాయి. వాహనం తీసుకెళ్తే జేబు గుల్ల అవుతుంది. ఇక మరుగుదొడ్ల వైపు వెళ్లకపోవడమే మంచిదనే రీతిలో అధ్వానంగా ఉన్నాయి. థియేటర్లోకి వెళ్లి అలా కూర్చున్నామో లేదో కాళ్ల పక్కనే ఆటలాడే మూషికాలు.. చిరిగిన.. విరిగినా సీట్లు.. సినిమా చూడటం దేవుడెరుగు ఎప్పుడు బయట పడుదామోనన్న పరిస్థితి నెలకొంది. ఇదీ జిల్లాలో సగానికి పైగా థియేటర్ల పరిస్థితి. మరి ఇదంతా జరుగుతుదంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఆకస్మిక తనిఖీలు ఎక్కడ జరుగుతున్నట్లు? ధరల నియంత్రణ ఎక్కడ అమలవుతున్నట్లో అధికారులకే తెలియాలి. అధిక ధరలకు టికెట్ల విక్రయాలు ప్రస్తుతం సంక్రాంతి పండగ సందర్భంగా పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహకులు వారి వ్యాపారం పెంచుకోవడం కోసం టిక్కెట్ల ధరలతో పాటు పార్కింగ్, క్యాంటిన్ ధరలు అమాంతంగా పెంచారు. ముఖ్యంగా టిక్కెట్ల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. టిక్కెట్‌పై రూ.70వేసి ప్రత్యేకంగా స్టాంప్‌తో రూ.100 ముద్ర వేసి ప్రేక్షకులతో 100 తీసుకుంటున్నారు. నిత్యం లక్షల్లో జనాల నుంచి నిర్వాహకులు దోచుకుంటున్నారు. కనిపించని కనీస సౌకర్యాలు జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో 50వరకు థియేటర్లున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే ఏడు థియేటర్లు ఉన్నాయి. అన్నిచోట్ల ధరలు అడ్డగోలుగా వసూలు చేస్తుండగా.. సౌకర్యాలు మాత్రం కరువైంది. రెవెన్యూ అధికారులు మాత్రం థియేటర్ల అనుమతికి సంబంధించి 5 విభాగాలు నిరభ్యంతర పత్రం అందిస్తుండటంతో వాటికి అనుగుణంగా రెన్యువల్ చేస్తున్నాం. అధిక ధరలను నియంత్రించేందుకు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నామని చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం అవి కన్పించడం లేదు. అనుమతులు ‘మామూలే’.. ప్రతి థియేటర్‌ను ఏటా రెన్యువల్ చేసుకోవాలి. ఫిల్మ్ ఛాంబర్, ట్రాన్స్‌కో, ఆర్అండ్బీ, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు తీసుకొస్తే రెవెన్యూ శాఖ థియేటర్లను నడుపుకునేందుకు అనుమతినిస్తుంది. కానీ అ నుమతుల్లో మాముళ్లదే పైచేయిగా మారుతోంది. క నీస సౌకర్యాలు లేకున్నా అనుమతులిచేస్తున్నారు. భ వన సామరŠాథ్యన్ని తెలుపుతూ ఆర్అండ్బీ అ భ్యంతరం లేదని ధృవీకరించాలి. అలాగే విద్యుత్ సరఫరాకు సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నాయం టూ ట్రాన్స్‌కో, ఎలాంటి అగ్నిమాపక శాఖ, సినిమా ప్రదర్శించే తెరకు సంబంధించి ఫిల్మ్‌ఛాంబర్ అ భ్యంతరం లేదని ధ్రువీకరిస్తే రెవెన్యూ శాఖ అనుమతి ని రెన్యువల్ చేస్తుంది. ఆచరణలో మాత్రం చేయి తడిపారంటే అనుమతి ఇచ్చేస్తున్నారు. ఇక అధికారుల ఆకస్మిక తనిఖీ అటకెక్కింది. జేబులు ఖాళీ.. కుటుంబంలో భార్య, భర్త ఇద్దరు పిల్లలతో సినిమాకు వెళితే పచ్చనోటు కూడా సరిపోవడం లేదు. విశ్రాంత సమయంలో క్యాంటిన్లో టీ, బిస్కెట్లు, సమోసాలు, శీతలపానియాలు కొనుగోలు చేస్తే బయట లభిస్తున్న ధరలకు ఐదురేట్లు అధికంగా వసూళ్లు చేస్తున్నారు. బిల్లు ఉండదు. వారి నోటికి ఎంతొస్తే అంత చెప్పడం.. ప్రేక్షకులు విధిలేక చెల్లించడం జరుగుతోంది. మరి కొత్త సినిమాలు విడుదల అవుతున్న సమయంలో మరింత దోపిడీ జరుగుతోంది. అదేవిధంగా థియేటర్లలో సైకిల్‌కు రూ.15, బైక్, కారు, ఆటోలకు రూ.30వసూలు చేస్తున్నారు. ఇవ్వకుంటే ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పోనీ వాహనాలకు భద్రత ఉందా అంటే అది లేదు. పార్కింగ్ రుసుంలో పేరిట ఇచ్చే రసీదులో ఎవరి సామాన్లలకు వారే బాధ్యులే అని ఉంటుంది. -
సినిమా టికెట్ ధరలకు రెక్కలు
వరంగల్ బిజినెస్ : సినిమా థియేటర్లలో టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజీ సినిమా గురువారం విడుదల కాగా నగరంలోని పలు థియేటర్లలో టికెట్ల ధరలు పెంచారు. వరంగల్‌లోని రామ్, నటరాజ్, సునీల్, లక్ష్మణ్, హన్మకొండలోని అమృత, అశోక థియేటర్లలో రూ.60 ఉన్న టికెట్ ఏకంగా రూ.100కు, రూ.40 ఉన్న టికెట్‌ను రూ.60, రూ.20 ఉన్న టికెట్‌ను రూ.30కు పెంచారు. థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించకుండానే ఇష్టారాజ్యంగా టికెట్ ధరలను పెంచడంతో సామాన్యులు సినిమా చూసే పరిస్థితి లేకుండా పోతోంది. టికెట్ ధరలు పెంచాలంటే జేసీ అనుమతి తీసుకోవాల్సి ఉండగా యాజమన్యాలు పట్టించుకోకపోవడం గమనార్హం. అలాగే, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాకే టికెట్ల ధరలు పెంచినట్లు చెబుతున్నారని పలువురు వాపోయారు. కాగా, సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు అధిక మొత్తం వెచ్చించడంతో టికెట్ల ధరలు పెంచినట్లు చెప్పారని సమాచారం. అయితే, వరంగల్ వెంకట్రామ థియేటర్లో కూడా టికెట్ ధర పెంచాలని డిస్ట్రిబ్యూటర్ ఒత్తిడి తెచ్చినా యజమాని నిరాకరించడంతో పాత ధరలతో విక్రయించారు. -
ఎయిర్ఏషియా డిస్కౌంట్ ఆఫర్
చెన్నై: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ విమాన టికెట్‌ను (ఒకవైపునకు మాత్రమే) రూ.786 ప్రారంభ ధరతో అందిస్తోంది. ‘ఫ్లై లైక్ ఏ సూపర్‌స్టార్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్.. జూలై 3 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలియజేసింది. పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకూ ఒకవైపునకు సంబంధించి రూ.2,999 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అప్‌కమింగ్ మూవీ ‘కబాలి’ ప్రమోషన్స్‌లో భాగం గా సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ఏషియా ఇటీవలే కబాలి సినిమా నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
విద్యార్థులకు ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ.. ఈ పరిమిత కాల ఆఫర్లో భాగంగా చదువు పరంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించే విద్యార్థులకు దేశీ విమాన టికెట్‌ను రూ.3,500 నుంచి అందిస్తోంది. తాజా ఆఫర్ ప్రయాణికులకు జూలై 31 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. -
ఆర్టీసీ చార్జీల బాదుడు
-
ఆర్టీసీ చార్జీల బాదుడు
- పల్లె ప్రజలపై 5 శాతం భారం - డీలక్స్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ ప్రయాణికులపై 10 శాతం వడ్డన - అర్ధరాత్రి నుంచి అమల్లోకి - తెలుగు వెలుగు బస్సులో కిలోమీటరుకు - 3 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులో 8 నుంచి 9 పైసలు పెంపు - ప్రయాణికులపై ఏటా రూ.300 కోట్ల భారం - స్టూడెంట్ బస్సు పాస్‌ల చార్జీలు యథాతథం - చార్జీలు పెంచబోమన్న ఎన్నికల హామీలు తుంగలోకి తొక్కిన బాబు సర్కారు - డీజిల్ ధరలు తగ్గుతున్నా, ఆర్టీసీ చార్జీలు పెంచడంపై సర్వత్రా విస్మయం - డిసెంబర్ 31లోగా జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లకు కొత్త హంగులు సాక్షి, విజయవాడ : ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ప్రభుత్వం చార్జీల భారం మోపింది. వ్యూహాత్మకంగా అమరావతి శంకుస్థాపన, దసరా పండుగ ముగిసీ ముగియగానే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల దెబ్బ వేసింది. రాష్ట్రంలో చార్జీలు పెంచబోమని గత ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రజలపై భారం మోపబోమంటూ అప్పట్లో చంద్రబాబు ఊరూ వాడా తిరిగి హామీ ఇచ్చారు. దానిని విస్మరించి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రెండోసారి చార్జీల భారం మోపారు. కొద్ది నెలల క్రితం బస్సు చార్జీలను పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావం కారణంగా పంటలు పండక, కరువు పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం మరోసారి చార్జీలను పెంచింది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గి, డీజిల్ ధరలు తగ్గుతుండగా, రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే తెలుగు వెలుగు, డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల చార్జీలను పెంచింది. అత్యంత ధనికులు మాత్రమే ప్రయాణించే వెన్నెల బస్సుల చార్జీలను మాత్రం పెంచలేదు. ఈ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ ఎన్. సాంబశివరావు తెలిపారు. శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెరిగిన చార్జీల వివరాలను వెల్లడించారు. పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉపయోగించే తెలుగు వెలుగు బస్సుల చార్జీలను ప్రస్తుతం ఉన్న రేటుపై 5 శాతం అంటే కి.మీ.కు 3 పైసలు పెంచామని చెప్పారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు ప్రస్తుతం ఉన్న చార్జీలపై 10 శాతం అంటే 8 నుంచి 9 పైసలు పెంచామని వెల్లడించారు. ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల చార్జీలను కూడా 10 శాతం పెంచినట్లు తెలిపారు. వెన్నెల బస్సుల చార్జీలను మాత్రం పెంచలేదు. రాష్ట్రంలో పది లక్షల మంది విద్యార్థులు బస్‌పాస్‌లు ఉపయోగించుకుంటున్నారని, అందువల్ల వాటి చార్జీలు పెంచలేదని తెలిపారు. పెరిగిన చార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.300 కోట్ల భారం పడుతుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.595 కోట్లు నష్టం వచ్చిందని, దీనికి తోడు ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల మరో రూ.660 కోట్లు ఆర్థిక భారం పడిందని ఎండీ వివరించారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రయత్నించామని, అయినప్పటికీ రూ.1,200 కోట్లకు పైగా నష్టం రావడంతో ప్రజలపై భారం మోపక తప్పలేదని చెప్పారు. ఆర్టీసీ ఆఖరుసారిగా 2013 నవంబర్‌లో చార్జీలు పెంచిందని వివరించారు. ఆర్టీసీని ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారని, రాష్ట్రంలో 14,000 గ్రామాలకు సేవలందిస్తోందని వివరించారు. విద్యార్థుల బస్ పాస్‌లకు సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.280 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంటుందని, మూడు నెలలకోసారి ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్ విధించడం వల్ల ఆర్టీసీపై ఏడాదికి రూ.395 కోట్లు భారం పడుతోందని వెల్లడించారు. దీన్ని మాఫీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. గతంతో పోల్చితే ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెరిగిందని, గతంలో 52 శాతం ఉండగా, ప్రస్తుతం 72 శాతానికి చేరిందని చెప్పారు. కొన్ని బస్సుల్లో నూరు శాతం ఉండగా, కొన్నింటిలో 44 శాతం కంటే పెరగడం లేదని చెప్పారు. -
రూ.1,777కే ఎయిర్ ఇండియా టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పరిమిత కాల దేశీ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ విమాన టికెట్లను రూ.1,777లకే ప్రయాణికులకు అందిస్తోంది. జూన్ 10 నుంచి 12 మధ్యకాలంలో బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. -
జెట్ ఎయిర్వేస్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థ జెట్ ఎయిర్వేస్ టికెట్ ధరల్లో పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టికెట్ ధరల్లో 30 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. జూన్ 1 నుంచి 4 వరకు టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. గల్ఫ్, సార్క్, ఏసియన్, యూరప్, యూఎస్, కెనడా ప్రాంతాలకు వెళ్లే వారు ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 14 తర్వాత ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. తన భాగస్వామి ఎతిహాద్ విమానాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. -
చార్జీల పెంపునకు సిద్ధం..!
టికెట్ ధరల సవరణపై యాజమాన్యం దృష్టి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు అడిగిన దానికంటే ఒక శాతం ఎక్కువగా ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఇక బస్సు చార్జీల పెంపుపై దృష్టి సారించనుంది. ఫిట్మెంట్ భారాన్ని అధిగమించే యత్నాల్లో చార్జీల పెంపు కూడా ఒకటని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అయితే ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా చూస్తామని పేర్కొన్నారు. కానీ, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో ఆర్టీసీపై రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పటికే నష్టంతో కుంగిపోతున్న ఆర్టీసీ ఈ భారం మోయలేమని స్పష్టం చేస్తోంది. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిన వెంటనే దాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక భారం నుంచి కొంతైనా తప్పించుకోవాలని చూస్తోంది. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చిన వెంటనే టికెట్ ధరలు పెంచితే.. ఆ భారాన్ని నేరుగా ప్రజలపై మోపిన భావన వస్తుందనే ఉద్దేశంతో చార్జీల పెంపును వెంటనే అమలు చేయొద్దని భావించింది. కానీ, డీజిల్ ధరలు పెరగడంతో ఇక టికెట్ ధరల పెంపు అనివార్యంగా మారింది. కార్మికులకు ఫిట్మెంట్ ప్రకటిస్తే 15 శాతం మేర టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతించాలని ఆర్టీసీ గత నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దానికి వెంటనే పచ్చజెండా ఊపాలని ఇప్పుడు ఆర్టీసీ కోరబోతోంది. దీనికి సంబంధించి మరో రెండుమూడు రోజుల్లో కొత్త ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించే సమయంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీకి పలు వరాలు ప్రకటించారు. అందులో కొన్ని మినహా మిగతా వేటిపై స్పష్టత లేదు. ముఖ్యంగా.. 44 శాతం ఫిట్మెంట్ ప్రకటనతో పడే రూ.850 కోట్ల భారాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుందా, ఆర్టీసీకి కొంతమేర గ్రాంట్ల ద్వారా సర్దుబాటు చేస్తుందా అన్న విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆర్టీసీకి తీవ్ర భారంగా మారిన రూ.1,900 కోట్ల అప్పుల విషయంలోనూ అలాంటి గందరగోళమే నెలకొంది. అప్పులకు సంబంధించి ఆర్టీసీ రూ.186 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ భారం నుంచి బయటపడాలంటే ముందుగా అప్పులు లేకుండా చేయాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. కానీ, ఆ అప్పులను ఎవరు తీర్చాలనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆర్టీసీకి జరుపుతామన్న కేటాయింపులు ఎంత అనేదీ స్పష్టం కాలేదు. జూన్ నెల నుంచి ఫిట్‌మెంట్‌ను చెల్లించాల్సిన నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ, ముఖ్యమంత్రి హామీల్లో స్పష్టత వస్తేగానీ ఈ లెక్కలు తేలవు. దీంతో ఆర్టీసీ అధికారులు రవాణాశాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రెండుచోట్ల కూడా స్పష్టత లేకపోవడంతో ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదించి చెప్తామనే సమాధానం వచ్చినట్టు తెలిసింది. -
కొన్ని చౌక.. మరికొన్ని ప్రియం
నేటి నుంచి అమల్లోకి సేవా పన్ను ప్రతిపాదనలు న్యూఢిల్లీ: బడ్జెట్లో పేర్కొన్న కొన్ని సేవా పన్ను ప్రతిపాదనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుండటంతో మ్యూజియాల, జంతు ప్రదర్శన శాలల, జాతీయ పార్కుల, జంతు సంరక్షణ శాలల ప్రవేశ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. వీటి కి సేవా పన్ను మినహాయింపు ఇచ్చారు. వీటితోపాటు వరిష్ట పెన్షన్ బీమా యోజన, అంబులెన్స్ సర్వీసులు, కూరగాయల, పండ్ల రిటైల్ ప్యాకింగ్ వంటి వాటిపైన కూడా సేవా పన్ను విధించలేదు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల ధరలు మాత్రం పెరగనున్నాయి. వీటిపై ప్రస్తుతం ఉన్న 40 శాతం సేవా పన్ను నేటి నుంచి 60 శాతానికి పెరుగుతుంది. సేవాపన్ను కిందకు మ్యూచువల్,చిట్ ఫండ్స్ సేవలు ఇకపై మ్యూచువల్ ఫండ్స్ సేవలు, లాటరీ టికెట్ల మార్కెటింగ్, డిపార్ట్మెంట్ల పబ్లిక్ టెలిఫోన్లు, ఎయిర్‌పోర్ట్స్, హాస్పిటల్స్ ఉచిత టెలిఫోన్ కాల్స్ సేవా పన్ను కిందకు రానున్నాయి. చిట్ ఫండ్స్‌కు సంబంధించిన లావాదేవీలకూ సేవా పన్ను వర్తించనుంది. ప్రభుత్వానికి సంబంధించిన చారిత్రక కట్టడాల, నీటిపారుదల పనులు, తాగు నీటి సరఫరా, మురికి నీటి శుద్ధి నిర్వహణ వంటి వివిధ నిర్మాణాత్మక సేవలకు ఏప్రిల్ 1 నుంచి సేవా పన్ను మినహాయింపు ఉంటుంది. జానపద, శాస్త్రీయ కళాకారులు అందించే సేవల విలువ రూ. లక్షకు తక్కువగా ఉంటే వాటికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. రైలు, రోడ్డు మార్గాలలో రవాణా చేసే ఆహార పదార్థాలకు (బియ్యం, పప్పు ధాన్యాలు, పాలు, ఉప్పు మాత్రమే) పన్ను మినహాయింపు ఉంటుంది. ఇతర పదార్థాల ధరలు పెరగనున్నాయి. ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు అందించే నిర్మాణ సర్వీసులకు కల్పిస్తున్న పన్ను మినహాయింపులు ఇకపై ఉండవు. -
చౌక టికెట్ ధరల రేసులోకి స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: ఇతర విమాన సంస్థల మాదిరిగానే స్పైస్‌జెట్ కూడా టికెట్ ధరల్లో డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రయాణికుల కోసం దాదాపు 5 లక్షల సీట్లను ప్రారంభ ధర రూ. 1,499కే అందుబాటులో ఉంచింది. బుధవారం నుంచి మూడు రోజుల వరకు జరిగే సూపర్ అమ్మకాల్లో ముందుగా బుకింగ్ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ప్రయాణికులు ఈ టికెట్లతో ఫిబ్రవరి 15 నుంచి జూన్ 30 వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది. జనవరి-మార్చి, జూలై-సెప్టెంబర్ త్రైమాసికాల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందుకే పలు విమాన సంస్థలు ప్రయాణికుల్ని ఆకర్షించటానికి ఆఫర్లను ప్రకటిస్తాయి. సూపర్ అమ్మకాల ద్వారా సంస్థ ఆదాయం పెరుగుతుందని స్సైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కనేశ్వరన్ అవిలి చెప్పారు. ప్రయాణికులకు రైళ్లు, బస్సు ప్రయాణాలతో పోలిస్తే విమాన ప్రయాణం ఇంకా సులభతరం చేయటం కోసమే ఇలాంటి ఆఫర్లను ప్రకటించామని తెలిపారు. -
ట్రావెల్ దందా
ప్రయాణికులకు పండుగ పాట్లు ప్రైవేట్ బస్సుల్లో మూడు రెట్లు పెరిగిన టికెట్ ధరలు ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లోనూ 50 శాతం అదనపు చార్జీ వసూలు తనిఖీలు నిర్వహించని రవాణా శాఖ సాక్షి, విజయవాడ : జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్ల పండుగ దందాకు తెరలేచింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ముందుగానే సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి. దీంతో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు టికెట్ ధరలను రెండు, మూడు రెట్లు పెంచి అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదారాబాద్ నుంచి విజయవాడ, నగరం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సుల్లో టికెట్ల ధరలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓల్వో, స్లీపర్ బస్సుల టికెట్ ధరలు విమానం టికెట్ రేట్లతో పోటీపడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఓల్వో బస్సులో చార్జీ రూ.1,500 వరకు, నగరం నుంచి వైజాగ్‌కు రూ.1,900 వరకు వసూలు చేస్తున్నారు. శనివారం నుంచి మొదలైన ఈ తరహా దోపిడీ ఆదివారానికి మరింత పెరిగింది. ఇదే పరిస్థితి మంగళవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. పండుగ అనంతరం 16 నుంచి 18వ తేదీ వరకు కూడా ప్రయాణికులకు ఈ తరహా కష్టాలు తప్పవు. ఈ దందాను అడ్డుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు పూర్తిగా ఆధార్ సీడింగ్ ప్రక్రియలో నిమగ్నమవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. రెండు, మూడు రెట్లు ఎక్కువగా.. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు జిల్లా నుంచి నిత్యం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం తదితర నగరాలతోపాటు రాష్ట్రంలోని 13 జిల్లాలకు బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి అన్ని ముఖ్య నగరాలకు రోజూ 250 బస్సులు వెళ్తుంటాయి. పండుగ సమయాల్లో మరో 100 బస్సుల వరకు ఏర్పాటుచేస్తారు. ఈక్రమంలో సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని శనివారం నుంచి మంగళవారం వరకు ప్రత్యేక సర్వీసులు కూడా పెంచారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏసీ బస్సులో టికెట్ రూ.550 కాగా, పండుగ రద్దీ పేరుతో రూ.1,000 నుంచి 1,500 వరకు వసూలు చేస్తున్నారు. నగరం నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో చార్జీ రూ.600 కాగా, ప్రస్తుతం 1,200 నుంచి రూ.1,900 వరకు పెంచేశారు. మంత్రి చెప్పినా... ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లు టికెట్లను అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఇటీవల చెప్పారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లోనూ టికెట్ల ధరలు ఒకేలా ఉండేలా చూస్తామని ప్రకటించారు. మంత్రి మాటలను అటు ఆర్టీసీ గానీ, ఇటు ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు గానీ, పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెందిన బస్సుల్లో ఇష్టానుసారంగా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఆర్టీసీలో ప్రత్యేక సర్వీసుల పేరుతో టికెట్ ధరలో 50 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ టార్గెట్ కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా పండుగను సొమ్ము చేసుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 13 వరకు, 16 నుంచి 18 వరకు స్పెషల్ బస్సులు నడిపి టికెట్లను అధిక ధరకు విక్రయించడం ద్వారా కోటి రూపాయల ఆదాయం పొందాలని విజయవాడ రీజియన్ అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఈ మేరకు బస్సులు తిరుగుతున్నాయి. సాధారణంగా హైదారాబాద్‌కు రోజు ఇక్కడి నుంచి 225, విశాఖపట్నం వైపు 110 బస్సులు వచ్చివెళ్తుంటాయి. పండుగ రద్దీ దృష్ట్యా శని, ఆదివారాల్లో రాజమండ్రి, విశాఖపట్నం వైపు అదనంగా 50 బస్సులు, హైదరాబాద్‌కు 70 బస్సులను పంపి అక్కడి నుంచి ప్రయాణికులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం, మంగళవారాల్లో విశాఖపట్నం రూట్‌కు 150, హైదరాబాద్‌కు 100 బస్సులను ఏర్పాటు చేశారు. పండుగ తర్వాత 16 నుంచి 18 వరకు మరో 20 శాతం బస్సులను పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ టికెట్ ధర కన్నా 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇతే తరహాలో ప్రత్యేక బస్సులు నడపడంతో ఆర్టీసీకి రీజియన్ పరిధిలో రూ.80లక్షల ఆదాయం వచ్చింది. -
అ‘ధన’పు దోపిడీ
సంక్రాంతికి ప్రత్యేక టికెట్ ధరలు మళ్లీ 50 శాతం పెంచుతున్న ఆర్టీసీ డీజిల్ ధరలు తగ్గినా రూటు మారని వైనం అదే బాటలో ప్రైవేట్ ట్రావెల్స్ సిటీబ్యూరో: సంక్రాంతి దోపిడీ వైపు ఆర్టీసీ చక్రం పరుగులెడుతోంది. ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు వసూళ్లకు ఆ సంస్థ తెరలేపింది. ఇటీవల కాలంలో డీజిల్ ధరలు బాగా తగ్గినప్పటికీ ప్రయాణికులను వదలడం లేదు. వారిపై అదనపు భారాన్ని మోపేందుకే సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 5,560 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైద రాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జనవరి 8నుంచి 13వ తేదీ వరకు వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు. రైళ్లన్నీ నిండిపోవడం.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రైవేట్ ఆపరేటర్లు ఇప్పటికే చార్జీలను రె ట్టింపు చేసి దోచుకుంటుండగా...వారికి తాము ఏమాత్రం తీసిపోమనే రీతిలో ఆర్టీసీ సైతం అదే బాటలో నడుస్తోంది. ఉభయ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌కు తెప్పించేందుకు ఆర్టీసీపై పడే ఇంధన భారం దృష్ట్యా మాత్రమే అదనపు చార్జీలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించడం గమనార్హం. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం పండగ రద్దీ దృష్ట్యా నగరం నుంచి విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, కర్నూలు, కడప, తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో జనవరి 9, 10 తేదీలకు 75 శాతానికి పైగా సీట్లు నిండినట్లు ఈడీ తెలిపారు. దీంతో ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో 10 శాతం సీట్లు నిండాయి. ఆంధ్రా వైపు 2,835 ప్రత్యేక బస్సులు, తెలంగాణలో 2,720 బస్సులు వేస్తున్నట్టు తెలిపారు. వీటన్నిటికీఅదనపు చార్జీలు వర్తిస్తాయి. వీటికి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. నగరంలోని 350కి పైగా ఏటీబీ కేంద్రాలు, ఆర్టీసీ బుకింగ్ కౌంటర్లు, ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. 9, 10, 11 తేదీల్లో రద్దీ బాగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. ఈ మేరకు 9వతేదీన 1345 బస్సులు, 10న 1,510, 11న610 సర్వీసులు నడపనున్నారు. సుమారు 500 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సేవలు అందించనున్నారు. దారి మళ్లింపు సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌కు వచ్చే బస్సులను నగర శివార్ల నుంచే నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు వెళ్లే బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్, పికెట్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి.కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ హేంగర్ (గౌలిగూడ) నుంచి నడుపుతారు.నల్గొండ, మిరియాలగూడ వైపు వెళ్లే బస్సులు దిల్సుఖ్నగర్ బస్‌స్టేషన్, ఎల్బీనగర్ల నుంచి నడుస్తాయి. వరంగల్, యాదగిరిగుట్ట, హన్మకొండ, జనగామ బస్సులను ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నడుపుతారు.విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి తదితర రూట్ల బస్సులు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి నడుస్తాయి.ఎల్బీనగర్, ఉప్పల్ రింగు రోడ్డు వద్ద ప్రయాణికుల కోసం ప్రత్యేక అనౌన్స్మెంట్ ఏర్పాటు చేస్తారు.గౌలిగూడ, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లలో అనౌన్స్‌మెంట్‌తో పాటు, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తారు. షటిల్ బస్సులు మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల మధ్య ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉండేలా సిటీ బస్సులు నడుపుతారు. ఇవిఎంజీబీఎస్లో 51వ ప్లాట్‌ఫామ్ నుంచి 55 వరకు ఉంటాయి.ఉప్పల్ వైపు వెళ్లే సిటీ బస్సులు ఎంజీబీఎస్‌లో 41 నుంచి 46 ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఆగుతాయి. ఎల్బీనగర్కు వెళ్లే సిటీ బస్సులు 15వ ప్లాట్‌ఫామ్ వద్ద ఆగుతాయి. -
పండుగల సీజన్లో ప్రయాణికులకు చార్జీల షాక్
50శాతం తత్కాల్ కోటాకు డివూండ్ ప్రాతిపదికన పెరిగిన చార్జీలు న్యూఢిల్లీ: పండుగల సీజన్లో రైల్వే ప్రయూణికులకు ఇది చేదువార్త. దేశవ్యాప్తంగా 80రైళ్లలోని తత్కాల్‌కోటా టికెట్లలో సగం టికెట్ల ధరలు గణనీయుంగా పెరిగాయి. ప్రయూణికుల డివూండ్ ప్రాతిపదికగా, తత్కాల్ టికెట్లలో సగం కోటాను ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ పరిధిలోకి తేవాలని రైల్వేశాఖ నిర్ణరుుంచడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పండుగల సీజన్ వుధ్యలో ప్రయూణికుల రద్దీని సొవుు్మచేసుకోవడం ద్వారా రైల్వే ఆదాయూన్ని పెంచుకోవడమే లక్ష్యంగా రైల్వేశాఖ ఈ నిర్ణయుం తీసుకుంది. తత్కాల్ కోటాలోని తొలి 50శాతం టికెట్లు ప్రస్తుత చార్జీలతోనే బుకింగ్ జరిగాక, మిగిలిన 50శాతం టికెట్లకు ప్రీమియుం ధరలను వర్తింపజేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియుర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ నెలలోనే అవులులోకి వచ్చిన ‘ప్రీమియుం తత్కాల్ టికెట్’ పథకాన్ని ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంచినట్టు రైల్వే బోర్డు (ట్రాఫిక్) సభ్యుడు డీపీ పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన 80రైళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నావున్నారు. ఇందుకోసం ఒక్కో జోన్లో ఐదేసి రైళ్లను గుర్తించాలని ఆయూ రైల్వే జోన్లను ఆదేశించినట్టు చెప్పారు. బ్లాకులో టికెట్లు విక్రయూనికి పాల్పడేవారి బెడదను అరికట్టేందుకే ఈ కొత్త చార్జీల వ్యవస్థను వర్తింపజేస్తున్నట్టు రైల్వే శాఖ చెబుతోంది. హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హజరత్ నిజావుుద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికిందరాబాద్-హౌరా ఫలక్‌నువూ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-బెంగళూరు ఎక్ప్రెస్, సికిందరాబాద్-పాట్నా ఎక్‌ప్రెస్‌లకు కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ అంటే: ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ ప్రకారం తత్కాల్ కోటాలో తొలి 50శాతం టికెట్లు ప్రస్తుత రేట్లతోనే బుక్ చేస్తారు. తదుపరి 10శాతం టికెట్లకు 20శాతం ఎక్కువగా చార్జీ వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక ‘థర్డ్‌ఏసీ’ రైల్వేబోగీలో 60సీట్లు అందుబాటులో ఉంటే, వాటిలో 30టికెట్లకు సాధారణమైన తత్కాల్ చార్జీలు వర్తిస్తారుు. మిగిలిన 30సీట్లలో పదిశాతం సీట్లకు, అంటే 3సీట్లకు, 20శాతం ఆదనపు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఆ తర్వాత మిగిలిన 27 సీట్లకు ఇదే పద్ధతిలో, 20శాతం అదనపు చార్జీ వర్తిస్తూపోతుంది. -
పండుగ సాకుతో దండుడు
సాక్షి, రాజమండ్రి :వేసవి సెలవుల అనంతరం పిల్లలకు లభించే పెద్ద ఆటవిడుపు దసరా సెలవలే. పదిరోజుల వరకూ ఉండే ఈ వ్యవధిలో తల్లిదండ్రులూ వెసులుబాటు చేసుకుని పండుగ ప్రయాణాలకు సన్నద్ధమవుతారు. అదిగో.. ఆ రద్దీనే అవకాశంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నాయి రవాణా సంస్థలు. ఈ లాభాలవేటలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లూ, ఆర్టీసీ వారూ పోటీ పడుతున్నారు.ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా రేట్లు వసూలు చేస్తుండగా, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో టిక్కెట్ ధరలు పెంచేస్తోంది. జిల్లా మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా వాటికి సంబంధించిన రిజర్వేషన్లు ఎన్నడో అయిపోయాయి. జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట స్టేషన్లకు కేటాయించిన బెర్తులు, సీట్లు 60 రోజుల ముందే భర్తీ అయ్యాయి. దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌కు కాకినాడ నుంచి ఆరు, విశాఖ నుంచి మూడు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శనివారంతో వీటిలో సీట్లు కూడా అయిపోయాయి. దీంతో జిల్లా వాసులకు కేవలం బస్సు ప్రయాణమే దిక్కవుతోంది. హైదరాబాద్‌కు నాన్ ఏసీ చార్జి రూ.1500 రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మామూలుగా రూ.600 నుంచి రూ.800 వరకు చార్జి చేసే ప్రైవేట్ బస్సుల వారు పండుగ రద్దీ సాకుతో రూ.1000 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వాళ్ల నుంచి అదే అవకాశంగా నాన్ ఏసీ బస్సు టిక్కెట్‌కే రూ.1500 వసూలు చేస్తున్నట్టు ఓ ప్రైవేట్ బస్సు నిర్వాహకుడే చెప్పారు. కండిషన్ సరిగ్గా లేని బస్సులను సైతం పండుగ స్పెషల్ సర్వీసులుగా నడుపుతూ వాటికి కూడా స్పెషల్ రేట్లు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే వాటితో కలిపి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సుమారు 60 బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లు తిప్పుతున్నారు. వీటి నుంచే పండుగ పేరుచెప్పి అదనంగా దండుకునేందుకు చూస్తున్నారు. రద్దీని బట్టి అప్పటి కప్పుడు ఖాళీగా ఉన్న టూరిస్టు సర్వీసులను సిద్ధంచేసి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులు కాదు.. చార్జీలే ప్రత్యేకం కాగా ఆర్టీసీ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు మామూలుగా నడిపే సర్వీసులతో పాటు పండుగ సందర్భంగా మొత్తం వంద ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇవి శనివారం నుంచి అక్టోబర్ ఒకటి వరకూ కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు నడుస్తాయి. తిరిగి రెండు నుంచి ఆరు వరకూ అదే సంఖ్యలో ప్రత్యేక సర్వీసులు హైదరాబాద్ నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నడుస్తాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారిపై ఆర్టీసీ అదనపు భారం మోపుతోంది. ప్రస్తుతం ఉన్న చార్జికి 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ప్రస్తుతం సూపర్ లగ్జరీ చార్జి రూ.441 కాగా స్పెషల్ సర్వీసుల్లో రూ.660 వరకూ ఉంటోంది. కాగా జిల్లా సర్వీసులుగా తిరిగే బస్సుల్లోనే కొన్నింటిని ఆర్టీసీ విజయవాడ, విశాఖలకు ప్రత్యేక బస్సులుగా మళ్లిస్తోంది. ప్రయాణికుల రద్దీని బట్టి అప్పటికప్పుడు నడుపుతున్న ఈ ప్రత్యేక సర్వీసులకూ అదనపు చార్జీలనే వసూలు చేస్తోంది. -
త్వరలో బస్సు చార్జీల బాదుడు!
బాబు సర్కారు యోచన ► 15 శాతానికి తక్కువ కాకుండా పెంపునకు ఆర్టీసీ ప్రతిపాదనలు ► పెరగనున్న ఆర్డినరీ, సూపర్ లగ్జరీ, గరుడ చార్జీలు! ► సీఎం ఆమోదమే తరువారుు ► రూ. 556 కోట్లకు పైగా జనంపై భారం హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘బస్సు చార్జీలను పెంచి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో డీజిల్ ధర ఏడెనిమిది సార్లు పెరిగింది. బస్సు చార్జీలను పెంచక తప్పని పరిస్థితి ఉంది. త్వరలోనే సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పిన నేపథ్యంలో అక్టోబర్ నుంచి చార్జీల పెంపు తప్పదని తెలుస్తోంది. 15 శాతానికి పైగా బస్సు టికెట్ ధరలు పెంచాల్సిందిగా ఆర్టీసీ యూజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ప్రయాణికులు డబ్బు లెక్క చేయడం లేదని, వారికి మెరుగైన సేవలందిస్తే ఆర్థిక భారాన్ని పట్టించుకోరని మంత్రి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే.. చార్జీల పెంపు ఖాయమని, ప్రభుత్వం ఇప్పటికే ఈ మేరకు నిర్ణయూనికి వచ్చిందనే విషయం స్పష్టమవుతోంది. ఈ మేరకు ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. గురువారం సచివాలయంలో ఆర్టీసీ, రవాణా అధికారులతో సమావేశమైన మంత్రి ఈ అంశంపైనే సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. డీజిల్ ధర ప్రతి నెలా లీటరుకు 50 పైసల చొప్పున పెరుగుతుండటంతో సంస్థ ఏటా రూ.400 కోట్లకు పైగా భారం భరించాల్సి వస్తోందని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఎంప్లాయిస్ యూనియన్ నేతలతో బుధవారం చర్చలు, అంతర్గత సమావేశం సందర్భంగా చార్జీల పెంపును ప్రస్తావించిన యాజమాన్యం.. చార్జీల పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ చార్జీలు 10 శాతానికి పైగా, సూపర్‌లగ్జరీ 15 శాతం, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ చార్జీలు 15 శాతానికి పైగా పెంచేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతున్నట్టు అధికారవర్గాల సమాచారం. 15 శాతం వరకు చార్జీల పెంపుతో ప్రయాణికులపై పెనుభారమే పడనుంది. రూ.556 కోట్లకు పైగా భారం! గతేడాది నవంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ చార్జీలు 9.5 శాతం వరకు పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలపై రూ.600 కోట్ల భారం పడింది. విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం పెంచనున్న బస్సు చార్జీలతో రూ.556 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా. ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగితే రాష్ట్రంలోని ప్రైవేటు బస్సు ఆపరేటర్లకూ కాసుల వర్షమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు వారాంతాల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ చార్జీలు పెరిగితే ఆ సాకుతో ప్రయాణికులను మరింత దోచుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు బస్సు ఆపరేటర్లంతా టీడీపీకి చెందినవారే కావడంతో వారు పండుగల వేళ, రద్దీ సమయాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విలేకరులు రవాణా మంత్రి దృష్టికి తెచ్చారు. వారితో ఏకీభవించిన మంత్రి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. డీజిల్ బదులు బయోడీజిల్: మంత్రి శిద్దా ఆర్టీసీ బస్సుల్లో డీజిల్ బదులు బయో డీజిల్ వాడాలని నిర్ణరుుంచినట్లు రవాణా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. బయో డీజిల్ సరఫరాను కాంట్రాక్టుకు అప్పగించనున్నామని, ఈ మేరకు రెండ్రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బస్స్టేషన్లలో విద్యుత్ పొదుపునకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయూలని, ఆర్టీసీ స్థలాలు బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) పద్ధతిలో లీజుకు అప్పగించడం వంటి కీలక నిర్ణయూలు తీసుకున్నామన్నారు. పోలాండ్, ఆస్ట్రేలియాలో ఆర్టీసీ బస్స్టేషన్లను అధ్యయనం చేసి, ఆ మాదిరిగా విజయవాడ, వైజాగ్, గుంటూరులలోని ఆర్టీసీ బస్టాండ్లలో షాపింగ్ మాల్స్, ఐమ్యాక్స్ థియేటర్లు లాంటి నిర్మాణాలు బీవోటీ పద్ధతిలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గతంలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా డీల్ చేయలేదన్నారు. సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ మాట్లాడుతూ.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోయినా మూడు నెలల కిందటే ఏర్పాటైన ప్రభుత్వానికి ఓ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సమ్మె విషయంలో గౌరవప్రదమైన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.