దేవర టికెట్‌ అధిక ధరలను 10 రోజులకే పరిమితం చేయండి | Dewara ticket prices are high Limit it to 10 days | Sakshi
Sakshi News home page

దేవర టికెట్‌ అధిక ధరలను 10 రోజులకే పరిమితం చేయండి

Published Thu, Sep 26 2024 5:33 AM | Last Updated on Thu, Sep 26 2024 5:33 AM

Dewara ticket prices are high Limit it to 10 days

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం  

14 రోజుల పాటు అనుమతించవద్దని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: దేవర సినిమా టికెట్లను 14 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకునేందుకు అనుమతి­నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆ టికెట్లను మొదటి 10 రోజులకు మాత్రమే అధిక ధరలకు అను­మతి­నివ్వాలని, సినిమా టికెట్‌ ధరల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభు­త్వాన్ని ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీకి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

వాస్త­వానికి జీవో 13 ప్రకారం మొదటి 10 రో­జులకే అధిక ధరలకు టికెట్లు అమ్ముకోవాల్సి ఉంటుందని గుర్తు­చేసింది. 20 శాతం మేర షూటింగ్‌ ఏపీలో జరిగిన భారీ బడ్జెట్‌ చిత్రాలకే అధిక ధరలకు అ­మ్ముకునే వెసులుబాటు ఉందని, ఈ విషయంలో నిర్మాత ఎలాంటి వివరాలను పొందుపరిచినట్లు కనిపించడం లేదంది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నామని కోర్టు తెలిపింది. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సినిమా ఈ నెల 27న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా టికెట్‌ ధరలను 14 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకు­నేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ నెల్లూరు జిల్లా, కావలికి చెందిన పి.శివకుమార్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement