
హైదరాబాద్,సాక్షి,: లావణ్య, రాజ్ తరుణ్‌ల వివాదం తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, మస్తాన్ సాయి (Mastan Sai Case) నిందితుడిగా ఉన్న ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మస్తాన్ సాయి కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు చేరింది. మస్తాన్ సాయి కేసు విషయమై లావణ్య తరుఫు న్యాయవాది నాగూర్‌బాబు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని లేఖలో పేర్కొన్నారు.
దర్గా ప్రతిష్టతకు భంగం..
ధర్మకర్త కుమారుడైన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర, భద్రతకు, భంగం వాటిల్లుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ లేఖలో న్యాయవాది ప్రస్తావించారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో తెలిపారు. అందుకే, మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలు లేఖలో లావణ్య తరుఫు న్యాయవాది నాగూర్ బాబు వెల్లడించారు.

Comments
Please login to add a commentAdd a comment