అమరావతి: ‘పుష్ప’ కేమో నీతులు చెప్తారా!, గేమ్ చేంజర్‌కి(Game Changer) పాటించరా! అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్.. ఈ సంక్రాతి బరిలో నిలవడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ఈవెంట్ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఇదే విషయంపై అంబటి రాంబాబు(Ambati Rambabu) ‘ ఎక్స్’ వేదికగా స్పందించారు.
"పుష్ప" కేమో నీతులు చెప్తారా !
"గేమ్ చేంజర్' కి పాటించరా !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు ఇద్దరు యువకులు. ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాము ఆధారాన్ని కోల్పోయమంటూ బోరున విలపిస్తున్నారు.
భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తోంది,. తనతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న చరణ్‌ను కోల్పోవడంతో తాము అన్నీ కోల్పోయినట్లే ఉందని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం నడిపారా?
పుష్ప-2(Pushpa-2) బెనిఫిట్ షో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ సినిమా బెనిఫిట్ షోలో భాగంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందింది. అదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఫలితంగా దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. పుష్ప-2 హీరో అల్లు అర్జున్... సంధ్య థియేటర్‌కు బెనిఫిట్ షోకు రావడంతోనే ఇదంతా జరిగిందని అతనిపై కేసు కూడా నమోదైంది. ఒకవైపు ఈ కేసులో A-11గా ఉన్న అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ లభించినా ఈ కేసు వివాదం ఇంకా చల్లారలేదు. ప్రధానంగా అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం అంతా నడిచిందనే విమర్శలు కూడా వినిపించాయి.
మరి గేమ్ ఛేంజర్ సంగతి ఏంటి?
పుష్ప సినిమాకు సంబంధించి తెలంగాణలో ఒకరు ప్రాణాలు కోల్పోతే, గేమ్ ఛేంజర్ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఇద్దరు అసువులు బాసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ‘పుష్ప’ రచ్చ ఇంకా హాట్ హాట్‌గా ఉండగానే, గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా జరపడాన్నిప్రశ్నిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ సాయంత్రం సమయంలో జరగడంతో పాటు దానికి భారీగా ఫ్యాన్స్ సేకరణ జరిగిందనే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు పలువురు విశ్లేషకులు.
పుష్ప ఘటన.. పవన్ మాటల్లో కొన్ని..
అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందన్నాడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటన జరిగిన వెంటనే రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్లే ఇంత జరిగింది. ఒకవేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఆయనపై కూడా ప్రజల్లో విమర్శలు వచ్చేవి. సీఎం హోదాలో రేవంత్ స్పందించారనే అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడే కాదు.. కింద స్థాయి నుంచి ఎదిగారు’ అని పవన్ అన్నారు.
‘‘గేమ్ ఛేంజర్’ పరామర్శిస్తాడా?
ఇ క్కడ కూడా విషాదమే చోటు చేసుకుంది. గేమ్ ఛేంజర్ ఆయా కుటుంబాల్ని పరామర్శిస్తాడా అనే ప్రశ్న తలెత్తోంది. ఆరోజు పవన్ మాటల్ని బట్టి చూస్తే.. రేవతి కుటుంబాన్ని అల్జు అర్జున్ పరామర్శించకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వివాదం పెద్ద అవడానికి కూడా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కూడా ఒక కారణంగా చూపారు.
మరి ఇప్పుడు రామ్ చరణ్ వెళ్లి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్సి పరామర్శించాలి కదా. వారి కుటుంబాలకైతే తక్షణ సాయం అయితే అందించారు కానీ వారి కుటుంబాల్ని వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత రామ్ చరణ్‌పై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ‘‘ఒరేయ్ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా
Comments
Please login to add a commentAdd a comment