సినీ తారలు, యాంకర్లు, డాన్సర్లు, సింగర్లతో ప్రత్యేక కార్యక్రమాలు
ఒక్కొక్కరి నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకూ వసూలు
సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్న నిర్వాహకులు
సాక్షి, అమరావతి: గత కాలపు జ్ఞాపకాలను.. కొత్త ఏడాదిపై ఆశలను పదిలం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. గడిచిన సంవత్సరంలో ఎదురైన కష్టాలను, కన్నీళ్లను మర్చిపోవాలని, జీవితం మళ్లీ నూతనోత్సాహంతో మొదలవ్వాలని ఆకాంక్షిస్తారు. అలాంటి వారికి వారి సంతోషాలను రెట్టింపు చేసుకునేందుకు పలువురు ఈవెంట్ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. డిసెంబరు 31 రాత్రి జీవితంలో మరిచిపోలేని అనుభూతులను మిగిల్చుకోవాలంటే ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో తాము నిర్వహించే వేడుకల్లో భాగమవ్వాలంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా..
కొద్దిరోజులుగా ఫేస్‌బుక్, వాట్స ప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నా యి. సినీ తారలు, బుల్లితెర నటులు, యాంకర్లు, స్టేజీ డ్యాన్సర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు వంటి సెలబ్రిటీల ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉంటోంది. ‘డిసెంబర్ 31 రాత్రికి మీ ఊరు మేం వస్తున్నాం.. మీరూ రండి.. ఎంజాయ్ చేద్దాం.’ అంటూ సెల్ఫీ వీడియాలతో ఆకర్షిస్తున్నారు.
భద్రతతో సంబంధంలేదు..
మరోవైపు.. కొత్త సంవత్సరం పేరుతో మోతాదు మించే ఆనందోత్సాహాలను అదుపుచేయడానికి నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. వేడుకకు వచ్చిన వారుగానీ, అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారు ఏమైపోయినా వారికి సంబంధంలేదని ముందే చెప్పేస్తున్నారు. డబ్బులు దండుకోవడమే పరమావధిగా జరిగే ఇలాంటి హంగామాలకు దూరంగా ఉంటేనే మంచిదని పౌర సమాజం ప్రతినిధులు సూచిస్తున్నారు. దీనికి బదులు ఆధ్యాత్మిక చింతనలో గడపడం, దేవాలయాలకు వెళ్లి భగవంతుణ్ణి దర్శించుకోవడం, మొక్కలు నాటడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, చెడు అలవాట్లను వదిలేయడం, కుటుంబ సభ్యులతో గడపడం, ఇంట్లోనే కేట్ కట్ చేసుకోవడం వంటివి మరింత సంతోషాని్నస్తాయని వారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment