Film Stars
-
న్యూఇయర్ వేడుకలకు భారీ ఏర్పాట్లు.. భద్రతతో సంబంధంలేదు..
సాక్షి, అమరావతి: గత కాలపు జ్ఞాపకాలను.. కొత్త ఏడాదిపై ఆశలను పదిలం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. గడిచిన సంవత్సరంలో ఎదురైన కష్టాలను, కన్నీళ్లను మర్చిపోవాలని, జీవితం మళ్లీ నూతనోత్సాహంతో మొదలవ్వాలని ఆకాంక్షిస్తారు. అలాంటి వారికి వారి సంతోషాలను రెట్టింపు చేసుకునేందుకు పలువురు ఈవెంట్ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. డిసెంబరు 31 రాత్రి జీవితంలో మరిచిపోలేని అనుభూతులను మిగిల్చుకోవాలంటే ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో తాము నిర్వహించే వేడుకల్లో భాగమవ్వాలంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా..కొద్దిరోజులుగా ఫేస్బుక్, వాట్స ప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నా యి. సినీ తారలు, బుల్లితెర నటులు, యాంకర్లు, స్టేజీ డ్యాన్సర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు వంటి సెలబ్రిటీల ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉంటోంది. ‘డిసెంబర్ 31 రాత్రికి మీ ఊరు మేం వస్తున్నాం.. మీరూ రండి.. ఎంజాయ్ చేద్దాం.’ అంటూ సెల్ఫీ వీడియాలతో ఆకర్షిస్తున్నారు.భద్రతతో సంబంధంలేదు..మరోవైపు.. కొత్త సంవత్సరం పేరుతో మోతాదు మించే ఆనందోత్సాహాలను అదుపుచేయడానికి నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. వేడుకకు వచ్చిన వారుగానీ, అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారు ఏమైపోయినా వారికి సంబంధంలేదని ముందే చెప్పేస్తున్నారు. డబ్బులు దండుకోవడమే పరమావధిగా జరిగే ఇలాంటి హంగామాలకు దూరంగా ఉంటేనే మంచిదని పౌర సమాజం ప్రతినిధులు సూచిస్తున్నారు. దీనికి బదులు ఆధ్యాత్మిక చింతనలో గడపడం, దేవాలయాలకు వెళ్లి భగవంతుణ్ణి దర్శించుకోవడం, మొక్కలు నాటడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, చెడు అలవాట్లను వదిలేయడం, కుటుంబ సభ్యులతో గడపడం, ఇంట్లోనే కేట్ కట్ చేసుకోవడం వంటివి మరింత సంతోషాని్నస్తాయని వారంటున్నారు. -
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సినీ తారలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన- రామ్ చరణ్ (ఫొటోలు)
-
హాలీడే టూర్స్‌లో స్టార్స్ బిజీ బిజీ
స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్ మోడ్‌లో ఏ స్టార్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం. మాల్దీవుల్లో మస్తీ వెకేషన్ స్పాట్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్‌లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లోని సినిమాలతో రజనీకాంత్ బిజీ అవుతారు. విదేశాల్లో బర్త్ డే ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ రావడంతో మహేశ్‌బాబు హాలిడే మోడ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్లో ఉన్నారు మహేశ్‌బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్‌ను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. వెకేషన్ కంటిన్యూ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్‌లోనే ఉన్నారు అజిత్. తనకు ఇష్టమైన బైక్స్‌పై విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌ను సందర్శించారు. కాగా అజిత్ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్. షార్ట్ గ్యాప్ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉందట. ఈ షార్ట్ గ్యాప్‌లో విజయ్ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్ సమాచారం. బాలీలో జాలీగా.. ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్ బాత్ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్ బాత్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. అలాగే వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. దుబాయిలో హాయి హాయి.. గత నెల మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా జోష్‌గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రిసార్ట్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు రకుల్. తన తల్లి బర్త్ డేను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారామె. ఇందుకోసమే రకుల్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లారు. ‘భోళా శంకర్’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ ప్రమోషన్స్‌తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్‌ను స్పెండ్ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్‌లో స్పెండ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్‌లో ఎక్కవ టైమ్ స్పెండ్ చేశారు. ఇలా వెకేషన్‌కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు. -
సిక్స్ కొట్టినంత ఈజీ కాదు.. సచిన్‌కు జగ్గారెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ‘క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సినీ తారలు కంగనా, అజయ్ దేవగన్, అక్షయ్‌కుమార్ లాంటి వారు ఒక్కసారి నాగలి పట్టి, భూమి దున్ని, ఇత్తులేసి, నీరు పోసి, పంట పండించగలరా? నాగలి పట్టి, పొలం దున్ని, పంట పండించడం అంటే క్రికెట్ ఆడినంత ఈజీ కాదు.. సినిమాల్లో డైలాగ్ చెప్పి డాన్స్ చేసినంత సులువు కాదు. రైతుల గురించి, వారు చేస్తున్న ఉద్యమాల గురించి అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హితవు పలికారు. రైతులు పండించిన పంట తింటూ వారి పోరాటాన్నే వ్యతిరేకిస్తూ కొందరు సినీ తారలు, క్రికెట్ ప్లేయర్లు మూర్ఖంగా మాట్లాడటం బాధాకరమని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘సినీ పరిశ్రమలో, క్రికెట్ ఆటలో విరామం ఉంటుంది. వారు ఆడుతున్నా, నటిస్తున్నా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. కానీ రైతులు నాగలి పట్టి భూమి దున్నేటప్పుడు అలాంటిదేమీ ఉండదు. రైతులకు పరాయి దేశస్తులు మద్దతిస్తే దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన సెలబ్రిటీలు విమర్శలు చేయడం సిగ్గుచేటు’అని దుయ్యబట్టారు. -
కనబడుట లేదు.. భారీ హిట్‌కి గురి
అవును... మన స్టార్స్‌కి కనబడట్లేదు. కథలో దమ్ము కనిపించేసరికి స్క్రీన్ మీద తమ పాత్రకు కళ్లు కనిపించకపోయినా ఫర్వాలేదంటున్నారు. క్యారెక్టర్‌కి కొత్త షేడ్ వస్తుందంటే.. సినిమా మొత్తం షేడ్స్ (కళ్ల జోడు) పెట్టుకొనే ఉండటానికి రెడీ అంటున్నారు. స్క్రీన్‌పై అంధులుగా నటిస్తూ.. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌కి గురి పెట్టారు. అంధ పాత్రలను ఓ చూపు చూస్తున్నారు. ప్రస్తుతం అంధ పాత్రలో నటిస్తున్న స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.. ‘అంధా ధున్’ హిందీలో పెద్ద హిట్. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభం అయింది. ఇందులో నితిన్ అంధ పియానో ప్లేయర్ పాత్రలో కనిపిస్తారు. తమిళ రీమేక్ విషయానికి వస్తే.. ప్రశాంత్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి 1న ప్రకటిస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకుడు. ఈ సినిమాలో పియానో వాద్యకారుడిగా నటించడానికి లాక్డౌన్లో రోజుకి రెండు గంటల చొప్పున పియానో నేర్చుకున్నారట ప్రశాంత్. ‘అంధా ధున్’ మలయాళంలోనూ రీమేక్ కాబోతుందనే వార్త కూడా ఉంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేస్తారట. లేడీ సూపర్‌స్టార్ నయనతార కొత్త సినిమా కోసం అంధురాలిగా మారారు. మిలింద్ రాజు తెరకెక్కిస్తున్న ‘నెట్రిక్కన్’లో కళ్లు కనిపించని అమ్మాయిగా చేస్తున్నారు నయన. ‘నెట్రిక్కన్’ అంటే మూడో కన్ను అని అర్థం. ఈ సినిమాలో నగరంలో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ఈసారి నయనతార వంతు వస్తుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి చూపులేకున్నా ఈ అమ్మాయి ఎలా తప్పించుకుందన్నది కథ. కమల్ హాసన్ సూపర్‌హిట్ సినిమాల్లో ‘రాజపార్వై’ (తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’) ఒకటి. అందులో కమల్ అంధుడిగా నటించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో వరలక్ష్మి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వరలక్ష్మి కూడా అంధురాలిగా నటిస్తున్నారు. హిందీ వైపు వెళ్తే... క్రైమ్‌ని కనిపెట్టడానికి కళ్లు అంత ముఖ్యమా? కామన్సెన్స్ చాలు అంటున్నారు సోనమ్ కపూర్. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లైండ్’. ఈ చిత్రంలో ఓ సైకో కిల్లర్‌ను పట్టుకునే కళ్లు కనిపించని పోలీసాఫీసర్‌గా సోనమ్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం స్కాట్‌ల్యాండ్‌లో ప్రారంభం అయింది. ఈ చూపులేని పాత్రల్లో తారలందరూ ఆడియన్స్ చూపు తిప్పుకోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చి, అలరిస్తారని ఊహించవచ్చు. -
మజా మాల్దీవ్స్
‘కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అని పాడుకుంటారు ‘జీన్స్’ సినిమాలో హీరో. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ పాటనే గుర్తు చేసుకుంటున్నారు. బెస్ట్ దీవి ఏదంటే.. ‘మాల్దీవులు’ అంటున్నారు. ప్రస్తుతం వెకేషన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది మాల్దీవులు. లాక్డౌన్ ఎక్కడివాళ్లను అక్కడే లాక్ చేసేసింది. అన్ని టెన్షన్లు మరచిపోయి కాస్త సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లారు కొందరు స్టార్స్. ఈ రెండు వారాల్లోనే చాలామంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ విశేషాలు. వర్క్–వెకేషన్ వర్క్‌ను, వెకేషన్‌ను ఒకేసారి పూర్తి చేస్తున్నారు కత్రినా కైఫ్. షూటింగ్ నిమిత్తం ఇటీవల మాల్దీవ్స్ వెళ్లారామె. అయితే సినిమా షూటింగా? యాడ్ కోసమా? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచకుండా ఫోటోలను షేర్ చేశారామె. బెస్ట్ బర్త్‌డే ఈ ఏడాది తన బర్త్‌డేను స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నారు మెహరీన్. వెంటనే మాల్దీవులకు ప్రయాణం అయ్యారు. తన కుటుంబంతో కలసి మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారీ బ్యూటీ. ‘ఈ బర్త్‌డే చాలా స్పెషల్’ అంటూ ఫోటోలు షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్న బ్రేక్ గత వారం తాప్సీ కూడా మాల్దీవుల్లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందీ చిత్రం ‘హసీనా దిల్రుబా’ చిత్రీకరణ పూర్తి చేసి చిన్న బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేలోగా తన స్నేహితులతో కలసి మాల్దీవుల్లో హాలిడేయింగ్ చేశారు. హనీమూన్ కొత్త కపుల్ కాజల్ అగర్వాల్– గౌతమ్ కిచ్లు ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం ఈ జంట ఎంచుకున్న చోటు మాల్దీవులు. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. పుట్టినరోజు వేడుకలు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. ఇటీవలే మాల్దీవుల నుంచి తిరిగొచ్చారు కూడా. -
చిన్న బ్రేక్
‘‘వ్యక్తిగత, వృత్తి కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ, అప్పుడప్పుడూ చిట్‌చాట్ సెషన్స్‌తో తమ ఫాలోయర్స్, ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం అనేది కొంచెం ఒత్తిడితో కూడుకున్న పనే అని కొందరు స్టార్స్ అంటున్నారు. ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి ఇటీవల పలువురు తారలు ‘డిజిటల్ డిటాక్స్’ (సోషల్ మీడియాకు దూరంగా ఉండటం) సూత్రం ఫాలో అవుతున్నారు. కరోనా కారణంగా అందరూ సామాజిక దూరం పాటిస్తున్నాం. ‘డిజిటల్ డిటాక్స్’ అంటూ ఇటీవల సామాజిక మాధ్యమానికి బ్రేక్ ఇచ్చిన స్టార్స్, చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ యాక్టివ్‌గా ఉంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మళ్లీ కలుద్దామని చెప్పి డిజిటల్‌కి దూరమైపోయారు త్రిష. ‘‘నా మైండ్‌కు కాస్త ఉపశమనం కావాలి. ఇది డిజిటల్ చికిత్స అనుకోవచ్చు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ కలుద్దాం’’ అంటూ ట్వీటర్‌కి చిన్న బ్రేక్ ఇచ్చారు త్రిష. ఇటీవలే ‘టిక్‌టాక్’లో కూడా త్రిష ఎంట్రీ ఇచ్చారు. మరో హీరోయిన్ యామీ గౌతమ్ ‘‘నా ప్రతి విషయాన్నీ ఇతరులతో పంచుకోవాలనుకోవడం లేదు’’ అని డిజిటల్ డిటాక్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. మరో బ్యూటీ పరిణీతీ చోప్రా ‘‘నా కోసం నాకు కొంత సమయం కావాలి. నా గురించి నేను మరింత తెలుసుకోవాలి. అందుకే కొంతకాలం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలనుకోవడం లేదు’’ అన్నారు. ‘‘ఈ క్వారంటైన్ టైమ్‌ని నా కోసం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉంటాను’’ అన్నారు శ్రియా పిల్గోన్కర్. రానా నటించిన ‘హాథీ మేరీ సాథీ’ (తెలుగులో ‘అరణ్య’) చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఈ బ్యూటీ. సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియాప్రకాశ్ వారియర్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ‘‘మానసిక ప్రశాంతత కోసమే నా ఇన్‌స్టా అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశాను. లైక్‌లు, షేర్లు వంటివి నాలో ఒత్తిడిని పెంచాయనిపిస్తోంది. కొంత సమయం తర్వాత ఇప్పుడు నేను తిరిగి ఇన్‌స్టాలోకి వచ్చాను. భవిష్యత్‌లో కూడా కావాలనుకుంటే కొన్ని రోజులు నా అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేస్తాను’’ అన్నారు ప్రియాప్రకాశ్ వారియర్. డీయాక్టివేట్ ట్వీటర్లో నెగటివిటీ పెరిగిపోయిందని తన అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు సోనాక్షీ సిన్హా. నెగటివిటీ, అసభ్యపదజాలంతో కూడిన కామెంట్స్ ఎక్కువైపోయాయని, అందుకే ట్వీటర్ నుంచి వైదొలుగుతున్నానని అన్నారు బాలీవుడ్ నటుడు సాకిబ్ సలీమ్. ‘బద్రీనాథ్‌కి దుల్హనీయా, ధడక్’ చిత్రాలను తెరకెకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు శశాంక్ కేతన్ తన ట్వీటర్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు. ‘‘సోషల్ మీడియా వల్ల రియల్ వరల్డ్ ఫేక్ వరల్డ్లాగా, ఫేక్ వరల్డ్ రియల్ వరల్డ్‌గా కనిపిస్తోంది’’ అంటున్నారు కృతీసనన్. -
సహాయం కోసం వేలం
కరోనా వల్ల ప్రపంచం ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రభావం అందరి మీదా పడింది. ఈ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎవరికి తోచిన స్థాయిలో వారు సహాయం చేస్తున్నారు. సినిమా స్టార్స్ కుడా విరాళాలు ఇస్తూ, ఫ్యాన్స్‌ని సహాయం చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. తాజాగా నిత్యా మీనన్ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాలకు సహాయం చేయదలచుకున్నారు. అందుకోసం ఓ భిన్నమైన దారిని ఎంచుకున్నారు. గతంలో ఓ ఫ్యాషన్ షో కోసం తాను వేసుకున్న డిజైనర్ డ్రెస్‌ని వేలం వేస్తున్నారు నిత్య. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఓ ఫౌండేషన్ ద్వారా పలు గ్రామాలకు సహాయం చేయాలనుకుంటున్నారు. (ఓ రైటర్ కథ) -
సమోసా రెడీ
లాక్ డౌన్ కారణంగా అందరికీ వీలైనంత ఖాళీ సమయం దొరుకుతోంది. షూటింగ్‌లు, ప్రమోషన్లు లేకపోవడంతో సినిమా స్టార్స్ కూడా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాజల్ కూడా వంట గదిలోకి వెళ్లి సమోసాలు తయారు చేశారు. బాగా రావడంతో శబాష్ అనేసుకున్నారు కూడా. ‘‘తొలిసారి సమోసా చేశాను. చాలా బాగా కుదిరింది. మా అమ్మ ఆధ్వర్యంలో చాలా శుభ్రతను, క్వాలిటీని పాటిస్తూ తయారు చేశాను’’ అని పేర్కొన్నారు కాజల్. -
కరోనా విరాళం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, సినిమా కార్మికుల కోసం ఇటీవలే ‘సీసీసీ మన కోసం’’ (కరోనా క్రైసిస్ చారిటి మనకోసం) ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. ఆదివారం విరాళం ప్రకటించిన వారి వివరాలు. ► రవితేజ (20 లక్షలు) ► వరుణ్ తేజ్ (20 లక్షలు) ► ‘దిల్’ రాజు, శిరీష్ (10 లక్షలు) ► శర్వానంద్ (15 లక్షలు) ► సాయిధరమ్ తేజ్ (10 లక్షలు) ► విశ్వక్ సేన్ (5 లక్షలు) ► ‘వెన్నెల’ కిశోర్ (2 లక్షలు) ► సంజయ్ (25 వేలు) -
కరోనా పాట
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు పాటించమని సినిమా స్టార్స్ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులందర్నీ కోరుతున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ప్రముఖ గాయకులు యస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాపై తమిళంలో ఓ పాట కంపోజ్ చేసి, పాడారు. ఈ పాటను రచయిత వైరముత్తు రచించారు. ప్రస్తుత సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాటను రాశారు. ఈ పాటను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యస్పీబీ. -
సాయం సమయం
విపత్కర పరిస్థితుల్లో ‘మేం ఉన్నాం’ అంటూ సినిమా పరిశ్రమ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుకొస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే షూటింగ్స్ అన్నీ రద్దు కావడంతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీపై ఆధారపడి జీవనం సాగించే చిన్నస్థాయి కళాకారుల జీవనశైలి కుంటుపడింది. దీంతో అటు కరోనా వైరస్‌పై పోరాడేందుకు కొందరు, చిన్నస్థాయి కళాకారులకు అండగా ఉండేందుకు మరికొందరు సినిమా తారలు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. గురువారం మరికొంతమంది తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటించారు. ఈ వివరాలు. ► చిరంజీవి – కోటి రూపాయలు (కరోనా కారణంగా ఉపాధి కాల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం). ► మహేశ్‌బాబు – కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్‌కు 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు.) ► ప్రభాస్ – కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్‌కు 50లక్షలు, తెలంగాణకు 50 లక్షలు.) ► పవన్‌కల్యాణ్ – 2 కోట్లు (ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి కోటి రూపాయలు.) ► ఎన్టీఆర్ – 75 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, తెలుగు సినీ కార్మికులకు 25 లక్షలు.) ► రామ్‌చరణ్ – 70 లక్షలు (కేంద్ర, తెలుగురాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి) ► ‘నాంది’ (ప్రస్తుతం ‘అల్లరి’ నరేష్ హీరోగా నటిస్తున్న చిత్రం) యూనిట్లో రోజువారి వేతనంతో జీవనం సాగించే 50మందికి పైగా ఉన్న కార్మికులకు చిత్రనిర్మాత సతీష్ వేగేశ్నతో కలిసి ప్రతి ఒక్కరికి తలా 10వేల రూపాయలను సాయంగా అందించాలని ‘అల్లరి’ నరేశ్ నిర్ణయించుకున్నారు. ► సాయితేజ్ – 10 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు.) ► నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ – 20 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు.) ► త్రివిక్రమ్ – 20 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 10లక్షలు, తెలంగాణకు 10 లక్షలు.) ► అనిల్ రావిపూడి – 10 లక్షలు ( ఆంధ్రప్రదేశ్‌కు 5లక్షలు, తెలంగాణకు 5లక్షలు) ► కొరటాల శివ – 10 లక్షలు ( ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు.) -
కుకింగ్.. క్లీనింగ్
కోవిడ్ 19 (కరోనావైరస్)తో దేశవ్యాప్తంగా థియేటర్స్, షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా తారలందరూ హోమ్ క్యారంటైన్లో ఉన్నారు. షూటింగ్స్, ప్రమోషన్స్ ఎప్పుడూ బిజీగా ఉండే వీరికి కాస్త ఖాళీ సమయం దొరకడంతో రోటిన్‌కి భిన్నంగా ఎవరికి వారు తమకు తోచిన పనిలో నిమగ్నమైపోయారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే గరిటె తిప్పే పనిలో పడిపోయారు. బెండాకాయ వేపుడు చేశారు ఇలియానా. హౌస్ క్లీనింగ్ పనిలో పడిపోయారు తాప్సీ. ఓ చైనీస్ వంటకం చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ తన తండ్రి (అజయ్ శర్మ) కోసం స్వయంగా కేక్ చేశారు. వర్కౌట్‌కి సై అన్నారు సన్నీ లియోన్. చీపురు పట్టుకుని గార్డెను క్లీన్ చేశారు బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్. షూటింగ్‌కి బదులుగా కుకింగ్.. క్లీనింగ్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు తారలు. అనుష్కాశర్మ చేసిన కేక్, ఆదిత్యారాయ్ కపూర్, ఇల్లు క్లీన్ చేస్తున్న తాప్సీ ఇలియానా చేసిన కూర, సన్నీలియోన్, వరలక్ష్మీ చేసిన చైనీస్ డిష్ -
కరోనాపై యుద్ధం గెలుద్దాం
కోవిడ్ 19 (కరోనా వైరస్)ను కట్టడి చేసే క్రమంలో 21 రోజులు దేశం లాక్ డౌన్లో ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజలందరూ ఇందుకు సహకరించాలని కొందరు సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వివరాలు ఇలా.. ► ఇంట్లో వాడే నిత్యావసర సరుకులను వీలైనంత తక్కువగా వాడుకుంటూ పొదుపు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నీ అయిపోయాయి, కొనాలంటే వస్తువులు దొరకడం లేదనే కంగారు, ఆందోళనలు ఉండవు. ► అవసరం మేరకు మాత్రమే కొని భద్రపరచుకుందాం. కనీస పొదుపు ఆచరించి ఇతరుల అవసరాలకు కూడా సహకరిద్దాం. ► వేపుడు వంటకాలు, కాలక్షేప, తీపి తినుబండారాలకు దూరంగా ఉందాం. ఖాళీ సమయం దొరికింది కదా అని కొత్త వంటలు, ప్రయోగాలను ఇప్పటి పరిస్థితుల్లో మానుకుందాం. ► మన చిన్నతనంలో బామ్మలు, అమ్మమ్మలు, అమ్మ మనకు చేసిపెట్టిన తరహాలో కనీస కూరలతో భోజనం కానిద్దాం. ► భారతీయులుగా మనమంతా ఒక్కటై కరోనా వైరస్ వ్యాప్తిని నివారిద్దాం. ► దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీగారికి, అందుకు సహకరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా అభినందనలు, ధన్యవాదాలు. ► ఈ లాక్డౌన్ సమయంలో ఇంటిపట్టునే ఉండి ఆరోగ్యంగా ఉందాం... ఆరోగ్యం పంచుదాం. – చిరంజీవి మన ప్రధాని మోదీగారు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కరోనా కట్టడికి ఇది మంచి అడుగు. మన జీవితాల కన్నా ఏదీ ముఖ్యం కాదు. నేను, నా కుటుంబం ఇంట్లోనే ఉంటున్నాం. మీరు కూడా ఇదే పాటించాలని కోరుకుంటున్నాను. – తమన్నా ధనిక, పేద, కులం, మతం అనే తారతమ్యాలు లేవు. మనం దరం మనుషులం. సమిష్టిగా పోరాడి కరోనాను చంపేద్దాం. – మంచు మనోజ్ ఇప్పటి మన జీవనశైలిలో 21రోజులు ఇంటిపట్టునే ఉండటం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇలా మనందరం లాక్డౌన్లో ఉన్నందుకు సంతోషపడే సమయం వస్తుందని నమ్ముతున్నాను. – తాప్సీ స్వీయ నియంత్రణకు, పాత అలవాట్లను మానుకుని కొత్త అలవాట్లు అలవరచుకోవడానికి 21 రోజులు సమయం చాలా ఉత్తమమైనది. ఆన్లైన్ కోర్సులు, ఎక్కువగా చదువుకోవడం ముఖ్యంగా మెడిటేషన్ వంటివి చేస్తున్నాను నేను. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. – కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. మనకు నచ్చిన రీతిలో ఉగాది వేడుక జరుపుకోలేకపోయాం. కరోనా మహమ్మారి మరణం తర్వాత తొందర్లోనే ఓ కొత్త ఆరంభం లభిస్తుంది. ఇంట్లో ఉండండి. సురక్షితంగా ఉండండి. – అదితీరావ్ హైదరీ మానసికంగా ధృడంగా ఉండండి. పుస్తకాలు చదవడం, వంటలు చేయడం, యోగా చేయడం వంటివి చేయండి. అప్పుడప్పుడు ప్రార్థనలు చేయండి. 21 రోజులు ఇట్లే గడిచిపోతాయి. – అనుపమా పరమేశ్వరన్ ‘కంట్రీ 21డేస్ లాక్డౌన్’కు కట్టుబడి ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని మరికొందరు స్టార్స్ స్పందించారు. ఈ 21 రోజుల లాక్‌డౌన్‌ని పాటించకపోతే ఈ లాక్డౌన్ ఇంకా మరో నెల కొనసాగే అవకాశం ఉంది. ఇటలీ, స్పెయిన్, ఇరాన్ వంటి దేశాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మనం చూస్తున్నాం. అక్కడి పరిస్థితులను చూసి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో మనం వ్యవహరిస్తే మనతో పాటు మనకు ఇష్టమైనవారిని, దేశంలోని ప్రజలను మనం విపత్కర పరిస్థితుల్లోకి నెట్టినవాళ్లం అవుతాం. కరోనాను కట్టడి చేయడంలో ఉన్న మీ వంతు బాధ్యతను ఓసారి గుర్తు చేసుకోండి. మనందరం కలిసి పోరాడితే ఈ కరోనా పరిస్థితులను విజయవంతంగా దాటగలం. – ఇలియానా కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా తమ వంతు బాధ్యతగా కరోనా మహమ్మారిని తరిమేద్దాం అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి, కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మహేశ్‌బాబు. ‘నమ్మకమైన సమాచారాన్ని కలిగి ఉండండి. ప్రార్థిద్దాం, మంచిని ఆశిద్దాం.. కలసికట్టుగా ఈ యుద్ధాన్ని గెలుద్దాం’ అంటూ, కింది విలువైన నియమాలను పాటించాలని కోరారు మహేశ్‌బాబు. 1 ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. 2 ఏదైనా వస్తువును తాకితే కనీసం 20 నుంచి 30 సెకన్లు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలి. 3 ముఖాన్ని.. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకుండా ఉండండి. 4 దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు లేదా టిష్యూ వాడండి. 5 సామాజిక దూరం అవసరాన్ని అర్థం చేసుకుని, మీ ఇంటి లోపల లేదా బయట ఇతర వ్యక్తుల నుండి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి. 6 మీకు కరోనా లక్షణాలు లేదా అనా రోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్క్‌ని వాడండి. మీకు కోవిడ్–19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని లేదా క్లినిక్‌ని సంప్రదించండి. -
నాలుగో విడుతలో ఓటు వేసిన ప్రముఖులు
-
ఓటెత్తిన ప్రముఖులు
-
వాయుసేనకు వందనం : ఫిలిం స్టార్స్
ఆత్మాహుతి దాడితో 40 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులపై భారత వైమానిక దళం పగ తీర్చుకుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం భారత వాయు సేన 29 నిమిషాల పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 200 నుంచి 300 మంది తీవ్రవాదులు హతమయ్యుంటారని భావిస్తున్నారు. ఈ ప్రతీకార చర్యపై ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ 2 అంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని విజయ గర్వాన్ని పంచుకుంటున్నారు. సినీ తారలు సైతం భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, మహేష్ బాబు, కమల్ హాసన్, రామ్ చరణ్, అఖిల్, వరుణ్ తేజ్, మంచు విష్ణు, మెహరీన్, సోనాక్షి సిన్హా, నితిన్, ఉపాసన, వెంకీ అట్లూరిలతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు విజయానందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. Our country gives a fitting reply. #IndiaStrikesBack . Salute to the Indian Air Force #JaiHind — Jr NTR (@tarak9999) 26 February 2019 Extremely proud of our #IndianAirForce. Salutes to the brave pilots of IAF🇮🇳 — Mahesh Babu (@urstrulyMahesh) 26 February 2019 Salute to the #IndianAirForce 🙏🏻. JAI HIND. #IndiaStrikesBack — rajamouli ss (@ssrajamouli) 26 February 2019 Our 12 return safely home after wreaking havoc on terrorist camps in Pakistan. India is proud of its heroes. I salute their valour. — Kamal Haasan (@ikamalhaasan) 26 February 2019 #SaluteIndianAirForce 🇮🇳🇮🇳🇮🇳 https://t.co/1G4RDOssu2 — Varun Tej Konidela (@IAmVarunTej) 26 February 2019 Proud of the Indian Air Force 🇮🇳 Jai Hind 🇮🇳 🙏🏼#IndiaStrikesBack #ramcharan pic.twitter.com/f5rN4Qc1sP — Upasana Konidela (@upasanakonidela) 26 February 2019 -
బాధ్యతగా ఓటేశారు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖులు, రాజకీయ నాయకులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా సినీతారలు, క్రీడాకారులు ఉదయాన్నే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఓటేసిన తరువాత అందరూ తప్పకుండా ఓటేయాలని మీడి యా ద్వారా తమ అభిమానులకు పిలుపునిచ్చారు. చింతమడకలో కేసీఆర్.. మరోవైపు రాజకీయ నేతల్లో అధికశాతం తాము పోటీ చేస్తోన్న సీట్లలో కాకుండా మరో చోట ఓటువేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామం లో ఓటు వేశారు. మంత్రి హరీశ్‌రావు దంపతులు సిద్దిపేటలో ఓటేశారు. మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆజంపురాలో, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాం పెయినర్ విజయశాంతి (బంజారాహిల్స్), జైపాల్‌రెడ్డి (జూబ్లీహిల్స్), వి.హనుమంతరావు (అంబర్‌పేట) కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నల్లగొండలో ఓటేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ (చిక్కడపల్లి), కిషన్‌రెడ్డి (కాచిగూడ), ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ (రాజేంద్రనగర్), టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ (జగిత్యాల), టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (తార్నాక), సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి (శేరిలింగంపల్లి), సీపీఐ కేంద్ర కార్యదర్శి నారాయణ (హిమాయత్‌నగర్), సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి (హుస్నాబాద్), ప్రజాగాయకుడు గద్దర్ (అల్వాల్) ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఉన్నతాధికారులు గవర్నర్ నరసింహన్ దంపతులు (ఎంఎస్ మక్తా), ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి (ప్రశాసన్‌నగర్), తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి (కుందన్‌బాగ్), ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ దంపతులు (ఖైరతాబాద్)లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్– సుజాత దంపతులు (వరంగల్‌లో) ఓటేశారు. సినీతారలు సైతం.. కృష్ణ–విజయనిర్మల, చిరంజీవి–సురేఖ, నాగార్జున–అమల, వెంకటేశ్, నిర్మాత సురేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, ఆయన తల్లి శాలిని, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రాణా, గోపీచంద్, రాజమౌళి దంపతులు, నితిన్, బండ్ల గణేశ్, రామ్ పోతినేని, శేఖర్ కమ్ముల, కోచ్ గోపీచంద్, పీవీ సింధు, సానియా మీర్జా, వందేమాతరం శ్రీనివాస్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, తొట్టెంపూడి వేణు, మంచులక్ష్మి, జగపతిబాబు, ఆర్పీ పట్నాయక్, వరుణ్‌తేజ్, నాగబాబు, చార్మి, శ్రీకాంత్–ఊహ, బ్రహ్మాజీ, నిఖిల్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీను, సుమ, ఉపాసన, సమంత, ఝాన్సీ, రాఘవేంద్రరావు తదితర ప్రముఖులు హైదరాబాద్‌లో ఓటేశారు. ఓటు వేసేందుకు వస్తున్న మహేశ్‌బాబు -
బిగ్ బి 1.. దీపికా 2
సినిమా తారలను, క్రీడాకారులను రోల్ మోడల్‌గా తీసుకుంటారు యూత్ అంటోంది యూగోవ్ అనే సంస్థ. ఈ ఏడాది ఇండియాలో యూత్‌ని ఎక్కువ ప్రభావితులను చేసిన ప్రముఖులు ఎవరు? అంటూ ఈ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ లిస్ట్‌లో అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో దీపికా పదుకోన్ ఉండగా అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ 5,6,7 స్థానాల్లో నిలిచారు. 3, 4 స్థానాల్లో క్రీడాకారులు ఉన్నారు. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా 9, 10 స్థానాల్లో ఉన్నారు. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లలో ఆలియా భట్ చిన్న వయస్కురాలు కావడం విశేషం. -
బిగ్‌బీ ఇంట్లో తారల వెలుగులు
బాలీవుడ్ సినీ ప్రముఖులు దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. సినిమా రిలీజ్‌ల పరంగా కూడా ఈ సీజన్లో మంచి సందడి కనిపిస్తుంది. టాప్ స్టార్లయితే తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలం గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన నటుడు బిగ్ బీ అమిత్ బచ్చన్. ప్రతీ ఏడాది అమితాబ్ ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతాయి. బిగ్ బీ స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాలుస్తూ సందడి చేస్తారు. బాలీవుడ్ తారాతోరణం అంతా అమితాబ్ ఇంట్లో వేడుకల్లో పాల్గొంటారు. అయితే గత ఏడాది మాత్రం ఈ సందడి కనిపించలేదు. అమితాబ్ కోడలు, నటి ఐశ్వర్యరాయ్ తండ్రి మరణించటంతో బిగ్ బి ఫ్యామిలీ వేడుకలకు దూరంగా ఉంది. కేవలం ఉదయం కుటుంబ సమేతంగా లక్ష్మీ పూజ చేసిన అమితాబ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఏడాది మరోసారి తన స్టైల్లో సినీ తారలతో కలిసి వేడుకలు నిర్వహించేందుకు అమితాబ్ ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ తారలంతా బిగ్‌బీ ఇంట్లో జరిగే దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. -
బ్యూటీ స్మైల్
-
కరుణానిధికి సినీతారల కన్నీటి నివాళి
తమిళ సినిమా (చెన్నై): కరుణానిధి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు సినీతారలు భారీగా తరలివచ్చారు. రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్, కూతురు ఐశ్వర్య, అల్లుడు, నటుడు ధనుష్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, అజిత్, శాలిని దంపతులు, శివకుమార్, సూర్య, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు, నటుడు విశాల్, నాజర్, ఇతర కార్యవర్గ సభ్యులు, ప్రభు, రామ్‌కుమార్, విక్రమ్ ప్రభు, టి.రాజేందర్, ప్రసన్న, స్నేహ, రాధా రవి, సత్యరాజ్, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌండ్రమణి, వివేక్, పార్తీపన్, సిబి రాజ్, శివకార్తీకేయన్, విజయ సేతుపతి, అధర్వ, నందా, బాబీ సింహా, పశుపతి, ఆర్కే.సురేశ్, మన్సూర్ అలీఖాన్, శ్రీమాన్, విమల్, పా.విజయ్, సంతానభారతి, నటి సరోజాదేవి,కోవై సరళ, దర్శకుడు ఎస్పీ.ముత్తురామన్, పి.వాసు, కేఎస్.రవికుమార్ తదితరులు నివాళులర్పించారు. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నటుడు విజయ్, విక్రమ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సంగీత దర్శకుడు రెహమాన్, దర్శకుడు శంకర్ ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. -
అలనాటి అందాల తారలు
80లలో సినీరంగంలో హీరోలు, హీరోయిన్లు గా ఓ వెలుగు వెలిగిన దక్షిణాది తారలు ప్రతీ ఏటా కలిసి పార్టీ చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ సంవత్సరం ఓ డిఫరెంట్ థీమ్ తో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో తెలుగు, తమిళ, మలయాళల, కన్నడ నటులు పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఈ గెట్ టు గెదర్ కన్నుల పండుగగా జరిగింది. 28 మంది దక్షిణాది తారలు ఇందులో పాల్గొన్నారు. అలనాటి అందాల తారలంతా ఒకే థీమ్ దుస్తుల్లో దిగిన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఆత్మీయ సమావేశంలో తెలుగు స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్ లతో పాటు శరత్ కుమార్, నరేష్, భాను చందర్, సురేష్, భాగ్యరాజ... హీరోయిన్లు రమ్యకృష్ణ, సుమలత, రాధిక, రేవతి, నదియా, సుహాసిని, జయసుధ, ఖుష్బూ తదితరులు పాల్గొన్నారు. -
జల్లికట్టు కోసం కొనసాగుతున్న నిరసనలు
చెన్నై : తమిళుల సాంప్రదాయ క్రీడ, జల్లికట్టు కోసం సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నిరసనలకు దిగుతున్నారు. ఇప్పటికే సినీ రంగంనుంచి స్టార్ హీరోలు సాంకేతికనిపుణులు జల్లికట్టు కోసం తమ గళం వినిపించగా తాజాగా బహిరంగ నిరసనకు దిగారు. సంక్రాంతి పండుగ ముగిసినా వివాదం మాత్రం సద్దుమణగటం లేదు. జల్లికట్టును నిషేదిస్తూ కోర్టు తీర్పునిచ్చినా.. నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తాజాగా మెరీనా బీచ్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తమిళ స్టార్ హీరోలు సూర్య, విశాల్, విజయ్, శింబు, లారెన్స్ లు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా మంగళవారం రాత్రి కూడా బీచ్ లోనే ఉన్న ఆందోళనకారులు బుధవారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మెరీనా బీచ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులు నిరసన కారులు గుమిగూడి ఉన్నారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించకపోయినా.. ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున బీచ్ పరిసరాల్లో పోలీసు బలగాలను మోహరించారు. -
సండే నో హాలిడే
వర్క్.. వర్క్.. మండే మార్నింగ్ నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ బిజీ బిజీగా గడిపే జనమంతా, వీకెండ్స్ వచ్చేసరికి సినిమాకో.. పార్టీకో.. వెళ్తారు. ఎంజాయ్ చేస్తారు. మరి, సినిమా తారల సంగతేంటి? వాళ్లది 9 టు 6 జాబ్ కాదుగా. సండే.. మండే.. వీకెండ్స్ అనే తేడా ఉండదు. షెడ్యూల్‌ను బట్టి షూటింగ్ చేయక తప్పదు. స్టార్స్ నుంచి స్మాల్ ఆర్టిస్టుల వరకూ వీకెండ్స్‌లో షూటింగ్ ఉంటే చేస్తారు. ఈ వారాంతంలో చిరంజీవి, మహేశ్‌బాబు, అక్షయ్‌కుమార్ వంటి హీరోలతో పాటు శ్రుతీహాసన్ టు తాప్సీ... చాలామంది తారలు మేకప్ వేసుకున్నారు. ‘సండే నో హాలిడే... అయినా ఓకే’ అంటూ హ్యాపీగా షూటింగ్‌లకు హాజరయ్యారు. చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. రాఘవా లారెన్స్ నృత్య దర్శకత్వంలో చిరు, రాయ్ లక్ష్మీలపై ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవియేమో స్టూడియోలో స్టెప్పులేస్తుంటే.. మహేశ్‌బాబు హైదరాబాద్ రోడ్స్‌పై ఫైట్ చేస్తున్నారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో చేస్తున్నారు. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఛేజింగ్, యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సునీల్ హీరోగా నటిస్తున్న ‘ఉంగరాల రాంబాబు’ సినిమా షూటింగ్ కూడా అన్నపూర్ణలోనే జరుగుతోంది. హైదరాబాద్‌లో శ్రుతీహాసన్ ‘కాటమరాయుడు’ షూటింగ్లో బిజీగా ఉంటే.. మలేసియాలో ‘నామ్ షబానా’ అంటున్నారు తాప్సీ. ‘బేబి’కి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న ‘నామ్ షబానా’ షూటింగ్‌తో ఆమె బిజీ. ఇందులో తాప్సీది మెయిన్ రోల్. అక్షయ్‌కుమార్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. శింబూతో కలసి చెన్నైలో జరుగుతోన్న ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’ షూటింగ్లో పాల్గొంటున్నారు తమన్నా. ఇంకా పలువురు తారలు ఈ వీకెండ్ షూటింగులతోనే గడిపారు. -
ఇచట సినిమా దుస్తులు అమ్మబడును
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో బన్నీ వేసుకున్న ట్రౌజర్ అదిరిపోయింది కదరా... అచ్చం అలాంటిది దొరికితే ఎంతైనా పెట్టి కొనేస్తాను అంటాడో కుర్రాడు. ‘‘జనతా గ్యారేజ్’ మూవీలో సమంత వేసుకున్న టాప్ చాలా బాగుందే. వాళ్లకి అలాంటివి దొరుకుతాయి. మనకెందుకు దొరకవు? అంటూ నిట్టూరుస్తుందో యువతి. అయితే ఇలాంటి సరదాలు తీర్చడానికి ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు సిద్ధమయ్యాయి. చెర్రీలా దుస్తుల్లో చెలరేగాలనుకునే చిన్నోళ్లు... తమన్నాలా త‘లుక్’మనాలనుకునే తరుణీమణులూ... బీరెడీ. – శిరీష చల్లపల్లి తెరపై కథానాయికలు ధరించే అందమైన చీరలు, డ్రెస్సులు జీవితంలో ఒక్కసారైనా మనం వేసుకోగలమా? అని ఆలోచించే అమ్మాయిలు... లైఫ్ అంటే హీరోలదే... మనకా అదృష్టం లేదని చింతించే అబ్బాయిలూ ఉన్నారు. అలాంటి వాళ్లను చూసి ‘వీరి సినిమా పిచ్చి తగలెయ్య..’ అనుకుంటూ నవ్వుకోవడం నిన్నటిమాట.. ఇప్పుడు సీన్ మారిపోయింది. తమకి ఇష్టమైన సినిమాల్లో, రియాలిటీ షోలో... తమ ప్రియ హీరోయిన్/హీరో ఫలానా సీన్/పాటలో... ధరించిన డ్రెస్ వేసుకోవాలని అనిపించడమే ఆలస్యం.. ఒక్క క్లిక్‌తో అవి ఒంటి మీద వాలుతున్నాయి. హవా స్టైల్... లివాస్టార్ ‘స్టార్’ దుస్తుల ఫ్యాషన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్సైట్లలో లివాస్టార్ ఒకటి. లివాస్టార్ వెబ్సైట్లోకి వెళ్లి మనకు కావాల్సిన సినిమా డ్రెస్సింగ్ స్టైల్ ని ఫొటోతో సహా వారికి పోస్ట్ చేయాలి. వెంటనే రిప్లై మెసేజ్ వస్తుంది. అలా మీ టెస్ట్‌కు తగ్గట్టూ, సైజును బట్టి మీరు కోరుకున్న స్టార్ కాస్ట్యూమ్ నాలుగు రోజుల్లో కళ్ల ముందుంటుంది. హీరో, హీరోయిన్లు ధరించిన కాస్ట్యూమ్స్ మీ సైజ్‌కు తగ్గట్టుగా రెడీమేడ్‌గా డెలివరీ అయిపోతాయి. కేవలం దుస్తులు మాత్రమే కాదు సినిమా స్టార్స్ ధరించే యాక్ససరీస్, ఆభరణాలు, రిస్ట్‌వాచ్‌లు సైతం ఈ తరహా వెబ్‌సైట్స్‌లో ఆర్డర్ చేయొచ్చు. అ‘డ్రెస్’ చెబుతారు కొంతమందికి కొన్ని సినిమాల్లో డ్రెస్‌లు నచ్చినా ఆ తర్వాత అవి ఎక్కడ చూశామో గుర్తుండకపోవచ్చు. అలాంటి వారు ఫలానా హీరోయిన్/హీరో పేరుని పోస్ట్ చేస్తే వారికి సంబంధించి, వారు ధరించగా హిట్ అయిన ఫ్యాషన్ కలెక్షన్స్ డిస్ప్లే చేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటిలో కావాల్సిన కాస్ట్యూమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్స్ దుస్తులు మక్కీకి మక్కీ కావాలనుకునేవారు కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. యాక్టర్స్ రేంజ్లో డ్రెస్ వేసుకోవాలంటే ఆ మాత్రం తప్పదు కదా. -
సినీ నటుల దిష్టిబొమ్మల దహనం
రాయగడ జిల్లా : చిట్‌పండ్ అక్రమాల్లో పాలుపంచుకున్నారని ఆరోపిస్తూ ఒడియా సినీ నటులు పప్పు పంపం, సిద్ధాంత్ మహాపాత్రో, అనుభవ్, ఆకాశ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. శుక్రవారం రాయగడ జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కపిలాస్ జంక్షన్లో చిట్‌ఫండ్ అక్రమాల్లో భాగస్వాములైన సినీ నటుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ బీజేడీలో ఉంటూ ప్రజల డబ్బులు స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నవీన్ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. చిట్‌ఫండ్ , గనులు, ఖనిజం, పప్పుధాన్యాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, భూకబ్జాలకు బీజేడీ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వచ్ఛమైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేడీ అవినీతి అక్రమాలమయమైందన్నారు. పద్నాలుగేళ్లుగా అధికారంలో ఉన్నా మాతృభాష రాని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రజలకు ఎలా పాలన అందించగలరని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా సభాపతి, భాస్కర నాయక్, హోల్దార్ మిశ్రో, లక్ష్మీపట్నాయక్, శ్రీఫాల్‌జైన్, సుశాంత్ మహరాణా, కె.అశ్వని, తిలక్‌చౌదురి పాల్గొన్నారు. -
ఎయిర్‌పోర్టుల్లో ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లు!
న్యూఢిల్లీ: సినీతారలు, ప్రముఖులు, తరచూ విదేశాలకు విమాన ప్రయాణాలు చేసే వ్యాపారులు ఇకపై ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారి జాబితాను రూపొందించి, విమానాశ్రయాల్లో వారి కోసం ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వారు నేరుగా ఆ కౌంటర్ల వద్దకు వెళ్లి, క్షణాల్లో తమ ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. నేర చరిత్ర లేని వారికే ఈ సౌకర్యం కల్పిస్తారు. -
‘గ్లోబల్ ఎంట్రీ’లో భారత్!
- భారత ప్రముఖులకు అమెరికా పర్యటనలో తనిఖీల నుంచి మినహాయింపు - జూలైలో ఒప్పందంపై సంతకాలు న్యూఢిల్లీ: అమెరికా, భారత్‌ల మధ్య జూలైలో జరగనున్న అంతర్గత భద్రత చర్చల సందర్భంగా ఇరు దేశాలూ రెండు కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి. ప్రముఖ భారత పౌరులు అమెరికాకు వచ్చినపుడు వారికి తనిఖీల నుంచి మినహాయింపునిచ్చే అంశంపై ఒక ఒప్పందం.. ఉగ్రవాద సమాచారాన్ని ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునే అంశంపై మరొక ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. జూలైలో వాషింగ్టన్లో జరిగే ఇరు దేశాల అంతర్గత భద్రత చర్చల్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా అంతర్గత భద్రత శాఖ మంత్రి జే చార్లెస్ జాన్సన్‌లు తమ తమ బృందాలతో పాల్గొననున్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రులు, మాజీ కేంద్రమంత్రులు, సినిమా తారలు, అగ్రగామి పారిశ్రామికవేత్తలు, తరచుగా అమెరికాలో తరచుగా పర్యటించే వారు.. ఆ దేశానికి వచ్చినపుడు విమానాశ్రయాల్లో తనిఖీల విషయంలో ఎటువంటి అవరోధాలూ లేకుండా మినహాయింపునిచ్చేందుకు ఉద్దేశించిన ‘గ్లోబల్ ఎంట్రీ’ కార్యక్రమంలో భారత్ కూడా చేరాలని అమెరికా పట్టుపడుతోంది. ఈ క్రమంలో చేసుకోనున్న ఒప్పందంలో ముందుగా 2వేల మంది ప్రముఖులను జాబితాలో చేర్చే అవకాశముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటివరకు అమెరికా గ్లోబల్ ఎంట్రీలో ఏడు దేశాలు మాత్రమే ఉన్నాయి. -
నాటా తెలుగు మహాసభలకు సినీ తారలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర అమెరికాలోని డల్లాస్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరగనున్న నాటా తెలుగు మహాసభల్లో ప్రముఖ తెలుగు సినీ తారలు పాల్గొననున్నట్లు నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, మహాసభల కన్వీనర్ డాక్టర్ గూడూరు రమణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నటులు వరుణ్‌తేజ్, సుధీర్‌బాబు, రకుల్ ప్రీత్‌సింగ్, నిత్యామీనన్, ప్రణీత, మోడల్ మాధురి ఇతాగి, నందిని రాయ్, సియా గౌతమ్, రచన మౌర్య, సునీత వర్మ, తేజస్విని తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. అలాగే దర్శకులు కోదండరామిరెడ్డి, ఆదిత్య, సీవీ రెడ్డి, హరీశ్ శంకర్, మేర్లపాక గాంధీ, నిర్మాత మధుర శ్రీధర్ తదితరులు తమ అనుభవాలను పంచుకుంటారని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడు డాక్టర్ నాగిరెడ్డి, సమన్వయకర్త రామసూర్యారెడ్డి, సహ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
నాటా తెలుగు మహాసభలకు తారాగణం
హైదరాబాద్ : ఉత్తర అమెరికా డల్లాస్ నగరంలో ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు జరుగనున్న నాటా తెలుగు మహాసభలకు తెలుగు తారలు తరలివస్తున్నారని నాటా అధ్యక్షుడు డాక్టర్ మోహన్ మల్లం, మహా సభల కన్వీనర్ డాక్టర్ గూడూరు రమణారెడ్డిలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సినీ ప్రముఖులు రకుల ప్రీత్‌సింగ్, నిత్యా మీనన్, ప్రణీత, మోడల్ మాధురి ఇతాగి, నందిని రాయ్, సియా గౌతమ్, రచన మౌర్య, సునీత వర్మ, తేజస్విని, సుధీర్‌బాబు, వరుణ్‌తేజ్ తదితరులు సభలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, ఆదిత్య, సీవీరెడ్డి, హరీష్ శంకర్, మధుర శ్రీధర్, మేర్లపాక గాంధీ తదితరులు తమ అనుభవాలు పంచుకోవడానికి నాటా మహాసభలకు హాజరుకానున్నారని సాంస్కతిక కార్యక్రమాల నాయకుడు డాక్టర్ నాగిరెడ్డి, సమన్వయకర్త రామసూర్యారెడ్డి, సహ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డిలు తెలిపారు. -
ఎన్నికల ప్రచారంలో సినీతారలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల ప్రచార యుద్ధంలో కదం తొక్కేందుకు కోలీవుడ్ కదలుతోంది. అన్ని ప్రధాన పార్టీల ప్రచారంలోనూ తారలు తళుక్కుమనేందుకు సిద్ధం అవుతున్నారు. జనాన్ని ఆకర్షించాలంటే ఎక్కడైనా, ఎప్పుడైనా స్టార్ ఎట్రాక్షన్ అవసరమే. అందునా అధికార పీఠం కట్టబెట్టే ఎన్నికలంటే ఇక చెప్పక్కర్లేదు. తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి అనాదిగా అవినాభావ సంబంధం ఉంది. ద్రవిడ పార్టీలకు ఆద్యుడు అన్నాదురై రంగస్థలం, సినిమా రంగాలకు తన కలం పదును చూపించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రాంతీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన అన్నాదురై మేధస్సు నుంచి పుట్టినదే. జీవించి ఉన్నంతకాలం డీఎంకే వ్యవస్థాపకుడిగా అన్నాదురై కీర్తిగడించారు. ఆయన గతించి న తరువాత పార్టీ పగ్గాలు పట్టిన కరుణానిధి సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపినవారే. కరుణానిధి ఇంటిలో నిర్మాతలు, హీరోలు ఉన్నారు. అలాగే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు హీరోగా ఎంజీ రామచంద్రన్ తమిళ సినీరంగాన్ని శాసించారు. ఎంజీఆర్ మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేతపట్టిన జయలలిత అగ్ర హీరోయిన్గా ప్రజల ను మెప్పించినవారే. ఎంజీఆర్ సమకాలికుడు దివంగత శివాజీ గణేషన్ సైతం కామరాజ నాడార్ శిష్యునిగా, కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ మాస్ హీరోగా ఆయన స్థానం ప్రత్యేకం. ఇలా దాదాపుగా అన్ని ప్రధాన పార్టీల నేతలూ ముందు సినిమా రంగం ఆ తరువాతనే రాజకీయ రంగంలో అడుగుపెట్టిన వారు. దీంతో సహజంగానే తమిళనాడులో రాజకీయం, సినిమా రంగాలు విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. తారల ఆకర్షణ తప్పనిసరి : రాజకీయ నాయకులు చేసే ఊకదంపుడు ఉపన్యాసాలు వినేందుకు ప్రజలను వేదిక వద్దకు రప్పించాలంటే ఏదో ఒక ఆకర్షణ ఉండాల్సిందే. తృణమో, పణమో ఇచ్చి జనాన్ని తోలడం రాజకీయపార్టీలకు ఎలాగూ అలవాటే. వీటికి అదనపు ఆకర్షణగా తారలను దించేందుకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి. కొన్నాళ్లపాటూ షూటింగులు పక్కనపెట్టి మీటింగులకు హాజరయ్యేలా నటీ నటులు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో డీఎండీకే అధినేత విజయకాంత్ పొత్తుపెట్టుకున్నారు. విజయకాంత్ అంటే గిట్టని హాస్యనటుడు వడివేలు డీఎంకే తరఫున రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం చేశారు. తన ప్రసంగాల్లో విజయకాంత్‌ను దుమ్మెత్తిపోశారు. వడివేలుకు విశేషమైన క్రేజు ఉండడంతో డీఎంకే సభలకు పెద్ద ఎత్తున జనం వచ్చేవారు. అన్నాడీఎంకే తరఫున ఆ పార్టీ అధినేత్రి జయలలితే పెద్ద స్టార్ ఎట్రాక్షన్. అన్నాడీఎంకేలో ఏకైక స్టార్ కాంపైన్ కూడా జయలలితనే. నటులు రామరాజన్, ఆనందరాజ్, పొన్నంబళం, సెంథిల్, సింగముత్తు, నటీమణులు సీఆర్ సరస్వతి, వింధ్య తదితరులు ప్రచారం చేయనున్నారు. డీఎంకే తరఫున నటలు వాగైచంద్రశేఖర్, కుమరి ముత్తు, వాసువిక్రం, పూచ్చీ మురుగన్ సిద్ధమయ్యారు. ఈసారి డీఎంకే తరఫున ప్రచారానికి వడివేలు స్థానంలో మరో వర్ధమాన హాస్యనటుడు ఇమాన్ అన్నాచ్చీ వచ్చిచేరారు. ఇక కాంగ్రెస్‌లో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కుష్బు, నగ్మా ప్రచారంలో పోటీపడనున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే సీనియర్ నటులు విసు, ఎస్వీ శేఖర్, సంగీత దర్శకులు డెరైక్టర్ గంగై అమరన్ ప్రచారం చేసే అవకాశం ఉంది. డీఎండీకేలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన హీరో అరుణ్ పాండియన్ ఇటీవలే రాజీనామా చేయడంతో పాటూ అమ్మ సరసన చేరారు. ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత మంది తారలు ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది. నడిగర్ సంఘం తటస్థ వైఖరి:ఎన్నికల్లో దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తటస్థ వైఖరిని అవలంభిస్తుందని అధ్యక్షుడు నాజర్ పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖానీని నాజర్ కలిశారు. 2014 ఎన్నికల సమయంలో వేదికపై నాటకాల ప్రదర్శనకు ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈసీని కలిసిన నాజర్ ఎన్నికల ప్రచార వేదికలపై సాంస్కృతిక, నాటక కళల ప్రదర్శనపై నిషేధం విధించి కళాకారుల ఉపాధిని దెబ్బతీయవద్దని కోరారు. అయితే ఏ పార్టీకి ప్రచారం చేయకుండా కార్యక్రమాలను నిర్వహిస్తామని నాజర్ ఆయనకు హామీ ఇచ్చారు. తమ సంఘంలో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారు, ఏ పార్టీకి ప్రచారం చేస్తారో అది వారి వ్యక్తిగత విషయమని ఆయన పేర్కొన్నారు. అయితే సంఘం మాత్రం తటస్థవైఖరికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. -
సందడిగా ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్
హైదరాబాద్: విద్యకే పరిమితం కాకుండా.. విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను... వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రయత్నంలో భాగంగా ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యూత్ ఫెస్ట్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సినీ తారల తళుకులు.. హుషారెత్తించే కామెడీ స్కిట్లు.. విద్యార్థుల సందడితో స్టేడియం మార్మోగుతోంది. ఈ రోజు సాయంత్రం మొదలయిన ఈ యూత్ ఫెస్ట్‌కు వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు మంచు మనోజ్, మంచు లక్ష్మీ, ఆది పినిశెట్టి, సునీల్, సంజనా, నిర్మాత దిల్‌రాజు తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ సింగర్స్ బాబా సెహగల్, రోల్ రిదా తమ పాటలతో ఉర్రూతలూగించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ఇండియా నంబర్ వన్ స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గానం, సంగీతం, ఆటలు తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం బహుమతులను అందజేస్తారు. ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ తార మంచు లక్ష్మి, విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ ఎల్.రత్తయ్య, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ గౌరవ సెక్రటరీ జాఫర్ జావిద్ తదితరులు ఫెస్ట్‌ను ప్రారంభించారు. -
నేడు ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్
వేదిక : ఎల్బీ స్టేడియం సవుయుం : సాయంత్రం3 గంటల నుంచి సందడి చేయనున్న సినీ తారలు సాక్షి, సిటీబ్యూరో: విద్యకే పరిమితం కాకుండా.. విద్యార్థులలోని సృజనాత్మక శక్తులను... వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రయత్నిస్తోంది. దీని కోసం ‘సాక్షి’ ఎరీనా వన్ యూత్‌ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యూత్ ఫెస్ట్ అంగరంగ వైభవంగా జరుగనుంది. సినీ తారల తళుకులు.. హుషారెత్తించే కామెడీ స్కిట్లు.. విద్యార్థుల సందడితో స్టేడియుం మార్మోగనుంది. సాయంత్రం 3 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్ట్‌కు వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. సినీతారలు అదా శర్మ, డింపుల్ చోపదే, రెజీనా, సునీల్, మంచు మనోజ్, నాని, ఆది, ఆది పినిశెట్టి తదితరులు సందడి చేయనున్నారు. వీరితో పాటు ప్రముఖ సింగర్స్ బాబా సెహగల్, రోల్ రిదా తమ పాటలతో ఉర్రూతలూగించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ఇండియా నంబర్ వన్ స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గానం, సంగీతం, ఆటలు తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం బహుమతులను అందజేస్తారు. ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీ తార మంచు లక్ష్మి, విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ ఎల్.రత్తయ్య, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ గౌరవ సెక్రటరీ జాఫర్ జావిద్ తదితరులు ఫెస్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ మెగా ఫెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ కళాశాలల గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ పాస్‌ల కోసం ‘సాక్షి’ ఎరీనా వన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెంట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. మరిన్ని వివరాలకు 95058 34448, 040-23256134కు కాల్ చేయవచ్చు. -
రేపు సాక్షి ఎరీనావన్ యూత్‌ఫెస్ట్
సిద్ధమైన ఎల్బీ స్టేడియం సందడి చేయనున్న సినీ తారలు సాక్షి, హైదరాబాద్: తారల తళుక్కులు.. ఉత్తేజాన్ని నింపే బాలీవుడ్ ప్రముఖ సింగర్ల స్వరాలు.. కిక్కెక్కించే కామెడీ.. విద్యార్థుల సందడి.. వీటన్నింటికీ వేదిక కానుంది హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం. సాక్షి ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ ఈనెల 21న ఈ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. కేవలం విద్యకే పరిమితం కాకుండా విద్యార్థుల అభిరుచులకు పెద్దపీట వేస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి సాక్షి మీడియా గ్రూప్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇండియా నంబర్ వన్ స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో గానం, మ్యూజిక్, కళ, ఆటలు తదితర అంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. గతనెల 22న మొదలైన ఈ పోటీల్లో వందల కళాశాలల నుంచి వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తుదిగా 225 కళాశాలలకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. రేపు జరిగే ఫెస్ట్‌లో వీరందరికీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ ఫెస్ట్‌లో అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సినీ దర్శకురాలు మంచు లక్ష్మి, విజ్ఞాన్ వర్సిటీ చైర్పర్సన్ ఎల్. రత్తయ్య, సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ గౌరవ సెక్రటరీ జాఫర్ జావీద్ తదితరులు ఫెస్ట్‌ను ప్రారంభించనున్నారు. వీరితోపాటు ప్రముఖ సింగర్స్ సెహగల్, రోల్ రిదా హుషారెక్కించనున్నారు. అలాగే సినీతారలు ఆదా శర్మ, డింపుల్ చొపాడే, రెజినా, సునీల్, మంచు మనోజ్, నాని, ఆది, ఆది పినిశెట్టి తదితరులు సందడి చేయనున్నారు. కాగా ఈ ఫెస్ట్‌కు విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంది. వీరంతా తమ కళాశాలకు చెందిన గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలి. ఎంట్రీ పాసుల కోసం సాక్షి ఎరీనా వన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మేరా ఈవెంట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. మరిన్ని వివరాలకు 9505834448, 040-23256134కు కాల్ చేయవచ్చు. -
అదే నాతో వచ్చిన చిక్కు!
సినీ తారల్లో ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ల సంఖ్య తక్కువ. ఎందుకొచ్చిన గొడవలే... అని చాలామంది తమ అభిప్రాయాలను వెల్లడించడానికి కాస్త భయపడతారు. కానీ సోనమ్‌కపూర్ స్టయిలే సెపరేటు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అందుకే సినీ పరిశ్రమలో చాలా మంది ఆమె మీద మండిపడుతూ ఉంటారు. ఎంత మంది వ్యతిరేకించినా ‘నేనింతే’ అని అంటున్నారామె. కానీ చిన్నప్పటి సోనమ్ అంత యాక్టివ్ కాదని చెప్పుకొచ్చారు. ‘‘అప్పట్లో రిజర్వ్డ్గా, కామ్‌గా ఉండేదాన్ని. స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. ఎవరైనా కొత్తవాళ్లు కనబడితే మాత్రం అమ్మ వెనకాల దాక్కునేదాన్ని. ఒక యాక్టర్‌కు ఉండాల్సిన చొరవ, చురుకుదనం అస్సలు లేవు. సినీ పరిశ్రమలోకి వచ్చాకే నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నించాను. చివరకు సక్సెస్ అయ్యాను. నేను ఎవరితో మాట్లాడినా, ఏ పని చేపట్టినా మనసుపెట్టి చేస్తాను. మెదడుతో అస్సలు ఆలోచించను. అదే నాతో వచ్చిన చిక్కు. కానీ నా స్నేహితులు మాత్రం నేను ఇలా ఉంటేనే ఇష్టపడతారు’’ అని సోనమ్ చెప్పుకొచ్చారు. -
వాళ్లంతా ప్రచారం చేస్తున్నారు..
దసరా పండుగ వెళ్లీ వెళ్లగానే మనకి గుర్తొచ్చేది దీపావళే. దీపావళి అనగానే టపాసులే. ఈ టపాసులు కాల్చడం వల్ల జరిగే నష్టాల గురించి ఒక్కసారి ఆలోచించండంటూ.. సిల్వర్ స్క్రీన్ స్టార్లు ప్రచారం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎవరికి వారు తమ స్టైల్లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో టపాసుల మోత తగ్గించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అనుష్క శర్మ, త్రిష, శ్రియా, ఛార్మి, రకుల్, దేవీశ్రీ ప్రసాద్ తదితరులు ఆసక్తికర ఫొటోలతో అవగాహన కల్పిస్తున్నారు. తెర మీద నటనతోనే కాదు.. సామాజిక బాధ్యత విషయంలో కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కాగా సంచలనాత్మక రీతిలో పాలుతాగే పసిపిల్లలు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. 'ఇంకా అభివృద్ధి చెందని మా ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాలు.. టపాకులు ద్వారా జనించే శబ్ధ, ధ్వని కాలుష్యాల వల్ల ఎంతగా అల్లాడిపోతాయో ఆలోచించండి' అంటూ ఆరు నెలల వయసున్న అర్జున్ గోపాల్, ఆరవ్ భండారీ, 14 నెలల వయసున్న జోయా రావ్ భాసిన్ అనే చిన్నారులు తమ న్యాయవాద తండ్రుల ద్వారా సెప్టెంబర్ 30న పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీపావళి పండుగనాడు టపాకులు పేల్చే కార్యక్రమాన్ని రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరగా.. రెండు గంటలు చాలా తక్కువ సమయమని, అందుకు కనీసం 5 గంటలైనా వేడుక జరుపుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. టపాకుల పేల్చివేత వ్యవధిని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్ధారిస్తే సరిపోతుందని ఒక నిర్ధారణకు వచ్చింది. తరుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తెలిపే వివరాలను బట్టి అదే రోజు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. -
సెలబ్రిటీల... షార్ట్ కట్
సమాజంలోని రుగ్మతలపై... ఇదివరకూ తమ సినిమాల్లో సందేశాలు ఇచ్చేవారు సినీతారలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. షార్ట్‌ఫిల్మ్ ఫీవర్ సెలబ్రిటీలను పట్టుకుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులపై... స్పందించడానికి షార్ట్‌ఫిల్మ్ ఆయుధంగా మారింది. అది ఆడవాళ్లపై జరుగుతున్న నేరాలకు ప్రతిఘటన కావచ్చు! మూర్ఖపు భావజాలంపై పోరు కావచ్చు! ఎయిడ్స్ లాంటి రోగాలపై అవగాహన కల్పించడం కావచ్చు!! ఇలా ప్రతి దానికీ ఒకటే - ‘షార్ట్ ’కట్..! అల్లు అర్జున్ ఏడాది క్రితమే ఇలాంటి ప్రయత్నం చేస్తే తాజాగా గాయని స్మిత, రానున్న రోజుల్లో తాప్సీ - అందరూ ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్ రూట్లోనే! అబ్బాయిలూ... ఏడవండి బాబూ! ‘మగపిల్లలు ఏడవకూడదురా’ అంటూ చిన్నప్పుడే వాళ్ల ఏడుపుకి అడ్డుపుల్ల వేసేస్తాం. వాడి మనసులో కూడా ‘నేను మగాణ్ణి నాకేంటి’ అనే భావం బలంగా నాటుకుపోతుంది. పెద్దవాడవుతాడు. ఏడవడు. వాడు ఏడ్వకపోతే పోయాడు.. అమ్మాయిలను ఏడిపించడం మొదలుపెడతాడు. ‘‘ఏడుపంటే ఏమిటో తెలియని అబ్బాయికి... అమ్మాయి ఏడుపు తాలూకు విలువ ఏం తెలుస్తుంది?.. అందుకే అబ్బాయిలనూ ఏడ్వనిద్దాం...’’ అంటున్నారు నటి మాధురీ దీక్షిత్. వినీత్ మ్యాథ్యూ దర్శకత్వం లోని ‘స్టార్ట్ విత్ ది బాయ్స్’ లఘు చిత్రం ఇది. అర్ధరాత్రి... ఒంటరి అమ్మాయి! అర్ధరాత్రి... ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది ఆ అమ్మాయి. ఇంతలో కారు ముందుకెళ్లనని మొరాయించింది. ఈలోపు అటువైపుగా కారులో వెళుతున్న కొంతమంది యువకులు ఆ అమ్మాయిని చూశారు. అబ్బాయి లకు ఏవేవో ఊహలు. కారు ఎంతకీ బాగవ్వకపోవడంతో వాళ్ల కారులో డ్రాప్ చేయమంటుంది. ఏదేదో చేయొచ్చని మళ్లీ అబ్బాయిలు ఊహల్లో విహరిస్తారు. ఈలోపు ఇల్లు రానే వస్తుంది. అమ్మాయి థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకెళ్లి పోతుంది. ‘గోయింగ్ హోమ్’ కథ ఇది. ఒంటరి ఆడపిల్ల రోడ్డు మీద కనబడితే నీకేం కాదు.. మేం ఇంటి దగ్గర సేఫ్‌గా దిగబెడతాం అని భరోసా ఇవ్వ లేమా? అని ప్రశ్నిస్తాడు దర్శకుడు. ‘క్వీన్’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన వికాస్ బెహల్ దర్శకత్వం వహిం చిన ఈ చిత్రంలో ఆలియా భట్ నటించారు. అహల్యను టచ్ చేస్తే..! ఆయన 70 ఏళ్ల వృద్ధుడు. ఆవిడకు ఓ పాతికేళ్లుంటాయ్. ఆ ఇంట్లోకి వచ్చినవాళ్లు వచ్చినట్లు మాయమైపోతారు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఓ పోలీసాఫీసర్ ఆ ఇంటికి వెళతాడు. వయసులో ఉన్న అమ్మాయిని చూసి, మోహిస్తాడు. మాటల మధ్య ఆ ముసలాయన ఓ రాయిని చూపిస్తూ, దీన్ని టచ్ చేసి, మేడ పైకి వెళ్లి, ఆ అమ్మాయికి సెల్‌ఫోన్ ఇచ్చినవాళ్లు తనలా మారిపోతారని చెబుతాడు. ఆఫీసర్ ఆశ్చర్య పోతాడు. రాయిని టచ్ చేసి, మొబైల్ తీసుకుని పెకైళ్తాడు. అహల్య అతణ్ణి తన భర్తే అనుకుని, చేతులు చాచి రమ్మంటుంది. అప్పుడేమైంది? ‘కహానీ’ చిత్ర దర్శకుడు సుజయ్ ఘోష్ ఈ ‘అహల్య’ను తెరకెక్కించారు. అహల్యగా రాధికా ఆప్టే నటించారు. దీన్ని థ్రిల్లర్‌గా తీర్చిదిద్దడంతో నెటిజన్లు ఫిదా. వ్యసనాలకు బానిసైతే... అతను ఓ ఫొటోగ్రాఫర్... భార్య, ఓ కొడుకుతో జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఆ ఫొటోగ్రాఫర్‌కు అమ్మాయిల పిచ్చి. ఫొటోలు దిగడానికి వస్తున్న మోడల్స్‌తో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడు. కుటుంబాన్ని పట్టించుకోడు. పాపం.. భార్యే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. కొడుకు పెద్దవాడవుతాడు. అతనూ ఫొటోగ్రాఫర్ అవుతాడు. కాలం గడుస్తుంది. ఇంతలో ఆ కొడుక్కి తల్లి దగ్గర నుంచి ఫోన్.. తండ్రికి ఎయిడ్స్ వచ్చిందని. వెంటనే బయలుదేరి వస్తాడు. తల్లి బతిమా లడంతో హాస్పిటల్లో ఉంటున్న తండ్రిని దగ్గరుండి చూసుకుంటాడు. పరిస్థితిని అర్థం చేసుకుని ఆఖరి రోజుల్లో తండ్రిని కంటికి రెప్పలా కాపాడు కుంటాడు. ‘పాజిటివ్’ పేరుతో బాలీవుడ్ దర్శక, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో ఎయిడ్స్ రోగిగా బొమన్ ఇరానీ, ఆయన భార్య పాత్రలో షబానా అజ్మీ నటిం చారు. ఒక వ్యసనం అందమైన కుటుంబంలోని సంతోషాలను ఎలా దూరం చేసింది? అనే అంశాన్ని కళ్లకు కట్టారు ఫర్హాన్ అక్తర్. నేను నేనులా ఉంటా! మహిళలు అంతరిక్షంలోకి అడుగుపెట్టినా, ఇంకా వంటింటి కుందేళ్లు అనే భావన ఉన్న మగవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి ఓ భర్త ఉద్యోగం చేస్తానన్న తన భార్యను వద్దంటాడు. అప్పుడు ఆ మహిళ దృఢంగా తీసుకున్న నిర్ణయం, చెప్పిన జవాబు నేపథ్యంలో వచ్చిన షార్ట్‌ఫిల్మ్ ‘డైయింగ్ టు బి మి’. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో గాయని స్మిత కథానాయిక. సుకుమార్ దర్శకత్వంలో ఏడాది క్రితం అల్లు అర్జున్ ‘అయామ్ దట్ ఛేంజ్’ అని షార్ట్‌ఫిల్మ్ చేయగా, ఇప్పుడు సెలబ్రిటీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తమ భావ వ్యక్తీకరణకు సినిమా కన్నా దగ్గరి దారిగా ఇలాంటి షార్ట్‌ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇవన్నీ నెట్లో హల్చల్ చేస్తూ, లక్షలాది వీక్షకులను సంపాదించడం విశేషం. హిట్లతో పాటు జనం మనసులోనూ ఆలోచన రేపితే, ఈ ‘షార్ట్’ కట్ ఫలించినట్లే! నో లైఫ్ కాదు... లైఫ్ ఎగైన్ క్యాన్సర్ భయంకరమైన వ్యాధే కావచ్చు, కానీ క్యాన్సర్ తర్వాత నో లైఫ్ కాదు...ై‘లెఫ్ ఎగైన్’ అని అంటున్నారు సీనియర్ నటి గౌతమి. ఓ యువతి జీవితం క్యాన్సర్ బారిన పడి ఎలా నలిగిపోయి, కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించిందన్న కథాంశంతో తెరకెక్కిన లఘుచిత్రం ‘లైఫ్ ఎగైన్’. హైమారెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, ఈ లఘుచిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో గౌతమి కీలక పాత్ర పోషించారు. కేన్సర్ వచ్చాక దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ లఘు చిత్రం ట్రైలర్‌ను ఎంపీ కవిత మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. -
కొలీజియంపై ‘బార్’ విమర్శలు
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బలంగా మద్దతు తెలిపింది. కొలీజియం వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. సినీ తారలు, రాజకీయ నాయకులకు ఊరటనిస్తూ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయం ఇవ్వని జడ్జీలను ఈ కొలీజియం వ్యవస్థ అందించిందని ధ్వజమెత్తింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. మానవ విలువలు, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో సామాన్యులకు న్యాయం అందించలేకపోవటం మనకు సిగ్గుచేటని అన్నారు. ఒకవైపు అల్లర్ల కేసులో దోషిగా నిర్ధారితుడైన మాయా కొద్నాని వంటి వ్యక్తులు ఊరట పొందుతుంటే.. మరొకవైపు తీస్తా సెతల్వాద్ వంటి కార్యకర్తలు ముందస్తు బెయిలు కోసం అన్నివైపులా పరుగులు తీయాల్సి వస్తోందని ఆయన ఒక దశలో తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల వల్లే సినీతారలు, రాజకీయ నేతలకు తక్షణం ఊరట లభిస్తోందన్నారు. జడ్జీలు బురఖాలతో కోర్టుల ఆవరణలో తిరిగితే.. న్యాయవ్యవస్థ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవచ్చన్నారు. -
తారలు దిగివచ్చిన వేళ..
తిరునగరి శనివారం సినీ తారల సందడితో పులకించి పోయింది. స్థానిక ఎస్వీయూ క్రీడా మైదానంలో హాలీవుడ్ స్థాయిలో నిర్వహించిన బాహుబలి ఆడియో విడుదల కార్యక్రమానికి సినీ తారలు పోటెత్తారు. అభిమానుల కేరింతలు.. సినీ తారలు.. గాయకుల పాటలతో స్టేడియం హోరెత్తింది. భారీ సెట్టింగులతో.. సినిమా విజయోత్సవాన్ని తలపించింది. హీరో ప్రభాస్ అభిమానులు డార్లింగ్.. జపం అందుకున్నారు. సినీ దర్శకుడు రాజమౌళి.. అగ్ర తారాగణం తరలిరావడంతో తిరుపతి మొత్తం జాతరను తలపించింది. - అట్టహాసంగా బాహుబలి ఆడియో విడుదల - సినీ నటులను చూసి పులకించి పోయిన జనాలు - తొక్కిసలాటతో విరిగిన బారికేడ్లు - జనాలను అదుపు చేయలేక చేతులెత్తేసిన పోలీసులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: బాహుబలి ఆడియో విడుదల వేడుక సూపర్ సక్సెస్ అయ్యింది. సాయం సంధ్యవేళ తారల సందడి.. అభిమానుల కేరింతలతో తిరుపతి నగరం పులకించి పోయింది. నగరంతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో స్టేడియం వైపు వెళ్లే దారులన్నీ జనాలతో కిక్కిరిశాయి. అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో పాసులు ఉన్నవారు సైతం స్టేడియం లోపలికి వెళ్లలేక వెనుదిరాగాల్సి వచ్చింది. గేట్ల వద్ద తోపులాట జరిగింది. ఓ దశలో జనాలను అదుపు చేయలేక పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఈ తోపులాటలో మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత మంది గేట్ల వద్దకు వెళ్లలేక అక్కడే కుప్పకూలిపోయారు. సాయంత్రం 3 గంటల నుంచే జనాలు ఎస్వీయూ ఆడిటోరియంకు తరలి వచ్చారు. తమ అభిమాన నాయకుడు ప్రభాస్ వచ్చే సమయానికే స్టేడియం నలుమూలల ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. స్టేడియంలోకి వచ్చినవారు సినిమాలో నటించి తమ అభిమాన తార గణాన్ని చూసి పులకించి పోయారు. అభిమానుల హర్షధ్వానాలు కేరింతలతో స్టేడియం హోరెత్తింది. గీతామాధురి ,రేవంత్, కృష్ణచైతన్య బృందం అలాపించిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలుగించాయి. ఈ ఆడియో విడుదల వేడుకకు ప్రముఖ వ్యాఖ్యాత సుమ యాంకరింగ్ చేశారు. సినిమాలోని ప్రతి పాత్రను అభిమానులకు పరిచయం చేశారు. వారు తమ అభిమానులద్దేశించి మాట్లాడే సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ వారికి తమ మద్దతు తెలపడం విశేషం. సినిమా డెరైక్టర్ రాజమౌళి సినిమాలోని పాత్రల ప్రాధాన్యతను వివరించారు. తమ సినిమాలో విలన్ క్యారక్టర్లు పవర్ పుల్గా ఉంటాయని చెప్పారు. సినిమా తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆడియో విడుదల వేడుకకు కోట్ల ఖర్చు ఎస్వీయూ ఆడిటోరియంలో ఆడియో విడుదల వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. పటిష్టమైన బారికేడ్లను, పెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. చిత్ర దర్శకులు రాజమౌళి శుక్రవారం నుంచి తిరుపతిలో మకాం వేసి, ఏర్పా ట్లలను స్వయంగా పరిశీలించారు. ప్రధానద్వారం వద్ద పెద్ద,పెద్ద ఆర్చిలను ఏర్పాట్లు చేశారు. సుమారు వెయ్యి మందికి పైగా సినీ ప్రముఖులు ఆడియో విడుదల వేడుకకు తరలివచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరికి స్టార్ హోటళ్లలో వసతి, భోజనానికి సంబంధించి భారీగా ఖర్చు చేసినట్లు సమచారం. తొలిసారి ఆడియో విడుదల వేడుక తిరుపతిలో నిర్వహించిన నేపథ్యంలో స్టేడియంలో ఏర్పాట్ల కోసం రూ.కోటికిపైగా ఖర్చు చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా అయినందున ఆడియో విడుదల వేడుకకు అదే రీతిలో భారీగా ఖర్చు చేసేందుకు నిర్మాత వెనుకాడనట్టు సమచారం. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి త్వరలో విడుదలైయ్యే సినిమాకు భారీ ప్రచారం వచ్చేలా ప్రణాళిక రూపొందించి, డబ్బు వెదజల్లినట్టు సమచారం. సభ నిర్వహణకు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ప్రైవేటు సైన్యాన్ని భారీగా తరలి వచ్చారు. లైటింగ్ డెకరేషన్ అద్భుతంగా చేశారు. -
తారల ‘పన్ను’పోటు
రూ.100 కోట్ల మేర పన్ను చెల్లించని సినీ ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ రంగం ప్రముఖుల సేవల పన్ను(సర్వీస్ ట్యాక్స్) బకాయిలు ఎంతో తెలుసా...? అక్షరాలా రూ.100 కోట్లపైనే. ఓ సినిమాను నిర్మాతలు నిర్మిస్తే పారితోషికం తీసుకుని అందులో నటించిన నటీనటులతోపాటు నేపథ్య గాయకులు, ఇతర ప్రముఖులను తమ సేవలను అందిస్తున్నట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో నిర్మాతల నుంచి పారితోషికాలతోపాటు సేవల పన్ను(సర్వీస్ ట్యాక్స్) రూపేణా సొమ్ము వసూలు చేస్తున్న కొందరు సినీ ప్రముఖులు ఆ మొత్తాన్ని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు ‘పెద్దలు’ కనీసం సేవల పన్ను విభాగంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బండి లాగిస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్ ఆధీనంలోని సేవల పన్ను విభాగం పరిశీలనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ విభాగం చట్టపరమైన చర్యలకు సమాయత్తమైంది. సేవల పన్ను ఇలా: వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సంస్థలు, హోటళ్లు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సేవల పన్నును చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. సినీరంగం విషయానికొస్తే.. నిర్మాతల నుంచి పారితోషికం తీసుకుని వారి చిత్రాల్లో నటించిన నటీనటులతోపాటు నేపథ్య గాయకులు, ఇతర నిపుణులు తమ సేవలను అందిస్తున్నట్లే లెక్క. దీంతో ఆర్థిక చట్టప్రకారం వీరు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆధీనంలోని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. కాగా నిర్మాత నుంచి పారితోషికం తీసుకునే సమయంలో వీరంతా అదనంగా 12.36 శాతం చొప్పున సేవల పన్ను వసూలు చేస్తున్నారు. ఈ మేరకు వారు సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం వద్ద రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు వార్షిక రిటర్న్స్ దాఖలు సమయంలో ఈ అంశాలను పక్కాగా లెక్కల్లో చూపి ఆ మొత్తాన్ని సేవల పన్ను విభాగానికి చెల్లించాల్సి ఉంది. పరిశీలనలో బయటపడిన జాతకాలు.. గడిచిన కొన్నేళ్లుగా అనేకమంది సినీ ప్రముఖులు సరైన రిటర్న్స్ దాఖలు చేయట్లేదని, లెక్కల్లో చెప్పిన మొత్తాన్ని సర్వీసు ట్యాక్స్‌గా చెల్లించట్లేదని సేవల పన్ను విభాగం అనుమానించింది. లోతుగా ఆరా తీసిన నేపథ్యంలో చాంబర్స్, మండళ్లతోపాటు దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులుసహా మరికొందరు రూ.100 కోట్లకుపైగా బకాయి పడినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రాధాన్యతాక్రమంలో ఈ సెలబ్రిటీల జాబితాను, సంస్థల పేర్లను సిద్ధం చేసిన అధికారులు ఆయా సంస్థలకు, వ్యక్తులకు సోమవారం నుంచి సమన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఆర్థిక చట్టప్రకారం రూ.50 లక్షలకు మించి సేవల పన్ను బకాయిపడిన వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ తీసుకుని నేరుగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అధికారమూ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సమన్లకు స్పందించని వారిపై వరుస దాడులు చేయడంతోపాటు అరెస్టు చేయాలని నిర్ణయించారు. రాజకీయంగానూ కీలకంగా ఉన్న ఓ ప్రముఖ నటుడితోపాటు మరో ప్రముఖ గాయని, ఇంకా మరికొందరు ప్రముఖులు కనీసం సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్‌లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదని అధికారులు గుర్తించారు. వీరికీ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. 2011లో రెండు ప్రముఖ సంస్థలపై సేవల పన్ను విభాగం దాడులు చేసింది. ఆ సమయంలో బకాయిలు చెల్లించడానికి కొంత గడువు కోరిన వారు.. ఆ గడువు తీరిన తర్వాత కూడా చెల్లించలేదు. ఈ దఫా వీరిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. -
షిర్డీ సాయి సన్నిధిలో సినీ తారలు
అనంతపురం కల్చరల్: ‘కితకితలు’ ఫేమ్ గీతాసింగ్, హాస్యనటులు చిట్టిబాబు, రామ్‌జగన్, మహలక్ష్మీ తదితరులు అనంతపురంలో గురువారం తళుక్కుమన్నారు. పాతూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వీరంతా గురువారం ఉదయం స్థానిక వేణుగోపాల్‌నగర్‌లోని శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరందరికీ ఆలయ కమిటీ సభ్యులు రవికాంత్మ్రణ, నాగేష్, ఎం.వి.రమణ తదితరులు ఆర్చకుల వేదమంత్రాల నడుమ స్వాగతం పలికారు. అనంత త్రిశక్తి పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్గురూజీ సినీతారలకు పవిత్ర కంకణాలు, అమ్మవారి చిత్రపటాలను అందించారు. అపమృత్యుదోషం కోసం కంకణాలను ధరించారు. ఈ సందర్భంగా గీతాసింగ్ మాట్లాడుతూ ఇటీవల అనంతకు రెండు సార్లు వచ్చామని, ఇక్కడి వారి ఆదరణ మరువలేమని తెలిపారు. ముఖ్యంగా అనంత వంటకాలు బాగా నచ్చాయని తెలిపింది. చిట్టిబాబు మాట్లాడుతూ తాను సాయి భక్తునిగా మారిన తర్వాత అనేక మందిరాలను దర్శించానని, మానవ సేవే మాధవ సేవ అని బాబా చరితం అందరూ చదివి ఆచరించాలని ఉద్భోదించారు. రాత్రి బెంగళూరులో జరిగే మ్యూజికల్ నైట్‌కు హాజరవుతున్నట్టు తెలిపారు. సినీతారలను చూడ్డానికి అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో కాసేపు గందరగోళం జరిగింది. -
ఆప్‌స్టోర్‌లో ‘మ్యావ్‌చాట్’ సందడి
ఆప్‌స్టోర్‌లో ‘మ్యావ్‌చాట్’ సందడి వాట్స్‌యాప్, ఫేస్బుక్ మెస్సెంజర్లను పోలి ఉండే ‘మియోవ్ చాట్’ ఆప్ ఇప్పుడు ఆప్‌స్టోర్‌లో తెగ సందడి చేసేస్తోంది. ఆప్స్టోర్లోని ఫ్రీ ఆప్‌లలో ఇదే ఇప్పుడు టాప్‌లో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లోనూ ఈ ఆప్‌ను ఇప్పటికే 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారట. టిండర్, గ్రిండర్ వంటి డేటింగ్ ఆప్స్‌తో పాటు ర్యాండమ్‌గా గ్రూపులో లేనివారితో కూడా టెక్ట్స్ మెసేజీలు, ఇమేజ్‌లు పంపించుకునేందుకు వీలవడమే ఈ ఆప్ ఆదరణను పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చుట్టుపక్కల ఉండేవారిని లేదా ప్రపంచంలో ఏ దేశంవారిని అయినా ఫ్రెండ్స్‌గా చేసుకుని చాటింగ్ చేసేందుకు ఇది సరదాగా ఉంటుంది. ముద్దొచ్చే అనేక పిల్లి బొమ్మలతో పాటు వినూత్నంగా ర్యాండమ్ ఫీచర్ కూడా ఉంది. అయితే.. ప్రస్తుతం కొత్త కొత్త స్నేహితుల మధ్య చాటింగ్‌కు ఎంతో సరదాగా ఉన్న ఈ ఆప్ కూడా వాట్స్యాప్లా డాలర్ల వర్షం కురిపిస్తుందో లేక మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందో కొన్నాళ్లాగితే తెలిసిపోతుందని అంటున్నారు. స్నేహితులే ఎమోటికన్లు! మనకు నచ్చిన సెలబ్రిటీలు, సినీతారలు, రాజకీయ నాయకులు, స్నేహితులు, ఇతరుల ఫొటోలను సరదాగా రకరకాల భావోద్వేగాలు ప్రదర్శిస్తున్న ఎమోటికన్స్గా మార్చుకునేందుకు ఉపయోగపడే వినూత్న ఆప్ ‘ఐమోజీ’. జపనీస్ భాషలో ఇ అంటే పిక్చర్ అని, మోజీ అంటే క్యారెక్టర్ అని అర్థమట. మొత్తంగా పిక్టోగ్రామ్ అనే అర్థం వచ్చే ఈ పద్ధతి ఇప్పుడు జపాన్ వెలుపలా ప్రాచుర్యం పొందుతోంది. అందుకే బిల్డ్స్ ఎల్ఎల్సీ కంపెనీవారు ఈ సరికొత్త ఆప్‌ను విడుదల చేశారు. నచ్చిన ఫొటోలను అప్లోడ్ చేసి వాటిని అతి సులభంగా ఎమోటికన్స్గా మార్చుకునేందుకు ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. పూర్తి ఉచితం. అయితే ఈ ఆప్ ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ ఆప్‌ను అతి త్వరలోనే విడుదల చేయనున్నారు. సెల్ఫీల కోసం ‘సెల్ఫీస్’ వర్డ్‌ప్రెస్ కంపెనీ నుంచి సెల్ఫీలను పంచుకోవడం కోసం సరికొత్త ఆప్ ‘సెల్ఫీస్’ విడుదలైంది. ఈ ఆప్‌తో ఇతరుల సెల్ఫీలపై మన సొంత ఇమేజ్‌లు, క్యాప్షన్స్తో స్పందనలు తెలుపవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరిగానే దీనిలోనూ చాలా ఫిల్టర్లు ఉంటాయి. వీటితో మన సెల్ఫీలకు క్యాప్షన్లు ఇచ్చుకోవచ్చు. రొటేషన్స్, ఫ్లిఫ్స్ కూడా అన్వయించి షేర్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్ లేదా ఇతర షోషల్ నెట్వర్కింగ్ సైట్లలోకి సైనప్ కాకుండానే ఈ ఆప్‌ను ఉపయోగించుకునేందుకు వీలు కావడం మరో విశేషం. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. ఇక ఎప్పుడైనా చిటికెలో సెల్ఫీలతో సరదాను పంచుకోవచ్చు. ఈ ఉచిత ఆప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌పై ఈ ఆప్ బాగా పాపులర్ అయితే గనక.. తర్వాత ఐఫోన్, ఐపాడ్లకూ దీనిని విడుదల చేస్తారట. -
బ్యాడ్మింటన్‌లో తలపడనున్న హీరో హీరోయిన్లు
సినీ తారలు సినిమాలతోనే కాకుండా క్రీడలతోను ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఆ మధ్య సెలిబ్రిటీ క్రికెట్ లీగ్‌లతో కాలక్షేపాన్నిచ్చిన సినీ తారలు ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడతో ఎంజాయ్మెంట్ను కలగజేయనున్నారు. క్రికెట్ క్రీడలో హీరోలు మాత్రమే పాల్గొని ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సారి బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో యువ హీరోలతోపాటు హీరోయిన్లు తలపడి వీక్షకుల్ని జోష్‌లో ముంచెత్తడానికి రెడీ అవుతున్నారు. సినిమాల్లో ఎప్పుడూ హీరోలదే పైచేయిగా ఉంటుంది. ఇప్పుడీ బ్యాడ్మింటన్ క్రీడలో హీరోలతో పోటాపోటీకి హీరోయిన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆగస్ట్‌లో జరగనున్న తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి 50 మందికి పైగా నటీనటులు రెడీ అవుతున్నారు. వీరిలో ఆర్య, జయం రవి, శివ, ఆది, నరేన్, భరత్, వెంకట్ ప్రభు, ఆది తదితర హీరోలున్నారు. ఓవియా, రాయ్ లక్ష్మీ, రూపా మంజరి, అమలాపాల్, జనని అయ్యర్ తదితర హీరోయిన్లు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరగనున్న ఈ తారల బ్యాడ్మింటన్ పోటీలను బ్యాడ్మింటన్ కళాకారుల సంక్షేమం కోసం ఇండియన్ బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్ అనే సంస్థ నిర్వహించనుంది. దీంతో జూలై నుంచి మన అందాల తారలు ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు. -
ఆగస్టులో బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్
- సందడి చేయనున్న - క్రీడాకారులు, సినీతారలు - చెన్నై నెహ్రూ స్టేడియం వేదిక - యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం కొరుక్కుపేట, న్యూస్‌లైన్: బ్యాడ్మింటన్ క్రీడాకారులు, సినీ తారలు కలిసి సందడి చేసేందుకు నగరంలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ఇండియన్ బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్ (ఐబీసీఎల్)ను నిర్వహించనున్నారు. దీనికి చెన్నై, నెహ్రూ స్టేడియం వేదికకానుంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఐబీసీఎల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్, ఐఈసీఎల్ బ్రాండ్ అంబాసిడర్ పి.వి. సింధూ, ప్రముఖ సినీ డెరైక్టర్ వెంకట్ ప్రభు హాజరై లోగోను ఆవిష్కరించారు. ఐబీసీఎల్ డెరైక్టర్, సీఈఓ హేమచంద్రన్ మాట్లాడుతూ తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3230, టై చెన్నైలతో కలిసి యువ క్రీడాకారులను ప్రోత్సహించేలా ఇండియన్ బ్యాడ్మింటన్ సెలెబ్రిటీ లీగ్ నిర్వహిస్తున్నామన్నారు. సినీ తారలు, టెక్నీషియన్లు, గాయనీగాయకులతో కలసి బ్యాడ్మిం టన్ క్రీడాకారులు లీగ్‌లో ఆడనున్నారని తెలిపారు. ఇందులో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ అంటూ మూడు కేటగిరిలలో జరుగనున్నాయి. ఇందులో సినీ తారలు అజిత్, జననీ అయ్యర్, వెంకట్ ప్రభు, ఆది, నితిన్ సత్య, నమిత తదితర తారలు, టెక్నిషియన్లు, గాయకులు పాల్గొననున్నారన్నారు. అనంతరం ఐబీసీఎల్ చైర్మ న్ మౌళి మదన్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన యువ క్రీడాకారుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహించేలా ఐబీసీఎల్ వేదిక కానుందన్నారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. పి.వి సింధూ మాట్లాడుతూ సెలబ్రిటీలతో క్రీడాకారులు కల సి బ్యాడ్మింటన్ క్రీడను ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందన్నారు. యువ క్రీడాకారులు మరింత మంది వెలుగులోకి వచ్చేందుకు ఇదో మంచి అవకాశం అని, ఐబీసీఎల్ సక్సెస్ సాధించాలని కోరారు. తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోచ్ మారన్, సెక్రటరీ అశోక్ బాలాజీ పాల్గొన్నారు. -
సినీ తారల సహకారంతో యాడ్ ఫిల్మ్