బిగ్‌బీ ఇంట్లో తారల వెలుగులు | Amitabh Bachchan Diwali Party At His House Jalsa | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 3:36 PM | Last Updated on Sat, Oct 27 2018 3:36 PM

Amitabh Bachchan Diwali Party At His House Jalsa - Sakshi

బాలీవుడ్‌ సినీ ప్రముఖులు దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. సినిమా రిలీజ్‌ల పరంగా కూడా ఈ సీజన్‌లో మంచి సందడి కనిపిస్తుంది. టాప్‌ స్టార్లయితే తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలం గడుపుతూ ఎంజాయ్‌ చేస్తారు. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన నటుడు బిగ్‌ బీ అమిత్‌ బచ్చన్‌.

ప్రతీ ఏడాది అమితాబ్‌ ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతాయి. బిగ్‌ బీ స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాలుస్తూ సందడి చేస్తారు. బాలీవుడ్‌ తారాతోరణం అంతా అమితాబ్‌ ఇంట్లో వేడుకల్లో పాల్గొంటారు.

అయితే గత ఏడాది మాత్రం ఈ సందడి కనిపించలేదు. అమితాబ్ కోడలు, నటి ఐశ్వర్యరాయ్‌ తండ్రి మరణించటంతో బిగ్‌ బి ఫ్యామిలీ వేడుకలకు దూరంగా ఉంది. కేవలం ఉదయం కుటుంబ సమేతంగా లక్ష్మీ పూజ చేసిన అమితాబ్‌ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈ ఏడాది మరోసారి తన స్టైల్‌లో సినీ తారలతో కలిసి వేడుకలు నిర్వహించేందుకు అమితాబ్ ప్లాన్‌ చేస్తున్నారట. బాలీవుడ్ తారలంతా బిగ్‌బీ ఇంట్లో జరిగే దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement