అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్
సినిమా తారలను, క్రీడాకారులను రోల్ మోడల్‌గా తీసుకుంటారు యూత్ అంటోంది యూగోవ్ అనే సంస్థ. ఈ ఏడాది ఇండియాలో యూత్‌ని ఎక్కువ ప్రభావితులను చేసిన ప్రముఖులు ఎవరు? అంటూ ఈ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ లిస్ట్‌లో అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో దీపికా పదుకోన్ ఉండగా అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ 5,6,7 స్థానాల్లో నిలిచారు. 3, 4 స్థానాల్లో క్రీడాకారులు ఉన్నారు. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా 9, 10 స్థానాల్లో ఉన్నారు. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లలో ఆలియా భట్ చిన్న వయస్కురాలు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment