
షిర్డీ సాయి సన్నిధిలో సినీ తారలు
అనంతపురం కల్చరల్: ‘కితకితలు’ ఫేమ్ గీతాసింగ్, హాస్యనటులు చిట్టిబాబు, రామ్‌జగన్, మహలక్ష్మీ తదితరులు అనంతపురంలో గురువారం తళుక్కుమన్నారు. పాతూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వీరంతా గురువారం ఉదయం స్థానిక వేణుగోపాల్‌నగర్‌లోని శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరందరికీ ఆలయ కమిటీ సభ్యులు రవికాంత్మ్రణ, నాగేష్, ఎం.వి.రమణ తదితరులు ఆర్చకుల వేదమంత్రాల నడుమ స్వాగతం పలికారు. అనంత త్రిశక్తి పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్‌గురూజీ సినీతారలకు పవిత్ర కంకణాలు, అమ్మవారి చిత్రపటాలను అందించారు.
అపమృత్యుదోషం కోసం కంకణాలను ధరించారు. ఈ సందర్భంగా గీతాసింగ్ మాట్లాడుతూ ఇటీవల అనంతకు రెండు సార్లు వచ్చామని, ఇక్కడి వారి ఆదరణ మరువలేమని తెలిపారు. ముఖ్యంగా అనంత వంటకాలు బాగా నచ్చాయని తెలిపింది. చిట్టిబాబు మాట్లాడుతూ తాను సాయి భక్తునిగా మారిన తర్వాత అనేక మందిరాలను దర్శించానని, మానవ సేవే మాధవ సేవ అని బాబా చరితం అందరూ చదివి ఆచరించాలని ఉద్భోదించారు. రాత్రి బెంగళూరులో జరిగే మ్యూజికల్ నైట్‌కు హాజరవుతున్నట్టు తెలిపారు. సినీతారలను చూడ్డానికి అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో కాసేపు గందరగోళం జరిగింది.