మజా మాల్దీవ్స్‌ | Tollywood And Bollywood Celebrities Maldives Vacation | Sakshi
Sakshi News home page

మజా మాల్దీవ్స్‌

Published Thu, Nov 12 2020 12:21 AM | Last Updated on Thu, Nov 12 2020 4:30 AM

Tollywood And Bollywood Celebrities Maldives Vacation - Sakshi

‘కోలంబస్‌ కోలంబస్‌ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అని పాడుకుంటారు ‘జీన్స్‌’  సినిమాలో హీరో. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ పాటనే గుర్తు చేసుకుంటున్నారు. బెస్ట్‌ దీవి ఏదంటే.. ‘మాల్దీవులు’ అంటున్నారు. ప్రస్తుతం వెకేషన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది మాల్దీవులు. లాక్‌డౌన్‌ ఎక్కడివాళ్లను అక్కడే లాక్‌ చేసేసింది. అన్ని టెన్షన్లు మరచిపోయి కాస్త సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లారు కొందరు స్టార్స్‌. ఈ రెండు వారాల్లోనే చాలామంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. ఆ విశేషాలు.

వర్క్‌–వెకేషన్‌  
వర్క్‌ను, వెకేషన్‌ను ఒకేసారి పూర్తి చేస్తున్నారు కత్రినా కైఫ్‌. షూటింగ్‌ నిమిత్తం ఇటీవల మాల్దీవ్స్‌ వెళ్లారామె. అయితే సినిమా షూటింగా? యాడ్‌ కోసమా? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఒకవైపు షూటింగ్‌లో పాల్గొంటూ మరోవైపు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచకుండా ఫోటోలను షేర్‌ చేశారామె.

బెస్ట్‌ బర్త్‌డే
ఈ ఏడాది తన బర్త్‌డేను స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నారు మెహరీన్‌. వెంటనే మాల్దీవులకు ప్రయాణం అయ్యారు. తన కుటుంబంతో కలసి మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారీ బ్యూటీ. ‘ఈ బర్త్‌డే  చాలా స్పెషల్‌’ అంటూ ఫోటోలు షేర్‌ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

చిన్న బ్రేక్‌
గత వారం తాప్సీ కూడా మాల్దీవుల్లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందీ చిత్రం ‘హసీనా దిల్‌రుబా’ చిత్రీకరణ పూర్తి చేసి చిన్న బ్రేక్‌ తీసుకున్నారు తాప్సీ. కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేలోగా తన స్నేహితులతో కలసి మాల్దీవుల్లో హాలిడేయింగ్‌ చేశారు.

హనీమూన్‌
కొత్త కపుల్‌ కాజల్‌ అగర్వాల్‌– గౌతమ్‌ కిచ్లు ప్రస్తుతం హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్‌ కోసం ఈ జంట ఎంచుకున్న చోటు మాల్దీవులు. అక్కడ ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు కాజల్‌.  

పుట్టినరోజు వేడుకలు
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్‌ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్‌ చేశారు ఈ కపుల్‌. ఇటీవలే మాల్దీవుల నుంచి తిరిగొచ్చారు కూడా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement