
కాజల్ అగర్వాల్
హిందీ, తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు కాజల్ అగర్వాల్. ఖాళీ లేని కాల్షీట్లు. షూటింగ్స్ కోసం జర్నీల నుంచి చిన్న హాలిడే తీసుకున్నారామె. ఈ లీవ్‌లో మాల్దీవుల్లో ఫ్యామిలీతో కలసి చిన్న వెకేషన్‌కు వెళ్లారు. సరదాగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ‘‘ఈ హాలిడే కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ప్రశాంతంగా గడపడానికి మాల్దీవులకు మించిన హాలిడే స్పాట్ ఏముంటుంది?’’ అని హాలిడేయింగ్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పంచుకున్నారు కాజల్ అగర్వాల్.