![Kajal Agarwal plans to Holiday trip - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/7/KajalAggarwal.jpg.webp?itok=07ZKvFFw)
Kajal Aggarwal: మూడు సినిమాలు.. ఆరు లొకేషన్స్ అన్నట్లు ఫుల్ బిజీగా సాగుతోంది కాజల్ అగర్వాల్ కెరీర్. గత ఏడాది వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ ఆ తర్వాత పెద్దగా పర్సనల్ లైఫ్‌కు టైమ్ కేటాయించకుండానే ‘ఆచార్య’ సెట్స్‌లో జాయినైపోయారు. ఆ తర్వాత భర్త గౌతమ్‌తో కలిసి కాజల్ ఓ స్మాల్ వెకేషన్‌కు వెళ్లారు. అంతే.. మళ్లీ సినిమాలు, ప్రమోషన్స్‌తో బిజీ బిజీ. దీంతో పర్సనల్ లైఫ్‌కు కాస్త దూరవుతున్నట్లుగా ఫీల్ అవుతున్నారట.
‘గౌతమ్ కోసం ఓ చిన్న బ్రేక్ తీసుకోవాలని ఉంది’ అని పేర్కొన్నారు కాజల్. ఇప్పుడు ఆ బ్రేక్‌కి కాస్త టైమ్ దొరికిందట. ‘హే సినామిక, కరుంగాపియమ్,ఘోస్టీ’ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేశారు కాజల్. అలాగే ఆమె చేస్తున్న తాజా హిందీ చిత్రం ‘ఉమ’ కోల్‌కతా షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ ‘ఆచార్య’, నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనే ముందు హాలిడే బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment