Celebrities on Vacation! See Where the Stars Get Away - Sakshi
Sakshi News home page

హాలీడే టూర్స్‌లో స్టార్స్ బిజీ బిజీ

Published Thu, Jul 27 2023 3:10 AM | Last Updated on Thu, Jul 27 2023 3:39 PM

Movie Stars celebrates are on vacation mode - Sakshi

 స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్‌. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్‌ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్‌ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్‌ మోడ్‌లో ఏ స్టార్స్‌ ఎక్కడున్నారో తెలుసుకుందాం.

మాల్దీవుల్లో మస్తీ
వెకేషన్‌ స్పాట్‌ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్‌. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్‌లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఇక వెకేషన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లోని సినిమాలతో రజనీకాంత్‌ బిజీ అవుతారు. 

విదేశాల్లో బర్త్‌ డే  
ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్‌ రావడంతో మహేశ్‌బాబు హాలిడే మోడ్‌లో ఉంటున్నారు.  ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ వెకేషన్‌లో ఉన్నారు మహేశ్‌బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్‌ను ΄్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్‌ బర్త్‌ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు.   

వెకేషన్‌ కంటిన్యూ
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్‌ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్‌లోనే ఉన్నారు అజిత్‌. తనకు ఇష్టమైన బైక్స్‌పై విదేశాల్లోని బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌ను సందర్శించారు. కాగా అజిత్‌ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్‌ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్‌.

షార్ట్‌ గ్యాప్‌
విజయ్‌ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్‌ నెక్ట్స్‌ ఫిల్మ్‌ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్‌ ఉందట. ఈ షార్ట్‌ గ్యాప్‌లో విజయ్‌ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్‌ సమాచారం.  

బాలీలో జాలీగా..
ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్‌ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్‌ బాత్‌ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్‌ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్‌ బాత్‌ చేసినట్లుగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్‌గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్‌ దేవరకొండ హీరో. అలాగే వరుణ్‌ ధావన్, సమంత లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.

దుబాయిలో హాయి హాయి..
గత నెల మాల్దీవుల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చాలా జోష్‌గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్‌ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ రిసార్ట్స్‌లో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రకుల్‌. తన తల్లి బర్త్‌ డేను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారామె. ఇందుకోసమే రకుల్‌ అండ్‌ ఫ్యామిలీ దుబాయ్‌ వెళ్లారు. 

‘భోళా శంకర్‌’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్‌ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్‌’ ప్రమోషన్స్‌తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్‌. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్‌ను స్పెండ్‌ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు వెంకటేశ్‌.

ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్‌లో స్పెండ్‌ చేసిన ప్రభాస్‌ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోని ‘సలార్‌’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్‌’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్‌) చిత్రాలతో ప్రభాస్‌ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్‌లో ఎక్కవ టైమ్‌ స్పెండ్‌ చేశారు.  ఇలా వెకేషన్‌కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement