Ajit
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. ఈ పండక్కి మూడు పెద్ద సినిమాలు(గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్) సినిమాలు రిలీజ్ అయితే.. వాటిల్లో గేమ్ ఛేంజర్ మినహా మిలిగిన రెండు సినిమాలు హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అయితే రికార్డులను సృష్టిస్తోంది. అయితే సంక్రాంతి సందడి తర్వాత పెద్ద సినిమాలేవి రిలీజ్ కాలేదు. ఫిబ్రవరిలో వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజై సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.‘పట్టుదల’తో వస్తున్న అజిత్కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయార్చి’. తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘పట్టుదల’ పేరుతో తెలుగులోనూ రిలీజ్ కానుంది. అజర్బైజాన్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ కథలో త్రిష, అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని కారు ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ని పెంచాయి. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రాజు,సత్యల ప్రేమ కథనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. మత్స్సకారుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజుగా నాగ చైతన్య, సత్య(బుజ్జితల్లి)గా సాయి పల్లవి నటిస్తున్నారు. దేశ భక్తి అంశాలతో పాటు ఓ చక్కని ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.‘ఒక పథకం ప్రకారం’సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీ సోది, ఆషిమా నర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సముద్ర ఖని కీలక పాత్ర చేశారు. వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేశ్ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది.నెట్ఫ్లిక్స్హలీవుడ్ వెబ్‌సిరీస్ ‘ప్రిజన్ సెల్ 211’- ఫిబ్రవరి 5హలీవుడ్ వెబ్‌సిరీస్ ‘సెలబ్రిటీ బేర్ హంట్’- ఫిబ్రవరి 5హలీవుడ్ వెబ్ సిరీస్ ‘ది ఆర్ మర్డర్స్’- ఫిబ్రవరి 5అమెజాన్ ప్రైమ్ వీడియోది మెహతా బాయ్స్ (హిందీ మూవీ): ఫిబ్రవరి 7డిస్నీ+ హాట్స్టార్కోబలి (తెలుగు వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 4సోనీలివ్బడా నామ్ కరేంగే (హిందీ వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 7జీ 5మిసెస్ (హిందీ సినిమా): ఫిబ్రవరి 7 -
హనుమాన్ సీక్వెల్ కి కోలీవుడ్ స్టార్..
-
గేమ్ చేంజర్ తర్వాత శంకర్ లిస్ట్‌లో ఉన్న టాప్ హీరో ఎవరు..?
భారీ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్. ఈ విషయంలో మరోమాటకు తావు లేదు. కొత్తవారితో చేసినా అది భారీగా ఉంటుంది. అందుకు చిన్న ఉదాహరణ బాయ్స్ చిత్రం. ఇకపోతే తొలి రోజుల్లోనే జెంటిల్మెన్, ఒకే ఒక్కడు వంటి చిత్రాల్లో భారీ తనాన్ని చూపించిన దర్శకుడు శంకర్. ఇక ఇండియన్, రోబో, అపరిచితుడు, ఐ వంటి చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో ఇండియన్–2, తెలుగు చిత్రం గేమ్ చేంజర్ ఉన్నాయి. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించిన ఇండియన్–2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీని తరువాత రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ చిత్రం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల కానుంది. దీంతో శంకర్ తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. అందుకు సమాధానంగా ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే అజిత్ హీరోగా శంకర్ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుపుతున్నారట. అజిత్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాదిలో సూపర్ క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో ఆయన. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన ప్రస్తుతం మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో తన 63వ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ రెండు చిత్రాల తరువాత అజిత్ నటించే చిత్రం ఏమిటన్న ప్రశ్నకు శంకర్ దర్శకత్వంలో నటించనున్నారని టాక్ వస్తోంది. అజిత్, దర్శకుడు శంకర్ల క్రేజీ కాంబినేషన్లో ఇప్పటి వరకూ చిత్రం రాలేదు. తాజాగా బాహుబలి చిత్రాన్ని మించే స్థాయిలో భారీ బడ్జెట్ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ, నిజం అయితే మాత్రం సూపర్‌గా ఉంటుందని చెప్పవచ్చు. -
Ajit: అజిత్ కళలు అన్నీ ఇన్నీ కాదండోయ్
చెన్నై: కోలీవుడ్‌లో బిరియాని ప్రియుడు, స్పెషలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది నటుడు అజిత్‌నే అయ్యి ఉంటారు. ఈయన తాను నటించే చిత్రాల షూటింగ్ స్పాట్లో యూనిట్ సభ్యులందరికీ స్వయంగా బిరియాని వండి వారుస్తారు. ఇక ఈయనలో ఒక మంచి షూటర్, బైక్ రైడర్ ఉన్నారన్న విషయం తెలిసిందే. షూటింగ్‌కు బ్రేక్ వస్తే చాలు మోటార్‌సైకిల్‌పై దేశ, విదేశాలు చుట్టి వస్తుంటారు. ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో నటిస్తున్న అజిత్ ఆ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ రావడంతో తన మిత్రులతో కలిసి బైక్‌లో మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. విడాముయర్చి చిత్రం ద్వారా పరిచయం అయిన నటుడు ఆరవ్ కూడా అజిత్ బృందంలో ఉన్నారు. కాగా వీరందరి కోసం అజిత్ మధ్యప్రదేశ్‌లోని అడవి ప్రాంతంలో మకాం పెట్టారు. అక్కడ గ్యాస్ పొయ్యిపై పెద్ద బానం పెట్టి చికెన్ బిరియాని చేసి, మిత్రులకు వడ్డించారు. దాన్ని వారంతా యమ రంజుగా ఉందంటూ రొట్టలేసుకుని ఆరగించారట. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు షూటింగ్లో యూనిట్‌కు సభ్యులకు తన బిరియాని స్పెషలిస్ట్ రుచిని చూపించిన అజిత్ ఇప్పుడు తన ఫ్రెండ్స్ కోసం చికెన్ బిరియాని చేయడం విశేషం. కాగా ఇటీవలే తన సతీమణి శాలిని పుట్టిన రోజు వేడుకలను అజిత్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలను చూసిన ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. Ride with Venus#Ajithkumar pic.twitter.com/GOOE7XCQ8u — Suresh Chandra (@SureshChandraa) March 20, 2024 -
హాలీడే టూర్స్‌లో స్టార్స్ బిజీ బిజీ
స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్ మోడ్‌లో ఏ స్టార్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం. మాల్దీవుల్లో మస్తీ వెకేషన్ స్పాట్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్‌లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లోని సినిమాలతో రజనీకాంత్ బిజీ అవుతారు. విదేశాల్లో బర్త్ డే ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ రావడంతో మహేశ్‌బాబు హాలిడే మోడ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్లో ఉన్నారు మహేశ్‌బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్‌ను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. వెకేషన్ కంటిన్యూ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్‌లోనే ఉన్నారు అజిత్. తనకు ఇష్టమైన బైక్స్‌పై విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌ను సందర్శించారు. కాగా అజిత్ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్. షార్ట్ గ్యాప్ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉందట. ఈ షార్ట్ గ్యాప్‌లో విజయ్ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్ సమాచారం. బాలీలో జాలీగా.. ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్ బాత్ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్ బాత్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. అలాగే వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. దుబాయిలో హాయి హాయి.. గత నెల మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా జోష్‌గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రిసార్ట్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు రకుల్. తన తల్లి బర్త్ డేను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారామె. ఇందుకోసమే రకుల్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లారు. ‘భోళా శంకర్’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ ప్రమోషన్స్‌తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్‌ను స్పెండ్ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్‌లో స్పెండ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్‌లో ఎక్కవ టైమ్ స్పెండ్ చేశారు. ఇలా వెకేషన్‌కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు. -
అజిత్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మళ్లీ తెరపైకి ‘అమరావతి’
నటుడు అజిత్ ఇప్పుడు మాస్ పాత్రలతో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నట పయనం ప్రేమ కథా చిత్రంతోనే మొదలైంది. అజిత్ నటించిన తొలి చిత్రం అమరావతి. నటి సంఘవి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని చోళా క్రియేషన్స్ పతాకంపై చోళా పొన్నురంగం నిర్మించారు. మొదట్లో టీవీ సీరియల్ నిర్మించిన ఈయన ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కాగా నటుడు అజిత్‌ను అమరావతి చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసింది ఈయనే. వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా 1993లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమరావతి చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త హంగులు అద్ది నటుడు అజిత్ పుట్టిన రోజును పురస్కరించుకుని మే 1వ తేదీన మళ్లీ తెరపైకి తీసుకురావడానికి నిర్మాత చోళ పొన్నురంగం సన్నాహాలు చేస్తున్నారు. (చదవండి: సక్సెస్ లేని రకుల్.. మాస్ మసాలా పాత్రల కోసం వెయిటింగ్..) దీని గురించి ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాను అజిత్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన అమరావతి చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించిందన్నారు. కాగా తాజాగా అజిత్ అభిమానుల కోరిక మేరకు ఆ చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మళ్లీ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. దీనిని సుమారు 400 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందుకు అజిత్ అభిమానులు థియేటర్ల యాజమాన్యం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
విజయ్‌ని డామినేట్ చేస్తున్న అజిత్!
కోలీవుడ్ పొంగల్ పోటీలో తాల అజిత్, తలపతి విజయ్ పోటీ పడుతున్నారు.బాక్సాఫీసు ముందర భారీ వార్ జరగబోతుంది.ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ వారిసు ప్రమోషన్లు షూరు అయ్యాయి.రంజితమే పాటతో..రచ్చ మొదలయ్యింది.అయితే అజిత్ మాత్రం..ఒక అడుగు ముందుకు వేసి విజయ్‌ని డామినేట్ చేయబోతున్నాడు.కలెక్షన్ల దగ్గర తనదే పై చేయి అనిపించుకోవాలి అనుకుంటున్నాడు.ఇంతకీ అజిత్ వేస్తున్న స్కెచ్ ఏంటి? కోలీవుడ్ పొంగల్ పోటీలో తలపతి విజయ్ వరిసుతో దూసుకుపోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లతో అలరించటమే కాదు..ఫస్ట్ సింగిల్ రంజితమే సాంగ్ ను రిలీజ్ చేసి..సోషల్ మీడియాలో తన రేంజ్ ఎంటో చూపిస్తున్నాడు..ప్రమోషన్లలో ముందున్నాను అనిపించుకుంటున్నాడు. విజయ్‌తో వార్కి సై అంటున్నాడు అజిత్. తాల అజిత్ ‘తునివు’ మూవీతో విజయ్ తో పోటీకి దిగుతున్నాడు.ఈ సీనియర్ హీరోకు కూడా మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దాంతో విజయ్ ,అజిత్ మధ్య పోటీ రంజుగా మారింది. బాక్సాఫీసు ఫైట్ మరో రేంజ్ కు చేరింది. విజయ్ వరిసుతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే..అజిత్ తునివు పోస్టర్లతోనే సరిపెట్టుకున్నాడు.కాని బాక్సాఫీసు ను శాషించటానికి భారీ స్కెచ్ మాత్రం వేశాడు. కలెక్షన్ల దగ్గర..విజయ్ సినిమాను డామినేట్ చేయాలి అనుకుంటున్నాడు అజిత్.అందు కోసం థియేటర్లను బ్లాక్ చేసుకున్నాడు. తన సినిమా తునివును ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయేలా ప్లాన్ చేశాడు. మొదటి రోజు కలెక్షన్లలో తనదే పై చేయి అనిపించుకోవాలి అనుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరు హీరోలలో ఎవరిది పై చేయి సాధిస్తారన్నది సినిమాలు విడుదయ్యాక తెలుస్తుంది. -
అజిత్ ‘వలిమై’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. ఒక్క తమిళనాడులోనే అన్ని కోట్లా!
దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వలిమై’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలన్ని వాయిదా పడటంతో వలిమైపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ తరుణంగా ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ హిట్‌టాక్‌ను తెచ్చుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా గ్రాండ్ ఓపెనింగ్‌ను ఇచ్చింది. ‘వలిమై’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ను అఫిషియల్‌గా ప్రకటిస్తూ సినిమా పీఆర్ఓ రమేష్ బాల ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన.. బ్రేకింగ్.. వలిమై తొలిరోజే కలెక్షన్స్ సునామి సృష్టించిన తొలి సినిమాగా నిలిచిందని, తమిళనాడులో వలిమై తొలిరోజు రూ. 34కోట్లు వసూలు చేసిందని వెల్లడించాడు. కరోనా సమయంలో సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్ ఆశ్చర్యకరం అంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చినప్పటికి అజిత్ వలిమైతో మరోసారి తన మార్క్ చూపించాడంటు మురిసిపోతున్నారు ఆయన అభిమానులు. అయితే ఒక్క తమిళనాడులోనే కలెక్షన్స్ ఈ రేంజ్లో ఉంటే ఇక తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో కలిపి 50 నుంచి 60 కోట్లు రూపాయలు దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. #BREAKING : Actor #AjithKumar 's #Valimai takes All-Time No.1 Day 1 Opening in TN.. TN Day 1 Gross - ₹ 34 Crs.. — Ramesh Bala (@rameshlaus) February 25, 2022 -
‘వలిమై’మూవీ రివ్యూ
టైటిల్ :వలిమై నటీనటులు :అజిత్, కార్తికేయ, హ్యూమా ఖురేషీ తదితరులు నిర్మాణ సంస్థలు : బే వ్యూ ప్రాజెక్ట్స్, జి.స్టూడియోస్ నిర్మాత: బోనీ కపూర్ దర్శకత్వం :హెచ్.వినోద్ సంగీతం : యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ :నీరవ్ షా విడుదల తేది : ఫిబ్రవరి 24, 2022 దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి.తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాకపోవడంతో ‘వలిమై’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ గురువారం(ఫిబ్రవరి 24)ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘వలిమై’కథేటంటే వైజాగ్ కేంద్రంగా ‘సైతాన్ స్లేవ్స్’పైరుతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు నరేన్(కార్తికేయ). ఆన్లైన్ వేదికగా జరిగే ఈ చట్ట విరుద్ద కార్యక్రమానికి నిరుద్యోగ యువతనే టార్గెట్‌గా చేసుకుంటాడు. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేసి, చైన్ స్నాచింగ్, హత్యలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడతాడు. వైజాగ్‌లో రోజు రోజుకి బైక్ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడంతో.. వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగుతాడు అసిస్టెంట్ కమిషనర్ అర్జున్(అజిత్). ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? నేరస్తులను పట్టుకునే క్రమంలో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతని ఫ్యామిలీని టార్గెట్ చేసిన నరేన్‌కు అర్జున్ ఎలా బుద్ది చెప్పాడు? చివరకు ఆన్లైన్ వేదిక ‘సైతాన్ స్లేవ్స్’ని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే ఏసీపీ అర్జున్ పాత్రలో అజిత్ ఒదిగిపోయాడు.స్వతగా అజిత్ మంచి బైక్ రేసర్ కావడంతో యాక్షన్స్ సీన్స్‌లో అద్భుతంగా నటించగలిగాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్‌లో అజిత్ అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రంతో కోలివుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. విలన్‌గా మెప్పించాడు. యాక్షన్స్ సీన్స్‌లో అజిత్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెడ్ సోఫియా పాత్రలో హ్యుమా ఖురేషి జీవించేసింది. సినిమాలో తనది కీలక పాత్ర అనే చెప్పాలి. ఇక ఏసీపీ అర్జున్ తమ్ముడు బుజ్జిగా రాజ్ అయ్యప్ప తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... వలిమై పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం. డ్రగ్స్ సరఫరా, చైన్ స్నాచింగ్, హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ సాగుతోంది. ఆన్లైన్ వేదికగా నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ని, ఆ గ్యాంగ్ లీడర్ని పోలీసులు ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా కథ. రోటీన్ కథనే ఎంచుకున్న దర్శకుడు వినోద్.. అజిత్‌కి తగ్గట్లుగా భారీ యాక్షన్ సీన్స్‌ని, బైక్ రేసింగ్ నేపథ్యాన్ని తీసుకొని సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్, కార్తికేయ మధ్య వచ్చే బైక్ ఛేజ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలే. యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే సినిమాలో కొత్తదనం లేకపోవడం, నిడివి ఎక్కువ ఉండడం మైనస్. సినిమా మొత్తం చేసింగ్ సీన్లే ఉంటాయి. మధ్య మధ్యలో మదర్ సెంటిమెంట్ చొప్పించే ప్రయత్నం చేసినా.. అది వర్కౌట్ కాలేదు. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఉన్నంతలో ఫస్టాఫ్ అంతో ఇంతో మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ బోరింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా పాత సినిమాల మాదిరి ఉంటుంది. ఓ ఫ్యాక్టరీలో హీరో ఫ్యామిలీని విలన్ బంధించి ఉంచడం.. హీరో వచ్చి ఫైట్ చేసి వారిని విడిపించడం.. ఇలాంటి క్లైమాక్స్ సీన్స్ గతంలో చాలా సినిమాల్లో వచ్చాయి. ఎడిటింగ్ బాలేదు. పాటలు, నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అజిత్ కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేసిన మహేష్
-
Valimai: అజిత్ లుక్ అదిరింది..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
ajit Valimai motion poster: కోలీవుడ్ అగ్ర కథనాయకుడు అజిత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వాలిమై’కు సంబంధించి అభిమానుల్లో అనందం నింపేలా ఓ అప్డేట్ వచ్చింది. కాగా, ఆదివారం ఈ చిత్రంలోని అజిత్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇందులో అజిత్ సీబీ సీఐడి అధికారిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో ‘వాలిమై’ చిత్ర అప్డేట్స్ ఇవ్వడం లేదంటు అజిత్ అభిమానులు సోషల్‌మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఇది తారస్థాయికి చేరింది. ఏకంగా ఓ సారి క్రీడా మైదానాల్లో ప్లకార్డులు ప్రదర్శించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో అభిమానుల తీరుపై ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు. HD Posters of #ThalaAjith's #Valimai #ValimaiMotionPoster ▶️ https://t.co/NwxiG3ubjY#Valimai #ValimaiFirstlook#Ajithkumar @BoneyKapoor #HVinoth @BayViewProjOffl @SureshChandraa #NiravShah @thisisysr @humasqureshi @ActorKartikeya @RajAyyappamv pic.twitter.com/cY3VaELpdF — BARaju's Team (@baraju_SuperHit) July 11, 2021 -
అజిత్ వీరాభిమాని ఆత్మహత్య..
తమిళ స్టార్ హీరో తలా అజిత్ అభిమాని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ప్రకాశ్ అనే యువకుడు అజిత్‌కు వీరాభిమాని.. అతని ఒంటి నిండ నటుడికి సంబంధించిన పచ్చబొట్టులే ఉంటాయి. అజిత్ సినిమాలేవి విడుదలైన ఫస్ట్‌డే ఫస్ట్షోనే చూస్తాడు. అంతేగాక అజిత్ బయట ఏ ఫంక్షన్‌కు హాజరైనా అందులో ప్రకాశ్ ఉత్సాహంగా పాల్గొంటాడు. ఈ క్రమంలో ప్రకాశ్ బుధవారం(ఫిబ్రవరి 24) సుసైడ్ చేసుకోవడం కోలివుడ్లో విషాదం నెలకొంది. అయితే ప్రకాశ్ ఆత్మహత్యకు వ్యక్తిగత విషయాలే కారణమని తెలుస్తోంది. అభిమాని సుసైడ్ విషయాన్ని అజిత్ కుమార్ ఫ్యాన్స్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. ‘ఈ రోజు తలా అజిత్ వీరాభిమాని, మంచి వ్యక్తిని కోల్పోయాం. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని, అవసరాలు తీర్చాలని స్థానికంగా దగ్గరలో ఉన్న అజిత్ ఫ్యాన్స్‌ను కోరుకుంటున్నాం. తమ కుటుంభానికి మా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు. కాగా అజిత్ అభిమాని ఆత్మహత్య చేసుకోవడంతో మిగతా అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. #RIPPrakash పేరుతో సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అయితే జీవితంలో ఏ సమస్యకూ చావు పరిష్కారం కాదని హితవు పలుకుతున్నారు. సమస్య ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని అధిగమించాలని సూచిస్తున్నారు. ఇదే చివరి ఆత్మహత్య కావాలని ప్రార్థిస్తున్నారు. Today We Lost One Of the Good Soul and One of the Die Hard THALA AJITH Fan 😑 Requesting Nearby Located FC's/Fans to Take Care of His Family And Any Needs 🙏 Kindly Support Family With Ur Assist Our deepest condolences and prayers to their Family.#RIPThalaPRAKASH #RIPPrakash pic.twitter.com/W8zj0v0HkO — AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) February 24, 2021 #RIPPrakash Sucide is not a solution brother💔 pic.twitter.com/so9uwyyKBe — P H O E N I X (@phoenixnk98) February 24, 2021 -
'అలీ బాయ్.. అజిత్ సినిమా అప్డేట్ ఏంటి!'
చెన్నై: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీతో ఫ్యాన్స్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాట సినిమాలను విపరీతంగా అభిమానిస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ హీరోల కోసం అభిమానులు ఒకరినొకరు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తమిళనాట సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న అజిత్ తాజాగా 'వాలిమయి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాట ఈ చిత్రంపై చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ అభిమానుల మధ్య ఈ సినిమాకు సంబంధించి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ స్పిన్నర్ అలీతో మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అజిత్ సినిమా అప్డేట్ గురించి అడిగారు. బౌండరీ లైన్ వద్ద నిలబడి ఉన్న మొయిన్ అలీతో.. 'అలీ బాయ్.. వాలిమయి అప్డేట్ ఏంటి 'అని అడిగారు. వారి భాష అర్థంకాని మొయిన్ అలీ నవ్వుతూ వారికి చేతులూపాడు. అలీ సంభాషణను ఒక వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో ట్రెండింగ్‌గా మారింది. కాగా ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో కీలకపాత్ర పోషించాడు. తొలిరోజు కోహ్లిని అలీ అవుట్ చేసిన తీరు హైలెట్‌గా నిలిచింది. అంతేగాక తొలిరోజు ఆటలో మూడు వికెట్లు తీసి స్పిన్ సత్తా చాటాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు వద్ద తొలిరోజు ఆటను ముగించిన టీమిండియా రెండోరోజు మరో 29 పరుగులు మాత్రమే జోడించి 329 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బ్యాటింగ్‌లో రోహిత్ 161 పరుగులు, రహానే 66 పరుగులు, రిషబ్ పంత్ 58 నాటౌట్ రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ 4 వికెట్లతో రాణించగా, ఓలీ స్టోన్ 3, జాక్ లీచ్ 2 వికెట్లు తీయగా.. కెప్టెన్ రూట్ ఒక వికెట్ తీశాడు. చదవండి: మూడో కన్నే పొరపాటు చేస్తే ఎలా? #Thala fans asking #Valimai update to #MoeenAli ...😀😀😀😀 pic.twitter.com/3ZCSfvmFEt — Anand (@anandviswajit) February 13, 2021 -
బైక్‌పై భారీయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో!
నటుడు అజిత్ ఇటీవల తన రాబోయే తమిళ చిత్రం వాలిమై యొక్క హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తీ చేసాడు. తర్వాత తుది షెడ్యూల్ కోసం "వాలిమై" చిత్ర బృందం మొరాకోకు వెళ్లనున్నారు. ఈ గ్యాప్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భారీ బైక్ యాత్రకు సిద్దమయ్యాడు. హీరో అజిత్‌కు బైక్‌లు, రేసింగ్ అంటే ఎంత పిచ్చో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వీలైనంత వరకు తను బైక్ ప్రయాణాల వైపే అజిత్ మొగ్గు చూపుతాడు. ఆ మధ్య తాను షూటింగ్ పూర్తీ అయ్యాక తిరుగు ప్రయాణంలో బైక్ మీద హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరిన సంగతి మనకు తెలిసిందే.(చదవండి: అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా?) తాజాగా ఇప్పుడు అజిత్ చెన్నై నుంచి సిక్కింకు(2400కి.మీ) బైక్‌పై వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నెలాఖరుకు చెన్నై తిరిగి రానున్నాడు. సోలోగా 4500 కి.మీ బైక్ యాత్ర చేయాలని అజిత్ ప్లాన్ చేసుకున్నారు. ఈ రోడ్ ట్రిప్‌లో వారణాసి దగ్గర ఒక అభిమానితో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీక్ అయిన చిత్రంలో అజిత్ బిఎండబ్ల్యూ బైక్ నడుపుతూ శీతాకాలపు బట్టలు ధరించి కనిపించాడు. ఈ పర్యటన నుండి తిరిగి వచ్చిన తరువాత అతను "వాలిమై" తుది షెడ్యూల్ కోసం మొరాకోకు వెళ్లనున్నారు. చిత్రంలో అజిత్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా, ఇందులో కథనాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుంది. టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. -
అజిత్‌తో అతిథిగా!
తమిళ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘వలిమై’. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకుడు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ కథానాయిక. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమాలో రేసర్ పాత్రలో జాన్ కనిపిస్తారట. బైక్స్, బేక్ రేసింగ్ అంటే జాన్ అబ్రహాంకి ఆసక్తి అనే విషయం గుర్తుండే ఉంటుంది. ఇది జాన్ అబ్రహాంకి తొలి తమిళ సినిమా అవుతుంది. -
నటి హీరాకు అజిత్ ప్రేమలేఖలు!
చెన్నై: నటుడు అజిత్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. రీసెంట్గా అజిత్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1990లో నటి హీరా రాజ్‌గోపాల్‌తో అజిత్ నడపిన ప్రేమాయణం అప్పట్లో టాక్ ఆప్ ది టౌన్‌గా ఉండేది. అయితే ఆ సమయంలో హీరాకు అజిత్ ప్రేమలేఖలు రాసేవారట. ఈ విషయాన్ని నటి బాయిల్వాన్ రంగనాథన్ వెల్లడించారు. ఆ లెటర్స్‌లో ఒకదాన్ని తాను చదివానని పేర్కొనడంతో వీరి లవ్‌స్టోరి మరోసారి వార్తల్లో నిలిచింది. (అందుకు నేను బాధ్యున్ని కాను!) కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్ - హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ బంధం పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు. వీరి వివాహానికి హీరా తల్లి నో చెప్పిందని, దీంతో వీరి లవ్ స్టోరికి ఫుల్స్టాప్ పడినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. కాగా కొన్నేళ్లకు అజిత్ నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అనోష్కా, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటిగా కెరియర్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న షాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. గృహిణిగా, నటిగా రెండు బాధ్యతలను తాను నిర్వహించలేనని అందుకే తన మొదటి ప్రయారిటీ కుటుంబమే అని షాలిని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. (అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా?) -
రీల్లోనే కాదు రియల్‌గాను హిట్ పెయిరే
(వెబ్‌స్పెషల్): రోజులు మారాయి.. ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలు కూడా జాబ్ చేసే అమ్మాయిలనే కోరుకుంటున్నారు. పెళ్లి విషయానికి వస్తే.. ఇద్దరు ఉద్యోగం చేస్తూంటే.. అమ్మాయిది, అబ్బాయిది ఒకే ఫీల్డ్ అయితే మరీ మంచిది అంటున్నారు. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ రంగంలోని వారిని వివాహం చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ సినీ ఫీల్డులో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా బయటి వ్యక్తులను వివాహం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అలా ఇండస్ట్రీలోని వారినే వివాహం చేసుకుని.. రీల్లోనే కాదు రియల్‌గా కూడా హిట్ పెయిర్ అనిపించుకుంటున్న వారిని ఓ సారి చూడండి.. కృష్ణ-విజయ నిర్మల 1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరతో వివాహం అయ్యింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో మొదటిసారి కృష్ణ,విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం అయినప్పటికి అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ టైంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం మొదలయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. అలా మెల్లిగా శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ వివాహం 1997లో జరిగింది. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: మొత్తం స్టూడియోలోనే?) జీవిత-రాజశేఖర్ జంట పదాలుగా తెలుగు పరిశ్రమలో ఈ భార్యాభర్తల పేర్లు ఎప్పటికీ పాపులరే. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమె వద్దు తొలగించండి’ అంటూ దర్శక నిర్మాతలకు చెప్పారు. ఆయన ఇలా చెప్పడంతో దర్శకనిర్మాతలు.. రాజశేఖర్‌నే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించవలసి వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్తా ప్రేమగా మారింది. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగులో రాజశేఖర్ గాయపడినప్పుడు, జీవిత ఆయన దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగార్జున- అమల టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో అక్కినేని నాగార్జున-అమల జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట సిల్వర్ స్క్రీన్ పై 'ప్రేమయుద్ధం' 'కిరాయి దాదా' 'శివ' 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేష్ సోదరితో వివాహం జరగడం.. విడాకులు తీసుకోవడం జరిగింది. (చదవండి: నో ప్యాంట్ 2020.. జీన్స్‌కి గుడ్‌బై) మహేష్‌బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే ఎనలేని ప్రేమ. తన సక్సెస్‌కు కారణం నమ్రత అని చెప్తారు. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు లవ్ చేసుకున్న వీరు 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి దగ్గరి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అతి నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చై-సామ్ ప్రస్తుతం ఉన్న దంపతుల్లో చై-సామ్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఏ మాయ చేశావే చిత్రంలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఆటో నగర్ సూర్య, మనం, వంటి చిత్రాల్లో కలిసి నటించారు. 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత మజిలీ చిత్రంలో జంటగా నటించారు. (చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...) షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్గా నటించారు. 2000 సంవత్సరంలో నటుడు అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. వ్యక్తిగతంగానే కాక ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఉంది. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్, దీపికా- రణ్వీర్ దంపతులు ప్రేమించి వివాహం చేసుకుని.. ఆనందంగా, ఆదర్శంగా జీవిస్తున్నారు. -
స్టార్ హీరోపై కన్నేసిన రష్మిక
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అజిత్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది నటి రష్మిక మందన. ఈ కన్నడి గుమ్మ తెలుగులో గీతగోవిందం చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్లో మార్కెట్ ఉన్న కథానాయకిల లిస్ట్‌లో ఈ అమ్మడు చేరింది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోలతోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే కోలీవుడ్‌కు డియర్ కామ్రేడ్ చిత్రం ద్వారా పరిచయమైనా, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం రష్మికను నిరాశపరిచింది. అంతకంటే ఎక్కువగా హీరో విజయ్‌తో నటించే అవకాశం మిస్ కావడం. దీంతో ఎలాగైనా కోలీవుడ్‌లో జెండాను గట్టిగా పాతాలని కోరుకుంటున్న ఈ బ్యూటీ దృష్టి ఇప్పుడు విజయ్‌కు దీటైన నటుడు అజిత్‌పై పడినట్లు తెలుస్తోంది. అందుకు ఉదాహరణ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక అజిత్ పేరు చెప్పి వార్తల్లో కెక్కింది. అజిత్‌కు దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన సాధారణంగా తన సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనే పాల్గొనరు. అయినా అలాంటి కార్యక్రమాల్లో అజిత్ పేరు చెప్పగానే అభిమానులు ఈలలు, చప్పట్లతో ఆవరణ దద్దరిల్లుతుంది. ఇది తెలిసిన రష్మిక తను పాల్గొన్న కార్యక్రమంలో మీకు కోలీవుడ్‌లో ఎవరితో నటించాలని ఆశ పడుతున్నారన్న వ్యాఖ్యాత ప్రశ్నకు టక్కున అజిత్ అని చెప్పింది. ఇది విన్న అభిమానులు తలా అంటూ గట్టిగా కేకలు వేస్తూ డాన్స్ చేయడం ప్రారంభించారు. అది చూసిన నటి రష్మిక అజిత్ మాస్ అని అంది. అలా విజయ్‌తో నటించే అవకాశాన్ని కోల్పోయిన ఈ బ్యూటీ దాన్ని అజిత్‌తో నటించి భర్తీ చేయాలని కోరుకుంటోంది. అయితే అలాంటి అవకాశం ఈ అమ్మడికి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఏదేమైనా నటి రష్మిక అజిత్ మాస్ అన్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే ఈ బ్యూటీ కార్తీకి జంటగా సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తోందన్నది గమనార్హం. -
రైఫిల్ షూట్ పోటీల్లో ఫైనల్‌కు అజిత్
పెరంబూరు : నటుడు అజిత్ రైఫిల్ షూట్ ఫోటీల్లో ఫైనల్‌కు చేరుకున్నారు.అజిత్ నటుడిగానే కాకుండా పలు రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారనే విషయం తెలిసిందే. ఈయన మంచి నలభీముడు, ముఖ్యంగా బిర్యాని వండడంలో దిట్ట. షూటింగ్‌ల్లో తాను చేసిన బిర్యానీతో చిత్ర యూనిట్‌ను ఆహా అనిపిస్తారు. ఇక కారు, బైక్ రేసుల్లోనూ పాల్గొంటుంటారు. అదే విధంగా ఎరో మోడలింగ్ వంటి వాటిలో పరిజ్ఞానం కలిగివ వ్యక్తి. మ్యాన్ పవర్ లేని బుల్లి విమానాలను తయారు చేసే ఎంఐటీకి చెందిన దక్ష అనే విద్యార్థుల టీమ్‌కు సలహాదారుడిగానూ వ్యహరిస్తున్నారు. ఇక చాలా కాలంగా రిమోట్ కంట్రోల్ ద్వారా పని చేసే విమానాల తయారీలోనూ దృష్టి సారిస్తున్నారు. కాగా తాజాగా రైఫిల్ షూట్ పోటీలకు సిద్ధం అయ్యారు. ఇటీవల కోవైలోని పోలీస్ అకాడమీ మైదానంలో జరిగిన జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో తమిళనాడు రైఫిల్ షూట్ సంఘం తరఫున పాల్గొని ఫైనల్‌కు చేరుకున్నారు. కాగా డిసెంబరు నెలలో మధ్య ప్రదేశ్‌లో జరగనున్న ఫైనల్ రైఫిల్ షూట్ పోటీల్లో అజిత్ పాల్గొననున్నారు. -
అజిత్ చిత్రానికి డేట్ ఫిక్స్
చెన్నై : హీరో అజిత్ చిత్రం విడుదలవుతుందంటే ఆయన అభిమానులకు పండగే. తాజాగా అజిత్ నటించిన చిత్రం ‘నేర్కొండ పార్వై’. కొత్తదనానికి, సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చే అజిత్ ఈసారి మరో వైవిధ్యభరతమైన కథా చిత్రంతో తెరపైకి రానున్నారు. ఇది బాలీవుడ్లో సంచలన విజయాన్ని అందుకున్న ‘పింక్’ చిత్రానికి రీమేక్. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పవర్ఫుల్ పాత్రను అజిత్ చేశారు. ఇక తాప్సీ పాత్రలో నటి శ్రద్ధాశ్రీనాథ్ నటించింది. మరో కీలక పాత్రలో నటి విద్యాబాలన్ కనిపించనుంది. ఈమె కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ఇది. విలన్ పాత్రలో దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ నటించిన ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ జీ.స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించారు. అజిత్ న్యాయవాదిగా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో నటించారు. చిత్ర చివరి ఘట్టంలో అజిత్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లు చిత్ర యూనిట్ టాక్. మరో విశేషం ఏమిటంటే యువన్‌శంకర్‌రాజా సంగీ తం అందించిన ఇందులో ఆంగ్ల సాంగ్ చోటు చేసుకోవడం. కవలై వేండామే తోళా అనే ఈ పాటలో ర్యాప్ సంగీతా నికి తగ్గట్టుగా ఆంగ్ల పదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయట. కాగా కాలం అనే పాట ఇటీవలే విడుదలై సంగీత ప్రియులను విపరీతంగా అలరిస్తోంది. ఇక నేర్కొండ పార్వై చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో విశేష ఆదరణను చూరగొంటోంది. చిత్ర విడుదల కోసం అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేర్కొండ పార్వై చిత్రాన్ని అక్టోబరు నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు గతంలో వెల్లడించారు. అయితే తాజాగా ఒక నెల ముందే అంటే ఆగస్ట్ 8వ తేదీనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. -
అక్షరాలా ఐదోసారి
ఆ రోజుల్లో హీరో, దర్శకుడు పది సినిమాల వరకూ కలసి చేసేవారు. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు తగ్గింది. హీరో–డైరెక్టర్ రెండు మూడు సినిమాలు చేస్తే ఎక్కువ అన్నట్లు ఉంది. కానీ తమిళ హీరో అజిత్, దర్శకుడు శివ అందుకు భిన్నంగా ఉన్నారు. వీళ్ల కాంబినేషన్లో ఆల్రెడీ ‘వీరమ్, వేదాళమ్, వివేగమ్’ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఐదోసారి కూడా వీళ్ల కాంబినేషన్ రిపీట్ కానుందని కోలీవుడ్ టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే ఈ సినిమా కూడా ‘వి’ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా ‘వి’తో టైటిల్ పెడతారో లేదో వేచి చూడాలి. -
‘దెబ్బకు దెబ్బ.. నీ పిల్లల్నీ చంపేస్తా..!’
న్యూయార్క్: నెట్ న్యూట్రాలిటీ విధానాన్ని రద్దు చేయడంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ చీఫ్‌పై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఓ వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ‘నీ కుటుంబాన్ని అంతం చేస్తాన’ని నిందితుడు ఎఫ్‌సీసీ చీఫ్ అజిత్పాయ్ను బెదిరించాడు. ఇంటర్నెట్ సేవల ధరలు పెరుగుతాయనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడనీ, దానికి బాధ్యుడు అజిత్ పాయ్ అని ఆరోపించాడు. అందుకనే ప్రతికారంగా అజిత్ పిల్లలను అంతమొందిస్తానని ఈ మెయిల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారంపై వైట్‌హౌస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. నేపథ్యం: ఇప్పటి వరకు ఇంటర్నెట్ సేవలపై తటస్థంగా (నెట్ న్యూట్రాలిటీ) వ్యహరించిన ఎఫ్‌సీసీ ఆ విధానానికి జూన్‌లో స్వస్తి పలికింది. ఎఫ్‌సీసీ ప్రతిపాదన మేరకు నెట్ న్యూట్రాలిటీ విధానాన్ని రద్దు చేస్తూ అమెరికా కాంగ్రెస్ తీర్మానం చేసింది. అయితే, నెట్ న్యూట్రాలిటీని రద్దు చేయడంతో అమెరికా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల ధరలు పెరుగుతాయనీ, ఇది వినియోగదారులపై ఆర్థిక భారం మోపనుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో వెబ్సైట్ల మనుగడను ప్రశ్నార్థకం చేసే నెట్ న్యూట్రాలిటీ రద్దుపై ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులు ప్రజల్ని రెచ్చగొడుతూ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే కాలిఫోర్నియాకు చెందిన మర్కాన్ మన్ మాత్రం.. కేవలం ఎఫ్‌సీసీ చీఫ్ అజిత్ పాయ్ వల్లనే నెట్ న్యూట్రాలిటీ విధానం రద్దయిందనీ, అందుకే అతనిపై పగ తీర్చుకుంటానని హెచ్చరించాడు. -
‘వివేకం’ హీరో అజిత్‌పై విశాల్ అసహనం..
సాక్షి, చెన్నై: తమిళ సినిమా స్టార్ అజిత్‌పై హీరో, తమిళ నిర్మాతల మండలి చైర్మన్ విశాల్ అసహనం వ్యక్తం చేశారు. గత నెలలో కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటుపై తమిళ సినిమా రంగం కేంద్రంపై మౌన పోరాట దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసనల్లో అజిత్ పాల్గొనక పోవడంపై విశాల్ స్పందించారు. విశాల్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘అజిత్ ఎప్పుడూ అందుబాటులో ఉండడు’ అంటూ వ్యాఖ్యానించారు. అజిత్ వ్యవహారం ఇబ్బందిగా అనిపించిందని అన్నారు. ‘ఒక అంశంపై నేను అజిత్‌ను కలవాల్సి ఉండగా, ఆయన పీఆర్ఓ సురేష్ చంద్రను సంప్రదించాను. కానీ అజిత్‌ని మాత్రం కలవలేపోయాన’ని విశాల్ వాపోయారు. ‘స్కూలు హెడ్ మాస్టారిలా సమావేశానికి అందరూ హాజరు కావాలని హుకుం జారీ చేయలేన’ని అన్నారు. కొన్ని వ్యవహరాలలో ఎవరికి వారు నైతికంగా జోక్యం చేసుకొని పాల్గొనాలని అభిప్రాయపడ్డారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా కొత్త కొత్త పోకడలతో నటీనటులంతా ప్రజలకు చేరువవుతున్న నేటి తరుణంలో.. అజిత్ అలాంటి వాటికి దూరంగా ఉండడం గమనార్హం. కాగా, గతంలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అజిత్ సినిమా తారలపై ప్రభుత్వ ఒత్తిడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరి జల వివాదంపై పోరాడాలని సినిమా రంగంపై అనుచిత ఒత్తిడి తెస్తున్నారని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. అజిత్ వ్యాఖ్యల్నిసూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సమర్థించారు. -
శంకర్ తదుపరి హీరో ఎవరు?
తమిళసినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ తదుపరి చిత్రం ఏమిటీ? ఏ హీరోతో చేయబోతున్నారన్నది దక్షిణ సినీ పరిశ్రమలో ఆసక్తిగా మారింది. శంకర్ చిత్రాల్లో సామాజిక అంశాలు ఉంటాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ఇలా ప్రేక్షకులను విస్మయపరిచే, ఆలోచింపజేసే, ఆహ్లాదపరచే అంశాలు ఉంటాయి కాబట్టే చేసింది తక్కువ చిత్రాలే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసే చిత్రాల దర్శకుడిగా ఎదిగారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని నభూతో నభవిష్యత్ అనే స్థాయిలో సిల్వర్ సెల్యులాయిడ్‌పై ఆవిష్కరిస్తున్నారు. ఎమీజాక్సన్ కథానాయకిగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగానూ నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని (ఒక్క పాట మినహా) నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరిలో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో శంకర్ తదుపరి చిత్రం ఏమిటన్న అంశంపై చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి. అజిత్‌తో ముదల్వన్–2: శంకర్ విశ్యనటుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్, విక్రమ్, అర్జున్, ప్రశాంత్, ఇలా చాలా మంది ప్రముఖ నటులతో చిత్రాలు చేశారు. అయితే అజిత్ హీరోగా ఇప్పటికీ చిత్రం చేయలేదు. వీరి కాంబినేషన్లో చిత్రం ఉంటుందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అది వాస్తవరూపం దాల్చలేదు. కాగా తాజాగా అజిత్ నటించిన వివేగం ఈ మధ్యనే విడుదలైంది. ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. దీంతో శంకర్, అజిత్ కలయికలో భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం తాజాగా జోరందుకుంది. శంకర్ దర్శకత్వంలో ముదల్వన్–2 చిత్రం రూపొందే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కమలహాసన్ హీరోగా ఇండియన్–2 శంకర్ తదుపరి కమలహాసన్ హీరోగా ఇండియన్–2 చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారన్నది. నిజానికి ఈ విషయమై శంకర్ కమలహాసన్‌ను కలిసి మాట్లాడారట. ఆయనతో చిత్రం ఖరారు చేసుకుందాం అనుకుంటున్న సమయంలో కమల్ తాజాగా రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించడానికి రెడీ అవుతుండటంతో శంకర్ తన ఇండియన్–2 చిత్ర ప్రయతాలకు బ్రేక్ వేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. విక్రమ్‌తో అన్నియన్–2 ఇక మరో వెర్షన్ ఏమిటంటే విక్రమ్ హీరోగా అన్నియన్–2 చిత్రానికి శంకర్ సిద్ధం అవుతున్నారన్నది. అన్నియన్ చిత్రానికి సీక్వెల్ చిత్రం వస్తుందనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. కాగా విక్రమ్ ప్రస్తుతం స్కెచ్, ధ్రువనక్షత్రం చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా సామి–2కు రెడీ అవుతున్నారు. తదుపరి శంకర్ దర్శకత్వంలో అన్నియన్–2 చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిజానికి ఇవన్నీ ఊహాగానాలే. పైన చెప్పిన వాళ్లలో ఏ ఒక్కరూ ఈ వార్తలపై స్పందించలేదు. ఖండించనూ లేదు. ఇంతకీ శంకర్ తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పటికి..? -
మరో చిత్రానికి రెడీ!
తమిళసినిమా: కోలీవుడ్ నటులలో అజిత్ రూటే వేరు. ఎవరి గురించి పట్టించుకోరు. వివాదాల జోలికి పోరు. తాననుకున్నది చేసుకుపోయే మనస్తత్వం. తన నిర్మాతల్ని, దర్శకుల్ని తనే ఎంచుకుంటారు. అలా దర్శకుడు శివతో వీరం, వేదాళం, తాజగా వివేగం అంటూ వరుసగా మూడు చిత్రాలు చేశారు. ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను చూరగొన్నాయి. గత వారం విడుదలైన వివేగం చిత్రం మిశ్రమ స్పందనలతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర రికార్డులనే బ్రేక్ చేస్తోందంటున్నారు సినీపండితులు. ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లను, ఎదుర్కొంటున్న విమర్శలను వింటూ మౌనం పాటిస్తున్న అజిత్ ఇటీవల దర్శకుడు శివను తన ఇంటికి పిలిపించుకుని వివేగం చిత్రానికి సంబంధించిన చాలా విషయాలను చర్చించారట. చిత్రంపై వస్తున్న విమర్శల గురించి కలత వద్దనీ, వాటిని అధిగమించేలా మరో చిత్రం చే ద్దాం అన్నారట. దీంతో నోట మాట రాక దర్శకుడు శివ కంట ఆనందభా ష్పాలు రాలాయట. దీని గురించి శివ తెలుపుతూ వివేగం చిత్ర నిర్మాణ సమయంలోనే అజిత్‌కు పలు కథలను చెప్పానని, అందులో తనకు నప్పే కథను అజిత్ ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే తమ తాజా చిత్రం గురించి అజిత్‌నే వెల్లడిస్తారని శివ పేర్కొన్నారు. కాగా వీరం, వేదా ళం, వివేగం మూడు వేర్వేరు నేపథ్యాల్లో తెరకెక్కిన కథా చిత్రాలుగా విజ యం సాధించిన నేపథ్యంలో ఈ సారి అజిత్, శివ కాంబినేషన్లో భారీ ఛారి త్రక కథా చిత్రం రూపొందే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
వివేకంతో ఢీ అంటున్న తప్పాట్టం
తమిళసినిమా: అజిత్ హీరో చిత్రం వస్తుందంటే ఒక మోస్తరు చిత్రాలను కూడా ఆ చిత్ర విడుదల దరిదాపుల్లో విడుదల చేయడానికి ముందుకురారు. అలాంటిది నూతన దర్శకుడు, నవ నిర్మాత కలయికలో కొత్త నటీనటులతో నిర్మించిన చిత్రాన్ని అజిత్ చిత్రానికి పోటీగా విడుదల చేసి పెద్ద సాహసమే చేశారు. ఆ చిత్రమే తప్పాట్టం. గత గురువారం అజిత్ చిత్రం వివేకంతో పాటు విడుదలైన తప్పాట్టం చిత్రానికి మంచి విమర్శలు, ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పాట్టం చిత్రం గురించి ఒక లుక్కేస్తే, పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ హీరోగా నటించగా ఆయనకు జంటగా డోనా నాయకిగా నటించారు. కోవై జయకుమార్, పేనామణి, కూత్తుపట్టరై తులసి, పేరాసిౖయె లక్ష్మి, రూఫి, పొల్లాచ్చి ఎంకే.రాజా ప్రధాన పాత్రల్లో నటించారు. నవ దర్శకుడు ముజిపూర్ రహ్మాన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఆదంబావా నిర్మించారు. 1984లో ఒక కుగ్రామంలో జరిగే కథగా తెరకెక్కించిన తప్పాట్టం చిత్రాన్ని దర్శకుడు చాలా సహజత్వంతో రూపొందించారు. చావులకు డప్పులు వాయించే ఒక యువకుడికి, అతడిని పిచ్చిగా ప్రేమించే అక్క కూతురికి మధ్య ప్రేమ,పెళ్లి, ఈ గ్రామంలో ఒక మోతు బారు రైతు ఇలా సాగుతుంది కథ. కంటపడిన యువతుల్ని కాంక్షించే ఆ మోతు బారి రైతు బారిన కథానాయకి పడుతుంది.ఆమె అతని నుంచి తప్పించుకోవడంతో పాటు అతని చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ పగతో రగిలే ఆ మోతుబారి రైతు ఏం చేశాడు, అందుకు చిత్ర కథానాయకుడి రియాక్షన్ ఏమిటీ? తదితర ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తప్పాట్టం. చాలా చిన్న చిత్రంగా నిర్మించిన తప్పాట్టంకు మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
వివేకంతో అభిమానులు ఖుషీ
తమిళసినిమా: అజిత్ అభిమానులు ఎంతగానో ఎదరుచూసిన వివేకం చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఇది అజిత్ 57వ చిత్రం మాత్రమే కాదు, ఆయనకు నటుడిగా 25వ వసంతంలోకి అడుగుపెట్టిన చిత్రం కూడా కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటుడు కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ కీలక పాత్రలోనూ నటించిన ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఓబరాయ్ ప్రతినాయకుడిగా నటించారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. అనిరుధ్ సంగీత బాణీలు లందించారు.అజిత్ ఇంటర్‌పోల్ అధికారిగా నటించిన ఈ చిత్రం హై స్టాండర్డ్‌లో రూపొందింది. చిత్ర ఆధ్యంతం ఉత్కంఠభరితంగా శరవేగంగా సాగుతుంది. మన దేశాన్ని అను ఆయుధాల ద్వారా భూకంపాలు వచ్చేలా చీకటి అరాచక శక్తుల కుట్రను కథానాయకుడు అజిత్ ఎలా ఛేదించారన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం వివేకం. ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు అజిత్ సహా చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. చిత్రం హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉందంటూ ప్రశంసిస్తున్నారు. కమలహాసన్ అభినందనలు నటుడు కమలహాసన్ తన కూతురు అక్షరహాసన్‌తో కలిసి గురువారం వివేకం చిత్రాన్ని చూశారు. చిత్రం ప్రదర్శన సమయంలోనే ఆయన తాను తన కూతురు అక్షరతో కలిసి వివేకం చిత్రం చూస్తున్నాను. చిత్రం గురించి మంచి రిపోర్ట్ వస్తోంది. అజిత్ సహా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. అభిమానుల హంగామా ఇక అజిత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వివేకం చిత్రాన్ని గురువారం వేకువజాము నుంచే చాలా థియేటర్లలో ప్రదర్శించారు. అభిమానులు అజిత్ ఫొటోలతో కూడిన భారీ కటౌట్లను థియేటర్ల ముందు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కటౌట్లకు పాలాభిషేకాలు, ఆలయాల్లో పూజలు అంటూ హంగామా సృష్టించారు. -
మళ్లీ వైఫ్‌గా...
నుదుట కుంకుమ బొట్టు... మెడలో తాళిబొట్టు... హుందాగా చీరకట్టు... కొత్తగా కనిపిస్తూ కాజల్ అగర్వాల్ కనికట్టు చేస్తారట. ఎందులోనంటే... అజిత్ ‘వివేకం’లో. రీసెంట్గా రిలీజైన ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరో వైఫ్ క్యారెక్టర్లో కనిపించిన కాజల్, ఈ సినిమాలోనూ హీరో వైఫ్‌గా కనిపించనున్నారు. అయితే... రెండు క్యారెక్టర్స్ మధ్య చాలా డిఫరెన్స్ ఉందట! ‘‘కళలను అభిమానించే వ్యక్తిగా, ‘వివేకం’లో టిపికల్ సౌతిండియన్‌గా నటించా. నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్’’ అన్నారు కాజల్. ఇందులో ఒకటి, రెండు పాటల్లో తప్పితే... సినిమా అంతా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజులు, ట్రెడిషనల్ శారీల్లో కాజల్ కనిపిస్తారట. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో యాక్షన్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ముఖ్యంగా అజిత్ మేకోవర్, స్టైల్‌కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో ఆయన సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు హ్యూమన్ ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు కాజల్. తమిళంలో ‘వివేగం’గా రూపొందిన ఈ సిన్మాను వంశధార క్రియేషన్స్ పతాకంపై నిర్మాత నవీన్ శొంటినేని (నాని) తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా, అక్షరా హాసన్ ముఖ్యతారగా నటించిన ఈ సినిమాకు శివ దర్శకుడు. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. -
ఆమె నటన చూసి కమల్ గర్వపడతారు
తమిళసినిమా: వివేకం చిత్రంలో ఆ చిత్ర కథానాయకుడు అజిత్ అసాధారణ నటనను చూస్తారని బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్‌ఓబరాయ్ పేర్కొన్నారు. అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వివేకం. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శివ దర్శకుడు. నటి కాజల్‌అగర్వాల్ నాయకిగా, నటుడు కమలహసన్ రెండో కూతురు అక్షరహాసన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఓబరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో ఈయన ప్రతినాయకుడిగా నటించినట్లు ప్రచారంలో ఉంది. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. వివేకం చిత్ర ప్రమోషన్లో భాగం చెన్నైకి వచ్చిన వివేక్‌ఓబరాయ్ శనివారం సాయంత్రం విలేకరులతో ముచ్చటించారు. ప్ర: వివేకం చిత్రంలో నటించడానికి కారణం? జ: ఒక రోజు దర్శకుడు శివ నన్ను కలిసి వివేకం చిత్ర కథ వినిపించారు. వెంటనే నటించడానికి ఓకే చెప్పేశాను. ఆయన వివేకం చిత్ర కథను నెరేట్ చేసిన విధం నాకు చాలా నచ్చింది. కథ, నా పాత్ర బాగుండడంతో నటించడానికి అంగీకరించాను. ప్ర : నటుడు అజిత్ గురించి? జ: అజిత్ నాకు మంచి మిత్రుడు. ఆయనతో ఈ చిత్ర జర్నీ మంచి అ నుభూతినిచ్చింది. వివేకం చిత్రం అంతర్జాతీయ స్థాయి కథా చిత్రం. ఇందులో మిషన్‌లో మేమిద్దరం కలిసి పని చేశాం. బల్గేరియాలో జీరో డిగ్రీల శీతల ఉష్ణంలో బేర్ బాడీతో ఆయన చేసిన సాహసాలు అబ్బు ర పరుస్తాయి. ఇక వివేకం చిత్రం గురించి చెప్పడానికి మాటలు చాలవు. దర్శకుడు శివ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ప్ర: నటి కాజల్‌అగర్వాల్ నటన గురించి? జ: నిజం చెప్పాలంటే కాజల్ అగర్వాల్ నటనను చూసి ఆశ్చర్యపోయాను. వివేకం చిత్రంలో ఆమె నటన అబ్బురపరచింది. ప్ర: నటి అక్షరహాసన్ నటన గురించి జ: అక్షరహాసన్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఆమె పాత్ర వివేకం చిత్రానికి చాలా కీలకంగా ఉంటుంది. చాలా మంచి నటి. ఈ చిత్రంలో అక్షరహాసన్ నటనను చూసి ఆమె తండ్రి కమలహాసన్ గర్వపడతారు. ప్ర: మీరీమధ్య ఎక్కువగా నటించడం లేదే? జ: అవకాశాలు చాలా వస్తున్నాయి. అయితే నాకు నటన ఒక్కటే కాదు, నా కుటుంబం, వ్యాపారం, ఇతర సామాజిక సేవాకార్యక్రమాలు అంటూ చాలా ఉన్నాయి. ప్ర: తమిళంలో అవకాశాలు వస్తే నటిస్తారా? జ: నటించాలన్న కోరిక నాకూ ఉంది.అయితే ఇక్కడ ప్రధాన సమస్య భాష. అయినా మంచి కథా చిత్రాలు వస్తే నటించడానికి రెడీ. ప్ర: చెన్నై గురించి? జ: చెన్నై నాకు చాలా నచ్చిన నగరం. మా పెద్దమ్మ, అక్కచెల్లెళ్లు అంటూ చాలా మంది బంధువులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇడ్లీ, దోసెలు అంటే నాకు చాలా ఇష్టం. అంతేకాకుండా స్టైల్‌కింగ్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్ లాంటి ఐకాన్లు నివశిస్తున్న నగరం చెన్నై. తమిళ చిత్రపరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. ప్ర: ఆ మధ్య తమిళనాడులో తుపాన్ సంభవించినప్పుడు మీరు చాలా సాయం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందా? జ: అది చాలా ఎమోషన్ సంఘటన. బాధితులను ఆదుకోవడం అన్నది మనిషిగా ప్రతి ఒక్కరి బాధ్యత. మావనతాదృక్పథంతోనే నేను అప్పుడు తమిళ ప్రేక్షకులకు సేవలందించాను.అంతేకానీ నాకు రాజకీయ రంగప్రవేశం ఆలోచన లేదు. -
ఉద్వేగం కలిగించే అజిత్
తమిళసినిమా: ఇతరులకు ఉద్వేగం కలిగించడంలో ఆజిత్కు ఆయనే సాటి అని ప్రముఖ హాలీవుడ్ నటి అమిలా టెర్జిమెహిక్ పేర్కొన్నారు. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వివేగం. కాజల్‌అగర్వాల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. బోలెడు విశేషాలు, అంతకంటే మరిన్ని అంశాలతో వివేగం చిత్రం ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో అజిత్ కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్‌లో ప్రధాన పాత్రను పోషించిన అమిలా టెర్జిమెహిక్ తన అనుభవాలను పంచుకుంటూ అంతర్జాతీయ స్థాయి చిత్రం వివేగం ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలోకి పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. తాను నటించన హాలీవుడ్ చిత్రం ది నవంబర్ మెన్ చిత్రం చూసి దర్శకుడు శివ తనను వివేగం చిత్రంలో నటిండానికి ఎంపిక చేసినట్లు తెలిసిందన్నారు. ఈ చిత్ర కథ, అందులో తన పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే చాలా నచ్చేసిందన్నారు. నటుడు అజిత్‌ను కలువక ముందే ఆయన ఎంత పెద్ద నటుడో తెలుసుకున్నానని చెప్పారు. అంత పెద్ద స్టార్ నిడరంబరంగా ఉండటం ఆయనకే చెల్లిందన్నారు. చిత్రంలో రిస్కీ ఫైట్స్‌లోనూ ఎలాంటి డూప్ లేకుండా నటించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఆయన ప్రవర్తనను, వృత్తి భక్తిని చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. -
ఆయన చాలా సిన్సియర్, మరి విజయ్?
తమిళసినిమా: నటుడు అజిత్ చాలా సిన్సియర్ అంటున్న నటి కాజల్‌అగర్వాల్‌తో మరి విజయ్ మాటేమిటన్న ప్రశ్నకు ఏం బదులిచ్చారో చూద్దాం. నేటి క్రేజీ హీరోయిన్లలో కాజల్‌అగర్వాల్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో ఇద్దరు ప్రముఖ హీరోలతో ఏకకాలంలో నటిస్తున్న లక్కీ నటి ఈ బ్యూటీ. అంతే కాదు ఈ నెలలో ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు వరుసగా తెరపైకి రానున్నాయి. అందులో ఒకటి అజిత్‌తో రొమాన్స్ చేసిన వివేగం ఇకటి కాగా టాలీవుడ్ యువ నటుడు రానాతో నటించిన నేనేరాజా నేనే మంత్రి మరొకటి. వీటితో పాటు ఇళయదళపతి విజయ్ సరసన నటిస్తున్న మెర్శల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో యమ ఖుషిలో ఉన్న కాజల్‌ను పలకరించగా ఈ ఏడాది తన టైమ్ చాలా బాగుందని ఖుషీ అయ్యారు. కోలీవుడ్‌లో అజిత్, విజయ్‌తో ఏక కాలంలో నటించారు. ఎలా భావిస్తున్నారన్న ప్రశ్నకు చాలా సంతోషంగా ఉందని, అజిత్‌తో తొలిసారిగా నటించానని అన్నారు. ఆయన నటనలో చాలా సిన్సియర్ అని అంతకు మించి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడని పేర్కొన్నారు. అజిత్ లాంటి ఫ్యాబులస్ యాక్టర్‌తో కలిసి నటించడం తీయని అనుభవం అని అన్నారు. వివేకం చిత్ర ఒన్లైన్ స్టోరీని దర్శకుడు చెప్పగానే తాను ఫ్లాట్ అయ్యిపోయానని పేర్కొన్నారు. ఇందులో తానింతవరకూ నటించనటువంటి పాత్రను పోషించానని చెప్పారు. వివేగం చిత్ర కథ చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. అనిరుధ్ చాలా మంచి సంగీతాన్నిచ్చారని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడాలని ఆశ పడుతున్నానంటున్న కాజల్‌తో నటుడు విజయ్ మాట ఏమిటన్న ప్రశ్నకు ఆయనతో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించానని, విజయ్ గురించి చెప్పాలంటే ముందు ఆయన ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలని అన్నారు. చాలా లవబుల్ పర్సన్. అంతకు మించి హార్డ్‌వర్కర్ అని పేర్కొన్నారు. విజయ్ స్టైలిష్ నటనను చూసిన తాను చాలా ఎడ్మైర్ అయ్యానని కాజల్ అంటోంది. -
తలైవా తర్వాత ?
-
అందుకే మతం మారాను: నటి
చెన్నై: ఆస్తికత్వంపై నమ్మకం లేదంటూనే బౌద్ధమతానికి మారానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రెండో కూతురు అక్షరహాసన్ చెప్పింది. ఆ మధ్య షమితాబ్ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన ఈ బ్యూటీ తాజాగా స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న వివేగం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ నేపథ్యంలో అక్షరహాసన్ ఇటీవల చెన్నైలో విలేకరులతో మాట్లాడింది. చిన్ననాటి నుంచే దర్శకత్వంపై ఆసక్తి ఉందని ఆమె తెలిపింది. ముంబయిలో కొన్ని చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానని చెప్పింది. 'ప్రస్తుతం నటనపై ఆసక్తి కలగడంతో అటుగా దృష్టి సారిస్తున్నాను. అమ్మా, నాన్న, అక్క, ఇతర బంధువులు అందరూ ఈ రంగంలోనే ఉన్నారు. వారందరితో ఒక మూవీ చేయాలనుంది. ముందు దర్శకురాలిగా ఓ విజయం సాధించిన తరువాత అమ్మానాన్న, అక్క కాల్షీట్స్ తీసుకుని వారితో సినిమా చేస్తాను. నాకు అక్క మాదిరి దేవుడిపై నమ్మకం లేదు. అయితే ఆసక్తితోనే బౌద్దమతం స్వీకరించాను. నాన్న కమల్‌హాసన్ గురించి చాలా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా.. లేదా.. అన్నది ఆయన ఇష్టం. దాని గురించి మాట్లాడబోనని' నటి అక్షరహాసన్ స్పష్టం చేసింది. -
ఆయన అచ్చంగా మా నాన్నలానే!
నా వయసెంత? ఆయన వయసెంత? అయినా సరే సెట్స్‌లో నన్ను ‘జీ’ (గారు) అని గౌరవంగా పిలిచేవారు. మా నాన్న కూడా అంతే. ఎదుటి వ్యక్తి వయసు, అనుభవంతో సంబంధం లేకుండా గౌరవిస్తారు. ఆయనలో ఈ మర్యాద నాకు బాగా నచ్చేసిందంటున్నారు కమల్‌హాసన్ రెండో కుమార్తె అక్షరాహాసన్. ఎవరి గురించి చెబుతున్నారీ అమ్మాయి? అంటే... తమిళ హీరో అజిత్ గురించి! సెట్స్‌లో అజిత్ ఇతరుల్ని గౌరవించే తీరు సేమ్ టు సేమ్ మా నాన్నలానే ఉంటోందన్నారు. ‘వీరం, వేదాలం’ సినిమాల తర్వాత శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వివేకం’. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఆ సంగతి తెలిసే అక్షరాహాసన్ కీలక పాత్ర నటించడానికి అంగీకరించారట. ‘‘హీరోయిన్గా నటించడం నాకిష్టమే. కానీ, నేను చేసిన రోల్ బాగుంది. ఐయామ్ హ్యాపీ’’ అన్నారు అక్షర. ఈ అమ్మాయి హిందీ సినిమాతో హీరోయిన్గా పరిచయమై, ఇప్పుడు మాతృభాష తమిళంలో సినిమా చేశారు. తమిళ సినిమాలు కంటిన్యూ చేస్తారా? అని అక్షరను అడిగితే... ‘‘నాకు భాషాబేధాలు లేవు. కొన్నాళ్లుగా నాన్నతో మాట్లాతున్నప్పుడు తమిళంలోనే మాట్లాడుతున్నా. స్పష్టంగా తమిళంలో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా. నేనెందుకు అలా చేస్తున్నానో నాన్నకు అర్థమైంది’’ అని నవ్వేశారు. సో, అక్షర మరిన్ని తమిళ సినిమాల్లో నటించాలని ఆశపడుతున్నారన్న మాట!! -
జేమ్స్ బాండ్ మూవీలా...
తమిళ స్టార్ హీరో అజిత్– దర్శకుడు శివలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరం, వేదాళం’ ఘన విజయం సాధించాయి. ఈ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘వివేగం’. కాజల్ కథానాయిక. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ తమిళంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని ‘వివేకం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నవీన్ శొంఠినేని మాట్లాడుతూ– ‘‘110 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘జేమ్స్ బాండ్’ తరహా మూవీగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు టీజర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘ప్రేమ పుస్తకం, ప్రేమలేఖ, వీరుడొక్కడే’ వంటి చిత్రాలతో అజిత్ తెలుగులోనూ హిట్స్ సాధించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. తెలుగులో ‘శౌర్యం, శంఖం, దరువు’ వంటి హిట్ చిత్రాలను శివ తెరకెక్కించారు. అజిత్‌తో ఆయన చేసిన ఈ మూడో సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అనిరుథ్ రవిచంద్రన్ పాటలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
అజిత్ 'వివేగానికి' భారీ రేటు!
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న హీరో అజిత్ తాజా చిత్రం 'వివేగం'.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మేకర్స్ తాజాగా తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టారు. స్పై థ్రిల్లర్‌గా తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 10న ఈ సినిమా విడుదలకానుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 4.5 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. వ్యాపారపరంగా చూసుకుంటే తెలుగు మార్కెట్లో అజిత్ సినిమాకు ఇదే హయ్యెస్ట్ రేటు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అక్షరహాసన్ కీలక పాత్రలోనూ నటిస్తోంది. హిందీ స్టార్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో అజిత్ రిస్కీ సన్నివేశాల్లోనూ డూప్ లేకుండా నటించారని చిత్రబృందం చెప్తోంది. -
హలో..బై తప్ప స్నేహం లేదట
తమిళసినిమా: సాధారణంగా ఒకే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తే వారి మధ్య స్నేహం, లేదా వైరం ఏర్పడుతుండడం చూస్తుంటాం. మిత్రత్వం అయితే ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటారు. అదే ఒకరికొకరు పొసగక పోతే గొడవలు, విమర్శలే. కానీ ఇద్దరు నటీమణులు ఒక చిత్రంలో కలిసి నటించినా హలో..బై అనే మాటలతోనే సరిపెట్టుకున్నారట. వారెవరో కాదు, అందాల భామ కాజల్‌అగర్వాల్, అక్షరహాసన్. ఈ ముద్దుగుమ్మలు కలిసి నటించిన చిత్రం ఏమిటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్.వివేగం, అజిత్ కథానాయకుడిగా నటించిన ఇందులో కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటించింది. మరో ప్రధాన పాత్రలో కమలహాసన్ రెండవ వారసురాలు అక్షరహాసన్ నటించింది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్‌కు అక్షరహాసన్‌కు మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉండవట. దీంతో వీరి మధ్య పెద్దగా స్నేహం ఏర్పడలేదట. షూటింగ్ స్పాట్లో ఎదురు పడినప్పుడు మాత్రం హలో చెప్పుకునే వారట. షూటింగ్ పూర్తి అయ్యి గుమ్మడికాయ కొట్టినప్పుడు ఒక సెల్ఫీ తీసుకుని బై చెప్పడం వరకే ఈ భామలు పరిమితం అయ్యారట. ఇంతకీ ఈ బ్యూటీస్ మధ్య స్నేహం ఏర్పడకపోవడానికి కారణాలేంటబ్బా ‘ ఇప్పుడీ విషయమే సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. మొత్తం మీద వివేగం చిత్రం వచ్చే నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఎవరి నటన ఎలా ఉంది, ఎవరికి ఎంత పేరు తెచ్చి పెడుతుంది అన్నది తేలేది అప్పుడే. -
వీరాభిమానం.. విగ్రహం
హీరోలకు అభిమానులుండటం కామన్. అభిమాన హీరో సినిమా ఫంక్షన్స్, సినిమా విడుదలైనప్పుడు వీరిదే హంగామా. వీరాభిమానులైతే ఈ హంగామాతో పాటు అభిమాన హీరో పేరిట సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అంతేకాదండోయ్... అభిమాన హీరోకు విగ్రహాలు కూడా పెట్టేస్తుంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులు ఆయన విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. తమిళంలో అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘వివేగమ్’ సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజుల కిందట విడుదలైన ఆ సినిమా టీజర్ కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్ దక్కించుకుంది. టీజర్లో అజిత్ నడిచి వస్తుంటారు. ఆ తరహాలోనే వాకింగ్ స్టైల్లో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ‘వివేగమ్’ మూవీ రిలీజ్ టైమ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు చెన్నై కోడంబాక్కమ్ టాక్. -
మలుపు తిప్పే వివేగం
తమిళసినిమా: వివేగం చిత్రం అందులో నటించిన నటీనటులు, సాంకేతిక వర్గం కేరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా ఉంటుందట. ఇది అన్నది ఎవరో కాదు ఆ చిత్ర దర్శకుడు శివ. అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం వివేగం. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ భారీఎత్తున్న నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్న ఇందులో అక్షరహాసన్ ముఖ్య భూమికను పోషిస్తున్నారు. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్న వివేకం చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 10న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.చిత్రాన్ని సెన్సార్‌కు పంపే పనిలో చిత్ర యూనిట్ ఉంది. కాగా ఇందులో అజిత్ రిస్కీ సన్నివేశాల్లోనూ డూప్ లేకుండా నటించారని ఇప్పటికే ఆ చిత్ర చాయాగ్రహకుడు వెట్రి గొప్పగా చెప్పారు. కాగా వివేగం చిత్రాన్ని అజిత్ సహా చిత్ర యూనిట్ అంతా చూశారని, అందరూ ఏక కంఠంతో చెప్పిన మాట ఈ చిత్రం తమ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా ఉంటుందనేనని దర్శకుడు శివ అన్నారు. కాగా ఇందులో అనిరుథ్ కర్ణాటక సంగీతంతో ఒక పాటకు ప్రయోగం చేశారట. ఆ పాట చిత్రానికి హైలెట్ అవుతుందంటున్నాయి చిత్ర వర్గాలు. -
హీరోయిన్గా అక్షరహాసన్!
తమిళసినిమా: నటుడు కమలహాసన్ రెండో వారసురాలు అక్షరహాసన్ ఎట్టకేలకు హీరోయిన్ అవుతున్నారు. తన అక్క శ్రుతీహాసన్ మాదిరిగానే వృత్తిపరంగా వారు కోరుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయ్యింది. శ్రుతీహాసన్‌కు సంగీతంపై మక్కువ అన్నది తెలిసిందే. తను సంగీత రంగంలో రాణించాలని ఆశ పడ్డారు. అదేవిధంగా పలు ప్రైవేట్ సంగీత ఆల్బంలు చేసిన శ్రుతి తన తండ్రి కమలహాసన్ నటించిన ఉన్నైపోల్ ఒరువన్ చిత్రం ద్వారా సంగీతదర్శకురాలిగా రంగప్రవేశం చేశారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా హీరోయిన్గా అవతారమెత్తారు. హిందీలో లక్ చిత్రంతో తన లక్కును పరిక్షించుకున్నా, తెలుగు చిత్రం గబ్బర్‌సింగ్‌తోనే స్టార్‌డమ్‌ను పొందగలిగారు. ఇక అక్షరహాసన్ కెమెరా వెనుక కెప్టెన్ కావాలని ఆశించారు. అందుకు దర్శకుడు బాల్కీ వద్ద సహాయదర్శకురాలిగా పనిచేశారు కూడా. అయితే తను యాదృచ్ఛికంగానే హిందీ చిత్రం షమితాబ్ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. తాజాగా అజిత్ హీరోగా నటిస్తున్న వివేగం చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ అక్షరహాసన్ కథానాయకి కాదు. తాజాగా హీరోయిన్ అవకాశం ఈమెను వరించిందని సమాచారం. అయితే ఈ అవకాశం అక్షరకు శాండిల్‌వుడ్‌లో రావడం విశేషం. కన్నడంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్ వారసుడు విక్రమ్ చంద్రన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో అక్షర ఆయనకు జంటగా నటించనున్నారని సమాచారం. -
అజిత్ అభిమానులకు శుభవార్త..
వద్దన్నా వెంటనడిచే అభిమానులన్న ఏకైక నటుడు అజిత్ అని చెప్పవచ్చు. ఆయన అభిమానుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చాలా కాలం క్రితమే తన అభిమాన సంఘాలను రద్దు చేశారు. అయితే వద్దంటే పోయేదా ఆయనపై అభిమానం. అజిత్ అధికారికంగా రద్దు చేసినా అనధికారంగా అజిత్ అభిమాన సంఘాలు కొనసాగుతూనే ఉన్నాయి. అజిత్ పుట్టిన రోజు, ఆయన చిత్రాల విడుదల సమయాల్లో అభిమానులు తన వీరాభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అజిత్ నూతన చిత్రం కోసం ఆతృతంగా ఎదురు చూస్తూనే ఉంటారు. అలా అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వివేగం కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అభిమానులకు శుభవార్త ఏమిటంటే వివేగం చిత్రం గురించి ఇప్పటి వరకూ వెలువడని కొన్ని విశేషాలు ఇక్కడ పొందుపరుస్తున్నాం. అజిత్ దర్శకుడు శివ కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం వివేగం. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో అందాల బామ కాజల్‌అగర్వాల్ తొలిసారిగా అజిత్‌తో రొమాన్స్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రం అధిక భాగం బల్గేరియాలో చిత్రీకరణ జరుపుకుంది. కొన్ని కీలక సన్నివేశాలను యూరప్ దేశాల్లో ఈ చిత్రం 70 శాతం షూటింగ్ జరుపుకుంది. మిగిలిన షూటింగ్‌ను ఇండియాలో చిత్రీకరిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే వివేగం చిత్రం గత ఏడారి ఆగస్ట్ 2న ప్రారంభమైంది. మే నెల 10వ తేదీకీ చిత్రీకరణను పూర్తి చేసుకోనుంది. అంటే మొత్తం 282 రోజుల్లో 150 రోజులు షూటింగ్‌ను జరుపుకుంది. ఇందులో అజిత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌గా నటిస్తున్నారు. ఆయన అంతర్జాతీయ టెర్రర్ నెట్‌వర్క్‌ను ఎలా అంతం చేశారన్నదే వివేగం చిత్ర కథ అని తెలిసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఓబరాయ్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అజిత్ అభిమానులకు గుడ్‌న్యూస్ ఏమిటంటే ఆయన పుట్టిన రోజు మే ఒకటవ తేదీన వివేగం టీజర్‌ను విడుదల కానుందన్నది తాజా సమాచారం. అదే విధంగా చిత్రాన్ని ఆగస్ట్ 10న గానీ 24గానీ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
షార్ప్ షూటర్‌గా దుమ్మురేపిన అజిత్!
అగ్రహీరో అజిత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వివేగం' తాజా లుక్ అభిమానులను థ్రిల్లింగ్‌కు గురిచేస్తున్నది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ స్నిప్పర్గా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు శివ ట్వీట్ చేసిన ఫొటోలో షార్ప్ షూటర్‌గా అజిత్ అదరగొట్టాడు. మంచులో పడుకొని తుపాకీతో గురిపెట్టిన ఆయన తాజా ఫొటో.. అభిమానులను అలరిస్తోంది. ఈ ఏడాది విడుదలవుతున్న రజనీకాంత్ 'రోబో 2.0' తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న సినిమా 'వివేగం'. ఈ సినిమాలో అజిత్ సిక్స్‌ప్యాక్ తో అదరగొట్టబోతున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఇంటర్‌పోల్ ఆఫీసర్ కావడంతో ఎక్కువ శాతం చిత్రీకరణ యూరోపియన్ దేశాల్లోనే జరుపుతున్నారు. కమల్‌హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్ తమిళ తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. స్టైలిష్ విలన్‌గా వివేక్ లుక్ ఈ సినిమాలో ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రం ఆగష్టు 10న థియేటర్లను పలకరించనుంది. VIVEGAM -
హాలీవుడ్‌కు విజయ్, రాజకీయాల్లోకి అజిత్!
ఇళయదళపతి విజయ్ హాలీవుడ్‌లోకి, అల్టిమేట్ స్టార్ అజిత్ రాజకీయాల్లోకి. ఇది సాధ్యమేనా? అలా సాధ్యం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక ప్రముఖ దర్శకుడు పేర్కొన్నారు. విజయ్, అజిత్ వీరిద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్న నటులు. వీరికి వృత్తిపరంగా పోటీ ఉంది. ఇద్దరికీ తమిళనాడు దాటి తెలుగు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లోనూ వీరి చిత్రాలు వసూళ్లను సాధిస్తాయి. వీరిలో ఒకరిని రాజకీయాల్లోకి, మరోకరిని హాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి రాజ్ తిరుసెల్వన్ అనే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈయన ప్రవాస భారతీయుడన్నది గమనార్హం. రాజ్ తిరుసెల్వన్ తాజాగా లేక్ ఆష్ ఫైర్ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్ర ప్రమోషన్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను రెండు కథలను తయారు చేశానన్నారు. అందులో తమిళనాడు రాజకీయాల గురించి కథ ఒకటన్నారు. తమిళనాడులో రెండు పార్టీలే మార్చి మార్చి అధికారంలోకి వస్తున్నాయని, దీనికి కారణం ఏమిటి? వీటి వెనుక ఎవరున్నారన్న వాస్తవాలను తెలిపే కథలో నటుడు అజిత్ హీరోగా చిత్రం చేయాలనుకుంటున్నానని, అందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అదే విధంగా ఒక ప్యూర్ లవ్ స్టోరీని సిద్ధం చేశానన్నారు. ఇందులో నటుడు విజయ్ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయ్ ఇక్కడ చాలా సాధించారని, హాలీవుడ్లో సాధించేలా ఈ కథను ఆయన కథానాయకుడిగా హాలీవుడ్ చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజ్ తిరుసెల్వన్ తెలిపారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా? తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్, అజిత్ ఆయన చిత్రాల్లో నటించడానికి అంగీకరిస్తారా అన్న అంశాలు ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. -
అజిత్‌కి ఏమైంది?
మంచు దుప్పటి కప్పేసిన ప్రాంతంలో ఓ మడుగు... అదీ రక్తపు మడుగు! అందులో నుంచి మెల్లగా బయటకు నడుచుకొస్తున్న ఓ మనిషి... అతని శరీరమంతా రక్తపు చారలు, కాలిన గాయాలు. అయినా వీరోచితంగా పోరాడుతున్నాడు. అతనెవరో కాదు... అజిత్. సడన్‌గా ‘కట్’ అనే సౌండ్ వినిపించింది. వెంటనే ఫైట్‌కి ఫుల్స్టాప్ పెట్టేసిన అజిత్ రక్తపు మడుగు నుంచి కాస్త పక్కకు జరిగారు. అప్పుడు తీసిన ఫొటోనే మీరు చూస్తున్నారు. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘వివేగమ్’. ఇందులో అజిత్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారట. ప్రస్తుతం బల్గేరియాలో చిత్రీకరణ జరుగుతోంది. బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరో ఇంటర్‌పోల్ ఆఫీసర్ కనుక ఎక్కువ శాతం చిత్రీకరణ యూరోపియన్ దేశాల్లోనే జరుపుతున్నారు. ఈ చిత్రంలో అజిత్ ఫస్ట్ లుక్‌ను ఎప్పుడో విడుదల చేశారు. సిక్స్ ప్యాక్‌లో అజిత్‌ను చూసిన ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ఇప్పుడీ లేటెస్ట్ లుక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. కమల్‌హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్ తమిళ తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట! -
కాజల్, కెరీర్లో ఫస్ట్ టైం..?
కెరీర్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు అంగీకరించింది. ఇప్పటికే నయనతార, త్రిష, అనుష్క లాంటి హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతుంటే కాజల్ మాత్రం గ్లామర్ రోల్స్‌కే పరిమితమయ్యింది. ఇటీవల అవకాశాలు కూడా తగ్గటంతో మనసు మార్చుకున్న ఈ బ్యూటి, ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు ఓకె చెప్పింది. జీవా, కాజల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన కవలై వేండమ్ సినిమాకు దర్శకత్వం వహించిన డీకే కాజల్ లీడ్ రోల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మధ్య కాజల్‌కు కథ కూడా చెప్పిన దర్శకుడు డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడట. ప్రస్తుతం కోలీవుడ్‌లో అజిత్, విజయ్ లాంటి టాప్ హీరోల సరసన నటిస్తున్న కాజల్, త్వరలోనే డీకే దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్రారంభించనుంది. -
వివేకం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
వావ్ అమేజింగ్ తల. ఇది అజిత్‌ను చూసి కోలీవుడ్ అబ్బురపడుతూ ముక్త కంఠంతో అంటున్న మాట. కారణం ఏమిటనేగా మీ ప్రశ్న. నటుడు అజిత్ సిక్స్ ప్యాక్ బాడీని చూసి ఆయన అభిమానులే కాదు, తమిళ చిత్రపరిశ్రమ వర్గాలు ఫిదా అయి పోయారు. ఎస్ఈ అల్టిమేట్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రానికి వివేకం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వీరం, వేదాళం చిత్రాల తరువాత అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. కాజల్ అగర్వాల్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటి అక్షరహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత బాణీలు కడుతున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం వివేకం. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో అజిత్ సిక్స్ ప్యాక్ బాడీతో నిలబడి ఉన్న ఫొటో వావ్ దటీజ్ తల అనిపించేలా చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది. అజిత్ సిక్స్ ప్యాక్ బాడీకి తయారవడాన్ని పలువురు కోలీవుడ్ ప్రముఖుల అచ్చెరువు చెందుతున్నారు. నటుడు లారెన్స్ , శివకార్తికేయన్, విక్రమ్‌ప్రభు, శాంతను, ప్రేమ్‌జీ, నటి పార్వతీమీనన్, సంగీత దర్శకుడు ఎస్ఎస్.తమన్ అమేజింగ్ అంటూ ప్రసంశిస్తున్నారు. అజిత్ సిక్స్‌ప్యాక్ బాడీకి మారడానికి నిత్యం ఐదు గంటలు కసరత్తులు చేశారట. ఆయనకు చెన్నైకి చెందిన యూసబ్ శిక్షకుడిగా వ్యవహరించారు. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. చిత్రాన్ని జూన్ లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
ఆ చెత్త అధికారికోసం బిచ్చగాడిలా..
చెన్నై: ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు పదిహనేళ్ల బాలుడు బిచ్చగాడిలా మారాడు. వీధుల్లో తిరుగుతూ తాను అలా ఎందుకు మారాల్సి వచ్చిందో వివరిస్తూ పైసాపైసా కూడబెట్టడం మొదలుబెట్టాడు. దీంతో ఆ అధికారి ఉద్యోగం ఊడిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా కున్నతూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అజిత్ అనే పదిహేనేళ్ల బాలుడి తండ్రి విజయ్ గత ఏడాది చనిపోయాడు. కానీ00 అంత్యక్రియలకు కూడా డబ్బు లేక అప్పు చేసిమరీ అజిత్ తండ్రి తుది క్రతువు నిర్వహించాడు. కాస్తంత ఆసరాగా ఉంటుంది కదా అని తండ్రి మరణానికి పరిహారం కోసం అధికారుల వద్దకు చెప్పులు అరిగేలా తిరిగాడు. ఏడాదిన్నర తర్వాత గానీ ప్రభుత్వం నుంచి సాయం ప్రకటన రాలేదు. అది కూడా అరకొరగా రూ.12,500 మాత్రమే. ఆ డబ్బుకు కూడా కక్కుర్తి పడ్డాడు సుబ్రహ్మణియన్ అనే ఓ అధికారి. తనకు 3000 వేలు లంచంగా ఇస్తేనే తాను రూ.12,500 ఇస్తానని చెప్పాడు. దీంతో ఇక చేసేది లేక ఆ పదిహేనేళ్ల బాలుడు చిరాకుతో ఏకంగా ఓ బ్యానర్ పై తాను ఓ అధికారికి లంచం ఇవ్వాలని, ఆ మొత్తం తన వద్ద లేనందున తనకు దానం చేయాలని వీధివీధిన తిరుగుతూ అడుక్కోవడం ప్రారంభించాడు. అలా బ్యానర్ పట్టుకొని బస్సుల్లో, స్టేషన్లలో ఆ బాలుడు బిచ్చమెత్తడం మొదలుపెట్టాడు. ఇది కాస్త ఫొటోల రూపంలో, వీడియో రూపంలో ఆన్ లైన్ లోకి వచ్చి హల్ చల్ చేసింది. ఆ బాలుడిని లంచం అడిగిన సుబ్రహ్మణియన్ అధికారిని విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశించారు. కాగా, తాను అసలు లంచం డిమాండ్ చేయలేదని, ఆ బాలుడు మైనర్ అయినందున ఇవ్వలేదని, అతడి తల్లికి ఇస్తానని చెప్పానని బదులిచ్చాడు. -
అమ్మాయి కోసం ఫేస్బుక్లో వార్నింగ్...
ఫేస్బుక్లో వార్నింగ్.. గ్రౌండ్లో డిష్యుం డిష్యుం బెంగళూరు : ఓ అమ్మాయి కోసం ఇద్దరి మధ్య ఫేస్బుక్లో జగడం మొదలైంది. ఇది చినికిచినికి గాలివానగా మారి దాడులకు దారితీసింది. ఈ ఘటన మంగళవారం బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని రాజాజీనగర్‌కు చెందిన అజిత్ తనతో పాటు కళాశాలలో చదువుతున్న అమ్మాయితో స్నేహంగా ఉండేవాడు. ఆ అమ్మాయిని.. ఆమె ఇంటి పక్కన ఉండే శివప్రసాద్ కూడా ఇష్టపడేవాడు. కొన్ని రోజుల క్రితం సదరు అమ్మాయితో అజిత్ కలిసి తిరుగుతున్న విషయాన్ని శివప్రసాద్ గమనించాడు. ఈ నేపథ్యంలో అతను ఫేస్బుక్లో అజిత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయిని తాను ప్రేమిస్తున్నానని, మర్యాదగా అడ్డుతప్పుకోవాలని హెచ్చరించాడు. అజిత్ కూడా వెనక్కి తగ్గలేదు. అమ్మాయితో స్నేహంగా ఉండటం, ప్రేమించడం తన సొంత విషయమని, బెదిరింపులకు లొంగేది లేదని ఫేస్బుక్లో సమాధానం ఇస్తూ ఫోన్‌నంబర్‌ను కూడా పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో శివప్రసాద్ సోమవారం రాత్రి అజిత్‌కు ఫోన్‌చేసి ధైర్యముంటే స్థానిక శంకర్‌మఠం వద్ద ఉన్న మైదానం వద్దకు రావాలని చెప్పాడు. అజిత్ తన నలుగురు స్నేహితులతో అక్కడికి చేరుకున్నారు. శివప్రసాద్ కూడా తన గ్యాంగుతో అక్కడికి చేరుకున్నారు. వాగ్వాదంతో మొదలై.. భౌతిక దాడుల వరకు వెళ్లారు. కత్తులు, రాడ్లతో గాయపరచుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రాజాజీనగర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అజిత్, శివప్రసాద్‌తో పాటు వారి స్నేహితులను అరెస్టు చేశారు. -
హన్సికకు ఆ వయస్సు వచ్చిందా?
అందానికి ప్రతి రూపం హన్సిక అనడంలో అతిశయోక్తి ఉండదేమో.తన కళ్లలో కొంటెదనం, లాస్యంతో కలిగే పరవశం కుర్రకారు గుండెల్ని తీయని బాధతో ఇట్టే పిండేస్తాయి. హన్సిక కోలీవుడ్‌లో నటుడు అజిత్ మినహా యువ హీరోలందరితోనూ నటించారు. అయితే ఇంతకు ముందు చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్న ఈ ఉత్తరాది భామ ఎందుకనో ఇటీవల నటిగా కాస్త వెనుక బడ్డారు. ప్రస్తుతం జయంరవితో రొమాన్స్ చేస్తున్న భోగన్ చిత్రం ఒక్కటే తన చేతిలో ఉంది. కారణాలేమిటన్న ప్రశ్నకు ఈ సౌందర్యరాశి తీసుకున్న నిర్ణయమేనని తెలియవచ్చింది. హన్సిక తను ఎంపిక చేసుకునే చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారట. ఇప్పటి వరకూ చాలా చిత్రాలు చేశాననిఇకపై కథలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి పచ్చజెండా ఊపాలని నిర్ణయించుకున్నారట. నటి జ్యోతిక నటించిన 36 వయదినిలే, అమలాపాల్ నటించిన అమ్మాకణక్కు, త్రిష ప్రస్తుతం నటిస్తున్న నాయకి చిత్రాల తరహాలో కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లోనే నటించాలని ఆశిస్తున్నారట. అంతాబాగానే ఉంది. ఈ బ్యూటీ అప్పుడే అలాంటి పాత్రల వయసుకు చేరుకున్నారా? అసలు తన ఈ నిర్ణయం సరైనదేనా? అన్న ప్రశ్నలు పరిశ్రమ వర్గాలలో హల్చల్ చేస్తోంది. ఏదేమైనా నటి హన్సిక నిర్ణయం తనను ఏ దిశకు తీసుకెళుతుందోనన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. -
హాస్యమే సేఫ్
ఇక్కడ హాస్య కథా చిత్రాలే సేఫ్ అనే నమ్మకం వ్యక్తం అవుతోందంటున్నారు ప్రముఖ దర్శకుడు ఎళిల్. ఇంతకు ముందు విజయ్ హీరోగా తుళ్లాద మనం తుళ్లుమ్, అజిత్‌తో రాజా చిత్రాలతో పాటు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన నటుడు విష్ణువిశాల్ నిర్మాతగా కూడా అవతారమెత్తడం విశేషం. ఆయన సరసన నిక్కీగల్రాణి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.కే.సత్య సంగీతాన్ని అందించిన వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రం రేపు (శుక్రవారం)తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎళిల్‌తో చిన్న భేటీ. ప్ర: వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ టైటిలే కొత్తగా ఉందే? జ: ఇది నా గత చిత్రాల కంటే కామెడీ బాగా వ ర్కౌట్ అయిన చిత్రం. పని అంటూ వస్తే అతను ఇంగ్లిషోడు లాంటి వాడని (వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్) గ్రామాల్లో నానుడి ఉంది. ఈ చిత్రం లో హీరో ఏ పని సరిగా చేయడు. అందుకే కాం ట్రాస్ట్గా ఉంటుందని ఆ పేరు నిర్ణయించాం. ప్ర: సరే చిత్ర కథేంటి? జ: ఏ పనీ సరిగా చేయని విష్ణువిశాల్, పోలీస్ అధికారిణి నిక్కీగల్రాణి, రవి మరియలకు సూరి ఒక సమస్యను తెచ్చి పెడతాడు. చివరికి ఆ సమస్యను తనే ఎలా పరిష్కరించారన్న వినోదాల విందే వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రం. ప్ర: ఈ చిత్రానికి నటుడు విష్ణువిశాల్ నిర్మాతగా మారడానికి ప్రధాన కారణం? జ: నిజానికి ఈ చిత్రాన్ని మొదట వేరే నిర్మాత నిర్మించాల్సింది. కొన్ని ఆటంకాల వల్ల ఆయన చేయలేని పరిస్థితి ఏర్పడడంతో వేరే నిర్మాతతో చర్చలు జరుగుతుండగా కథ బాగుందని తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని విష్ణువిశాల్ ముందుకు వచ్చారు. నటుడిగానూ ఈ చిత్రం ఆయనకు వేరేలా ఉంటుంది. ప్ర: కథానాయకుడే నిర్మాత అవడంలో ఇబ్బంది అనిపించలేదా? జ: ఇందులో ఇబ్బందే ముంటుంది. చెప్పిన బ డ్జెట్లో చిత్రాన్ని పూర్తి చేసి ఇస్తే సమస్యలే ఉం డవు. నా గత చిత్రాలకు కొన్ని రీషూట్స్ చేశా ను. నిర్ణయించిన బడ్జెట్లో కరెక్ట్ టైమ్‌లో పూర్తి చేసి ఇచ్చాను. కారణం షూటింగ్‌కు ముందే ప్రణాళికను సిద్ధం చేసుకోవడమే. ప్ర: చిత్రంలో సూరి పాత్ర గురించి? జ: నాకు సూరికి మధ్య మంచి అండర్స్టాం డింగ్ ఉంది. మనం కొత్తి పరవై చిత్రంలో ఆయనకు చిన్న పాత్రనే ఇచ్చాను. అయితే ఒక ముఖ్య పాత్ర పోషించాల్సిన నటుడు రాకపోడంతో అతని పాత్రను సూరి ఎలా చేస్తారో చూద్దాం అని ఆయనతో చేయిం చాను. ఇక ఈ చిత్రంలో అంతకంటే బాగా హాస్యాన్ని పండించారు.ఇప్పటి వరకూ ఆయన్ని పరోటా సూరి అని పిలుస్తున్న వారు ఈ చిత్రం విడుదలైన తరువాత పుష్పా పురుషుడు సూరి అని పిలుస్తారు. ప్ర: వరుసగా హాస్యకథా చిత్రాలనే చేస్తున్నారే? జ: వేరే జానర్ కథా చిత్రాల ను చేయాలని నేనూ కోరుకుంటున్నాను.అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. హాస్య భరిత కథా చిత్రాలే సేఫ్ అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. భారీ చిత్రం చేయాలంటే ప్రముఖ కథానాయకుల కాల్షీట్స్ అవసరం అవుతుంది. నా తదుపరి చిత్రం ప్రముఖ హీరోతోనే ఉంటుంది. -
అభిమానమంటే ఇదే!
చెన్నై: కోలీవుడ్‌లో సినీ అభిమానమే వేరు. ఒక్క సారి అభిమాని అయితే మరచిపోవడమో, మరలడమో తక్కువనే చెప్పాలి. అలా హీరోలనే కాదు వారి వారసులపైనా అభిమానం ఇసుమంత కూడా తగ్గకుండా కొనసాగుతుంది. ఇప్పుడు అజిత్ విషయంలోనూ అదే జరుగుతోంది. అజిత్, షాలినీల కొడుకు అద్విక్ బుధవారం పుట్టిన రోజు జరుపుకున్నాడు. అజిత్ దంపతులు కుమారుడు పుట్టిన రోజును కుటుంబసభ్యులతో నిరాడంబరంగా జరిగింది. మార్చి2, 2015న అద్విక్కు షాలినీ జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అద్విక్ బర్త్ డే సందర్భంగా చెన్నైతో పాటు తమిళనాడులో వివిధ ప్రాంతాల్లో అదిరిపోయేలా అభిమానులు వేడుకలు నిర్వహించారు. అజిత్ అభిమానులు కుట్టీ తలా(చిన్న నాయకుడు) అంటూ పెద్దగా పోస్టర్లు వేసి పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఈ పోస్టర్లు చెన్నైలో కొన్ని చోట్ల కనిపించినా, మదురైలో భారీగా గోడలపై వెలిశాయి. కొందరు అభిమానులు అజిత్‌కు ఇష్టం అయిన బిరియానీతో 151 మందికి విందును ఇచ్చారు. అభిమానం అంటే ఇదన్న మాట. నిజానికి అజిత్ తన అభిమాన సంఘాలను రద్దు చేసి చాలా కాలం అయ్యింది. అయినా అసలు సిసలు అభిమానం ఎక్కడికి పోతుంది. వద్దంటే పోయేది అభిమానమే కాదని అజిత్ అభిమానులు ఈ విధంగా నిరూపిస్తున్నారు. కాగా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటలో అన్యోన్యంగా జీవిస్తున్న వారిలో అజిత్, షాలిని దంపతులున్నారు. 1999లో 'అమర్కాలం' అనే చిత్ర షూటింగ్లో పరిచయం అయిన అజిత్, షాలినీ అనంతరం ప్రేమలోపడి 2000లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే వీరికి ఎనిమిది సంవత్సరాల పాప కూడా ఉంది. ఆమె పేరు అనౌష్క. -
శ్రీవారి సేవలో అజిత్
ప్రముఖ తమిళ నటుడు అజిత్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సమయంలో ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. -
ఈ వారం you tube హిట్స్
గర్ల్స్ టు మెన్ : ఛానెల్ 4 నిడివి : 34 సె. హిట్స్ : 56,71,913 చానెల్ 4 బ్రిటిష్ టీవీ చానెల్. సామాజిక అంశాలు, సమస్యలపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడంలో ప్రసిద్ధి చెందిన ఈ చానెల్ తాజాగా ‘గర్ల్స్ టు మెన్’ అనే ప్రోగ్రామ్ని అక్టోబర్ 13 రాత్రి పది గంటలకు ప్రసారం చేయబోతోంది. దాని ట్రైలరే గర్ల్స్ టు మెన్. అమ్మాయిలుగా పుట్టి, అమ్మాయిలుగా ఉండడానికి ఇష్టపడని పిల్లల్ని, వాళ్ల తల్లిదండ్రుల్ని చానల్ 4 ఇంటర్వ్యూ చేసింది. అమ్మాయిల్ని శారీరకంగా అబ్బాయిలుగా మార్చే ఆధునిక శస్త్రచికిత్సల గురించి కూడా ఈ ప్రోగ్రామ్‌లో చూపించబోతోంది. ముందైతే ట్రయిలర్ చూడండి. భలే ఉంది. వెడలామ్ : టీజర్ నిడివి : 45 సె. హిట్స్ : 31,19,402 అజిత్, శృతిహాసన్ నటించిన తమిళ చిత్రం ‘వెడలాం’ ట్రైలర్ హిట్స్ అంతకంతకూ పెరిగిపోతున్నాయి! శివ డెరైక్ట్ చేసిన ఈ చిత్రానికి మ్యూజిక్ అనిరుథ్ రవిచందర్. ఇద్దరి కాంబినేషన్‌కు చిన్న శాంపిల్‌లా ఉంది ఈ టీజర్. నిర్మాత ఎ.ఎం. రత్నం. ప్రస్తుతానికైతే నవంబర్ 11న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. టీజర్లో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో, అజిత్ ఒక రాక్షసుడిలా కనిపిస్తాడు. యూట్యూబ్ హిట్స్‌లో ఈ టీజర్... టేలర్ స్విఫ్ట్ ‘బ్యాడ్ బ్లడ్’ రికార్డును బ్రేక్ చేసింది. అప్లోడ్ చేసిన తొలి గంటలోనే ‘వెడలాం’కు 50 వేల లైకులు వచ్చాయి. హెయిల్, సీజర్ : ట్రైలర్ నిడివి : 2 ని. 32 సె. హిట్స్ : 25,46,726 నాలుగుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కోయెన్ బ్రదర్స్ స్క్రిప్టు రాసి, డెరైక్ట్ చేస్తున్న ఆల్‌స్టార్ కామెడీ మూవీ ‘హెయిల్, సీజర్’. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న విడుదలవుతోంది. 1950ల నాటి హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ మేనేజర్ కథ ఇది. కంపెనీ ప్రతిష్టను కాపాడడం, ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సినీ తారలను వివాదాలకు దూరంగా ఉంచడం అతడి పని. ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్న ‘హెయిల్ సీజర్, ఎ టేల్ ఆఫ్ క్రైస్ట్స్ లైఫ్’ నటుడు బైర్డ్ వైట్లాక్ కిడ్నాప్ అవుతాడు. తర్వాత ఏం జరుగుతుందన్నదే ఈ చిత్రం. ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. మటర్ గస్తీ : వీడియో సాంగ్ నిడివి : 2 ని. 29 సె. హిట్స్ : 17,22,587 బాలీవుడ్ మూవీ ‘తమాషా’లోని వీడియో సాంగ్ ఇది. మూడు రోజుల క్రితమే టీ సీరీస్ అప్లోడ్ చేసింది. రణబీర్ కబీర్, దీపికా పడుకోన్ మధ్య సాగే ఈ ఉల్లాస గీతాన్ని మోహిత్ చౌహాన్ ఆలా పించారు. సంగీతం ఎ.ఆర్.రెహమాన్. చిత్రం నవంబర్ 27 న విడుదలవుతోంది. ఈ రొమాంటిక్ డ్రామాను డెరైక్ట్ చేసింది ఇంతియాజ్ అలీ. ఆచారాలు, సంప్రదాయాలు, నిమయాలు, నిబంధనలకు అనుగుణం జీవితాన్ని సాగించాలనుకునే ఒక యువకుడు తనలో తను ఎలా సతమతమవుతుంటాడో ఈ చిత్రం వినోదాత్మకంగా చూపిస్తుంది. సాంగ్ చూడండి. బాగుంది. కలర్ఫుల్గా. ది హంగర్ గేమ్స్ పార్ట్ 2 : ట్రైలర్ నిడివి : 1 ని. 56 సె. హిట్స్ : 18,42,897 గత ఏడాది విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ వార్ ఫిల్మ్ ‘ది హంగర్ గేమ్స్ : మాకింగ్‌జే పార్ట్ 1’కి సీక్వెల్ ఈ పార్ట్ 2. దీని ట్రైలర్ నాలుగు రోజుల క్రితమే విడుదలైంది. చిత్రం విడుదల నవంబర్ 20. సుజాన్ కాలిన్స్ 2010లో రాసిన ‘మాకింగ్‌జే’ నవల ఆధారంగా ఈ సీరీస్ తయారవు తున్నాయి. పార్ట్ 2లో కూడా జెన్నిఫర్ లారెన్స్, జోష్ హచర్సన్ నటిస్తున్నారు డెరైక్టర్ ఫ్రాన్సిస్ లారెన్స్. జెన్నిఫర్, ఆమె బృందం కలసి యుద్ధ పీడిత ప్రాంతమైన పానెమ్లో పౌరులకు విముక్తి కల్పించడం కోసం బయల్దేరతారు. భయంకర మైన పోరాటాలు చేస్తారు. చివరికి విజయం సాధిస్తారు. జస్టిన్ బీబర్ స్నబ్డ్ నిడివి : 1 ని. 8 సె. హిట్స్ : 23,91,885 అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్, నటి రోండా జీన్ రౌజీ... ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన పదహారేళ్ల చెల్లెలు జూన్‌కు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ కాస్మోపాలిటన్ మ్యాగజీన్ ఫంక్షన్లో మాట్లాడిన వీడియో ఇది. జూన్‌ని అవమానించింది ఎవరో తెలుసా? యూత్ పాప్ ఐకన్, కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్! ‘బీబర్‌కి నా చెల్లెలు డై హార్ట్ ఫ్యాన్. కాన్స్ ఫెస్టివల్లో అందరూ వెళ్లి బీబర్‌తో ఫొటోలు దిగుతున్నారు. తనూ అతడితో ఫొటో దిగాలని ఎంతో ఉబలాట పడింది. కానీ బీబర్ ఛాన్స్ ఇవ్వలేదు’ అని రోండా ఆవేదన వ్యక్తం చేశారు. -
బావ నన్ను ఒక్క చాన్స్ అడిగారు
మా బావ అజిత్ ఒక చాన్స్ ఇప్పించమని నన్ను అడిగారు అని ఆయన మరదలు, నటి షాలిని చెల్లెలు షామిలి అన్నారు. అజిత్ ఏమిటీ షామిలిని అవకాశం అడగడం ఏమిటి? కాస్త విడ్డూరంగా ఉంది కదూ! ఆ మతలబు ఏమిటో చూద్దామా. షామిలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం అని అనుకోవడం లేదు. కారణం బాల నటిగానే అబ్బుర పరచిన లిటిల్‌స్టార్ తాజాగా కథానాయకి అవతారమెత్తుతున్న షామిలి. అయితే ఇంతకు ముందే తెలుగులో ఓయ్ అంటూ కథానాయకిగా పలకరించి సుమారు ఐదేళ్ల తరువాత తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో కథానాయకిగా మూడు చిత్రాల్లో నటిస్తూ నటనకు అంకితం అయిన షామిలితో చిన్న భేటీ... ప్ర: కథానాయికిగా తెలుగు చిత్రంలో మెరిసి ఆ తరువాత మాయం అయ్యారే? జ: ఆ మాయం అయిన కాలాన్ని సింగపూర్‌లో విద్యాభ్యాసం కోసం వెచ్చించాను. విస్కామ్ పూర్తి చేసిన తరువాత అదే రంగంలో ఉన్నత విద్యను చదవాలని ఆశించాను. కుటుంబ సభ్యులు ఆశీర్వదించి సింగపూర్ పంపారు. అక్కడ చదువు పూర్తి చేసి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చాను. ప్ర: అంత చదివి మళ్లీ నటనకే వచ్చారే? జ: నేను బాల తారగానే జాతీయ అవార్డును గెలుచుకున్న నటిని. అదే విధంగా అతి పిన్న వయసులోనే ఇన్‌కంటాక్స్ కట్టిన బాల నటిని బహుశ నేనే అనుకుంటా. అప్పట్లో చదువు కోసం నటనకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నా పలు అవకాశాలు వచ్చాయి. చదువు విజ్ఞానానికి నటన ఇష్టానికి అన్నది నా పాలసీ. చదువు పూర్తి అయింది. ఇప్పుడు ఇష్టమైన నటనకు సిద్ధమయ్యాను. ఇకపై ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. నటన..నటన..నటనే ప్ర: మీ కథానాయకులు ధనుష్, విక్రమ్ప్రభులో పోలికలు? జ: అసలు వారిని ఎందుకు పోల్చాలి? వారిద్దరూ కేరీర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. విక్రమ్‌ప్రభు చెల్లెలు నా క్లాస్మేట్. అందువల్ల శివాజీ కుటుంబంతో నాకు కొంచెం సాన్నిహిత్యం ఉంది. ప్ర: ఏ హీరోతో నటించాలని ఆశిస్తున్నారు? జ; నటి అన్న తరువాత ఏ హీరోతో అయినా నటించడానికి సిద్ధం కావాలి. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని అంకితభావంతో నటించడానికి కృషి చేయాలి. ప్ర: అత్యంత అభిమానగణం కలిగిన మీ బావ అజిత్ గురించి? జ: అందరు అభిమానులకు మాదిరిగానే ఆయన నాకు తల నే. మా బావ ఫొటోగ్రఫీ కళ గురించి ఇప్పుడు మీడియా ప్రచారం చేస్తోంది గానీ దీనా చిత్ర షూటింగ్ సమయంలోనే ఆ చిత్ర చాయాగ్రాహకుడు అరవిందన్ ఒక కెమెరాను బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి బావకు ఫొటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది. ఈ మధ్య కూడా మా కుటుంబ సన్నిహితురాలు సుహాసిని అనే 90 ఏళ్ల బామ్మ ఫొటోను అద్భుతంగా తీశారు. ఇటీవలే శ్రుతిహాసన్, అప్పుకుట్టి తదితర సహ నటీనటులను తన కెమెరాలో బంధించారు. అంతెందుకు నేను నటిస్తున్నానన్న విషయం తెలియగానే వచ్చేసి నాకు ఫొటో సెషన్ చేసే అవకాశం ఇవ్వాలని నన్ను అడిగారు. నా లేటెస్ట్ ఫొటో ఆల్బమ్‌లో మా బావ తీసిన ఫొటోలే ఉన్నాయి. ప్ర: చివరి ప్రశ్న గ్లామర్ గురించి? జ: నన్ను చూసి కూడా ఇలాంటి ప్రశ్నా? నా విషయంలో గ్లామర్ చాన్సేలేదు. నాదీ అక్క బాటే. -
మా బావ నన్ను నటించొద్దన్నారు
మా బావ నన్ను నటించొద్దన్నారు. ఇలా చెప్పింది ఎవరో కాదు. ఒక నాడు ముద్దు ముద్దు మాటలతో ముచ్చటైన నటనతో నట కళామతల్లినే మురిపించి, బాల నటిగా జాతీయ అ వార్డు అందుకున్న నేటి అందాల భామ షామిలి. ఇక ఈమె అక్క ఎవరో, బావ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఎస్.. నేటి ప్రముఖ నటుడు శాలిని భర్త అజిత్‌నే. షామిలిని నటించొద్దన్నారట. అయినా కథానాయికి గా నటించడానికి తయారవుతున్న షామిలి దీని గురించి చెబుతూ తాను ఓయ్ అనే ఒకే ఒక్క తెలుగు చిత్రం హీరోయిన్గా నటించాను. ఆ తరువాత ఎందుకు నటించలేదని చాలా మంది అడుగుతున్నారు. కారణం అంటూ పెద్దగా ఏమీ లేదు. నేను బాల్యం నుంచే నటించడం వల్ల పాఠశాల జీవితాన్ని కోల్పోయాను. అందుకే ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాను. ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చాను. ఇప్పటికీ నేను నటించడం మా బావ అజిత్‌కు ఇష్టం లేదు. అయితే నటిస్తానన్న నా ఆసక్తిని తెలపగా ఆయన పచ్చజెండా ఊపడంతో పాటు స్వయంగా ఫొటోసెషన్ ఏర్పాటు చేసి తనే నన్ను ఫొటోలు తీశారు. నాకంతా అక్కా బావే. నా బాగోగులు చూసుకునేది వారే. నా హితవు కోరే బావ ముందు నటించవద్దన్నారు. ఆ తరువాత నా ఇష్టాన్ని గ్రహించి సమ్మతించారు. ప్రస్తుతం తొలిసారిగా తమిళంలో రెండు చిత్రాలను అంగీకరించాను. వాటిలో ఒకటి విక్రమ్‌ప్రభు సరసన వీరశివాజీ చిత్రం కా గా రెండోది ధనుష్‌కు జంటగా నటిస్తున్నాను. వీరశివాజీ పూర్తి వినోదభరిత కథా చిత్రం. నా పాత్రకు ప్రా ముఖ్యత ఉంటుంది. ఇక ధనుష్‌తో నటించే చిత్రం పొలిటికల్ అంశాలతో కూడినథ్రిల్లర్ కథా చిత్రం. ఇం దులోనూ నా పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఎలాంటి పాత్రలు చెయ్యాలనుకుంటున్నార ని అడుగుతున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏదయినా చెయ్యడానికి రెడీ. నేను గ్లామర్‌కు వ్యతిరేకిని కాను. అయితే స్కిన్ ఎక్స్ఫోజ్కు నేను దూరం. -
బాషా-2లో అజిత్?
బాషా. ఇది రజనీకాంత్, దర్శకుడు సురేష్‌కృష్ణ సినీకేరీర్లోనూ మరచిపోలేని చిత్రం. అంతేకాదు తమిళ చిత్రపరిశ్రమలోనే ఒక మైలురాయి. దర్శకుడు సురేష్‌కృష్ణ ఎక్కడికి వెళ్లినా బాషా చిత్రానికి సంబంధించిన ప్రశ్నల నుంచి తప్పికోలేరు. అంతగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఆపాధించి పెట్టిన చిత్రం అది. అలాంటి చిత్రానికి సీక్వెల్ తీయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. అయితే ఇది కత్తి మీద సాము అన్న సంగతి తెలిసిందే. అయినా బాషా-2 రూపొందించాలన్నది సురేష్‌కృష్ణ కోరిక. రజనీ ఓకే అంటే బాషా పార్టు 2 తీస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఆ పట్టుదలతోనే బాషా సీక్వెల్‌కు కథ సిద్ధం చేశారు. ఈ విషయాన్ని మన సూపర్‌స్టార్‌కు తెలిజేశారు కూడా. అయితే బాషా ఒక్కడే మరో బాషాను కలలో కూడా ఊహించుకోలేనని రజనీకాంత్ అన్నారట. దీంతో ప్రత్యామ్నాయ దిశగా దృష్టి సారించిన దర్శకుడు సురేష్‌కృష్ణ. ఆయనకు అజిత్ ఒక్కరే కనిపించారట. అజిత్ ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన బిల్లా చిత్ర రీమేక్‌లో నటించే సాహసంచేసి విజయం సాధించారు. అదీకాకుండా బాషా లాంటి గ్యాంగ్‌స్టర్ పాత్రలకు ప్రస్తుత నటుల్లో ఆయనే గుడ్ ఛాయిస్ అనుకున్నారు. బాషా-2 స్క్రిప్ట్‌ను అజిత్‌కు వినిపించారని, ఆయన నటించడానికి సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అనధికార ప్రచారం జరుగుతోంది. మరి బాషా సీక్వెల్ తెరరూపం దాల్చేదెప్పుడో? అసలు ఈ చిత్రం ఉంటుందో? లేదో? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. -
ప్రేమ... పగ... ప్రతీకారం...
కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఒక పోలీసు అధికారి ఎలా పగ తీర్చుకున్నాడనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘ఎన్నై అరిందాల్’. అజిత్, త్రిష, అనుష్క నాయకా నాయికలుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ సూపర్‌హిట్‌ను ‘ఎంతవాడు గానీ...’ పేరుతో సీనియర్ నిర్మాత ఎ.ఎం రత్నం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి రత్నం మాట్లాడుతూ- ‘‘గౌతమ్ మీనన్ కొత్తశైలిలో తెరకెక్కిం చారు. అజిత్ నటన, అనుష్క త్రిషల గ్లామర్ ప్రధాన ఆకర్షణ. హారిస్ జయరాజ్ చాలా మంచి స్వరాలందించారు. తమిళంలో లాగానే తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. -
అజిత్ ..రజనీలా స్టైలిష్ స్టార్ కాడు
సావుక్కు బయందవన్ దినమ్ దినమ్ సావాన్! కొందరికి జుట్టు నెరుస్తుంది... మనోడికి జుట్టు మెరుస్తుంది... సదరన్ సినిమాలో అతనొక సిల్వర్ లైనింగ్! లైఫ్ చాలా సింపుల్... నో వైనింగ్... నో డైనింగ్!! రిస్కు అజిత్‌కుమార్ ఇంటిపేరు... మంచితనం ఆయన ముద్దుపేరు... రత్నం మాటల్లో చెప్పాలంటే - తన కమ్‌బ్యాక్‌కు అజిత్ పెద్ద కట్నం. ‘నామ వాళనువ్ునా... యార వేణా, యతనపేర వేణా కొల్లలావ్ు’ (మనం బతకాలంటే... ఎవరినైనా, ఎంత మందినైనా చంపచ్చు). ఇది తమిళ సూపర్‌హిట్ ‘బిల్లా’ లోని డైలాగ్. రీల్ లైఫ్‌లో ఈ డైలాగ్‌తో మాస్‌ను ఉర్రూత లూపిన హీరో అజిత్. కానీ, రియల్ లైఫ్‌లో ఆయన క్యారెక్టర్ మాత్రం ఆ పాపులర్ డైలాగ్‌కు పూర్తి విరుద్ధం. మనం బతకడం కాదు... చుట్టూ అంతా బతకాలి, బాగుండాలి. ఇదీ అజిత్ తత్త్వం. అందుకే, అజిత్ గురించి మాట్లాడుకొనే ముందు... నిర్మాత ఏ.ఎం. రత్నం గురించి చెప్పుకోవాలి! ఒకటా... రెండా... బోల్డన్ని కోట్లు పోసి, ‘భారతీయుడు’, ‘జీన్స్’ లాంటి భారీ చిత్రాలు తీసిన నిర్మాత. ఆయన అడగడమే ఆలస్యం... ఏ హీరో అయినా డేట్లివ్వాల్సిందే! నిర్మాతగా రత్నానికున్న క్రేజ్, ఇమేజ్ అలాంటివి. కానీ... అదంతా గతం! ఇప్పుడు రత్నం వాళ్ళెవరికీ గుర్తు లేడు. ఒక్కడికి మాత్రం గుర్తున్నాడు. ఆ ఒక్కడూ - అజిత్. రత్నం లాంటి నిర్మాతను నిలబెడితే, ఇండస్ట్రీకి మంచిదని అజిత్ నమ్మాడు. అజిత్ ఎప్పుడూ అంతే! తను నమ్మిందే చేస్తాడు. అప్పుడెప్పుడో తన ‘కాదల్ కోట్టై’ని తెలుగులో ‘ప్రేమలేఖ’గా అందించిన రత్నాన్ని పిలిచి మరీ డేట్లి చ్చాడు. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు సినిమాలు. నిన్నటి ‘ఆరంబం’... తాజా ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గానీ’గా రానుంది) సూపర్‌హిట్. ఇప్పుడు మూడోది మొదలైంది. రత్నం పుంజుకున్నాడు. వైభవం మళ్ళీ మొదలైంది. ఇదంతా అజిత్ చలవే! మీకు శ్రీకర్ గుర్తున్నాడా? పోనీ... గొల్లపూడి మారుతీరావు కొడుకు తీసిన ‘ప్రేమ పుస్తకం’ (1993) సినిమా గుర్తుందా? ఆ శ్రీకరే... ఈ అజిత్. హీరోగా అతని ఫస్ట్ ఫిల్మ్ అదే. నిజానికి, హీరో అజిత్ తొలి అడుగులోనే సినిమా కథంత డ్రామా ఉంది. అవకాశమిచ్చిన గొల్లపూడి కొడుకు శ్రీనివాస్ షూటింగ్ మొదలైన తొమ్మిదో రోజే చనిపోయాడు. వైజాగ్ షూటింగ్లో రాకాసి సముద్రపు అల మింగేసింది. శ్రీనివాస్ శవాన్ని శ్మశానం దాకా మోశాడు అజిత్. దుఃఖాన్ని దిగమింగి, కొడుకు ప్రేమించిన వెండితెర పుస్తకాన్ని గొల్లపూడి పూర్తి చేశాడు. అజిత్ హీరో అయ్యాడు. ఆ సినిమా ఆడలేదు. కానీ, అజిత్‌కు తమిళ్ ఛాన్సలొచ్చాయి. రజనీకాంత్, కమలహాసన్‌లను అభిమానించిన అజిత్... వాళ్ళు క్రమంగా స్లో అవుతున్న టైమ్‌లో వచ్చాడు. లిబరలైజేషన్ ఎరాలోని నవతరం ప్రేక్షకుల టైవ్‌ులో వచ్చాడు. విక్రమ్, విజయ్ లాంటి కొత్త నీటితో పైకొచ్చాడు. తెలుగు ఫీల్డ్‌లోకి మళ్ళీ రాలేనంత బిజీ అయ్యాడు. తమ్ముడి భార్య మీద కన్నేసిన అన్న! ఏ హీరో అయినా ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడా? అజిత్ ఒప్పుకున్నాడు. తమ్ముడి పాత్ర తనే! మూగ, చెవిటివాడైన అన్న కూడా తనే! ఎంత కష్టం... ఎంత రిస్కు! కానీ, అజిత్ అదరగొట్టాడు. తెలుగులోనూ డబ్ అయింది. ఇప్పటికీ తెలుగువాళ్ళకు అజిత్ అంటే ‘వాలి’ గుర్తొస్తుంది. యూత్‌ఫుల్, రొమాంటిక్ పాత్రలతో అజిత్ స్టార్టయ్యాడు. యాక్షన్ పాత్రలకు ఎదిగాడు. నెరిసిన జుట్టుతో మెచ్యూర్ పాత్రలకు మారాడు. 44 ఏళ్ళ వయసుకే పాతికేళ్ళ కెరీర్... 55 సినిమాలు. సినిమాను అజిత్ అమితంగా ప్రేమిస్తాడు. డబ్బు పెట్టిన నిర్మాత, తీస్తున్న దర్శకుడూ బాగుండాలని తపిస్తాడు. రిజల్ట్ - గత ఎనిమిదేళ్ళలో 5 హిట్స్ (‘బిల్లా, మంగాత్తా, ఆరంబమ్, వీరమ్, ఎన్నై అరిందాల్’). అజిత్... రజనీకాంత్‌లా స్టైలిష్ స్టార్ కాడు! కమల్‌లా అద్భుతమైన పెర్ఫార్మరూ కాడు! విజయ్, ధనుష్‌లా పచ్చి మాస్ హీరో అసలే కాడు! కానీ, వాళ్ళందరిలో లేనిది ఇతనిలో ఉంది. అదే జనాలకు నచ్చింది. ఎక్స్‌ట్రాలు లేవు... హంగామాలు లేవు... ఇప్పుడతను తమిళ సినిమాకు సెలైంట్ నంబర్‌వన్! ఎన్ని సినిమాలు చేసినా ‘అమర్కళమ్’ అజిత్ లైఫ్‌లో స్పెషల్. (‘అద్భుతం’గా డబ్ అయింది. ఎస్పీబీ గుక్కతిప్పుకోకుండా పాడిన ‘నిత్యం ఏకాంత క్షణమే అడిగా...’ పాట గుర్తుందిగా!) నటి శాలినితో అతను కలసి చేసిన సినిమా అదొక్కటే! మొదట వాళ్ళిద్దరూ కేవలం కో-స్టార్స్... ఆపైన ఫ్రెండ్సయ్యారు. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమైంది. గుడి గంటలు, చర్చి బెల్స్ సాక్షిగా వారిని ఏకం చేసింది. పేరుకు తగ్గట్లే ఆ సినిమా వాళ్ళ లైఫ్‌లో జరిగిన అద్భుతం. అజిత్... నచ్చింది చేస్తాడు... నచ్చినట్లు బతుకుతాడు కేరళ అయ్యర్‌కీ, కలకత్తా సింధీకీ హిందువుగా పుట్టి, క్రిస్టియన్ శాలినిని పెళ్ళి చేసుకోవడం కావచ్చు... ఆరు సిన్మాలుగా జుట్టుకు రంగేయకపోవడం కావచ్చు... కలెక్షన్స్ కోసం సినిమా ప్రమోషన్‌కు తిరగకపోవడం కావచ్చు... యాడ్స్‌లో చేయనని భీష్మించుకోవడం కావచ్చు... చివరకు, ఇంట్లో పనివాళ్ళకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం కావచ్చు... సినిమా ఫీల్డ్‌లో అజిత్ ఒక యునీక్ ఎగ్జాంపుల్! ఆటో మెకానిక్‌గా మొదలై... రేసింగ్‌కి డబ్బు కోసం ఒక గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం చేసి... పత్రికల్లో ప్రకటనలకు మోడల్‌గా మారి... సినిమాల్లో స్థిరపడిన రోజులన్నీ అజిత్‌కు బాగా గుర్తే! ఒకటే జీవితం... దాన్ని అనుకున్న రీతిలో, ఆనందంగా గడపాలి. అది అతని తత్త్వం. ‘సావుక్కు బయందవన్ దినమ్ దినమ్ సావాన్. బయప్పడాదవన్ ఒరు తడవదాన్ సావాన్’ (చావంటే భయమున్నవాడు రోజూ చస్తాడు. భయం లేనివాడు ఒకేసారి చస్తాడు). ఇది అజిత్ సినిమా పంచ్ డైలాగే కాదు. ఆయన లైఫ్ ఫిలాసఫీ కూడా. అందుకే, భయపడకుండా రిస్క్ చేస్తాడు - అది షూటింగ్లో ఫైటైనా! బయట రేసైనా! పద్ధెనిమిదో ఏట నుంచి బైక్, కారు రేసుల్లో దేశ విదేశాల్లో పాల్గొన్న ప్రాణం అజిత్‌ది. ప్రమాదాల పాలయ్యాడు. ఒకటి కాదు... రెండు కాదు... 15 సర్జరీలు... అందులో 5 ఏకంగా వెన్నెముకకే! అయినా ఆగలేదు. ‘బిల్లా’లో డైలాగ్‌లా ‘అయావ్‌ు బ్యాక్’ అన్నాడు. ‘ఫార్ములా 2’ రేస్‌లో పాల్గొన్నాడు. బైకు, కారే కాదు... విమానం నడపాలని అజిత్ ఆశ. ప్రైవేట్ పైలట్ లెసైన్స్ రాలేదు. అజిత్ నిరాశపడి, ఆగిపో కుండా ఏరో- మోడలింగ్ చేశాడు. రెండేళ్ళ క్రితం స్విట్జర్లాండ్‌లో కొన్న కొత్త బి.ఎం.డబ్ల్యు బైక్‌పై పుణే నుంచి చెన్నై దాకా రైడ్ చేశాడు. తనలోని పసితనం కాపాడుకుంటున్నాడు. మరి, ఇప్పుడు అజిత్ ఏం చేస్తున్నాడు? నిన్నటి నుంచి తన 56వ సినిమా (నిర్మాత రత్నం) షూటింగ్లో పాల్గొంటున్నాడు. షూటింగై పోగానే, వరుస హిట్ల విజయగర్వం తలకెక్కించుకోకుండా, హాయిగా ఇంట్లో ఏడేళ్ళ కూతురు అనౌష్కతో, రెండు నెలల చంటిపిల్లాడు ఆద్విక్తో గడుపుతున్నాడు. అజిత్ ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలే! సగటు సినీ హీరోగా క్వాలిఫై అయ్యేంత హైట్ అతనికి లేకపోవచ్చు. కానీ, లైఫ్ ఫిలాసఫీలో అతనిది టవరింగ్ పర్సనాలిటీ! విడ్డూరం ఏమిటంటే - అజిత్ ఫ్యాన్ క్లబ్స్ వద్దం టాడు. అమ్మానాన్నను బాగా చూసుకోండని చెబుతాడు. అవసరంలో ఉన్నవాళ్ళకు అండగా నిలబడమంటాడు. ఎ.ఎం. రత్నానికి అజిత్ చేసింది అదే! అందుకే, చాలా మంది స్టార్స్ ఉండచ్చు. కానీ, అభిమానులు అన్నట్లు ‘అల్టిమేట్ స్టార్’ మాత్రం అజితే! పేరు, ప్రతిష్ఠ, డబ్బు, ఈ స్టార్ స్టేటస్... ఇవాళ ఉంటాయి. మరి, రేపటికి...? అజిత్ ఉంటాడు!! - రెంటాల జయదేవ కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇవాళ తమిళనాట అజిత్ సినిమా వస్తోందంటే, డిస్ట్రిబ్యూటర్లకూ, థియేటర్లకూ పండగే! సినిమా ఎలా ఉన్నా సరే, ఓపెనింగ్స్ అదిరిపోతుంటాయి. ఇంకా చెప్పాలంటే, ఇవాళ రజనీకాంత్ సినిమాల కన్నా ఎక్కువ ఓపెనింగ్స్ అజిత్‌కు వస్తున్నాయని తమిళ సినీ వ్యాపార వర్గాల కథనం. అందుకే, ఫ్యాన్స్ అజిత్‌ను ‘తల’ (నాయకుడనే అర్థంలో ‘తలైవా’కు సంక్షిప్త రూపం), ‘కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్’ అని పిలుస్తుంటారు. తోటి హీరోలతో పోలిస్తే, సంఖ్యాపరంగా అజిత్ హిట్స్ తక్కువే కావచ్చు. కానీ, సినిమా హిట్టయిందీ అంటే... ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసినట్లే! బాక్సాఫీస్ వద్ద ఆ క్రేజు, స్టార్డమ్ అజిత్ సొంతం. తక్కువ హిట్స్‌తో, ఎక్కువ పాపులారిటీ సాధించిన తమిళ హీరో అంటే అజితే! మంచితనం ఎక్కువ ‘‘స్టార్స్‌కు భిన్నంగా అజిత్‌లో సింప్లిసిటీ, మంచితనం ఎక్కువ. ఎందరో నిర్మాతలు వెయిట్ చేస్తున్నా, ఆయనే నన్ను పిలిచి మరీ డేట్లిచ్చారు. యూనిట్లో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, అవసరమైన సాయం చేస్తారు. తమిళనాట యూత్‌కు ఆయనంటే క్రేజ్. ఆయనే తమ రోల్‌మోడల్, ఇన్స్పిరేషన్ అంటారు.’’ - ఎ.ఎం. రత్నం, ప్రముఖ సినీ నిర్మాత -
మళ్లీ దుమ్మురేపుదామా..
నటి తమన్నకిప్పుడు అవకాశాలు కావాలి. అలాగే అర్జెంట్‌గా ఒక విజయం అవసరం. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఒక రౌండ్ కొట్టేసిన ఈ బ్యూటీకి ప్రస్తుతం ఈ మూడు భాషల్లోనూ అవకాశాలు పలచబడ్డాయి. ప్రస్తుతం తమిళంలో ఆర్య సరసన ఒక చిత్రం చేస్తున్నారు. దీంతో కోలీవుడ్‌లో మరో రౌండ్ కొట్టాలని ఆశ పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో అజిత్ తాజా చిత్రానికి రెడీ అవుతుండడం, ఆ చిత్రానికి శివ దర్శకత్వం వహించనుండడంతో తమన్న ఈ చిత్రంపై కన్నేశారు. కారణం ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వీరం వంటి విజయవంతమైన చిత్రం తెరకెక్కడమే. శివ దర్శకత్వంలో తమన్న చిరుతై చిత్రంలో కార్తీ సరసన నటించారు. ఆ చిత్రం విజయం సాధించింది. దీంతో అజిత్ తాజా చిత్రంలో అవకాశం కొట్టేయాలని దర్శకుడు శివకు ఫోన్ చేసి మరోసారి మనం వీరం చిత్రం తరహాలో దుమ్మురేపుదాం అని అడిగారు. అయితే ఆమె ఫోన్ టెక్నిక్ దర్శకుడు శివ వద్ద పని చేయలేదు. ఆమెకు తన నూతన చిత్రంలో అవకాశం కల్పించే విషయం గురించి మాట ఇవ్వలేకపోయారు. కారణం ఈసారి ఇంతకుముందు జతకట్టని కొత్త కథానాయికతో నటించాలని అజిత్ భావించడమే. అందువలన ఈ చిత్రంలో చాన్స్ లేదనే విషయాన్ని దర్శకుడు చల్లగా తమన్నకు చెప్పేశాడు. దీంతో తమన్న చాలా అప్సెట్ అయిందట. అయితే ప్రస్తుతం ఆమె ఆర్యకు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆరంభం చిత్రం తరువాత ఆర్య అజిత్‌కు మంచి ఫ్రెండ్ అయిపోయారు. అజిత్ చిత్రంలో నటించడానికి ఆర్య సిఫార్సును ఉపయోగించుకోవలసిందిగా తమన్న స్నేహితులు చెవిలో ఊదుతున్నారట. అయితే బిరియాని విందుతో కథానాయికలను బుట్టలో వేసుకునే ఆర్యను అజిత్‌కు రికమెండ్ చేయమని ఎలా అడగాలి అని తమన్న సంకోచిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ గురువారం తెరపైకి రానుంది. -
లుక్.. లైక్!
పెద్దగా సినిమాలు లేక ఖాళీగా ఉన్న బ్లాక్ బ్యూటీ ప్రియమణి... తమిళ హీరో అజిత్ వెంట పడుతోంది. బయట కాదు... ట్విట్టర్లో! రాబోయే సినిమాలో అతగాడి ‘లుక్’ విపరీతంగా నచ్చేసిందట. అనుకున్నదే తడవుగా... ‘సినిమా ట్రైలర్ అదిరిపోయింది’ అంటూ ట్వీటేసింది. ఏమనుకుందో ఏమో... వెంటనే ‘ఊప్స్... ఇట్స్ మై మిస్టేక్. ఐ మీన్ అజిత్ లుక్స్ ఆసమ్’ అని సవరించింది. పనిలో పనిగా... చిత్రంలోని హీరోయిన్లు అనుష్క, త్రిషను కూడా పొగిడేసింది. త్రిష ఎప్పుడూ లేనంత గ్లామరస్‌గా ఉందని, అనుష్క బ్యూటిఫుల్ అని ట్వీటేసింది! -
స్టార్ వార్!
తమిళ తంబీలు విజయ్, అజిత్‌ల మధ్య అంతంత మాత్రంగా ఉన్న రిలేషన్‌కు ఓ చిన్న పోస్ట్‌తో మరింత పొగబెట్టాడో తుంటరి. దానికి ఏ సంబంధం లేని దర్శకుడు కేవీ ఆనంద్‌ను రింగ్ మాస్టర్‌ను చేసేసి చేతులు దులుపుకున్నాడు. విషయం సామాజిక సైట్ దాటి... హీరోల అభిమానులకు చేరి... పరిస్థితి చేతులు దాటిపోయిందట. విషయమేమంటే... విజయ్ 60వ సినిమా కేవీ ఆనంద్ చేస్తున్నాడంటూ ఓ పోస్టర్‌ను ఆనంద్ వాల్‌పై పోస్ట్ చేశాడు ఆ తుంటరి. దీంతో నిప్పు రాజుకుంది. దీనిపై ఆనంద్... ‘అది ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టింది. నాకెలాంటి సంబంధం లేదు. దాన్ని వెంటనే డిలీట్ చేశా. ఇద్దరూ నాకు మంచి మిత్రులు’ అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. -
అజిత్‌తో ఇద్దరు రొమాన్స్?
ఇంతకుముందు ఒక హీరోకు ఒకే హీరోయిన్ ఉండేవారు. అయితే ప్రస్తుతం ఒక హీరో ఇద్దరు హీరోయిన్ల ట్రెండ్ నడుస్తోంది. కోలీవుడ్ విషయానికొస్తే కమలహాసన్ విశ్వరూపం చిత్రంలో ఆండ్రియా, పూజాకుమార్లు నటించగా ఆ తరువాత ఈ ఇద్దరు విశ్వరూపం-2, ఉత్తమ విలన్ చిత్రాల్లోనూ వారు కొనసాగుతూ వచ్చారు. ఇక రజనీకాంత్ తాజా చిత్రం లింగాలో అనుష్క, సోనాక్షి సిన్హాలతో డ్యూయెట్లు పాడేశారు. విజయ్ కూడా తాజా చిత్రం మారిషన్‌లో శ్రుతిహాసన్, హన్సికతో రొమాన్స్ చేస్తున్నారు. సూర్య నటిస్తున్న మాస్ చిత్రంలో నయనతార, ఎమిజాక్సన్లుగా హీరోయిన్లుగా చేస్తున్నారు. నటుడు అజిత్ కూడా తానేమీ తక్కువ కాదంటూ ప్రస్తుతం నటిస్తున్న ఎన్నై అరిందాళ్ చిత్రంలో ఏకంగా అనుష్క, త్రిష, పార్వతిమీనన్లతో యువళగీతాలు పాడేశారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అజిత్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం మంచి మాస్ ఎంటర్టైనర్ కథా చిత్రం అట. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వీరం చిత్రం తెరకెక్కి విజయం సాధించిందన్నది గమనార్హం. తాజా చిత్రంలో అజిత్‌తో రొమాన్స్‌కు శ్రుతిహాసన్, సమంత సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. -
అమ్మకు రక్ష.. జననీ సురక్ష
కంగ్టి: గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ విస్తృత చర్యలు చేపట్టిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సీనియర్ రీజినల్ డెరైక్టర్ డాక్టర్ మహేశ్, యూనిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ అజిత్ తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) ఢిల్లీ బృందం మంగళవారం సందర్శించింది. స్థానికంగా అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల గురించి బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోని 18 రాష్ట్రాల్లో సీఆర్ఎం బృందం విస్తృతంగా పర్యటిస్తోందని చెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో తమ పరిశీలన కొనసాగుతోందన్నారు. ఆరోగ్య వైద్య సేవల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదిస్తామని తెలిపారు. మహిళలకు సాధారణ ప్రసవాలు చేయకుండా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు పేదల నుంచి డబ్బులు గుంజుతున్నారని పేర్కొన్నారు. దీన్ని అరికట్టేందుకు జననీ సురక్ష కింద రూపాయి ఖర్చు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సాధారణ ప్రసూతులు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు నమోదవుతున్నాయని తెలిపారు. తెలంగాణాలోని 18 పట్టణాల్లో నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో సీజేరియన్ ఆపరేషన్ చేసే వైద్య నిపుణులు, రక్తనిధి, పరిరక్షణ ఏర్పాట్లు తది తర సర్వవసతులు కల్పించే సరికొత్త ఆస్పత్రిని నారాయణఖేడ్ పట్టణంలో నెల కొల్పి వైద్య సేవలను పటిష్టం చేస్తామన్నారు. శిశువులకు ఒక్క టీకాతో ఐదు రకాలైన రోగాలను నియంత్రించేందుకు త్వరలో ‘పెంటావాలింట్’ టీకా రానుందని పేర్కొన్నారు. సీఆ ర్ఎం బృందం స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ జనార్దన్, ఎస్పీహెచ్ఓ డాక్టర్ గాయత్రీదేవి, మెడికల్ ఆఫీసర్ భాస్కర్, సీహెచ్ఓ గాలన్న, వసంత్‌రావు, ఎంపీహెచ్ఏలు భాస్కర్, చంద్రబాబు, నారాయణరెడ్డి, స్టాఫ్ నర్స్‌లు ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలి... నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సేవలు అందించాలని కేంద్ర వైద్య బృందం ఫైనాన్స్ కన్సల్టెంట్ సభ్యుడు గుప్తా సిబ్బందికి సూచించారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్ సభ్యుడు నరేంద్ర, ఎన్ఆర్హెచ్ఎం మెంబర్ రాజేష్‌తో కలిసి మండల పరిధిలోని రెడ్డిపల్లి పీహెచ్‌సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్థానిక వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నాయని తెలిపారు. పీహెచ్‌సీకి వస్తున్న రోగుల సంఖ్య, అందుబాటులో ఉన్న మం దుల వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సునీల్, స్థానిక డాక్టర్ జ్యోతి, లక్ష్మణ్, రాజయ్య, గంగాధర్ చందర్, ఆరోగ్యమిత్ర రవిగౌడ్ ఉన్నారు. -
మూడో హీరోయిన్ అయితేనేం?
అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని మనం కావాలనుకున్నప్పుడు అవి రావు. నటి పార్వతీమీనన్ వ్యవహారమే ఇందుకు ఒక ఉదాహరణ. ఈ మలయాళ కుట్టి పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య పర్వాలేదనిపించుకుంది. పార్వతిమీనన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇంకేముంది పార్వతికి మరిన్ని అవకాశాలు తలుపుతట్టాయి. అయితే ఆ సమయంలో ఈ కేరళకుట్టి గ్లామర్ పాత్రలు చేయను.. ఈత దుస్తులు ధరించను.. అవకాశాలు లేకపోతే ఇంట్లో కూర్చొంటా.. అంటూ తెగ స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో ఆ అవకాశాలన్నీ తిరుగుముఖం పట్టాయి. చాన్నాళ్ల తరువాత ఆ మధ్య ధనుష్ సరసన మరియాన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. పార్వతిమీనన్తో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. మడికట్టుకు కూర్చొంటే లాభం లేదనుకుందో ఏమో! సొంతంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని అందాలారబోస్తూ ఫొటోలు తీసుకుని వెబ్సైట్ తదితర ఇతర ప్రసార సాధనాల్లో ప్రచారం చేసుకుంది. కొంతవరకు సక్సెస్ అయ్యింది కూడా. నటుడు కమలహాసన్ చిత్రం ఉత్తమవిలన్ చిత్రంలోను, అజిత్ హీరోగా నటిస్తున్న ఎన్నై అరిందాల్ చిత్రంలోను నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఉత్తమ విలన్ చిత్రంలో కమలహాసన్ సరసన పూజాకుమార్, ఆండ్రియాలు నటిస్తునారు. అదే విధంగా ఎన్నై అరిందాల్‌లో అజిత్‌కు జంటగా అనుష్క, త్రిషలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ పార్వతి మీనన్ మూడో హీరోయిన్ పాత్రకే పరిమితమైంది. అయితే కమలహాసన్ అజిత్ లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో మూడో హీరోయిన్గా నటించే అవకాశం రావడం ఆనందమే నంటోంది పార్వతి మీనన్. -
రెట్టింపు ఇస్తే ఓకే
మన కథానాయికల ఆలోచనలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే కొందరు పేరు వచ్చిన తరువాత పారితోషికం పెంచుకునే పనిలోనే ఉంటారు. మరికొందరు మంచి కథా చిత్రం అయితే పారితోషికం విషయంలో పెద్దగా డిమాండ్ చేయరు. నయనతార, కాజల్ అగర్వాల్ లాంటి వారు మొదటికోవకు చెందినవారే. ప్రముఖ హీరో సరసన నటించినా, చిన్న హీరోకు జతగా నటించినా పారితోషికం విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదనే టాక్ ఉంది. తమన్నా వీరికి కొంచెం భిన్నం అనే పేరుంది. మంచి అవకాశం అనుకుంటే పారితోషికం విషయంలో కాస్త పట్టువిడుపునకు ఆస్కారం ఇస్తుందంటారు. అయితే ఈ అమ్మడు తమిళంలో చేసింది చాలా తక్కువ చిత్రాలే. అదే విధంగా పెద్ద హీరోలంటే ఆ మధ్య సూర్యతో అయన్, ఆ తరువాత అజిత్‌తో వీరం చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు విజయం సాధించడం విశేషం. అయితే ఆ తరువాత అమ్మడికి ఇక్కడ అవకాశాలు లేవు. ఆ మధ్య బాలీవుడ్ రంగ ప్రవేశం కూడా చేశారు. తొలి చిత్రం హిమ్మత్వాలా, మలి చిత్రం హమ్షకర్స్ రెండూ నిరాశనే మిగిల్చాయి. దీంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ హిందీలో నటించిన మూడో చిత్రం ఎంటర్టైన్మెంట్ చిత్రం పర్వాలేదనిపించుకుని తమన్నలో కాస్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఈ జాణ ప్రవర్తనలో మార్పు వచ్చిందట. అధిక పారితోషికం డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారట. వీరం తరువాత కోలీవుడ్‌లో అవకాశాల్లేని తమన్నాకు అంతకుముందు పైయ్యా చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లింగుస్వామి తాజాగా శివకార్తికేయన్‌తో నిర్మించనున్న రజని మురుగన్ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం కల్పించారు. తమన్న కూడా వెంటనే నటించడానికి అంగీకరించారు. అయితే హిందీ చిత్రం ఎంటర్టైన్మెంట్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో, ముందు ఒప్పుకున్న పారితోషికానికి రెట్టింపు కావాలని డిమాండ్ చేస్తోందట. దీంతో ఈ అమ్మడు కూడా నయనతార, కాజల్ బాటలోనే పయనిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే దర్శకుడు లింగుస్వామి తరపు నుంచి మాత్రం తమన్నాతో ఇప్పటికీ పారితోషికం విషయంలో చర్చలు జరుపుతున్నారని సమాచారం. తమ బడ్జెట్‌కు తగ్గట్టు పారితోషికానికి అంగీకరిస్తే తమన్నా ఉంటుంది లేదంటే మరో నాయికను ఎంపిక చేస్తా అంటున్నారు దర్శకుడు లింగుస్వామి వర్గం. -
అజిత్‌తో రొమాన్స్ చేయాలని!
సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత కోలీవుడ్‌లో హీరోయిన్లు ఎక్కువగా నటించాలని కోరుకునేది అజిత్ సరసనే అంటారు. ఇప్పుడు సరిగ్గా నటి హన్సిక అలాంటి ఆశనే వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్యూటీ ఆర్య, ధనుష్, కార్తీ, జీవా, జయం రవి వంటి యువ హీరోలతో పాటు ఇళయదళపతి విజయ్, సూర్య లాంటి స్టార్స్‌తో కూడా జతకట్టారు. అజిత్ సరసన మాత్రం నటించే అవకాశం ఇంకా రాలేదు. అజిత్ ఆరంభం చిత్రంలో నటించినా ఆయనకు జంటగా నటించలేదు. దీంతో ఆమె అజిత్‌తో రొమాన్స్ చే యాలనే కోరికను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి హన్సిక మాట్లాడుతూ తాను అజిత్ వీరాభిమానినన్నారు. ఆయనతో ఒక చిత్రంలో అ యినా నటించాలన్నది తన స్వప్నమన్నా రు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నంలోఉన్నట్టు తెలిపారు. -
లక్కీ హీరోయిన్
నటి త్రిష లక్కీ హీరోయిన్. ఈమెకు మూడు పదుల వయసు మీద పడినా, నటిగా దశాబ్దం దాటినా నేటి కీ హీరోయిన్గా ఒక బలమైన స్థానంలో కొనసాగుతుండడం విశేషమే. కొత్తనీరు రాక, పాత నీరు పోక సర్వసాధారణం అంటారు. అయితే ఎందరో యువ నటీమణులు కొత్త కొత్త అందాలతో విజృంభిస్తున్నా వారికి దీటుగా త్రిష తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతేకాదు నటిగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. తమిళం, తెలుగు భాషల్లో నేటికీ ఒక చిత్రం తరువాత మరొక చిత్రం చేస్తూ గ్యాప్ అనే పదానికి తావు లేకుండా హీరోయిన్గా తన పయనాన్ని అప్రతిహతంగా సాగిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే తాజాగా శాండిల్‌వుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో అజిత్ లాంటి స్టార్ హీరో సరసన టాలీవుడ్లో లెజెండ్ నటుడు బాలకృష్ణకు జంటగా రొమాన్స్ చేస్తున్న త్రిష శాండిల్‌వుడ్‌లో టాప్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌తో నటిస్తున్నారు. ఈ లక్కీ హీరోయిన్ మాట్లాడుతూ నటిగా పదేళ్లు దాటినా ఇటు టాప్స్టార్స్తోను, అటు యువ హీరోల సరసన నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కన్నడ చిత్ర రంగ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ ఇన్నేళ్ల తరువాత కన్నడ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అది పునీత్ రాజ్‌కుమార్ సరసన నటించడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఆయనకు జంటగా పవర్ చిత్రంలో నటిస్తున్నానని ఈ చిత్రం శాండిల్ వుడ్లో మంచి ఎంట్రీనిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవర్ చిత్ర షూటింగ్లో పునీత్ రాజ్‌కుమార్ సహకారం మరువలేనన్నారు. ఇంతకుముందు కన్నడ చిత్రాల్లో ఎందుకు నటించలేదని అడుగుతున్నారని అయితే అలాంటి మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని వివరించారు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యం ఉంటుందని అయినా తానింతకాలం హీరోయిన్గా రాణిస్తుండడం తన అదృష్టం అని త్రిష పేర్కొన్నారు. -
ఆ హీరో కొత్త అవతారం ఎత్తినట్లు ఉంది!
తమ కిష్టమైన హీరో ఎవరన్న ప్రశ్నకు బదులివ్వడానికి చాలామంది హీరోయిన్లు దాటవేత ధోరణి అవలంభిస్తారు. నటి త్రిష మాత్రం నిస్సంకోచంగా నచ్చిన హీరో అజిత్ అంటూ ఠకీమని చెప్పేస్తారు. అజిత్ అంటే ఈమెకంత అభిమానం. ఇప్పటికే ముచ్చటగా మూడుసార్లు తన అభిమాన హీరోతో జత కట్టిన త్రిష నాలుగోసారి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రొమాన్స్ చేస్తున్నారు. మరో హీరోయిన్గా అనుష్క నటిస్తున్న ఈ చిత్రం అజిత్‌కు 55వ చిత్రం కావడం విశేషం. త్రిష నటించిన చిత్రాలేవీ 2014లో ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. జయం రవి సరసన నటించిన భూలోకం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అజిత్‌కు జంటగా నటిస్తున్న తాజా చిత్రం కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అజిత్ సరసన నటించడం గురించి ఈ చెన్నై చిన్నది చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. తన ఫేవరెట్ దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకుడు కావడం, ఈ ముద్దుగుమ్మ సంతోషానికి మరోకారణం. ఇంతకు ముందు విన్నై తాండి వరువాయా చిత్రంలో త్రిష పోషించిన జెస్సీ పాత్రను ఆమె ఎప్పటికీ మరచిపోలేదు. అందుకే త్రిష గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడం మంచి అనుభవంగా భావిస్తుంటారు. తాజాగా అజిత్ సరసన నటిస్తున్న చిత్రం గురించి మాట్లాడుతూ ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. అయితే అజిత్‌తో తాను నటించే సన్నివేశాలన్నీ చాలా రొమాంటిక్‌గా ఉంటాయని చెప్పారు. తాను అజిత్‌తో నటిస్తున్న నాలుగో చిత్రం ఇదన్నారు. ఈ చిత్రంలో అజిత్ ఆహార్యం, అభినయం చాలా కొత్తగా ఉంటాయన్నారు. చాలాకాలం క్రితం కిరీటం చిత్రంలో అజిత్‌తో తొలిసారిగా నటించానన్నారు. ఆ సమయంలో ఆయన అన్నీ మాస్ కమర్షియల్ చిత్రాలు చేశారని ప్రస్తుతం ఆయన్ని చూస్తుంటే కొత్త అవతారం ఎత్తినట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను అజిత్‌తో డ్యూయెట్ పాడుతున్నానని త్రిష చెప్పారు. -
నాయికగా ఎన్నాళ్లని?
ఏ రంగంలో అయినా మార్పు అనేది సహజం. సినీ రంగం అందుకు అతీతం కాదు. నటీనటులు కూడా పరిస్థితులకనుగుణంగా తమను తాము మార్చుకుంటూ వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ పరిపక్వతతో కూడిన నటనతో ముందుకు పయనించాలి. హీరోల్లో సకలకళావల్లభుడు కమలహాసన్ ఇలాంటి భావాన్నే వ్యక్తం చేశారు. మరో నటుడు అజిత్ కూడా 41 వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఇమేజ్ అనే చట్రం నుంచి బయటకొచ్చి వైవిధ్యభరిత పాత్రలతో విజయపథంలో కొనసాగుతున్నారు. ఇక హీరోయిన్లలో నటి శ్రీయ ఇదే పంథాను అవలంభించాలనుకుంటున్నారు. శ్రీయ మంచి నటి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె నవ నటుల నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ స్థాయి హీరోలతో జతకట్టారు. అయితే నాయికగా దశాబ్దాన్ని దాటారు. ఇంకా హీరోయిన్‌గానే కొనసాగాలని కొంత కాలంగా బింకం చూపినా ప్రస్తుతం ఆ ఆలోచనల నుంచి బయటపడ్డారు. ఫలితంగా పలు విభిన్న నటనలకు అవకాశం ఉన్న పాత్రలు శ్రీయను వరిస్తున్నాయి. ఆ మధ్య తెలుగులో నాగార్జున సరసన మనం చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా సమంత నటించారన్నది గమనార్హం. అయినా శ్రీయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఓ మైగాడ్ హిందీ చిత్రం రీమేక్ గోపాల గోపాల తెలుగు చిత్రంలో వెంకటేష్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇందులో ఆమె వెంకటేష్ భార్యగా నటిస్తున్నారన్నది గమనార్హం. ఈ సందర్భంగా శ్రీయ తన మనసులోని భావాలను వెల్లడిస్తూ తాను రజనీకాంత్, నాగార్జున లాంటి సీనియర్ నటుల సరసన నటించడం వలన ఈ తరం దర్శకులు కాస్త వయసు పాత్రలనే ఇస్తున్నారన్నారు. అందువలన ఇకపై హీరోయిన్ అనే చట్రం నుంచి బయటపడి అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. -
సినీ రంగంలో బలమైన బంధాలు
ప్రేమ - పెళ్లి. వీటికి మనిషి జీవితంలో దేని ప్రత్యేకత దానిదే. పెళ్లి లేనిదే కుటుంబం లేదు. ప్రేమ లేనిదే జీవితమే లేదు. మధురమైన జీవితానికి పెళ్లి బంధం వేస్తే ప్రేమ పెనవేసుకుంటుంది. ప్రేమ అనేది తొలుత ఆకర్షణతో మొదలయినా ఆ తరువాత అదే జీవిత గమ్యంగా మారుతుంది. ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ దాన్ని పెంచుకుంటూ పోతే వారి జీవిత నౌక ఆనందమయంగా సాగుతుంది. అలాకాకుండా అపార్థాలతో తుంచేసుకుంటే జీవితంలో మిగిలేది వేదనే. ఇది జగమెరిగిన నగ్న సత్యం. అయినా కొందరి జీవితం అపోహలతో కలహాల కాపురంగా మారుతుంది. ఇక్కడ ప్రేమ కీలకంగా మారుతుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న వారు కూడా ఒక్కోసారి విడిపోవాల్సి వస్తుంది. అలాగే పెద్దలు నిశ్చయించిన పెళ్లిళ్లు కలతలు లేకుండా సజావుగా సాగుతున్నాయనలేం. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం కూడా దాంపత్య జీవితంపై పడుతుంది. కారణాలేమయినా కావచ్చు లేదా అంతకు ముందు జరిగిన వదంతులు కావచ్చు. సినీ రంగంలో ఎన్నో విమర్శల మాటు నుంచి పుట్టిన ప్రేమకథలు ఎన్నో ఏళ్లుగా, ఎంతో బలంగా, హాయిగా సాగుతున్నాయి. వాటిలో కొన్ని గాథలు చూద్దాం. అన్యోన్యానికి మారుపేరు అజిత్ - శాలిని దంపతులను అన్యోన్యానికి మారు పేరుగా పేర్కొనవచ్చు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా లవ్ ఎట్ ఫస్ట్ మూవీతోనే అజిత్ - శాలిని జీవితాన్ని కలిసి పంచుకోవాలని భావించారు. అమర్కలం చిత్రం ఘన విజయం సాధించినట్లుగానే వీరి ప్రేమ 2000లో పెళ్లి పీటలెక్కింది. ఆ తరువాత శాలిని సినిమాలకు స్వస్తి పలికి సంసార జీవితమే లక్ష్యంగా అజిత్ అడుగులో అడుగేస్తూ సహధర్మచారిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజిత్‌కు శాలిని అంటే వల్లమానిన ప్రేమ. వీరి గారాల బిడ్డ పేరు అనౌష్క. భార్య శాలిని, కూతురు అనౌష్కనే అజిత్ ప్రపంచం. తన పనేమిటో తాను చేసుకుంటూపోయే అజిత్ జీవిత శైలి ప్రత్యేకం. తనకు సంబంధంలేని విషయాల గురించి అసలు స్పందించరు. సినిమా వేడుకలకు దూరంగా ఉంటారు. చాలా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పవచ్చు. అజిత్, శాలిని అన్యోన్య జీవితానికి 15 వసంతాలు నిదర్శనంగా నిలిచాయి. ప్రేమకు నమ్మకం సూర్య, జ్యోతికల జంట ప్రేమకు పెద్ద నమ్మకం. వీరిద్దరూ కలిసి చాలా చిత్రాల్లో నటించారు. అయితే వీరి ప్రేమకు భీజం పడింది మాత్రం కాక్కకాక్క చిత్రం షూటింగ్ సమయంలోనే. అంతకుముందు వరకు సూర్య వర్ధమాన నటుడు, సీనియర్ నటుడు శివకుమార్ కొడుకనే ఘనత ఉంది. అప్పట్లో జ్యోతిక, సూర్యకు సిఫార్సు చేసేవారనే ప్రచారం కూడా జరిగింది. వీరి మధ్య పరిచయం స్నేహంగా మారి ఆపై ప్రేమగా మొగ్గుతొడిగి 2006లో పెళ్లికి దారి తీసింది. వివాహానంతరం జ్యోతిక నటనకు దూరమయ్యారు. అప్పటికే ఆమె నంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. అలాగే జోకి ఆసక్తి ఉంటే నటించడానికి తాను అడ్డు చెప్పనని సూర్య స్పష్టం చేశారు. జ్యోతిక అంటే సూర్యకు అమితమయిన ప్రేమ. ముద్దుగా జో అని పిలుచుకుంటారు. వీరి ప్రేమానుబంధాల కాలం 8 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదర్శ దంపతుల ప్రేమకు చిహ్నం దియా, దేవ్‌లు. ముచ్చటైన జంట సినీ రంగంలో మరో ముచ్చటైన జంట ప్రసన్న - స్నేహ. తమిళం, తెలుగు భాషల్లో నటిగా స్నేహ చక్కటి పేరు సంపాదించుకున్నారు. ప్రసన్న కూడా తమిళం, మలయాళంలో యువ నటుడిగా గుర్తింపు పొందారు. వీరి ప్రేమాయణం మూడేళ్లకు పైగా సాగింది. అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటిస్తుండగా ప్రసన్న - స్నేహల మధ్య ప్రేమ పుట్టింటారు. 2012 మేలో పెద్దల అనుమతితో వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కింది. ఆ తరువాత స్నేహ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. ఇలా సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, గాయని సైందవిల సుదీర్ఘ ప్రేమ ఫలించి పెళ్లి పీటలెక్కింది. అలాగే గాయని చిన్మయి, నటుడు రహల్ప్రేమ సమీపకాలంలో పరిణయంగా మారింది. నటి సంగీత, గాయకుడు క్రిష్‌లు ప్రేమించి పెళ్లి చేసుకునిహాయిగా జీవిస్తున్నారు. ఇంతకు ముందు తరంలో కూడా ప్రేమతో ఒకటైన సినీ ఆదర్శ దంపతులు చాలా మంది ఉన్నారు. వారి ప్రేమ చాలా బలమైంది, దృఢమైనది. మరపురాని జంట కోలీవుడ్‌లో మరో మరపురాని ప్రేమ జంట మణిరత్నం, సుహాసిని. మణిరత్నం దర్శకుడిగా ఎంత ఖ్యాతి గాంచారో, సుహాసినీ నటిగా అంత పేరు పొందారు. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పక తప్పదు. ఆత్మ విశ్వాసం మెండు. తొలి రోజుల్లో చాయాగ్రహణంలో శిక్షణ పొందిన సుహాసిని ఆ తరువాత హీరోయిన్గా తెరపై వెలిగిపోయారు. అటుపై దర్శకురాలిగా తనలోని కళా తృష్ణను తీర్చుకున్నారు. 1988లోనే దర్శకుడు మణిరత్నం కరమాలను ప్రేమతో చేపట్టారు. వీరి అన్యోన్య దాంపత్యానికి కానుకగా నందన్‌ను చెప్పుకోవచ్చు. నిజమైన ప్రేమ యువ నటుడు ధనుష్, రజనీకాంత్ పెద్దకుమార్తె ఐశ్వర్యల ప్రేమ - పెళ్లి విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళ ప్రేమ గురించి కథలు కథలుగా ప్రచారం చేశారు. నిజంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురిని ప్రేమించడానికి దమ్ముకావాలి. ధనుష్, ఐశ్వర్యల ప్రేమ నిజమైంది కాబట్టి సక్సెస్ య్యింది. 2004లో ఈ ప్రేమ జంట ఒకటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపాలే యాత్ర, లింగాలు. పసి హృదయాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెప్పలేని ప్రేమ. -
టాప్ హీరోల డబుల్ ధమాకా
ఒకే సంవత్సరంలో రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, అజిత్ సినిమాలు రెండేసి విడుదల కావడం విశేషం. ఎప్పుడూ రెండు మూడేళ్లు వ్యవధి తీసుకునే కమల్, రజనీ కూడా ఈ సారి రెండు చిత్రాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కమల్ తప్ప ముగ్గురు హీరోలు ఇప్పటికే ఒక్కో సినిమాను విడుదల చేశారు. ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమ ఒక ప్రత్యేకతను సంతరించుకోనుంది. ప్రస్తుం చిన్న చిత్రాల నిర్మాణం బాగా పెరిగింది. ఇలాంటి సినిమాలే ఇప్పుడు ఎక్కువగా హిట్టవుతున్నాయి. భారీ కమర్షియల్ చిత్రాలను కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. వీటిలో టాప్ స్టార్స్ చిత్రాలకు క్రేజే వేరు. సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమల్‌హాసన్, ఇళయ దళపతి విజయ్, అల్టిమేట్ స్టార్ అజిత్, సూపర్‌హీరో సూర్య లాంటి నటుల చిత్రాలంటే ఇటు చిత్ర పరి శ్రమ, అటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వారి చిత్రాలకు అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. గ్యాప్‌కు కారణం ఇదే అతిశ్ర ద్ధ అనుకోని అనవసరపు జోక్యం అనుకోని ఎవరెలాంటి కామెంట్ చేసినా స్టార్ హీరోలు మాత్రం కథ నుంచి, సహ నటీనటులు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, చాయాగ్రహణం లాంటి విషయాల్లో కూడా తమ ప్రమేయం ఉండేలా చూసుకుంటారు. ఆ మధ్య సూర్య, గౌతమ్ మీనన్ దర్శకత్వం లో నటించే విషయమై కథ సంతృప్తిగా లేదంటూ సుమారు ఏడాదికిపైగా వేచి ఉన్నారు. ఆ తర్వాత కూడా కథ తృప్తి కలగకపోవడంతో తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసి చిత్రం నుంచి డ్రాప్ అయ్యారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. విజయంపై గ్యారెంటీ లేదు అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ చిత్రం హిట్ అవుతుందా అంటే ఈ విషయంలో ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. దాన్ని నిర్ణయించేది ప్రేక్షక దేవుళ్లే. అలాగే హీరోల జోక్యంపై విమర్శించేవారు ఉన్నారు. ఆహ్వానించే వారు ఉన్నారు. ఏదేమైనా చిత్రంలో కొత్త దనం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లేదంటే ఎవరు నటించిన చిత్రం అయినా తిప్పికొడుతున్నారు. డబుల్ ధమాకా అయితే తమ చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, రెండేళ్లకో మూ డేళ్లకో ఏడాదికో ఒక చిత్రంలో నటించే టాప్ హీరోలు ఈ ఏడాది కాస్త స్పీడ్ పెంచడం విశేషం. సూపర్‌స్టార్ రజనీకాంత్, పద్మభూషణ్ కమల్‌హాసన్, విజయ్, అజిత్ వంటి టాప్ హీరోలు నటించిన రెండేసి చిత్రాలు ఈ ఏడాది తెరపైకి రానున్నాయి. రజనీకాంత్ ఎందిరన్ తర్వాత కోచ్చడయాన్/విక్రమసింహకు మూడేళ్లుపైగా పట్టింది. అలాగే కమల్‌హాసన్ విశ్వరూపం చిత్రం అంతకు ముందు చిత్రాలకు మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. అలాంటిది ఈ ఏడాది మే లో రజని కోచ్చడయాన్తో తెరపైకి వచ్చారు. తాజాగా నటిస్తున్న లింగా చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రజని డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో అనుష్క బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకుడు. కమల్‌హాసన్ నటించిన విశ్వరూపం-2 నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. కమల్ స్వీయ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆండ్రియ, పూజకుమారి, పార్వతి హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం కమల్‌హాసన్ తన మిత్రుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమవిలన్ చిత్రం చేస్తున్నారు. ఇందులో కమల్ రెండు వైవిద్యభరిత పాత్రల్ని పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శక నిర్మాత లింగుస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోనే తెరపైకి రానుంది. అలాగే విజయ్ నటించిన జిల్లా చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యింది. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం చేస్తున్నారు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. దీపావళి సందర్భంగా కత్తిని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కత్తి చిత్రంలో ఇళయదళపతి ద్విపాత్రాభినయం చేయ డం విశేషం. ఇలా రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్‌లు ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు వరుసగా ఒకే ఏడాది తెరపైకి రానుండటం మరో విశేషం. అలాగే డబుల్ దమాకాకు రెడీ అవుతున్న మరో స్టార్ హీరో అజిత్. ఈయన నటించిన వీరం ఈ ఏడాది జనవరిలో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది రెండవ భాగంలో టాప్స్టార్లు తమ చిత్రాలతో సందడి చేయడానికి రెడీ అవుతుండటం అభిమానులకు ఆనందమే ఆనందం. -
ఆ ఇద్దరితో చిత్రానికి రెడీ
వృత్తిపరంగా నువ్వా నేనా అని పోటీ పడుతున్న అజిత్, విజయ్ హీరోల కలయికతో చిత్రం తెరకెక్కించడానికి తాను సిద్ధమని ప్రముఖ దర్శక నిర్మాత ఎ.ఆర్.మురుగదాస్ పేర్కొన్నారు. విశేషం ఏమిటంటే ఎ.ఆర్.మురుగదాస్ ఆరంభంలోనే అజిత్‌కు దీనా వంటి సూపర్ హిట్ ఇచ్చారు. ఇక విజయ్‌కి ఇటీవలే తుపాకీ చిత్రంతో గన్‌లాంటి సక్సెస్ ఇచ్చారు. ప్రస్తుతం కత్తి లాంటి విజయాన్నివ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దర్శకుడంటే ఆ ఇద్దరు హీరోలకు గౌరవమే. రాజావిన్ పార్వైయిలే చిత్రంలో విజయ్, అజిత్ కలిసి నటించారు. ఆ తర్వాత సోలో హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో కమల్, రజనీ తర్వాత ఆ స్థాయిలో స్టార్డమ్తో వెలుగొందుతున్నారు. అలాంటి స్టార్స్ కలయికలో చిత్రం రావాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. అలాగే ఈ క్రేజీ కాంబినేషన్లో చిత్రం చెయ్యడానికి పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఆ మధ్య నిర్మాత జె.అన్బళగన్ విజయ్, అజిత్‌తో చిత్రం చెయ్యడానికి రెడీ అంటూ ప్రకటించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కారణాలేమైనా అది జరగలేదు. ప్రస్తుతం అజిత్, విజయ్ ఓకే అంటే వారి కలయికలో చిత్రం చెయ్యడానికి తాను సిద్ధం అంటున్నారు ప్రముఖ దర్శక నిర్మాత ఎ.ఆర్ మురుగదాస్. అంతేకాదు రెండు నెలలు సమయం ఇస్తే వారి కోసం బ్రహ్మాండమైన కథ తయారు చేస్తానని, ఆ ఇద్దర్ని నటింపజేయడం అంత సులభం కాదని పేర్కొన్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోలు కలిసి నటించే ట్రెండ్ కొంతకాలం క్రితం నుంచే కొనసాగుతోంది. టాలీవుడ్‌లోను ఆ ట్రెండ్ మొదలైంది. కోలీవుడ్లోను ఆ పరిస్థితి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
ఈసారైనా కలిసొచ్చేనా
మాజీ ప్రపంచసుందరి పార్వతి ఓమన కుట్టాన్ మరోసారి కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోంది. ఈ బ్యూటీ అజిత్ సరసన బిల్లా-2 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ చిత్రంపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. బిల్లా-2 చిత్రం పార్వతి ఓమన కుట్టాన్ ఆశల్ని అడియాశలు చేసింది. ఆ చిత్ర పరాజయంతో ఆమెకు మరో అవకాశం దరిచేరలేదు. తాజాగా నంబియార్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తోంది. శ్రీకాంత్ హీరోగా నటిస్తూ సొంతంగా తన గోల్డెన్ ప్రైడే పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి సునైనా హీరోయిన్గా నటిస్తోంది. సంతానం హాస్యభూమికను పోషిస్తున్నారు. గణేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పార్వతి ఓమన కుట్టాన్ పాత్ర గురించి దర్శకుడు తెలుపుతూ కాలేజ్గర్ల్గా మంచి యూత్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. పార్వతి ఓమన కుట్టాన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఈ మలయాళ బ్యూటీ బాలీవుడ్‌లోను తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తమిళంలో అనూహ్య విజయాన్ని సాధించిన పిజ్జా చిత్రం హిందీ రీమేక్‌లో పార్వ తి ఓమన కుట్టాన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నటించడం టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అంది. చిత్రం విడుదల కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు పార్వతి ఓమన కుట్టాన్ పేర్కొంది. -
డబుల్ ధమాకా
అదృష్టం నటి అనుష్కను శనిలా వెంటాడుతోంది. శని, పడితే అంత సులభంగా వదలదంటారు. అలాగే ప్రస్తుతం అదృష్టం అనుష్కను తరుముతోంది. సాధారణంగా రెండు భాషల్లో ప్రాచుర్యం పొందిన హీరోయిన్లు తరువాత కాలంలో ఒకే భాషకు పరిమితమవుతుంటారు. అరయితే అనుష్కకు ఇది వర్తించదు. ఎందుకంటే ఈ బ్యూటీ నటించే ప్రతి సినిమా తమిళం, తెలుగు రెండు భాషల్లోను విడుదలవుతుంది. ప్రస్తుతం అనుష్క నటించే చిత్రాలన్నీ అలాంటి భారీ క్రేజీ చిత్రాలే కావడం విశేషం. ఇంతకు ముందు అనుష్క ఏ భాషలో నటించిన చిత్రాలు ఆ భాషకే పరిమితం అయ్యాయి. అయితే అరుంధతి చిత్రం తరువాత పరిస్థితి మారింది. తమిళం, తెలుగు భాషల్లో ఈమె క్రేజీ అనూహ్యంగా పెరిగింది. అనుష్క ఒక్క భాషలో నటించిన చిత్రం కచ్చితంగా మరో భాషలోను విడుదలవుతుంది. ఇక ఇప్పడయితే ఆమె నటిస్తున్న చిత్రాలన్ని ద్విభాషా చిత్రాలే. అలాగే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు కావడం గమనార్హం. అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోపాటు హీరోలతో రొమాన్స్ చేసే చిత్రాల్లోనూ నటిస్తూ ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటుకుంటున్నారు. రుద్రమదేవి అనే హిస్టారికల్ మూవీలో రాణి రుద్రమాదేవిగా తన నట విశ్వరూపం ప్రవర్తిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించనుంది. మరో చరిత్రాత్మక కథా చిత్రం బాహుబలి. ఈ చిత్రంలోను అనుష్క వీరప్రతాపాలను ప్రదర్శించనున్నారు. ఇది కూడా బహుభాషా చిత్రమే. తమిళంలో ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్‌తో తొలిసారి జతకడుతున్న చిత్రం లింగా. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. అనుష్క తొలి సారిగా జతకడుతున్న మరో హీరో అజిత్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో మరో హీరోయిన్గా త్రిష నటించడం గమనార్హం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోను ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఇలా అనుష్క ప్రస్తుతం డబుల్ ధమాకాతో యమా ఖుషీలో ఉన్నారు. ఈనాలుగు చిత్రాల్లో తొలుత రుద్రమాదేవి, ఆ తరువాత రజనీకాంత్ లింగా ఆపై అజిత్, ప్రభాస్ చిత్రాలు వరుసగా తెరపైకి రానున్నట్లు సమాచారం. -
చిన్న చిత్రాలపెద్ద విజయం
ఏ చిత్రానికి అయినా కథే కింగ్ అని ఇటీవల విడుదలైన చిత్రాలు మరోసారి నిరూపించాయి. ప్రేక్షకుల అభిరుచి మారుతుంది. కథ, కథనాల్లో వైవిధ్యం కనబరుస్తూ చిత్రాలను రూపొందిస్తే ప్రేక్షకాదరణ ఉంటుంది. స్టార్స్ చిత్రాలపై ఆసక్తి ఉంటుందన్నది ఎంత నిజమో అలాంటి చిత్రాల్లో కూడా నవ్యత లేకుంటే పక్కన పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడమని ఆడియన్స్ చేతల్లో చెబుతున్నారు. ఈ విషయం క్రియేటర్స్‌కు బాగా అర్థం అయ్యింది. దీంతో చాలా వరకు దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తగా చిత్రాలు నిర్మిస్తున్నారని చెప్పవచ్చు. చిత్ర విజయాల సంఖ్య పెరిగింది ఏదేమైనా ఈ ఏడాది విజయాల సంఖ్య పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పలు చిన్న చిత్రాలు విజయ విహారం చేయడం మంచి పరిణామం. ఈ ఏడాది రెండు స్టార్స్ చిత్రాలతో శుభారంభం అయ్యింది. వాటిలో ఒకటి విజయ్ జిల్లా, రెండోది అజిత్ వీరం చిత్రాలు. జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ రెండు చిత్రాలు భారీ లాభాలనే ఆర్జించి పెట్టాయి. చిన్న చిత్రాల హవా అయితే ఆ తరువాత స్టార్స్ చిత్రాలేవీ తెరపైకి రాకపోవడం విశేషం. రజనీకాంత్ కోచ్చడయాన్, కమలహాసన్ విశ్వరూపం-2 చిత్రాలు ఈ ఏడాది ఆదిలో తెరపైకి వస్తాయని ఆశించినా అలా జరగలేదు. అయితే ఆ చిత్రాలకు బదులు విడుదలైన చిన్న బడ్జెట్ చిత్రాలు మాన్‌కరాటే, నాన్ శిగప్పు మనిదన్, లాంటి చిత్రాలు విజయాలను సొంతం చేసుకున్నాయి. ఎలాంటి స్టార్ వాల్యూ లేని లోబడ్జెట్ చిత్రం గోలీసోడా సాధించిన వసూళ్లు తమిళ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచాయి. ఇక తేగిడి, ఇదు కదిర్వేలన్ కాదల్ వంటి చిన్న చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. -
అజిత్‌తో ముచ్చటగా...
పెళ్లి కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లలో నటి త్రిష ఒకరు. ఈమెకు వరుడిని అన్వేషించే కార్యక్రమాన్ని ఆమె తల్లి వేగవంతం చేసినట్లు సమాచారం. ఇంతకు ముందు డిమాండ్ లేకపోయినా మూడు పదులు వయసు దాటిన త్రిష నేటికీ హీరోయిన్గా తన ఉనికిని చాటుకుంటూనే ఉండడం విశేషం. తాజాగా అజిత్ సరసన రెండవ హీరోయిన్గా నటించడానికి ఈ చెన్నై చిన్నది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విన్నై తాండి వరువాయా చిత్రంలో జెస్సీ పాత్రనిచ్చి మంచి ఇమేజ్ను తెచ్చిపెట్టిన దర్శకుడు గౌతమ్‌మీనన్ మరో సారి ఈ అవకాశం కల్పించారు. ఆరంభం వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆ చిత్ర సమర్పకుడు ఏఎం రత్నం నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో అజిత్ సరసన ఇప్పటికే ఒక హీరోయిన్గా అనుష్క నటిస్తున్నారు. మరో హీరోయిన్గా త్రిష పేరు పరిశీలనలో ఉన్నా అధికారికంగా ప్రకటించలేదు. అజిత్ సరసన నటిస్తున్న విషయాన్ని నటి త్రిష తాజాగా స్పష్టం చేశారు. ఇటీవలే చిత్ర దర్శకుడు గౌతమ్‌మీనన్ త్రిషకు కథ వినిపించారట. ఆమె ఇంకా ఒప్పంద పత్రాలలో సంతకం చేయకపోయినా నటించడానికి అంగీకారం తెలిపారట. చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందంటున్న త్రిష, సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు సరసన నటించే చిత్రం ఆగిపోవడంతో ఆ కాల్షీట్స్ను అజిత్ చిత్రానికి కేటాయించినట్లు తెలిసింది. ఈ చిత్రం కోసం గౌతమ్‌మీనన్ ఇప్పటికే అజిత్, అనుష్కల మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్లో త్రిష పాల్గొననున్నారట. మరో విషయం ఏమిటంటే ఇప్పటికే త్రిష అజిత్‌తో కిరీటం, మంగాత్త చిత్రాల్లో జత కట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఆయనతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. -
పోలీసాఫీసర్‌గా...
తమిళంలో మంచి మాస్ హీరో అయిన అజిత్‌కు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అజిత్ ‘నే వస్తున్నా’ అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో మీరాజాస్మిన్ కథానాయిక. ఎస్. మురళీ రామనాథన్ నిర్మాత. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘అజిత్ శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలో ఉన్న పదకొండు ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తాయి. మణిశర్మ స్వరపరచిన ఆరు పాటలూ వినసొంపుగా ఉంటాయి. అజిత్ యాక్షన్, మీరాజాస్మిన్ అభినయం ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ .వై, సహనిర్మాత: పరిటాల రాంబాబు, దర్శకత్వం: ఎన్. మహరాజన్. -
అజిత్‌తో అధర చుంబనం
హిందీ సినీపరిశ్రమ సంస్కృతి నిదానంగా దక్షిణాదిని కూడా ఆవహించేస్తోంది. ఇక్కడి హీరోయిన్లు కూడా లిప్‌లాక్‌లకు రెడీ అయిపోతున్నారు. శింబుతో నయనతార, బన్నీతో కాజల్, నాగచైతన్యతో సమంత ఇప్పటికే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి అనుష్క కూడా చేరారు. ఇంతకీ అనుష్క అధరాలను చుంబించిన ఆ హీరో ఎవరో తెలుసా? అజిత్. ప్రస్తుతం ఈ జంట గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కథ రీత్యా ఇందులో శృంగారభరితమైన ఓ సన్నివేశం ఉంది. ఆ సీన్‌ని గౌతమ్ చాలా బోల్డ్‌గా తీశారని కోలీవుడ్ సమాచారం. తాను అనుకున్నట్లు ఆ సన్నివేశం రావడానికి గౌతమ్ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారట. యూనిట్ మొత్తాన్నీ బయటకు పంపించేసి, తాను, అజిత్, అనుష్క, కెమెరామేన్ మాత్రమే లొకేషన్లో ఉండి, ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట. ఈ సీన్లో అజిత్, అనుష్క రెచ్చిపోయి నటించారని యూనిట్ సభ్యులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఈ సన్నివేశంలో భాగంగానే వీరిద్దరితో లిప్‌లాక్ కూడా చేయించారట గౌతమ్. ఈ సన్నివేశం సినిమాకు హైలైట్ కానుందని కోలీవుడ్ టాక్. గౌతమ్‌మీనన్- అజిత్ సినిమా అంటే... కచ్చితంగా తెలుగులోకి కూడా అనువాదమవ్వడం ఖాయం. సో... అనుష్క-అజిత్‌ల అధర చుంబనాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా వీక్షిస్తారన్నమాట. -
అవి లిప్‌లాక్ సన్నివేశాలేనా?
కోలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నటుడు అజిత్ మంగాత్తా, ఆరంభం, వీరం చిత్రాల విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. గురువారం పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ స్టార్ హీరో తాజాగా గౌతమ్ మీనన్ దర్శత్వంలో నటిస్తున్నారు. ఆరంభం ఫేమ్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో అజిత్ సరసన అనుష్క హీరోయిన్గా నటిస్తున్నారు. మరో హీరోయిన్గా త్రిష ఓకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తొలుత అజిత్ నటించే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా అజిత్, అనుష్క మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ సన్నివేశాలను మూడు రోజులపాటు యూనిట్‌ను దూరంగా పెట్టి చిత్రీకరించినట్టు సమాచారం. దర్శకుడు హీరో హీరోయిన్ కెమెరామెన్ మినహా ఎవరినీ షూటింగ్ దరిదాపులకు రానియలేదట. ఆ మూడు రోజులు యూనిట్‌కు పనిచేయకుండానే జీతం చెల్లించినట్టు తెలిసింది. ఇంతకీ బేడ్ రూమ్‌లో అంత్యత రహస్యంగా చిత్రీకరించింది అజిత్, అనుష్క మధ్య లిప్‌లాక్ సన్నివేశాలా? అన్న ఆసక్తికరమైన చర్చకు అవకాశం కల్పించారంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
హన్సికపై ఫిర్యాదు
అందాల భామ హన్సికకు కోలీవుడ్‌లో దర్శకుల హీరోయిన్ అనే మంచి పేరుంది. కాల్షీట్స్ టైమ్ కంటే అరగంట ముందే షూటింగ్ స్పాట్లో ఉంటారు. దర్శకుడు చెప్పినట్లు అభినయిస్తారు అనే ప్రసంసలు అందుకున్న హన్సికపై తాజాగా రిమార్క్ పడింది. తన చిత్రానికి కాల్షీట్స్ కేటాయించడం లేదంటూ వాలు చిత్ర నిర్మాత నిక్ ఆర్ట్స్ చక్రవర్తి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు అజిత్ హీరోగా వాలి, తరువాత సిటిజన్ తదితర చిత్రాలను నిక్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు చక్రవర్తి. ఈయన రెండేళ్ల క్రితం శింబు, హన్సిక హీరోహీరోయిన్లుగా వాలు చిత్రాన్ని ప్రారంభించారు. విజయ్ చందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాగా, పాటలు చిత్రీకరణ మినహా చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. లవ్ ఎఫెక్ట్ వాలు చిత్ర షూటింగ్ సమయంలోనే శింబు, హన్సికల మధ్య ప్రేమ మొలకెత్తింది. అయితే వాలు చిత్ర షూటింగ్లో మొదలయిన శింబు, హన్సికల మధ్య ప్రేమ ఆ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే ముగిసింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా హన్సిక కాల్షీట్లు ఇవ్వకుండా ఇదిగో.. అదిగో అంటూ దాటవేస్తూ వస్తుండడంతో వాలు చిత్రానికి చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో వాలు చిత్ర నిర్మాత నిక్స్ ఆర్ట్స్ చక్రవర్తి నిర్మాతల మండలిలో నటి హన్సికపై ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ వాలు చిత్రంలో నటించడానికి గాను నటి హన్సికకు 70 లక్షల పారితోషికం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికే 55 లక్షలు ఆమెకు ఇచ్చినట్లు వెల్లడించారు. పాటల చిత్రీకరణ పూర్తి కాగానే మిగిలిన 15 లక్షలు చెల్లిస్తానని అన్నట్లు చెప్పారు. అయితే హన్సిక కాల్షీట్స్ కేటాయించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. మేలో గానీ జూన్‌లో గానీ కాల్షీట్స్ ఇస్తానని హన్సిక అంటున్నారని అప్పటి వరకు ఆగితే తనకు పెనునష్టం ఏర్పడుతుందని, ఆమెను వెంటనే కాల్షీట్స్ కేటాయించేలా ఆదేశించాలని నిక్స్ ఆర్ట్స్ చక్రవర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు.