వివేకం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
వావ్ అమేజింగ్ తల. ఇది అజిత్‌ను చూసి కోలీవుడ్ అబ్బురపడుతూ ముక్త కంఠంతో అంటున్న మాట. కారణం ఏమిటనేగా మీ ప్రశ్న. నటుడు అజిత్ సిక్స్ ప్యాక్ బాడీని చూసి ఆయన అభిమానులే కాదు, తమిళ చిత్రపరిశ్రమ వర్గాలు ఫిదా అయి పోయారు. ఎస్‌ఈ అల్టిమేట్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రానికి వివేకం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వీరం, వేదాళం చిత్రాల తరువాత అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. కాజల్ అగర్వాల్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటి అక్షరహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత బాణీలు కడుతున్నారు.
సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం వివేకం. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో అజిత్ సిక్స్ ప్యాక్ బాడీతో నిలబడి ఉన్న ఫొటో వావ్ దటీజ్ తల అనిపించేలా చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది. అజిత్ సిక్స్ ప్యాక్ బాడీకి తయారవడాన్ని పలువురు కోలీవుడ్ ప్రముఖుల అచ్చెరువు చెందుతున్నారు. నటుడు లారెన్స్ , శివకార్తికేయన్, విక్రమ్‌ప్రభు, శాంతను, ప్రేమ్‌జీ, నటి పార్వతీమీనన్, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్.తమన్ అమేజింగ్ అంటూ ప్రసంశిస్తున్నారు. అజిత్ సిక్స్‌ప్యాక్ బాడీకి మారడానికి నిత్యం ఐదు గంటలు కసరత్తులు చేశారట. ఆయనకు చెన్నైకి చెందిన యూసబ్ శిక్షకుడిగా వ్యవహరించారు. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. చిత్రాన్ని జూన్ లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.