vivekam
-
వివేకం సినిమాపై ఎన్నికల సంఘం సీరియస్
సాక్షి, తాడేపల్లి : ఎన్నికల సమయంలో రిలీజ్ చేసిన వివేకం చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అడిషనల్ ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో చిత్రీకరించారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వివేకం సినిమా బ్యాన్ చేయాలి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం రాష్ట్రంలో హింసని ప్రేరేపించేలా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో ప్రదర్శించడం, వివేకా బయోపిక్‌కామ్ అనే వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రాన్ని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వివేకం సినిమాను మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యకేసు నేపథ్యంలో నిర్మించారు.అందులో రాజకీయపార్టీకి సంబంధించిన పలు సన్నివేశాల్లో వైఎస్సార్సీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారు. పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ గారి పేరు సహా ఇతర పాత్రలను కూడా అదే పేర్లతో ఉచ్చరించారు. గతంలో ఇలా చేస్తే.. సీఎం జగన్‌తో పాటు పార్టీని కించపరిచేలా ఇష్టారీతిన సీన్లు రూపొందించారు. ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని ఆన్లైన్లో రిలీజ్ చేశారు. నిజానికి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కేసు విచారణలో ఉన్న సమయంలో దాని గురించి సినిమా తీయడమనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం. 2019 ఎన్నికల సమయంలో ఇదే రీతిలో బయోపిక్ ఆఫ్ పీఎం మోది చిత్రం రూపొందిస్తే అప్పట్లో దానిని బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా "వివేకం" చిత్రాన్ని బ్యాన్ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. చదవండి: ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. అవమానం పడ్డ చోటే జెండా పాతాడు -
నచ్చినోడు దొరికితే పెళ్లి చేసుకుంటా: హీరోయిన్
చెన్నై: నచ్చినోడు దొరికితే పెళ్లి చేసుకొని సెటిల్ అయితపోతానంటోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. దక్షిణాదిలోనే పుష్కర కాలాన్ని చాలా సునాయాసంగా దాటేసిన ఆ ఉత్తారాది బ్యూటీ నేటీకి క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా అజిత్‌తో రొమాన్స్ చేసిన వివేకం చిత్రం రికార్డు స్థాయిలో ఆడేస్తోంది. మరో స్టార్ హీరో విజయ్‌కు జంటగా నటించిన మెర్శల్ సినిమా దీపావళికి తెరపైకి రానుంది. ఇక హిందీ చిత్రం క్వీన్ రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా బాలీవుడ్‌లోనూ తన ఉనికిని చాటుకుంటున్న ఈ అమ్మడు వాణిజ్య ప్రకటనలతోనూ సంపాదించేస్తోంది. ఆ మధ్య నేను పక్కా లోకల్ అంటూ ఐటమ్ సాంగ్‌లోనూ నటించి ఆ ముచ్చట తీర్చేసుకుంది. అయితే కాజల్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూద్దాం. అజిత్‌కు జంటగా వివేకం చిత్రంలో నటించిన అనుభవం గురించి? నిజం చెప్పాలంటే నేనింతకు ముందు స్పై థ్రిల్లర్ కథా చిత్రంలో నటించలేదు. అదీ ఇంటర్నేషనల్ స్పై చుట్టూ తిరిగే కథా చిత్రం వివేకం. వివేకం చిత్రంలో నటించే అవకాశం రావడం నాకు లక్కే. అజిత్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన దేవుడికి స్పెషల్ థ్యాంక్స్. అజిత్‌తో కలిసి నటించిన హీరోయిన్లందరూ ఆయన్ని తెగ పొగిడేస్తుంటారు. మీరెలా స్పందిస్తారు? అజిత్‌ను నేనూ పొగిడేస్తాను. ఆయన చాలా కూల్ పర్సన్. మనసు విప్పి మాట్లాడతారు. ఆదే ఆయనలో నాకు నచ్చిన విషయం. షూటింగ్లో సహ నటీనటులను ఎలా గౌరవిస్తారో, చిన్న టెక్నీషియన్‌ను కూడా అంతే గౌరవిస్తారు. నేను కలుసుకున్న మంచి వారిలో అజిత్ ఒకరు. ఇద్దరు లేక ముగ్గురు హీరోయిన్ల చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. మీ పాత్రకు ప్రాధాన్యత తగ్గుతుందన్న భయం లేదా? కథ, అందులో నా పాత్ర ఏమిటన్నది, ఇంకా ఏఏ హీరోయిన్లు నటిస్తున్నారు, అన్న విషయాలను అడిగి తెలుసుకున్న తరువాతే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరిస్తాను. అలాంటప్పుడు భయం ఎందుకు? నాకు నమ్మకం ఉన్న దర్శకుల చిత్రాల్లోనే నటిస్తాను. హీరోయిన్గా పుష్కర కాలంగా రాణిస్తున్నారు. ఎలా ఫీలవుతున్నారు? ఇప్పుడే హీరోయిన్గా ప్రవేశం చేశాననిపిస్తోంది. అంతలోనే పదేళ్లు దాటాయంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమా నాకు చాలానే ఇచ్చింది. ముఖ్యంగా అభిమానుల ప్రేమ. అది వెల కట్టలేనిది.హీరోయిన్గా బాలీవుడ్లో కెరీర్‌ను ప్రారంభించినా, తమిళం, తెలుగు సినీపరిశ్రమలే నాకు జీవితాన్నిచ్చాయి. ఒకవేళ హిందీ చిత్రాలతో బిజీ అయినా, దక్షిణాది నుంచి అవకాశం వస్తే వెంటనే వచ్చి నటిస్తాను. పదేళ్లకు పైగా నటిస్తున్నా, మీపై వదంతులు పెద్దగా ప్రచారం కాలేదే? చిన్న చిన్న అవాస్తవ వందతులు ప్రచారమై ఉండవచ్చుగానీ, పెద్దగా అలాంటివి రాకపోవడానికి నా వ్యవహారశైలినే కారణం. షూటింగ్ ముగియగానే నేరుగా ఇంటికి వెళ్లిపోతాను. పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ బయట తిరగను. నేనిప్పటి వరకూ ఎవరి ప్రేమలోనూ పడలేదు. అందువల్ల నా గురించి తప్పుడు ప్రచారం జరిగే ఆస్కారమే ఉండదు. మీ చెల్లెలు నిషా నటిస్తున్న సమయంలోనే సడన్‌గా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయింది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? నిషా ప్రేమలో పడింది. అదే జీవితం అని భావించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. నాకూ నచ్చినోడు దొరికితే నేనూ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతాను. ప్రస్తుతానికి మాత్రం నా శ్వాస, ప్రాణం సినిమానే. -
మేకింగ్ ఆఫ్ మూవీ - వివేకం
-
'టికెట్ ధరలను నియంత్రించాలి'
సాక్షి, చెన్నై: కొత్త చిత్రాల విడుదల సమయాల్లో థియేటర్ల యాజమాన్యాలు అధిక ధరలకు టిక్కెట్లను విక్రయించడాన్ని నియంత్రించాలని చెంబియత్తు గ్రామానికి చెందిన దేవరాజన్ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్రంలో కొత్త చిత్రాల విడుదల సమయంలో థియేటర్ల యాజమాన్యం తొలి ఐదు రోజులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇది పెద్ద హీరోల చిత్రాలకు మరింత ఎక్కువన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2009లో థియేటర్ల టిక్కెట్ ధరల పట్టికను నిర్ణయించిందని, ఆ ప్రకారం ఏసీ, ఇతర సౌకర్యాలు ఉన్న థియేటర్లలో రూ. 10 నుంచి 120 వరకూ టిక్కెట్ల ధరను, అలాంటి సౌకర్యాలు లేని థియేటర్లలో టికెట్ల ధర రూ.5 నుంచి 50 గా నిర్ణయించిందన్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొత్త చిత్రాల విడుదల సమయాల్లో టిక్కెట్ల ధరలు రూ. 200 నుంచి 300 వరకు ఉంటున్నాయని తెలిపారు. ఈ విధానాన్ని అడ్డుకోవాలని గత 17 నుంచి 22 తేదీ వరకూ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి, ఆదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించ లేదన్నారు. ఇటీవల విడుదలైన వివేకం చిత్రాన్ని చూడడానికి వచ్చే ప్రేక్షకుల నుంచి టిక్కెట్ ధరను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా వసూలు చేస్తున్న థియేటర్ల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా వాటి నుంచి రోజుకు రూ. లక్ష చొప్పున అపరాధరుసుం వసూలు చేయాలన్నారు. అందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రత్యేక కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిష¯ŒS సోమవారం విచారించిన న్యాయమూర్తి ఎం.దురైస్వామి బదులివ్వాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేశారు. -
వివేకం కలెక్షన్స్ : రెండ్రోజుల్లో 66 కోట్లు..!
తలా అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ వివేకం. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకుంది. అజిత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలోనూ అదే స్థాయి చూపిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన వివేకం తొలి రోజు బెనిఫిట్ షోస్ తో కలిపి ఏకంగా 33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గురువారమే రిలీజ్ అయిన ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చింది. రెండో రోజు కూడా భారీ వసూళ్లను సాధించిన వివేకం రెండు రోజుల్లోనే ఏకంగా 66 కోట్ల వసూళ్లను సాధించి రికార్డ్ సృష్టించింది. అంతేకాదు మూడో రోజు కూడా వసూళ్ల హవా కొనసాగించిన ఈ సినిమా శనివారం 15 కోట్ల కలెక్షన్లు సాధించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి 100 కోట్ల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. అజిత్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ శివ దర్శకుడు. 120 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందే 100 కోట్ల బిజినెస్ చేయగా.. లాంగ్ రన్ లో తమిళనాట సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తుందన్న జోష్ లో ఉన్నారు తలా ఫ్యాన్స్. -
వివేకంతో అభిమానులు ఖుషీ
తమిళసినిమా: అజిత్ అభిమానులు ఎంతగానో ఎదరుచూసిన వివేకం చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఇది అజిత్ 57వ చిత్రం మాత్రమే కాదు, ఆయనకు నటుడిగా 25వ వసంతంలోకి అడుగుపెట్టిన చిత్రం కూడా కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటుడు కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ కీలక పాత్రలోనూ నటించిన ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఓబరాయ్ ప్రతినాయకుడిగా నటించారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. అనిరుధ్ సంగీత బాణీలు లందించారు.అజిత్ ఇంటర్‌పోల్ అధికారిగా నటించిన ఈ చిత్రం హై స్టాండర్డ్‌లో రూపొందింది. చిత్ర ఆధ్యంతం ఉత్కంఠభరితంగా శరవేగంగా సాగుతుంది. మన దేశాన్ని అను ఆయుధాల ద్వారా భూకంపాలు వచ్చేలా చీకటి అరాచక శక్తుల కుట్రను కథానాయకుడు అజిత్ ఎలా ఛేదించారన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం వివేకం. ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు అజిత్ సహా చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. చిత్రం హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉందంటూ ప్రశంసిస్తున్నారు. కమలహాసన్ అభినందనలు నటుడు కమలహాసన్ తన కూతురు అక్షరహాసన్‌తో కలిసి గురువారం వివేకం చిత్రాన్ని చూశారు. చిత్రం ప్రదర్శన సమయంలోనే ఆయన తాను తన కూతురు అక్షరతో కలిసి వివేకం చిత్రం చూస్తున్నాను. చిత్రం గురించి మంచి రిపోర్ట్ వస్తోంది. అజిత్ సహా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. అభిమానుల హంగామా ఇక అజిత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వివేకం చిత్రాన్ని గురువారం వేకువజాము నుంచే చాలా థియేటర్లలో ప్రదర్శించారు. అభిమానులు అజిత్ ఫొటోలతో కూడిన భారీ కటౌట్లను థియేటర్ల ముందు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కటౌట్లకు పాలాభిషేకాలు, ఆలయాల్లో పూజలు అంటూ హంగామా సృష్టించారు. -
'వివేకం' మూవీ రివ్యూ
టైటిల్ : వివేకం జానర్ : స్పై థ్రిల్లర్ తారాగణం : అజిత్ కుమార్, వివేక్ ఒబరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ సంగీతం : అనిరుధ్ దర్శకత్వం : శివ నిర్మాత : సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వివేకం. వీరం, వేదలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించిన అజిత్, శివ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో తమిళ నాట ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో తెలుగు నాట కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది.? చాలా కాలంగా తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టిన అజిత్ అనుకున్నది సాధించాడా.? దరువు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన శివ, వివేకంతో మెప్పించాడా..? కథ : అజయ్ కుమార్ (అజిత్ కుమార్) కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తుంటాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి 279 మిషన్ లను సమర్థవంతంగా పూర్తి చేసిన అజయ్, 280వ మిషన్ లో ఉండగా అదృశ్యమవుతాడు. కొంత కాలం తరువాత భారీ వినాశనానికి ప్రయత్నించిన ఓ అంతర్జాతీయ మూఠా ను మట్టుబెట్టిన సమయంలో అజయ్ ఉనికి వెలుగులోకి వస్తుంది. దీంతో ఎలర్ట్ అయిన కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అజయ్ కోసం వెతకటం ప్రారంభిస్తుంది. అందుకోసం అజయ్ స్నేహితుల సాయం తీసుకుంటుంది. తన భార్యతో కలిసి ఓ హోటల్ నడుపుతున్న ప్రశాంతంగా జీవిస్తున్న అజయ్.. సీక్రెట్ గా తన మిషన్ ను కొనసాగిస్తుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా కృతిమ భూకంపాలను సృష్టించి భారీ ప్రాణ ఆస్తి నష్టాలను సృష్టించేందుకు అంతర్జాతీయ తీవ్రవాదులు ప్లాన్ చేస్తారు. అందుకోసం ప్లుటోనియం ఆయుధాలను శాటిలైట్ సాయంతో పేల్చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఈ ఆయుదాలను పేల్చాలనుకుంటుంది ఎవరు..? ఆ ప్రయత్నాలను అజయ్ కుమార్ ఎలా అడ్డుకున్నాడు..? అసలు అజయ్ రహస్య జీవితం ఎందుకు గడుపుతున్నాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాలో నటించిన అజిత్, సినిమా అంతా తన భుజాల మీదే మోశాడు. యాక్షన్, ఎమోషన్, స్టైల్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ను సమపాళ్లలో అందించి అభిమానులను అలరించాడు. యాక్షన్ సీక్వన్స్ లలో అజిత్ పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. హీరోయిన్ గా కాజల్ ఆకట్టుకుంది. గ్లామర్ షోకు ఏ మాత్రం చాన్స్ లేని హుందా పాత్రలో తనదైన నటనతో అలరించింది. కీలక పాత్రలో కనిపించిన అక్షర హాసన్, తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా.. గుర్తుండిపోయే పాత్రలో తనని తానూ ప్రూవ్ చేసుకుంది. విలన్ గా వివేక్ ఒబరాయ్ మరోసారి ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో క్రిష్ 3 సినిమాలోని వివేక్ నటన గుర్తుకు వస్తుంది. మిగిలిన పాత్రలేవి చెప్పుకొదగ్గ స్థాయిలో తెర మీద కనిపించవు. సాంకేతిక నిపుణులు : ఓ అంతర్జాతీయ స్థాయి కథను తమిళ సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేసిన దర్శకుడు శివ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. సినిమా అంతా హాలీవుడ్ స్థాయిలో రూపొందించే ప్రయత్నం చేసిన శివ సక్సెస్ అయినా... లోకల్ ఆడియన్స్ ను మెప్పించటంలో తడబడ్డాడు. అజిత్ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ మసాలా ఎలిమెంట్స్ ఏవీ సినిమాలో లేకపోవటం నిరాశపరుస్తుంది. పూర్తిగా హాలీవుడ్ తరహా కథ కథానాలతో సాగటంతో యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చినా.. సాధారణ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందన్నది అనుమానమే. ఏ మాత్రం లాజిక్ లేకుండా సాగిన కథా కథనాలు కూడా కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచింది. ముఖ్యంగా చేజింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో అనిరుథ్ మ్యూజిక్ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. వెట్రీ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. సత్య జ్యోతి ఫిలింస్ నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయి సినిమాను దక్షిణాది ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చాయి. ప్లస్ పాయింట్స్ : అజిత్ నటన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్రాండ్ విజువల్స్ యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : లాజిక్ లేని సీన్స్ పాటలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అజిత్ 'వివేకం': మరో బ్లాక్‌బస్టర్ హిట్టా?
సూపర్‌స్టార్ అజిత్ తాజా సినిమా 'వివేకం' (తమిళంలో వివేగం).. తొలిరోజే సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు తమిళనాడులో ఒకేసారి గురువారం విడుదలైన ఈ సినిమాకు ఎర్లీ రిపోర్ట్స్ పాజిటివ్‌గా అందుతున్నాయి. మార్నింగ్ షోస్ చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు, 'తల' ఫ్యాన్స్ ఈ సినిమా సూపర్‌గా ఉందని అంటున్నారు. 'వివేకం' సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉందని, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని, మాస్ ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమా ఉందని ట్విట్టర్లో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు శివ మరోసారి తన మ్యాజిక్‌ను తెరపై ఆవిష్కరించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో శివ-అజిత్ కాంబినేషన్లో వీరం, వేదాలం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు కనిపిస్తోంది. 'వివేకం'లో అద్భుతమైన నటన కనబర్చిన అజిత్‌కు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అజిత్ సరసన నాయకిగా కాజల్ అగర్వాల్ నటించగా.. మరో కీలక పాత్రలో కమలహసన్ రెండో కూతురు అక్షరహాసన్ నటించింది. విలన్‌గా వివేక్ ఒబరాయ్ కనిపించాడు. #vivegam good movie with never seen action sequence in Tamil. Most of the reviewers are VJ fans so just go and enjoy this movie. — Find me here (@tweet2sarva) 24 August 2017 ONE WORD ...NEVER EVER SEEN STUNTS IN TAMIL CINEMA . GOOD EMOTIONAL CONNECT . MUST WATCH #VIVEGAM — amalas francis (@heartrobberamal) 24 August 2017 #VivegamFDFS No words after watching d movie.#Ajith sir nailed it. Totally its a super hit film#Vivegamreview #Vivegam #VivegamFromToday — Nivetha Thomas (@INivethaThomas) 24 August 2017 This Not #Tamilnaadu This Is #Khammam #ThalaAjith Mass -
బాహుబలి, కబాలిల కన్నా ఎక్కువగా..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వివేకం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అజిత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అజిత్ హీరోగా వీరం, వేదలం లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించిన శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ చిత్రం కూడా గ్యారెంటీ హిట్ అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి. సినిమా రిలీజ్ విషయంలో కూడా సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తున్నాడు అజిత్. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిరోజు చెన్నైలో భారీ సంఖ్యంలో షోలు పడేలా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి, కబాలి చిత్రాల కన్నా ఎక్కువ షోన్ ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు వివేకం టీం. చెన్నైలోని ఒక్క మాయాజాల్ మల్టీప్లెక్స్ లోనే తొలి రోజు 65 షోలు వేస్తున్నారు. కేరళలోనూ అదే స్థాయిలో రిలీజ్ అవుతోంది. మరే పరభాషా హీరో సినిమా రిలీజ్ చేయని విధంగా కేరళలో తొలి రోజు వివేకం సినిమాను 300 థియేటర్లలో 1000 షోస్ వేసేందుకు రెడీ అవుతున్నారట. కర్నాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు వివేకం యూనిట్. -
మళ్లీ వైఫ్‌గా...
నుదుట కుంకుమ బొట్టు... మెడలో తాళిబొట్టు... హుందాగా చీరకట్టు... కొత్తగా కనిపిస్తూ కాజల్ అగర్వాల్ కనికట్టు చేస్తారట. ఎందులోనంటే... అజిత్ ‘వివేకం’లో. రీసెంట్గా రిలీజైన ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరో వైఫ్ క్యారెక్టర్లో కనిపించిన కాజల్, ఈ సినిమాలోనూ హీరో వైఫ్‌గా కనిపించనున్నారు. అయితే... రెండు క్యారెక్టర్స్ మధ్య చాలా డిఫరెన్స్ ఉందట! ‘‘కళలను అభిమానించే వ్యక్తిగా, ‘వివేకం’లో టిపికల్ సౌతిండియన్‌గా నటించా. నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్’’ అన్నారు కాజల్. ఇందులో ఒకటి, రెండు పాటల్లో తప్పితే... సినిమా అంతా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజులు, ట్రెడిషనల్ శారీల్లో కాజల్ కనిపిస్తారట. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో యాక్షన్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ముఖ్యంగా అజిత్ మేకోవర్, స్టైల్‌కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో ఆయన సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు హ్యూమన్ ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు కాజల్. తమిళంలో ‘వివేగం’గా రూపొందిన ఈ సిన్మాను వంశధార క్రియేషన్స్ పతాకంపై నిర్మాత నవీన్ శొంటినేని (నాని) తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా, అక్షరా హాసన్ ముఖ్యతారగా నటించిన ఈ సినిమాకు శివ దర్శకుడు. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. -
ఆమె నటన చూసి కమల్ గర్వపడతారు
తమిళసినిమా: వివేకం చిత్రంలో ఆ చిత్ర కథానాయకుడు అజిత్ అసాధారణ నటనను చూస్తారని బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్‌ఓబరాయ్ పేర్కొన్నారు. అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వివేకం. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శివ దర్శకుడు. నటి కాజల్‌అగర్వాల్ నాయకిగా, నటుడు కమలహసన్ రెండో కూతురు అక్షరహాసన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఓబరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో ఈయన ప్రతినాయకుడిగా నటించినట్లు ప్రచారంలో ఉంది. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. వివేకం చిత్ర ప్రమోషన్లో భాగం చెన్నైకి వచ్చిన వివేక్‌ఓబరాయ్ శనివారం సాయంత్రం విలేకరులతో ముచ్చటించారు. ప్ర: వివేకం చిత్రంలో నటించడానికి కారణం? జ: ఒక రోజు దర్శకుడు శివ నన్ను కలిసి వివేకం చిత్ర కథ వినిపించారు. వెంటనే నటించడానికి ఓకే చెప్పేశాను. ఆయన వివేకం చిత్ర కథను నెరేట్ చేసిన విధం నాకు చాలా నచ్చింది. కథ, నా పాత్ర బాగుండడంతో నటించడానికి అంగీకరించాను. ప్ర : నటుడు అజిత్ గురించి? జ: అజిత్ నాకు మంచి మిత్రుడు. ఆయనతో ఈ చిత్ర జర్నీ మంచి అ నుభూతినిచ్చింది. వివేకం చిత్రం అంతర్జాతీయ స్థాయి కథా చిత్రం. ఇందులో మిషన్‌లో మేమిద్దరం కలిసి పని చేశాం. బల్గేరియాలో జీరో డిగ్రీల శీతల ఉష్ణంలో బేర్ బాడీతో ఆయన చేసిన సాహసాలు అబ్బు ర పరుస్తాయి. ఇక వివేకం చిత్రం గురించి చెప్పడానికి మాటలు చాలవు. దర్శకుడు శివ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ప్ర: నటి కాజల్‌అగర్వాల్ నటన గురించి? జ: నిజం చెప్పాలంటే కాజల్ అగర్వాల్ నటనను చూసి ఆశ్చర్యపోయాను. వివేకం చిత్రంలో ఆమె నటన అబ్బురపరచింది. ప్ర: నటి అక్షరహాసన్ నటన గురించి జ: అక్షరహాసన్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఆమె పాత్ర వివేకం చిత్రానికి చాలా కీలకంగా ఉంటుంది. చాలా మంచి నటి. ఈ చిత్రంలో అక్షరహాసన్ నటనను చూసి ఆమె తండ్రి కమలహాసన్ గర్వపడతారు. ప్ర: మీరీమధ్య ఎక్కువగా నటించడం లేదే? జ: అవకాశాలు చాలా వస్తున్నాయి. అయితే నాకు నటన ఒక్కటే కాదు, నా కుటుంబం, వ్యాపారం, ఇతర సామాజిక సేవాకార్యక్రమాలు అంటూ చాలా ఉన్నాయి. ప్ర: తమిళంలో అవకాశాలు వస్తే నటిస్తారా? జ: నటించాలన్న కోరిక నాకూ ఉంది.అయితే ఇక్కడ ప్రధాన సమస్య భాష. అయినా మంచి కథా చిత్రాలు వస్తే నటించడానికి రెడీ. ప్ర: చెన్నై గురించి? జ: చెన్నై నాకు చాలా నచ్చిన నగరం. మా పెద్దమ్మ, అక్కచెల్లెళ్లు అంటూ చాలా మంది బంధువులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇడ్లీ, దోసెలు అంటే నాకు చాలా ఇష్టం. అంతేకాకుండా స్టైల్‌కింగ్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్ లాంటి ఐకాన్లు నివశిస్తున్న నగరం చెన్నై. తమిళ చిత్రపరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. ప్ర: ఆ మధ్య తమిళనాడులో తుపాన్ సంభవించినప్పుడు మీరు చాలా సాయం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందా? జ: అది చాలా ఎమోషన్ సంఘటన. బాధితులను ఆదుకోవడం అన్నది మనిషిగా ప్రతి ఒక్కరి బాధ్యత. మావనతాదృక్పథంతోనే నేను అప్పుడు తమిళ ప్రేక్షకులకు సేవలందించాను.అంతేకానీ నాకు రాజకీయ రంగప్రవేశం ఆలోచన లేదు. -
వివేకం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
వావ్ అమేజింగ్ తల. ఇది అజిత్‌ను చూసి కోలీవుడ్ అబ్బురపడుతూ ముక్త కంఠంతో అంటున్న మాట. కారణం ఏమిటనేగా మీ ప్రశ్న. నటుడు అజిత్ సిక్స్ ప్యాక్ బాడీని చూసి ఆయన అభిమానులే కాదు, తమిళ చిత్రపరిశ్రమ వర్గాలు ఫిదా అయి పోయారు. ఎస్ఈ అల్టిమేట్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రానికి వివేకం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వీరం, వేదాళం చిత్రాల తరువాత అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. కాజల్ అగర్వాల్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటి అక్షరహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీత బాణీలు కడుతున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం వివేకం. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో అజిత్ సిక్స్ ప్యాక్ బాడీతో నిలబడి ఉన్న ఫొటో వావ్ దటీజ్ తల అనిపించేలా చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది. అజిత్ సిక్స్ ప్యాక్ బాడీకి తయారవడాన్ని పలువురు కోలీవుడ్ ప్రముఖుల అచ్చెరువు చెందుతున్నారు. నటుడు లారెన్స్ , శివకార్తికేయన్, విక్రమ్‌ప్రభు, శాంతను, ప్రేమ్‌జీ, నటి పార్వతీమీనన్, సంగీత దర్శకుడు ఎస్ఎస్.తమన్ అమేజింగ్ అంటూ ప్రసంశిస్తున్నారు. అజిత్ సిక్స్‌ప్యాక్ బాడీకి మారడానికి నిత్యం ఐదు గంటలు కసరత్తులు చేశారట. ఆయనకు చెన్నైకి చెందిన యూసబ్ శిక్షకుడిగా వ్యవహరించారు. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. చిత్రాన్ని జూన్ లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలోని 50 షేర్ల సూచీ నిఫ్టీ... గతేడాది మార్చిలో నమోదు చేసిన 9,119 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23 శాతం కంటే ఎక్కువే నష్టపోయింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ వాతావరణమంతా నిస్తేజంగా మారింది. దేశీ మదుపుదారులంతా ఆందోళనతో ఉన్నారు. కాకపోతే కొంత మంది ఎనలిస్టులు మాత్రం ఈ సమయంలోనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లలో గందరగోళం మాత్రం పోలేదు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేక మరింత పతనం జరిగే వరకు ఆగాలా? అన్న విషయంపై ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ‘వివేకం’ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. వాటినిప్పుడు పరిశీలిద్దాం.. చౌకగా లభిస్తాయి.. మనం పుస్తకాల్లో చదువుకున్న దాని ప్రకారం మార్కెట్ సూచీలు నూతన గరిష్ట స్థాయిల నుంచి 20 శాతం మించి పతనమైతే ఇంచుమించు మాంద్యంలోకి జారినట్లే. గత 13 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు సూచీలు మరింత పతనమయ్యాయనేది పరిశీలించాం. మార్కెట్లో భయాందోళన పరిస్థితులు ఉన్నప్పుడు కొనుగోలు చేసి.. ఇంకా పెరుగుతుందని ఆశపడేంత పరిస్థితులున్న సమయంలో విక్రయించాలని ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ రిటైల్ ఇన్వెస్టర్లకు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. మన ఇన్వెస్టర్లు కూడా చాలా ధైర్యవంతులని సూచీలు 20 శాతం పైగా పతనమై భయాందోళనలు ఉన్నప్పుడు కొనుగోలు చేస్తారనుకుంటున్నాం. ఇలాంటి సమయాల్లో మంచి పనితీరు కనబర్చే చాలా షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తాయి. ఒక్కసారే నష్టపోయారు.. షేర్ల కదలికలు కంపెనీని, రంగాన్ని బట్టి రకరకాలుగా ఉండొచ్చు. అందుకని వ్యక్తిగత షేర్ల జోలికి పోకుండా గత 13 ఏళ్లలో ఇండెక్స్‌లు ఎలా కదిలాయో పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు గమనించవచ్చు. 2003 నుంచి ఫిబ్రవరి 19, 2016 వరకు గమనిస్తే నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతానికిపైగా నష్టపోయి 929 రోజులు ఉంది. (వివరంగా పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది). ఈ సమయంలో కొనుగోలు చేసి... దీర్ఘకాలం వేచి ఉన్న వారు మంచి లాభాలు పొందారు. 20 శాతం పైగా నష్టపోయిన తర్వాత కొని రెండేళ్లు వేచి చూసిన వారికి 53 శాతం, మూడేళ్లు ఉన్న వారికి 74 శాతం, 5 ఏళ్లు ఉన్న వారికి 138 శాతం లాభాలొచ్చాయి. ఇలా కొనుగోలు చేసినప్పుడు కేవలం లాభాలే కాదు! నష్టాలొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలం వేచి ఉండే కొద్దీ ఈ నష్టం వచ్చిన సందర్భాలు తగ్గడం విశేషం. ఇన్వెస్ట్ చేసి రెండేళ్లు వేచి చూసినా 39 సార్లు నష్టాలు వచ్చాయి. అదే మూడేళ్లలో వేచి ఉన్న సందర్భాల్లో 26 సార్లు, 5 ఏళ్లు వేచి ఉంటే ఒకేసారి మాత్రమే నష్టం వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే... పెట్టుబడి పెట్టిన సమయంతో సంబంధం లేకుండా ఈ సమయంలో ప్రతీ ఇన్వెస్టరు కనీసం ఒకసారి లాభాలొచ్చే అవకాశాన్ని పొందారు. తక్కువ సమయంలో.. ఈ దీర్ఘకాలిక లెక్కలపై సందేహాలు వ్యక్తం చేసేవారి కోసం... విశ్లేషణ సమయాన్ని మరింత కుదించాం. ఇప్పుడు 2008 నుంచి జనవరి, 2016 వరకు నిఫ్టీ కదలికలను తీసుకొని పరిశీలిద్దాం. ఈ సమయంలో రెండు అతిపెద్ద బేర్ ర్యాలీలు, ఒక మోస్తరు మార్కెట్ రికవరీ జరిగింది. ఇలాంటి సమయంలో కూడా నిఫ్టీ 20 శాతానికిపైగా పతనమైనప్పుడు కొనుగోలు చేసి రెండేళ్లు ఉంటే 35 శాతం, మూడేళ్లు ఉంటే 41 శాతం, ఐదేళ్లుంటే 56 శాతం లాభం వచ్చింది. ఒక ఏడాది దాటి ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం ఉండదు కాబట్టి వార్షిక సగటు రాబడి కింద చూస్తే వరుసగా 17.5 శాతం, 13.7 శాతం, 11.2 శాతం పొందినట్లు లెక్క. ఈ రాబడి ప్రస్తుతం బ్యాంకు అందిస్తున్న వడ్డీరేట్లు 7-8 శాతం కంటే చాలా ఎక్కువ. స్థూలంగా చూస్తే మనం సరైన షేరును ఎంచుకుంటే బుల్ మార్కెట్లో బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడులను పొందే అవకాశాలు చాలా ఎక్కువని చెప్పొచ్చు. ఇలా షేర్లను ఎంచుకోవడం కష్టం అనుకున్న వారికిప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ఇండెక్స్ ఫండ్లను అందిస్తున్నాయి. వీటిని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌గా పిలుస్తారు. వీటి రాబడి ఇంచుమించు సూచీల కదలికలకు అనుగుణంగానే ఉంటుంది. వీటిల్లో రూ.1,000 చొప్పున కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. 2008 నుంచి సూచీలు 20 శాతం కంటే నష్టపోయిన సందర్భాల్లో సిప్ ఇన్వెస్ట్మెంట్స్ రాబడి వరుసగా రెండేళ్లకు 13.5%, మూడేళ్లకు 9.51%, ఐదేళ్లకు 10.41%గా ఉంది. అంటే ప్రతినెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసిన వారికి రెండేళ్లలో రూ. 2.75 లక్షలు, మూడేళ్లలో రూ. 4.16 లక్షలు, ఐదేళ్లలో రూ.7.82 లక్షలు చొప్పున లాభాలు పొందారు. - వి.వి.కె.ప్రసాద్ వివేకం, ఫైనాన్షియల్ సర్వీసెస్ -
వివేకం: మీరు ఎలా భోంచేస్తున్నారు?
యోగాలో ఏమంటామంటే, మీరొక ముద్ద ఆహారాన్ని తీసుకుంటే, దాన్ని 24 సార్లు నమలాలని. మీ ఆహారం మీ నోటిలో ముందే జీర్ణమైపోతే, అది మీ వ్యవస్థలో ఎలాంటి మందకొడితనాన్ని సృష్టించదు. మీరు తిన్నదాన్ని ఇరవై నాలుగు సార్లు నమిలితే, ఆ ఆహారం గురించిన సమాచారంమీ శారీరక వ్యవస్థలో స్థాపితమవుతుంది. మనం ఎలా తింటున్నామన్నది కూడా మనం ఏం తింటున్నామన్నంత ముఖ్యమైన విషయమే. ఎంత తినాలి? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు అత్యుత్తమంగా పని చేస్తుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు, ఘ్రెలిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుందనీ, అది కడుపునకు ఆకలిగా ఉందన్న సంగతిని మెదడుకు చేరవేస్తుందనీ పరిశోధకులు చెబుతున్నారు. మనం నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తికి, మనమున్న ప్రదేశ విశ్లేషణకి చెందిన పనులను, మన మెదడులో చక్కబెట్టే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతాన్ని ఘ్రెలిన్ ఉత్తేజితం చేసి, దాని సామర్ధ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల మనం చురుగ్గా, ఏకాగ్రతతో ఉంటాం. అయితే మనం తినడం మానేయాలని కాదు. మనమెంత తింటున్నామన్న విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలన్న సంగతి ఇది చెబుతుంది. మీరు ముప్ఫై ఏళ్లలోపు వారైతే, రోజుకు మూడు పూటలా తినడం సరిపోతుంది. ముప్ఫై పైబడి ఉంటే, రెండు పూటలే ఉత్తమం. తిన్నది రెండున్నర గంటల్లో ఉదర కోశం నుంచి వెళ్లిపోయేలా, 12-18 గంటల్లో మీ శరీరాన్నే వదిలిపోయేలా ఉండే ఆహారం ఎరుకతో తీసుకోండి. ఎలా నమలాలి? భోజనంలో నమలడానికి చాలా ప్రాధాన్యత ఉంది. పిండి పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలు, లాలాజలం ద్వారానే 30 శాతం జీర్ణం అవుతాయి. భోజనం చేసేటప్పుడు నీరు తాగడం మంచిది కాదు. కావాలంటే భోజనానికి కొద్ది నిమిషాల ముందు కొద్దిగా నీరు తాగండి లేదా భోంచేసిన 30, 40 నిమిషాల తర్వాత తీసుకోవడం మంచిది. రాత్రివేళ రాగి పాత్రలో నీటిని ఉంచితే, అది క్రిములను నాశనం చేయడమే కాకుండా, ఆ నీటిని శక్తిమంతం చేస్తుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో జరిపిన పరీక్షల్లో రాగి పాత్రలు ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్లను వ్యాపింపజేసే బ్యాక్టీరియాని 97 శాతం నాశనం చేస్తాయని తేలింది. ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలి? భారతదేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, వేసవి కాలంలో ఒకలా, వానాకాలంలో మరోలా, చలికాలంలో ఇంకోలా, ఆయా కాలాల్లో దొరికే, శరీరానికి సరిపడే కూరగాయలతో వండుతారు. ఉదాహరణకి చలికాలంలో, గోధుమ, నువ్వుల్లాంటి కొన్ని రకాల ఆహారాలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ కాలంలో, వాతావరణం చల్లబడటం వల్ల చర్మం పగులుతుంది. అయితే పూర్వం ప్రజలు క్రీములు మొదలైనవాటిని వాడేవాళ్లు కాదు. అందరూ రోజూ నువ్వులని తీసుకునేవారు. అవి ఒంటిని వేడిగా, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మీ శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉండటం వల్ల, మీ చర్మం పగలదు. అదే, ఎండాకాలంలో శరీరం వేడెక్కుతుంది. కాబట్టి శరీరాన్ని చల్లబరిచేవి (చల్లనివి కాదు) తీసుకునేవాళ్లు. ఉదాహరణకి జొన్నలు. సమతుల ఆహారం అంటే ఏమిటి? ఈ రోజున, డాక్టర్లు దాదాపు 8 కోట్ల మంది భారతీయులు మధుమేహ వ్యాధి వైపుగా వెళుతున్నారని చెబుతున్నారు. దీనికి గల ఒకానొక కారణం, చాలామంది భారతీయులు ఒక రకం ధాన్యంతోనే చేసిన ఆహారాన్ని తీసుకోవడం. సాంప్రదాయికంగా, ప్రజలు చాలా రకాల పప్పు దినుసులనీ, ధాన్యాలనీ తినేవారు. ఈ కాలంలో దక్షిణ భారతంలో ఆహారాన్ని చూస్తే, అన్నం, కొద్దిగా కూరగాయలతో చేసినదేదైనా ఉంటుంది. పూర్తిగా కార్బొహైడ్రేట్లు ఉండే ఇలాంటి ఆహారానికి మారడం గత 25, 30 ఏళ్లలో జరిగింది. దీన్నిప్పుడు వెనక్కి తిప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా కార్బొహైడ్రేట్లు ఉండి మిగతావి తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే, ఒక వ్యక్తి దీర్ఘ కాలిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆహారంలో ఎక్కువ భాగం కేవలం అన్నమే ఉండకూడదు, మిగతావి కూడా ఉండాలి. అన్నమనేది మీ ఎంపిక మాత్రమే - అది తినాలా వద్దా అనే విషయాన్ని మీరు మీ ఆకలి స్థాయిని బట్టి నిర్ణయించుకోండి. ఇది ప్రజల మనస్సులో ఏర్పరచవలసిన ఒక మౌలికమైన భావన. -
వివేకం: జీవిత ప్రాథమిక సూత్రం సంతోషం
కేవలం జీవితంలో సాధించినవాటితోనే మనకు సంతోషం, సంతృప్తి రావు. మనం చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఏమీ లేకుండానే మనం సంతోషంగా ఉండగలిగాం. సంతోషం మానవుని అసలు స్వభావం. మీరు మీ స్వభావానికి విరుద్ధంగా వెళుతూ సంతోషం పొందాలని ప్రయత్నిస్తే మాత్రం ఎప్పటికీ దాన్ని అందుకోలేరు. సంతోషంగా ఉండటమే జీవితంలోని గొప్ప విషయం కాదు. అసలు మన జీవన ప్రాథమిక మూలం సంతోషమే. మనం సంతోషంగానే లేమంటే, ఇక మన మిగతా జీవితంతో మనమేం చేయగలం? సంతోషంగా ఉండటమే మానవుని ప్రప్రథమ, అతి ముఖ్యమైన ప్రాథమిక బాధ్యత. మీరు జీవితంలో ఏమి చేస్తున్నా, అది వ్యాపారం, ఉద్యోగం, సేవ ఏదైనా కానీ, మన మనసు లోతుల్లో ఎక్కడో దానివల్ల మనకు సంతోషం లభిస్తుందనే భావం నెలకొని ఉండటం వల్లే అది చేస్తున్నాం. ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా, దానివల్ల మనకు సంతోషం కలుగుతుందనే ఆకాంక్షే మూలకారణం. ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషం కోసం మనం ఎంత విపరీతంగా ప్రయత్నిస్తున్నామంటే, ఈ భూగోళం మీద జీవన మనుగడే ప్రమాదంలో ఉంది. సంతోషం పొందడం కోసం బాహ్య అంశాల మీద ఆధారపడేవారంతా వారి జీవితాల్లో నిజమైన సంతోషాన్నీ, ఆనందాన్నీ ఎప్పటికీ తెలుసుకోలేరు. వాస్తవానికి ఆనంద మూలాలు మనలోనే ఉన్నాయి. వాటిని మన అజమాయిషీలోకి తెచ్చుకోవచ్చు. మనం ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉండటానికి మనం చేయాల్సింది మరేదీ లేకపోతే, మన ఆలోచనా విధానం, మన స్పందన, ఈ ప్రపంచం మొత్తం మారిపోతాయి. అప్పుడిక స్వార్థ ప్రయోజనాలంటూ మనకేమీ ఉండవు. ఎందుకంటే... మనం ఏమి చేసినా, చేయకపోయినా, మనకు ఏది లభించినా, లభించకపోయినా... ఏదైనా సంభవించినా, సంభవించకపోయినా సరే మనం స్వభావ రీత్యా సంతోషంగానే ఉండిపోతాం. ఇలా స్వభావ రీత్యా సంతోషంగా ఉండిపోతే మనం చేసేవన్నీ పూర్తిగా వేరే స్థాయికి ఎదిగిపోతాయి. మన సంక్షేమాన్ని సృజించుకోవలసిన సమయం ఇదే. మన అంతరంగం పరిణతి చెందితేనే నిజమైన సంక్షేమం మనకు వస్తుందనే వాస్తవం మన స్వానుభవం నుంచే మనం గమనించగలుగుతాము. మనం ధరించే బట్టల వల్లో, మన చదువు వల్లో, కుటుంబం గొప్పతనం వల్లో, ఇదీ అదీ కాకపోతే మనకున్న బ్యాంకు బ్యాలెన్స్ వల్లో మన జీవన ప్రమాణం నిర్ధారణ కాదు. కేవలం మన అంతరంగంలో ఎంత ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నామనే దానిపైనే మన సంతోషం, ఆనందం ఆధారపడి ఉంటుంది. నిజమైన పరిణతి మనలో చోటుచేసుకోకపోతే, ఈ ప్రపంచానికి విలువైనదేదీ మనం చేయలేం. ప్రపంచంలో మన అవలక్షణాలనే విస్తరింపగలుగుతాం. మనం ఇష్టపడినా పడకున్నా, ఇదే వాస్తవం. ఈ జీవితం గురించి మీకు శ్రద్ధ ఉంటే, మొట్టమొదట మనం చేయవలసింది అంతరంగాన్ని ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకుని మనం సంతోషమయులం, ఆనందమయులం కావడమే! సమస్య - పరిష్కారం నాయకత్వ లోపం సమాజంలో అన్నిచోట్లా కనిపిస్తోంది. అది ఎలా మారుతుంది? అసలు మంచి నాయకుని లక్షణాలేమిటో దయచేసి తెలుపుతారా? - ఎస్.కె.గౌడ్, హైదరాబాద్ నాయకుడనేవాడు తను ఉన్న పరిస్థితులు, పరిసరాలను బాగా గమనించగలిగినవాడై ఉండాలి. ఇతరులు గమనించలేని వాటిని సునిశితంగా గమనించగల ప్రజ్ఞ అతనికి ఉండాలి. ఎవరైనా సరే చాలినంతగా శ్రద్ధ పెట్టినట్టయితే ఈ విశాల విశ్వంలో మనకు అర్థం కానిదీ, అవగతం కానిదీ ఏదీ ఉండదు. ఇంకా నాయకుడనేవాడు నీతి నిజాయితీలకు ప్రతీకగా ఉండాలి. ఇక స్ఫూర్తి మూడవ లక్షణం. తన చుట్టూ ఉన్నవారిని పూర్తిగా ప్రభావితం చేయగల, వారిలో స్ఫూర్తిని నింపగల సామర్థ్యం కలిగి ఉండాలి. ప్రభావితం చేయగలిగే, స్ఫూర్తిని నింపగల లక్షణం ఉంటే నాయకుడనేవాడు పైకి ఆకర్షణీయంగా, జనసమ్మోహనంగా ఉండాల్సిన అవసరం లేదు. తాము చేసే పనిపట్ల పూర్తి కార్యదీక్ష, అంకితభావంతో ఇతరులలో స్ఫూర్తిని నింపినవారెంతో మంది ఉన్నారు. కార్యదీక్ష అనే గొప్ప లక్షణంతో గాంధీ మహాత్ముడు కోట్లాది మంది ప్రజానీకంలో స్ఫూర్తిని నింపి వారిని జాగృతపరిచారు. -
వివేకం: భావోద్వేగాలే సుందరం!
భావానుభూతి మనిషి జీవితానికొక సుందర పార్శ్వం. అదే లేకపోతే జీవితం అందవిహీనమౌతుంది. కానీ ఏ విషయమైనా స్వాధీనంలో లేకపోతే ఉన్మాదానికి దారితీస్తుంది. ఇదే అసలు సమస్య. మీ భావోద్వేగం మీకనుగుణంగా ఉండాలంటే ఏ విధంగా మలుచుకోవాలనుకుంటారు? నాకు భావోద్వేగాల్ని వాంఛితాలు, అవాంఛితాలు అని వర్గీకరించాలని లేదు. అవి జీవితానికి ఎంతవరకు తోడ్పడుతాయన్నదే నేను చూస్తాను. మీ భావోద్వేగాలు మీ కుటుంబానికిగానీ, ఉద్యోగానికిగానీ, వ్యాపారానికిగానీ తోడ్పడుతున్నాయా? మీరెప్పుడూ కోపంతోనో, నిరాశా నిస్పృహలతోనో, ద్వేషంతోనో కలవరపడుతూ ఉంటే మీకు బాగుంటుందా? అలా కాకుండా, మీ భావోద్వేగాలు ఆనందంగా, ప్రేమమయంగా, దయాపూరితంగా ఉన్నాయనుకోండి. అవి మీకెంతో తోడ్పడతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నేను నాకేది తోడ్పడుతుందో దాన్నే పట్టించుకుంటాను. మన జీవితానికే విధంగానూ సహకరించనిదాన్ని తలకెత్తుకోవడంలో అర్థమేముంది? ప్రాణికోటిలో ప్రతి ఒక్కటీ తాను జీవించడానికి ఏం చెయ్యాలో అదే చేస్తోంది. మరి మనిషికేమిటి సమస్య? ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలుంటాయి. భావోద్వే గాలు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకమని ఎవరన్నా అంటే, వారే ఆ తర్వాత మీ శరీరం కూడా దానికి ఆటంకమంటారు. ఒక విధంగా చూస్తే అది కూడా నిజమే. మీ శారీరక, మానసిక, భావోద్వేగ శక్తులన్నీ మీ ఎదుగుదలకు ఇబ్బందిగా ఉండొచ్చు లేదా అవే మీ ఎదుగుదలకు సోపానాలు కూడా కావొచ్చు. అదంతా మీరు వాటినుపయోగించే పద్ధతిని బట్టి ఉంటుంది. ఈ శరీరాన్నీ, బుద్ధినీ, మనసునీ మీ జీవితానికి అవరోధాలుగా భావిస్తారా లేక మీ అభ్యున్నతికి వాటిని నిచ్చెనమెట్లుగా మలుచుకుంటారా? ఈ మూడూ అవరోధాలైతే ఈ ప్రపంచంలో బతకడానికి ఈ మూడు ధర్మాలే కదా ఆధారం! కొన్ని లక్షల సంవత్సరాల పరిణామక్రమం తర్వాత, మన బుద్ధి ఈ స్థాయికి చేరింది. మరి ఇప్పుడు ఈ బుద్ధిని సమస్యగా భావించగలమా? బుద్ధి సమస్య కాదు. బుద్ధిని సరిగా వినియోగించలేకపోవడమే సమస్య. మానవ మేధ నిజంగా అత్యాశ్చర్యకరమైంది. కానీ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సాధనమే సమస్యగా మారింది. అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికిగానీ, నియంత్రించడానికిగానీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదన్నమాట! మీ భావోద్వేగాలు మీ ఆలోచనలకు విరుద్ధమైనవి కావు. మీ ఆలోచనా సరళిని బట్టే మీ అనుభూతి కూడా ఉంటుంది. ఆలోచన శుష్కమైందీ, అనుభూతి రసవంతమైనదీ. మీ ఆలోచనకు విరుద్ధంగా మీ భావోద్వేగాలు ఉండవు. ‘ఈయన భరించలేని వ్యక్తి’ అని తలచాక అతడి పట్ల మీలో కోమల భావోద్వేగాలు కలిగే అవకాశముంటుందా! సమస్య - పరిష్కారం ధ్యానం అంటే సమయాన్ని వృథా చేయడమా అనిపిస్తోంది. నాకు దానివల్ల ఏమీ లాభం కనబడటం లేదు. - పి.సంపత్‌కుమార్, వరంగల్ సద్గురు: మీరు ఈ ధ్యానం వల్ల ఉపయోగం ఏమిటి అన్న ఆలోచన వదిలిపెట్టాలి. దాని మూలంగా మీకేమీ రానక్కరలేదు. మీకేమీ ఉపయోగం ఉండనవసరం లేదు. మీరు రోజూ కొంత సమయం వృథా చేయండి. అలా చేయడం నేర్చుకోండి, అది చాలు. దాని మూలంగా ఏదో కానక్కరలేదు. ధ్యానం చేయడం ద్వారా మీరేదో ఆరోగ్యంగా కానక్కరలేదు, మీకేదో జ్ఞానం రానక్కరలేదు, మీరేదో స్వర్గానికి పోనక్కరలేదు, అది కొంత సమయం వృథా చేయడమే అనుకోండి. ధ్యానం వల్ల మీకు కావలసినది అసలైనదైతే నాకు లాభమేమిటి, నాకు ఒరిగేదేమిటి అని లెక్కలు వేయకండి. మీరు ఈ లెక్కలేయడం ఆపేస్తే, 90 శాతం పని అయిపోయినట్లే. అంటే చివరి వరుసకు చేరినట్లే. ఒకసారి చివరి వరుసకు చేరారంటే ఇక అక్కడ మిమ్మల్ని మింగేసే పాములుండవు. మీరు దాటవలసినది, ఎక్కవలసినది ఒక్కొక్క మెట్టు మాత్రమే. సమయం వచ్చినప్పుడు అది కూడా దానంతట అదే జరిగిపోతుంది. -
వివేకం: బాధ్యత బరువు కాదు!
సామాన్యంగా బాధ్యత అనగానే బరువు అనుకుంటారు. బాధ్యత అంటే తమ విద్యుక్తధర్మం అని తప్పుగా భావించడం వలనే ఇలా బరువు అనిపిస్తున్నది. చిన్నప్పటినుండే అందరికీ విద్యుక్తధర్మం అనే భావాన్ని పెంపొందించారు. కొడుకుని చదివించడం తండ్రి ధర్మం, వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడటం కొడుకు ధర్మం, విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుని ధర్మం, దేశాన్ని కాపాడటం రక్షణ సిబ్బంది ధర్మం అంటూ ధర్మం అనే మాటను మీ మనసులో బలంగా నాటుకుపోయేలా చేశారు. ‘నా ధర్మం నిర్వహిస్తున్నాను’ అనుకుంటూ ఏది చేసినా అలసటగా ఉంటుంది, దానివల్ల రక్తపు పోటు పెరుగుతుంది. ఒక పాదరక్షల ఫ్యాక్టరీని చూడటానికి యజమాని వచ్చాడు. ఒక కార్మికుడు అట్టపెట్టె అందుకుని, దానిమీద లేబుల్ అతికిస్తున్నాడు. మరో కార్మికుడు దానిలో ఒక పాదరక్షనుంచాడు. అతని తర్వాతి కార్మికుడు ఆ పెట్టెను మూసి, ముందుకు జరిపాడు. తరువాత అతను దాన్ని బండిలోకెక్కించాడు. ‘‘ఏం జరుగుతున్నదిక్కడ? చెప్పులను జతలుగా తయారుచేస్తున్నాం కదా. కాని పెట్టెలో ఒక చెప్పునే ఎందుకు పెట్టి పంపిస్తున్నారు?’’ అని కంగారుగా అడిగాడా యజమాని. ‘‘అయ్యా తీసుకుంటున్న జీతాని కన్నా ఇక్కడ ఎవరూ తక్కువ పనిచేయడం లేదు. ఎడం కాలి చెప్పు అందుకుని పెట్టెలో పెట్టే అతను ఈ రోజు సెలవులో ఉన్నాడు. అదే సమస్య’’ అని ఫ్యాక్టరీ మేనేజర్ సమాధానం. తమ విద్యుక్తధర్మాన్ని క్రమం తప్పకుండా నెరవేర్చే కార్మికులున్నప్పటికీ, ఇలా జరుగుతూ ఉంటే ఆ వ్యాపారం ఏమవుతుందో కాస్త ఆలోచించండి. పూర్తి బాధ్యత తీసుకోకుండా, డ్యూటీ చేస్తున్నామనుకుంటూ ప్రవర్తిస్తే, అది అభివృద్ధికి పనికిరాదు. త్వరలో మీరు విరక్తి, ద్వేషం, చిరాకు కలగలిసిన యంత్రంలా మారిపోతారు. ఎవరో చెప్పింది చేయడం కంటే, మీరే గ్రహించి బాధ్యతాయుతంగా చేస్తే ఈ బాధ ఉండదు.ముందు బాధ్యతను పనిగా భావించకుండా, దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ప్రయత్నించండి. ఇష్టంగా, సంపూర్ణంగా బాధ్యతను స్వీకరిస్తే, ‘‘ఇది నాది. నాకు సంబంధించినది’’ అనే భావన కలుగుతుంది. అప్పుడది భారం కాదు. ఇది నా బాధ్యత అనుకున్నప్పుడు, ఈయన నా భర్త, నా గృహం, నా వాహనం అని భావిస్తారు. అలా అనుకోగానే పూర్తి ఆసక్తి కలుగుతుంది. అప్పుడది తేలిక అవుతుంది. ఏ భారమూ ఉండదు. మీరీ భూమిని తలపై పెట్టుకున్నారనుకుందాం. ఈ భూమి నాది అనే తలంపుతో ఉన్నంతవరకు, అది మీకు బరువుగా తోచదు. కాని, ‘నేను బాధ్యుడను కాను’ అనే భావనతో, ఒక చిన్న సూది తీసుకున్నా, అది బరువుగా ఉంటుంది. మనస్ఫూర్తిగా ‘నాది’ అని అనుకుంటున్నప్పుడు మీరు జీవితంతో ఇష్టంగా స్పందిస్తారు. ‘నేను బాధ్యుడను కాను’ అని అనుకుంటే వ్యతిరేకత, అయిష్టత కలుగుతాయి. జీవితంతో మనస్ఫూర్తిగా స్పందించేప్పుడు, ఆ మాధుర్యాన్నే స్వర్గం అంటున్నాం. ఇష్టం లేకుండా, వ్యతిరేక భావంతో స్పందిస్తున్నప్పుడు, దాన్ని నరకం అంటున్నాం. కాబట్టి స్వర్గం, నరకం మరణం తర్వాత కాదు - ఇక్కడే, ఇప్పుడే మీరు స్పష్టించుకోగలిగినవే. సమస్య - పరిష్కారం అందరూ నాకు అహం చాలా ఎక్కువ అంటారు. నా అహానికి భయమే కారణమా? నా అహాన్ని నేను ఎలా తెంచుకోగలను? -కె.ఎల్.శ్రీనివాస్, కావలి సద్గురు: దీనిని అటువైపు నుంచి చూడాలి. భయం వల్ల అహం కాదు, అహం వల్లనే భయం ఉంటుంది. అహం గాయపడుతుందేమోనన్న భయం అది. ఎవరో పరుషంగా దూషించినట్లు మనకు అనిపించేది - అహం వల్లే. మీకు మీరు ఒక పరిమితమైన సరిహద్దు గీసుకున్నారు. ‘నేను’ అనే దానికి ఒక గుర్తింపు పెట్టుకున్నారు. అందువల్ల, సహజంగానే భయం కలుగుతుంది. ‘నేను’ అని మీరు భావించుకునే వ్యక్తి, మీరు స్వయంగా సృష్టించుకున్న రూపమే. మీరు నిజంగా భయపడేది, శరీరాన్ని పోగొట్టుకుంటామని కాదు. మీరు స్వయంగా నిర్మించుకున్న ఈ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటామేమోనని మాత్రమే మీరు భయపడుతూ ఉంటారు. ఉదాహరణకు, మిమ్మల్ని అవమానానికి, దూషణకు గురిచేశామనుకోండి. అప్పుడు ఈ వ్యక్తికి మరణం వచ్చినట్లే అని మీరు భావిస్తారు. అటువంటి సందర్భంలో మరణమే నిజమైన వరం అనిపిస్తుంది. మీ ఈ గుర్తింపును మీరు ధ్వంసం చేయాలి. అప్పుడు ఇక హద్దులు, అహాలు, భయాలు ఉండవు. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: దెబ్బతింటేనే జీవితపు పంట పండుతుంది!
ఉత్కంఠ భరితమైన వార్తలంటేనే అందరికీ ఆసక్తి. ‘ఎవరో ఇద్దరు ప్రేమగా కాపురం చేస్తున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు’ అన్న వార్త చప్పగా ఉంటుంది. కాని మీ జీవితం మటుకు ఏ ప్రతిఘటనా లేకుండా, ఒడుదుడుకుల్లేకుండా, ఒకే రీతిలో ఉండాలి. మీరు అడిగినా, అడక్కపోయినా ఈ ప్రపంచం మీ మీద సమస్యలను విసిరి, తమాషా చూడబోతోంది. మరి వాటిని ఎదుర్కోవడానికి మీరు ఎందుకు జంకుతున్నారు? ఒకసారి రైతు దేవుడితో పొట్లాట వేసుకున్నాడు. ‘‘నీకు వ్యవసాయం గురించి ఏమి తెలుసు? నీవనుకున్నప్పుడే వర్షాలు కురిపిస్తున్నావు. నీ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. నా మాట విని ఈ పనులన్నీ ఒక రైతుకు ఇచ్చెయ్’’ అన్నాడు. దేవుడు, ‘‘ఎండ, వాన, గాలి అంతా నీ వశంలో ఉండుగాక’’ అని వరమిచ్చేసి వెళ్లిపోయాడు. పంటల కాలం వచ్చింది.‘‘ఓ వానా, కురు!’’ అన్నాడు. వాన పడింది! ఆగమంటే ఆగింది! నేలను దున్నాడు. కావలసిన వేగంతో గాలిని రమ్మన్నాడు. విత్తనాలు జల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ అతను చెప్పినట్లు విన్నాయి. చేలు పచ్చగా ఎదిగాయి. కోతల కాలం వచ్చింది. రైతు ఒక వరి కంకిని కోశాడు. తీసి చూశాడు. నివ్వెరపోయాడు! లోపల ధాన్యం కనిపించలేదు. వెంటనే, మరో కంకిని కోసి చూశాడు. దానిలో కూడా ధాన్యం లేదు. ‘‘ఓ భగవంతుడా! గాలి, వాన, ఎండ అన్నింటినీ సమంగానే వాడాను. కానీ పంట ఎందుకు దెబ్బతిన్నది?’’ అంటూ కోపంగా అరిచాడు. దేవుడు ‘‘నా దగ్గరున్నప్పుడు గాలి వేగంగా వీచేది, అప్పుడు పైరు అమ్మను గట్టిగా వాటేసుకునే పసిపిల్లల్లా భూమిలో తమ వేర్లను చాలా లోతుల్లోకి తీసుకెళ్లేవి. అలాగే వాన తగ్గిందంటే, నీటిని వెదుక్కుంటూ వేర్లను నాల్గు దిక్కులకూ పంపించేవి. పోరాట పటిమ ఉంటేనే మొక్కలు తమను తాము కాపాడుకునేందుకు బలంగా పెరుగుతాయి. అన్నింటికీ వసతులు కల్పించి, ఇవ్వగానే నీ పంటకు సోమరితనం వచ్చేసింది. ఏపుగా ఎదిగిందే గాని, ధాన్యం ఇవ్వడం దానిచేత కాలేదు’’ అన్నాడు. ‘‘వద్దు స్వామీ! ఇలాగైతే నీ వాన, గాలి నువ్వే ఉంచుకో’’ అని ఆ రైతు వాటిని దేవుడికే అప్పగించేశాడు. జీవితంలో అన్నీ సులభంగా సమకూరితే, ఆ జీవితం ఇలాగే ఉంటుంది. దానికి మించిన శూన్యం వేరొకటి ఉండదు. ఊహించని అనుభవాలు ఎదురొస్తే, జీవితంలో అనుభవించి తెలుసుకునే అవకాశాలుగా వాటిని భావించాలి. చిక్కులు వచ్చినప్పుడే మన సామర్థ్యం ఏమిటి? మనం ఎక్కడ ఉన్నాం అనేది స్పష్టంగా తెలుస్తుంది. చీకటి సమస్య ఉన్నందుకే కదా విద్యుద్దీపాలు కనుగొన్నారు. సమస్యలే లేకుంటే, మీ మెదడు పనితీరు ఏ విధంగా ఉందో ఎలా తెలుసుకోగలరు? వాస్తవానికి, మీ పద్ధతి సరిగా లేనందువల్లే, సాధారణ పరిస్థితులు కూడా సమస్యలుగా కనిపిస్తాయి. సమస్య - పరిష్కారం ఒత్తిడి వల్ల జీవితంలో సంబంధాలు దెబ్బతింటున్నాయి. సహాయం చేయగలరు. - డి.రాజ్మలక్ష్మి, సికింద్రాబాద్ సద్గురు: మీలాగే ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది వివిధ రకాల ఒత్తిడులకు గురి అవుతున్నారు. ఒత్తిడి, ఆందోళన అనేవి మనం కొత్తగా పెట్టుకున్న పేర్లు మాత్రమే. పూర్వకాలంలో వీటిని అజ్ఞానం అని పిలిచేవారు. మీరు చేస్తున్న పనివల్ల మీకు ఒత్తిడి లేదు. మీ జీవన క్రియను మీరు సరిగ్గా నిర్వహించుకోలేని అసమర్థతతో ఉన్నారు. దీనివల్లనే మీకు ఒత్తిడి కలుగుతోంది. మీ జీవన క్రియను - మీ శరీరాన్ని, మీ బుద్ధిని, మీ భావోద్వేగాలను, మీ ప్రాణశక్తిని - ఒక క్రమపద్ధతిలో నిలుపుకోలేని మీ అసమర్థతయే ఒత్తిడి. ఏ వ్యక్తి అయినా ఒక స్పష్టతా స్థితిలో ఉంటే ఒత్తిడి అనే ప్రశ్నే తలెత్తదు. మనం ధ్యానం అని చెబుతున్నది, దీనికి చికిత్సయే. ధ్యానం అనేది ఒక పని కాదు. అది ఒక లక్షణం, గుణం. మీ శరీరాన్ని, బుద్ధిని, భావోద్వేగాలను, ప్రాణశక్తులను - ఒక పరిపక్వ స్థాయిలో ఉండేటట్లు మీరు మలచుకోగలిగితే, ధ్యానం సహజంగానే కలుగుతుంది. ఇది సరిగ్గా ఎలాంటిదంటే, మీరు నేలను సారవంతంగా ఉంచారు. సరైన ఎరువును, నీటి వసతిని కల్పించారు. ఇక సరైన రకపు విత్తనం అక్కడ ఉంటే కనుక, అది పెరుగుతుంది, పుష్పాలుగా, ఫలాలుగా వికసిస్తుంది. మీరు కోరుకున్నంత మాత్రం చేత, మొక్క నుండి పుష్పాలు, ఫలాలు రావు. అందుకు ఆవశ్యకమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తే అవి వస్తాయి. అదే విధంగా, మీరు మీ లోపల అవసరమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. అప్పుడు ధ్యానం మీ లోపల సహజంగా కనిపిస్తుంది. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: మార్పు రావాల్సింది మీలోనే!
ఈ కాలంలో ఎవరు చూసినా కోపాలు, చిరాకులతో సతమతమౌతున్నారు. అలా ఎందుకుంటున్నారంటే మా తండ్రులు, తాతల నుంచీ మా రక్తంలో ఉందనో, ఉంటున్న పరిస్థితులలో ఉందనో చెప్పబోతారు. కాని మీ కోపాలకు, చిరాకులకు కారణం మీరేననీ, అది మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉందనీ గ్రహించడం మంచిది. దీనికి శంకరన్ పిళ్లై ఉదాహరణ చెప్పాలి. ఎండాకాలం. శంకరన్ పిళ్లై వీధివీధిన టోపీలు అమ్ముకుంటున్నాడు.మధ్యాహ్న సమయం. అలసిపోయి ఒక చెట్టు నీడన కూర్చొని ఉండగా, బాగా నిద్ర పట్టేసింది. చాలాసేపైనాక కళ్లు తెరచి చూశాడు. అమ్మకానికి పెట్టుకున్న టోపీలన్నీ, కోతులు తీసుకెళ్లాయి. అతని తాతగారొకరు ఇదే పరిస్థితిలో ఏం చేశారో శంకరన్ పిళ్లైకి బామ్మ చెప్పిందొకసారి. మనిషి చేసేది కోతి అలాగే చేస్తుంది కాబట్టి, అతని తాతగారు తన టోపీని తీసి భూమ్మీదకు విసిరికొట్టారనీ, అది చూసి కోతులూ అలాగే టోపీలను కిందకు విసిరికొట్టాయనీ బామ్మ చెప్పింది. అలాగే చేయాలనుకుని, కోతులను చూసి చేతులను ఆడించాడు. అవి కూడా చేతులు ఆడించాయి. తన బుగ్గ మీద చేత్తో చిన్నగా కొట్టుకున్నాడు. కోతులు కూడా తమ చెంపల మీద తట్టి చూపించాయి. శంకరన్ పిళ్లై తన టోపీని తీసి ఒకసారి తిప్పి, మరలా తలమీద పెట్టుకున్నాడు. కోతులు కూడా అలానే చేశాయి. ఇలా కాస్సేపు వాటిని ఆడించి, చివరికి తన టోపీని తీసి నేలకేసి కొట్టాడు. చెట్టుపైనున్న ఒక కోతి వేగంగా కిందికి దూకి, శంకరన్ పిళ్లై విసిరికొట్టిన టోపీని టక్కున అందుకుంది. తెల్లమొహం పెట్టి చూస్తున్న అతణ్ని సమీపించి, అతని చెంప మీద బలంగా ఒక్కటిచ్చింది. ‘‘ఇడియట్! నీకేనా బామ్మ ఉండేది?’’ అనడిగింది. కోతుల ఆలోచనలు మారవా? రోజూ అన్నిటికీ చిరాకేనా? కోపాలు, చిరాకులు మంచివి కావని తెలియదా? మీ తెలివితో వాటిని అధిగమించలేరా? జీవితంలో ఏ రోజూ చిరాకు కలిగించేది కాదు. ఈ భూమి కూడా ఆగకుండా తిరుగుతూ ఉంది. ఏ నిమిషం మీరు తలెత్తి చూసినా, ఆకాశంలో ఒక కొత్త భాగాన్ని చూస్తారు. మీ మనసే ఆ అనుభూతి పొందలేక అల్లాడుతోంది. అధీనంలో పెట్టుకోవడం తెలియక కట్లు విప్పదీస్తే, మనసుకు వేరే విధంగా పని చేయడం తెలియదు. చిరాకుకు కారణం మీ ఆఫీస్ కాదు. మీరు మీ మనసుకు బానిస అయిపోయినందుకే. మనసును ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియకపోవటం వల్లే, అది మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది. ఒక స్టేజ్‌లో అది మిమ్మల్ని మింగేసి మిమ్మల్ని ఏమీ లేనివాడుగా చేస్తుంది. చిరాకు నుండి బయటపడ్డానికి ఒక మార్గం ఉంది. ఏ పనిచేసినా, దాంట్లో పూర్తిగా లీనమైపోండి. పూర్తిగా అంటే, మిమ్మల్నే దానికోసం అర్పించుకునేందుకు సిద్ధమయ్యే పూర్ణ స్థితి. చేసేది సంతోషంగా చేస్తున్నామని భావించగలిగితే, పూర్తిగా పనిచేయగలుగుతారు. ఎవరి బలవంతం మీదో పనిచేస్తున్నాననుకుని విసుగ్గా చేస్తే, రక్తపోటు, గుండెనొప్పి, మిగతా మానసిక వ్యాధులు పిలువకుండా వచ్చి కూర్చుంటాయి. బయట దేనిని మార్చినా, ఎన్ని మార్చినా, అది నిజమైన మార్పు కాదు. సరైన స్పృహతో జీవిస్తే, ప్రతిక్షణం జీవంతో ఉంటారు. ఒక్క క్షణం కూడా పాతగా ఉండదు. ధ్యానం చేస్తే మీ లోపల మార్పు వస్తుంది, చిరాకు ఎగిరిపోతుంది. సమస్య - పరిష్కారం పెద్దవారంటే ఇప్పటివాళ్లకు మర్యాద లేకుండా పోయింది. మా ఆత్మగౌరవం ఎలా కాపాడుకోవాలి? - ఎం.రాజలింగం, మహబూబ్‌నగర్ సద్గురు: మీ కింద పనిచేసేవారో, మీ ఇంట్లో వారో మీకు తగిన మర్యాదనివ్వటం లేదని బాధపడుతున్నారా? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మీ ఆత్మ ఎటువంటి మర్యాదా ఆశించడం లేదు. ఆత్మగౌరవం అనేదేదీ లేదు. అదొక కాల్పనిక భావం. అందులోని నిజం ఏమిటంటే... ప్రస్తుతం, మీలో మీకు పూర్ణత్వం కనిపించడం లేదు. అసంపూర్ణంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయడానికి మీకు ఇతరులు అవసరమౌతున్నారు. మర్యాదను అధికారికంగానో, ప్రేమతోనో అడిగి తీసుకోవడం భిక్షం అడిగినట్లే. తిండి కోసం చేతులు చాచవచ్చు. మర్యాదల కోసం చేతులు చాచరాదు. ఈ రోజు మీకు అపరిమితంగా గౌరవ మర్యాదలు ఇచ్చేవారు, రేపు మిమ్మల్ని తిరిగి చూడకుండా వెళ్లవచ్చు. అది మిమ్మల్ని బాధిస్తే, తప్పు మీదే. ఎప్పుడు మిమ్మల్ని మీరు అసంపూర్ణంగా భావిస్తారో, అప్పుడే ఎదుటివారి నుండి ఏదో ఆశిస్తారు. మిమ్మల్ని మీరు సంపూర్ణులుగా చేసుకోక, పక్కవారి నుండి మర్యాదలు కోరడం హీనం కదా! నన్నడిగితే, చేదు అనుభవాలన్నీ వెంట వెంటనే కలగడం మంచిదే. చిన్న చిన్న పాఠాలు ఆలస్యమయ్యే కొద్దీ, మీ జీవితం వృథా అయిపోతుంది. అభిమానం, ఆత్మగౌరవం అంటూ పోతే, ఒక్కరోజైనా ఆనందం పొందలేరు. ఇది తెలుసుకోగలిగితే, మిగిలిన జీవితాన్నైనా ఆనందంగా ఎలా గడపాలా అని చూడటం మొదలెడతారు. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: ఇవ్వడంలో ఉన్నది పొందడంలో లేదు
ఎంతో సారవంతమైన భూమిని తన ఇద్దరు కొడుకులకు అప్పగించాడో భూస్వామి. పెద్దవాడికి వివాహమైంది. ఐదుగురు పిల్లలు. చిన్నవాడు పెళ్లి చేసుకోలేదు. తండ్రి ఇష్టప్రకారం, పంటను ఇద్దరూ సమంగా పంచుకుంటున్నారు. ఓరోజు పెద్దవాడికి, ‘‘నాకు వయసైపోయినా చూసుకోవడానికి పిల్లలున్నారు. తమ్ముడికి ఎవరూ లేరే? వాడికి అదనంగా ధనం అవసరం కదా!’’ అని ఆలోచన వచ్చింది. దాంతో అతను ప్రతినెలా తన వాటా నుండి ఒక మూట ధాన్యాన్ని తమ్ముడి గిడ్డంగిలో చేర్చడం మొదలుపెట్టాడు. రెండోవాడు, ‘‘నేను ఒంటరిని. అన్న కుటుంబానికి ఎక్కువ భాగం కావాలి కదా’’ అని వేరేవిధంగా ఆలోచించాడు. అతను కూడా తన వాటా నుండి ఒక మూట ధాన్యాన్ని ఎత్తుకెళ్లి అన్న గిడ్డంగిలో రహస్యంగా చేర్చడం మొదలెట్టాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు అన్నదమ్ములిద్దరూ ధాన్యపు బస్తాలతో ఎదురెదురుగా రావడం జరిగింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ ధాన్యపు బస్తాలను తమ తమ గిడ్డంగులలో దించేసి, ఇళ్లకు చేరుకున్నారు. తర్వాత, ఆ ఊరిలో ఒక గుడి కట్టడానికి తగిన స్థలం వెతికేటప్పుడు, ఆ అన్నదమ్ములు కలుసుకున్న ఆ ప్రత్యేకమైన స్థలమే పవిత్రమైన స్థలంగా ఎన్నుకున్నారు. సత్సంబంధాలు అంటే ఇలా ఉండాలి. మరి మన సంబంధాలు ఎలా ఉంటున్నాయి? ఎంతటి సన్నిహితులైనా ఒక హద్దు విధించుకుని, గిరి గీసుకుని కూర్చుంటున్నాం. ఇరువురిలో దాన్ని ఎవరు దాటినా, యుద్ధం ప్రకటిస్తున్నాం. ఒక్కరైనా పోనీలే అనుకుని గొప్ప మనసుతో ఉంటే కదా ఎదుటివాడు బతికేది! బాగా గమనించండి. ప్రత్యేకించి ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నప్పుడు, అతనితో పనిచేయడం చాలా సులభంగా ఉంటుంది. అతనే సంతోషంగా లేని సమయాన అతనితో కలిసి పనిచేయడం కష్టమౌతుంది. ఆటలు కానీ, వ్యాపారం కానీ, ఆఫీసు కానీ, ఎక్కడైనా అందరూ ఒకటిగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వేరు వేరు విభాగాల నుండి వచ్చినవారు కలిసి ఉన్న సమయంలో, అంతా ఒకరి ఇష్టప్రకారం జరగడమనేది కష్టమే. అక్కడ ఇతరులను తక్కువగా చూసే అలవాటును మొదట మానాలి. ఎవరినీ ‘నీలా ఎవరు ఉండరంటూ’ తప్పు పట్టకండి. చుట్టూ ఉన్నవారంతా గొప్పవారే. ఒకటీ రెండు సందర్భాల్లో వారు తెలివితక్కువగా ప్రవర్తించి ఉండవచ్చు. దగ్గరి బంధువులు కూడా పలు సందర్భాల్లో నిరాశపరచి ఉండవచ్చు. దాన్ని కొండంత చేయకండి. జీవితం యొక్క సారం దాని ఒడిదుడుకుల్లోనే ఉంది. అందరినీ మీకు కావలసిన రీతిగా వంచాలని చూడకండి. ఎదుటివారిని అలాగే అంగీకరించటం నేర్చుకోండి. అలా చేస్తే, ఇతరులు మీ ఇష్టప్రకారం ఉండకపోవచ్చు. కాని జీవితం మీ ఇష్టప్రకారమే ఉంటుంది. ఇవ్వడంలో లభించే ఆనందం, పొందడంలో లేదు. ‘‘ఆకలితో ఉన్నవాడికి నీ ఆహారం ఇచ్చేస్తే, నీవు బలహీనపడవు. బలపడతావు’’ అని బుద్ధ భగవానుడు అందంగా దీన్ని ఉటంకించారు. ఆహారం మటుకే కాదు, ప్రేమ కూడా అంతే. ప్రేమను అంతులేకుండా ఇవ్వడంలో లభించే ఆనందానికి సరితూగేది మరేదీ లేదు. దీన్ని మాటల్లో కంటే చేతల్లో చూడండి. దీనిలోని పూర్తి నిజం, అనుభవం మీద తెలుస్తుంది. సమస్య - పరిష్కారం దేవుని కంటే దెబ్బే గురువు అన్నట్లు, ఈ కాలంలో భయపెట్టకుండా ఎవరిచేత ఏ పనీ చేయించుకోలేకపోతున్నాం. అలా చేయడం సబబేనా? -కె.వేణుగోపాల్, హైదరాబాద్ సద్గురు: ఒక్క విషయం గుర్తుంచుకోండి - అలా బలవంతపెట్టి పనిచేయించుకుంటే, పనిచేసినవారు మీరెప్పుడు చిక్కుతారా అని అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అదను చూసి మీరు వేసిన దెబ్బ కంటే బలంగా వేస్తారు. మీరు మీ కుటుంబంలోనైనా, వ్యాపారంలోనైనా మీ చుట్టూ ఉన్నవారిపై ప్రేమతో ఉండాలి. అప్పుడే వారి నుండి మీకు పరిపూర్ణ సహాయం అందుతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? ముందుగా మీరు వారి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారిపై మీరు ప్రేమ కురిపించాలి. మీపై నమ్మకం కలిగించుకోవాలి. మీరు వారి హృదయంలో చోటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఆవలి మనసు చూరగొన్నారో అప్పుడు మీరెక్కడున్నా మీ పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. మీరు ఉన్నా లేకపోయినా వారి కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చగలరు. ప్రేమతో అనితర సాధ్యమైన పనులను కూడా సాధించగలం. కాని భయాలు, బలవంతాల వల్ల ఏమీ చేయలేమన్నది నగ్న సత్యం. - జగ్గీ వాసుదేవ్