అజిత్‌ 'వివేకం': మరో బ్లాక్‌బస్టర్‌ హిట్టా? | audience review on Vivekam movie | Sakshi
Sakshi News home page

అజిత్‌ 'వివేకం': మరో బ్లాక్‌బస్టర్‌ హిట్టా?

Published Thu, Aug 24 2017 12:07 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అజిత్‌ 'వివేకం': మరో బ్లాక్‌బస్టర్‌ హిట్టా? - Sakshi

అజిత్‌ 'వివేకం': మరో బ్లాక్‌బస్టర్‌ హిట్టా?

సూపర్‌స్టార్‌ అజిత్‌ తాజా సినిమా 'వివేకం' (తమిళంలో వివేగం).. తొలిరోజే సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు తమిళనాడులో ఒకేసారి గురువారం విడుదలైన ఈ సినిమాకు ఎర్లీ రిపోర్ట్స్‌ పాజిటివ్‌గా అందుతున్నాయి. మార్నింగ్‌ షోస్‌ చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు, 'తల' ఫ్యాన్స్‌ ఈ సినిమా సూపర్‌గా ఉందని అంటున్నారు. 'వివేకం' సినిమా హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందని, యాక్షన్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉన్నాయని, మాస్‌ ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమా ఉందని ట్విట్టర్‌లో కామెంట్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

దర్శకుడు శివ మరోసారి తన మ్యాజిక్‌ను తెరపై ఆవిష్కరించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో శివ-అజిత్‌ కాంబినేషన్‌లో వీరం, వేదాలం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టినట్టు కనిపిస్తోంది. 'వివేకం'లో అద్భుతమైన నటన కనబర్చిన అజిత్‌కు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో అజిత్‌ సరసన నాయకిగా కాజల్‌ అగర్వాల్‌ నటించగా.. మరో కీలక పాత్రలో కమలహసన్‌ రెండో కూతురు అక్షరహాసన్‌ నటించింది. విలన్‌గా వివేక్‌ ఒబరాయ్‌ కనిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement