సాక్షి, తాడేపల్లి : ఎన్నికల సమయంలో రిలీజ్ చేసిన వివేకం చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అడిషనల్ ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో చిత్రీకరించారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
వివేకం సినిమా బ్యాన్ చేయాలి
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం రాష్ట్రంలో హింసని ప్రేరేపించేలా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో ప్రదర్శించడం, వివేకా బయోపిక్‌కామ్ అనే వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రాన్ని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వివేకం సినిమాను మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యకేసు నేపథ్యంలో నిర్మించారు.అందులో రాజకీయపార్టీకి సంబంధించిన పలు సన్నివేశాల్లో వైఎస్సార్‌సీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారు. పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ గారి పేరు సహా ఇతర పాత్రలను కూడా అదే పేర్లతో ఉచ్చరించారు.
గతంలో ఇలా చేస్తే..
సీఎం జగన్‌తో పాటు పార్టీని కించపరిచేలా ఇష్టారీతిన సీన్లు రూపొందించారు. ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. నిజానికి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కేసు విచారణలో ఉన్న సమయంలో దాని గురించి సినిమా తీయడమనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం. 2019 ఎన్నికల సమయంలో ఇదే రీతిలో బయోపిక్ ఆఫ్ పీఎం మోది చిత్రం రూపొందిస్తే అప్పట్లో దానిని బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా "వివేకం" చిత్రాన్ని బ్యాన్ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
చదవండి: ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. అవమానం పడ్డ చోటే జెండా పాతాడు
Comments
Please login to add a commentAdd a comment