appi reddy
-
వివేకం సినిమాపై ఎన్నికల సంఘం సీరియస్
సాక్షి, తాడేపల్లి : ఎన్నికల సమయంలో రిలీజ్ చేసిన వివేకం చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అడిషనల్ ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హరేందిర ప్రసాద్ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో చిత్రీకరించారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వివేకం సినిమా బ్యాన్ చేయాలి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం రాష్ట్రంలో హింసని ప్రేరేపించేలా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో ప్రదర్శించడం, వివేకా బయోపిక్‌కామ్ అనే వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రాన్ని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వివేకం సినిమాను మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యకేసు నేపథ్యంలో నిర్మించారు.అందులో రాజకీయపార్టీకి సంబంధించిన పలు సన్నివేశాల్లో వైఎస్సార్సీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారు. పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ గారి పేరు సహా ఇతర పాత్రలను కూడా అదే పేర్లతో ఉచ్చరించారు. గతంలో ఇలా చేస్తే.. సీఎం జగన్‌తో పాటు పార్టీని కించపరిచేలా ఇష్టారీతిన సీన్లు రూపొందించారు. ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని ఆన్లైన్లో రిలీజ్ చేశారు. నిజానికి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కేసు విచారణలో ఉన్న సమయంలో దాని గురించి సినిమా తీయడమనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం. 2019 ఎన్నికల సమయంలో ఇదే రీతిలో బయోపిక్ ఆఫ్ పీఎం మోది చిత్రం రూపొందిస్తే అప్పట్లో దానిని బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా "వివేకం" చిత్రాన్ని బ్యాన్ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. చదవండి: ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. అవమానం పడ్డ చోటే జెండా పాతాడు -
సీఎం జగన్ రాక కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు
-
పెద్ద హీరోలతో సినిమాలు చేయడం కష్టమే: నిర్మాత అప్పిరెడ్డి
‘మా సంస్థలో పెద్ద హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. కానీ వాళ్లంతా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వాస్తవానికి వాళ్లను ఒక స్క్రిప్ట్ తో అప్రోచ్ అవడమే కష్టం. వాళ్లకు నచ్చినా రెండు మూడేళ్లు వెయిట్ చేయాలి. ఎక్కువ టైమ్ వెయిట్ చేస్తే అప్పుడు అనుకున్న స్క్రిప్ట్ కూడా ఔట్ డేటెడ్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ మాకు అన్నీ కుదిరితే తప్పకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాం’అని నిర్మాత అప్పిరెడ్డి అన్నారు. బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, రూపా కొడవాయుర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మా మైక్ మూవీస్ సంస్థలో ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాం. మన ప్రేక్షకులకు నచ్చేలా, మన నేటివిటీ ఉంటే కథలతో సినిమాలు చేస్తున్నాం. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’కథలో మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. అయితే మేల్ పెగ్నెన్సీ నేపథ్యం కాబట్టి ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఇది కత్తి మీద సాము లాంటి సినిమా అని చెప్పారు. ఇది ఛాలెంజింగ్ స్క్రిప్ట్. మేము కూడా అలాగే తీసుకుని చేశాం. ఈ చిత్రం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’అని అన్నారు. వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు వేరే హీరోల్ని అనుకున్నాం. అయితే బిగ్ బాస్ చూసినప్పుడు ఆ గేమ్స్ లోని ఎమోషన్ ను సొహైల్ ఇంప్రెసివ్ గా చూపించాడు. అప్పుడే అనుకున్నాం ఈ కథకు హీరోగా బాగుంటాడని. అతనికి ఈ సినిమాలో మంచి పేరొస్తుంది. మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ ను ఎంతో సహజంగా చేశాడు. ఈ సినిమాను కమర్షియల్ మూవీ ఫార్మేట్ లో చూడకూడదు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చూశాక చాలా మంది తమ ఎక్సీపిరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు. మా వైఫ్ ను ప్రెగ్నెంట్ టైమ్ లో ఇంకా బాగా చూసుకుని ఉండాల్సింది అన్నారు. అలా ఎవరికి వారిని వ్యక్తిగతంగా ఆలోచింపజేసే చిత్రమవుతుంది’ అన్నారు. ‘ఇలాంటి కథతో తెలుగులో ఇప్పటివరకు మూవీ రాలేదు. ఇంగ్లీష్ లో వచ్చినా...అది ఎక్స్ పర్ మెంటల్ గా చేశారు. కామెడీ మీద బేస్ అయి ఉంటుంది. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్‌తో సాగే మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రం చూసి అంతా ఎంజాయ్ చేస్తారు’ అని రవీందర్ రెడ్డి సజ్జల అన్నారు. -
ఓటర్ల జాబితాపై జాగ్రత్త
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈనెల 21వతేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం క్రియాశీలకంగా వ్యవహరించేలా శాసనసభ్యులు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్ సీపీ 175కి 175 స్థానాలను ఖాయంగా గెలుచుకునే వాతావరణం ఉందన్నారు. దొంగ ఓట్ల తొలగింపుతోపాటు అర్హులను ఓటర్లుగా చేర్చేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. 2014 – 19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోగస్, సెకండ్ ఓట్లను చేర్చి వారికి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసిందన్నారు. బూత్ స్థాయిలో బోగస్ ఓట్లను గుర్తించి ఎన్నికల కమిషన్ దృష్టికి తేవాలన్నారు. పార్టీ బూత్ కమిటీల ఇన్ ఛార్జులు, గృహ సారథులతో దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. తరచూ ముందస్తు ఎన్నికలనే ప్రచారాన్ని తెరపైకి తెస్తూ క్యాడర్‌ను కాపాడుకునేందుకు టీడీపీ ఆపసోపాలు పడుతోందని వ్యాఖ్యానించారు. శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లతో సజ్జల ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దీనికి సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సజ్జల ఏమన్నారంటే.. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.. దాదాపు 25 లక్షలకు పైగా అసైన్డ్ భూములు, 2 లక్షల ఎకరాల మేర చుక్కల భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 1.87 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. దశాబ్దాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన దుస్థితికి సీఎం జగన్ పరిష్కారం చూపారు. ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి మంచి నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. లబ్ది దారులతో ఎక్కడికక్కడ కార్యక్రమాలను నిర్వహించాలి. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను ధర్మకర్తలకే అప్పగించడం లాంటి నిర్ణయాలు తీసుకున్నాం. సంధాన కర్తలుగా పార్టీ పరిశీలకులు.. పార్టీ పరిశీలకులుగా నియమితులైనవారు శాసనసభ్యులకు, పార్టీ కోఆర్డినేటర్లకు సంధానకర్తలుగా వ్యవహరించాలి. సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే ఆయా నియోజకవర్గాలలో పరిశీలకులు ఎక్కువ సమయం వెచ్చించాలి. స్థానిక నేతల మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలుంటే సర్దుబాటు చేయాలి. అవసరమైతే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల దృష్టికి, కేంద్ర కార్యాలయం దృష్టికి తేవాలి. ప్రజల ఆశీస్సులను ఓట్లుగా మలుచుకుని ఫలితాలు సాధించేలా కృషి చేయాలి. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం, ఏమరుపాటు పనికిరాదని గడప గడపకూ సమీక్షల్లో సీఎం జగన్ స్పష్టం చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా. -
సినిమా తీయడం అంత సులువు కాదు
‘‘నాకు సినిమా పట్ల అంత ఆసక్తి లేదు. కాకపోతే రాయడం నేర్చుకున్నాను. అమెరికాలో ఎమ్మెస్ చేశాను.. అక్కడే ఓ ఐటీ కంపెనీలో 10 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత 2004లో బెంగళూరుకు మారిపోయా’’ అని సుజాయ్ కారంపూడి తెలిపారు. సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో సుజాయ్, సుశీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుజాయ్ మాట్లాడుతూ– ‘‘మధుర’ శ్రీధర్ షార్ట్ ఫిలిం కోసం ఒక స్టోరీ రాశాను. ఆయనకు బాగా నచ్చడంతో సినిమా కథలు రాయమని సలహా ఇచ్చారు. మేం ఇండస్ట్రీకి కొత్త. ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు. అందుకే తెలుగు సినిమాలు చూశాం. మా ప్రయత్నాల్ని, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. సినిమా నిర్మాణం మాకు చాలా నేర్పించింది.. ఆటుపోట్లు తెలిశాయి. సినిమా అనేది అంత సులభమైన పనేం కాదు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో మా కుటుంబాన్ని కనీసం వారాంతంలో కూడా కలవలేకపోయాం. స్క్రిప్ట్ డెవలప్ చేయడమో, సినిమా మేకింగ్‌లోనో బిజీగా ఉండేవాళ్లం’’ అన్నారు. సుశీల్ మాట్లాడుతూ– ‘‘మేం సాఫ్ట్వేర్ నేపథ్యం నుంచి వచ్చాం. అక్కడ చర్చల్లో డెవలప్మెంట్, ఫీడ్‌బ్యాక్ వంటి విలువైన అంశాలు ఉండేవి. ఇవే సూత్రాల్ని మేం స్టోరీ చర్చించేటప్పుడు కూడా పాటించాం. సినిమా మేకింగ్ సమయంలో అవి బాగా దోహదపడ్డాయి. ఒక యువకుడి చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. తల్లిదండ్రుల ఆత్మీయత, భావోద్వేగాల్ని ఈ సినిమాలో చూపించాం. మేకర్స్‌గా మాకిది తొలి సినిమా. విలువైన విమర్శలను ఆహ్వానిస్తాం’’ అన్నారు. -
జార్జ్ రెడ్డి లాంటి సినిమాలు రావాలి
‘‘నేను ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మొదటిసారి జార్జ్ రెడ్డి గురించి విన్నాను. ఇన్నాళ్లకు ‘జార్జ్ రెడ్డి’ సినిమా ద్వారా మరోసారి ఆయన గురించి వింటున్నాను’’ అని చిరంజీవి అన్నారు. సందీప్ మాధవ్ లీడ్ రోల్లో ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలకంగా వచ్చే ‘అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు...’అనే పాటను చిరంజీవి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘జార్జ్ రెడ్డి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. మార్పు కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన. తప్పును ప్రశ్నించే అలాంటి వాళ్లు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంకా చాలామంది వచ్చారు. ‘అడుగడుగు మా ప్రతి అడుగూ నీ వెనకాలే మా పరుగు...’ పాట చూసిన తర్వాత నేను చాలా ఎగై్జట్ అయ్యాను. జార్జ్ రెడ్డి ఎలాంటి ఆశయాలతో ఉండేవారు? ఆయన రివల్యూషనరీ థాట్స్ ఎలా ఉండేవి? విద్యార్థి సంఘాలను పెట్టి అన్యాయాలను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఈ పాటలో తెలుస్తోంది. ‘జార్జ్ రెడ్డి’ లాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇలాంటి సినిమా అందరూ చూడాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యొక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి. -
‘ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకుంటాం’
సాక్షి, గుంటూరు : హాయ్‌లాండ్ వ్యవహారంపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. వేలకోట్లు విలువైన హాయ్‌లాండ్‌ను కొట్టేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని, రెండు మూడు రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అప్పిరెడ్డి దీనిపై ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. నాలుగు నెలల్లో అధికారం చేజారుతుందని గ్రహించి ఈలోపే హాయ్‌లాండ్‌ను కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపితే బాగోతం బయటపడుతుందని సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు జీవో జారీ చేశారని మండిపడ్డారు. బాధితులు బయపడ్డాల్సిన పనిలేదని.. తాము అండడా ఉంటామని భరోసా ఇచ్చారు. -
కాలిఫోర్నియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని ఫ్రీమంట్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, యువ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జయ జయహే తెలంగాణ గీతంతో ఈ వేడుకలు ప్రారంభమైనాయి. ఈ గీతాన్ని శ్రీనివాస్ మానాప్రగడ ఆలపించారు. అనంతరం టీఏటీఏ ప్రాంతీయ ఉపాధ్యక్షుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ.... బంగారు తెలంగాణ సాధించే క్రమంలో గత రెండేళ్లుగా సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలపై తెలంగాణ ఎన్నారైలు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ వేడుకల్లో టీఏటీఏ మైనార్టీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేసినందుకు టీఏటీఏ యూత్ ఛైర్మన్ సతీష్, యూత్ కో ఆర్డినేటర్ అమిత్ ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్, నిషాంత్ పాల్గొన్నారు. -
'ఒక్క హామీ నెరవేర్చని ఘనత బాబుదే'
గుంటూరు: టీడీపీ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా పేదలకు ఒక్క ఉపయోగ పడే పని చేయలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క పేద వాడికి ఇళ్లు కట్టించిన దాఖలాలు కూడా లేవని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చని ఘనత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం టీడీపీ నేతలకు అలవాటైందన్నారు. ఇప్పటికైనా వారు పద్దతులు మార్చుకుని పరిపాలన పై దృష్టి పెట్టాలని అప్పిరెడ్డి సూచించారు. -
జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే
-
జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే
ఒంగోలు సెంట్రల్ : జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానంతోపాటు గిద్దలూరు, చీరాల మున్సిపాలిటీలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ప్రకాశం జిల్లా ఎన్నికల పరిశీలకుడు, గుంటూరు అర్బన్ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా జిల్లా నాయకులతో చర్చించడానికి అప్పిరెడ్డి బుధవారం ఒంగోలు వచ్చారు. పార్టీ స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి జిల్లాలో గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లతో మాట్లాడారన్నారు. వారందరూ వైఎస్ఆర్పై అభిమానం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో కొనసాగుతున్నారన్నారు. టీడీపీ నాయకులు గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ నీచానికి ఒడిగుడుతున్నారని చెప్పారు. రేషన్ డీలర్లు, వ్యాపారాలు, నగదు ఇస్తామని అభ్యర్థులకు ఎరవేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ సీపీకి విప్ అధికారం ఉందని, దాన్ని ధిక్కరించిన వారిపై అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. 30కి పైగా ఎంపీపీలను పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెల రోజులు కావస్తున్నా రైతు రుణ మాఫీ ఊసే లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తెలివిగా రూణమాఫీని కేంద్రానికి రుద్దాలని చూశారని, తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపిందని చెప్పారు. అధికారాన్ని, పొలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఉద్యమాలు, పోరాటాలతో పుట్టిన వైఎస్ఆర్ సీపీ ఇవేమీ చేయలేవన్నారు. గిద్దలూరు సహకార సంఘ అధ్యక్షుడు, ైవె ఎస్ఆర్ సీపీ నాయకుడు వైజా భాస్కర్‌రెడ్డిని ఎస్సై వై శ్రీనివాసరావు తన్నడంతోనే మృతి చెందాడన్నారు. ఈ సంఘటనపై జ్యూడిషియల్ విచారణ నిర్వహించాలని కోరారు. అమాయకుడైన భాస్కర్‌రెడ్డి ప్రాణాలు పోవడానికి కారకుడైన ఎస్సైను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, బుర్రా మధు సూదన్, శింగరాజు వెంకట్రావు, నాగిరెడ్డి, శంకర్, ఎ. ఆంజనేయులు, కె.వి. రమణా రెడ్డి, కె.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ విప్ల జారీ ఒంగోలు అర్బన్ : స్థానిక ఎన్ఎస్పీ అతిథి గృహంలో వైఎస్ఆర్ సీపీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లకు విప్ ఇవ్వాలని ఆ పార్టీ ఎన్నికల పరిశీలకుడు అప్పిరెడ్డి జిల్లా నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించారు. జిల్లాకు సంబంధించి విప్‌లు జారీ చేసే అధికారం పార్టీ మాజీ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డికి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పగించారని చెప్పారు. ఆయన ఆదేశానుసారం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు విప్‌లు అందచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ వై. నాగిరెడ్డి, దూళిపూడి ప్రసాద్ పాల్గొన్నారు. ఎస్సై ప్రవర్తన ప్రజాస్వామ్యానికే మచ్చ గిద్దలూరు రూరల్ : గిద్దలూరు ఎస్సై వై.శ్రీనివాసరావు ప్రవర్తన ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని వైఎస్ఆర్ సీపీ నగర పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకుడు అప్పిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గృహానికి బుధవారం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయం చేయాలని కోరినందుకు ఎస్సై దురుసుగా ప్రవర్తించడమే కాక నెట్టడంతో మరణించిన వైజా భాస్కర్‌రెడ్డి లోటు పార్టీకి పూడ్చలేనిదన్నారు. ఆయన మృతికి కారకుడైన ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తామన్నారు. భాస్కరరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. తొలుత మృతుడు భాస్కర్‌రెడ్డి గృహానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఏ ఆంజనేయులు, ట్రేడ్ యూనియన్ నాయకులు కేవీ ప్రసాద్, యువజన విభాగం అధ్యక్షుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, నాయకులు యేలం వెంకటేశ్వరరావు, కే రమణారెడ్డి, పీ వెంకటరాజుయాదవ్, నారు అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.