Producer Appi Reddy, Venkat Annapareddy, Ravinder Reddy Talks About Mr. Pregnant - Sakshi
Sakshi News home page

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి కథ తెలుగులో ఇంతవరకు రాలేదు: నిర్మాతలు

Published Tue, Aug 15 2023 4:29 PM | Last Updated on Wed, Aug 16 2023 9:54 AM

Producer Appi Reddy, Venkat Annapareddy ,Ravinder Reddy Talks About Mr Pregnant - Sakshi

‘మా సంస్థలో పెద్ద హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. కానీ వాళ్లంతా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వాస్తవానికి వాళ్లను ఒక  స్క్రిప్ట్ తో అప్రోచ్ అవడమే కష్టం. వాళ్లకు నచ్చినా రెండు మూడేళ్లు వెయిట్ చేయాలి. ఎక్కువ టైమ్ వెయిట్ చేస్తే అప్పుడు అనుకున్న స్క్రిప్ట్ కూడా ఔట్ డేటెడ్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ మాకు అన్నీ కుదిరితే తప్పకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాం’అని నిర్మాత అప్పిరెడ్డి అన్నారు.

బిగ్‌బాస్‌ ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌, రూపా కొడవాయుర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’.మైక్ మూవీస్ బ్యానర్ పై  అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్‌ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. 

అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మా మైక్ మూవీస్ సంస్థలో ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాం. మన ప్రేక్షకులకు నచ్చేలా, మన నేటివిటీ ఉంటే కథలతో సినిమాలు చేస్తున్నాం. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’కథలో మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. అయితే మేల్ పెగ్నెన్సీ నేపథ్యం కాబట్టి ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఇది కత్తి మీద సాము లాంటి సినిమా అని చెప్పారు. ఇది ఛాలెంజింగ్ స్క్రిప్ట్. మేము కూడా అలాగే తీసుకుని చేశాం. ఈ చిత్రం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’అని అన్నారు. 

వెంకట్‌ అన్నపరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు వేరే హీరోల్ని అనుకున్నాం. అయితే బిగ్ బాస్ చూసినప్పుడు ఆ గేమ్స్ లోని ఎమోషన్ ను సొహైల్ ఇంప్రెసివ్ గా  చూపించాడు. అప్పుడే అనుకున్నాం ఈ కథకు హీరోగా బాగుంటాడని. అతనికి ఈ సినిమాలో మంచి పేరొస్తుంది. మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ ను ఎంతో సహజంగా చేశాడు. ఈ సినిమాను కమర్షియల్ మూవీ ఫార్మేట్ లో చూడకూడదు.

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చూశాక చాలా మంది తమ ఎక్సీపిరియన్స్ మాతో షేర్  చేసుకున్నారు. మా వైఫ్ ను ప్రెగ్నెంట్ టైమ్ లో ఇంకా బాగా చూసుకుని ఉండాల్సింది అన్నారు. అలా ఎవరికి వారిని వ్యక్తిగతంగా ఆలోచింపజేసే చిత్రమవుతుంది’ అన్నారు. ‘ఇలాంటి కథతో తెలుగులో ఇప్పటివరకు మూవీ రాలేదు. ఇంగ్లీష్ లో వచ్చినా...అది ఎక్స్ పర్ మెంటల్ గా చేశారు. కామెడీ మీద బేస్ అయి ఉంటుంది. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్‌తో సాగే మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ చిత్రం చూసి అంతా ఎంజాయ్‌ చేస్తారు’ అని రవీందర్ రెడ్డి సజ్జల అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement