Mr Pregnant Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. వినాయక చవిత పండగ అయిపోయింది. అందరూ ఆఫీస్, స్కూల్ హడావుడిలో పడిపోతారు. అదే టైంలో ఈ వారం సినిమాలు ఏమేం వస్తున్నాయనేది కూడా ఓ లుక్కేస్తారు. ఇకపోతే థియేటర్లలో మ్యాడ్, రూల్స్ రంజన్, మామ మశ్చీంద్ర తదితర చిత్రాలు ఉన్నాయి కానీ వాటిపై పెద్దగా హైప్ లేదు. అదే టైంలో ఓటీటీలో మాత్రం 27 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' నుంచి రతిక ఎలిమినేట్.. ఆ తప్పుల వల్లే ఇలా?) గత కొన్నివారాల నుంచి ఉన్నట్లే ఈ వారం కూడా ఓటీటీల్లో తెలుగు హిట్ సినిమాల దగ్గర నుంచి హిందీ, ఇంగ్లీష్ సిరీస్‌ల వరకు బోలెడన్ని ఉన్నాయి. ఈ మొత్తం లిస్టులో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి', 'మిస్టర్ ప్రెగ్నెంట్', 'గదర్ 2', 'ముంబయి డైరీస్' వెబ్ సిరీస్ రెండో సీజన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయనేది చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ బెక్‌హమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04 రేస్ టూ ద సమ్మిట్ (జర్మన్ సినిమా) - అక్టోబరు 04 ఎవ్రిథింగ్ నౌ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 05 సిస్టర్ డెత్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 05 ఖుఫియా (హిందీ చిత్రం) - అక్టోబరు 05 లూపిన్ పార్ట్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 05 మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (తెలుగు సినిమా) - అక్టోబరు 05 ఏ డెడ్లీ ఇన్విటేషన్ (స్పానిష్ చిత్రం) - అక్టోబరు 06 బల్లేరినా (కొరియన్ సినిమా) - అక్టోబరు 06 ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 06 ఇన్సీడియష్: ద రెడ్ డోర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 06 స్ట్రాంగ్ గర్ల్ నామ్ సూన్ (కొరియన్ సిరీస్) - అక్టోబరు 07 అమెజాన్ ప్రైమ్ డెస్పరేట్లీ సీకింగ్ సోల్‌మేట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06 ముంబయి డైరీస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 06 టోటల్లీ కిల్లర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 06 హాట్‌స్టార్ హాంటెడ్ మ్యాన్షన్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 04 లోకి: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06 జీ5 గదర్ 2 (హిందీ సినిమా) - అక్టోబరు 06 ఆహా మిస్టర్ ప్రెగ్నెంట్ (తెలుగు సినిమా) - అక్టోబరు 06 ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు సినిమా) - అక్టోబరు 06 డిస్కవరీ ప్లస్ స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) - అక్టోబరు 06 సినీ బజార్ నీ వెంటే నేను (తెలుగు సినిమా) - అక్టోబరు 06 బుక్ మై షో ద నన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 03 గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 05 ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 06 జియో సినిమా ర్యాట్ ఇన్ ద కిచెన్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 02 మెయిన్ మహ్మమూద్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 03 గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 06 ద డాటర్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 07 (ఇదీ చదవండి: ఓటీటీలో ఈ నెలలో 45కు పైగా సినిమాలు/సిరీస్‌లు, ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?) -
'మగవాళ్లు గర్భం ధరిస్తే ఎలా ఉంటుంది?'.. ఓటీటీలో చూసేయండి!
బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ రియాన్, రూపా కొడువాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మించారు. ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమ్మతనం బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ధారణంగా మహిళలు గర్భం దాలుస్తుంటారు. ఒకవేళ అది మగాడికి వస్తే పరిస్థితి ఏంటి? చివరకు ఏమైంది అనే స్టోరీతో తీసిన మూవీనే 'మిస్టర్ ప్రెగ్నెంట్'. డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించారు. అసలు కథేంటంటే.. గౌతమ్(సోహైల్) ఓ ఫేమస్ టాటూ ఆర్టిస్ట్. చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటాడు. గౌతమ్ అంటే మహి(రూపా కొడవాయుర్)కి చాలా ఇష్టం. కాలేజీ డేస్ నుంచి అతన్ని ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. ఓ సారి ఫుల్‌గా తాగి ఉన్న గౌతమ్‌ని దగ్గరకి వచ్చి ప్రపోజ్ చేస్తుంది మహి. పెళ్లి చేసుకుందాం అని కోరుతుంది. దానికి ఒప్పుకున్న గౌతమ్.. పిల్లలు వద్దనుకుంటేనే పెళ్లి చేసుకుందామని కండీషన్ పెడతాడు. అయితే ఇదంతా గౌతమ్ మద్యంమత్తులో చెప్తాడు. కానీ మహి మాత్రం గౌతమ్ కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయించుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. విషయం తెలుసుకున్న గౌతమ్.. మహికి తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకొని పెళ్లికి ఓకే చెబుతాడు. మహి పేరెంట్స్ మాత్రం పెళ్లికి అంగీకరించరు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటుంది. కొన్నాళ్లపాటు ఎంతో అనోన్యంగా వీరి జీవితం సాగుతుంది. పిల్లలే వద్దనుకున్న గౌతమ్‌కి పెద్ద షాక్ తగులుతుంది. మహి గర్భం దాల్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గౌతమ్ ఎందుకు గర్భం మోయాల్సి వచ్చింది? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఓ మగాడు ప్రెగ్నెంట్ అయితే సమాజం అతన్ని ఎలా చూసింది? చివరకు అతని డెలివరీ సాఫీగా సాగిందా లేదా? అనేదే మిగతా కథ. -
Roopa Koduvayur: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తెలుగు బ్యూటీ
‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రూప కొడువాయూర్. ఈ పేరు వినగానే అంతా మలయాళి అమ్మాయి అనుకుంటారు. కానీ రూప అచ్చమైన తెలుగమ్మాయి. ఈ భామ నేటీవ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. వృత్తిరిత్య డాక్టర్ అయిన రూప నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ.. రూపకు మంచి గుర్తింపు లభించింది. ఇక సోహైల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రం ఆమెకు మరింత గుర్తింపుని తెచ్చిపెట్టింది. బేసిగ్గా తాను క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో సూనసాయంగా నటించగలదు. అద్భుతమైన హవభావాలు పలికిస్తుంది. అదే తనకు ప్లస్ అవుతుంది. తాజాగా ఈ తెలుగమ్మాయికి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. ఓ భారీ యాక్షన్ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిందట. డిసెంబర్లో తెలుగుతో పాటు తమిళ్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రిలో పేరు మోసిన బడా సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అవుతుందని సమాచారం. ఇప్పటికే తనదైన నటనతో ఆకట్టుకుంటున్న రూప.. సరైన సినిమా పడితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. -
మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సయ్యద్ సోహైల్ రియాన్.. బిగ్‌బాస్ తర్వాతే ఈ పేరు చాలామందికి తెలిసొచ్చింది. అప్పటికే కొత్తబంగారు లోకం, జనతా గ్యారేజ్ వంటి చిత్రాల్లో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించిన అతడు వెండితెరపై హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే యురేక, లక్కీ లక్ష్మణ్ సినిమా చేసిన సోహైల్ ఇటీవలే మిస్టర్ ప్రెగ్నెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో రూపా కొడువాయుర్ హీరోయిన్గా నటించింది. ఆగస్టు 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా రోజురోజుకూ వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 రోజుల్లోనే రూ.4.6 కోట్లు రాబట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. సోహైల్ ఎట్టకేలకు మంచి హిట్ కొట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నిజానికి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను శ్రీనివాస్ ఎవరైనా పెద్ద హీరోతో చేయాలనుకున్నాడు. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే సినిమాకు క్రేజ్ రాదని భావించాడు. అలా తన స్నేహితుడైన సోహైల్‌ను పక్కనపెట్టాడు. కానీ అతడు బిగ్‌బాస్ నుంచి రాగానే నువ్వే హీరో అని చెప్పి సోహైల్‌తో సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం సోహైల్.. బూట్ కట్ బాలరాజుతో పాటు, కథ వేరే ఉంటది అనే సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Mic Movies (@mic_movies) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: బర్త్‌డే పార్టీలో డ్యాన్స్ చేసేదాన్ని.. ఆ డబ్బుతో పూట గడిచేది.. -
రీరిలీజ్ చిత్రాలపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా సాగుతోంది. స్టార్ హీరోల పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది నిర్మాతలు. అభిమానులు తమ హీరోల ఓల్డ్ మూవీస్‌ని థియేటర్లలో మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సినిమాలు అయితే ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబట్టాయి. అయితే ఈ రీరిలీజ్ చిత్రాలు బడా నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తుంటే.. చిన్న నిర్మాతలకు మాత్రం భారీ నష్టాన్ని మిగులుస్తోంది. పెద్ద సినిమాలు పోటీలో లేని డేట్ చూసుకొని చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. అదే రోజు రీరిలీజ్ పేరుతో బడా చిత్రాలను రావడం తమకు ఇబ్బందిగా మారిందని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. (చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా?) తాజాగా ఇదే విషయంపై ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ సక్సెస్ మీట్లో నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. చిన్న సినిమాల విడుదల రోజు పెద్ద సినిమాలను రీరిలీజ్ చేయడం ఆపాలని డిమాండ్ చేశాడు. శుక్రవారం కాకుండా సోమ, మంగళ వారాల్లో రీరిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. (చదవండి: రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?) ‘చిన్న సినిమాకి వీకెండ్ స్కోప్ దొరకడమే చాలా కష్టం. అలాంటి స్కోప్‌లో మళ్లీ రీరిలీజ్‌లు అని పాత సినిమాలు విడుదల చేయడం మాలాంటి చిన్న నిర్మాతలకు ఇబ్బంది కలిగిస్తోంది. అలా అని రీరిలీజ్ చిత్రాలను నేను వ్యతిరేకం కాదు. కానీ చిన్న చిత్రాలు విడుదలయ్యే రోజు పెద్ద చిత్రాలను రీరిలీజ్ చేయొద్దని నా విజ్ఞప్తి. శుక్రవారం కాకుండా సోమ, మంగళవారాల్లో రీరిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇదే విషయంపై త్వరలో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఫిర్యాదు చేస్తా’అని అన్నారు. కాగా, ఆగస్ట్ 18న మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంతో పాటు మరో రెండు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అదే రోజు ప్రభాస్ యోగితో పాటు ధనుష్ ‘రఘువరన్ బీటెక్’కూడా థియేటర్స్‌లో మళ్లీ విడుదలైంది. -
‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ
టైటిల్: మిస్టర్ ప్రెగ్నెంట్ నటీనటులు: సోహైల్, రూపా కొడవాయుర్ ,సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: మైక్ మూవీస్ నిర్మాతలు: అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ విడుదల తేది: ఆగస్ట్ 18, 2023 కథేంటంటే.. గౌతమ్(సోహైల్) ఓ ఫేమస్ టాటూ ఆర్టిస్ట్. చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటాడు. గౌతమ్ అంటే మహి(రూపా కొడవాయుర్)కి చాలా ఇష్టం. కాలేజీ డేస్ నుంచి అతన్ని ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. ఓ సారి ఫుల్‌గా తాగి ఉన్న గౌతమ్‌ని దగ్గరకి వచ్చి ప్రపోజ్ చేస్తుంది మహి. పెళ్లి చేసుకుందాం అని కోరుతుంది. దానికి ఒప్పుకున్న గౌతమ్.. పిల్లలు వద్దనుకుంటేనే పెళ్లి చేసుకుందామని కండీషన్ పెడతాడు. అయితే ఇదంతా గౌతమ్ మద్యంమత్తులో చెప్తాడు. కానీ మహి మాత్రం గౌతమ్ కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయించుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. విషయం తెలుసుకున్న గౌతమ్.. మహికి తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకొని పెళ్లికి ఓకే చెబుతాడు. మహి పేరెంట్స్ మాత్రం పెళ్లికి అంగీకరించరు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటుంది. కొన్నాళ్లపాటు ఎంతో అనోన్యంగా వీరి జీవితం సాగుతుంది. పిల్లలే వద్దనుకున్న గౌతమ్‌కి పెద్ద షాక్ తగులుతుంది. మహి గర్భం దాల్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గౌతమ్ ఎందుకు గర్భం మోయాల్సి వచ్చింది? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఓ మగాడు ప్రెగ్నెంట్ అయితే సమాజం అతన్ని ఎలా చూసింది? చివరకు అతని డెలివరీ సాఫీగా సాగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ మగాడు గర్భం దాల్చడం అనే కాస్సెప్టే చాలా కొత్తగా ఉంది. ఇదొక ప్రయోగం కూడా. ఇలాంటి కథలను తెరపై చూపించడం కత్తిమీద సాములాంటిదే. కాస్త తేడా కొట్టినా.. ‘కథ వేరుంటుంది’. తొలి ప్రయత్నంలోనే దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఇలాంటి క్రేజీ పాయింట్‌ని ఎంచుకొని, దాన్ని తెరపై కన్విన్సింగ్‌గా చూపించాడు. కామెడీ, ఎమోషన్స్, ప్రేమ, రొమాన్స్ ఇలా అన్ని ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అయితే వాటిని పూర్తిగా వాడుకోవడంలో మాత్రం కాస్త తడబడ్డారు. ఫస్టాఫ్‌లో కథ రొటీన్‌గా సాగుతుంది. గౌతమ్‌ని మహి ప్రేమించడం.. అతని చుట్టూ తిరగడం..మధ్యలో టాటూ పోటీ నిర్వహించడం.. క్లైమాక్స్ కోసమే అన్నట్లు ఓ విలన్ని పరిచయం చేయడం..ఇలా కథనం సాగుతుంది. అసలు హీరోయిన్ హీరోని ఎందుకు అంత పిచ్చిగా ప్రేమిస్తుందనేది బలంగా చూపించలేకపోయారు. హీరో హీరోయిన్ల పెళ్లి తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆటో సీన్‌తో కథ ఎమోషనల్ వైపు సాగుతుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా భావోద్వేగానికి గురిచేస్తుంది. హీరో ఎందుకు గర్భం దాల్చుతున్నారనేది కన్విన్సింగ్‌గా చూపించారు.ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అప్పటివరకు వైవా హర్ష రొటీన్ కామెడీతో కాస్త విసిగిపోయిన ప్రేక్షకులకు బ్రహ్మాజీ ఎంట్రీ పెద్ద ఊరటనిస్తుంది. ‘గే’క్యారెక్టర్‌తో బ్రహ్మాజీ చేసే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. ఆ తర్వాత వెంటనే కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. గౌతమ్ గర్భం దాల్చిన విషయం వైరల్ కావడం.. ఆ తర్వాత అతను పడే అవమానాలు, భార్య పడే ఇబ్బందులను చాలా బాగా డీల్ చేశారు. ఇక క్లైమాక్స్‌లో ఆడవారి గురించి, గర్భం దాల్చిన సమయంలో వారు పడే ఇబ్బందుల గురించి చేప్పే సీన్ ఎమోషనల్‌కు గురిచేస్తుంది. భార్యకు సాయం చేస్తే అర్థం చేసుకోవడం కానీ ఆడంగితనం ఎలా అవుతుంది? లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఓవరాల్‌గా ఓ డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే 'మిస్టర్ ప్రెగ్నెంట్' ప్రయత్నించండి. ఎవరెలా చేశారంటే.. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. గౌతమ్ పాత్రలో సొహెల్ బాగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించాడు. హీరోయిన్గా చేసిన రూపకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్ తమదైన కామెడీతో నవ్వించారు. డాక్టర్ వసుధగా సుహాసినికి మంచి పాత్ర దక్కింది. మిగతా యాక్టర్స్ తమ పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు పర్వాలేదు. పిక్చరైజేషన్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ సినిమాకు సరిగా సరిపోయింది. సినిమాటోగ్రాఫర్ షఫీ.. తన లెన్స్‌తో మిస్టర్ ప్రెగ్నెంట్‌ని అందంగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని మూవీ చూస్తే అర్థమవుతుంది. -
200 మంది గర్భిణీల కోసం 'మిస్టర్ ప్రెగ్నెంట్' స్పెషల్ షో
బిగ్‌బాస్ ఫేమ్ సొహెల్ హీరోగా నటించిన 'మిస్టర్ ప్రెగ్నెంట్'.. ఆగస్టు 18న థియేటర్లలోకి రాబోతుంది. ట్రైలర్ చూస్తుంటే సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించింది. ప్రమోషన్స్ కూడా కొత్తగా ట్రై చేశారు. ఇప్పుడు గర్భిణీల కోసం స్పెషల్‌గా ప్రీమియర్ షో వేశారు. దీంతో చూసొచ్చిన తర్వాత ఎలా ఉందో చెబుతున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?) సాధారణంగా మహిళలు గర్భం దాలుస్తుంటారు. ఒకవేళ అది మగాడికి వస్తే పరిస్థితి ఏంటి? చివరకు ఏమైంది అనే స్టోరీతో తీసిన మూవీ 'మిస్టర్ ప్రెగ్నెంట్'. సొహెల్, రూప హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు గర్బిణీల కోసం ప్రత్యేకంగా ఓ మల్టీప్లెక్స్ లో ప్రదర్శించారు. చూసొచ్చిన వాళ్లు.. డిఫరెంట్ స్టోరీ, హీరో యాక్టింగ్ బాగుందని మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!) -
ప్రెగ్నెంట్‌గా నటించడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్: సోహైల్
‘నేను బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాను. అయితే సినిమాలో హీరోగా నటిస్తే నన్ను చూసేందుకు థియేటర్ దాకా వస్తారా అనే సందేహం ఉండేది. స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కవుట్ అవుతుంది. వాళ్లకు అభిమానులు ఉంటారు. కానీ నాలాంటి యంగ్ హీరోస్ వెరైటీ మూవీస్, కొత్త ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకులు మన సినిమాలకు వస్తారు అని నమ్మాను. అందుకే మిస్టర్ ప్రెగ్నంట్ వంటి న్యూ జానర్ మూవీ చేస్తున్నాను’ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ అన్నారు. . ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. రేపు(ఆగస్ట్ 18)ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సోహైల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి నాకు ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్. ఈ కథతో ఎవరైనా ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే మనిద్దరం కొత్తవాళ్లమే సినిమాకు క్రేజ్ రాదు అనేవాడు. నేను అప్పటికి బిగ్ బాస్ లోకి వెళ్లలేదు. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఈ సినిమాకు నువ్వు హీరో అని చెప్పి సైన్ చేయించాడు. అలా ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. ► మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో నటించడం నాకొక డిఫరెంట్ ఎక్సీపిరియన్స్. మా ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ నేను ఈ సినిమా ఒప్పుకునేప్పటికి ప్రెగ్నెంట్ గా ఉన్నారు. వాళ్లు ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పనులు చేస్తున్నారు అంతా గమనించాను. అలాగే మా దర్శకుడు శ్రీనివాస్ గుడ్ ఫ్యామిలీ పర్సన్. ఆయన మంచి సూచనలు ఇచ్చేవారు. అలా ఈ క్యారెక్టర్ బాగా చేశాను. ఈ క్యారెక్టర్ చేసేప్పుడు మూడు కిలోల బరువున్న ప్రోత్సటిక్స్ ధరించాను. ఆ కొద్ది బరువే నాకు ఇబ్బందిగా అనిపించేది. తొమ్మిది నెలలు అమ్మ మనల్ని మోసేందుకు ఎంత కష్టపడుతుందో మనం ఊహించుకోవచ్చు. ► ఈ సినిమా షో చూసిన తర్వాత చాలా మంది మహిళలు అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుని చెప్పారు. మా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందని అనేందుకు వాళ్ల రెస్పాన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. దీంతో మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనిపించింది. రేపు థియేటర్ లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. ► ఈ సినిమా అనౌన్స్ చేశాక చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే నన్ను ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని అనుకున్నా. ఈ సినిమా గురించి మా అమ్మ కూడా మొదట్లో నెగిటివ్ గా చెప్పింది. కానీ సినిమా చూశాక ప్రౌడ్ గా ఫీలయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావని నన్ను మెచ్చుకుంది. ► మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా గ్లింప్స్ చూపించినప్పుడు నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. నువ్వు డిఫరెంట్ మూవీ చేస్తున్నావు. కొత్త వాళ్లు ఇలాగే కొత్త ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ►ప్రస్తుతం బూట్ కట్ బాలరాజు షూటింగ్ జరుగుతోంది. కథ వేరే ఉంటది అనే మరో సినిమా చేస్తున్నాను. సెలెక్టెడ్ గా మూవీస్ చేయాలని ఉంది. బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాలా తెలుగులో డిఫరెంట్ మూవీస్ చేయాలని ఉంది. -
ఆ వార్తను పేపర్లో చదివే ఈ సినిమా తీశాను: డైరెక్టర్
సయ్యద్ సోహైల్, రూపాకొడవయూర్ జంటగా శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ– ‘‘నా వ్యక్తిగత జీవితంలోని ఘటనల ఆధారంగా, మేల్ ప్రెగ్నెంట్ అనే వార్తను పేపర్లో చదివి ఈ కథ రాసుకున్నాను. అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి చూడాల్సిన చిత్రం ఇది. తెలుగు పరిశ్రమలో ఓ మంచి సినిమా చేశామనే పేరు వస్తుంది’’ అన్నారు. -
పెద్ద హీరోలతో సినిమాలు చేయడం కష్టమే: నిర్మాత అప్పిరెడ్డి
‘మా సంస్థలో పెద్ద హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. కానీ వాళ్లంతా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వాస్తవానికి వాళ్లను ఒక స్క్రిప్ట్ తో అప్రోచ్ అవడమే కష్టం. వాళ్లకు నచ్చినా రెండు మూడేళ్లు వెయిట్ చేయాలి. ఎక్కువ టైమ్ వెయిట్ చేస్తే అప్పుడు అనుకున్న స్క్రిప్ట్ కూడా ఔట్ డేటెడ్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ మాకు అన్నీ కుదిరితే తప్పకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాం’అని నిర్మాత అప్పిరెడ్డి అన్నారు. బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, రూపా కొడవాయుర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మా మైక్ మూవీస్ సంస్థలో ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాం. మన ప్రేక్షకులకు నచ్చేలా, మన నేటివిటీ ఉంటే కథలతో సినిమాలు చేస్తున్నాం. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’కథలో మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. అయితే మేల్ పెగ్నెన్సీ నేపథ్యం కాబట్టి ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఇది కత్తి మీద సాము లాంటి సినిమా అని చెప్పారు. ఇది ఛాలెంజింగ్ స్క్రిప్ట్. మేము కూడా అలాగే తీసుకుని చేశాం. ఈ చిత్రం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’అని అన్నారు. వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు వేరే హీరోల్ని అనుకున్నాం. అయితే బిగ్ బాస్ చూసినప్పుడు ఆ గేమ్స్ లోని ఎమోషన్ ను సొహైల్ ఇంప్రెసివ్ గా చూపించాడు. అప్పుడే అనుకున్నాం ఈ కథకు హీరోగా బాగుంటాడని. అతనికి ఈ సినిమాలో మంచి పేరొస్తుంది. మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ ను ఎంతో సహజంగా చేశాడు. ఈ సినిమాను కమర్షియల్ మూవీ ఫార్మేట్ లో చూడకూడదు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చూశాక చాలా మంది తమ ఎక్సీపిరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు. మా వైఫ్ ను ప్రెగ్నెంట్ టైమ్ లో ఇంకా బాగా చూసుకుని ఉండాల్సింది అన్నారు. అలా ఎవరికి వారిని వ్యక్తిగతంగా ఆలోచింపజేసే చిత్రమవుతుంది’ అన్నారు. ‘ఇలాంటి కథతో తెలుగులో ఇప్పటివరకు మూవీ రాలేదు. ఇంగ్లీష్ లో వచ్చినా...అది ఎక్స్ పర్ మెంటల్ గా చేశారు. కామెడీ మీద బేస్ అయి ఉంటుంది. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్‌తో సాగే మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రం చూసి అంతా ఎంజాయ్ చేస్తారు’ అని రవీందర్ రెడ్డి సజ్జల అన్నారు. -
ఈ వారం చిన్న సినిమాల సందడే సందడి, ఓటీటీలోనే ఎక్కువ!
ఈ మధ్య వరుసగా చిన్న సినిమాలే రిలీజవుతూ వచ్చాయి. కానీ గత వారం మాత్రం రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అవే జైలర్, భోళా శంకర్. ఒకటి హిట్ టాక్‌ను, మరొకటి మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మరోవైపు ఈ వారం మరిన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగబోతున్నాయి. కొన్ని థియేటర్లో, మరికొన్ని ఓటీటీలోకి రానున్నాయి. అయితే పెద్దగా భారీ బడ్జెట్ సినిమాల సందడైతే కనిపించడం లేదు. లవ్, హారర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఇలా అన్ని జానర్ల సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగుతున్నాయి. మరి ఆ సినిమాలేంటి? ఏయే సినిమాలో థియేటర్లో రిలీజవుతున్నాయి? ఓటీటీలోకి వస్తున్న కొత్త చిత్రాలేంటి? అనేవి చూసేద్దాం.. థియేటర్లో రిలీజవుతున్న సినిమాలు.. ► మిస్టర్ ప్రెగ్నెంట్ - ఆగస్టు 18 ► ప్రేమ్ కుమార్ - ఆగస్టు 18 ► జిలేబి - ఆగస్టు 18 ► డీడీ రిటర్న్స్: భూతాల బంగ్లా - ఆగస్టు 18 ► పిజ్జా - ఆగస్టు 18 ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్ ► హర్లాన్ కొబెన్స్ షెల్టర్ (వెబ్ సిరీస్) - ఆగస్టు 18 నెట్‌ఫ్లిక్స్ ► నో ఎస్కేప్ రూమ్ (హాలీవుడ్) - ఆగస్టు 15 ► అన్‌టోల్డ్: ఆల్ ఆఫ్ షేమ్ (హాలీవుడ్) - ఆగస్టు 15 ► డెప్ వర్సెస్ హర్డ్ (డాక్యుమెంటరీ సిరీస్) - ఆగస్టు 16 ► గన్స్ అండ్ గులాబ్స్ (తెలుగు డబ్) - ఆగస్టు 18 ► మాస్క్ గర్ల్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 18 జీ5 ► ఛత్రపతి (హిందీ) - ఆగస్టు 15 బుక్‌మై షో ► డాంఫైర్ (హాలీవుడ్) - ఆగస్టు 15 ► బాబిలోన్ 5: రోడ్ హోమ్ (హాలీవుడ్)- ఆగస్టు 15 ► స్టోరీస్ నాట్ టూబీ టోల్డ్ (హాలీవుడ్) - ఆగస్టు 15 జియో ► తాలి(హిందీ) - ఆగస్టు 15 ► ఫ సే ఫాంటసీ కొత్త సీజన్ (హిందీ) - ఆగస్టు 17 లయన్స్ గేట్ ప్లే ► మైండ్ కేజ్ (హాలీవుడ్) - ఆగస్టు 15 చదవండి: భోళా ఎఫెక్ట్.. నిర్మాతతో చిరు గొడవ? ఏం జరిగిందో చెప్పిన బేబి డైరెక్టర్ -
మిస్టర్ ప్రెగ్నెంట్.. అంతా ఉల్టా పల్టా
సయ్యద్ సోహైల్ రియాన్, రూపాకొడవాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘ఉల్టా పల్టా..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ – ‘‘అమ్మతనం బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాశాను. సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి జాగ్రత్తగా రూ΄÷ందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్. వాళ్లను చూసి ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’’ అన్నారు సోహైల్. ‘‘పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ చూసి, మంచి సినిమా చేశారని ప్రశంసించారు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘యూఎస్‌లో 100 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ అన్నపరెడ్డి. ‘‘అప్పిరెడ్డి జడ్జిమెంట్ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాం’’ అన్నారు రవీందర్ రెడ్డి సజ్జల. -
ట్రైలర్ ఎమోషనల్‌గా ఉంది: నాగార్జున
‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనగానే మగవాళ్లు ఎలా ప్రెగ్నెంట్ అవుతారు? ఆ అంశాన్ని ఎలా చూపించారు? అనే ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ ఎమోషనల్‌గా చాలా బాగుంది’’ అన్నారు నాగార్జున. సోహైల్, రూపా కొడవయూర్ జంటగా శ్రీనివాస్ వింజనంపా టి దర్శకత్వంలో అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. శనివారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘సోహైల్ ఈ సినిమాను పట్టుదలతో చేశాడనిపిస్తోంది. శ్రీనివాస్‌కు ఇది తొలి సినిమానే అయినా డిఫికల్ట్ సబ్జెక్ట్‌ను బాగా తెరకెక్కించాడని అర్థమవుతోంది. ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ రెండూ ఉంటాయి’’ అన్నారు సోహైల్. ‘‘ఎంతోమంది ప్రతిభావంతులను పరిచయం చేసిన ఘనత నాగార్జునగారికే దక్కింది’’ అన్నారు రవిరెడ్డి సజ్జల. ‘‘యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం’’ అన్నారు వెంకట్ అన్నపరెడ్డి. ‘‘మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘డెలివరీ కోసం అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథ ఇది’’ అన్నారు శ్రీనివాస్ వింజనంపా టి. -
అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు) హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోహైల్‌తో పాటు దీప్తి నల్లమోతు,రూపా,అలీ రెజా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సోహైల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా సమయంలో చాలా మంది అవమానించారని ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. (ఇదీ చదవండి: రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్) ఇక్కడ లైఫ్‌లో ముందుకెళ్లాలి.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా..? వీడు రియాల్టీ షో నుంచి వచ్చాడు, చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు అని అంటూ ఉంటే ఒక్కోసారి భయమేస్తూ ఉంటుందని ఆయన ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు కొందరు నెగిటివ్ కామెంట్లు చేశారు. తర్వాత ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఏందిరా ఈ తేడా గాడు.. అది ఇది అంటూ హేళన చేశారని ఆయన స్టేజీపైనే అందరి ముందు కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఆయన్ను అభిమానించే వారు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. -
సోహైల్ సరికొత్త ప్రయోగం.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వచ్చేస్తుంది
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తెలుగు తెరపై ఇదొక కొత్త తరహా ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. సినిమా ఔట్ పుట్ విషయంలో చిత్రబృందం సంతృప్తిగా ఉన్నారు. రిలీజ్ కు కూడా ఆగస్టు 18 మంచి డేట్ గా భావిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. -
Mr Pregnant: ఆడవాళ్లు గ్రేట్ సార్.. ఆకట్టుకుంటున్న సోహైల్ డైలాగ్
ఆడవాళ్లు చాలా గ్రేట్ అంటున్నాడు ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహైల్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (చదవండి: మహేశ్ కోసం ఆ హీరోని పక్కకు పెట్టిన పరశురాం..నెక్ట్స్ అతనితోనే మూవీ!) కాగా, మదర్స్‌డే సందర్భంగా ఆదివారం ఆ చిత్రం నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో గ్లింప్స్ లో అమ్మ గురించి సుహాసిని, సొహైల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తొమ్మిది నెలల కష్టాన్ని నవ్వుతూ భరిస్తూ ఒక బిడ్డకి జన్మనివ్వడం.అది చావుకు తెగించి... ఈ ఆడవాళ్లు గ్రేట్ సార్ అంటూ సొహైల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఉద్వేగంగా ఉంది. ఈ చిత్రంలో సోహైల్ ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తుది దశలో ఉన్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.