
‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రూప కొడువాయూర్. ఈ పేరు వినగానే అంతా మలయాళి అమ్మాయి అనుకుంటారు. కానీ రూప అచ్చమైన తెలుగమ్మాయి. ఈ భామ నేటీవ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. వృత్తిరిత్య డాక్టర్ అయిన రూప నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ.. రూపకు మంచి గుర్తింపు లభించింది. ఇక సోహైల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రం ఆమెకు మరింత గుర్తింపుని తెచ్చిపెట్టింది.
బేసిగ్గా తాను క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో సూనసాయంగా నటించగలదు. అద్భుతమైన హవభావాలు పలికిస్తుంది. అదే తనకు ప్లస్ అవుతుంది. తాజాగా ఈ తెలుగమ్మాయికి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. ఓ భారీ యాక్షన్ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిందట. డిసెంబర్‌లో తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రిలో పేరు మోసిన బడా సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అవుతుందని సమాచారం. ఇప్పటికే తనదైన నటనతో ఆకట్టుకుంటున్న రూప.. సరైన సినిమా పడితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు.
Comments
Please login to add a commentAdd a comment