
సయ్యద్ సోహైల్ రియాన్, రూపాకొడవాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘ఉల్టా పల్టా..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ – ‘‘అమ్మతనం బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాశాను.
సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి జాగ్రత్తగా రూ΄÷ందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్. వాళ్లను చూసి ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’’ అన్నారు సోహైల్. ‘‘పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ చూసి, మంచి సినిమా చేశారని ప్రశంసించారు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘యూఎస్‌లో 100 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ అన్నపరెడ్డి. ‘‘అప్పిరెడ్డి జడ్జిమెంట్ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాం’’ అన్నారు రవీందర్ రెడ్డి సజ్జల.
Comments
Please login to add a commentAdd a comment