
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికను పెళ్లాడారు. 2023లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. భూమా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వల్లే మంచు మనోజ్ ఆమెను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.
గతేడాది ఈ జంట ముద్దుల కూతురిని తమ జీవితంలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా తమ గారాలపట్టికి దేవసేన శోభ అని శోభనాగిరెడ్డి పేరు కలిసేలా నామకరణం చేశారు. ఈ జంటకు ఏప్రిల్ 2, 2024లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇవాళ తమ కూతురి మొదటి పుట్టినరోజు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ సైతం చిన్నారి దేవసేన తొలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. తనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను వ్యక్తం చేసింది.
ఇక మనోజ్, మౌనిక దంపతులు తమ ముద్దుల కూతురి దేవసేన తొలి పుట్టినరోజు ఫోటోలను షేర్ చేశారు. ఓ పురాతన కట్టడంలో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ కూతురిపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఏడాది క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురిగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. ఒక తిరుగులేని బంధం. ఈ నాలుగు పిల్లర్స్ ప్రేమ, బలంతో నిర్మించిన కుటుంబం. మా ఎంఎం పులి.. దేవసేన శోభ. నువ్వు మా జీవితాల్లో వెలుగు, ధైర్యంతో పాటు అనంతమైన ఆనందాన్ని తెచ్చావు. అమ్మా, నేనూ, ధైరవ్ అన్నా నికు ఎప్పటికీ రక్షణగా ఉంటాం. అద్భుతం, ఆరోగ్యం, అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. నీకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం.' అంటూ కూతురిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మనోజ్ దంపతుల ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.