నా జీవితంలో నువ్వే ఇన్‌స్పిరేషన్‌: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ | Tollywood Hero Manchu Manoj Special Wishes His Wife Mounika | Sakshi
Sakshi News home page

Manchu Manoj: భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన మంచు మనోజ్.. పోస్ట్ వైరల్!

Oct 4 2024 3:30 PM | Updated on Oct 4 2024 5:46 PM

Tollywood Hero Manchu Manoj Special Wishes His Wife Mounika

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాదిలో తండ్రిగా ప్రమోషన్ కొట్టేశాడు కూడా. హీరో మంచు మనోజ్- మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మించింది. ఏప్రిల్‌లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.

(ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)

తాజాగా తన భార్య మౌనిక పుట్టిన రోజు కావడంతో మంచు మనోజ్‌ విషెస్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తన భాగస్వామికి బర్త్‌ డే శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా జీవితంలో సూపర్ వుమెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నాకు ప్రేరణగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు. పిల్లల కోసం నువ్వు రూపొందించిన ఎడ్యుకేషన్‌ గేమింగ్ యాప్‌ లాంఛ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మంచు మనోజ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మౌనికకు బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు. 

సంతోషాలు నింపావ్: మంచు లక్ష్మి

మంచు మనోజ్ భార్య భూమా మౌనికకు నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. హ్యపీ బర్త్‌ డే మౌనిక.. మా జీవితాల్లో చాలా సంతోషాన్ని తీసుకొచ్చావ్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. మౌనికతో పాటు దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. కాగా.. మనోజ్- మౌనికల వివాహా వేడుక మంచు లక్ష్మి ఇంట్లోనే గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అన్నీ తానై ముందుండి వారి పెళ్లిని జరిపించింది. 

manchu
 

Advertisement
 
Advertisement
Advertisement