![Sohel Mr Pregnant Movie special glimpse video out - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/8/sohel.jpg.webp?itok=Nru_R7fF)
ఆడవాళ్లు చాలా గ్రేట్ అంటున్నాడు ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహైల్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
(చదవండి: మహేశ్ కోసం ఆ హీరోని పక్కకు పెట్టిన పరశురాం..నెక్ట్స్ అతనితోనే మూవీ!)
కాగా, మదర్స్‌డే సందర్భంగా ఆదివారం ఆ చిత్రం నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో గ్లింప్స్ లో అమ్మ గురించి సుహాసిని, సొహైల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తొమ్మిది నెలల కష్టాన్ని నవ్వుతూ భరిస్తూ ఒక బిడ్డకి జన్మనివ్వడం.అది చావుకు తెగించి... ఈ ఆడవాళ్లు గ్రేట్ సార్ అంటూ సొహైల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఉద్వేగంగా ఉంది. ఈ చిత్రంలో సోహైల్ ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తుది దశలో ఉన్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment