
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది.
హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తెలుగు తెరపై ఇదొక కొత్త తరహా ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. సినిమా ఔట్ పుట్ విషయంలో చిత్రబృందం సంతృప్తిగా ఉన్నారు. రిలీజ్ కు కూడా ఆగస్టు 18 మంచి డేట్ గా భావిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment