
సోహైల్, నాగార్జున, రూపా కొడవయూర్
‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనగానే మగవాళ్లు ఎలా ప్రెగ్నెంట్ అవుతారు? ఆ అంశాన్ని ఎలా చూపించారు? అనే ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ ఎమోషనల్‌గా చాలా బాగుంది’’ అన్నారు నాగార్జున. సోహైల్, రూపా కొడవయూర్ జంటగా శ్రీనివాస్ వింజనంపా టి దర్శకత్వంలో అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.
శనివారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘సోహైల్ ఈ సినిమాను పట్టుదలతో చేశాడనిపిస్తోంది. శ్రీనివాస్‌కు ఇది తొలి సినిమానే అయినా డిఫికల్ట్ సబ్జెక్ట్‌ను బాగా తెరకెక్కించాడని అర్థమవుతోంది. ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ ఉంటాయి’’ అన్నారు సోహైల్. ‘‘ఎంతోమంది ప్రతిభావంతులను పరిచయం చేసిన ఘనత నాగార్జునగారికే దక్కింది’’ అన్నారు రవిరెడ్డి సజ్జల. ‘‘యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం’’ అన్నారు వెంకట్ అన్నపరెడ్డి. ‘‘మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘డెలివరీ కోసం అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథ ఇది’’ అన్నారు శ్రీనివాస్ వింజనంపా టి.
Comments
Please login to add a commentAdd a comment