sohail
-
వినోదాల బాలరాజు
సోహైల్ టైటిల్ రోల్ చేసిన సినిమా ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సోహైల్ మాట్లాడుతూ– ‘‘నేను షార్ట్‌ఫిల్మ్ నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాను. హీరో వెంకటేశ్‌గారికి మా సినిమా గురించి మెసేజ్ చేశాను. ఆల్ ది బెస్ట్ చెబుతూ, వాయిస్ మెసేజ్ పంపారు. అంత పెద్ద హీరో రిప్లయ్ ఇవ్వడం ధైర్యాన్నిచ్చింది. నాలాంటి యంగ్ స్టర్స్ ఇలాంటి సపోర్ట్ ఆశిస్తారు. పాషాగారు హార్డ్‌వర్క్ చేసి, ఈ సినిమా తీశారు’’ అన్నారు. ‘‘వినోదాత్మక చిత్రమిది’’ అన్నారు శ్రీ కోనేటి. -
నేల మీద నేను ఉన్నా...
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా రూపొందిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ‘నేల మీద నేను ఉన్నా..’ అంటూ సాగే ఫాస్ట్ మాస్ బీట్ సాంగ్‌ను బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ విడుదల చేశారు. కొల్లి చైతన్య స్వరపరచిన ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా వీఎం మహాలింగం, ఎంఎం మానసి ఆలపించారు. -
మాస్ రింగు...
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్– కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా నిర్మిస్తున్నారు. మేçఘా లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘రింగు రింగు బిళ్ల..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకి దేవ్ పవార్ సాహిత్యం అందించగా, భోలే షావలి, రఘురామ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘ఫుల్ మాస్‌గా ‘రింగు రింగు బిళ్ల..’ సాంగ్ ఉంటుంది. సోహైల్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు మేకర్స్. -
'మగవాళ్లు గర్భం ధరిస్తే ఎలా ఉంటుంది?'.. ఓటీటీలో చూసేయండి!
బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ రియాన్, రూపా కొడువాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మించారు. ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమ్మతనం బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ధారణంగా మహిళలు గర్భం దాలుస్తుంటారు. ఒకవేళ అది మగాడికి వస్తే పరిస్థితి ఏంటి? చివరకు ఏమైంది అనే స్టోరీతో తీసిన మూవీనే 'మిస్టర్ ప్రెగ్నెంట్'. డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించారు. అసలు కథేంటంటే.. గౌతమ్(సోహైల్) ఓ ఫేమస్ టాటూ ఆర్టిస్ట్. చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటాడు. గౌతమ్ అంటే మహి(రూపా కొడవాయుర్)కి చాలా ఇష్టం. కాలేజీ డేస్ నుంచి అతన్ని ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. ఓ సారి ఫుల్‌గా తాగి ఉన్న గౌతమ్‌ని దగ్గరకి వచ్చి ప్రపోజ్ చేస్తుంది మహి. పెళ్లి చేసుకుందాం అని కోరుతుంది. దానికి ఒప్పుకున్న గౌతమ్.. పిల్లలు వద్దనుకుంటేనే పెళ్లి చేసుకుందామని కండీషన్ పెడతాడు. అయితే ఇదంతా గౌతమ్ మద్యంమత్తులో చెప్తాడు. కానీ మహి మాత్రం గౌతమ్ కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయించుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. విషయం తెలుసుకున్న గౌతమ్.. మహికి తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకొని పెళ్లికి ఓకే చెబుతాడు. మహి పేరెంట్స్ మాత్రం పెళ్లికి అంగీకరించరు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటుంది. కొన్నాళ్లపాటు ఎంతో అనోన్యంగా వీరి జీవితం సాగుతుంది. పిల్లలే వద్దనుకున్న గౌతమ్‌కి పెద్ద షాక్ తగులుతుంది. మహి గర్భం దాల్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గౌతమ్ ఎందుకు గర్భం మోయాల్సి వచ్చింది? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఓ మగాడు ప్రెగ్నెంట్ అయితే సమాజం అతన్ని ఎలా చూసింది? చివరకు అతని డెలివరీ సాఫీగా సాగిందా లేదా? అనేదే మిగతా కథ. -
నాలాంటివాళ్లు కొత్త కథలే చేయాలి – సోహైల్
‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రీమియర్ షో చూశాక చాలా మంది మహిళలు అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని కన్నీళ్లు పెట్టుకుని చెప్పా రు. దీంతో మా ప్రయత్నం విజయవంతం అయిందనిపించింది’’ అన్నారు సయ్యద్ సోహైల్ రియాన్. శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వంలో సయ్యద్ సోహైల్, రూపా కొడవయూర్ జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సోహైల్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘స్టార్ హీరో లకు ఫ్యాన్స్ ఉంటారు. కమర్షియల్ సినిమాలు చేసినా వర్కవుట్ అవుతుంది. కానీ, నాలాంటి వాళ్లు కొత్త ప్రయత్నాలు చేస్తేనే ప్రేక్షకులు సినిమాలకు వస్తారని నమ్మాను. అందుకే ‘బిగ్ బాస్’ నుంచి రాగానే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వంటి కొత్త జానర్ మూవీ చేశాను. మేల్ ప్రెగ్నెన్సీ నిజంగా సాధ్యమైతే కనీసం 20 శాతం మంది మేల్స్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం కోసం రెడీగా ఉన్నారు’’ అన్నారు. -
ఆ వార్తను పేపర్లో చదివే ఈ సినిమా తీశాను: డైరెక్టర్
సయ్యద్ సోహైల్, రూపాకొడవయూర్ జంటగా శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ– ‘‘నా వ్యక్తిగత జీవితంలోని ఘటనల ఆధారంగా, మేల్ ప్రెగ్నెంట్ అనే వార్తను పేపర్లో చదివి ఈ కథ రాసుకున్నాను. అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి చూడాల్సిన చిత్రం ఇది. తెలుగు పరిశ్రమలో ఓ మంచి సినిమా చేశామనే పేరు వస్తుంది’’ అన్నారు. -
ట్రైలర్ ఎమోషనల్‌గా ఉంది: నాగార్జున
‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనగానే మగవాళ్లు ఎలా ప్రెగ్నెంట్ అవుతారు? ఆ అంశాన్ని ఎలా చూపించారు? అనే ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ ఎమోషనల్‌గా చాలా బాగుంది’’ అన్నారు నాగార్జున. సోహైల్, రూపా కొడవయూర్ జంటగా శ్రీనివాస్ వింజనంపా టి దర్శకత్వంలో అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. శనివారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘సోహైల్ ఈ సినిమాను పట్టుదలతో చేశాడనిపిస్తోంది. శ్రీనివాస్‌కు ఇది తొలి సినిమానే అయినా డిఫికల్ట్ సబ్జెక్ట్‌ను బాగా తెరకెక్కించాడని అర్థమవుతోంది. ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ రెండూ ఉంటాయి’’ అన్నారు సోహైల్. ‘‘ఎంతోమంది ప్రతిభావంతులను పరిచయం చేసిన ఘనత నాగార్జునగారికే దక్కింది’’ అన్నారు రవిరెడ్డి సజ్జల. ‘‘యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం’’ అన్నారు వెంకట్ అన్నపరెడ్డి. ‘‘మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘డెలివరీ కోసం అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథ ఇది’’ అన్నారు శ్రీనివాస్ వింజనంపా టి. -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ జిమ్‌లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్‌లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్‌లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్‌ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్‌ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్‌నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
' ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు ' మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
క్యారెక్టర్ ఉంటే తిరుగుండదు
‘‘యాక్టర్ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ, సక్సెస్ఫుల్ యాక్టర్ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్ కావాలి.. అది ఉంటే తిరుగుండదని ఈ తరం నటీనటులకు చెబుతున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదం’ సినిమా తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ప్రేక్షకుల నవ్వులు చూసేందుకు ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. మీనా మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో 30ఏళ్ల తర్వాత ఈ మూవీలో చేశాను. కృష్ణారెడ్డిగారితో సినిమా చేసే అవకాశం ఇన్నేళ్లకు కుదిరింది. తొలిసారి ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో (కల్పన) పని చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు సోహైల్. -
నా భర్త విడాకులకు నేను కారణం కాదు - హన్సిక
గత ఏడాది డిసెంబరు 4న వ్యాపారవేత్త సోహైల్ కతురియా, హీరోయిన్ హన్సికల వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరి ప్రేమ, పెళ్లి గురించిన సంగతులతో ‘లవ్ షాదీ డ్రామా’ అనే వీడియో ఒకటి ఓ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీడియోలో హన్సిక పంచుకున్న విషయాల్లో సోహైల్ మొదటి పెళ్లి గురించిన అంశం ఒకటి. ‘‘సోహైల్, నా పెళ్లి గురించిన విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నాను. నేను సెలబ్రిటీని కావడం వల్ల కాబోలు అవన్నీ బహిర్గతం అయ్యాయి. సోహైల్ విడాకులు తీసుకోవడానికి నేనే కారణమని వార్తలు వచ్చాయి. సోహైల్ పెళ్లి (మొదటి పెళ్లి)లో నేను పాల్గొన్న ఫోటోలను షేర్ చేసి, కొందరు నన్ను విమర్శించారు కూడా. నిజం చెప్పాలంటే సోహైల్ విడాకులకు నేను కారణం కాదు. నా భర్తకు గతంలో పెళ్లయిన విషయం నాకు తెలుసు. వారికి అధికారికంగా విడాకులు వచ్చాయి’’ అని చెప్పుకొచ్చారు హన్సిక. అలాగే ‘‘గతంలో నేనో రిలేషన్లో ఉన్నాను. ఈ విషయం అందరికీ తెలుసు. మళ్లీ అలాంటి బంధాన్ని కొనసాగించాలని లేదు. అందుకే పెళ్లి చేసుకున్నాను. సోహైల్ నా జీవితంలోకి వచ్చిన క్షణాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇకపై నా భర్తతోనే నేను పబ్లిక్‌లోకి రావాలనుకుంటున్నాను’’ అని కూడా పేర్కొన్నారు హన్సిక. ఇక తన మొదటి వివాహం విఫలం కావడానికి హన్సిక కారణం కాదని సోహైల్ కూడా పేర్కొన్నారు. 2014లో రింకీ బజాజ్‌ను పెళ్లాడారు సోహైల్. ‘‘ఆ వివాహ బంధం చాలా కొద్ది కాలం మాత్రమే సాగింది’’ అన్నారు సోహైల్. రింకీ, సోహైల్‌కి హన్సిక కామన్ ఫ్రెండ్ కావడంతో ఆ పెళ్లికి వెళ్లారామె. ఆ పెళ్లి వీడియోలో హన్సిక డ్యాన్స్ చేశారు కూడా. ఆ వీడియోను షేర్ చేసి, ఒక ఫ్రెండ్ వైవాహిక జీవితం ముగియడానికి కారణం హన్సిక అంటూ వచ్చిన వార్తలకు ‘లవ్ షాదీ డ్రామా’ ద్వారా స్పందించారు హన్సిక, సోహైల్. -
పెళ్లైన వ్యక్తితో హన్సిక ప్రేమ.. తల్లిని ఎలా ఒప్పించిందంటే..
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలె వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లికి మొదట్లో కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక తన వెడ్డింగ్ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనికి సోహైల్‌కు ఇది వరకే పెళ్లై, విడాకులు తీసుకోవడం కారణమని తెలుస్తుంది. ఇక పెళ్లకి ముందు కూడా సోహైల్ గురించి వచ్చిన వార్తలు తనను ఇబ్బంది పెట్టినట్లు చెబుతూ హన్సిక బాగా ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంంది. మొత్తంగా హన్సిక కూడా సాధారణ అమ్మాయిలానే ప్రియుడితో పెళ్లికి ఒప్పించడానికి చాలానే కష్టపడినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. -
పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట కావడం ఆనందంగా ఉంది: హన్సిక
పెళ్లయ్యాక వచ్చిన తొలి పండగ సంక్రాంతి సంబరాల్లో ఉన్న హన్సిక తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 4న వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం జరిగింది. పెళ్లి తర్వాత షూటింగ్స్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారామె. ఇక సంక్రాంతి సంబరాల గురించి హన్సిక ఈ విధంగా చెప్పారు. సంక్రాంతి మనందరికీ పెద్ద పండగ. మాకు నార్త్‌లో అయితే 13 నుంచి 16వ తేదీ వరకూ పండగ చేసుకుంటాం. శుక్రవారం లోరీ (భోగి పండగ) జరుపుకున్నాం. లోరీ అంటే మాకు నువ్వుల లడ్డు తప్పనిసరి. హల్వా కూడా చేస్తాం. మా అత్తగారింట్లో సంప్రదాయాలు బాగా పాటిస్తారు. కోడలు హల్వా చేయడం ఆనవాయితీ. సో.. లోరీకి నేనే హల్వా తయారు చేశాను. ఇంకా వేరుశెనగ పప్పుతో బర్ఫీ చేస్తాం. లోరీ మంటలో మరమరాలు, పేలాలు వంటివన్నీ వేస్తాం. అగ్నికి చెడు ఆహుతైపోవాలని, రానున్న రోజులన్నీ బాగుండాలని కోరుకుంటూ, మంట చుట్టూ తిరుగుతాం. పుట్టిల్లు.. అత్తిల్లు ఒకేచోటే... సంక్రాంతి సందర్భంగా మా అత్తగారు మా పుట్టింటివాళ్లని ఆహ్వానించారు. లోరీ రోజు మా అమ్మవాళ్లు వచ్చారు. పండగ పనులకు అమ్మ సాయం చేశారు. ఆ రోజంతా ఉండి, ఎంజాయ్ చేసి వెళ్లారు. పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట.. అంటే ముంబైలోనే కావడం ఆనందంగా ఉంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఇలా పండగలప్పుడు కలుసుకునే వీలుంటుంది. గ్రాండ్‌గా పండగ లోరీని ఘనంగా జరిపినట్లే మిగతా మూడురోజుల పండగను కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. నిష్టగా పూజలు చేయడం, పిండి వంటలు చేయడం.. అన్నింటినీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఇక పండగ అంటే ఇతరులను కూడా సంతోషపెట్టాలన్నది నా అభిప్రాయం. నా చిన్నప్పుడే మా అమ్మగారు నాకీ విషయం చెప్పి, ఇతరులకు సహాయపడేలా చేస్తుంటారు. పిల్లలకు కొత్త బట్టలు కొన్నాం ‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది’ అని మా అమ్మ అంటుంటారు. అందుకే టీనేజ్‌లో నేను హీరోయిన్ అయ్యాక కొంతమంది పిల్లలను దత్తత తీసుకునేలా చేశారు, ఇప్పుడు మేం మొత్తం 31 మంది పిల్లల ఆలనా పాలనా చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు కొన్నాం. స్వీట్లు పంచి పెట్టాం. పిల్లల ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ఆనందం తాలూకు ఆశీర్వాదాలు మనకు అందుతాయి. ఆ దేవుడి ఆశీర్వాదం ఉండటంవల్లే నా జీవితం సాఫీగా సాగిపోతోంది. ఈ 20 నుంచి ఫుల్ బిజీ పెళ్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్‌కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. ఈ మధ్యే యాడ్ షూట్స్‌లో పాల్గొన్నాను. ఇక ఈ నెల 20న నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయబోతున్నాను. దాదాపు ఏడు సినిమాలు కమిట్ అయ్యాను. రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. వీటితో బిజీ అయిపోతాను కాబట్టి ఈ పండగను వీలైనంత ప్రశాంతంగా జరుపుకుంటున్నాను. మరోవైపు మా ఆయన కూడా తన బిజినెస్ పనులతో బిజీ అయిపోతారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలని ఇద్దరం మాట్లాడుకున్నాం. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ దేవుడి దయ వల్ల అందరి జీవితాలూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
‘లక్కీ లక్ష్మణ్.. మంచి కాఫీలాంటి సినిమా’
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్, మోక్ష హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఎ.ఆర్. అభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రం బృందంగా ఇటీవల ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ లాంచ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్కీ లక్ష్మణ్ మూవీ ఫస్ట్‌లుక్ చాలా బాగుందని, దర్శక, నిర్మాతలకు ఇది తొలి చిత్రమే అయిన మూవీ బాగా తీశాకరన్నారు. అలాగే లక్కీ లక్ష్మణ్ మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం హీరో సోహైల్ మాట్లాడుతూ.. అనిల్ అన్న చేతుల మీదుగా తన మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, తన బిజీ షెడ్యూల్లో సైతం తమ మూవీ ఫస్ట్‌లుక్ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన మూవీ దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారన్నాడు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్పుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్‌తో నిర్మించారని సోహైల్ తెలిపాడు. నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు ఒక మంచి కాఫీలాంటి సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్ కీత. -
నటుడు బ్రహ్మాజీ కొడుకు హీరోగా మరో సినిమా..
Actor Brahmaji Son Sanjay Rao New Movie Shooting Launched: నటుడు బ్రహ్మాజీ తనయుడు, 'ఓ పిట్టకథ' ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రంతో ఏఆర్ శ్రీధర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీరామనవమి పండగ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సోహైల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ ఇచ్చారు. రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును యూనిట్‌కి అందించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ జె. రెడ్డి కెమెరా వర్క్ చేయగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. లైన్ ప్రొడ్యూసర్‌గా రమేష్ కైగురి, సహ నిర్మాతలుగా చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం వ్యహరించారు. చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ -
జాగ్రత్త అంటోన్న అక్షయ్, అవి కూడా జీవితాన్నిఇస్తాయంటున్నా అరియాన
తక్కువ విచారించండి, ఎక్కువ నవ్వండి: ప్రగ్యా జైస్వాల్ కొన్ని సమయంలో జీవం లేని వస్తువులు కొత్త జీవితాన్ని ఇస్తాయంటున్న అరియాన గ్లోరీ రణ్వీర్ సింగ్‌కు అలియారేఅలియా స్టేప్పులేస్తున్న అక్షయ్ కుమార్. ఈ స్టెప్పులతో జాగ్రత్త అంటూ హెచ్చరిక ‘నేటి ఈ కష్టం రేపటి మీ బంగారు భవిష్యత్తుకు పునాది’ అంటున్న ప్రియమణి View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
పాకిస్తాన్ 482 ఆలౌట్
దుబాయ్: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హరిస్ సొహైల్ (240 బంతుల్లో 110; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 482 పరుగుల భారీ స్కోరు సాధించింది. అసద్ షఫీక్ (165 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఓవర్‌నైట్ స్కోరు 255/3తో సోమవారం బ్యాటింగ్ కొనసాగించిన ఆ జట్టును హరిస్, అసద్ ముందుకు నడిపించారు. ఐదో వికెట్‌కు 150 పరుగులు జోడించారు. మరింత భారీ స్కోరు ఖాయమనుకుంటున్న దశలో ఈ ఇద్దరితో పాటు బాబర్ అజమ్ (4) అవుటయ్యాడు. కెప్టెన్ సర్ఫరాజ్ (15) కూడా విఫలమవడంతో పాక్ ఇన్నింగ్స్ తొందరగానే ముగిసింది. సిడిల్ 3, నాథన్ లయన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 13 ఓవర్ల పాటు సాగిన ఆటలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా 30 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా (17 బ్యాటింగ్), ఆరోన్ ఫించ్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
నాకు బతకాలని ఉంది!
ఒంగోలు (ప్రకాశం): ‘నాకు బతకాలని ఉంది.. కానీ నా పరిస్థితి దినదినగండంగా మారింది. ఏడాది నుంచి అనారోగ్యం నన్ను కబళించివేస్తుంటే.. చికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక నా కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. చికిత్సకు రూ.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దయచేసి నన్ను ఆదుకోండి’ అంటూ స్థానిక జిల్లా జైలు ఎదురుగా ఉన్న సిరి ఈవెంట్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొహైల్ అనే బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... సొహైల్ తండ్రి మొయీన్ అహ్మద్ దంపతులకు ఇద్దరు సంతానం. రెండో సంతానమైన సొహైల్‌కు పుట్టినప్పటి నుంచి అనారోగ్యంగానే ఉండేది. వైద్యులు పరీక్షించి పలు మందులు రాసేవారు. వాటిని వాడుతూ వచ్చారు. 9వ తరగతి వరకు పాఠశాలకు పంపారు. అనారోగ్యం కారణంగా వారంలో మూడురోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది. ఆ తర్వాత మరింత నీరసిస్తుండటంతో బడి మాన్పించేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. టేబుల్ మీద కనిపించే బొమ్మలను తానే తయారుచేస్తూ తాను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ నుంచి విముక్తి కోసం, భగవంతుడి కృప కోసం ఎదురుచూస్తోంది. తండ్రి చికెన్ పకోడీ బండి పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే.. సోదరుడు ఇప్పుడిప్పుడే వెబ్‌డిజైనింగ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలబడేందుకు కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏడాది క్రితం స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు వైద్యశాలలో సొహైల్‌కు చూపించగా, వైద్యులు సొహైల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అపోలో హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. దీంతో ఆమెకు స్కానింగ్ తీసి పరిశీలించిన అపోలో వైద్యులు.. గుండెకు మూడు రంధ్రాలున్నట్లు నిర్ధారించారు. పల్మనరీ హైపర్ టెన్షన్, వెంట్రిక్యులర్ సెప్టిన్ డిఫెక్ట్, యెజెనెమెంజర్స్ సిండ్రోమ్ అనే మూడు రకాల సమస్యలు ఆమె హృదయానికి ఉన్నాయని, ఆమె జీవించాలంటే గుండె మార్పిడి తప్పనిసరని తెలిపారు. ఆపరేషన్‌కు ముందు రూ.2 లక్షలు, ఆపరేషన్‌కు రూ.30 నుంచి 35 లక్షలు ఖర్చవుతాయని వెల్లడించారు. గుండెమార్పిడికి అవసరమైన ఆర్గాన్‌ను తెప్పించాలంటే ఫ్లైట్ చార్జీలు రూ.12 లక్షలు అవుతాయని పేర్కొన్నారు. మొత్తంగా దాదాపు రూ.50 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలని సొహైల్ కోరుతోంది. సొహైల్‌ను ఆదుకోవాలని భావించే వారు ఆమె సోదరుడైన ‘షేక్ అతికూర్, ఎస్బీఐ అకౌంట్ నంబర్ 20351379362, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0010311’కు నగదు జమచేయవచ్చు. పూర్తి వివరాల కోసం 99492 99089 నంబర్‌ను సంప్రదించవచ్చు. స్పందించిన సిరి ఈవెంట్స్... సొహైల్ విషయం తెలుసుకున్న ఒంగోలు సిరి ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎం.శ్రీనివాసులు స్పందించారు. తాను ఇటీవల హీరో సంపూర్ణేష్‌బాబును కలిసి సొహైల్ వృత్తాంతాన్ని వివరించగా, ఒంగోలులో ఒక ఈవెంట్‌ను ఉచితంగా నిర్వహించి వచ్చే నగదును సొహైల్‌కు కేటాయించేందుకు ఆయన ముందుకు వచ్చారన్నారు. ఆగస్టు 26న రక్షాబంధన్ రోజున ఒంగోలులో సొహైల్ ఆపరేషన్ కోసం 57 మంది సినీ, బుల్లితెర కళాకారులతో జబర్దస్త్ నవ్వుల హరివిల్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ వైద్యులు కూడా సహకారం కోసం ముందుకొస్తారన్నారు. ప్రతిఒక్కరూ సొహైల్‌కు తోచిన సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు పట్టణాభివృద్ధి సమితి అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ తమ సమితి తరఫున తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటామని పేర్కొన్నారు. -
ఆదుకుంటేనే నేను జీవించేది
ఒంగోలు: ‘నాకు బతకాలని ఉంది.. కానీ నా పరిస్థితి దినదినగండంగా మారింది. ఏడాది నుంచి అనారోగ్యం నన్ను కబళించివేస్తుంటే.. చికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక నా కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. చికిత్సకు రూ.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దయచేసి నన్ను ఆదుకోండి’ అంటూ స్థానిక జిల్లా జైలు ఎదురుగా ఉన్న సిరి ఈవెంట్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొహైల్ అనే బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... సొహైల్ తండ్రి మొయీన్ అహ్మద్ దంపతులకు ఇద్దరు సంతానం. రెండో సంతానమైన సొహైల్‌కు పుట్టినప్పటి నుంచి అనారోగ్యంగానే ఉండేది. వైద్యులు పరీక్షించి పలు మందులు రాసేవారు. వాటిని వాడుతూ వచ్చారు. 9వ తరగతి వరకు పాఠశాలకు పంపారు. అనారోగ్యం కారణంగా వారంలో మూడురోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది. ఆ తర్వాత మరింత నీరసిస్తుండటంతో బడి మాన్పించేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. టేబుల్ మీద కనిపించే బొమ్మలను తానే తయారుచేస్తూ తాను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ నుంచి విముక్తి కోసం, భగవంతుడి కృప కోసం ఎదురుచూస్తోంది. తండ్రి చికెన్ పకోడీ బండి పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే.. సోదరుడు ఇప్పుడిప్పుడే వెబ్‌డిజైనింగ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలబడేందుకు కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏడాది క్రితం స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు వైద్యశాలలో సొహైల్‌కు చూపించగా, వైద్యులు సొహైల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అపోలో హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. దీంతో ఆమెకు స్కానింగ్ తీసి పరిశీలించిన అపోలో వైద్యులు.. గుండెకు మూడు రంధ్రాలున్నట్లు నిర్ధారించారు. పల్మనరీ హైపర్ టెన్షన్, వెంట్రిక్యులర్ సెప్టిన్ డిఫెక్ట్, యెజెనెమెంజర్స్ సిండ్రోమ్ అనే మూడు రకాల సమస్యలు ఆమె హృదయానికి ఉన్నాయని, ఆమె జీవించాలంటే గుండె మార్పిడి తప్పనిసరని తెలిపారు. ఆపరేషన్‌కు ముందు రూ.2 లక్షలు, ఆపరేషన్‌కు రూ.30 నుంచి 35 లక్షలు ఖర్చవుతాయని వెల్లడించారు. గుండెమార్పిడికి అవసరమైన ఆర్గాన్‌ను తెప్పించాలంటే ఫ్లైట్ చార్జీలు రూ.12 లక్షలు అవుతాయని పేర్కొన్నారు. మొత్తంగా దాదాపు రూ.50 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలని సొహైల్ కోరుతోంది. సొహైల్‌ను ఆదుకోవాలని భావించే వారు ఆమె సోదరుడైన ‘షేక్ అతికూర్, ఎస్బీఐ అకౌంట్ నంబర్ 20351379362, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0010311’కు నగదు జమచేయవచ్చు. పూర్తి వివరాల కోసం 99492 99089 నంబర్‌ను సంప్రదించవచ్చు. స్పందించిన సిరి ఈవెంట్స్... సొహైల్ విషయం తెలుసుకున్న ఒంగోలు సిరి ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎం.శ్రీనివాసులు స్పందించారు. తాను ఇటీవల హీరో సంపూర్ణేష్‌బాబును కలిసి సొహైల్ వృత్తాంతాన్ని వివరించగా, ఒంగోలులో ఒక ఈవెంట్‌ను ఉచితంగా నిర్వహించి వచ్చే నగదును సొహైల్‌కు కేటాయించేందుకు ఆయన ముందుకు వచ్చారన్నారు. ఆగస్టు 26న రక్షాబంధన్ రోజున ఒంగోలులో సొహైల్ ఆపరేషన్ కోసం 57 మంది సినీ, బుల్లితెర కళాకారులతో జబర్దస్త్ నవ్వుల హరివిల్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, విజయవంతం చేసి చిన్నారికి ప్రాణభిక్ష పెట్టాలని శ్రీనివాసులు కోరారు. -
ప్రాణపాయ స్థితిలో యువకుడు
పెనుకొండ రూరల్ : హిందూపురానికి చెందిన సొహల్(26) పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం... ఆదివారం కావడంతో సొహైల్ మరి కొందరు కలసి ఆటవిడుపు కోసం రిజర్వాయర్ వద్దకు వచ్చారు. అక్కడి నీటి ప్రవాహం ఉన్న ప్రాంతంలో దిగేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. అతికష్టమ్మీద బయటకు లాగి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని వెంటనే పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం పెద్దాస్పత్రికి తరలించారు. -
సల్మాన్ తాగాడో లేదో తెలియదు!
కోర్టుకు ‘రెయిన్ బార్’ మేనేజర్ వాంగ్మూలం ముంబై: ‘హిట్ అండ్ రన్’ కేసులో సల్మాన్‌కు ఊరటనిచ్చేలా జుహూలోని రెయిన్ బార్ మేనేజర్ కోర్టుకు వాంగ్మూలమిచ్చారు. ఘటన జరిగిన రోజు స్నేహితులతో కలిసి సల్మాన్‌ఖాన్ బార్‌కు వచ్చిన విషయం నిజమే అయినప్పటికీ వారితో కలిసి ఆయన ఆల్కహాల్ తాగాడా? లేదా? అనే విషయం కచ్చితంగా తెలియదని కోర్టుకు తెలిపాడు. జుహూలోని రెయిన్ బార్లో మద్యం సేవించిన సల్మాన్ ఆ మత్తులోనే కారు నడిపి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్నవారి మీదనుంచి తీసుకెళ్లాడని, ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘సల్మాన్ స్నేహితులతో కలిసివచ్చి మద్యాన్ని ఆర్డర్ చేశారు. దీంతో వెయిటర్ వారికి మద్యాన్ని అందజేశాడు. అప్పుడు సల్మాన్ మద్యం సేవించాడా? లేదా? అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేన’ని బార్ మేనేజర్ రిజ్వాన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే ధర్మాసనానికి తెలిపాడు. రెస్టారెంట్లో ఆ రోజు జనంతో కిటకిటలాడుతోందని, సల్మాన్, అతని సోదరుడు సోహైల్ సర్వీస్ కౌంటర్ ముందు నిలబడి స్నాక్స్, డ్రింక్స్ ఆర్డరు చేశారని, అంతలోనే వారి టేబుల్ వద్దకు అతని స్నేహితులు వచ్చి కూర్చున్నారని చెప్పాడు. సల్మాన్ చేతిలో తాను నిండు గ్లాస్‌ను కూడా చూశానని, అయితే రంగులేని సోడా(నీళ్లలాగా)తో ఉందని చెప్పినప్పుడు అది మద్యమా? అని న్యాయవాది ప్రశ్నించాడు. దీంతో తాను కచ్చితంగా చెప్పలేనని రిజ్వాన్ సమాధానమిచ్చాడు. సల్మాన్ బృందం బయటకు వెళ్లేముందు కూడా తాను ప్రధాన ద్వారం వరకు వచ్చానని చెప్పాడు. ఆ సమయంలో సల్మాన్ నుంచి ఎటువంటి మద్యం వాసన రాలేదని, అతను మత్తులో ఉన్నట్లుగా కూడా కనిపించలేదని, మామూలుగానే నడుచుకుంటూ వెళ్లిపోయాడని రిజ్వాన్ కోర్టుకు తెలిపాడు. ఆ రోజు సల్మాన్ డబ్బులు చెల్లించిన బిల్లులను కోర్టుకు చూపాడు. ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది రిజ్వాన్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు.. ఆ రోజు సర్వీస్ కౌంటర్లో ఎవరున్నారో చెబుతారా? అని ప్రశ్నించగా.. బార్లో వెలుతురు తక్కువగా ఉన్న కారణంగా ఆ సమయంలో సర్వీస్ కౌంటర్‌పై ఎవరున్నారనే విషయాన్ని తాను చెప్పలేనన్నాడు. అంతకు ముందు వెయిటర్ కూడా దాదాపుఇదే రకమైన సమాధానమిచ్చాడు. సల్మాన్ మద్యం సేవించడాన్ని తాను చూడలేదని కోర్టుకు తెలిపాడు. మరో ప్రత్యక్ష సాక్షి రామశ్రీ పాండేను కూడా ప్రాసిక్యూషన్ విచారించింది. ప్రమాదం జరిగిన అమెరికన్ బేకరీకి సమీపంలోనే పాండే దుకాణం కూడా ఉంది. ‘ప్రమాదం జరిగిందంటూ అరుపులు వినపడగానే నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్లాను. అప్పటికే అక్కడ సుమారు 50-60 మంది గుమిగూడారు. కొందరు కారు డోరును తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికే అది జామ్ అయింది. బాధితుల కేకలు వినిపించాయి. మరికొద్ది సేపటికి కోపంతో కొందరు కారువైపు రాళ్లు రువ్వారు. ఆ సమయంలో కారు ముందుభాగం కిందివైపు సల్మాన్ కనిపించాడు. అతని బాడీగార్డ్ మాత్రం బయట కనిపించాడు. వీరు మినహా ఘటనాస్థలంలో మరెవరూ కనిపించలేద ’ని కోర్టుకు తెలిపాడు.