
దుబాయ్: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హరిస్ సొహైల్ (240 బంతుల్లో 110; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 482 పరుగుల భారీ స్కోరు సాధించింది. అసద్ షఫీక్ (165 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఓవర్‌నైట్ స్కోరు 255/3తో సోమవారం బ్యాటింగ్ కొనసాగించిన ఆ జట్టును హరిస్, అసద్ ముందుకు నడిపించారు. ఐదో వికెట్‌కు 150 పరుగులు జోడించారు.
మరింత భారీ స్కోరు ఖాయమనుకుంటున్న దశలో ఈ ఇద్దరితో పాటు బాబర్ అజమ్ (4) అవుటయ్యాడు. కెప్టెన్ సర్ఫరాజ్ (15) కూడా విఫలమవడంతో పాక్ ఇన్నింగ్స్ తొందరగానే ముగిసింది. సిడిల్ 3, నాథన్ లయన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 13 ఓవర్ల పాటు సాగిన ఆటలో ఆసీస్ వికెట్ కోల్పోకుండా 30 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా (17 బ్యాటింగ్), ఆరోన్ ఫించ్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment