
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్, మోక్ష హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఎ.ఆర్. అభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రం బృందంగా ఇటీవల ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ లాంచ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్కీ లక్ష్మణ్ మూవీ ఫస్ట్‌లుక్ చాలా బాగుందని, దర్శక, నిర్మాతలకు ఇది తొలి చిత్రమే అయిన మూవీ బాగా తీశాకరన్నారు. అలాగే లక్కీ లక్ష్మణ్ మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం హీరో సోహైల్ మాట్లాడుతూ.. అనిల్ అన్న చేతుల మీదుగా తన మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, తన బిజీ షెడ్యూల్లో సైతం తమ మూవీ ఫస్ట్‌లుక్ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన మూవీ దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారన్నాడు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్‌పుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్‌తో నిర్మించారని సోహైల్ తెలిపాడు. నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు ఒక మంచి కాఫీలాంటి సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్ కీత.
Comments
Please login to add a commentAdd a comment