కాలిఫోర్నియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | 2nd Telangana Formation Day Celebrations in Bay Area, CA | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published Sun, Jun 5 2016 2:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

కాలిఫోర్నియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కాలిఫోర్నియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని ఫ్రీమంట్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, యువ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జయ జయహే తెలంగాణ గీతంతో ఈ వేడుకలు ప్రారంభమైనాయి. ఈ గీతాన్ని శ్రీనివాస్ మానాప్రగడ ఆలపించారు. అనంతరం టీఏటీఏ ప్రాంతీయ ఉపాధ్యక్షుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ.... బంగారు తెలంగాణ సాధించే క్రమంలో గత రెండేళ్లుగా సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.

ఈ కార్యక్రమాలపై తెలంగాణ ఎన్నారైలు ప్రశంసల జల్లు కురిపించారు.  ఈ వేడుకల్లో టీఏటీఏ మైనార్టీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేసినందుకు టీఏటీఏ యూత్ ఛైర్మన్ సతీష్, యూత్ కో ఆర్డినేటర్ అమిత్ ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  వెంకట్, నిషాంత్ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement