telangana american telugu association
-
ఛార్లెట్‌లో గ్రాండ్‌గా టీటీఏ బోర్డ్ మీటింగ్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు మీటింగ్ ఛార్లెట్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాదిలో జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వాషింగ్టన్ లోని సియాటెల్‌లో జరిగే టీటీఏ మహాసభల గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ గురించి చర్చించారు. అంతకుముందు టీటీఏ సభ్యులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. బోర్డు సమావేశానికి సంస్థ సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి హాజరైనా సంస్థ వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఇటీవల కన్నుమూసిన ప్రజాగాయకుడు గద్దర్‌కి టీటీఏ బోర్డు ఘన నివాళులు అర్పించింది. సంస్థ సభ్యులు గద్దర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. తన ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని, ప్రజాగాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. గద్దర్ ఆలపించిన పాటలు పాడి ఆయన్ను గుర్తు చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన టీటీఏ బోర్డు మీటింగ్‌లో సంస్థ వ్యవస్థాపకులు, బోర్డ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. టిటిఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి బోర్డ్ ప్రారంభ సందేశం వివరించారు. సియాటెల్‌లో జరిగే టిటిఎ మెగా కన్వెన్షన్ 2024ను విజయవంతం చేయాలన్నారు. అలాగే నిధుల సమీకరణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్థ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి.. సమావేశానికి హాజరైన బోర్డు మరియు టిటిఎ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సియాటెల్‌లో జరగనున్న టిటిఎ మెగా కన్వెన్షన్ అప్డేట్లను అందించారు. నిధుల సేకరణ, సాంస్కృతిక కార్యక్రమాలపై తన విజన్‌ను పంచుకున్నారు. సియాటెల్‌లో జరిగే కన్వెన్షన్‌ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. సంస్థ ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ మల్లిపెద్ది, EC సభ్యులు టిటిఎ మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. టిటిఎ మెగా కన్వెన్షన్‌కు సంబంధించి సూచనలను, సలహాలను, కార్యాచరణ ప్రణాళికలను అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి తెలియజేశారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాలపై అన్ని టిటిఎ రాష్ట్ర చాప్టర్లు పనిచేయాలని కోరారు. అడ్వైజరీ కో-ఛైర్ మోహన్ పాటల్లోల, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి తదితరులు కన్వెన్షన్‌తో పాటు ఇటీవల జరిగిన సేవా డేస్ విశేషాలను అందరితో పంచుకున్నారు. ఇకసెక్రటరీ కవితారెడ్డి 2023 కార్యక్రమాలపై నివేదికలను అందజేశారు. బతుకమ్మను విజయవంతం చేసిన మహిళా నాయకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్ కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కి విశేష స్పందన వచ్చింది. సమావేశాలకు అయ్యే ఖర్చులను దాతలు విరాళాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా 4లక్షల డాలర్ల నిధులను సేకరించినట్లు నిర్వహకులు తెలిపారు. విరాళాలు ప్రకటించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ఈవెంట్‌ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందు, వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిభింభించేలా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. యూత్ డాన్స్ ప్రదర్శన ఆడియన్స్‌లో జోష్ నింపింది. ఛార్లెట్‌లో నిర్వహించిన ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అవ్వటం పట్ల నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ బోర్డ్ కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ కార్యక్రమానికి సహాయసహాకారాలు అందించి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్ లోని సియాటెల్‌లో జరిగే టీటీఏ మహాసభలకు తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేశారు. -
నాగర్ కర్నూల్ , తుమ్మంపేట గ్రామంలో టీటీఏ సేవా డేస్!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించింది టీటీఏ టీమ్. తుమ్మంపేట గ్రామంలో పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. టీటీఏ నాయకులు సైదులు స్వగ్రామంలో ప్రభుత్వ స్కూల్‌కు స్టేజ్ నిర్మాణం పూర్తి చేసి పాఠశాలకు అందించారు. టీటీఏ నాయకులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించారు. స్కూల్ అభివృద్ధిలో సహాయసహాకారాలు అందిస్తున్న టీటీఏ బృందానికి టీచర్లతో పాటు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా ఉన్నటీటీఏ సంస్థను గ్రామస్థులు, పలువురు నాయకులు ప్రసంశించారు. రానున్న రోజుల్లో ఈ స్కూల్ ను దత్తత తీసుకోనున్నామని టీటీఏ సభ్యులు తెలిపారు. ప్రిన్సిపాల్ అడిగిన గ్రీన్ బోర్డ్ త్వరలో అందిస్తామని ప్రామిస్ చేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు ధైర్య ప్రదర్శన చేసిన పిల్లలకు మోమొంటోలు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన ప్రతి క్లాస్ లో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేసారు. ఇక కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గణిత శాస్త్ర నిపుణులు రామానుజం జయంతి సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగాలను టీటీఏ నాయకులు మనోహర్, నరసింహ పేరుక తిలకించారు. ఇక విద్యార్థుల ప్రతిభకు అబ్బురపడి పిల్లలను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. (చదవండి: 'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్‌చైర్స్ పంపిణీ) -
'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్‌చైర్స్ పంపిణీ
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీటీఏ)సేవాడేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్ చైర్స్ పంపిణీ చేశారు. పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్‌ను రినోవేషన్ చేశారు. అధునాతన హంగులతో స్కూల్‌ను అందంగా తీర్చిదిద్దారు. టీటీఏ ఆధ్వర్యంలో అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా.విజయపాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి సహాకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ వంశీరెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్, పరిగి ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకు రానున్న రెండు ఏళ్లలో 100శాతం మందికి వారికి అవసరమైన సహాయం టీటీఏ చేస్తుందని తెలిపారు. కాగా టీటీఏ సేవలను స్కూల్ టీచర్లు, గ్రామస్థులు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించి, మెమెంటోలు అందించారు. -
సేవాడేస్ కార్యక్రమంలో పేదలకు దుప్పట్ల పంపిణి
తెలంగాణ అమెరికాన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఆధ్వర్యంలో మూడవ రోజు జరిగిన సేవాడేస్ కార్యక్రమం విజయవంతమైంది. సేవాడేస్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీటీఏ మూడవ రోజు ధార్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీటీఏ ఎథిక్స్ కమిటీ డైరెక్టర్ గణేష్ వీరమనేని స్వగ్రామం నల్గొండ జిల్లా, పెండ్లిపాకల గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభోత్సవంలో టీటీఏ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పేద ప్రజలకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న టీటీఏ సంస్థను గ్రామ ప్రజలు కొనియాడారు. -
T Hubలో 'TTA' సేవాడేస్.. పాల్గొన్న యువ పారిశ్రామికవేత్తలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా డేస్ కార్యక్రమం రెండో రోజు హైదరబాద్‌లోని టీ-హబ్‌లో ఘనంగా జరిగింది. TTA ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టార్టప్, ఇన్వెస్ట్మెంట్, ఏఐ అంశాలపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ , ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి, హైదరాబాద్ ఐఐఐటీ కో-ఇన్నోవేషన్ ప్రొఫెసర్ రమేష్ లోగనాథన్ పాల్గొని ప్రసంగించారు. టీటీఏ సభ్యులు తమ ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. మారుమూల గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లి ఎంప్లాయిమెంట్ సృష్టించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న విజయ గాద తన ప్రసంగంతో యువ పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించి సన్మానించారు. -
మాతృభూమి కోసం.. ఎన్నారైల సేవా కార్యక్రమాలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాతృభూమికి సేవ చేయడానికి 'సేవా డేస్' పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది డిసెంబరు 11-23 వరకు తెలుగు రాష్ట్రాల్లో సేవా డేస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, కో ఆర్డినేటర్ సురేశ్ రెడ్డి వెంకన్నగరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహిస్తున్న సేవా డేస్ కార్యక్రమాల గురించి టీటీఏ టీమ్ వివరించింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA ఆధ్వర్యంలో డిసెంబర్11 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు TTA అధ్యక్షుడు కంచర కుంట్ల వంశీరెడ్డి తెలిపారు. అమెరికాలో స్థిరపడిన వారంతా మాతృభూమిలోని పేదలకు తమ వంతు సాయం చేసేందుకు వేదికగా సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణలో15 జిల్లాలు సందర్శించి ‘టీటీఏ సేవా డేస్’ పేరుతో అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహిస్తున్న సేవా డేస్ కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. డిసెంబర్11న మెడికల్ క్యాంప్, 12న టీ హబ్‌లో టెక్నాలజీపై,16న ఆరోగ్యంపై అవగాహనకు నెక్లెస్ రోడ్డులో 5కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. 18న వరంగల్‌లో మెగా జాబ్‌మేళాతో పాటు వీల్చైర్స్పంపిణీ, హెల్త్‌క్యాంప్ తో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 17న వికారాబాద్ లో కృత్రిమ అవయవాల పంపిణీ, 23న రవీంద్రభారతిలో సేవాడేస్ ముగింపు సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
న్యూజెర్సీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
సీటెల్ లో TTA బోర్డ్ సమావేశం విజయవంతం
-
Jhansi Reddy: మనలోని సమర్థతకు మనమే కేరాఫ్ అడ్రస్..
సమస్యతో పాటు పరిష్కారం కూడా మన వెన్నంటే ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందడుగు వేసేవారే ఎప్పుడూ విజేతలుగా నిలుస్తారు. అందుకు సరైన ఉదాహరణ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. తెలంగాణలోని ఖమ్మం జిల్లావాసి ఝాన్సీరెడ్డి విద్య, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. పురుషాధిక్య ప్రపంచమైన రియల్ ఎస్టేట్ రంగంలో తన సత్తా చాటడంతో పాటు, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల ఉన్నతికి పాటుపడుతూ, పుట్టిన గడ్డకు సాయమందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఝాన్సీరెడ్డిని పలకరిస్తే ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు. ‘‘నా శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే, ఏ పనిని ఎంచుకున్నా అందులో సంపూర్ణ విజయాన్ని సాధించేదాకా వదలను. నేను పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లా మధిర దగ్గర బనిగళ్లపాడు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడంతో పెద్దనాన్నతో పాటు అమెరికా వెళ్లిపోయాను. అక్కడే టెన్త్ పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చాను. పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి అయింది. సాధారణంగా భర్త వెంట భార్య అమెరికా వెళ్లడం చూస్తుంటాం. కానీ, నా విషయంలో ఇది రివర్స్ అయ్యింది. మా వారు కార్డియాలజిస్ట్ కావడం, మేం న్యూజెర్సీలో సెటిల్ అవడం... ఏడాదిలోనే జరిగిపోయాయి. పెళ్లయ్యింది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఏ దేశం లో ఉన్నా భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తేనే వారి కుటుంబంతో పాటు వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని నమ్ముతాను. అలా ప్లస్ టూ పూర్తవగానే బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాను. కానీ, పై చదువులు చదవాలన్న ఆసక్తి ఎక్కువ. అదే సమయంలో బ్యాంకు కూడా ఫైనాన్సింగ్ క్లాసెస్ ఆఫర్ చేసింది. దీంతో సాయంత్రాలు చదువుకుంటూ, పగటి వేళ ఉద్యోగం చేశాను. ప్రమోషన్లు వచ్చాయి. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్స్టాప్ పడింది. ఈ సమయంలోనూ ఖాళీగా లేకుండా మా వారి హాస్పిటల్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నాను. అమెరికా.. రియల్ ఎస్టేట్ డాక్టర్‌గా మా వారి సంపాదన బాగానే ఉంది. దీంతో ఓ చిన్న స్థిరాస్తి కొనుగోలు చేశాం. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ‘ఈ స్థిరాస్తిని కేవలం పెట్టుబడిగానే ఎందుకు చూడాలి, ఇదే వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అనుకున్నాను. కానీ, ఈ రంగంలో మహిళలు ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ఇండియా–అమెరికా ఏ దేశమైనా ఈ రంగంలో మహిళల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టచ్చు. అంతటా పురుషాధిపత్యమే. చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని తెలుసు. అయినా, పాతికేళ్ల క్రితం ‘రాజ్ ప్రాపర్టీస్’ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించాను. ఎందుకొచ్చిన రిస్క్ అన్నవారూ ఉన్నారు. విమర్శలనే కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను. కొద్దికాలంలోనే ఈ రంగంలో మంచి పేరు సాధించాను. తెలుగు మహిళల కోసం.. అమెరికాలో చిన్నప్పటి నుంచి ఉన్నాను కనుక తెలుగువారి సమస్యలు బాగా తెలుసు. అందులోనూ తెలుగు అసోసియేషన్స్‌కు వచ్చిన మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. దేశం మారుతున్నా మగవారి మనస్తత్వాలు, భావాలు మారడం లేదు. దీంతో తెలుగు కుటుంబాల్లో గృహహింస, గొడవలు, రకరకాల చికాకులతో మహిళలు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారున్నారు. ఆర్థిక స్థిరత్వం లేదు. ఇలాంటి వాటన్నింటికి పరిష్కారంగా ఒక సంస్థ ఉండాలనుకున్నాను. అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల కోసం ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థను నాలుగేళ్ల్ల క్రితం ఏర్పాటు చేశాను. ఇందులో నిష్ణాతులైన మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు మహిళలకు కావల్సిన ప్రేరణ, ప్రోత్సాహం, ఆసక్తి గల మహిళలందరికీ అందించాలన్నదే లక్ష్యం. మనలోని సమర్థత ఏంటో మనకే బాగా తెలుసు. ఏ రంగంలో మనం సమర్థవంతంగా రాణించగలమో గ్రహించి, ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడు అవకాశాలు కూడా వాటంతటవే వస్తుంటాయి. వాటిని అందిపుచ్చుకుంటూ వెళ్లడంలోనే మన విజయం దాగుంటుంది. దీంతో మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో పాటు మన చుట్టూ ఉన్న కొందరికైనా సాయం అందించగలం’’ అని వివరించారు ఈ ప్రవాస భారతీయురాలు. (చదవండి: నాట్య దీపిక.. దీపికారెడ్డి) పుట్టిన గడ్డకు సాయం అనుకున్న విజయాలను సాధించాను. పుట్టినగడ్డకు కొంతైనా సేవ చేయాలని.. ఖమ్మం జిల్లాలోని మా ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లలో స్కూల్ భవనాలు కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాను. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాను. వీటితోపాటు లైబ్రరీ, గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాను. పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించాను. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
ఎన్నారైల నీటి ప్రమాదాలపై ‘టాటా’ ఆందోళన
ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో అమెరికా బాటపడుతున్న తెలుగు యువత అవి నెరవేరకముందే అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కలల్ని మోసుకుంటూ ఉన్నత దిశగా ఎదగాలని, వారి మీదే ప్రాణాల్ని పెట్టుకున్న కుటుంబ సభ్యులకి మంచి జీవితం ఇవ్వాలనే కోరికలతో వెళ్లి ఇలా విదేశాల్లో ప్రమాదాల బారిన పడి అయినవారికి తీరని శోకాన్ని మిగల్చడం బాధాకరం. అమెరికా గడ్డపై ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. వాటిలో కూడా సరదా కోసం నీటిలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో పీజీ చేస్తున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు కౌశిక్ ఓలేటి, కొయ్యలముడి అజయ్‌లు సెప్టెంబరు 3న నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ప్రమాదాలపై తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) ఆందోళన వ్యక్తం చేసింది. టాటా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మహేష్ ఆదిభట్ల దీనిపై ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. నీటిలో మునిగి చనిపోవడం వల్ల అమెరికాలో ఏడాదికి 3,72,000మంది చనిపోతున్నారు. ఈ మరణాలలో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరగడం మా దృష్టికి వచ్చింది. సరైన అవగాహన లేక నదులు, జలపాతాలలోకి దిగి ప్రాణాలు విడుస్తున్నారు. కొందరు తమ మాతృదేశంలో మంచి ఈత వచ్చిన వారు కావొచ్చు. అలా అని అమెరికాలోని నదులలో ఈత అంత సులభం కాదు. మన నదుల తీరు వేరు. ఇక్కడి పరిస్థితులు వేరు. ఇవేవి తెలియకుండా భారత్‌లో ఈత కొట్టాం.. అమెరికాలో కొట్టలేమా అని నదులలోకి దిగి మృత్యువాత పడుతున్నారు. భారత నదులకు పూర్తి భిన్నంగా ఇక్కడి నదులు ఉంటాయి. ఒక్లహామాలోని టర్నర్‌ఫాల్స్, డల్లాస్‌లోని గ్రేప్‌వైన్, క్రేటర్ లేక్, లివర్మోర్ నదులలో ఎక్కువగా భారతీయులు ప్రమాదాల బారిన పడుతున్నారు. టర్నర్‌ఫాల్స్ జలపాతంలో గత మూడు నెలల్లోనే నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. జులై నెలలో ఒకరు, ఆగస్టులో ఒకరు, సెప్టెంబర్‌లో ఇద్దరు ఈ జలపాతంలో మునిగి చనిపోయారు. భారతీయులకు ఈ నదులపై సరైన అవగాహనలేక వీటిని పర్యాటాక స్థావరాలుగా భావించి తెలియక నీటిలో దిగి మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని టాటా సూచిస్తోంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వీటిపై అవగాహన కల్పించేందుకు పలు సదస్సులు నిర్వహిస్తోంది. ఒత్తిడికి గురైన వారికి సహాయ సహకారాలు అందిస్తోంది. టాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పైల మల్లారెడ్డి, అధ్యక్షుడు విక్రమ్ జంగం సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. -
టాటా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
న్యూయార్క్ : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (టాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం శిబిరానికి భారీ స్పందన లభించింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా న్యూయార్క్ టాటా టీమ్ హప్పాగేలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి రక్తదాతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 100 మంది టాటా సంస్థ సభ్యుల కుటుంబాలు పాల్గొన్నాయి. వారి నుంచి 55 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. టాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ మల్లిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటైంది. ప్రతి ఒక్కరు రక్తాన్ని దానం చేయాలని మల్లిక్ రెడ్డి కోరారు. శిబిర ఏర్పాటుకు సహకరించిన డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి( టాటా ఆడ్వేజరీ కౌన్సిల్ చైర్మన్), విక్రమ్ రెడ్డి (టాటా ప్రెసిడెంట్), టాటా సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వీపీ మల్లిక్ రెడ్డి, రంజిత్ క్యాతమ్, శరత్ వేముగంటి, సహోదర్ పెద్దిరెడ్డి, ఉషా మన్నెం, పవన్ రవ్వ, మాధవి సోలేటి, శ్రీనివాస్, రఘురాం పన్నాల, రమ వనమ, ప్రహ్లాద్, సత్య గగ్గెనపల్లి, యోగి వనమ, హేమంత్ కంచెర్ల, మౌనిక పెద్దిరెడ్డి, రవ్వ రాగిని, అనిత గగ్గెనపల్లి, త్రినాథ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘ది సోఫియా వే’లొ టాటా ఫుడ్ డ్రైవ్
సియాటెల్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(టాటా) సియాటెల్ విభాగం ఆధ్వర్యంలో ‘ది సోఫియా వే’లో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ది సోఫియా వే అనేది ఆవాసం లేని మహిళలకు షెల్టర్ కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి టాటా సియోటెల్ కమ్యూనిటీ నుంచి విశేష స్పందన వచ్చింది. మార్చి 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ది సోఫియా వేకు వెళ్లిన టాటా వాలెంటీర్స్ అక్కడి మహిళలకు పలు రకాలు ఆహారాన్ని అందజేశారు. కాఫీ, టీ, షుగర్, సలాడ్, బ్రీడ్స్, కూరగాయలు, జూస్లు ఇచ్చారు.దాతలు, తెలంగాణ కమ్యూనిటీ సాయంతో భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని భావిస్తున్నట్టు టాటా సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలెంటీర్స్ టాటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
టాటా నూతన అధ్యక్షునిగా విక్రమ్ రెడ్డి
లాస్‌వెగాస్ : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) నూతన అధ్యక్షునిగా విక్రమ్ రెడ్డి జనగామ నియమితులయ్యారు. లాస్‌వెగాస్‌లోని ఆరియా కన్వెన్షన్ సెంటర్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్‌లో సుమారు 150 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. టాటా ప్రెసిడెంట్‌గా విక్రమ్ జనగామను అడ్వైజరీ కౌన్సిల్ ఎంపిక చేసింది. టాటా మాజీ అధ్యక్షులు డా. హరనాత్ పొలిచర్ల తన హయాంలో టాటా సాధించిన లక్ష్యాలను వివరించారు. టాటాకు హరనాథ్ అందించిన సేవలను టాటా సభ్యులు కొనియాడారు. తనకు మద్దతుగా నిలిచిన సభ్యులందరికీ విక్రమ్ ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వంశీ రెడ్డి, జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ గానగోని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మహేశ్ ఆదిభట్ల, ట్రెజరర్‌గా రంజీత్ క్యాటం, జాయింట్ సెక్రటరీ నీలోహిత కొత్త, జాయింట్ ట్రెజరర్‌గా సురేశ్ వెంకన్నగారి, ఇంటర్నేషన్ వైస్ ప్రెసిడెంట్ హరీందర్ తాళ్లపళ్లి, ఎగ్జిక్యూటివ్ కో ఆర్డినేటర్‌గా శ్రీనివాస్ మనప్రగాడలు ఎన్నికయ్యారు. -
టాటా ఆధ్వర్యంలో ‘సర్వ్ ఎ మీల్’
న్యూయార్క్ : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (టాటా) ఆధ్వర్యంలో ‘సర్వ్ ఎ మీల్’ చారిటీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. న్యూయార్క్‌లోని రొనాల్డ్ మెక్‌డొనాల్డ్ హౌజ్‌లో ఈ చారిటీ విందును ఏర్పాటు చేశారు. పసందైన వంటకాలతో వచ్చిన వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పీ.మల్లారెడ్డి, వీ.సుధాకర్, మాధవ రెడ్డి మిగతావారికి టాటా వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పాపిరెడ్డి, కో ఆర్డినేటర్ సత్యారెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఆర్.పవన్, టాటా బోర్డ్ డైరెక్టర్స్ రంజిత్, శరత్, పణిభూషన్, మహిళా స్టాండింగ్ కమిటీ కో చైర్ పర్సన్ మాధవి, స్టాండింగ్ కమిటీ కో చైర్మెన్ అశోక్, కో ఆర్డినేటర్స్ ఉషా, మల్లిక్, సత్యారెడ్డి, యోగి, ప్రహ్లాద, హేమంత్, రమా, జయప్రకాష్, వాలంటీర్లు నాగశ్రీ, మౌనిక, శ్వేత, కరుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డెలావేర్లో ఆటా మహిళా దినోత్సవ వేడుకలు
డెలావేర్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్యర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డేలావేర్‌లో ఆటా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో 250 మందికి పైగా మహిళలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. మహిళా సాధికారత గురించి, మహిళలు అన్ని రంగాల్లో రాణించడం గురించి చర్చించారు. పలువురు సింగర్స్ పాల్గొని తమ ఆట, పాటలతో ఆహుతులను అలరించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా డల్లాస్, టెక్సాస్‌లలో మే 31, జూన్ 1, జూన్ 2 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించబోయే తెలుగు కన్వెన్షన్‌కు హాజరుకావాల్సిందిగా తెలుగువారిని ఆహ్వానించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మహిళలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. -
ఆటా ఆధ్యర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అట్లాంటా : అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్యర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సదర్భంగా అట్లాంటా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో టాలీవుడ్ సింగర్ అంజనా సౌమ్యతో పాలు పలువురు సింగర్స్ పాల్గొని తమ ఆట, పాటలతో ఆహుతులను అలరించారు. మూడు వందలకు పైగా మహిళలు ఈ ఈవెంట్లో పాల్గొని మహిళా సాధికారత గురించి చర్చించారు. ఆటా అధ్యక్షుడు మరునాలా అసిరెడ్డి, బోట్స్ అనిల్ బోడిరెడ్డి, వేణు పిసికే, రీజనల్ కో ఆర్డినేటర్ శివ రామడుగులు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నేతృత్వంలో డల్లాస్‌లో మే 31, జూన్ 1, జూన్ 2 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న కన్వెన్షన్‌కు హాజరుకావాల్సిందిగా తెలుగువారిని ఆహ్వానించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మహిళలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. -
ప్రారంభమైన ‘టాటా సేవా డేస్’ 2017
హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో ‘టాటా సేవా డేస్ 2017’ వేడుకలు గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేందుకు టాటాను నెలకొల్పామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ‘సేవా డేస్’ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగుల పంపిణీ, దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇదీ షెడ్యూల్ ఈ నెల 15న కర్నూలు జిల్లా సున్నిపెంట, 16న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, 19న రంగారెడ్డి జిల్లా జుక్కల్, నల్లగొండ జిల్లా ఆత్మకూరు గ్రామాల్లో, 20న వరంగల్, 21న నిజామాబాద్ జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 23న టాటాతో పాటుగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్, మధ్యాహ్నం శిల్పకళా వేదికలో కవి సమ్మేళనం ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో భాగంగా సినీ నటుడు కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వయిజరీ బోర్డు సభ్యుడు మోహన్ పట్లోల, కార్యక్రమ సమన్వయకర్త వంశీరెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వెంకట్ ఎక్కా, సంయుక్త కోశాధికారి జ్యోతిరెడ్డి, సమన్వయకర్త ద్వారక్‌నాథ్ రెడ్డి, జి.బి.కె.రెడ్డి, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'అమెరికాలో తెలంగాణ విద్యార్థులకు భద్రత కల్పించాలి'
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం తీర్మాణం రాయికల్ : అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్న దాడుల నుంచి ముఖ్యంగా తెలంగాణ వారిని రక్షించేలా యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు తీర్మానించారు. మంగళవారం అమెరికాలోని వర్జీనియాలో బోర్డు కమిటి సమావేశం నిర్వహించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఆచార సాంప్రదాయాలను కాపాడటం కోసమే ఈ సంఘం పనిచేస్తుందని, దీని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏప్రిల్ 29న రెండో వార్షికోత్సవ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై తీసుకోవాల్సిన ప్రణాళికలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న దాడులను ఖండించి ఇటీవల కాన్సస్‌లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఇంజినీర్ శ్రీనివాస్ మృతిపట్ల బోర్డు సభ్యులు సంతాపం వ్యక్తం చేసినట్లు మీడియా ఇన్చార్జి బండ ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మల్లారెడ్డి, ఝాన్సీరెడ్డి, విజయ్‌పాల్, సుధాకర్, శ్రీనివాస్, రవీందర్, వంశీరెడ్డి, శరత్, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఘనంగా టాటా రెండో వార్షికోత్సవ వేడుకలు
ఉత్తర అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) రెండో వార్షికోత్సవ వేడుకలను డల్లాస్‌లోని బిర్యానీపాట్@హిల్‌టాప్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. టాటాను ఫార్మసీ రంగ ప్రముఖుడు పైళ్ల మల్లారెడ్డి స్ధాపించారు. గత రెండేళ్లలో టాటా అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. టాటా డల్లాస్ ప్రాంతీయ అధ్యక్షురాలు సమీరా ఇల్లెందుల మాట్లాడుతూ.. సంస్ధ వార్షికోత్సవ వేడుకలను తొలుత ఏప్రిల్‌లో నిర్వహించాలని భావించనట్లు చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చినా అందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత టాటా గత రెండేళ్లలో నిర్వహించిన సామాజిక కార్యక్రమాలపై వీడియోను ప్లే చేశారు. టాటా కార్యదర్శి విక్రమ్ ఆర్ జనగాం వార్షికోత్సవ కమిటీల గురించి వివరించగా.. ఈవెంట్ కో-ఆర్డినేటర్ మహేష్ ఆదిభట్ల కమిటీల సభ్యులను పరిచయం చేశారు. సమీరా ఇల్లెందుల, మహేందర్ కామిరెడ్డి, మనోహర్ కసగాని, శాంతి నూతి, రూప, రోజా ఆదెపు, షకేర్ బ్రహ్మదేవర, సంతోష్ కోరె, రత్నా, సతీష్ నాగిల్ల, సురేష్ పథనేని, పవన్ గంగాధర, చంద్ర పోలీస్, శ్యాం పాటి, పద్మ శ్రీ తోటలు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. డా.పైళ్ల మల్లారెడ్డి ఆదర్శాల మేరకు టాటాను సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల ఆర్గనైజేషన్లలో అత్యున్నత స్ధాయికి తీసుకెళ్లాలని, అందుకు జాతీయ, స్ధానిక తెలుగు ఆర్గనైజేషన్లు సహకారం అందించాలని మహేష్ ఆదిభట్ల, విక్రమ్ జనగాంలు కోరారు. వార్షికోత్సవం విజయవంతం కావడానికి కృషి చేసిన అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, నేషనల్ టీం తదితరాలకు మహేష్ ఆదిభట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రామానికి టాంటెక్స్, టీపాడ్, డాటా, తానా, అటా, నాటా, నాట్స్, ఐటీ సర్వ్ తదితర కమ్యూనిటీ లీడర్లు హాజరయ్యారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) టాటా రెండో వార్షికోత్సవానికి స్పాన్సర్షిప్ వహించిన తొలి డైమండ్ పార్ట్నర్. కార్యక్రమానికి టీపాడ్ ఇచ్చిన మద్దతుకు విక్రమ్ జనగాం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
కాలిఫోర్నియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని ఫ్రీమంట్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, యువ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జయ జయహే తెలంగాణ గీతంతో ఈ వేడుకలు ప్రారంభమైనాయి. ఈ గీతాన్ని శ్రీనివాస్ మానాప్రగడ ఆలపించారు. అనంతరం టీఏటీఏ ప్రాంతీయ ఉపాధ్యక్షుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ.... బంగారు తెలంగాణ సాధించే క్రమంలో గత రెండేళ్లుగా సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలపై తెలంగాణ ఎన్నారైలు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ వేడుకల్లో టీఏటీఏ మైనార్టీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేసినందుకు టీఏటీఏ యూత్ ఛైర్మన్ సతీష్, యూత్ కో ఆర్డినేటర్ అమిత్ ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్, నిషాంత్ పాల్గొన్నారు.