
డెలావేర్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్యర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డేలావేర్‌లో ఆటా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో 250 మందికి పైగా మహిళలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. మహిళా సాధికారత గురించి, మహిళలు అన్ని రంగాల్లో రాణించడం గురించి చర్చించారు. పలువురు సింగర్స్ పాల్గొని తమ ఆట, పాటలతో ఆహుతులను అలరించారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా డల్లాస్, టెక్సాస్‌లలో మే 31, జూన్ 1, జూన్ 2 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించబోయే తెలుగు కన్వెన్షన్‌కు హాజరుకావాల్సిందిగా తెలుగువారిని ఆహ్వానించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మహిళలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.



Comments
Please login to add a commentAdd a comment