'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్‌చైర్స్‌ పంపిణీ | Telangana American Telugu Association Seva Days Held At Vikarabad | Sakshi
Sakshi News home page

'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్‌చైర్స్‌ పంపిణీ

Published Wed, Dec 20 2023 10:15 AM | Last Updated on Wed, Dec 20 2023 10:18 AM

Telangana American Telugu Association Seva Days Held At Vikarabad - Sakshi

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(టీటీఏ)సేవాడేస్‌ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్  చైర్స్ పంపిణీ చేశారు. పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్‌ బిల్డింగ్‌ను రినోవేషన్‌ చేశారు.

అధునాతన హంగులతో స్కూల్‌ను అందంగా తీర్చిదిద్దారు. టీటీఏ ఆధ్వర్యంలో  అడ్వైజరీ కౌన్సిల్ చైర్  డా.విజయపాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి సహాకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్, పరిగి ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకు రానున్న రెండు ఏళ్లలో 100శాతం మందికి వారికి అవసరమైన సహాయం టీటీఏ చేస్తుందని తెలిపారు. కాగా టీటీఏ సేవలను స్కూల్‌ టీచర్లు, గ్రామస్థులు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించి, మెమెంటోలు అందించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement