
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్‌లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్‌లను పూర్తి చేశాడు.

క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది.
NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
న్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులు
న్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు
-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి
-సలహా సంఘం:
-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు
-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల
-సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు
-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది
Comments
Please login to add a commentAdd a comment