regional
-
ఢిల్లీ వాసులకు ‘హై స్పీడ్’ ప్రయాణం
‘ప్రయాణానికి తక్కువ సమయం, కుటుంబానికి ఎక్కువ...!’. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రీజనల్ రైల్ సరీ్వస్‌కు సంబంధించిన ఆకర్షణీయమైన నినాదాల్లో ఇదొకటి! ర్యాపిడ్ ఎక్స్‌గా పిలుస్తున్న ఈ తొలి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు దేశ రాజధాని ప్రాంత (ఎన్సీఆర్) వాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 82 కిలోమీటర్ల మేర చేపట్టిన ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) కారిడార్‌లో 17 కి.మీ. ప్రస్తుతం సిద్ధమైంది. సాహిబాబాద్–దుహై స్టేషన్ల మధ్యనున్న ఈ కారిడార్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ ఎక్స్ రైలుకు నమోభారత్‌గా గురువారం నామకరణం చేశారు. శనివారం నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. కారిడార్‌లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్యచిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి. అంతేనా...! ఈ ర్యాపిడ్ ఎక్స్ హై స్పీడ్ రైల్వే వ్యవస్థ విశేషాలు అన్నీ ఇన్నీ కావు... గంటకు 160 కి.మీ. వేగం! ► ర్యాపిడ్ ఎక్స్ ద్వారా రాజధాని వాసులకు ప్రయాణ సమయం ఏకంగా మూడో వంతు దాకా తగ్గనుంది. ► ప్రయోగాల సందర్భంగానే ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగాన్ని సులువుగా అందుకున్నాయి! ► అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ రైళ్ల సొంతం. ► ఒక్కో రైల్లో ఆరు కోచ్‌లుంటాయి. వీటిలో 1,700 మంది ప్రయాణించవచ్చు. ► ప్రతి రైల్లో ఒక మహిళా కోచ్‌తో పాటు వారికి దివ్యాంగులకు, వృద్ధులకు కొన్ని సీట్లు ప్రత్యేకిస్తారు. ► రెండు వరుసల్లో, వరుసకు రెండు చొప్పున సీట్లుంటాయి. నిలబడేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. ► ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, లగేజీ ర్యాక్‌లు, అభిరుచికి అనుగుణంగా లైటింగ్‌ను మార్చుకునే వెసులుబాటు, సీట్ పుష్ బ్యాక్, కోట్ తగిలించుకునే హుక్, ఫుట్ రెస్ట్, ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సాయపడేందుకు అసిస్టెంట్, స్నాక్స్, డ్రింక్స్ కొనుక్కునేందుకు వెండింగ్ మెషీన్ల వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ► ఉదయం ఆరింటి నుంచి రాత్రి 11 దాకా ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ► డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి మున్ముందు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు. ► చార్జీలు స్టాండర్డ్ కోచ్‌లో రూ.20–రూ.40, ప్రీమియం కోచ్‌లో రూ.40–రూ.100. ► ప్రతి స్టేషన్నూ ఆకర్షణీయమైన రంగులతో కూడిన కుడ్య చిత్రాలు, నినాదాలతో ఆకట్టుకునేలా తయారు చేశారు. ళీ ఈ ర్యాపిడ్ ఎక్స్ ప్రాజెక్టును ఢిల్లీ, హరియాణా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి కేంద్రం సంయుక్తంగా చేపట్టింది. ► ఢిల్లీ–గాజియాబాద్–మీరట్ మధ్య 81.15 కి.మీ. ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ 2025 కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ► ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.30 వేల కోట్లు. ‘ఏఐ’ బ్యాగేజ్ స్కానింగ్ ర్యాపిడ్ ఎక్స్ రైళ్ల ఉద్దేశమే ప్రయాణ సమయం తగ్గించడం. అందుకు అనుగుణంగా కారిడార్‌లోని స్టేషన్లలో బ్యాగేజీ తనిఖీ సమయాన్ని బాగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. నియంత్రిత, నిషేధిత వస్తువులుంటే అది వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ► ఇందులో డ్యుయల్ వ్యూతో కూడిన ఎక్స్ రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై, లోపలి భాగాలు స్క్రీన్‌పై విడిగా, స్పష్టంగా కని్పస్తాయి. ► ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్ డిటెక్షన్–డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటివాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పల్లెవెలుగు’లో మరో రాయితీ టికెట్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో వెళ్లే ప్రయాణికులను బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. దూరం ప్రయాణించే వారికి రాయితీ టికెట్‌ను అందుబా టులోకి తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం సంస్థ టీ9–60 పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికులకు రూ.100కే రాను పోను రాయితీ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దానికి స్పందన తక్కువగా ఉండటంతో, ఇప్పుడు టీ9–30 పేరుతో 30 కి.మీ. పరిధిలో తిరిగే వారికి రూ.50కే రానుపోను వర్తించేలా రాయితీ టికెట్‌ను ప్రారంభించింది. ఈ టికెట్లు గురువారం నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆటోల్లో ప్రయాణించేవారిపై గురి.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆటోలను ఆశ్రయి స్తున్నారు. పల్లెవెలుగు బస్సు టికెట్‌పై రాయితీ ప్రకటిస్తే వారిలో కొందరైనా బస్సులెక్కు తారని ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లో 30 కి.మీ. నిడివిలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు మూడున్నర లక్షలుగా ఉంది. అంతకు రెట్టింపు జనం అదే పరిధిలో ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రాయితీ టికెట్ తీసుకుంటే.. రూ.50తో గమ్యం వెళ్లితిరిగి రావచ్చు. దానికి అదనంగా రూ.20 చెల్లించి కాంబి టికెట్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా అదే టికెట్‌తో రాను, పోనూ ప్రయాణించవచ్చు. కొద్ది రోజుల క్రితం 60 కి.మీ. నిడివిలో ప్రయాణించేవారికోసం రూ.100కే రానుపోను టికెట్ తీసుకురాగా, 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో దానికి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది డిపో మేనేజర్లు కోరటంతో కొత్త విధానం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 వరకు టికెట్ల జారీ ఉంటుంది. 30 కి.మీ. పరిధిలో పొరుగు రాష్ట్రంలో ప్రయాణం ఉంటే.. అక్కడ కూడా ఇది చెల్లుబాటు (టీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే) అవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ఆవిష్కరించారు. -
దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం!
దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు రాపిడ్‌ఎక్స్ (RAPIDX) ఈ నెల (జూలై)లోనే ప్రారంభం కానుంది. 17 కిలో మీటర్ల పొడవుతో ఏర్పాటైన ఈ రైలు సర్వీసులో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దార్, దుహాయ్ డిపో అనే స్టేషన్లు ఉంటాయని ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఈ అన్ని స్టేషన్లు పనులన్నీ పూర్తయి కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని ఓ సీనియర్ అధికారి చెప్పినట్లుగా పేర్కొంది. దీంతోపాటు సాహిబాబాద్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు 42 కిలోమీటర్ల రైలు సర్వీస్ కూడా పూర్తయింది. దుహాయ్ డిపో తర్వాత 25 కి.మీ సెక్షన్‌ను ప్రాధాన్యతా విభాగం తర్వాత ప్రారంభిస్తారని తెలిసింది. ఈ సెక్షన్లో మురదానగర్, మోదీ నగర్ సౌత్, మోదీ నగర్ నార్త్, మీరట్ సౌత్ స్టేషన్లు ఉంటాయి. ఈ సెక్షన్లు ఢిల్లీ - మీరల్ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లో భాగం. ఇందులో రైళ్లు 160 కి.మీ వేగంతో నడిచే అవకాశం ఉంది. 2025 నాటికి 82 కిలో మీటర్లు ఆర్ఆర్టీఎస్ నిర్మాణం 2019 జూన్‌లో ప్రారంభమైంది. ఆర్‌ఆర్‌టీస్ కారిడార్‌ను నిర్మిస్తున్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 2025 నాటికి మొత్తం 82 కి.మీల ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 30,274 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌టీస్ ప్రాజెక్ట్‌కు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు నిధులు సమకూర్చాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా సెమీ-హై స్పీడ్ రీజినల్ రైల్ సర్వీస్‌ను ఎన్సీఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు కేంద్రం ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రతి రాపిడ్‌ఎక్స్ రైలులో ప్రీమియం కోచ్ తర్వాత మహిళలకు ఒక ప్రత్యేక కోచ్ ఉంటుంది. రిజర్వ్డ్ కోచ్‌లో 72 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపయుక్తంగా ప్రతి స్టేషన్లోనూ డైపర్ మార్చేందుకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడం విశేషం. -
వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ
అమరావతి: ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్ పార్టీకి చెందిన ప్రాంతీయన సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే…. ► ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉంది. ► పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లుగా మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. ► మీకు అప్పగించిన వివిధ జిల్లాల్లో పార్టీనేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే. ► ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి. ► అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావాలి. ► ఆ లక్ష్యంతోనే మీరు సంకల్పంతో పనిచేయాలి. ► పార్టీ సమన్వయ కర్తలుగా మీరు నాతో ఏ విషయాన్నైనా చర్చించండి. ► ఎప్పుడైనా నన్ను కలవవచ్చు. పార్టీ పరంగా మీరు నాకు టాప్ టీం. ► సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో కింద చక్కటి యంత్రాంగం ఉంది. వాలంటీర్లను వారితో మమేకం చేయాలి. ► ఈ యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించడానికి, క్రియాశీలకంగా ఉండడానికి కార్యక్రమాలను నిర్దేశించాం. ► ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి. ► మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకుసాగాలి. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, భూమన కరుణాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్, రామసుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి, బీద మస్తాన్ రావు తదితరులు హాజరైయ్యారు. -
ఈజీఆర్ విభాగం ఏర్పాటు దిశలో బీఎస్ఈ అడుగులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) విభాగం ఏర్పాటు దిశలో బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) కీలక అడుగులు వేసింది. ఈ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడానికి మహారాష్ట్ర, తమిళనాడు నుంచి నాలుగు ప్రాంతీయ అసోసియేషన్లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బీఎస్ఈ తెలిపింది. వీటిలో తిరునెల్వేలి గోల్డ్ సిల్వర్ డైమండ్ జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్, నాందేడ్ సరాఫా అసోసియేషన్, సరాఫ్ సువర్కర్ సంత్నా పూసద్, ఘడ్చిరోలి జిలా సరాఫా అసోసియేషన్లు ఇందులో ఉన్నాయి. వీటిలోని దాదాపు 1,000 మంది సభ్యులు జ్యూయలరీ, బులియన్ ట్రేడ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యాలతో దేశీయ, అంతర్జాతీయ జోన్లలో శక్తివంతమైన గోల్డ్ ఎక్సే్చంజ్‌ని అభివృద్ధి చేయడంలో పరివర్తనాత్మక పాత్రను పోషించగలదనే విశ్వాసాన్ని బీఎస్ఈ వ్యక్తం చేసింది. ఈజీఆర్ సెగ్మెంట్ ఏర్పాటుకు కొద్ది రోజుల క్రితమే బీఎస్ఈకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో గోల్డ్ ఎక్సే్చంజ్‌ల ఏర్పాటుకు వీలుగా వాల్డ్ మేనేజర్స్ నిబంధనావళిని కూడా సెబీ ఇటీవలే నోటిఫై చేసింది. గోల్డ్ ఎక్సే్చంజ్‌ల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) రూపంలో బంగారం ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీఆర్‌ను బాండ్‌గా పరిగణిస్తారు. సంబంధిత ఈజీఆర్‌లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, ఫిజికల్ డెలివరీ ఫీచర్లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్‌కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం, పటిష్ట స్పాట్ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్ ఎక్సే్చంజ్ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గోల్డ్ ఎక్సే్ఛంజ్, వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్లు్యడీఆర్ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కాస్ట్ కటింగ్ సెగ : ఆకాశవాణి జాతీయ ఛానెల్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ఆలిండియా రేడియో జాతీయ చానల్‌కు కాస్ట్ కటింగ్ సెగ తాకింది. ఆకాశవాణి జాతీయ ఛానల్ ప్రసారాలు హేతుబద్దీకరణ, నిర్వహణ వ్యయం తగ్గింపులో భాగంగా ఆల్ ఇండియా రేడియో (ఎఐఆర్) జాతీయ ఛానల్‌ను మూసివేయాలని ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ప్రసార భారతి నిర్ణయించింది. ఈ మేరకు ప్రసారభారతి తన నిర్ణయాన్నిడిసెంబరు 24న ఎఐఆర్ డైరెక్టరేట్‌కు తెలిపింది. ఇందుకోసం గత ఏడాది పలుమార్లు సంప్రదింపులు, చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని వెంటనే అమలు చేయాలని ఆలిండియా రేడియోను ఆదేశించింది. అలాగే అకాడమీస్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియాను కూడా మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఐదు నగరాలు, అహ్మదాబాద్ హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా అకాడెమీలను రద్దు చేయనుంది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. తోడాపూర్, నాగపూర్ సహా ఇతర నగరాల్లోని సిబ్బందిని వేరే ప్రదేశాలకు సర్దుబాటు చేయనుంది. జాతీయ చానెల్ ద్వారా భద్రపరిచే కార్యక్రమాల ఆర్కైవ్స్‌ను, డిజిటలైజేషన్‌కోసం ఢిల్లీలోని సెంట్రల్ ఆర్కైవ్స్ సెంటర్‌కు పంపించాలని జనవరి 3, 2019 తేదీన ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. జాతీయ ఛానల్‌కు సంబంధించిన ట్రాన్స్మీటర్లు బలహీనంగా ఉండటం కూడా మూసివేతకు కారణమని ఏఐఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నాగపూర్‌లో ఉన్న ఒకే ఒక ట్రాన్స్‌మీటరు మాత్రమే ఒక మెగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, ప్రస్తుత డిజిటల్ రేడియో యుగంలో ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. అలాగే పటిష్టమైన శ్రోతల ప్రాతిపదిక లేని ఛానల్లో పెట్టుబడులు పెట్టడం సరైంది కాదని సీనియర్ నిర్వాహకులు భావించారని ఆయన వివరించారు. అంతేకాదు ప్రస్తుతం కొన్ని ఏఐఆర్ కార్యక్రమాలను అవుట్సోర్స్ ద్వారా నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఏఐఆర్ వెబ్‌సైట్‌ను ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఐఆర్‌లోని కొన్ని విభాగాలు ఈ నిర్ణయంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ ఛానల్ ప్రసారాలు చాలా ముఖ్యమైన భాగమని, మొత్తంగా దాన్ని మూసివేయడం కంటే ఖర్చులను తగ్గించుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని కోరుతున్నాయి కాగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు జాతీయ ప్రసారాలు ప్రసారమయ్యే నేషనల్ చానల్ 1987లో ప్రారంభమైంది. 31 సంవత్సరాలకుపైగా జాతీయ వార్తలను, కీలక అంశాలను ప్రజలకు చేరవేయడంలో చురుకైన కీలక పాత్ర పోషించింది. -
సైకాలజిస్టుల ప్రాంతీయ అధ్యక్షుడిగా బాలాజిసింగ్
నంద్యాల: కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా స్థానిక సైకాలజిస్ట్ బాలాజీ సింగ్ ఎంపికయ్యారు. తిరుపతిలో శనివారం జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కర్నూలుకు చెందిన జయరెడ్డి ఎన్నికయ్యారు. మెడికల్ కౌన్సిల్ తరహాలో సైకాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. -
ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు
♦ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగం ♦ పారిశ్రామిక, రీజినల్, ఐటీ రోడ్లను నిర్మిస్తాం ♦ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ♦ రెండో దశ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రారంభం ఘట్కేసర్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం ఘట్కేసర్ నుంచి మేడ్చల్ వైపు సుతారిగూడ వరకు ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డును ఆయన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఓఆర్ఆర్ చుట్టూ ఏర్పాటు చేసే టౌన్‌షిప్‌లలో విద్య, వైద్య అవసరాలు ఉండేలా చూస్తామన్నారు. ఈ రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఔటర్ వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. మరిన్ని ఐటీ, ఇతర పరిశ్రమలు రావడానికి అవకాశం ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి ఔటర్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రారంభానికి భారీ ఏర్పాట్లు ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రి వచ్చే మార్గంలో రంగురంగుల జెండాలు, తోరణాలను అలంకరించారు. వాహనాల పార్కింగ్ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. టోల్‌ప్లాజాను బెలూన్లతో అలంకరించారు. మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, నగర మేయర్ రామ్మోహన్ తదితరులు వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చి రిబ్బన్ కట్‌చేసి రోడ్డును ప్రారంభించారు. రెండు గంటల ఆలస్యం ఔటర్ ప్రారంభోత్సవానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 12 గంటలకు విచ్చేస్తారని అధికారులు ముందుగా తెలిపారు. అప్పటికే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అరుుతే, మంత్రి జలమండలి సమావేశంలో ఉండడంతో సమయానికి రాలేకపోయారు. రెండు గంటల ఆలస్యంగా వచ్చిన మంత్రి రోడ్డును ప్రారంభించారు. వేదిక వద్ద అధికారులు ఓఆర్ఆర్కు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి శ్రీనివాస్, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి , నాయకులు బైరురాములు, నక్కనరసింహ, జడిగే రమేష్, సారుురెడ్డి, కొండల్‌రెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10సంవత్సరాలు 99 శాతం ఔటర్ రింగ్ రోడ్డును 2006 జపాన్ సంస్థ ఆర్థిక సహకారంతో ప్రారంభించారు. భూసేకరణ, అలైన్మెంట్లలో చోటుచేసుకున్న పలుమార్పులు, అనుమతుల రాకలో జరిగిన ఆలస్యంతో 10 సంవత్సరాలు గడిచింది. అరుు నా 99శాతం మాత్రం పూర్తరుుంది. ఇంకా 1.1 కిలోమీటర్ మేర పనులు జరగాల్సి ఉంది. కోర్టు వివాదాల కారణంగా అది ఆలస్యం అవుతుంది. ఇంకా 9నెలల కాలంలో మిగిలిన మార్గం అందుబాటులోకి రావచ్చని మంత్రి తెలిపారు. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రులు ఔటర్‌ను వేర్వేరు చోట్ల ప్రారంభిస్తే నాలుగోసారి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గత నెలలోనే నిర్మాణం పూర్తరుునా.. రోడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందజేసిన జపాన్ సంస్థ ప్రతినిధులు కొన్ని కారణాల వల్ల రాకపోవడంతో అప్పట్లో వారుుదా పడింది. -
ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయాల ముట్టడికి ఈయూ పిలుపు
తమ డిమాండ్ల పరిష్కారానికై శనివారం ఏపీఎస్ఆర్టీసి రీజనల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. అద్దె బస్సుల టెండర్స్ రద్దుచేయడం, పెండింగ్ ఉన్నకాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయడం, రిటైర్ అయిన ఆర్టీసి కార్మికులకు పీఆర్సీ బకాయిలు చెల్లించడం, సమైక్యాంధ్ర సమ్మెకాలం 60 రోజులను స్పెషల్ క్యాజువల్ లీవుగా మంజూరుచేయాలనే డిమాండ్ల అమలులో ప్రభుత్వం చూపుతున్న అలసత్వానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. -
'కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవు'
హైదరాబాద్: కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని సినిమా రంగంలో గల సమస్యలపై శనివారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సినిమా ప్రముఖులు సురేష్‌బాబు, సి. కళ్యాణ్, ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలను చలన చిత్రాల షూటింగ్ కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు.అలాగే నంది అవార్డుల పేరు మర్పు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్మాతలు కోరారు. అలాగే సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.