ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు
♦ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగం
♦ పారిశ్రామిక, రీజినల్, ఐటీ రోడ్లను నిర్మిస్తాం
♦ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
♦ రెండో దశ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రారంభం
ఘట్‌కేసర్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం ఘట్‌కేసర్ నుంచి మేడ్చల్ వైపు సుతారిగూడ వరకు ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డును ఆయన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఓఆర్‌ఆర్ చుట్టూ ఏర్పాటు చేసే టౌన్‌షిప్‌లలో విద్య, వైద్య అవసరాలు ఉండేలా చూస్తామన్నారు. ఈ రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఔటర్ వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. మరిన్ని ఐటీ, ఇతర పరిశ్రమలు రావడానికి అవకాశం ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి ఔటర్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రారంభానికి భారీ ఏర్పాట్లు
ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రి వచ్చే మార్గంలో రంగురంగుల జెండాలు, తోరణాలను అలంకరించారు. వాహనాల పార్కింగ్ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. టోల్‌ప్లాజాను బెలూన్లతో అలంకరించారు. మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, నగర మేయర్ రామ్మోహన్ తదితరులు వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చి రిబ్బన్ కట్‌చేసి రోడ్డును ప్రారంభించారు.
రెండు గంటల ఆలస్యం
ఔటర్ ప్రారంభోత్సవానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 12 గంటలకు విచ్చేస్తారని అధికారులు ముందుగా తెలిపారు. అప్పటికే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అరుుతే, మంత్రి జలమండలి సమావేశంలో ఉండడంతో సమయానికి రాలేకపోయారు. రెండు గంటల ఆలస్యంగా వచ్చిన మంత్రి రోడ్డును ప్రారంభించారు. వేదిక వద్ద అధికారులు ఓఆర్‌ఆర్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి శ్రీనివాస్, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి , నాయకులు బైరురాములు, నక్కనరసింహ, జడిగే రమేష్, సారుురెడ్డి, కొండల్‌రెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
10సంవత్సరాలు 99 శాతం
ఔటర్ రింగ్ రోడ్డును 2006 జపాన్ సంస్థ ఆర్థిక సహకారంతో ప్రారంభించారు. భూసేకరణ, అలైన్‌మెంట్లలో చోటుచేసుకున్న పలుమార్పులు, అనుమతుల రాకలో జరిగిన ఆలస్యంతో 10 సంవత్సరాలు గడిచింది. అరుు నా 99శాతం మాత్రం పూర్తరుుంది. ఇంకా 1.1 కిలోమీటర్ మేర పనులు జరగాల్సి ఉంది. కోర్టు వివాదాల కారణంగా అది ఆలస్యం అవుతుంది. ఇంకా 9నెలల కాలంలో మిగిలిన మార్గం అందుబాటులోకి రావచ్చని మంత్రి తెలిపారు. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రులు ఔటర్‌ను వేర్వేరు చోట్ల ప్రారంభిస్తే నాలుగోసారి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గత నెలలోనే నిర్మాణం పూర్తరుునా.. రోడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందజేసిన జపాన్ సంస్థ ప్రతినిధులు కొన్ని కారణాల వల్ల రాకపోవడంతో అప్పట్లో వారుుదా పడింది.