Industrial
-
నారా లోకేష్, చంద్రబాబుపై వైఎస్ జగన్ సెటైర్లు
-
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ రాష్ట్రాలదే: సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: పారిశ్రామిక మద్యానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇండస్ట్రీయల్ ఆల్కహార్ తయారీ, అమ్మకాలను నియంత్రించే చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు బుధవరం తీర్పునిచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని తొలగించలేనని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలోని ఎనిమిది మంది సభ్యులు ఈ పిటిషన్‌కు మద్దతు తెలపగా.. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం విభేదించారు. పారిశ్రామిక మద్యంపై శాసనాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండాలని ఆమె వాదించారు. దీంతో 8:1 మెజార్టీతో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.అయితే యూపీ స్టేట్ వర్సెస్ సింథటిక్స్ అండ్ కెమికల్స్ కేసులో పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తూ 1990లో ఇచ్చిన ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం రద్దు చేసింది. సీజేఐ చంద్రచూడ్, మెజారిటీ అభిప్రాయాన్ని అందజేస్తూ.. ‘డినేచర్డ్ స్పిరిట్స్' అని పిలవబడే 'పారిశ్రామిక మద్యం'పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, ఈ అధికారాలను రాష్ట్రాల నుండి తొలగించలేమని స్పష్టం చేశారు. వారి అధికార పరిధిలో పారిశ్రామిక మద్యం ఉత్పత్తి, సరఫరాను నియంత్రించడానికి వీలుందని ఆయన పేర్కొన్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు..
ఢిల్లీ : దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.దేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.28,602 కోట్ల నిధుల్ని కేటాయించింది.నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏర్పాటు కానున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్‌లో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్‌కు 2 కేటాయించింది. కడప జిల్లా కొప్పర్తిలో 2596 ఎకరాల్లో, కర్నూలు జిల్లా ఓర్వకల్లో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక తెలంగాణ జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేలా సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. #WATCH | After the cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "...Cabinet today approved 12 Industrial Smart Cities under National Industrial Corridor Development Programme. The government will invest Rs 28,602 crore for this project..." pic.twitter.com/KxNYqNZ5dT— ANI (@ANI) August 28, 2024 -
కాకినాడ తీరం... విస్తరిస్తున్న పారిశ్రామికం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ తీరం కళ్లు మిరుమిట్లు గొలిపే పారిశ్రామిక ప్రగతి వైపు దూసుకెళ్తోంది. కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ (కేఎస్ఈజెడ్) ఏర్పాటై దశాబ్ద కాలం గడచినా చంద్రబాబు పాలనలో ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్తా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆయన హయాంలో సెజ్ భూముల బదలాయింపులు తప్ప తదనంతర ప్రగతి కనిపించ లేదు.అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గడచిన రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు వస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ఈ ఏడాది అంతానికి పట్టాలెక్కేలా ప్రణాళికతో నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలన్నీ పూర్తయితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉండి సముద్ర తీరానికి ఆనుకుని సుమారు ఏడువేల ఎకరాలను అన్ని అనుమతులతో సెజ్ కోసం సిద్ధం చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సరళీకరణ పారిశ్రామిక విధానాలు దోహదం చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ‘పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్’ నిర్మాణం తొండంగి మండలంలో అరబిందో ఫార్మా దేశంలోనే అతి పెద్ద పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా ప్లాంట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 416 ఎకరాలు కేటాయించింది. అరబిందో ఫార్మా అనుబంధ లీఫియస్ ఫార్మా ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పెన్సిలి జీ డిసెంబర్ నెలాఖరు నాటికి ట్రయల్‌రన్ నిర్వహించాలనే ప్రణాళికతో ఉంది. రూ.2,000 కోట్ల వ్యయంతో 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటువుతున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డును సొంతం చేసుకోనుంది. పీఎల్‌ఐఎస్ పథకం ద్వారా దేశంలో ఎంపికైన తొలి ప్రాజెక్టు లీఫియస్ ఫార్మా పెన్సిలిన్ జీ కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 4,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. చురుగ్గా మేజర్ హార్బర్ నిర్మాణ పనులు ఉప్పాడలో మేజర్ హార్బర్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో ఇచి్చన హామీ మేరకు రూ.350 కోట్లతో ప్రతిపాదించారు. సాంకేతిక కారణాలతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా.. ఇప్పటికే 70 శా తం పూర్తి అయింది. ఏకకాలంలో 2,500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 50 వేల కుటుంబాల అవసరాలను తీర్చగలిగేలా, లక్ష టన్నుల సామర్థ్యంతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.రూ.2,500 కోట్లతో కాకినాడ గేట్ వే పోర్టు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్) నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం సెజ్‌లో 1,650 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డీప్ సీ పోర్టుగా 11 బెర్తుల సామర్థ్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పోర్టు ద్వారా 16 మిలియన్ టన్నుల కార్గోను ఏటా హ్యాండ్లింగ్ చేసే అవకాశం లభిస్తుంది. 2.70 లక్షల టన్నుల బరువును మోయగల భారీ ఓడలు నిలుపుకునేలా పోర్టు నిర్మాణం జరుగుతోంది. పోర్టు కోసం అన్నవరం నుంచి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు కేటాయించింది. యాంకరేజ్ పోర్టులో అంతర్గత రహదారులు, జట్టీల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. -
పారిస్ ఒప్పందానికి చిల్లు? భయపెడుతున్న భూతాపం!
ప్రపంచ మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ రోజురోజుకు పెరిగిపోతున్న భూతాపం. దీనిని నియంత్రించే లక్ష్యంతో 2015లో 200 దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని ప్రకారం అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు ఈ దేశాలన్నీ తగిన చర్యలు చేపట్టాలి. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంట్రీగ్రేడ్‌ల కన్నా తక్కువకు నియంత్రించాలి. అప్పుడే విపత్కర వాతావరణ ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చని పారిస్ ఒప్పందంలో తీర్మానించారు. అయితే ఇది విఫలమయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023 నవంబరు 17న నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోజు భూ ఉపరితల ఉష్ణోగ్రత పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యింది. ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇదే రికార్డుగా నిలిచింది. ఇది అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన గాలి ఉష్ణోగ్రత, సముద్ర ఉష్ణోగ్రత, అంటార్కిటిక్ సముద్రపు మంచు విస్తీర్ణం మొదలైనవి భూతాపం పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. గత జూలైలోనూ భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. సెప్టెంబర్ నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నాయని మరో నివేదిక పేర్కొంది. భూతాపం నియంత్రణకు అన్ని దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడం, అటవీ రక్షణ పెంపుదల, మొక్కల ఆధారిత ఆహారాలవైపు మళ్లడం, కొత్త బొగ్గు ప్రాజెక్టులను ఎత్తివేయడం, చమురు, గ్యాస్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి ప్రయత్నాలను తప్పనిసరిగా చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉష్ణోగ్రతలను లక్ష్యం మేరకు నియంత్రించలేకపోతే అత్యంత దారుణమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే సముద్ర మట్టాలు 10 సెంటీమీటర్లు పెరిగి, చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పరిమితం చేయగలిగితే కనీసం కోటి మందిని ఈ ముప్పు నుంచి బయటపడేయచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారతీయలు పాక్‌లో వ్యాపారం చేయవచ్చా? -
విశాఖలోనూ విద్యుత్ నియంత్రణ మండలి
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడుతోంది. అక్కడి ప్రజలకు, పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) త్వరలో అందుబాటులోకి వస్తోంది. కొన్ని విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, కేసులను విశాఖ నుంచే ఏపీ ఈఆర్సీ పరిష్కరించనుంది. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న వినియోగదారులకు హైదరాబాద్‌కు, భవిష్యత్‌లో కర్నూలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విశాఖలోనూ కార్యకలాపాలు మొదలుపెడుతోంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీ ఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే.. విద్యుత్ నియంత్రణ మండలి మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వస్తోంది. ప్రస్తుతం అనేక కేసుల్లో వాయిదాలకు హాజరయ్యేందుకు విద్యుత్ సంస్థల అధికారులు, ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు తరచూ హైదరాబాద్‌లోని ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కనీసం రెండు, మూడు రోజులు ఏపీ ఈఆర్సీ అధికారులు రాష్ట్రంలో అందుబాటులో ఉండటం లేదు. 24 గంటలూ పనిచేయాల్సిన అత్యవసర విభాగాల్లో విద్యుత్ శాఖ ప్రధానమైనది కావడంతో ప్రజలకు కూడా దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపై ఈ పరిస్థితిలో చాలా వరకూ మార్పు రానుంది. కర్నూలులో ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వర్తించాలని ఈ ఏడాది ఏప్రిల్ 25న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు అక్కడ భవన నిర్మాణం జరుగుతోంది. షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కొన్నేళ్లుగా వార్షిక టారిఫ్ ఆర్డర్ (విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల వంటి కార్యకలాపాలను మాత్రమే విశాఖపట్నం నుంచి నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 18న ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఆవరణలో ఏపీ ఈఆర్సీ క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది. ఆ మరుసటి రోజే రాష్ట్ర విద్యుత్ సంస్థలు తయారు చేసిన ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్‌పై ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ విచారణ విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరిగింది. అయితే.. ఇది ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థలు ఇచ్చిన నివేదికలపై జరిగిన విచారణ. ఇదే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు వేసిన పిటిషన్లపై కూడా కమిషన్ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. నవంబర్ 4న క్యాంపు కార్యాలయంలో ఒకేరోజు 9 పిటిషన్లపై బహిరంగ విచారణ చేపట్టనుంది. షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఏపీఈఆర్సీ తాజాగా విడుదల చేసింది. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది. -
శ్రీసిటీలో ‘కెర్రీ ఇండెవ్’ లాజిస్టిక్స్ కేంద్రం ప్రారంభం
సత్యవేడు (తిరుపతి జిల్లా): భారత్‌లోని ప్రముఖ ఇంటిగ్రేటివ్–3పీఎల్ (థర్డ్ పార్టీ లాజిస్టిక్స్) సేవల సంస్థ కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్ నెట్వర్క్, శ్రీసిటీలో 3 లక్షల చ.అ విస్తీర్ణంలో నిర్మించిన నూతన అత్యాధునిక లాజిస్టిక్స్ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా ఆపరేషన్స్ కోసం ఇది పనిచేయనుంది. పరిశ్రమ ఆవరణలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మిత్సుబిషి ఎలక్ట్రిక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)ఒబాటా మసకాజు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కెర్రీ ఇండెవ్ చైర్మన్ డాక్టర్ గ్జావియర్ బ్రిట్టో మాట్లాడుతూ..వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ వ్యాపార సంస్థలకు శ్రీసిటీ అత్యంత అనువైన వ్యూహాత్మక స్థానమని చెప్పారు. తమ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన శ్రీసిటీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒబాటా మసకాజు మాట్లాడుతూ నూతన ప్లాంట్ ఏర్పాటులో కెర్రీ ఇండెవ్ లాజిస్టిక్స్, ఇండోస్పేస్ బృందాల అత్యుత్తమ కృషిని అభినందించారు. శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో లాజిస్టిక్, వేర్‌హౌసింగ్ సేవల ప్రాముఖ్యతను వివరించారు. మిత్సుబిషి ఎలక్ట్రిక్ ప్లానింగ్ హెడ్ గణపతి శంకర్ తదితరులు పాల్గొన్నారు -
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో విదేశీ పారిశ్రామికవేత్తల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపదపై అధ్యయనానికి వచ్చిన విదేశీ యువ పారిశ్రామికవేత్తలు.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను మంగళవారం కలిశారు. యూత్ అంబాసిడర్స్ ప్రోగ్రాం(వైఏపీ)లో భాగంగా ఆ్రస్టియా, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్, బెల్జియం దేశాలకు చెందిన 13 మంది యువ పారిశ్రామికవేత్తలు 15 రోజుల పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ని సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రాముఖ్యత, చారిత్రక, వారసత్వ సంపద, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఇండ్రస్టియల్ పాలసీ, ఐటీ, ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి విషయాలను వారికి మంత్రి వివరించారు. కార్యక్రమంలో యూత్ అంబాసిడర్స్ కో–ఆర్డినేటర్ నవీన్ మల్వేతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వ కృషికి అవార్డుతో జాతీయ స్థాయిలో గుర్తింపు
-
క్వాంటమ్ మిషన్‌కు ఆమోదం
న్యూఢిల్లీ: క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనలు, అభివృద్ధికి ఉద్దేశించిన నేషనల్ క్వాంటమ్ మిషన్(ఎన్‌క్యూఎం)కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. దీనికి వచ్చే ఆరేళ్లలో రూ.6,003.65 కోట్లు వెచ్చిస్తారు. ఈ రంగంలో పరిశోధనలతో దేశంలో మరింత ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ విభాగాల్లో నాలుగు థీమాటిక్ హబ్స్(టీ–హబ్స్) నెలకొల్పనున్నట్లు తెలియజేశారు. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు–2023కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేసే కఠినౖ నిబంధనలను బిల్లులో చేర్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ప్రస్తుతమున్న యూ, ఏ, యూఏ అని కాకుండా ప్రేక్షకుల వయసుల విభాగం ఆధారంగా సినిమాలను వర్గీకరించనున్నట్లు పేర్కొన్నారు. -
పెట్టుబడులకు థీమ్... భారత్ !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థిరమైన విధా నాలు, తయారీ సామర్థ్యాలు పెంచుకుంటూ ఉండటం, వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు అంతర్జాతీయంగా చూస్తే భారతదేశం ప్రధాన థీమ్‌గా ఉండబోతోందని పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ సీఐవో శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. ప్రస్తుతం ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్ స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. మరిన్ని వివరాలు.. ► రాబోయే దశాబ్ద కాలంలో పెట్టుబడులకు కొత్తగా ఏ థీమ్‌లు ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి? ప్రధానంగా మూడు థీమ్‌లు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా భారత్‌తో ముడిపడినవే. అంతర్జాతీయ దృష్టికోణంతో చూస్తే భారతదేశమే కొత్త పెట్టుబడి థీమ్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం అయిదో అతి పెద్ద ఎకానమీగా ఎదిగింది. స్థిరమైన రాజకీయ పరిస్థితులు, పటిష్టమైన వినియోగంతో కూడుకున్న వృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో భారత్‌లో పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక రెండో థీమ్ విషయానికొస్తే భారత్ తన తయారీ సామరŠాధ్యలను పెంచుకుంటూ ఉండటం. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ పరిస్థితులు, ముడి సరుకులపై అనిశ్చితి, చైనా ప్లస్ వన్ వ్యూహాలు మొదలైన ధోరణులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం మన జీడీపీలో ఎక్కువగా సర్వీసుల వాటా ఉంటుండగా, తదుపరి దశ వృద్ధి తయారీ రంగం నుంచి రాబోతోంది. దేశీయంగా తయారీకి ప్రాధాన్యతనిస్తుండటం, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాలు మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి. ఇక మూడో థీమ్‌ను తీసుకుంటే పెరుగుతున్న తలసరి ఆదాయంతో వినియోగం కూడా పెరుగుతోంది. మరింత మంది ప్రజలు ఆర్థికంగా ఎదిగే కొద్దీ వినియోగ పరిమాణం, నాణ్యత రెండూ పెరగనున్నాయి. ఫైనాన్షియల్స్, డిజిటలైజేషన్‌లోనూ ఇదే ధోరణి కనిపించనుంది. ► ఒడిదుడుకుల మార్కెట్లో రిటైల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి? ఇన్వెస్టర్లు.. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే మార్కెట్లో టైమింగ్ కన్నా ఎంత కాలం పాటు మార్కెట్లో ఉన్నామనేది ముఖ్యం. స్వల్పకాలిక ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిప్ల విధానం సరైనది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి. మార్కెట్లు స్వల్పకాలికంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా, దీర్ఘకాలంలో మాత్రం ఒడిదుడుకులు తక్కువగానే ఉంటాయి. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు ప్రతి రోజూ తమ పోర్ట్‌ఫోలియోను చూసుకోవడం కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోణంలో వ్యవహరించాలి. అలాగే వయస్సుకు తగిన విధంగా అసెట్ కేటాయింపులపై దృష్టి పెట్టాలి. తద్వారా రిటైర్మెంట్ తదితర దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు వీలవుతుంది. ► ద్వితీయార్ధంలో మార్కెట్లకు పొంచి ఉన్న రిస్కులేమిటి? ఇటీవలి కాలంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత మార్కెట్లు బాగానే రాణించాయి. వేల్యుయేషన్స్ చౌకగా లేకపోయినా చాలా అధికంగా కూడా ఏమీ లేవు. భౌగోళికరాజకీయ అనిశ్చితులు, కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మొదలైన రిస్కులు ఉన్నాయి. అయితే ఇవన్నీ అంతర్జాతీయంగా కూడా ఉన్నవి, తాత్కాలికమైనవే. ఏదేమైనా రిస్కులనేవి ఈక్విటీ పెట్టుబడుల్లో అంతర్భాగమేనని దృష్టిలో ఉంచుకుని, డైవర్సిఫికేషన్ ద్వారా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ► ప్రస్తుతం ఏయే రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? సాధారణంగా అసెట్ క్వాలిటీ, రుణ వృద్ధి మెరుగుపడుతుండటంతో ఫైనాన్షియల్స్ సానుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే దేశీయంగా తయారీకి ప్రోత్సహిస్తున్నందున ఇండస్ట్రియల్స్ కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, యుటిలిటీలు మొదలైనవి అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ► తొలిసారిగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సూచనలు? ఫస్ట్ టైమర్లు దీర్ఘకాలిక పెట్టుబడుల కోణంతో తక్కువ ఒడిదుడుకులు ఉండే, డైవర్సిఫైడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. డైవర్సిఫైడ్/ఫ్లెక్సి క్యాప్, ఈఎల్ఎస్ఎస్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈ కోవకు చెందుతాయి. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులకు 3 ఏళ్ల ఆటోమేటిక్ లాకిన్ వ్యవధి ఉంటుంది. ఈక్విటీల్లో రాబడులు అందుకోవాలంటే కనీసం ఆ మాత్రం సమయమైనా ఇన్వెస్ట్ చేయాలి. ఇక వయస్సు, ఇతరత్రా కట్టుకోవాల్సినవి బట్టి ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలు/వయస్సు/వ్యక్తిగత అవసరాల ప్రకారం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్డ్/హైబ్రిడ్ ఫండ్స్‌కు కేటాయించడాన్ని పరిశీలించవచ్చు.స్టాక్, సెక్టార్, మార్కెట్లు .. ఏవైనా కావచ్చు వేలం వెర్రి ధోరణులకు పోవద్దు. మార్కెట్లు ఆశ, నిరాశల మధ్య తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఉంటాయి. కాబట్టి రాబడులకు సంబంధించి భారీగా కాకుండా వాస్తవిక స్థాయిలో అంచనాలు పెట్టుకోవడం మంచిది. -
పారిశ్రామిక పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని, తైవాన్ కంపెనీల కోసం తెలంగాణలో ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు అన్నారు. తైపీ ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ బౌ షాన్ జెర్ నేతృత్వంలోని తైవాన్ వాణిజ్య ప్రతినిధుల బృందం శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పరస్పర సంస్కృతి కార్య క్రమాల మార్పిడి సహా అనేక అంశాల గురించి ఈ భేటీలో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను కేటీఆర్ తైవాన్ ప్రతినిధుల బృందానికి తెలిపారు. లైఫ్‌సైన్సెస్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆటో మొబైల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలతోపాటు పలురంగాల్లో రాష్ట్రం పురోగమిస్తున్న తీరునుతెఇయజేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా ఎనిమిదేళ్లుగా సాధించిన పెట్టుబడులు, ఉపాధి కల్పన తదితరాలను తైవాన్ బృందానికి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు తైవాన్ బృందం రాష్ట్రానికి వచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా కేటీఆర్‌ను కలిసిన ప్రతినిధుల బృందంలో తైవాన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ రిచర్డ్ లీతో పాటు తైవాన్‌కు చెందిన పలువురు వాణిజ్యవేత్తలున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు. -
అగ్రశ్రేణి కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ పాలసీలతోపాటు దేశంలోనే అత్యుత్తమ వాతావరణం తెలంగాణ సొంతమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో గత ఎనిమిదేళ్లుగా నమోదైన ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ప్రోత్సాహకాలతో ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకున్నాయన్నారు. తెలంగాణకు భారీ పెట్టుబడులను రప్పించడం లక్ష్యంగా మంత్రి కేటీ ఆర్ శుక్రవారం ‘డిప్లొమాట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్’ను నిర్వహించారు. టీ–హబ్ 2.0లో జరిగిన ఈ సమావేశానికి సుమారు 50 దేశాలకు చెందిన రాయబారు లు, ప్రతినిధులు, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సు ల్ జనరల్స్, హైకమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు. తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించారు. తెలంగాణ పెట్టుబడుల సలహాదారు (టియా) పేరిట రూపొందించిన వర్చువల్ మస్కట్, చాట్ బాట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కేటీఆర్ ప్రజెంటేషన్ అనంతరం విదేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు టీ హబ్ ప్రాంగణాన్ని పరిశీలించి వివిధ స్టార్టప్‌ల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ చొరవతో ప్రారంభమైన టీ–హబ్, టీ–వర్క్స్, టీఎస్ఐసీ, టాస్క్ సంస్థల లక్ష్యాలు, పనితీరును దౌత్యవేత్తలు ప్రశంసించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీ–హబ్ సీఈఓ ఎం శ్రీనివాస్‌రావు, పరిశ్రమలు, ఐటీ శాఖకు చెందిన వివిధ విభాగాల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
పరిశ్రమలు.. పరుగు..పారిశ్రామిక ఉత్పత్తిలో కొత్త జోష్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి విషయంలో మే నెలకు సంబంధించి సూచీ ఎకానమీకి ఊరటనిచ్చింది. 2022లో 19.6 శాతం పురోగతిని (2021 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాలు మే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి పురోగతికి ఊతం ఇచ్చినట్లు మంగళవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం వివిధ రంగాల పనితీరును పరిశీలిస్తే... ♦ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగం భారీగా 20.6 శాతం పురోగతి సాధించింది. ♦ విద్యుత్ రంగం ఉత్పత్తి 23.5 శాతం పెరిగింది. ♦ మైనింగ్ రంగంలో పురోగతి 10.9 శాతం, ♦ పెట్టుబడులకు, భారీ యంత్రసామగ్రి డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు ఏకంగా 54%గా నమోదైంది. ♦ రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 58.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ మరోవైపు 2022 ఏప్రిల్ ఐఐపీ తొలి అంచనాను 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. తొలి రెండు నెలల్లో ఇలా..: 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలలు.. ఏప్రిల్, మేలో ఐఐపీ వృద్ధి రేటు 12.9%గా నమోదైంది. రూపాయి : 79.59 ముంబై: సెంట్రల్ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా విధాన నిర్ణయాలు డాలర్ మారకంలో రూపాయి పతనాన్ని నిలువరించలేకపోతున్నాయి. మంగళవారం రూపాయి డాలర్ మారకంలో మరో కొత్త చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు పతనమై, 79.59కి రూపాయి బలహీనపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 79.66కు కూడా పడిపోయింది. -
వారెవ్వా ఐపాస్... ప్రగతి పట్టాలపై పారశ్రామిక పరుగు
కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామికరంగం మళ్లీ ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతోంది. గత ఏడేళ్లలో పరిశ్రమల ఏర్పాటులో మేడ్చల్ అగ్రభాగాన ఉండగా..రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. రాష్ట్ర ఖజానాకు మూడో వంతు ఆదాయాన్ని సమకూర్చడమేగాకుండా నిరుద్యోగులకు ఉపాధిలోనూ ముందు వరుసలో ఉంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే–2021లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే టాప్‌లో నిలిచింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అప్రూవల్ అండ్ సెల్ప్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ ఐపాస్) విధానంతో ఉమ్మడి జిల్లాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత (2014–21 మధ్య) జిల్లాకు రూ.29,488 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఏర్పాటు చేసిన 5,362 కంపెనీల వల్ల 2,62,018 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. అంతేకాదు నగరశివారులో ఏర్పాటు చేసిన ఈ సంస్థల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూ రాయి. ఫలితంగా జిల్లా తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ కొనసాగుతోంది. పరిశ్రమల ఏర్పాటు లో మాత్రం మేడ్చల్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఏడేళ్లలో మేడ్చల్ జిల్లాలో 3,805 కంపెనీలు ఏర్పాటు కాగా, రంగారెడ్డిజిల్లాలో 1,137 కం పెనీలు వచ్చాయి. వీటి ద్వారా 1,60,382 మందికి ఉపాధి లభించింది. ఉత్పత్తుల ఎగుమతుల్లో మేడ్చల్ 25.52శాతంతో మొదటి స్థానంలో ఉంటే, అదే రం గారెడ్డి 16.97 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన టీఎస్–ఐపాస్‌కు ఆన్లైన్ దరఖాస్తులతో అన్ని రకాల అనుమతులు ఏకగవాక్ష విధానంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే జారీ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఫలితంగా దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సహాకాలు ప్రకటిస్తుంది. ఫలితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మచ్చుకు కొన్ని.. ఇప్పటికే విమానాలు, హెలిక్యాప్టర్ విడిభాగాల ఉత్పత్తిని చేపడుతున్న జిల్లా త్వరలోనే రైల్వేకోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రం కానుంది. శంకర్పల్లి మండలం కొండకల్ వద్ద మేద సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఏర్పాటు చేసింది. ఏటా 500 రైల్వే కోచ్‌లు, 50 లోకోమోటివ్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనుంది. అంతేకాదు 2,200 మందికి ఉపాధి కల్పించనుంది. ట్రయల్ రన్లో భాగంగా ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. మహేశ్వరం మండలం కేసీతండాలో ఎలక్ట్రిక్ హార్ట్‌వేర్ పార్క్‌లో రూ.300 కోట్లతో విప్రో కన్జ్యూమర్ కంపెనీ స్థాపించింది. 900 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇటీవల ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. ఐపాస్‌తో పెరిగిన వేగం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుత పారిశ్రామిక వాడలను మరింత విస్తరించడంతో పాటు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మంఖాల్, మహే శ్వరం, షాబాద్, తదితర ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఎంఎస్ఎంఈ పార్కులు, ఫుడ్ పార్కులు, ప్లాస్టిక్ అండ్ లెదర్ పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నాం. దళారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తున్నాం. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రవాణా, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ, అధికారి (చదవండి: హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్) -
ఫుల్లుగా తాగేశారు... 34 లక్షల బాటిళ్లు ఖాళీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూములు, ఇళ్లు, ఐటీ, పారిశ్రామిక ఉత్పత్తుల్లోనే కాదు మద్యం అమ్మకాల్లోనూ జిల్లా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే.. ఇక్కడ మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం జిల్లా నుంచే సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి జూన్ 15 వరకు 2,33,69,322 బీర్లు అమ్ముడు పోగా, ఇందులో కేవలం జిల్లా వాసులే 51,51,058 బీర్లు తాగేశారు. తెలంగాణ వ్యాప్తంగా 1,65,10,978 ఫుల్ బాటిళ్లు ఖాళీ కాగా కేవలం జిల్లాలోనే 34,72,932 ఫుల్ బాటిళ్లు అమ్ముడుపోయాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాకి ఇప్పటి వరకు రూ.15,235 కోట్ల ఆదాయం సమకూరగా, కేవలం జిల్లా నుంచే రూ.3,354 కోట్లకుపైగా రావడం గమనార్హం. విందేదైనా మందు ఉండాల్సిందే నగరానికి చేరువలో ఉండడం.. అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడు మెజార్టీ ఔటర్ రింగ్‌రోడ్డు జిల్లాలో ఉండడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు దేశవిదేశాలకు చెందిన ఐటీ అనుబంధ సంస్థలు, అంతర్జాతీయ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. అనేక మంది ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. వీరిలో చాలా మంది ఇక్కడే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారు. ఇళ్లు, భూములు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఇక్కడి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భూ క్రయవిక్రయాల ద్వారా రైతులు, వ్యాపారులు అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు సైతం రూ.లక్షల్లో ఉన్నాయి. చేతినిండా డబ్బులు ఉండటంతో పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు, విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారు. శుభకార్యాలు, అశుభకార్యాలు ఇలా ఏదైనా వచ్చిన బంధువులకు మద్యం, మాంసం తప్పనిసరైంది. శంషాబాద్ నుంచే అత్యధికం జిల్లాలో 234 మద్యం దుకాణాలు ఉండగా, వీటిలో శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో వంద, సరూర్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో 134 ఉన్నాయి. శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలోనే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో సరూర్‌నగర్ జోన్ నుంచి సమకూరడం విశేషం. ఇన్నర్ రింగ్‌రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న దుకాణాల్లోనే అమ్మకాలు ఎక్కువ జరగడం విశేషం. (చదవండి: కార్ల పైనా కన్నేస్తున్నారు!) -
రాయితీలు.. ఇంకా రాలే..
►సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు గోమతి కాటన్ ఇండస్ట్రీస్ ఆరేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. పెట్టుబడి రాయితీ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా రూ.10 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయినా నేటికీ నయాపైసా విడుదల కాలేదు. ►కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన మన్నె జానకి 2017లో ఉపాధి కోసం జేసీబీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీల రాయితీలకు ఉద్దేశించిన ‘టీ ప్రైడ్’కింద రూ.6.91 లక్షలు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సబ్సిడీ ఇవ్వాలని 2018 అక్టోబర్‌లో కమిటీ సిఫారసు చేసింది. అయినా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. సబ్సిడీ అందకపోవడంతో అప్పులపై వడ్డీ భారం పెరుగుతోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ►సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన రేండ్లపల్లి కాంతమ్మ వాహనం కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోగా 2018లో యూనిట్ మంజూరైంది. రుణం కోసం బ్యాంకును ఆశ్రయించగా, పరిశ్రమల శాఖ నుంచి పెట్టుబడి సబ్సిడీ విడుదలైతేనే రుణం మంజూరు చేస్తామని షరతు విధించింది. అటు బ్యాంకు, ఇటు పరిశ్రమల శాఖ తీరుతో తనకు ఉపాధి లేకుండా పోయిందని కాంతమ్మ వాపోతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబ డులతో వచ్చే వారికి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు అందడం లేదు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా.. పరిశ్రమల యాజమాన్యాలు దరఖాస్తులు చేసుకుంటున్నా విడుదల కావడం లేదు. గత నవంబర్ వరకు రాష్ట్రంలో 43 వేలకుపైగా యూనిట్లకు రూ.3,389.95 కోట్లు రాయితీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటివరకు 72 పర్యాయాలు ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపినా ఫలితం శూన్యమే. నవంబర్ 30న జరిగిన 72వ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం 369 యూనిట్లకు సంబంధించి మరో రూ.47.67 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించింది. జనరల్ కేటగిరీలో 2016–17 నుంచి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 2018–19 నుంచి రాయితీలు పెండిం గులో ఉన్నాయి. కరోనాతో కార్యకలాపాలు దెబ్బతినడంతో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఊరటనిస్తాయ ని పారిశ్రామికవర్గాలు భావించాయి. దీనికితోడు బ్యాంకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం కూడా అమలుకాకపోవడంతో ఇటు రుణాలపై వడ్డీ, అటు ప్రోత్సాహకాలు అందక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఊరటనివ్వని ‘టీ ఐడియా’, ‘టీ ప్రైడ్’ పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం 2014–15 నుంచి ఇప్పటివరకు రూ.26.46 లక్షల కోట్ల పెట్టుబడులతో 18వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 21 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలుగట్టారు. పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం 2014లో ‘టీ ఐడియా’, ‘టీప్రైడ్’పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. జనరల్ కేటగిరీకి టీ ఐడియా ద్వారా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ‘టీ ప్రైడ్’ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. వీటికింద రాయితీ, స్టాంప్ డ్యూటీ, సేల్స్ టాక్స్, భూమి ధర, విద్యుత్ బిల్లులు, పావలావడ్డీ తదిరాలకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇదిలాఉంటే సీనియారిటీ ప్రకారం బకాయిలు విడుదల కావాల్సి ఉండగా, సిఫారసు లేఖలు తెచ్చిన 24 మెగా కంపెనీలకు గత నవంబర్‌లో రూ.250 కోట్లు విడుదలైనట్లు సమాచారం. బడ్జెట్లో కేటాయించినా..! రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు రూ.3,389 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను ప్రతిపాదించి, అందులో రూ.2,500 కోట్లు రాయితీలు, ప్రోత్సాహకాలకే కేటాయించినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అంతకుముందు బడ్జెట్లో రాయితీల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ఇప్పటివరకు రూ.100 కోట్లు మాత్రమే విడుదలైనట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆశలు ఆవిరై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉసూరుమంటున్నాయి. -
ఏపీలో మరో భారీ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ.1,500 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ ప్లాంటు ఏర్పాటుకు శ్రీ సిమెంట్ గ్రూపు ముందుకొచ్చింది. 24 నెలల్లో దీనిని పూర్తిచేసేలా శ్రీ సిమెంట్ గ్రూపు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్లను ఈ గ్రూప్ ఏర్పాటుచేసింది. శ్రీ సిమెంట్ గ్రూపు నుంచి ఏపీలో ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు కానుంది. ఈ నేపథ్యంలో.. సంస్థ ఎండీ హెచ్ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్‌లు సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఏపీలో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ముఖ్యమంత్రి జగన్ శ్రీ సిమెంట్ మేనేజ్మెంట్ టీమ్‌తో చర్చించారు. రాష్ట్రాభివృద్దికి సీఎం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా సంస్థ ఎండీ హెచ్ఎం బంగూర్ స్పందిస్తూ.. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. ఒక కంపెనీ సీఈఓ ఏ రకంగా వ్యవహరిస్తారో అలాగే రాష్ట్ర బాగోగుల కోసం సీఎం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని, రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్దఎత్తున జరగాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. ఇక దేశం కంటే రాష్ట్ర వృద్ధి రేటు అధికంగా ఉందని.. భవిష్యత్తులో ఇది మరింతగా పెరుగుతుందని బంగూర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆలోచనా దృక్పథంతో రాష్ట్రాభివృద్ధి మరింత పురోగమిస్తుందని.. అందువల్లే తామిక్కడ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. సంస్థ జేఎండీ ప్రశాంత్ బంగూర్ మాట్లాడుతూ.. పెద్ద సిమెంటు ప్లాంటు ఏర్పాటువల్ల మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందన్నారు. తద్వారా అనేకమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సర్వీసులను అందించే క్రమంలో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి వేల మందికి లబ్ధి జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, శ్రీ సిమెంట్ ప్రెసిడెంట్ (కమర్షియల్) సంజయ్ మెహతా, జీఎం జీవీఎన్.శ్రీధర్ రాజు, మేనేజర్ వెంకటరమణ, అసిస్టెంట్ మేనేజర్ సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. చదవండి: ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది: కొడాలి నాని -
పారిశ్రామికాభిరుద్దిపై సీఎం జగన్ దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు : గౌతమ్ రెడ్డి
-
బడ్జెట్‌ను స్వాగతించిన పారిశ్రామిక సంఘాలు
కాన్సెప్ట్ సిటీలతో పెట్టుబడి అవకాశాలు: సీఐఐ సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలోనూ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పారిశ్రామిక అభివృద్ధికి పలు చర్యలు తీసుకోవడంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీస్ (సీఐఐ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రం భారీ పెట్టబడులతోపాటు ఉపాధి అవకాశాలను పొందే అవకాశముందని సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ డి.తిరుపతిరాజు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్రం 6,234.64 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశానికి షోకేస్‌గా నిలబడిందని, కాన్సెప్ట్ సిటీల నిర్మాణంతో భారీగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు. హెల్త్‌కేర్, వ్యవసాయంలో యాంత్రీకరణలను ప్రోత్సహించడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. విపత్తులోనూ వృద్ధి నమోదు చేసే బడ్జెట్: ఫ్యాప్సీ సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలోనూ సుస్థిరాభివృద్ధి చేసే బడ్జెట్‌గా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) శ్లాఘించింది. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు రూ.3,673.34 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రం కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఫ్యాప్సీ అధ్యక్షుడు సీవీ అచ్యుతరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో వైద్యరంగానికి రూ.13,830 కోట్లు కేటాయించడం, ముఖ్యంగా కోవిడ్ కట్టడికి రూ.1,000 కోట్లు ఖర్చు చేయడం ఆహ్వానించదగ్గ నిర్ణయమని ప్రశంసించారు. వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన రాష్ట్రంలో ఈ రంగానికి రూ.31,256 కోట్లు కేటాయించడం ద్వారా అన్ని వర్గాలు ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు. చదవండి: పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,673.34 కోట్లు -
AP Budget 2021:పారిశ్రామికాభివృద్ధితో భారీ ఉపాధి కల్పన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక వసతులను పెంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా కొప్పర్తిలోని వైఎస్సార్ ఈఎంసీ, విశాఖలోని నాయుడుపేట క్లస్టర్లను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020–21లో పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు రూ.2,705 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.968.34 కోట్లను పెంచి రూ.3,673.34 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే 35.79 శాతం అదనపు నిధులను పరిశ్రమల శాఖకు కేటాయించారు. ముఖ్యంగా రాష్ట్రంలో విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏపీఐఐసీకి రూ.200 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో నిర్మిస్తున్న వైఎస్సార్ ఈఎంసీకి రూ.200 కోట్లు కేటాయింపులు చేసింది. ఇదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల్లో మౌలిక వసతులు కల్పించడానికి రూ.60.93 కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్న వైఎస్సార్ కడప స్టీల్ ప్లాంట్‌కు గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా రూ.250 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,000 కోట్లు కేటాయించింది. రొయ్యల ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు రాయితీల నిమిత్తం రూ.50 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. కోవిడ్ సమయంలోనూ కొత్త పెట్టుబడులు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం వెన్నాడుతున్నప్పటికీ కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.6,234.64 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, తద్వారా 39,578 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్రంలో మరో 117 కంపెనీలు రూ.31,668 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయి. వీటిద్వారా 67,716 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కేవలం ఎంఎస్ఎంఈ రంగంలో రూ.4,383.24 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిద్వారా 87,944 మందికి ఉపాధి లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు, ఐటీ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. తద్వారా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో 30 వేల మందికి ఉపాధి లభించనుంది. చదవండి: AP Budget 2021: వ్యవసాయ రంగానికి భారీగా నిధులు -
రూ.200లతో ప్రస్థానం.. నేడు కోట్లకు అధిపతి
ఆసిఫాబాద్: చేసేది గుమాస్తాగా.. వచ్చేది రూ. 200ల వేతనం.. దీంతోనే కుటుంబ పోషణ బాధ్యత.. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే ఉన్నతంగా ఎదగడం కష్టమే. కాని కష్టాలకు ఏమాత్రం వెరవకుండా తనకున్న ఆలోచన విధానంతో ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగారు రఫీక్ జివాని. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయినా సరే కేవలం ఒక పూట భోజనం, నాలుగు గంటలు మాత్రమే నిద్రతో నిరంతరం శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారు రఫీక్. ఉన్నత చదువులు లేకపోయినా స్వయం కృషితో నేడు వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. రూ.వందలతో మొదలైన ప్రస్థానం రూ.కోట్లకు అధిపతిగా మా రారు. పెద్దపెద్ద చదువులు లేకపోయినా వ్యాపారంలో విజయవంతంగా కొనసాగుతున్న రఫీక్ జివానిపై ‘సాక్షి’ సక్సెస్ స్టోరీ. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన సదృద్దీన్ జివానీ, రోషన్ బాయి దంపతులకు తొమ్మిది మంది సం తానం. ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు రఫీక్ జివాని. సదృద్దీన్ పూర్వీకులు గుజరాత్‌లోని కచ్ నుంచి 150 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని పాండ్రకౌడకు వలస వచ్చారు. కొంతకాలం అక్కడే ఉన్న వీరి కుటుంబం అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఇంద్రవెళ్లికి వచ్చారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ వచ్చారు. ఈక్రమంలో రఫీక్ జివాని ప్రాథమిక విద్యాభ్యాసం నాలుగో తరగతి వరకూ హిందీ మాద్యమంలో జరిగింది. పదో తరగతి ఆసిఫాబాద్‌లో చదువుకున్నారు. 1981లో పదోతరగతి ఉత్తీర్ణత సాధించినా ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ చదువుకోలేకపోయాడు. చదువుకు స్వస్తి చెప్పిన రఫీక్ ఉపాధి వేటలో వాంకిడి మండలం అర్లిలో కమీషన్ పద్ధతిలో కల్లేదార్గా చేరారు. నాలుగు నెలలు పనిచేసి మొట్టమొదటి సంపాదన రూ.5200/– కమీషన్ పొందారు. అనంతరం 1981 నుంచి 83 వరకు పట్టణంలోని ఓ హోల్‌సేల్ వ్యాపారి వద్ద రూ. 200/– కు గుమాస్తాగా చేరారు. రెండేళ్లు పనిచేసినా వేతనం పెంచకపోవడంతో 1984 నుంచి 91 వరకు పట్టణంలోని మరో వ్యాపారి వద్ద రూ.400/– కు పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. గుమాస్తాగా పనిచేసిన 13 ఏళ్ల కాలంలో కేవలం ఒకపూట భోజనం, నాలుగైదు గంటల నిద్ర మాత్రమే దొరికేది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో పదిమంది కుటుంబం ఒకే గదిలో ఉండాల్సి వచ్చేది. అంచెలంచెలుగా వ్యాపార విస్తరణ.. గుమాస్తాగా వచ్చే జీతం సరిపోకపోవడం, తమ్ముళ్లు ఎదగడంతో పట్టణంలో కిరాణా హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం ప్రారంభించారు. రఫీక్ వ్యాపార నిపుణత, తమ్ముళ్ల సహకారంతో వ్యాపారం మరింత విస్తరించారు. గుమాస్తాగా పనిచేసిన అనుభవంతో పట్టణంలో హోల్‌సేల్ వ్యాపారంలో రాణించారు. అప్పట్లో మండలంలో వట్టివాగు ప్రాజెక్టు ప్రారంభమవడంతో ఈ ప్రాంతంలో వరి ధాన్యం పండించే వారు. ఈక్రమంలో పట్టణంలో అద్దె ప్రాతిపదికన రైస్‌మిల్ ప్రారంభించారు. 2005లో వట్టివాగు కాల్వకు గండిపడడంతో పొట్టకు వచ్చిన వరి పంట సాగునీరందక ఎండిపోయింది. దీంతో రైస్‌మిల్ నిర్వహణ భారంగా మారింది. సగం నష్టంతో రైస్‌మిల్ మిషనరీ విక్రయించారు. జిన్నింగ్‌మిల్లుల ఏర్పాటు.. మారిన పరిస్థితులతో ఈ ప్రాంతంలో పతి సాగు పెరగడంతో బ్యాంకు సహకారంతో ఆరు డీఆర్‌ల జిన్నింగ్ పరిశ్రమ స్థాపించారు. అంచెలంచెలుగా వ్యాపారాభివృద్ధి చేసి 2010లో పట్టణానికి సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై స్వంతంగా 24 డీఆర్ జిన్నింగ్, ప్రెస్సింగ్ ఇండస్ట్రీ ప్రారంభించారు. తనకున్న వ్యాపార మెలకువలు, అనుభవంతో జిన్నింగ్ ఇండస్ట్రీలో రాణిస్తూ వచ్చాడు. 2016–17లో పక్కనే రెండో జిన్నింగ్ మిల్లు ప్రారంభించారు. అప్పటి నుంచి సుమారు 400 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. స్థానికంగా జిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేయడంతో రైతులు ఆదిలాబాద్ మార్కెట్‌కు వెళ్లడం తప్పడంతో పాటు మద్దతు ధర పొందుతున్నారు. వ్యాపారంలో, మాటల్లో చతురత కలిగిన రఫీక్ సుమారు 20 ఏళ్ల పాటు పట్టణ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. గత మూడేళ్లుగా ఏ ఎంసీ డైరెక్టర్‌గా ఉన్నారు. ధాతృత్వంలోనూ ముం దుండే రఫీక్ కుల, మతాలకతీతంగా గుళ్లు, మసీ దులకు సాయం చేయడంలో ముందున్నారు. కుమారులను ఉన్నతులుగా తీర్చిదిద్ది.. చిన్నప్పటి నుంచి కషాలు పడ్డ రఫీక్ గుజరాత్‌లోని పోరుబందర్‌కు చెందిన పేదింటి అమ్మాయి మునీరాను వివాహం చేసుకున్నారు. రఫీక్‌కు ఇద్దరు కుమారులు. పెద్దోడు రిజ్వాన్ ఇంజినీరింగ్ పూర్తిచేసి, ప్రస్తుతం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. చిన్న కుమారుడు ఇర్ఫాన్ హైదరాబాద్‌లోని దక్కన్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తాను చదువులకు దూరమైనా తన కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నానని సంతృప్తిగా చెబుతారు రఫీక్. -
46 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 46 వేల ఎకరాల్లో కొత్త పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు, ముడిసరుకుల లభ్యత ఆధారంగా వివిధ అనుబంధ రంగ పరిశ్రమలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీఎస్ఐఐసీ చేపట్టిన మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు 2019 అత్యంత కీలకమని, ఈ ఏడాదిలోనే ఆ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ మెగా ప్రాజెక్టులపై రూపొందించిన 2019 క్యాలెండర్‌ను గురువారం జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్‌తో కలిసి ఆవిష్కరించారు. -
పారిశ్రామిక కారిడార్‌గా నీలగిరి
పరిశ్రమల కారిడార్ వైపు నీలగిరి అడుగులు వేస్తోంది. టీఎస్ ఐపాస్ ద్వార 2018 ఫిబ్రవరి వరకు 211 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు రూ.26,770 కోట్ల 92లక్షల పెట్టుబడులు పెడుతున్నారు. దీని ద్వార 8,950 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నల్లగొండ రూరల్ : జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పుష్కరాల సందర్భంగా సాగర్, మఠంపల్లి, ప్రాం తాలకు రోడ్డు మార్గాలను పటిష్టపర్చారు. 2020–25 నాటికి విజయవాడ హైవే ఎక్స్‌ప్రెస్ హైవేగా మారనుండటం, అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి కూడా విస్తరించడం, నడికూడ–మాచర్ల డబ్లింగ్ రైలు పనులు, భూదాన్ పోచంపల్లి నుంచి రీజనల్‌రింగ్ రోడ్డు, నకిరేకల్–నాగార్జునసాగర్ వరకు జాతీయ రహదారి పనులు జరుగుతుండటంతో పరిశ్రమల ద్వార ఉత్పత్తి అయిన వస్తువులను మార్కెటింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. యాదాద్రి పవర్ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే దామర్లచర్ల, మిర్యాలగూడ, నిడమనూరు తదితర ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన అవకాశాలున్నాయి. త్వరితగతిన అనుమతులు చౌటుప్పల్ మండలం హెచ్ఎండీఏ పరిధిలో ఉండటం వలన పరిశ్రమల అనుమతులు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పరిశ్రమలను నల్లగొండ జిల్లాలో స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 30 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో భారీగా పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. ఇప్పటికే 82 పరిశ్రమలను స్థాపించారు. రూ.610 కోట్లు పెట్టుబడి పెట్టి 1968 మందికి ఉద్యోగాలు కల్పించారు. మరో 28 పరిశ్రమలు ఈనెలాఖరులోగా ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా 39 పరిశ్రమలు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. 57 పరిశ్రమలు స్థాపనకు పనులు జరుగుతున్నాయి. దామరచర్ల ప్రాంతంలో గ్రానైట్ కటింగ్ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తే పరిశ్రమను మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా మార్బుల్స్‌ను వినియోగిస్తున్నారు. మార్బుల్స్ వినియోగం వలన వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చధనాన్ని గుణం వున్నట్లుగా ఇటలి శాస్త్రవేత్తలు తేల్చారు. కోళ్ల ఫారం దానాలు జిన్నింగ్ మిల్లులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తే మంచి ఉత్పిత్తి కి మంచి మార్కెటింగ్ ఉంటుంది. ప్రస్తుతం 2 జిన్నింగ్ పరిశ్రమలున్నప్పటికీ ఆధునిక పరిజ్ఞానం లేకపోవడంతో అంతర్జాతీయంగా పోటీని తట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత పరిశ్రమలు భారీగా ఏర్పాటవుతున్నాయి. మోడ్రన్ రైసు మిల్లులు ఏర్పాటయితే ఇతర దేశాలకు కూడా డిమాండ్ పెరగనుంది. ఏడు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ వినియోగం అందుబాటులోకి రానుంది. పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్, రోడ్డు రవాణా, మార్కెటింగ్ సులభమవుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనువైన ప్రాంతం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన అవకాశాలున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు రీజనల్ రింగు రోడ్లు, ఎక్స్‌ప్రెస్ హైవే మార్గాలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొస్తున్నారు. చేనేత, గ్రానైట్, రైస్, జిన్ని, కాటన్, సోలార్, పవర్‌ప్లాంట్స్, మార్బుల్ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా పరిశ్రమల గనిగా మారింది. – కోటేశ్వర్రావు, పరిశ్రమల శాఖ జీఎం -
మనం దూసుకెళుతున్నాం
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ పురోగతిలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీని 2022 నాటికి దేశంలో మూడో రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నంబర్‌వన్‌గా నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. మరే రాష్ట్రంలోనూ లేని అపార వనరులు ఏపీలో ఉన్నాయని, పెట్టుబడిదారులు ముందుకొస్తే అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. శనివారం విశాఖలో ప్రారంభమైన పారిశ్రామిక భాగసామ్య సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. మూడు వారాల్లో అనుమతులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి అన్ని రకాలుగా సహకరిస్తామని, మౌలిక సదుపాయాలు కల్పించి ఏవైనా భూ వివాదాలు తలెత్తినా తామే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎలాంటి అనుమతులైనా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే వచ్చేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఉన్నాయని, భవిష్యత్‌లో విద్యుత్ ఛార్జీల ధర కూడా తగ్గిస్తామన్నారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ పారిశ్రామిక పురోభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోందన్నారు. 2015–16లో 10.5 శాతం, 2016–17లో 11.61 శాతం, 2017–18 మొదటి అర్ధ సంవత్సరంలో 11.37 శాతం పురోభివృద్ధి నమోదైందన్నారు. రెండంకెల వృద్ధి సాధించడం ఏపీకే సాధ్యమైందన్నారు. సీఎం హోదాలో తాను ఆరు భాగస్వామ్య సదస్సులను నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. 1,946 ఎంవోయూలు.. కార్యరూపం దాల్చినవి 531 గత మూడేల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి 1,946 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రూ. 13.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 31 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసినట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే 531 పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చాయని, రూ. 1.03 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందని, 2.65 లక్షల మందికి ఉపాధి లభించిందని ప్రకటించారు. మరో 1,143 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటి ద్వారా రూ. 5.69 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని, పారిశ్రామిక పెట్టుబడుల పురోగతి దేశంలోనే అత్యధికంగా 59 శాతం నమోదైందని చెప్పారు. మరో ఐదేళ్లలో 20 లక్షల మంది ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. . భావనపాడు పోర్టులో పెట్టుబడులు .. భావనపాడు పోర్టులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అదాని గ్రూప్ చైర్మన్గౌతమ్ అదాని భాగస్వామ్య సదస్సులో ప్రకటించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల పరిశ్రమలతో కలుపుకొని రూ. 9,400 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫాక్చరర్స్, రాష్ట్ర ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. వచ్చే ఏడాదీ విశాఖలోనే: సీఎం వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఏటా సదస్సు నిర్వహించే ఏపీఐఐసీ మైదానంలో కొత్తగా అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తున్నామన్నారు. ఏడాదిలో నిర్మాణం పూరై్తతే తదుపరి భాగస్వామ్య సదస్సు అందులో నే ఏర్పాటు చేస్తామన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ కాంట్రాక్టు పొందిన లూలూ సంస్థ సీఎండీ యూసఫ్ ఆలీని కోరారు. -
పే..ద్ద లారీ
చిలమత్తూరు : లారీకి సాధారణంగా 10 లేదా 16 చక్రాలు అంతకంటే పెద్ద లారీకి 90 చక్రాల వరకు ఉంటాయి. కానీ తమిళనాడు తిరుచునారు నుంచి పరిశ్రమలకు సంబంధించిన అతి పెద్ద పరికరంతో గుజరాత్ వెళ్తున్న ఓ లారీకి ఏకంగా 134 చక్రాలు ఉన్నాయి. శుక్రవారం కొడికొండ చెక్‌పోస్టులో తనిఖీలో భాగంగా ఈ లారీని ఆపారు. ఇంత పెద్ద లారీని చూసిన స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. -
పరిశ్రమకు పంటభూములే కావాలా?
బీడు, బంజరు భూముల్లో ఏర్పాటు చేయాలి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి ముగిసిన రైతుల దీక్షలు గీసుకొండ : జిల్లాలో విస్తారంగా బీడు, బంజరు భూములు ఉండగా పరిశ్రమల కోసం రైతుల భూములను ఎలా సేకరిస్తారని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలంలోని ఊకల్ క్రాస్‌రోడ్డు వద్ద టెక్స్టైల్ పార్కు కోసం పంట భూములను ఇవ్వమంటూ రైతులు చేపట్టిన దీక్షల ముగింపు సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 28 వేల ఎకరాల బీడు భూములు ఉండగా బలవంతంగా రైతుల భూములను లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి , రైతు సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు మోర్తాల చందర్రావు, కూసం రాజమౌళి, శ్రీనివాస్, రమేశ్, రంగయ్య, సమ్మిరెడ్డి, భూ పరిరక్షణ కమిటీ నాయకులు నర్సింగరావు, రవీందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు. -
మార్కెట్లకు స్వల్ప నష్టాలు..
• నిరాశపరిచిన పారిశ్రామిక, ద్రవ్యోల్బణ గణాంకాలు • 88 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ • నిఫ్టీకి 29 పాయింట్ల నష్టం ముంబై: జూన్‌లో పారిశ్రామికోత్పత్తి మందగించడం, ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతోపాటు... జపాన్ రెండో త్రైమాసికపు జీడీపీ గణాంకాలు నిరుత్సాహపరచడంతో మార్కెట్లు మంగళవారం స్వల్పంగా నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 88 పాయింట్ల నష్టంతో 28,064.61 వద్ద ముగియగా.... నిఫ్టీ సైతం 29.60 పాయింట్లను కోల్పోయి 8,642.55 వద్ద ముగిసింది. ఉదయం మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమైనా హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాల రాకతో ఆ ఉత్సాహం ఎంతో సేపు నిలువలేదు. సెన్సెక్స్ 28,199 పాయింట్ల గరిష్ట స్థాయికి వెళ్లినా చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 88 పాయింట్లు కోల్పోయి 28,064 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 29.60 పాయింట్ల నష్టంతో 8,642 వద్ద స్థిరపడింది. పారిశ్రామికోత్పత్తి జూన్‌లో గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2.1శాతానికి తగ్గడం, రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం పెరగడం మార్కెట్లను నిరుత్సాహపరిచినట్టు జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ అన్నారు. ఎఫ్ఐఐల వాటాః రూ.20 లక్షల కోట్లు: ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల వాటా విలువ ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.20.13 లక్షల కోట్లుగా ఉంది. ఇక జనవరి-మార్చి త్రైమాసికంలో ఎఫ్ఐఐ హోల్డింగ్స్ రూ.18.37 లక్షల కోట్లు. -
సింగరేణి అభివృద్ధితోనే పారిశ్రామిక ప్రగతి
జీఎం విజయపాల్‌రెడ్డి ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి అభివృద్ధితో తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి సాధ్యమని ఆర్జీ–2 జీఎం విజయపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక సీఈఆర్ క్లబ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఎగురవేసి మాట్లాడారు. ప్రస్తుతం బొగ్గు పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, దీన్ని అధిగమించేందుకు ప్రతీఒక్కరు సమష్టిగా కృషి చేయాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలపై యాజమాన్యం ప్రత్యేక దష్టి సారించిందన్నారు. అనంతరం ఆర్జీ–2 డివిజన్లో ఉత్తమ కార్మికులుగా ఎంపికైన 8మందిని జీఎం సన్మానించారు. ఎస్‌ఓటూ జీఎం రవీందర్ అధికారులు రమేష్, చింతల శ్రీనివాస్, ఆర్వీ.రావు, ప్రసాద్, ఓదెలు, వెంకటయ్య, జానకీరాం, కార్మిక సంఘాల నాయకులు ఐలి శ్రీనివాస్, దశరథంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సెన్సెక్స్ మద్దతు 27,650...
మార్కెట్ పంచాంగం అమెరికాలో జాబ్స్ డేటాతో పాటు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ వినియోగం పెరిగినట్లు గణాంకాలు వెలువడి, ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఇన్వెస్టర్లు గతంలోలా భయపడటం లేదు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతున్న ప్రభావాన్ని కొద్దినెలలపాటు పరిశీలించిన తర్వాత ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వుంటుందన్న అంచనాలే ఇందుకు కారణం. గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత నిర్భయంగా భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్లన్నీ ర్యాలీ జరుపుతున్నాయి. ఇప్పటికే అమెరికా మార్కెట్ రికార్డు గరిష్టస్థాయిని చేరగా, యూరప్‌తో సహా ఇతర ప్రధాన మార్కెట్లన్నీ ఏడాది గరిష్టస్థాయిలో వున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యమైన అంతర్జాతీయ ప్రతికూల సంఘటనలేవీ ఎదురుకాకపోతే, భారత్ మార్కెట్ కూడా కొత్త రికార్డును ఈ ఏడాదే నెలకొల్పే ఛాన్స్ వుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... జూలై 15తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాగంలో అంచనాలకు అనుగుణంగా 27,618 పాయింట్ల స్థాయిని దాటిన తర్వాత 28,048 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 710 పాయింట్ల భారీలాభంతో 27,837 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ వారం మార్కెట్ పెరిగితే సెన్సెక్స్‌కు 28,100 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం కలగవచ్చు. ఆపైన ముగిస్తే 28,250 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. కొద్ది వారాల్లో 28,580 పాయింట్ల స్థాయిని కూడా అందుకోవొచ్చు. తొలి అవరోధస్థాయిని అధిగమించలేకపోతే గత వారం మార్కెట్ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన గ్యాప్‌లు ఈ వారం మద్దతుల్ని అందించవచ్చు. ఈ ప్రకారం 26,650 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ దిగువన మద్దతుస్థాయిలు 27,380, 27,035 పాయింట్లు మొత్తం మీద రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు 28,000-28,500 పాయింట్ల శ్రేణి మధ్య పలు అవరోధాలు ఎదురవుతుండగా, 27,000-27,650 పాయింట్ల శ్రేణి మధ్య వరుసగా మద్దతులు లభిస్తున్నాయి. నిఫ్టీ మద్దతు 8,475 ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 218 పాయింట్ల పెరుగుదలతో 8,541 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరుగుదల కొనసాగాలంటే తొలుత 8,550 పాయింట్లపైన స్థిరపడాల్సివుంటుంది. ఆపైన గత ఏడాది జులై టాప్ అయిన 8,655 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఆపైన స్థిరపడితే కొద్ది రోజుల్లో క్రమేపీ 8,845 పాయింట్ల వద్దకు చేరే ఛాన్స్ వుంటుంది. 8,655 పాయింట్లపైన అవరోధస్థాయిలు 8,700, 8,760 పాయింట్లు. ఈ వారం 8,550 స్థాయిపైన స్థిరపడలేకపోతే 8,475 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 8,400 స్థాయికి పడిపోవొచ్చు. ఈ దిగువన 8,320-8,350 పాయింట్ల శ్రేణికి తగ్గే అవకాశాలుంటాయి. -
ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు
♦ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగం ♦ పారిశ్రామిక, రీజినల్, ఐటీ రోడ్లను నిర్మిస్తాం ♦ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ♦ రెండో దశ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రారంభం ఘట్కేసర్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం ఘట్కేసర్ నుంచి మేడ్చల్ వైపు సుతారిగూడ వరకు ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డును ఆయన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఓఆర్ఆర్ చుట్టూ ఏర్పాటు చేసే టౌన్‌షిప్‌లలో విద్య, వైద్య అవసరాలు ఉండేలా చూస్తామన్నారు. ఈ రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఔటర్ వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. మరిన్ని ఐటీ, ఇతర పరిశ్రమలు రావడానికి అవకాశం ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి ఔటర్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రారంభానికి భారీ ఏర్పాట్లు ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రి వచ్చే మార్గంలో రంగురంగుల జెండాలు, తోరణాలను అలంకరించారు. వాహనాల పార్కింగ్ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. టోల్‌ప్లాజాను బెలూన్లతో అలంకరించారు. మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, నగర మేయర్ రామ్మోహన్ తదితరులు వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చి రిబ్బన్ కట్‌చేసి రోడ్డును ప్రారంభించారు. రెండు గంటల ఆలస్యం ఔటర్ ప్రారంభోత్సవానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 12 గంటలకు విచ్చేస్తారని అధికారులు ముందుగా తెలిపారు. అప్పటికే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అరుుతే, మంత్రి జలమండలి సమావేశంలో ఉండడంతో సమయానికి రాలేకపోయారు. రెండు గంటల ఆలస్యంగా వచ్చిన మంత్రి రోడ్డును ప్రారంభించారు. వేదిక వద్ద అధికారులు ఓఆర్ఆర్కు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి శ్రీనివాస్, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి , నాయకులు బైరురాములు, నక్కనరసింహ, జడిగే రమేష్, సారుురెడ్డి, కొండల్‌రెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10సంవత్సరాలు 99 శాతం ఔటర్ రింగ్ రోడ్డును 2006 జపాన్ సంస్థ ఆర్థిక సహకారంతో ప్రారంభించారు. భూసేకరణ, అలైన్మెంట్లలో చోటుచేసుకున్న పలుమార్పులు, అనుమతుల రాకలో జరిగిన ఆలస్యంతో 10 సంవత్సరాలు గడిచింది. అరుు నా 99శాతం మాత్రం పూర్తరుుంది. ఇంకా 1.1 కిలోమీటర్ మేర పనులు జరగాల్సి ఉంది. కోర్టు వివాదాల కారణంగా అది ఆలస్యం అవుతుంది. ఇంకా 9నెలల కాలంలో మిగిలిన మార్గం అందుబాటులోకి రావచ్చని మంత్రి తెలిపారు. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రులు ఔటర్‌ను వేర్వేరు చోట్ల ప్రారంభిస్తే నాలుగోసారి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గత నెలలోనే నిర్మాణం పూర్తరుునా.. రోడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందజేసిన జపాన్ సంస్థ ప్రతినిధులు కొన్ని కారణాల వల్ల రాకపోవడంతో అప్పట్లో వారుుదా పడింది. -
ఫలితాలు, గణాంకాలు.. కీలకం
న్యూఢిల్లీ: పారిశ్రామిక, ద్రవ్యోల్బణ గణాంకాలు, నైరుతి రుతుపవనాల విస్తరణ, కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు.. ఈ వారం స్టాక్‌మార్కెట్‌కు కీలకాంశాలని నిపుణులంటున్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు కదలికలు.. స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. పెద్ద కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి ఈ వారం నుంచి ప్రారంభం కానున్నది. నేడు(సోమవారం) ఇండస్‌ఇంద్ బ్యాంక్, ఈ నెల 14న టీసీఎస్, ఈ నెల 15న ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. ఈ ఫలితాల ప్రభావం ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ఉంటుంది. ఈ ఫలితాలతో పాటు ఈ నెల 12న మే నెల పారిశ్రామికోత్పత్తి, జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఈ నెల 14న జూన్ టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి. ఫలితాలపైననే దృష్టి.. ఈ వారం నుంచి పెద్ద కంపెనీల ఫలితాల సీజన్ ప్రారంభమవుతుందని, ఇన్వెస్టర్ల దృష్టి అంతా ఈ ఫలితాలపై, ఈ ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ యాజమాన్యం చేసే వ్యాఖ్యలపై ఉంటుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. నేటి(సోమవారం) ట్రేడింగ్ ప్రారంభంలో గత శుక్రవారం వెల్లడైన అమెరికా ఉద్యోగ గణాంకాల ప్రభావం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. మరో 4-6 వారాల పాటు కంపెనీల క్యూ1 ఫలితాలే ఇన్వెస్టర్లకు ముఖ్యమైన విషయమని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్ పంకజ్ శర్మ చెప్పారు. ప్రభుత్వ సంస్కరణలు, విధానాల పట్ల ఇన్వెస్టర్లు నమ్మకంగా ఉన్నారని, మార్కెట్ ముందుకేనని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ డి. కె. అగర్వాల్ చెప్పారు. ఒకింత ఒడిదుడుకులు ఈ వారంలో యూరోప్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ల సమావేశాలు జరగనున్నాయని, ఈ సమావేశాల నేపథ్యంలో బ్రెగ్జిట్(యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) పరిణామాల ప్రభావంపై ఆందోళన నెలకొనవచ్చని, ఇది స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు కారణం కావచ్చని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ అంచనా వేస్తున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ సూచీలు ఒకింత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని కొందరు నిపుణుల భావన. -
ఆశయం ఘనం.. అభివృద్ధి శూన్యం
అలంకారప్రాయంగా అపరెల్‌పార్క్ నిరుపయోగంగా మారిన నిర్మాణాలు పట్టించుకోని పాలకులు మేడ్చల్:నగర శివార్లలో ఉన్న మేడ్చల్ ఒకప్పుడు వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. క్రమంగా వ్యవసాయానికి దూరమై రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగానికి చిరునామాగా మారింది. 1978లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి మేడ్చల్‌లో పారిశ్రామిక వాడకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో అపరెల్ పార్క్ ఏర్పాటు చేసింది. పేద ప్రజలకు ఉపాధి కల్పించాలన్న సదాశయంతో 1995 జూలై 19నపార్క్కు శంకుస్థాపన చేశారు. 1999 జూన్ 30న నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారు. ప్రధానంగా కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించారు. వస్త్ర పరిశ్రమ ఎక్కువగా కర్ణాటకలో ఉండడంతో అక్కడి వ్యాపారులు అపరెల్ పార్క్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పార్క్‌ను రూపొందించారు. గ్రామానికి చెందిన పేద రైతుల నుంచి 157 ఎకరాల భూమిని సేకరించి మొత్తం 226.36 ఎకరాల్లో పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 129.87 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా 121 ప్లాట్లను రూపొం దించారు. 60 ఎకరాలను మరిన్ని పరిశ్రమల కోసం ఖాళీగా వదిలారు. 38 ఎకరాల్లో పార్క్‌లో రోడ్లు, మురికి కాలువలు, ఇతర వసతులతో పాటు విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేశారు. స్థానికంగా 30 వేలమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రారంభోత్సవంలో పాలకులు ఉపన్యాసాలు దంచారు. 30 వేలు కాదుకదా 3వేల మందికి కూడా ఉపాధి కల్పించలేకపోయారు. పార్క్ అభివృద్ధికి వైఎస్సార్ కృషి.. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక పార్క్ లక్ష్యాన్ని నెరవేర్చే ఉద్దేశంతో 2008 ఏప్రిల్ 7న ఇక్కడ రెండు పరిశ్రమలు ప్రారంభించారు. బహుళరంగ కంపెనీలు రావాలని మరో 23 ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం అపరెల్ పార్క్ గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. అడవిని తలపిస్తూ.. పరిశ్రమలు, కార్మికులతో కళకళలాడాల్సిన అపరెల్ పార్క్ ప్రస్తుతం కళావిహీనమైంది. దాదాపు 100 ఎకరాలు ఖాళీగా ఉండటంతో చెట్లు, ముళ్లపొదలు పెరిగి అటవీ ప్రాంతాన్ని తలపిస్తోంది. హుడా ఆధ్వర్యంలో పది ఎకరాల్లో మొక్కలను నాటారు. పార్క్‌కు రావడానికి విశాలమైన రోడ్లు, ఉద్యానవనాలు, కార్యాలయ భవనం నిర్మించారు. అవన్నీ ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. పట్టించుకోని ప్రభుత్వం.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అపరెల్ పార్క్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గత ఏప్రిల్ 29న అపరెల్ పార్క్‌లో పర్యటించారు. పార్క్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏడు నెలలు గడిచినా ఒక్క అడుగుకూడా ముందుకు పడిన దాఖలాలు లేవు. -
పరిశ్రమల నిరాశ...
ఆర్బీఐ నిర్ణయంపై పారిశ్రామిక వర్గాలు తీవ్ర నిరాశను వ్యక్తం చేశాయి. బలహీన డిమాండ్ మెరుగుదల, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా రుణ రేటు తగ్గిస్తే బాగుండేదని అన్నాయి. ఒక అవకాశాన్ని వదులుకున్నట్లయ్యిందని కూడా వ్యాఖ్యానించాయి. రుణ డిమాండ్ బలహీనంగా ఉంది. కార్పొరేట్లు, బ్యాంకులు రుణ బకాయిల సమస్యలతో సతమతమవుతున్నాయి. మౌలిక రంగంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రుణ రేటు తగ్గించి ఉంటే... పెట్టుబడుల ప్రక్రియ ఊపందుకునేది. వర్షపాతం, ఫెడ్ నిర్ణయం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులన్నింటిపై ఒక సమగ్ర అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నందున, తదుపరి సమీక్షలో ఆర్బీఐ పాలసీ రేటు తగ్గిస్తుందని భావిస్తున్నా. -చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ పరిశ్రమకు ఇది నిరాశకలిగించే అంశమే. పారిశ్రామిక వృద్ధి ఇంకా ఒడిదుడుకులుగానే ఉంది. డిమాండ్ పరిస్థితులు ప్రోత్సాహకరంగా లేవు. ఆయా పరిస్థితుల దృష్ట్యా పాలసీ ప్రోత్సాహకం ఉంటే మంచి ఫలితం ఉండేది. - జోత్స్నా సూరీ, ఫిక్కీ ప్రెసిడెంట్ -
27,000 దాటితేనే సెన్సెక్స్‌కు స్థిరత్వం
దేశంలో పారిశ్రామికోత్పత్తి అంచనాలకంటే మించిందని, ద్రవ్యోల్బణం భయపడినంతగా పెరగలేదంటూ రెండు సానుకూల వార్తలు గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. అలాగే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన తర్వాత, ఇప్పటివరకూ సగటుకంటే 5 శాతం ఎక్కువగా వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. జూన్2 నాటి పాలసీ సమీక్షలో రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించినా, వర్షాభావం, ద్రవ్యోల్బణం పట్ల ఆందోళనతోనే స్టాక్ మార్కెట్ 5 శాతంపైగా పడిపోయింది. ఈ భయాలు ప్రస్తుతానికి తొలగిపోయినందున, మార్కెట్ ఓవర్‌సోల్డ్ కండీషన్లో వున్నందున, ఈ వారం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీకి ఛాన్స్ వుంది. కానీ గ్రీసు-యూరోపియన్ యూనియన్ దేశాలు-ఐఎంఎఫ్‌ల మధ్య ఒక అంగీకారం కుదరక గత శుక్రవారం పశ్చిమ దేశాల మార్కెట్లు పడిపోయాయి. వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి కీలకమైన ఫెడ్ ప్రకటన ఈ బుధవారం వెలువడుతుందన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. ఈ కారణాలతో మార్కెట్ మరింత క్షీణించే ప్రమాదం కూడా వుంది. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూన్ 12తో ముగిసిన వారంలో 27,000-26,307 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 343 పాయింట్ల నష్టంతో 26,425వద్ద ముగిసింది. ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 26,250 వద్ద తక్షణ మద్దతు లభ్యమవుతున్నది. ఈ స్థాయి దిగువన ముగిస్తే 26,090 వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున కీలకమైన మద్దతు 25,900 స్థాయి. పెద్ద ప్రతికూల వార్త వెలువడితే తప్ప ఈ స్థాయిని సెన్సెక్స్ కోల్పోయే అవకాశాలు తక్కువ. ఈ స్థాయి దిగువన 25,200 వరకూ నిలువునా పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం గ్యాప్‌అప్‌తో మొదలైతే 26,470 పాయింట్ల స్థాయికి సూచీ చేరవచ్చు. ఆపైన ముగిస్తే 26,770 స్థాయిని అందుకునే వీలుంటుంది. రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు స్థిరత్వం రావాలంటే 27,000 పాయింట్లపైన కొద్దిరోజులపాటు ట్రేడ్కావాల్సివుంటుంది. నిఫ్టీ తక్షణ మద్దతు 7,920-నిరోధం 8,030 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,160-7,940 మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు 132 పాయింట్ల నష్టంతో 7,983 వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే 8,030 స్థాయి నిఫ్టీకి స్వల్ప నిరోధాన్ని కల్పించవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. అటు తర్వాత 8,100 స్థాయిని చేరొచ్చు. అటుపైన 8,150-8,190 కీలకమైన అవరోధ శ్రేణి. తదుపరి వారాల్లో 8,460 స్థాయిని అందుకోవాలంటే ఈ అవరోధ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించాల్సివుంటుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 7,920 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 200 పాయిం ట్ల వరకూ పలు స్థాయిల వద్ద సాంకేతిక మద్దతులు నిఫ్టీకి వున్నందున, రానున్న రోజుల్లో మార్కెట్లను అతలాకుతలం చేసే ప్రతికూల వార్త ఏదైనా వెలువడితే తప్ప, 7,720 స్థాయిలోపునకు నిఫ్టీ తగ్గకపోవొచ్చు. 7,920 స్థాయిని ముగింపులో కోల్పోతే 7,850 వరకూ నిఫ్టీ క్షీణించవచ్చు. -
చైనా పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం
-
ఎక్కడ చూసినా సర్కార్ భూములే!
ఈ భూమి విలువ రూ.350 కోట్లు ఇదిగో.. ఈ ఫొటోలో కనిపిస్తున్న భూమి విలువ రూ.350 కోట్లు. అమీన్‌పుర్‌లోని 993 సర్వే నంబర్లో ఉంది. మొత్తం 110 ఎకరాలు. కబ్జా కబంధ హస్తాల నుంచి బయటపడి, ఇటీవలే ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కింది. కబ్జాదారులను బలవంతంగా వెళ్లగొట్టారు. చైనా వాల్ మాదిరిగా చుట్టూ పటిష్టమైన గోడ కట్టారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకు సీమలో ఎక్కడ చూసినా.. ప్రభుత్వ భూములే కనిపిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం స్పందించి, ప్రభుత్వ భూముల గుర్తింపు వేట ఆరంభించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1 లక్షా 59 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. ఈ భూముల విలువ సుమారు రూ.75 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ప్రత్యేక చొరవతో అనతి కాలంలోనే ఇంత భారీస్థాయిలో ప్రభుత్వ భూమిని గుర్తించడమేగాక స్వాధీనం కూడా చేసుకున్నారు. అనంతరం వీటి వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరిచి ప్రభుత్వానికి నివేదిక అందించారు. కంది గ్రామ సర్వే నంబర్ 400 సీరీస్‌లో 12 నంబర్లతో 200 ఎకరాలు.. నర్సాపూర్ పట్టణం 76 సర్వే నెంబర్లో 48 ఎకరాలు.. కాజిపల్లి పారిశ్రామికవాడ సర్వే నంబర్ 181లో 25 ఎకరాలు.. ముత్తంగి గ్రామంలో 25 ఎకరాలు.. రామచంద్రాపురంలో 60 ఎకరాలు ఇలా ఒక్కొక్క ఎకరాను లెక్కగట్టి చూస్తే మెదక్ జిల్లా వ్యాప్తంగా 1 లక్షా 59 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ నిర్ధారించారు. దీని విలువ రూ.70 నుంచి రూ.75 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలోని పటాన్చెరు, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోనే 60 శాతం ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్న 1 లక్షా 59 వేల ఎకరాల భూమిలో 1,620 ఎకరాలు అత్యంత విలువైనదిగా, 3,500 ఎకరాలు జనావాసాలకు సమీపంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికి వచ్చే విలువైన భూమిగానూ 16,551 ఎకరాలు పారిశ్రామిక వాడలకు, 35 వేల ఎకరాలు హెచ్ఎండీఏ అవసరాలకు, మిగిలిన భూమి వ్యవసాయానికి ఉపయోగపడేదిగానూ గుర్తించారు. ఈ భూములకు రెవెన్యూ రికార్డులు సరిగా లేకపోవడం, ఐఏఎస్ అధికారులకు రెవెన్యూ రికార్డులు, వాటి అమలు తీరుపై సమగ్రమైన పట్టు లేకపోవడం, పైగా రెవెన్యూ శాఖలోనే కింది స్థాయి అధికారులు కబ్జాదారులకు అండగా నిలబడటంతో ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులు పట్టుబిగిస్తూ వచ్చారు. ఓ యజ్ఞమే జరిగింది... ప్రభుత్వ భూముల గుర్తింపు వెనుక జాయింట్ కలెక్టర్ శరత్ ఓ యజ్ఞమే చేశారు. ఏడు రికార్డుల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ముందుగా ప్రతి రైతుకు రెవెన్యూ సహకారాన్ని అందించారు. రికార్డులన్నీ భూ యజమానులకు అందేలా చేశారు. తరువాత ఒక్కో నియోజక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎంచుకున్న నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, కబ్జాలో ఉన్నవారి వివరాలు, కబ్జాకు అనుకూలించిన పరిణామాలు తదితర వివరాలను ముందుగా సేకరించారు. రెండో దశలో ‘మీరు ఆక్రమణలో ఉన్నది ప్రభుత్వ భూమి కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చూపించాలి’ అని ఆయా వ్యక్తులకు నోటీసులు పంపిచారు. ఈ తంతుతో భూ బకాసురుల బండారం బయటకు వచ్చింది. ఆధారాలు చూపిన వారిని వదిలేసి మిగిలిన వారిమీద పడ్డారు. మూడో దశలో పోలీసుల సహకారం తీసుకొని నిర్ధారించిన ప్రభుత్వ భూముల చుట్టూ కంచె వేయించారు. -
దమ్ముంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలి
ముఖ్యమంత్రికి పొన్నం సవాల్ సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. సీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణను తానే తెచ్చినట్టుగా కేసీఆర్ చెప్పుకుంటున్నారన్నారు. అలా అయితే కేసీఆర్‌కు ఉన్న అవే శక్తి సామర్థ్యాలను కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలు ఇప్పించడానికి వినియోగించాలని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన తుగ్లక్‌ను మించి పోయిందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను, రెండు రాష్ట్రాలకు సరిపోయేస్థాయిలో ఉన్న సచివాలయాన్ని కూడా అమ్మడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రయోజనాలకోసం ప్రభుత్వ ఆస్తులను సమకూర్చాలి తప్ప ఉన్నవాటిని అమ్మాలనే నిర్ణయం సరికాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రుణమాఫీ చేసి తీరుతాం
- వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తాం - జిల్లాలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి - 500 జనాభా ఉన్న తండాలను జీపీలుగా మారుస్తాం - కూరగాయల జోన్ ఏర్పాటుకు కృషి - 111 జీఓ ఎత్తివేతకు ప్రయత్నిస్తాం - రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి - చేవెళ్లలో ఘనంగా సన్మానం చేవెళ్ల: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను మాఫీచేసి తీరుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో 84 గ్రామాల ప్రజలకు గుదిబండగా మారిన జీఓ 111ను ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నదని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని వెల్లడించారు. కేసీఆర్ చెప్పినట్లుగా వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తామని, జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన త్వరలో జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా మున్ముందు ఐటీ, ప్రారిశ్రామిక రంగాల్లో గణనీయ పురోగతి సాధిస్తుందన్నారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని, రైతుకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, విత్తనాలు అందేలా చూస్తామని చెప్పారు. 500 పైబడి జనాభాఉన్న గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 30నుంచి 50 డిపోల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, చేవెళ్లలోనూ బస్‌డిపో ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి గ్రామానికీ బస్సు నడిపిస్తామని, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు- ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, జిల్లా నాయకులు సత్యనారాయణరెడ్డి, స్వప్న, ఎస్.వసంతం, కే.మహేందర్‌రెడ్డి, సామ మాణిక్‌రెడ్డి, పురుషోత్తం, ఆర్టీసీ టీఎంయూ జిల్లా కార్యదర్శి ఎం.భుజంగరెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వై.శ్రీరాంరెడ్డి, ఎం.మాణిక్‌రెడ్డి, సామ రవీందర్‌రెడ్డి, కొలన్ ప్రభాకర్‌రెడ్డి, కే.సుధాకర్‌రెడ్డి, శంభారెడ్డి, జడల రాజేందర్‌గౌడ్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
కొరతను అధిగమిస్తేనే..
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోను, ఇటు రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇక నిర్మాణ రంగానికి ఊపిరి పోయడమే తరువాయి. భారత నిర్మాణ రంగానికి రానున్న ఐదేళ్లలో అధిక శాతం పెట్టుబడుల్ని ఆకర్షించే సత్తా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే మానవ వనరుల కొరతే ఈ రంగం అభివృద్ధికి విఘాతాన్ని కల్గిస్తోందంటున్నారు. నైపుణ్యం గల సిబ్బంది కొరతతో ప్రధాన పారిశ్రామికవాడల్లోని భారీ నిర్మాణాలు 12 నుంచి 18 నెలల ఆలస్యమవుతాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటివారి కొరత సుమారు 30 శాతం దాకా ఉంది. ప్రస్తుతం ఐదు కోట్ల మంది పనివారు అందుబాటులో ఉండగా.. కేవలం రెండు కోట్ల మందికే నైపుణ్యముంది. సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ప్లానర్ల విషయానికొస్తే గిరాకీ, సరఫరాల మధ్య వ్యత్యాసం 82-86 శాతంగా ఉంది. రానున్న ఐదేళ్లలో 40 లక్షల మంది సివిల్ ఇంజనీర్ల అవసరముంటుంది. ఇందుకు గాను ప్రస్తుతం 6.42 లక్షల మంది అందుబాటులో ఉన్నారు. 3.96 లక్షల మంది ఆర్కిటెక్టుల స్థానంలో 65 వేల మంది, 1.19 లక్షల ప్లానర్లకు బదులు 18 వేలే అందుబాటులో ఉన్నారు. మొత్తానికి 2012 నుంచి 2020 మధ్యలో 45 లక్షల మంది నిపుణులు కావాల్సి ఉంటుంది. కొరతను తీర్చే మార్గమిదే.. విదేశాల్లో మాదిరిగా మనం కూడా నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించాలి. ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారికి ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి ఉక్కు వినియోగం దాదాపు 150-200 కిలోలుంటే మన దేశంలో చూస్తే సుమారు 40 కిలోలుగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఉక్కు నిర్మాణాల్ని కడితే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ బెండర్లు తదితరుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, కళాశాలల్లో సీట్లను పెంచాలి. భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. -
విద్యుత్ కోతలతో కుదేలు
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్:జిల్లాలో విద్యుత్ కోతలు అధికమయ్యాయి. అధికార అనధికారిక కోతలతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. పల్లెల్లో పగలంతా కరెంటు ఉండటం లేదు. పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నా అధికారులు ఇష్టారాజ్యంగా కోతలు అమలు చేయడం సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో నిత్యం తెల్లవారు జామున నెల్లూరు నగరంతో పాటు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మండల, పట్టణాల్లో కరెంటు మీద ఆధారపడి చిరు వ్యాపారం చేసుకునే వారు కుదేలవుతున్నారు. ఎండలు పెరగకముందే ఈ రకంగా ఎడా పెడా విద్యుత్ కోతలను విధిస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణాల్లో అధికారికంగా గంట అన్నది అనాధికారికంగా మరో గంట కోత విధిస్తున్నారు. గ్రామాల్లో అయితే పగలంతా కరెంటు ఉండటం లేదు. పల్లెల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఈ కోతలతో తాగునీటి పథకాలకు ఆటంకం ఏర్పడుతోంది. వేసవి ప్రతాపం ప్రారంభం కాకముందే ఈ విధంగా కోతలు ఉంటే మండు వేసవి ఏప్రిల్, మే నెలల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ఎండలు... వారం రోజుల నుంచి పగటి ఉష్టోగ్రతల్లో వ్యతాసం ఉంటోంది. ఎండ వేడిమి పెరుగుతోంది. రోజుకు అత్యధికంగా 39 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుండడంతో ప్రజలు వేసవి తాపానికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏసీల వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోంది. పెరిగిన ఇండస్ట్రియల్ లోడు.. జిల్లాకు రోజు 9.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కోటాగా ఇస్తున్నారు. ఇందులో నగర వినియోగం 20 శాతంకు పైగా ఉంటోంది. జిల్లాలో గృహవిద్యుత్ కనెక్షన్లు 8.84 లక్షలు, కమర్షియల్ కనెక్షన్లు 71వేలు, వ్యవసాయ కనెక్షన్లు 1.35 లక్షలు కాగా, ఎల్టీ(పరిశ్రమల) సర్వీసులు 41 వేల వరకు ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో ఇండస్ట్రియల్ లోడు గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా జిల్లాకు కోటాను కేటాయించడం లేదు. సెంటర్ పవర్‌గ్రిడ్ నుంచి ఏపీఎస్పీడీసీఎల్కు దక్కే వాటా 22 శాతం వరకు ఉంటుంది. ఈ శాతం 25కు పెంచాలని అధికారులు కోరినా ఫలితం ఉండటం లేదు. వ్యవసాయానికి 7.00 గంటలు విద్యుత్ ఇస్తామని అధికారులు చెబుతున్నా కోతలు పెడుతుండటంతో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. రాత్రి 5 గంటలు, పగలు రెండు గంటలు విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. విద్యుత్ సరఫరా వేళలు ఇలా ఉంటున్నాయి. ఏ గ్రూపు పరిధిలో రాత్రి 23.15 గంటల నుంచి 4.15 వరకు, మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4.15 వరకు, బీ గ్రూపు పరిధిలో ఉదయం 4.15 నుంచి 9.15 వరకు, రాత్రి 23.15 నుంచి 1.15 వరకు, సీ గ్రూపు పరిధిలో ఉదయం 9.15 నుంచి 14.15 వరకు, రాత్రి 1.15 నుంచి 3.15 వరకు, డీ గ్రూపు పరిధిలో మధ్యాహ్నం 2.10 నుంచి సాయంత్రం 7.10 వరకు, రాత్రి 3.15 నుంచి 5.15 వరకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే నిర్దేశించిన కోతల సమయానికి కరెంటు కోతలకు సంబంధం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో సాగు, తాగునీటి కొరత అధికమవుతోంది. విద్యార్థులకు పరీక్షల సమయంలో తీవ్ర ఆందోళన గురికావాల్సి వస్తోంది. పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సైతం కరెంటు కష్టాలు తప్పడం లేదు. -
రాష్ట్రంలో వృద్ధి రేటు ఢమాల్!
తిరోగమనంలో వ్యవసాయ, పారిశ్రామిక, మైనింగ్ రంగాలు ఉద్యమాలు.. రాజకీయ అనిశ్చితి ప్రధాన కారణాలు సాక్షి, హైదరాబాద్: ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని, అభివృద్ధిలో దూసుకుపోతోందని, ఇందుకు అవార్డులు వస్తున్నాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండగా, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి భారీగా పడిపోయినట్టు అర్థగణాంక శాఖ రూపొందించిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు ్లస్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్ధ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రాష్ట్ర స్థూల ఉత్పత్తి లెక్కలను అర్థగణాంక విభాగం రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరం ఆరునెలల వృద్ధి రేటు కన్నా ఈ ఆర్థిక సంవత్సరం ఆరునెలల వృద్ధి రేటు బాగా తగ్గిపోయింది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి రేటు గత ఏడాదితో పోల్చి చూస్తే తక్కువగా నమోదైంది. మైనింగ్ రంగం అయితే పూర్తిగా తిరోగమనబాట పట్టింది. మైనింగ్ క్వారీయింగ్ రంగం వృద్ధి రేటు గత ఏడాది 8.93 శాతం ఉండగా ఈ ఏడాది అర్ధసంవత్సరంలో -15.31 శాతంతో తిరోగమనంలో ఉంది. కరువు ప్రభావం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయగా పారిశ్రామిక ప్రగతిపై రాష్ట్ర విభజన ప్రభావం పడిందని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా లేదని ఎప్పుడూ అనిశ్చితే కొనసాగుతోందని, ఇవన్నీ రాష్ర్ట అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది అర్ధ సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 6.50 శాతం ఉండగా, ఈ ఏడాది అర్ధ సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 5.56 శాతానికే పరిమితమైంది. నిర్మాణ కార్యకలాపాలు తగ్గిపోవడంతో ఆ రంగం వృద్ధి రేటు కూడా గతేడాదితో పోల్చితే బాగా తగ్గిపోయింది. గతేడాది అర్ధ సంవత్సరంలో వ్యవసాయరంగం వృద్ధి రేటు 8.77 శాతం ఉండగా ఈ ఏడాది అర్ధ సంవత్సరం వృద్ధి రేటు 6.81 శాతానికి పడిపోయింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 2.57 శాతం ఉండగా, ఈ ఏడాది ఆరునెలల వృద్ధి రేటు 1.95 శాతానికి పడిపోయింది. సర్వీసు రంగం వృద్ధి రేటు కూడా గతేడాది కన్నా ఈ సంవత్సరంలో తగ్గిపోయింది. గతేడాది సర్వీసు రంగం వృద్ధి రేటు 7,79 శాతం ఉండగా ఈ ఏడాది వృద్ధి రేటు 6.85 శాతానికి పడిపోయింది. వాణిజ్యం, హోటల్స్ అండ్ రెస్టారెంట్, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్స్ రంగాల వృద్ధి రేటు గతేడాది 6.72 శాతం ఉండగా ఈ సంవత్సరం వృద్ధి రేటు 5.67 శాతానికి తగ్గిపోయింది. ఆర్థిక, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్, సర్వీసు రంగాల వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం 10.22 శాతం ఉండగా ఈ ఏడాది వృద్ధి రేటు 9.03 శాతానికి తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలో ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాలు ఈ ఏడాది కొద్దిగా వృద్ధిలోకి వచ్చాయి. -
సర్కారు భూములు హాంఫట్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వివిధ సంస్థలకు బదలాయిస్తున్న ప్రభుత్వ భూములు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. నామమాత్రపు ధరకే భూములను కొట్టేయడంలో కనబరుస్తున్న శ్రద్ధ.. సంస్థల స్థాపనలో చూపకపోవడంతో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. నిర్దేశిత వ్యవధిలో కార్యకలాపాలు ప్రారంభించని సంస్థల నుంచి స్థలాలను స్వాధీనం చేసుకోవాల్సి వున్నా.. ఆ దిశగా యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో రూ.కోట్ల విలువైన స్థలాలకు రెక్కలొస్తున్నాయి. జిల్లాలో 35,514 ఎకరాలను ఏపీఐఐసీ, హెచ్ఎండీఏ, దిల్, రాజీవ్ స్వగృహ, టూరిజం తదితర సంస్థలకు ప్రభుత్వం బదలాయించింది. ప్రజా, పారిశ్రామిక అవసరాల పేర యూనిట్లు పెట్టేందుకు ఆసక్తి చూపిన సంస్థలకు ఈ భూములను కట్టబెట్టారు. కారుచౌకగా అప్పగించిన ఈ స్థలాల్లో చాలామంది పరిశ్రమలు, ఇత ర యూనిట్లను ఔత్సాహికులు నెలకొల్పినప్పటికీ, అత్యధికులు మాత్రం స్థలాలను కాజేసి మిన్నకుండి పోయా రు. రాయితీలు దక్కించుకోవడం మినహా.. పారిశ్రామిక విస్తరణ దిశగా ఆలోచనలు చేయడంలేదు. ఈ క్రమంలోనే జిల్లాలో కేవలం 27,346 ఎకరాలు మాత్రమే ఇప్పటివరకు వినియోగంలోకి వచ్చాయంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. నిర్దేశిత అవసరాలకు వాడగా 7,370 ఎకరాల మిగులు భూములను ఆ కంపెనీలు అట్టిపెట్టుకున్నాయి. ఇటీవల రెవెన్యూ యంత్రాం గం జిల్లావ్యాప్తంగా వివిధ సంస్థలకు జరిపిన భూ కేటాయింపులు. వాటి వినియోగంపై క్షేత్రస్థాయిలో సర్వే జరిపింది. ఈ పరిశీలనలో వేలాది ఎకరాలు ఇప్పటికీ వినియోగంలోకి రాకపోగా.. సుమారు 794 ఎకరాలు కబ్జాదారుల పాలైనట్లు తేలింది. స్థలాలను కైవసం చేసుకున్న సంస్థల పర్యవేక్షణ లేకపోవడం, నిర్దేశించిన కాలపరిమితిలో యూనిట్లను స్థాపించకపోవడంతో అక్రమార్కులు వీటిపై కన్నేసినట్లు స్పష్టమైంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.1000 కోట్లపైనే పలుకుతుందని అంచనా. పారిశ్రామిక, గృహావసరాలను సాకుగా చూపి అడ్డగోలుగా భూసేకరణ జరిపి బడా సంస్థలు కట్టబెడితే.. ఈ భూములు పరాధీనం కావడం అధికారులను నివ్వెరపరిచింది. ముఖ్యంగా ఏపీఐఐసీ ఎడాపెడా భూసేకరణ చేపట్టింది. పారిశ్రామికవాడల పేర యథేచ్ఛగా భూసేకరణ పర్వాన్ని కొనసాగించింది. పేద రైతాంగానికి ముఖ్యం గా అసైన్డ్భూములతో జీవనోపాధి పొందుతున్న అట్టడుగువర్గాల భూములను సేకరించింది. అక్కడక్కడా పారిశ్రామిక వాడలు ఏర్పాటుచేసినప్పటికీ, వ్యాపారవేత్తలు ముందుకు రాకపోవడంతో అవి ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల పారిశ్రామికవాడలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. లేఅవుట్లు చేయకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో యూనిట్లు పెట్టేందుకు సంస్థలు ఆసక్తి చూపడంలేదు. ఈ తంతు ఓవైపు ఇలాసాగుతుండగానే మరోవైపు ఆయా సంస్థలకు బదలాయించిన భూములు అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోతుండడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 769.02 ఎకరాలు, మల్కాజ్గిరి డివిజన్లో 1.06, రాజేంద్రనగర్ డివిజన్లో 20.28, చేవెళ్ల డివిజన్లో 3.08 ఎకరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో బయటపడింది. అంతేకాకుండా ఈ స్థలాల్లో తిష్టవేసిన కబ్జాదారులు యాజమాన్య హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 53కేసులు వివిధ కోర్టుల్లో నడుస్తున్నాయి. వీటిలో చాలావరకు హైకోర్టు పరిధిలోనే కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. విలువైన భూములపై కన్నేసిన ఆక్రమణదారులు కొంతమంది రెవెన్యూ అధికారులతో మిలాఖత్ అయి ఈ తతంగం నెరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ అవసరాల నిమిత్తం భూములు తీసుకున్న సంస్థల నిర్లక్ష్యంతోనే రూ.కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతున్నట్లు తెలుస్తోంది.