సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపదపై అధ్యయనానికి వచ్చిన విదేశీ యువ పారిశ్రామికవేత్తలు.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను మంగళవారం కలిశారు. యూత్ అంబాసిడర్స్ ప్రోగ్రాం(వైఏపీ)లో భాగంగా ఆ్రస్టియా, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్, బెల్జియం దేశాలకు చెందిన 13 మంది యువ పారిశ్రామికవేత్తలు 15 రోజుల పర్యటనకు వచ్చారు.
ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ని సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రాముఖ్యత, చారిత్రక, వారసత్వ సంపద, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఇండ్రస్టియల్ పాలసీ, ఐటీ, ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి విషయాలను వారికి మంత్రి వివరించారు. కార్యక్రమంలో యూత్ అంబాసిడర్స్ కో–ఆర్డినేటర్ నవీన్ మల్వేతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment