industrialists
-
రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు?
భారత పార్లమెంట్ లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. దీనినే పెద్దలసభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. రాష్ట్రాల నుంచి , కేంద్రపాలిత ప్రాంతాల నుంచి , వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి ఎంపిక చెయ్యడం ద్వారానూ, రాజ్యసభ సభ్యులు నియామకం అవుతారు.వీరి పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది.ప్రతి రెండేళ్లకొకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించి సభ్యులనుఎన్నుకుంటారు. ఇదీ, రాజ్యసభ సభ్యులను ఎంపికచేసుకొనే విధానం. లోక్‌సభ సర్వశక్తివంతమైనది.రాజ్యసభతో పోల్చుకుంటే,ఎక్కువ హక్కులు లోక్ సభ కలిగి ఉంటుంది.ప్రజల నుంచి నేరుగా ఎన్నిక ద్వారానే లోక్ సభ సభ్యుల ఎంపిక జరుగుతుంది. ప్రజాప్రతినిధులుగా వీరు,వివిధ పార్టీల నుంచి ఎంపికవుతారు. ఇలా ఈ రెండు సభల నిర్మాణం వెనుకప్రజాహితమే ప్రధాన ఉద్దేశ్యంగా రాజ్యాంగ నిర్మాతలు రూపకల్పన చేశారు.రాజ్యసభను సెకండ్ ఛాంబర్ అనికూడా అంటారు.అంటే,సెకండ్ చెక్ అన్నమాట. రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. వివిధ శాసనాలను తీర్మానం చేసే క్రమంలో రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా దేశభక్తితో నిర్ణయాలు జరగాలనే గొప్ప ఉద్దేశ్యంతో,సమాంతర వ్యవస్థగా రాజ్యసభను ఏర్పాటుచేశారు.విజ్ఞాన ఖనులు, మేధావులు,సాంస్కృతిక ప్రేమికులు, గొప్ప ప్రజానాయకులు , పరమ దేశభక్తులు,సత్ శీలురు ఈ పెద్దల సభలో సభ్యులుగా ఎంపికవుతారు. లోక్ సభసభ్యులు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా బిల్లులు ఆమోదించినప్పటికీ,వీటికి అతీతంగా,వీరు ప్రజాహితం కోరుకుంటూ,అవసరమైతే వీటిని అడ్డుకుంటారు. కొన్ని బిల్లుల విషయంలో,లోక్ సభ సభ్యులు ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నాయని భావించినా, సుదూర భవిష్యత్తు అలోచించి, రాజ్యసభ సభ్యులు వాటిని ఆమోదించకుండా తిప్పికొట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. పెద్దలసభ,అని పేరు పెట్టుకున్నందుకు,నిజంగా పెద్దమనుషులతో ఈ సభలు శోభాయమానంగా ఉండేవి. దురదృష్టవశాత్తు,విలువలు తగ్గుముఖం పడుతూ,అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయ వ్యవస్థల మధ్య పెద్దలసభలో పెద్దమనుషులు తగ్గుతూ వస్తున్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా,స్వప్రయోజనాల లక్ష్యంగా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణుల మధ్య పెద్దలసభకు కొందరి నియామకాలు జరుగుతూ ఉన్నాయనేది, జారిటీ మేధావులు అభిప్రాయం. ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే,రాజ్యసభలోనూ అధికార పార్టీకి మెజారిటీ ఉండాలి. ఈ విషయంలో,చాలావరకూ, ప్రతిపక్ష పార్టీలకే మెజారిటీ ఎక్కువగా ఉండే పరిస్థితులను అధికారంలో ఉన్న పార్టీలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, రాజ్యసభలో మెజారిటీ కోసం,ప్రతిపక్ష సభ్యులకు ఎరవేసి, లాక్కొనే ప్రయత్నాలు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తూ ఉంటాయి. రాజకీయక్షేత్రంలో,ఇది యుద్ధనీతిగా అభివర్ణించుకుంటున్నారు.ఈ అభ్యాసం కొన్నేళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. పెద్దలసభల్లోనూ బడా పారిశ్రామక వేత్తలు,వ్యాపారులు,స్వపక్షీయులు వచ్చి చేరుతున్నారు. ఈ క్రీడలో యుద్ధనీతి ఎలా ఉన్నా రాజనీతికి తూట్లు పడుతున్నాయి.లోక్ సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందక, సెలెక్ట్ కమిటీకి వెళ్లి,కాలయాపన జరిగి,ఏళ్ళు పూళ్ళు సాగి, త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు: మహిళాబిల్లు.ఈ విధంగా అధికారపార్టీలను ఇరకాటంలో పెట్టి,నైతికంగా గెలిచామనే ఆనందంతో ప్రతిపక్ష పార్టీలు తాండవం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో,ఎన్నో సంస్కరణలకు నోచుకోవాల్సినవి,మెజారిటీ ప్రజలకుఎన్నో ప్రయోజనాలు చేకూర్చేవి, చారిత్రకమైన బిల్లులు కూడా ఉంటాయి.ఇదొక రాజకీయ చదరంగం.రాష్ట్ర పాలనకు సంబంధించి,రాష్ట్రాలలో ఉండే, శాసనమండలిని కూడా ఎగువసభ అంటారు. ఇక్కడ,అధికార పార్టీకి మెజారిటీ లేక,ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బంది పెడితే, అధికారంలో ఉన్న పార్టీకి శాసనమండలిని రద్దు చేసుకొనే అధికారం ఉంది. కానీ,రాజ్యసభను రద్దు చేసే అధికారం కేంద్రంలో లేదు. అలా రాజ్యాంగం నిర్మాణం చేశారు. తమకు మెజారిటీ వచ్చిన దాకా ఆగి తీరాల్సిందే. రాష్ట్రాలకు సంబంధించిన పెద్దల సభల్లోనూ ఒకప్పుడు మహనీయులు ఉండేవారు.రాజకీయ సంస్కృతి మారుతున్న నేపథ్యంలో,ఇక్కడా పెద్దమనుషులు కరువవుతున్నారు. ప్రస్తుతం,దేశంలోని ఎక్కువ రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థలు రద్దయ్యే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాజ్యసభ ప్రస్థానాన్ని గమనిస్తే, నిత్యస్మరణీయులైన మహనీయులు సభ్యులుగా పనిచేశారు.శాసనాల రూపకల్పనలో అచంచలమైన దేశభక్తితో, నిస్వార్ధంగా వ్యవహరించారు. అటు ఎంపికచేసిన పార్టీకి,ఇటు రాజ్యసభకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు.నిజంగా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవారికి ఇది గొప్ప అవకాశం.నియోజకవర్గాల్లోకి వెళ్ళి రాజకీయాలు చేసుకోనక్కర్లేదు.ఓట్ల భయం లేదు.ఖాళీ సమయాల్లో,అద్భుతమైన గ్రంథాలయాల్లో ఉన్న అపార జ్ఞాన సంపదను అక్కున చేర్చుకొని,దేశ ప్రతిష్ఠ పెంచే,సకల జనుల శ్రేయస్సు ప్రసాదించే అద్భుతమైన సలహాలు,సూచనలు పాలకులకు ఇవ్వవచ్చు.ఒకప్పుడు అలాగే సాగేది.నిన్న మొన్నటి వరకూ కూడా,ఎందరో పెద్దలు ఈ పెద్దలసభలకు ఎంపికయ్యారు. వాజ్ పెయి,పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్,ప్రణబ్ ముఖర్జీ, భూపేష్ గుప్తా,అల్లాడి కృష్ణస్వామి అయ్యర్,ఎన్. జి. రంగా, నీలం సంజీవరెడ్డి,బెజవాడ గోపాల్ రెడ్డి,బూర్గుల రామకృష్ణరావు,వల్లూరి బసవరాజు, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,నార్ల వెంకటేశ్వరరావు,దేవులపల్లి రామానుజరావు, పి. కె. కుమరన్ మొదలైన పెద్దలెందరో ఈ పెద్దల సభలో ఉండేవారు. రాష్ట్రపతి ఎంపిక చేసినవారిలోనూ ఎందరో పెద్దలు ఉండేవారు.రాజా రామన్న, జాకీర్ హుస్సేన్,అబు అబ్రహాం, శంకర్ కురూప్,ఆర్.కె.నారాయణ్, పండిట్ రవిశంకర్,పృథ్వి రాజ్ కపూర్,లతా మంగేష్కర్,కులదీప్ నయ్యర్. సి.నారాయణరెడ్డి మొదలైన వాళ్ళు పెద్దల సభకు ఎంతో గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చిన గొప్పవాళ్ళు. టెండూల్కర్,జయభాదురీ,రేఖ, హేమామాలిని మొదలైన వాళ్ళు కూడా ఎంపికయ్యారు.కళాకారులు, కవులు,శాస్త్రవేత్తలు,క్రీడాకారులకు గౌరవపూర్వకంగా రాజ్యసభకు ఎంపిక చెయ్యడం ఒక ఆనవాయితీ, ఒక మర్యాద.ఇందులో కొందరు అలంకారప్రాయంగా పదవికి పరిమితమైనవారు,కనీస హాజరు కూడా లేనివారు ఉన్నారు. జయభాదురీ,డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటివారు తమ పదవిని,సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు.కొందరు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలకు వివిధ రూపాల్లో ప్రయోజనాలు చేకూర్చి, తత్ఫలితంగా పదవులు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించడం,సర్వ ప్రజాహితంగా నిర్ణయాలు తీసుకోవడం,పదవీకాలాన్ని సద్వినియోగం చెయ్యడం, ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడడం ఈ సభ్యుల బాధ్యత. రాజ్యాంగం అమలు అనేది,అమలు చేసే పాలకులమీదనే ఆధారపడుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పారు.ఆచరణలో, పెద్దలసభ రాజకీయాలకు అతీతంగా, సర్వ స్వతంత్య్రమైన వ్యవస్థగా నిలబడాలి. ఉభయ సభలు ఆదర్శవంతంగా సాగాలన్నది,నేటి కాలంలో అత్యాశే అయినప్పటికీ, అలా సాగాలని అభిలషిద్దాం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
CM Jagan: ఎల్లుండి విశాఖకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి/విశాఖపట్నం: ఎల్లుండి(మంగళవారం) విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సీఎం సమావేశం కానున్నారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఇతర అధికారులతో కలిసి రాడిసన్ బ్లూ హోటల్, వి–కన్వెన్షన్ హాళ్లను పరిశీలించారు. విజన్ వైజాగ్ పేరుతో రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు హాజరుకానున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం పీఎంపాలెంలోని వి–కన్వెన్షన్ హాలుకు చేరుకుని అక్కడ ఏర్పాట్లను గమనించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో ఇక్కడ సీఎం జగన్ సమావేశమవుతారు. తర్వాత రుషికొండ హరిత రిసార్ట్స్ సమీపంలోని హెలిప్యాడ్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి రాడిసన్ బ్లూ హోటల్, వి– కన్వెన్షన్ హాలుకు ముఖ్యమంత్రి చేరుకునే రూట్ మ్యాప్ గురించి చర్చించారు. ఇదీ చదవండి: వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్‌తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే!
కేంద్రం ప్రకటించిన 132 పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఇందులో వాణిజ్య, పారిశ్రామిక విభాగం నుంచి ఇద్దరికి పద్మ భూషణ్, మరో ఇద్దరికీ పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పద్మ భూషణ్ సీతారాం జిందాల్ - కర్ణాటకకు చెందిన జిందాల్ అల్యూమినియం లిమిటెడ్, సీతారాం జిందాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీతారాం జిందాల్ (SITARAM JINDAL)కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ లభించింది. యంగ్ లియు - ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఫాక్స్‌కాన్ సీఈఓ యంగ్ లియుకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ దక్కింది. భారతదేశంలో పారిశ్రామిక రంగంలో లియు చేసిన కృషికి కేంద్రం ఈ అవార్డుని అందించింది. భారతదేశంలో విస్తృతంగా సేవలందిస్తూ.. ఇప్పటికి సుమారు 40000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇదీ చదవండి: తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు! పద్మశ్రీ కల్పన మోర్పారియా - మహారాష్ట్రకు చెందిన జేపీ మోర్గాన్ ఇండియా సీఈఓ 'కల్పన మోర్పారియా'కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ లభించింది. శశి సోనీ - కర్ణాటకకు చెందిన శశి సోనీకి కూడా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ కైవసం చేసుకుంది. -
‘దేశం’లో ధనస్వామ్యం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పేదల కోసమే పుట్టిందంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఎన్నికల్లో సీట్లు మాత్రం పెత్తందారులకే కట్టబెడుతున్నారు. ఇందుకోసం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి ఆ జెండానే నమ్ముకున్న వారిని పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. ధనబలం ఉన్న వారికే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇస్తామని, ఇందులో మరో ఆలోచనకే తావులేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీని నిలబెట్టేందుకు తాను ఎంతలా కష్టపడ్డానో చెప్పి ఈసారి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడం సాధ్యంకాదని ఆయన తెగేసి చెప్పారు. పోటీ చేసేవాళ్లు బయట వాళ్లా, పార్టీ వాళ్లా అనేది ముఖ్యం కాదని డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సీట్లు ఇస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పార్టీ వ్యూహ రచన సమావేశాల్లోనూ చంద్రబాబు, ముఖ్య నేతలు ఇదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల అన్వేషణ, ఎంపికలోనూ దీన్నే పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చాలాచోట్ల కొత్త పెత్తందారుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు గేట్లు బార్లా తెరిచేశారు. పార్టీ ఫండ్ ఇవ్వండి, సీట్లు తీసుకోండని టీడీపీ సీనియర్లు బడాబాబులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. వలలో పడిన వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. బాబు చేసే ఈ ధన యజ్ఞంలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న నేతలూ కొట్టుకుపోయే పరిస్థితి దాపురించిందని పార్టీనే నమ్ముకున్న సీనియర్లు వాపోతున్నారు. డబ్బులేదని నానికి ఝలక్.. తమ్ముడికి ఛాన్స్.. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని ప్రస్తుతం డబ్బు ఖర్చుచేసే పరిస్థితి లేదని తెలియడంతో చంద్రబాబు ఆయన్ను అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు. ఎంపీగా ఉన్నా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదు. చోటామోటా నేతలతో ఆయన్ను తిట్టిస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి సృష్టించారు. నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు ఇటీవల స్పష్టంచేశారు. రూ.100 కోట్లకుపైగా డబ్బును ఖర్చుపెట్టేందుకు ఆయన సిద్ధపడడంతో చిన్నికి అవకాశమిచ్చారు. రియల్ ఎస్టేట్‌లో బాగా డబ్బు సంపాదించి, సొంత అన్నతోనే విభేదించిన చిన్ని చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచి సీటు తెచ్చుకున్నారనే ప్రచారం టీడీపీలోనే విస్తృతంగా జరుగుతోంది. గుంటూరు బరిలో విద్యా సంస్థల అధినేత! గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పార్టీ కోసం ఇప్పటివరకూ పనిచేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన చంద్రబాబు చేతులు మీదుగా ప్రజలకు పండుగ కానుకలు ఇస్తామని మభ్యపెట్టి తొక్కిసలాటలో ముగ్గురి మృతికి కారణమయ్యారు. అలాగే, గుంటూరు ఎంపీ స్థానం నుంచి భాష్యం విద్యా సంస్థల యజమాని రామకృష్ణను పోటీచేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు బడా బాబుల కోసం చంద్రబాబు గేలం వేస్తున్నారు. ♦ కాకినాడ పార్లమెంట్ స్థానం కోసం మొదటి నుండి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌ను కాదని వ్యాపారవేత్త సానా సతీష్ కు సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ♦ తుని అసెంబ్లీ స్థానంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోసిన కృష్ణుణ్ణి నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు సీటు కట్ట బెడుతున్నారు. ♦రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ను తప్పించి ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణను ఇన్‌ఛార్జిని చేశారు. ♦ అమలాపురం ఎస్సీ రిజర్వు స్థానంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కాదని ఆర్థికంగా ధన బలం ఉన్న అయితాబత్తుల సత్యశ్రీకి సీటు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ చివరికి పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కూడా కాదని కమ్మ సామాజికవర్గానికి చెందిన ధనవంతుడు, కాంట్రాక్టర్ చంద్రమౌళికి సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత కుటుంబానికే ఓటు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పెత్తందారులకే సీట్లు కట్టబెట్టేందుకు చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గండి బాబ్జి స్థానంలో తన కుటుంబానికి చెందిన ‘గీతం’ భరత్‌ను రంగంలోకి దించేందుకు చంద్రబాబు రంగం సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. తెరపైకి ఎన్ఆర్ఐలు ♦ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కోళ్ల అప్పలనాయుడు కుటుంబాన్ని కాదని ఎన్ఆర్ఐ కొంప కృష్ణను రంగంలోకి దించారు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ♦ నెల్లిమర్లలో మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని కాదని బంగార్రాజు అనే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కుటుంబాన్ని పక్కనపెట్టి ఎన్ఆర్ఐ గోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. ♦ కృష్ణాజిల్లా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు కుటుంబం ఎన్టీఆర్ నాటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. ఇప్పుడు డబ్బులేదనే కారణంతోనే రావిని పక్కకు నెట్టి ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు. రాముకున్న అర్హత కేవలం ధన బలం మాత్రమేనని, డబ్బు లేకపోవడంవల్లే తనను దూరం పెట్టారని రావి వెంకటేశ్వరరావు వాపోతున్నారు. -
సీఎం జగన్ పారిశ్రామిక విధానాలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు, విధానాలు అంతర్జాతీయ సంస్థల అధిపతుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు నుంచి పరిశ్రమ ప్రారంభోత్సవం వరకు పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండదండగా నిలుస్తోంది. వేగంగా అన్ని అనుమతులూ ఇస్తోంది. దీంతో రాష్ట్రంలో శరవేగంతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కూడా సీఎం వైఎస్ జగన్ విధానాలకు ప్రశంసలందించారు. ఈ సంస్థ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీకి రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ఏర్పాటు చేస్తోంది. రూ.4,640 కోట్లతో చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద 800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ యూనిట్ ద్వారా 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉపాధి లభిస్తుంది. పెప్పెర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పెప్పర్ మోషన్ యూనిట్ వివరాలను వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల క్లస్టర్ ఏర్పాటుకు వేగంగా అనుమతులు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం వైఎస్ జగన్ విధానాలను కొనియాడారు. ఏడాదికి 30,000 విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సామర్ధ్యంతో ఇక్కడి యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్ ఏర్పాటు, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వాములకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తామని చెప్పారు. మూడు దశల్లో ఏర్పాటు చేసే ఈ యూనిట్ తొలి దశ 2025 మూడో త్రైమాసికానికి అందుబాటులోకి వస్తుందన్నారు. 2027 మూడో త్రైమాసికానికి మూడో దశలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, అమలు చేస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ పెప్పర్ మోషన్ ప్రతిని«దులకు వివరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెప్పర్ మోషన్ సీటీవో డాక్టర్ మథియాస్ కెర్లర్, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్టర్, సీఐవో రాజశేఖర్‌రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్ శ్రీధర్ కిలారు, ఉర్త్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ హర్ష ఆద్య పాల్గొన్నారు. సీఎం విజనరీ థింకింగ్ మమ్మల్ని ఆకట్టుకుంది: ఆండ్రియాస్ హేగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ థింకింగ్, అమలు చేస్తున్న పాలసీలు తమను ఆకట్టుకున్నాయని, ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేమంటూ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కొనియాడారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీలో వరల్డ్ క్లాస్ యూనిట్ ఏర్పాటు చేయడంపై చాలా సంతోషంగా ఉన్నాం. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మా యూనిట్ ఏర్పాటుచేస్తున్నాం. ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకువచ్చేలా మా యూనిట్ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా మా యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పారు. -
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో విదేశీ పారిశ్రామికవేత్తల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపదపై అధ్యయనానికి వచ్చిన విదేశీ యువ పారిశ్రామికవేత్తలు.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను మంగళవారం కలిశారు. యూత్ అంబాసిడర్స్ ప్రోగ్రాం(వైఏపీ)లో భాగంగా ఆ్రస్టియా, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్, బెల్జియం దేశాలకు చెందిన 13 మంది యువ పారిశ్రామికవేత్తలు 15 రోజుల పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ని సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రాముఖ్యత, చారిత్రక, వారసత్వ సంపద, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఇండ్రస్టియల్ పాలసీ, ఐటీ, ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి విషయాలను వారికి మంత్రి వివరించారు. కార్యక్రమంలో యూత్ అంబాసిడర్స్ కో–ఆర్డినేటర్ నవీన్ మల్వేతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇదే సమయం
సాక్షి, హైదరాబాద్, బంజారాహిల్స్: పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఇదే ఉత్తమ సమయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఇంటర్ప్రీనర్స్ ఆఫ్ ఇండియా (ఎలీప్) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ వద్ద కేటాయించిన ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (డబ్ల్యూఐటీటీసీ) కేంద్రానికి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏకకాలంలో ఐదు విప్లవాలు హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవంతో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్త్రం దేశానికి ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. రా్రష్తంలోని అన్ని జిల్లాలు పారిశామ్రిక ప్రగతికి అత్యధికంగా వనరులున్నాయన్నారు. వీటిని పారిశ్రామికవెత్తలు అందిపుచ్చుకొని గ్రామీణ స్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితేనే సమతుల్యత సాధించగలమన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటుచేసుకొని వాటిని సాధించేందుకు కృషి చేస్తే అద్భుతాలు సాధ్యమన్నారు. ఎలీప్ అధ్యక్షురాలు రమాదేవి కన్నెగంటి మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం కేవలం 5 మంది పారిశ్రామికవేత్తలతో ప్రారంభమైన అలీప్లో ఇప్పుడు 10వేల మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ జి.బాలమల్లు, డబ్ల్యూఐటీటీసీ వైస్ చైర్పర్సన్ జ్యోతి, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెజ్లర్లకు న్యాయం చేయాలి: కేటీఆర్ లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న దీక్షకు రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మద్దతు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై విచారణ జరిపి, వారికి న్యాయం చేయాలని శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ‘ఒలంపిక్స్‌లో పతకాలు సాధించి వారు దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినప్పుడు మనం ఉత్సవాలు జరుపుకొన్నాం. ప్రస్తుతం వారు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికీ సంఘీభావం తెలుపుదాం. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి, రెజ్లర్లకు న్యాయం అందించాలి’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రెజ్లర్ల సమస్యను పరిష్కరించాలి: కవిత రెజ్లర్లకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్ చేశారు. ‘అంతర్జాతీయ వేదికలపై మన అథ్లెట్లు కనపరిచిన ప్రతిభను చూసి ఉత్సవాలు చేసుకున్నాం. మన అథ్లెట్లు గ్లోబల్ ఐకాన్స్. వారు మనను ఎంతో ప్రభావితం చేస్తున్నారు. మన అథ్లెట్లు చెబుతున్న సమస్యను విని, దేశ భవిష్యత్ దృష్ట్యా వారి సమస్యను పరిష్కరించాలి’అని ఆమె శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
పెట్టుబడులకు అత్యుత్తమం
సాక్షి, విశాఖపట్నం: అక్షర క్రమంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగింపు సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. విజనరీ లీడర్ షిప్‌తో అన్ని రంగాల్లో ఏపీ దూసుకెళుతోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని కొనియాడారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను తమ తొలి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఫోన్ కాల్ చాలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పట్ల పరిశ్రమల యాజమాన్యాలన్నీ పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. 11.47 శాతం వృద్ధితో ఏపీ అగ్రభాగంలో ఉండటం గర్వకారణం. దూరదృష్టి కలిగిన నాయకత్వం ఆధ్వర్యంలో రూపొందించిన పారిశ్రామిక పాలసీ అద్భుతమని అందరి మాటగా చెబుతున్నా. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారినందుకు సంతోషంగా ఉంది. రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన సదస్సులో ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలన్న సీఎం వైఎస్ జగన్ భరోసా అందర్నీ ఆకట్టుకుంది. ఆయన చెప్పిన మాట నిజంగా వాస్తవం. ఫోన్ చేస్తే ఏ సమస్యనైనా పరిష్కరిస్తున్నారు. – గజానన్ నబర్, నోవా ఎయిర్ సీఈవో, ఎండీ అసాధారణ ఘనత.. ప్రపంచమంతా పునరుత్పాదక ఇంధనం వైపు పయనిస్తోంది. ఈ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీలో పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులకు అనువైన స్థలాలను గుర్తించగలిగాం. సోలార్, విండ్, పంప్డ్ హైడ్రో పవర్ ఉత్పత్తిలో ఏపీ ప్రపంచంలోనే నంబర్1 గా ఎదిగే అవకాశాలున్నాయి. దీని వెనుక సీఎం జగన్ అకుంఠిత దీక్ష ఉంది. గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో పాటు సోలార్, విండ్, హైడ్రో ప్రాజెక్ట్‌లలో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ రంగంలో ఏపీలో భారీగా పెట్టుబడులు పెడతాం. కర్బన రహిత పర్యావరణం కోసం ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా తొలి స్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. పారిశ్రామిక వాతావరణం అద్భుతంగా ఉండటం వల్లే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాం. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. – వినీత్ మిట్టల్, ఆవాదా గ్రూప్ చైర్మన్ చురుకైన ప్రభుత్వం.. రాష్ట్ర విభజన తర్వాత బల్క్ డ్రగ్ క్యాపిటల్‌గా ఏపీ మారింది. రాష్ట్రంలో కొన్ని అతిపెద్ద ఏపీఐ యూనిట్లు పనిచేస్తున్నాయి. మేం 2007లో ఒక ఉద్యోగి స్థాయి నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగామంటే సీఎం జగన్ అందించిన సహకారమే కారణం. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ, చురుకైన ప్రభుత్వం, నిపుణులైన అధికారులు, నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఏపీకి ప్రత్యేకంగా మార్కెట్ అవసరం లేదు. పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా పెడితే పెట్టుబడులు వస్తాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డ్రగ్ కంట్రోలర్ అనుమతులతో సహా ప్రక్రియను వేగంగా నిర్వహించేలా డిజిటల్ డ్రైవ్‌లోనూ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రపంచానికి కావాల్సిన ఔషధాలు ఏపీలో తయారవుతున్నాయి. – సూర్యనారాయణ చావా, లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో పరిశ్రమలు కోరుకునే సుస్థిర వాతావరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థ నాయకత్వం కారణంగా సమ్మిట్‌లో అనూహ్యరీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిర విధానాలు, ఆహ్లాదకరమైన వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైనందుకు ఆనందంగా ఉంది. పెట్టుబడుల్ని క్రమంగా ఇక్కడ విస్తరిస్తాం. నాణ్యమైన మానవ వనరులను అందించడం, పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి పరిష్కరిస్తున్నారు. ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఏపీలో ఉన్నందున నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టవచ్చు. – సంతానం, సెయింట్ గోబెన్ సీఈవో 96 సేవలు ఒకే చోట ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. కొత్తగా వచ్చే పరిశ్రమలకు 21 రోజుల్లో అన్ని అనుమతులను మంజూరు చేస్తున్నాం. 24 ప్రభుత్వ శాఖలకు చెందిన 96 సేవల్ని ఒకే చోట చేర్చి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రతి సంస్థకు పూర్తి స్థాయి మద్దతిస్తూ ప్రతి విషయంలోనూ సహకరిస్తాం. – డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండేళ్లలో రూ.రెండు వేల కోట్లు కోవిడ్ తర్వాత ఫార్మా రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భారత్‌ను ఫార్మా స్యూటికల్ రంగంలో భాగస్వామిగా చేసుకునేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చూపిస్తున్న చొరవ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారం కారణంగా ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – వంశీకృష్ణ, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ -
జగన్ దార్శనికతే ఏపీ ప్రగతి దిక్సూచి
(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 ’ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంతా ఒకే వేదికపైకి వచ్చిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. అంతకుమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత, కార్యదక్షతకు నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, సరళతర వాణిజ్య విధానాలు ఎంతటి సత్ఫలితాలను అందిస్తున్నాయో ప్రపంచానికి చాటి చెప్పింది. సదస్సులో తొలి రోజు శుక్రవారం దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో సృష్టించిన పారిశ్రామిక అనుకూల వాతావరణం గురించి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. సీఎం వైఎస్ జగన్ యువ నాయకత్వం, దార్శనికతతోనే వృద్ధి రేటు, సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కొనియాడటం విశేషం. దక్షిణ భారత దేశంలో నిర్వహించిన ఓ పెట్టుబడుల సదస్సుకు ఆయన హాజరుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికాభివృద్ధిపట్ల సీఎం జగన్ స్పష్టమైన దృక్పథానికి ఆకర్షితుడయ్యే ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. సహజ వనరులు, భౌగోళిక అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకత అని ఆదానీ పోర్ట్ – సెజ్ సీఈవో కరణ్ అదానీ చెప్పారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీరరేఖ కలిగిన ఏపీలో పోర్టుల అభివృద్ధికి జగన్ ప్రణాళికలు ఇందుకు నిదర్శనమన్నారు. పారిశ్రామిక విధానం, పరిశ్రమల అనుకూల ఎకోసిస్టమ్ కల్పించేందుకు సమర్థంగా అమలు చేస్తున్న సింగిల్ విండో పాలసీ గురించి జేఎస్పీఎల్ గ్రూప్ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం జగన్ దార్శనిక విధానాల ఫలితంగానే తమ గ్రూప్ ఏపీలో రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే అగ్రగామిగా నిలిపి సీఎం జగన్ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారన్నారు. సమర్థ నాయకుడు సంక్షోభం తలెత్తినప్పుడు సమర్థంగా వ్యవహరించడమే నాయకత్వ లక్షణమని కియా మోటార్స్‌కు చెందిన కబ్ డాంగ్లీ చెప్పారు. అలాంటి నాయకుడు జగన్ అని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు, ముడి సరుకును సురక్షితంగా తరలించడానికి సీఎం జగన్ సత్వరం సహకారం అందించడం ఇందుకు తార్కాణమన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధే ఆర్థికాభివృద్ధికి చోదక శక్తి అనే వాస్తవాన్ని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి కొనియాడారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య–ఆరోగ్య రంగాలపై ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తుండటం దేశానికే ఆదర్శమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎంవోయూల పేరుతో చేసిన కనికట్టు అందరికీ తెలిసిందే. ఛోటామోటా నేతలకు సూట్లు వేసి మరీ ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు ప్రజల్ని మోసం చేశారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలలో 10 శాతం కూడా కార్యరూపం దాల్చలేదు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తూ పరిశ్రమల ఏర్పాటును స్వయంగా పర్యవేక్షిస్తుండటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే విషయాన్ని కెనాఫ్ సంస్థ సీఈవో సుమిత్ బిదానీ జీఐఎస్ సభా వేదిక మీదే చెప్పారు. 40 మిలియన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద ప్లాంట్‌ను తాము ఏర్పాటు చేయడం కేవలం సీఎం జగన్ సహకారంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. ఒప్పందం జరిగిన 18 నెలల్లోనే ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంతటి పారిశ్రామిక అనుకూలత అరుదు సీఎం జగన్ నిబద్ధత గురించి జపాన్‌కు చెందిన టోరే ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగుచి చెప్పిన విషయం అబ్బురపరిచింది. శ్రీ సిటీలో రూ.200 కోట్లతో తాము త్వరగా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం 132 కేవీ విద్యుత్ లైన్‌ను ప్రత్యేకంగా వేయడాన్ని ఆయన ఉదహరించారు. ఇంతటి పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉండటం చాలా అరుదని వ్యాఖ్యానించారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తుండటం ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ పారిశ్రామిక పరిణామాలపై ఆయనకున్న ముందు చూపునకు నిదర్శనమని టెస్లా కంపెనీ కో ఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్ తెలిపారు. శ్రీ సిమెంట్ చైర్మన్ హరిమోహన్ బంగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిమెంట్ రంగంలో తాము ఈ కారణంగానే ఏపీలో పెట్టుబడులు పెడుతున్నామన్నాఉ. ఇప్పటికే రూ.3,000 కోట్లతో గుంటూరులో తాము ఏర్పాటు చేస్తున్న దేశంలోనే మొదటి గ్రీన్ సిమెంట్ ప్లాంట్ పనులు నడుస్తున్నాయని, త్వరలో మరో రూ.5,000 కోట్లు పెట్టుబడులతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అపారమైన సహజ వనరులు.. నైపుణ్యమైన మానవ వనరులు అభివృద్ధికి మూలం. కీలకమైన ఆ రెండింటినీ గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకునే సమర్థ నాయకత్వం ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో అటువంటి సమర్థ నాయకత్వం లభించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలవడం ఖాయం. వైఎస్ జగన్ దార్శనికతే ఏపీ ప్రగతికి దిక్సూచి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 వేదికపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయమిది. సీఎం జగన్‌ను చూసి గర్వపడుతున్నా.. పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ ఎంత వేగంగా స్పందిస్తారో చెబుతూ సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా చెప్పిన ఉదాహరణ ఆకట్టుకుంది. ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, అందుకోసం నోడల్ ఆఫీసర్ల నియామకంతోపాటు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఏఏ మోడల్స్ ఉత్పత్తి చేయాలి తదితర అంశాలన్నీ ఒక్క సమావేశంలోనే కొలిక్కి వచ్చేశాయన్నారు. తాను పుట్టిన నేలకు దేశ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను తెచ్చిన సీఎం జగన్‌ను చూసి గర్విస్తున్నానని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు చెప్పారు. జె ఫర్ జగన్ కాస్త జె ఫర్ జోష్‌గా మారిందని దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా వ్యాఖ్యానించారు. -
అభివృద్ధిలో భాగస్వాములవుతాం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తూ ఉపాధి కల్పనే లక్ష్యంగా విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 ఊహకు మించి అద్భుతంగా ఆరంభమైంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొనడం హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఏ ఒక్క పెట్టుబడుల సదస్సుకు హాజరుకాని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 15 మంది బోర్డు డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో కలసి విశాఖ సమ్మిట్‌లో పాల్గొనడం విశేషం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డైనమిక్ లీడర్‌షిప్‌పై ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రాభివృద్ధిలో తాము కూడా భాగస్వాములవుతామని ప్రకటించారు. పెట్టుబడులకు స్వర్గధామం లాంటి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య రంగం అద్భుతం.. – ప్రీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వైస్ చైర్పర్సన్ సమృద్ధి అంటే మనం చూస్తున్నట్లుగా ప్రజల శ్రేయస్సు పరిపూర్ణంగా కనిపించడం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని ఈ భూమి తల్లి కుమార్తెగా చెబుతున్నా. వైద్యారోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు నిజంగా ప్రశంసనీయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ఇతర దేశాలకూ విస్తరించింది. ఆ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ మరింత విస్తరింపజేశారు. ఆరోగ్యశ్రీ ఆఫ్రికాలోనూ అమలవుతుండటం గర్వకారణం. ఏపీ ప్రభుత్వంతో అపోలో గ్రూప్స్ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. అపోలో కార్యకలాపాలకు సీఎం జగన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. మనమంతా చూస్తున్నట్లుగా ఏపీవైపు అన్ని పరిశ్రమలు కలసి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యుత్తమ ఆరోగ్య ప్రమాణాలు అందించేందుకు ఒక కుటుంబంగా సహకరిస్తామని హామీ ఇస్తున్నా. రూ.5 వేల కోట్ల పెట్టుబడులు – హరిమోహన్ బంగూర్, శ్రీ సిమెంట్ జీఎస్డీపీలో 11.43 శాతంతో అగ్రభాగంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ దేశ జీడీపీలో 5 శాతం వాటా సాధించినందుకు అభినందనలు తెలియచేస్తున్నా. సీఎం జగన్ కృషితో విద్య, సామాజిక, ఇంజనీరింగ్ రంగాల్లో పరిశ్రమల్ని ఆకర్షించే అద్భుతమైన వనరులున్న రాష్ట్రంగా ఏపీ అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్న రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది పారిశ్రామిక వర్గాల్ని ఆకర్షిస్తున్నారు. దాదాపు 50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో శ్రీసిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. 55 శాతం గ్రీన్ ఎనర్జీ వినియోగిస్తూ దేశంలోని సిమెంట్ ప్రాజెక్టుల్లో నంబర్ వన్‌గా ఉన్నాం. ప్లాంట్లు మరిన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మా సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతంగా భావిస్తున్నాం. రూ.3,000 కోట్లతో గుంటూరులో దేశంలోనే మొదటి గ్రీన్ సిమెంట్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టి 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాం. ప్రభుత్వ సహకారంతో 18 నెలల్లోనే పూర్తి – సుమిత్ బిదానీ, కెనాఫ్ సంస్థ సీఈవో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పేందుకు మేమే నిదర్శనం. శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటుకు 2019లో ఒప్పందం కుదుర్చుకున్నాం. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా 40 మిలియన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో 24 ఎకరాల్లో నిర్మించాం. 200 మందికి నేరుగా ఉపాధి కల్పించాం. సీఎం జగన్ సహకారం, ప్రోత్సాహంతో పెట్టుబడుల ఒప్పందం జరిగిన 18 నెలల్లోనూ మా ప్రాజెక్టుని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాం. ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని అనుమతుల్ని తేలికగా పొందాం. శ్రీసిటీలో విద్యుత్ సరఫరా చాలా అద్భుతంగా ఉంది. ముడిపదార్థాలు, ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకునేందుకు పలు పోర్టులు 100 కి.మీ. లోపు ఉండటం, బహుళ రహదారుల అనుసంధాన వ్యవస్థ కూడా ఉపయోగపడుతోంది. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యం ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామికవేత్తలకు బాగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు విస్తరణ ఏపీలోనే – సజ్జన్ భజాంకా, సెంచురీ ప్లై చైర్మన్ ఏపీలో 14 నెలల క్రితం మా కలల ప్రయాణం ప్రారంభమైంది. సీఎం జగన్‌ను మొదటిసారి కలసినప్పుడు మా ప్లాంట్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో వెళ్లాం. ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఏ మోడల్స్ ఉత్పత్తి చేయాలి? నోడల్ ఆఫీసర్లు ఎవరు..? ఇలా అన్నీ ఒక్క మీటింగ్‌లోనే డిసైడ్ అయిపోయాయి. అన్నీ కుదిరితే 2024 కల్లా ప్లాంట్‌లో ఉత్పత్తులు ప్రారంభించగలమని అనుకున్నాం. సీఎం ప్రోత్సాహంతో కేవలం రెండేళ్లలోనే 2021 డిసెంబర్లో ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో మా ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, సులభంగా మారింది. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇది మా రాష్ట్రం, మా ప్రాంతం అనే భావనకు వచ్చేశాం. ప్రతి ఒక్క అధికారి, రాజకీయ ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారు. మరో రెండు ప్లాంట్ల పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఏపీని మా ఫస్ట్ చాయిస్‌గా మార్చేశారు. రూ.10 వేల కోట్లకు కియా పెట్టుబడులు – కబ్ డాంగ్లీ, కియా మోటర్స్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ ప్లాంట్ నిర్మించాం. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు మరువలేనిది. ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో కియా ఇండియా లీడింగ్ కంపెనీగా మారడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ఉంది. 2023 చివరి నాటికల్లా ఈవీ–6 తయారు చేస్తాం. ఏపీలో 2027 నాటికల్లా కియా పెట్టుబడులు రూ.10 వేల కోట్లకు చేరుకోనున్నాయి. నిరంతర విద్యుత్, స్కిల్డ్ మానవ వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అందించారు. కోవిడ్ సమయంలో మా ఉద్యోగులు, ముడి సరుకులను తరలించడంలో సీఎం జగన్ ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలోని సుదీర్ఘ తీరం వెంట పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాల్ని వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నా. ప్రభుత్వ సహకారానికి సాహో – మసహిరో యమగుచీ, టోరే ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఎండీ శ్రీసిటీలో ప్లాంట్ ఏర్పాటు సమయంలో సీఎం జగన్ సహకారం మరువలేనిది. అనుమతులన్నీ అతి తక్కువ సమయంలోనే మంజూరు చేశారు. ఫస్ట్ ఫేజ్‌లో 2019లోనే ఉత్పత్తులు ప్రారంభించాం. రెండో ఫేజ్‌లో రూ.200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌ను అభివృద్ధి చేసి ఉత్పత్తుల్ని ఈ ఏడాది మొదలు పెట్టాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయో, నానోటెక్నాలజీ, పాలిమర్ కెమిస్ట్రీ కోర్ టెక్నాలజీతో ప్రారంభిస్తున్నాం. శ్రీసిటీలో హైక్వాలిటీ ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తున్నాం. 132 కేవీ విద్యుత్ లైన్‌ని ప్రత్యేకంగా మాకోసం అందించారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అద్భుతంగా అమలు చేస్తున్నారు. స్టార్టప్, గ్రీన్ ఎనర్జీపై ఆసక్తి.. – మార్టిన్ ఎబర్‌హార్డ్, టెస్లా కో ఫౌండర్ టెస్లా ప్రారంభించినప్పుడు ఎవరికీ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తారనే ఆలోచన లేదు. ఈ రోజు ప్రతి దిగ్గజ కార్ల కంపెనీకి ఈవీ కార్ల గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్టార్టప్ కంపెనీలకు గొప్ప ఎకో సిస్టమ్ ఉంది. ఏపీలో స్టార్టప్స్‌తో పాటు గ్రీన్ఎనర్జీ ఉత్పత్తి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో సదస్సుకు హాజరయ్యా. ఈవీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. గ్రీన్ రివల్యూషన్‌కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టార్టప్ కంపెనీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఒక్కటే చెబుతున్నా.. ఓడిపోయామని వదలొద్దు.. విజయం సాధించే వరకూ అడుగులు వేస్తూనే ఉండాలి. -
Fact Check: రాయితీల జాడపై రామోజీ అబద్ధాల నీడ
సాక్షి, అమరావతి: తనకు కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేరని, అతన్ని ఆ పీఠంపై తిరిగి కూర్చోబెట్టడానికి అనుకూల వాతావరణం సృష్టించేందుకు ‘ఈనాడు’ తహతహలాడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రగతిని పణంగా పెడుతూ నీచ రాజకీయాలకు తెరలేపింది. ఒక్కో రోజు ఒక్కో కట్టు కథతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొన్నటికి మొన్న టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకపోయినా.. కొట్టారంటూ పాత ఫొటోలతో తప్పుడు ప్రచారం చేసింది. ప్రజలు గుర్తించి సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోయడంతో తప్పు ఒప్పుకుంటూనే.. తిరిగి అవే తప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ.. ‘పారిశ్రామిక రాయితీ జాడేది?’ అంటూ తాజాగా మరో కథనాన్ని వండివార్చింది. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోవాలని, పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేయాలనే దుర్బుద్ధి కనిపిస్తోంది. గత ప్రభుత్వం పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వకుండా బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అంధకారంలోకి నెట్టిన విషయాన్ని ఏ రోజూ మాట మాత్రంగానైనా రామోజీ ప్రశ్నించ లేదు. ఈ ప్రభుత్వం వరుసగా రాయితీలు విడుదల చేస్తున్నా, తప్పుడు రాతలతో విషం కక్కడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమే. కోవిడ్ సమయంలో పరిశ్రమలు భారీగా ఆదాయం నష్టపోయినా, రీస్టార్ట్ ప్యాకేజీతో ఈ ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుందన్న పచ్చి నిజాన్ని దాచడం దుర్మార్గం కాదా? భారీ సంక్షోభాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు పారిశ్రామిక వేత్తలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం న్యాయమా? ఆరోపణ: రాయితీలు ఇవ్వలేదు వాస్తవం: గత ప్రభుత్వం రూ.3,409 కోట్ల రాయితీలను పరిశ్రమలకు బకాయి పెట్టి రాష్ట్ర పారిశ్రామిక వాతావరణాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి సకాలంలో రాయితీలను విడుదల చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.46 కోట్లు, 2020–21లో రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ.993.30 కోట్ల రాయితీలను విడుదల చేయడం ద్వారా కోవిడ్ సంక్షోభంలో 8,000 ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా అండగా నిలిచింది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంలో 2021–22లో రూ.666.86 కోట్ల రాయితీలను విడుదల చేశారు. 2022–23కు సంబంధించి ఆగస్టులో పారిశ్రామిక రాయితీలను విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్‌ను విశాఖలో నిర్వహిస్తున్న తరుణంలో దానికి ఒక నెల ముందు పారిశ్రామిక రాయితీలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతలో ఎంఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాయితీల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అయిపోగానే పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ వాస్తవాలను ఏమాత్రం ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ముందు రాష్ట్రం పరువు తీయాలని ఈనాడు లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టమవుతోంది. ఆరోపణ: విద్యుత్ డిమాండ్ చార్జీల సంగతీ అంతే.. వాస్తవం: గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఏటా క్రమం తప్పకుండా రాయితీలను విడుదల చేస్తూ, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా చేదోడుగా నిలబడటంతో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. పూర్తిగా 100 శాతం రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రకటిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడటం అంటే రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మూడు నెలల కాలానికి విద్యుత్ రంగానికి చెందిన ఫిక్స్డ్ డిమాండ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు భారీ పరిశ్రమలకు ఎటువంటి పెనాల్టీలు లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు వైఎస్సార్ బడుగు వికాసం కింద 9,631 యూనిట్లకు రూ.661.58 కోట్ల రాయితీలు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 2,207 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు రూ.111.08 కోట్లు, 424 ఎస్టీ పారిశ్రామికవేత్తలు రూ.24.31 కోట్ల రాయితీలు అందుకున్నారు. వైఎస్సార్ నవోదయం కింద 1.08 లక్షల ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలకు చెందిన రూ.3,236 కోట్ల రుణాలను ప్రభుత్వం రీ–షెడ్యూల్ చేసింది. -
నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. బీజేపీకి షాక్ తగులుతుందా?
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి విద్యుత్ షాక్ తగులుతుందా ? నానాటికీ పెరిగిపోతున్న చార్జీలు ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీస్తాయా ? సామాన్య జనమే కాదు. బడా బడా పారిశ్రామికవేత్తలు కూడా విద్యుత్ టారిఫ్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ? గుజరాత్లో విద్యుత్ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్ అండ్ పవర్ పర్చేజ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీపీఏ) రూపంలో పెంచింది. ప్రస్తుతం యూనిట్ ధర వివిధ వర్గాల వాడకానికి అనుగుణంగా యూనిట్‌కు రూ.2.50 నుంచి రూ. 7.50 వరకు ఉంది. . ‘‘గుజరాత్లో విద్యుత్ వినియోగదారులు 2021 మే–జూన్‌లో యూనిట్‌కి రూ.1.80 చెల్లిస్తే, ఈ ఏడాది జూన్ నాటికి యూనిట్ ధర రూ.2.50 చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏడాదిలో 70 పైసలు పెరిగింది. గత రెండు నెలల్లోనే యూనిట్‌కు 30 పైసలు పెరిగేసరికి రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై నెలకి అదనంగా రూ.270 కోట్ల భారం పడింది’’ అని రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ నిపుణుడు కె.కె.బజాజ్ చెప్పారు. గుజరాత్లో విద్యుత్ వాడకం ఎక్కువ. ఒక వ్యక్తి ఏడాదికి సగటున 2,150 యూనిట్లు వాడితే, ఇతర రాష్ట్రాల్లో 1,150 యూనిట్లే వాడతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా కోసం విద్యుత్ కంపెనీలు రూ.20 పెట్టి యూనిట్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా విద్యుత్ చార్జీలు వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపాయి. పారిశ్రామిక రంగానికి యూనిట్‌కు రూ.7.50 చెల్లించాల్సి రావడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే వ్యాపారాలు చేయలేమంటోంది సదరన్ గుజరాత్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మహారాష్ట్ర, తెలంగాణలో పరిశ్రమలు యూనిట్‌కు రూ.4 చెల్లిస్తే, తాము రూ.7.50 చెల్లించాల్సి వస్తోందన్న ఆందోళనలో వారు ఉన్నారు. ఆప్ వర్సెస్ బీజేపీ గుజరాత్లో మొదటిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ తరహాలో గృహాలకు నెలకి 300 యూనిట్ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్ హామీ పట్ల సామాన్యులు ఆకర్షితులవుతున్నారు. 2021 డిసెంబర్ 31కి ముందు జారీ అయిన పెండింగ్ విద్యుత్ బకాయిల్ని మాఫీ చేస్తామని, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. .మరోవైపు కాంగ్రెస్ కూడా ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తామంటోంది. ఇవన్నీ అధికార పార్టీకి సవాల్‌గా మారాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచితాలు ఇచ్చే పార్టీల మాయలో పడొద్దని ఉచిత హామీ పథకాలు దేశాభివృద్ధిని అడ్డుకుంటాయంటూ ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్యుత్ హామీ నెరవేరాలంటే గుజరాత్ ఖజానాపై ఏడాదికి రూ.8,700 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇంత అదనపు భారాన్ని ఎలా మోస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందించడంమే తమ పార్టీ లక్ష్యమనం మోదీ అంటున్నారు. విద్యుత్ చౌర్యం జరగకుండా మీటర్లు పెట్టడం తప్పనిసరి చేశారు. మరోవైపు బీజేపీ ప్రచారాన్ని ఆప్ తిప్పి కొడుతోంది. గుజరాత్లో ముఖ్యమంత్రి నెలకి 5 వేల యూనిట్లు, ఇతర మంత్రులకి 4 వేల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నప్పుడు సాధారణ జనం 300 యూనిట్ల వరకు ఎందుకు వాడుకోకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉచిత విద్యుత్ గుజరాత్ ఓటర్లకు కొత్త కాదు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేశూభాయ్ పటేల్ ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన కేశూభాయ్ పటేల్ రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం కింద 47 లక్షల ముంది లబ్ధి పొందుతారు. అయితే మోదీ ఛరిష్మాకు ఆయన ఎదురు నిలువ లేకపోయారు.అప్పట్లో ఉచిత విద్యుత్ హామీలేవీ ఫలించలేదు. ఇప్పుడు కూడా ఆప్, కాంగ్రెస్‌కు అదే జరుగుతుందని బీజేపీ ధీమాగా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అన్ని చోట్లా పరిశ్రమలు
పటాన్చెరు: దిగుమతులకు చరమగీతం పాడేలా తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పది వేల ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఆల్ప్లా పరిశ్రమలో మౌల్డింగ్ కేంద్రం,డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడిదార్లకు భరోసా: గతంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేశారని, ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదార్లకు భరోసాను కల్పిస్తూ మంచి వాతావరణాన్ని కల్పించామన్నారు. గ్రీన్ (సాగు), వైట్ (క్షీర), బ్లూ (నీలి – మత్య్స), పింక్ (మాంసాహార), ఎల్లో (ఆయిల్ – వంటనూనె) విప్లవం కొనసాగుతుందని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, 25 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు (మొత్తం సాగు విస్తీర్ణంలో 15 శాతం) లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఆల్ప్లా పరిశ్రమ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆల్ప్లా గ్లోబల్ సీఈఓ ఫిలిప్ లెహనర్, సంస్థ ఇండియా ఎండీ వాగీశ్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులను పారిశ్రామికవేత్తలుగా...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని బలంగా ఆకాంక్షించిన విషయం విదితమే. అందులో భాగంగా 2005లో రూపొందించిన పారిశ్రామిక విధానంలో తన ఆకాంక్షలకు అంకురార్పణ చేశారు. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అభివృద్ధి పరచిన పారిశ్రామిక వాడలలోని ప్లాట్లను ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు. రిజర్వేషన్లతో పాటు గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించారు. గరిష్టంగా 50 లక్షల మేర పెట్టుబడి రాయితీతో పాటు, విద్యుత్, వడ్డీరాయితీలు, స్టాంప్ డ్యూటీ, రీయింబర్స్మెంట్, ఏపీఎస్ఎఫ్లలో అడ్వాన్స్ సబ్సిడీ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా వందల సంఖ్యలో దళితులు వినూత్న పథకాలతో పరిశ్రమల స్ధాపనకు ముందు కొచ్చారు. 2012 వరకు ఈ వర్గాలు నగదు మొత్తం చెల్లించి ప్లాట్లు పొందే పద్ధతి అమలయింది. (చదవండి: బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా?) 2012లో నాటి ప్రభుత్వం యిచ్చిన 102 జీఓలో ప్లాటు ధర మొత్తంలో 25 శాతం చెల్లించి, రెండు సంవత్సరాలు మారటోరియం సదుపాయం పొంది, 10 సంవత్సరాలలో 8 కిస్తీలలో చెల్లించాలని నిర్దేశించారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మార్గదర్శకాలు రూపొందించడంలో అలసత్వం, 16.6 శాతం వడ్డీ విధించడం, లీజు కాలం కేవలం 10 సంవత్సరాలు కావడం వల్ల బ్యాంకుల నుండి ఎదురయ్యే ఇబ్బందులు, అధిక వడ్డీ వంటి సమస్యలు లబ్ధిదారులకు ఎదురయ్యాయి. ఈ అంశాన్ని ప్రస్తుత పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కారికాల వలవన్, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, అధికారుల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం ఈ వర్గాలకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జీఓఎమ్ఎస్ నం. 7ను 2022 ఫిబ్రవరి 5న విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం 2008 నుండి 2020 మార్చి 31 వరకు పారిశ్రామికవాడ లలో ప్లాట్లు పొందిన వారందరూ ఎటువంటి అదనపు వడ్డీలు, అపరాధ రుసుములు చెల్లించే అవసరం లేకుండా పాత ధర ప్రకారమే ప్లాటును సొంతం చేసుకోవచ్చు. నగదు చెల్లించే విధానంలోనూ ఉదారతను చాటింది ప్రభుత్వం. (చదవండి: సమానత్వం దిశగా ముందడుగు) ప్లాటు యజమాని ఏపీఐఐసీకి చెల్లించాల్సిన నగదును 3 పద్ధతుల ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. 90 రోజుల లోపు చెల్లించే వారికి ఎలాంటి వడ్డీ ఉండదు. 91వ రోజు నుండి 180 రోజులు (6 నెలల లోపు) చెల్లించే వారికి 4 శాతం నామ మాత్రపు వడ్డీని ప్రకటించారు. 181వ రోజు నుండి 2 సంవత్సరాల లోపు చెల్లించే వారికి 8 శాతం వడ్డీని ప్రకటించారు. అయితే పరిశ్రమలు స్థాపించాలని ముందుకు వచ్చిన దళిత పారి శ్రామికవేత్తలు బ్యాంకు రుణం పొందడంలో విఫలమైతే ప్రభుత్వమే హామీ ఉండి రుణాలు ఇప్పిస్తే ఈ వర్గాలకు మరింత మేలు జరుగుతుంది. - వి. భక్తవత్సలం డీఐపీసీ సభ్యులు, ఒంగోలు -
జగనన్న దసరా కానుక
సాక్షి, అమరావతి: ‘రాయితీలు ఎంతో ఉపయోగపడతాయి. కోవిడ్ సమయంలో రాయితీలు ఇచ్చి ఆదుకున్నారు. జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది’ అని పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించేందుకు ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల మనోగతం ఇలా ఉంది. రూ.కోటి సబ్సిడీ.. ఇదే తొలిసారి వైఎస్సార్ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. అయితే ఇవాళ్టి పాలసీ దేశంలోనే తొలిసారి. కోటి రూపాయల సబ్సిడీని ఎక్కడా ఇవ్వడం లేదు. నైపుణ్యాభివృద్ధి నుంచి ఉత్పత్తి వరకు అన్ని కోణాల్లోనూ ఆలోచించారు. ఎస్సీ, ఎస్టీలకు జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది. ప్రభుత్వంతో కలిసి మేం అడుగులు ముందుకు వేస్తున్నాం. డీఐసీసీఐ (దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నుంచి పూర్తి సహకారం అందిస్తాం. దేశంలోని దళిత పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. – నర్రా రవికుమార్, డీఐసీసీఐ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్సెంటివ్‌తో ఎంతో ఉపయోగం నేను నోట్బుక్లు తయారు చేస్తున్నాను. ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే మా యూనిట్ పని చేస్తుంది. ఈసారి కోవిడ్ వల్ల పాఠశాలలు ఆరు నెలలు వాయిదా పడ్డాయి. దీంతో యూనిట్ నడవక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన ఇన్సెంటివ్ ఎంతో ఉపయోగపడింది. నవరత్నాలు, ఇతర పథకాలతో ప్రతి కుటుంబంలో ఆనందం నిండింది. ప్రభుత్వ స్కూళ్లంటే ఉన్న చెడు భావన ఇప్పుడు పోయింది. – సి.సుజాత, సూరంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా రూ.21 లక్షల సబ్సిడీ పొందాను నా పరిశ్రమలో 25 మంది ఉపాధి పొందుతున్నారు. రూ.45 లక్షల యంత్రాలకు రూ.15 లక్షల సబ్సిడీ వచ్చింది. విద్యుత్ చార్జీలో కూడా సబ్సిడీ ఇచ్చారు. ఆ విధంగా దాదాపు రూ.21 లక్షల సబ్సిడీ వచ్చింది. కరోనా కష్టకాలంలోనూ చిన్నతరహా పరిశ్రమలను ఆదుకున్నారు. దీంతో విజయవంతంగా నా పరిశ్రమను నడిపించుకోగలుగుతున్నాను. వివిధ పథకాల కింద రూ.60 వేలకుపైగా లబ్ధి కలిగింది. – సీహెచ్ ఏసుపాదం, ఐఎంఎల్ పాలిమర్స్ కంపెనీ, పశ్చిమగోదావరి మమ్మల్ని నిలబెట్టారు నేను డిప్లొమా చేశాను. ఒక ఫార్మా కంపెనీలో 17 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత రూ.12 కోట్లు పెట్టుబడితో సీపీఆర్ కంపెనీ స్థాపించి, బల్క్ డ్రగ్‌లు తయారు చేస్తున్నాను. తొలి ఏడాది చాలా ఇబ్బంది పడ్డాను. ఓ వైపు బ్యాంక్ ఈఎంఐ.. మరోవైపు మార్కెట్ లేదు.. ఇంకోపక్క కోవిడ్.. ఈ సమయంలో మీరు ఇచ్చిన రీస్టార్ట్ ప్యాకేజి నాతో పాటు నా దగ్గర పని చేస్తున్న 50 మంది కుటుంబాలకు పునర్జన్మలాంటిది. – డి.రవికుమార్, విశాఖపట్నం -
స్వచ్ఛతకు పెద్దపీట: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: కాలుష్యం తగ్గించేందుకు పారిశ్రామిక వేత్తలు కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. గాంధీ జయంతి పురస్కరించుకుని విశాఖ స్వచ్ఛ మహోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ మహోత్సవ్-2020 అవార్డ్ గ్రహీతలకు ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షన్- 2021 కరపత్రాలు, సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. 2014లో రాజ్ ఘాట్ లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారని, ప్రజలంతా స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. ఎయిర్ సీడింగ్ ద్వారా కొండల్లో పచ్చదనం పెంపుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పొల్యూషన్ ఫ్రీ సిటీ గా విశాఖ ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి పథకంలోను మహిళలకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సుందర నగరం విశాఖ:ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే విశాఖపట్నం సుందర నగరమని పేర్కొన్నారు. విశాఖలో మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు హెలికాప్టర్స్ లో సీడ్ బాల్స్ ను కొండల్లో వదలడం ద్వారా మరింతగా పచ్చదనం పెంచవచ్చన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతోందని, మరింతగా అభివృద్ధి జరుగుతుందని ఎంపీ సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు: ఎంపీ సత్యవతి అనకాపల్లి ఎంపీ కె.సత్యవతి మాట్లాడుతూ ఏపీకి వలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపారు.ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వలంటీర్లకు ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మరింత అభివృద్ధి చెందుతుంది: ఎమ్మెల్యే వాసుపల్లి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 25 లక్షలు మొక్కలు నాటాలి అని సీఎం లక్ష్యం గా పెట్టుకున్నారని పేర్కొన్నారు. 23 శాతం నుంచి 33 శాతం అటవీ ప్రాంతం పెంపునకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు.. విశాఖ కమిషనర్ సృజన మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు, పర్యావరణ పరిరక్షణకు లక్ష విత్తన బంతులను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చెత్త నుంచి సంపదను సృష్టించుకుంటున్నామని, 50 వేల మందికి చెత్త బుట్టలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు నేడు సాయంత్రం 7 గంటలకు వలంటీర్లు, కార్యదర్శులను చప్పట్లతో అభినందించాలని ఆమె కోరారు. మంచి కోసం జరిగే మార్పులో వీరి పాత్ర చాలా కీలకమైందని ఆమె పేర్కొన్నారు. -
వచ్చే మూడేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి : వచ్చే మూడేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధి జరగనుందని, ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించనుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. త్వరలో రామాయపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెడతామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలపై ఎక్కువ శ్రద్ధపెట్టామన్నారు. చేపల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతుల కోసం 7 హార్బర్లను అధునాతనంగా నిర్మించనున్నామని వెల్లడించారు. మంగళవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ఆన్లైన్ సమావేశ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘45 వేల ఎకరాలలో శ్రీసిటీ తరహా సకల సదుపాయాలుండే ఇండస్ట్రియల్ ఎస్టేట్లను నిర్మిస్తాం. పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. రాష్ట్రంలోని అనువణువు శోధించి పరిశ్రమల ఏర్పాటులో వేగం కోసం రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించనున్నాం. ( ఐఎస్బీ ఒప్పందం చారిత్రాత్మకం : మేకపాటి) ఏ పరిశ్రమ వచ్చినా ఎక్కడ ఏర్పాటు చేయాలో రూట్ మ్యాప్ కోసం క్లస్టర్లుగా విభజన జరుగుతుంది. పరిపాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులతో ముందుకెళుతున్నాం. అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకున్న విశాఖ ఎయిర్ పోర్టును డిసెంబర్లో నిర్మాణ పనులు చేపడతాం. రోడ్లుంటే ఎయిర్ పోర్టులు లేకపోవడం, ఎయిర్ పోర్టులుంటే పోర్టులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు లేకుండా సమగ్రంగా అన్ని రవాణా సదుపాయాలపై శ్రద్ధ వహించాం. తిరుపతి ఎయిర్ పోర్ట్‌ను ఇంటర్నేషనల్ కార్గో హబ్‌గా, కర్నూలు ఎయిర్ పోర్ట్ త్వరలోనే ఆన్‌లైన్‌లోకి వస్తుంది. కడప విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకురానున్నాం. విజయవాడ విమానాశ్రామాన్ని విస్తరించనున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం. రానున్న 2-3 సంవత్సరాలలో 5 విమానాశ్రాయాలు పూర్తి సదుపాయాలతో అందుబాటులోకి వస్తాయి. ఒక్కో పోర్టుకు రూ.10వేల కోట్లలాగా...3 మేజర్ పోర్టులు, దాదాపు 2వేల కోట్లు వెచ్చించి 7 ఫిషింగ్ హార్బర్లు, 3 రాజధానులు, కారిడార్లు సిద్ధమవుతాయి. 175 నియోజకవర్గాల్లో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మారుమూల ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య లేకుండా రూ.30-40 వేల కోట్లు ఖర్చు చేసి వాటర్ గ్రిడ్ ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించనుంది’’ అని వెల్లడించారు. -
‘కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలి’
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలకు ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ఐఏఎస్ అధికారుల నుంచి.. కాంట్రాక్ట్ ఉద్యోగి వరకు ప్రభుత్వానికి తమ వంతు సాయం చేశారని పేర్కొన్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో 58 ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు 19 వేలకు పైగా పడకలను అత్యవసర చికిత్స కోసం అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కరోనా బాధితులకు వైద్యం చేసే వైద్యుల రక్షణ కోసం పీపీఈ కిట్స్‌ను విశాఖ జిల్లాలోనే తయారు చేసుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. (కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) రాష్ట్రంలో ప్రతి పేదవానికి వాలంటీర్ల ద్వారా రేషన్‌తో పాటు రూ.1000 సాయం అందించామని చెప్పారు. భౌతిక దూరం పాటించడంతోనే కరోనా నియంత్రణ సాధ్యమని ఆయన సూచించారు. పేదలెవరూ ఆకలితో ఉండకుండా పారిశ్రామికవేత్తలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నివారణకు విశాఖ పారిశ్రామికవేత్తలు రూ.4 కోట్ల నిధులను జిల్లా కలెక్టర్‌కు అందించారన్నారు. సీఎం సహాయ నిధికి రూ. కోటి రూపాయిలకి పైగా విరాళాలు ఇచ్చారని వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులతో శానిటైజర్లు, మాస్క్‌లు, వైద్య పరికరాలను ఇవ్వాలని ఆయన కోరారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం
సాక్షి, తాడేపల్లి: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్‌తో చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులు రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూలతలను పారిశ్రామికవేత్తల బృందానికి వివరించారు. డైరీ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్ ఆటోమేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల బృందం ఆసక్తి కనబరిచింది. -
ప్రభుత్వ పెద్దల హర్షాతిరేకాలు...
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పట్ల అటు ప్రభుత్వ వర్గాలు నుంచి ఇటు పారిశ్రామిక వర్గాల వరకూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారాలను తిరిగి గాడిలో పడేందుకు, మరింత ఉపాధి అవకాశాల కల్పనకు, అంతర్జాతీయంగా మందగమనంలోనూ భారత్‌ను తయారీ కేంద్రంగా చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం సాయపడుతుందని అభిప్రాయడుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతాయి అద్భుతమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలు దీర్ఘకాలంగా నిదానించిన ఆర్థిక వృద్ధికి తగిన ప్రేరణనిస్తాయి. మినహాయింపులు కూడా కలిపి చూస్తే మన పన్ను రేటు అమెరికా, దక్షిణాసియా దేశాలకు దీటుగా, పోటీనిచ్చేదిగా ఉంటుంది. మినహాయింపులను కూడా వినియోగించుకుంటే పన్ను రేటు చాలా తక్కువగా 15 శాతమే ఉంటుంది. పెట్టుబడులకు ప్రభుత్వ నిర్ణయాలు ప్రోత్సాహాన్నిస్తాయి. రూ.1.45 లక్షల కోట్లు నేరుగా కంపెనీల ఖజానాకు వెళతాయి. వాటిని తిరిగి పెట్టుబడులకు వినియోగించడం వల్ల వృద్ధికి ఊతం లభిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి కార్పొకు ప్రేరణ ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి తాజా శక్తి, ప్రేరణనిస్తాయి. – ధర్మేంద్ర ప్రదాన్, పెట్రోలియం మంత్రి చరిత్రాత్మక సంస్కరణ ఈ చరిత్రాత్మక సంస్కరణలు భారత్‌లో తయారీకి బలమైన ఊతమిస్తాయి. – స్మృతి ఇరానీ. మహిళా, శిశుఅభివృద్ధి మంత్రి ఇన్వెస్టర్లకు ఉత్సాహం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక రంగం అధిక వృద్ధి పథంలోకి అడుగుపెడుతుంది. – రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సాహసోపేత నిర్ణయం కార్పొరేట్ పన్ను తగ్గింపును సాహసోపేత నిర్ణయం. ఇది ఆర్థి క వ్యవస్థకు ఎంతో సా నుకూలం. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల ను కచ్చితంగా స్వాగ తించాల్సిందే. మనదగ్గరున్న ప్రతికూలతల్లో అధిక కార్పొరేట్ పన్ను రేట్లు కూడా ఒకటి. ఈ రోజు గణనీయంగా తగ్గించడం వల్ల థాయిలాండ్, ఫిలి ప్పీన్స్ వంటి వర్ధమాన దేశాలకు దగ్గరగా మన దేశాన్ని తీసుకెళుతుంది. దీనికితోడు సరళతర వడ్డీరేట్ల విధానం దేశాభి వృద్ధికి దోహదపడే అంశం. వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వంతో ఆర్బీఐ కలిసి పనిచేస్తుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక రంగానికి ఊతం ఆర్థిక రంగానికి ఊపునిస్తుంది. తయారీకి, మౌలిక సదుపాయాలకు గొప్ప ప్రేరణనిస్తుంది. ఈ అడుగు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ వృద్ధి) వృద్ధి తిరిగి 8–9 శాతానికి చేరుకునేందుకు సాయపడుతుందని బలంగా నమ్ముతున్నాం. భారత్‌లో వేలాది ఉ ద్యోగాల కల్పనకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మార్క్నుకుచే రుకునే ప్రయాణం ఎంతో ఆశాజనకంగా ఉంది. – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోటీకి సై... కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికా వంటి తక్కువ పన్ను రేటున్న దేశాలతో పోటీ పడేందుకు భారత కంపెనీలకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక వృద్ధికి, చట్టబద్ధమైన పన్నులను చెల్లించే కంపెనీలకు మద్దతుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంకేతమిస్తోంది. – ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో వృద్ధికి దోహదం వృద్ధి తిరిగి కోలుకునేందుకు, పెట్టుబడుల పునరుద్ధరణకు ఇదో గొప్ప అడుగు. సాహసోపేతమైన, అవసరమైన ఈ చర్యను తీసుకున్నందుకు ఆర్థిక మంత్రికి నా హ్యాట్సాఫ్. – కిరణ్ మజుందార్ షా, బయోకాన్ చైర్పర్సన్ తిరుగులేని సంస్కరణ... కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించడం అన్నది గడిచిన 28 ఏళ్లలోనే తిరుగులేని సంస్కరణ. కార్పొరేట్ కంపెనీల లాభాలకు తోడ్పడుతుంది. ఉత్పత్తుల ధరలు తగ్గేందుకు వీలు కల్పిస్తుంది. నూతన తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిస్తుంది. భారత్‌లో తయారీని పెంచుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ అపూర్వం, సాహసోపేతం ఎంతో కాలంగా ఉన్న డిమాండ్. దీన్ని నెరవేర్చడం అపూర్వమైనది, సాహసోపేతమైనది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ప్రేరణనిస్తుంది. తయారీని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక రంగంలో ఉత్సాహాన్ని పెంచుతుంది. – విక్రమ్ కిర్లోస్కర్, సీఐఐ ప్రెసిడెంట్ -
వర్సిటీల్లో పరిశోధన వెనకబడుతోందా?
విశ్వవిద్యాలయాల్లో బోధన పరిశోధన రెండు కళ్ళలాంటివి. పరిశోధన ప్రాముఖ్యత విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల బోధనపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. విశ్వవిద్యాలయాల పరిశోధన ఆర్థిక, సామాజికాభివృద్ధి, బోధనా పటిష్టతకు తోడ్పడుతుంది. అనేక దేశాలలో పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక విప్లవం విశ్వవిద్యాలయ పరిశోధనపై ఆధారపడి నడుస్తున్న దృష్టాంతాలు అనేకం. అదే విధంగా మనదేశంలో పారిశ్రామిక అభివృద్ధి విశ్వవిద్యాలయ పరిశోధనపై ఆధారపడి వుంది. విచిత్రమేమిటంటే పారిశ్రామికవేత్తలు మన దేశంలో విశ్వవిద్యాలయ పరిశోధన పటిష్టతకు ఎక్కువ చేయూతనివ్వలేదు. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధన పారిశ్రామిక వేత్తలకు ప్రత్యక్ష్యంగా ఉపయోగపడే విధంగా లేకపోవడం ఒక కారణం. సమాజాభివృద్ధికి కావల్సిన∙పరిశోధనా పరమైన అంశాలను విశ్వవిద్యాలయాల్లో చేపట్టకపోవడం ఒక విధమైన చేదు అనుభవం. ప్రభుత్వ ఆర్థిక సహాయం, పారిశ్రామికవేత్తల చేయూత విశ్వవిద్యాలయంలో పరిశోధనాభివృద్ధికి రెండు మూలస్తంభాలుగా భావించవచ్చు. కానీ ప్రభుత్వ ఆర్థిక సహాయం గత మూడు దశాబ్దాలుగా సన్నగిల్లి, పారిశ్రామికవేత్తలు పూర్తిగా విస్మరించడం వల్ల విశ్వవిద్యాలయ పరిశోధనా వ్యవస్థ కుంటుపడి ముందుకు నడవలేకపోతోంది. ఈ పరిశోధనా వ్యవస్థ పటిష్టం కాకపోవడానికి ఆర్థిక సహాయ లోపమే కాకుండా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పరిశోధనా పటిమ తగ్గడం ముఖ్య కారణంగా భావించవచ్చు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన పరిశోధనా ఫలాలు గత మూడు దశాబ్దాలుగా గణనీయంగా పడిపోయాయని మన గణాంకాలు చెబుతున్నాయి. ఈ విధమైన పరిస్థితి విశ్వవిద్యాలయాల ఉనికికే ప్రమాదకరమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే పరి శోధన విధానాలను సామాజికాభివృద్ధికి ఉపయోగంగా మలచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇవే విశ్వవిద్యాలయాల పేరు ప్రఖ్యాతులను విశ్వవ్యాప్తం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయ అధ్యాపక నియామకాలను పరిశీలించినట్లయితే 1990 తర్వాత పరిశోధన పటిష్టత లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మన ప్రభుత్వాలు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై అనేక విధాలుగా నిర్లక్ష్యం వహిస్తూండటం వల్ల వాటి ప్రమాణాలు దిగజారుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుత దుర్భర పరిస్థితిని మార్చాలంటే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది. ఇందులో ప్రధానంగా ప్రతిభ, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులను ఉపకులపతులుగా నియమించే ప్రక్రియ అత్యంత కీలకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల స్థితిగతులను పరిశీలిస్తే, ఉన్నతవిద్య ప్రమాణాలు గణనీయంగా తగ్గాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీలోని 20 విశ్వవిద్యాలయాల్లోనూ బోధన చాలా తక్కువ సంఖ్యలో ఉన్న సిబ్బందితో కొనసాగుతోంది. ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నేను 1977–78లో పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు దాదాపు 120 మంది పరిశోధక విద్యార్థులు ఉండేవారు. అప్పటికి యూనివర్సిటీగా గుర్తింపు లేదు. పీజీ సెంటర్‌గానే వుండేది. కానీ అప్పటి ఆచార్య బృందానికి బోధనపై ఎంత పట్టు ఉండేదో, అంతే స్థాయిలో పరిశోధనపై కూడా ఉండేది. ఇది అన్ని శాఖలకు వర్తించేది. విశ్వవిద్యాలయ హోదా పొందిన తర్వాత గత ముఫ్ఫై ఏళ్లలో వర్సిటీల్లో బోధన పటిమ, పరిశోధనా సామర్థ్యాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా బోధనా సిబ్బంది గణనీయంగా తగ్గిపోవడం, అదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడం. 1980వ దశాబ్దంలో దాదాపు 20 విభాగాల్లో 200 మంది బోధనా సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు దాదాపు 36 విభాగాల్లో 70 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఈ కారణంగా విశ్వవిద్యాలయంపై విద్యార్థులకున్న నమ్మకం సన్నగిల్లుతూ వచ్చింది. ఉపకులపతులు అనేక రకాలైన చట్టపరమైన, పాలనాపరమైన చిక్కుముడుల వల్ల అధ్యాపకుల నియామకాలు చేపట్టలేకపోయారు. పీజీ స్థాయిలో ప్రత్యేక పాఠ్యాంశాల బోధన లేకపోవడం వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విష వలయం నుండి బయటపడాలంటే ప్రస్తుత ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, బోధన సిబ్బంది నియామకాలు త్వరితగతిన చేపట్టాల్సి వుంది. ఏ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులైనా సరే వేగవంతం కావాలంటే ప్రధానమైన విశ్వవిద్యాలయాల్లో విద్యా విస్తరణ పటిష్టతతో ముందుకు వెళ్ళాల్సి ఉంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఉపయోగించుకొని విశ్వవిద్యాలయాల విశిష్టతను పెంపొందించి, విద్యాభివృద్ధికి, రాష్ట్రాల మానవవనరుల నైపుణ్యాభివృద్దికి కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రస్తుతం ఏపీలో, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బడ్జెట్ మానవ వనరుల అభివృద్ధికి కృషి చేసే దిశగా ప్రయత్నం చేస్తుండటం శుభసూచకం. ఈ ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం. వ్యాసకర్త: ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి, పూర్వ ఉపకులపతి, ఎస్కేయూ అనంతపురం, మొబైల్ : 94408 88066 -
‘రూ లక్ష కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్’
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం నేపథ్యంలో పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించేందుకు పరిశ్రమ ప్రముఖులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. మంత్రిని కలిసే వాణిజ్య ప్రముఖుల్లో ఉదయ్ కొటక్, బీకే గోయంకా, సజ్జన్ జిందాల్, అనిల్ ఖైతాన్, అజయ్ పిరమల్, సంగీతా రెడ్డి, దిలీప్ సంఘ్వి, సంజీవ్ పూరి, రిషబ్ ప్రేమ్జీలున్నారు. ఎగుమతులను ప్రోత్సహించే చర్యలు చేపట్టడం, సిమెంట్ , ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్‌పై జీఎస్టీ తగ్గింపు వంటి పలు డిమాండ్లను వారు ఆర్థిక మంత్రి ముందుంచనున్నారు. మధ్య,చిన్నతరహా పరిశ్రమల్లో సులభతర వాణిజ్యం పెంచేందుకు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ సూచీ ఆవశ్యకతను వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిసింది. మరోవైపు ఆర్థిక వ్యవస్ధను ఉత్తేజపరిచేందుకు రూ లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించాలని కూడా పారిశ్రామికవేత్తలు మంత్రిని కోరతారని సమాచారం. పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు అవసరమైన చర్యలపై మంత్రి ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. -
సిద్ధార్థ.. వినయశీలి, మృదుభాషి
న్యూఢిల్లీ: కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మృతిపై పారిశ్రామిక వర్గాలు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సిద్ధార్థ వినయశీలి, మృదుభాషి’’ అని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు నివాళులర్పించారు. ‘సిద్ధార్థ భార్య మాళవిక, ఆయన కుమారులు, ఎస్ఎం కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను‘ అని కిరణ్ షా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపార వైఫల్యాలతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు కుంగిపోరాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘సిద్ధార్థ స్ఫూర్తిదాయకమైన ఎంట్రప్రెన్యూర్, ఇన్వెస్టరు‘ అని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులకి నిదర్శనం: మాల్యా సిద్ధార్థ మరణంపై దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. రుణాలన్నీ తిరిగి పూర్తిగా కట్టేస్తానంటున్నా తనను కూడా అలాగే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకులకు ఎగవేసిన ఆర్థిక నేరస్థుడన్న ఆరోపణలతో మాల్యా ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘నాకు వీజీ సిద్ధార్థతో పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి. చురుకైన వ్యాపారవేత్త. ఆయన లేఖలోని అంశాలు ఎంతో కలిచివేసేవిగా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎలాంటివారినైనా దయనీయ స్థితిలోకి నెట్టేయగలవు. నేను పూర్తిగా డబ్బు కట్టేస్తానంటున్నా ఎలా వేధిస్తున్నారో కనిపిస్తూనే ఉంది. మిగతా దేశాల్లో రుణగ్రహీతలు ఏదో రకంగా రుణాలు కట్టేసేలా ప్రభుత్వం, బ్యాంకులు సహాయం అందిస్తాయి. కానీ నా కేసు విషయంలో నేను కట్టేసేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటున్నారు‘ అని మాల్యా వ్యాఖ్యానించారు. ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్లు.. సిద్ధార్థకు చెందిన కాఫీ డే నేచురల్ రిసోర్సెస్, టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్ల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కాఫీ డే నేచురల్ రిసోర్సెస్‌లో ఫండ్స్ పెట్టుబడులు రూ. 149 కోట్లు, టాంగ్లిన్‌లో రూ. 44 కోట్ల మేర ఉన్నట్లు మార్నింగ్‌స్టార్ సంస్థ రూపొందించిన నివేదికలో వెల్లడైంది. డీఎస్పీ క్రెడిట్ రిస్క్ ఫండ్ అత్యధికంగా కాఫీ డే నేచురల్ రిసోర్సెస్‌లో రూ. 132 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మరో 20 శాతం పడిన షేరు.. తాజా పరిణామాలతో బుధవారం కూడా కాఫీ డే షేరు మరో 20 శాతం పతనమైంది. ఇంట్రాడేలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో రూ. 123.25కి క్షీణించింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి కూడా. అటు ఎన్ఎస్ఈలో కూడా 20% పతనమై రూ. 122.75కి పడింది. రెండు రోజుల్లో సంస్థ మార్కెట్ విలువ రూ. 1,463 కోట్లు ఆవిరైపోయి.. రూ.2,604 కోట్లకు తగ్గింది. సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్తలతో మంగళవారం కూడా కాఫీ డే షేరు 20% పతనమైన సంగతి తెలిసిందే. -
పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్ఆర్ఐ హల్చల్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్‌నెం–12లో ఉంటున్న ఓ పారిశ్రామికవేత్త ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ ఎన్ఆర్ఐ సదరు ఇంటి యజమానికోసం గాలిస్తూ ఆయన భార్య, అడ్డువచ్చిన సెక్యురిటీ గార్డులను బెదిరించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్‌నెం–12లోని పారిశ్రామికవేత్త ఇంటికి వచ్చిన ఇద్దరు అపరిచితులు వచ్చి తాము సదరు పారిశ్రామికవేత్తను కలిసి బొకే ఇచ్చి వెళ్లడానికి వచ్చినట్లు సెక్యురిటి గార్డు కృష్ణకు చెప్పారు. అతను ఈ విషయాన్ని యజమానురాలికి చెప్పేందుకు లోపలికి వెళ్లగానే వారు ఇద్దరూ బలవంతంగా లోపలికి ప్రవేశించారు. దీంతో మీరెవరంటూ సదరు పారిశ్రామికవేత్త భార్య మంజులారెడ్డి ప్రశ్నిస్తుండగానే వారు ఇంటి ఫోటోలు తీస్తూ తమకు ఇంటి యజమాని రూ.18కోట్లు ఇవ్వాలని ఆయన ఎక్కడ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన ఇంట్లో లేరని చెప్పినా వినిపించుకోకుండా న్యూసెన్స్ చేశారు. ఆసభ్యంగా దూషిస్తూ తమకు రావాల్సిన రూ.18కోట్లు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని బెదిరించారు. దీంతో ఆమె సెక్యురిటీ గార్డులను పిలిచి పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి వెళ్లిన పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ప్రధాన నిందితుడు తన పేరు పొన్ విశాఖన్ అలియాస్ నిక్‌గా తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన తనకు ఆ ఇంటి యజమాని రూ.18కోట్లు ఇవ్వాలని ఈ విషయం అడగేందుకే వచ్చినట్లు చెబుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తమిళనాడుకు చెందిన విశాఖన్ ఆస్ట్రేలియాలో స్థిర పడినట్లు విచారణలో వెల్లడైంది. అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని చెన్నైకి చెందిన రాఖేష్ రాజ్‌గా తెలిపారు. నమోదు చేసిన పోలీసులు వారిరువురిని అరెస్ట్ చేశారు.