ఇంటర్నెట్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు: కేసీఆర్
ఇంటర్నెట్ ద్వారా సులభమైన పద్దతుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తామని పారిశ్రామిక వేత్తలలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్: ఇంటర్నెట్ ద్వారా సులభమైన పద్దతుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తామని పారిశ్రామిక వేత్తలలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు 21రోజుల్లోగా అనుమతులు ఇస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారు. ఒకట్రెండు అనుమతులకు తప్ప ఒకే రోజు అన్ని రకాల అనుమతులకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుసింది.
ప్రతి సాగునీటి ప్రాజెక్టులో పదిశాతం నీరు పరిశ్రమలకు కేటాయిస్తామని, పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. జెన్కో ద్వారా 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. చిన్న పరిశ్రమలకు జిల్లాల్లో అనుమతులిస్తామని కేసీఆర్ వెల్లడించారు.