industrial policy
-
పారిశ్రామిక పాలసీల్లో బడుగులకు మొండిచెయ్యి
సాక్షి, అమరావతి: నూతన పారిశ్రామిక పాలసీల్లో దళితులు, బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇంతకాలం వారికి అందిస్తున్న అదనపుప్రయోజనాల్లో భారీ కోత పెట్టింది. భూమి కొనుగోలు దగ్గర నుంచి పెట్టుబడి వ్యయం వరకు అదనపు ప్రయోజనాలు కల్పించకపోగా.. ఇప్పటివరకు ఉన్న వాటిని కూడా తీసివేయడంపై దళిత పారిశ్రామిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 32 పేజీల పారిశ్రామిక పాలసీల్లో కేవలం ఒకే ఒక వాక్యం ఎస్సీ, ఎస్టీల గురించి ప్రస్తావించి వదిలేశారంటే దళితులపై చంద్రబాబు ప్రభుత్వంకు ఎంత ప్రేముందో అర్థం చేసుకోవచ్చు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అదనంగా 5 శాతం పెట్టుబడి సాయం అని ప్రస్తావించారే తప్ప.. ఆ పెట్టుబడి సాయం పరిధిని మాత్రం పెంచలేదు. ఇతరులకు ఇస్తున్న విధంగానే పెట్టుబడి సాయం పరిమితిని ఉంచడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న పరిశ్రమల విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వం కొనుగోలు చేసే వస్తువులను ఎస్సీ, ఎస్టీలకు చెందిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నుంచి 4 శాతం తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసే దళితులకు అదనంగా 10 శాతం క్యాపిటల్ సబ్సిడీ అని పేర్కొన్నా ఇతరులకు అందిస్తున్న క్యాపిటల్ సబ్సిడీ రూ.7 కోట్ల పరిమితిని అదేవిధంగా ఉంచి పైసా కూడా పెంచకపోవడం ఈ ప్రభుత్వం దళితులపై చూపిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనమని దళిత్ ఇండ్రస్టియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మామిడి సుదర్శన్ ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ బడుగు వికాసం పేరిట దళితలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తే.. పొరుగున ఉన్న తెలంగాణ కూడా అదేవిధంగా భూమి కొనుగోళ్లలో రాయితీ ఇస్తోందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీ 4.0లో వీటన్నింటికీ మంగళం పాడారని విమర్శించారు. ప్రైవేటు పార్కులొస్తే రిజర్వేషన్లు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల నుంచి భారీ పరిశ్రమలకు వరకు అన్నిరకాల పారిశ్రామిక పార్కులను ప్రైవేటుపరం చేసే విధంగా పారిశ్రామిక పార్కుల పాలసీని ప్రవేశపెట్టడం ద్వారా దళితులు, బలహీన వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై ప్రభుత్వం నీళ్లుచల్లింది. ఇంతకాలం ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పార్కుల్లో 25 శాతం వరకు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండటమే కాకుండా తక్కువ ధరకు భూమిని కేటాయించేవారు. కానీ ఇప్పుడు పార్కులను ప్రైవేటు పరం చేస్తుండటంతో రిజర్వేషన్లకు అవకాశం లేకుండా పోయింది. ప్రైవేటు పారిశ్రామిక పాలసీల్లో రిజర్వేషన్లు కల్పించాలని దళిత సంఘాలు అనేకసార్లు విజ్ఞప్తి చేసిన కూటమి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఏపీఐఐసీ స్థానంలో ప్రైవేటు పార్కులను ప్రోత్సహిస్తూ ఎంఎస్ఎంఈ పాలసీలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ప్రతిపాదన ఏ విధంగా అమలు అవుతుందని దళితులు ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక పాలసీలలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీల ప్రతిపాదనలు » పరిశ్రమల్లో ఏర్పాటు చేసే వ్యయంలో అదనంగా 5 శాతం పెట్టుబడి రాయితీ » ఎంఎస్ఎంఈ పాలసీలో ప్రభుత్వ కొనుగోళ్లలో 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమల నుంచి కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తాం » 10 శాతం అదనపు క్యాపిటల్ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.7 కోట్లు. » పారిశ్రామిక పార్కుల్లో 20 శాతం స్థలాలు మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపు వైఎస్సార్ బడుగు వికాసంలో.. » పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కుల్లో భూమి విలువలో 50 శాతం రాయితీ. » భూబదలాయింపు చార్జీల్లో 25 శాతం, 100 శాతం స్టాంప్‌డ్యూటీ మినహాయింపు » తయారీ, సర్వీసు రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 45 శాతం. 9 శాతం వడ్డీ రాయితీ. » ఉత్పత్తి ప్రారంభించిన ఐదేళ్ల వరకు యూనిట్ ధరపై రూ.1.50 సబ్సిడీ » ఎంఎస్ఎంఈలకు 100 శాతం ఎస్జీఎస్టీ మినహాయింపు » మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ పరిశ్రమలకు 50 శాతం ఎస్జీఎస్టీ మినహాయింపు » ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సీడ్ క్యాపిటల్ అసిస్టెంట్ కింద 25 శాతం యంత్రాల కొనుగోలు వ్యయంపై రాయితీ » క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్లకు అయ్యే వ్యయంలో 100 శాతం రాయితీ. రాయితీలు విడుదలకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు -
రండి.. రండి.. దండుకోండి!
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ చేతిలో ఉన్న సుమారు 40,000 ఎకరాల విలువైన భూమిని అభివృద్ధి పేరిట తమకు కావాల్సిన ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేలా కూటమి ప్రభుత్వం పారిశ్రామిక పాలసీలను ప్రకటించింది. ఇంతకాలం ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి పరిశ్రమలకు అందిస్తుండగా, ఇప్పుడు పాలసీ పేరుతో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసింది. కనీసం 10 ఎకరాల నుంచి 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, 100 నుంచి 1,000 ఎకరాలపైన భారీ పారిశ్రామిక పార్కులను ప్రైవేటు రంగంలో నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రపదేశ్ ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీ విడుదల చేసింది. పూర్తిగా ప్రైవేటు భూముల్లో లేదా ప్రైవేటు – ప్రభుత్వ భూముల్లో, పూర్తిగా ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు సంస్థలు పార్కులను అభివృద్ధి చేస్తే వారికి ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్యాపిటల్ సబ్సీడీతోపాటు వ్యవసాయ భూ బదాలియింపు చార్జీలు, లేఔట్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల్లో 100 శాతం వరకు మినహాయింపు ఇవ్వనుంది. ఎంఎస్ఎంఈ పార్కుల్లో 35 శాతం వరకు, మెగా పార్కుల్లో అయితే భూమిలో గరిష్టంగా 10 శాతం వరకు ఇతర అవసరాలు అంటే హోటల్స్, నివాస గృహాలు, సర్వీస్ అపార్టమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ వంటి నిర్మాణాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది. పారిశ్రామిక పార్కు నిర్మాణం దశలను బట్టి మొత్తం అయిదు దశల్లో ఈ రాయితీలను విడుదల చేయనుంది. కాగా.. ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం సబ్సిడీలను 45 శాతం వరకు ఇస్తే కూటమి ప్రభుత్వం దాన్ని 35 శాతానికి తగ్గించింది. దీంతో పార్కుల నిర్మాణం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లడంతో తమకు భూ కేటాయింపులు ఉండవని దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మామిడి సుదర్శన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాలసీలో ముఖ్యాంశాలు» వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 2024–29 కాలానికి పారిశ్రామిక పాలసీ 4.0 విడుదల. ఇందులో వాస్తవ రూపంలోకి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు.» ఈ ఐదేళ్లలో రూ.83,000 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 175 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి. » తొలిసారిగా పీఎల్ఐ సబ్సిడీ, ఎంప్లాయిమెంట్ సబ్సిడీ, డీ–కార్బనైజేషన్ సబ్సిడీలు. మొత్తం పెట్టుబడిలో సబ్సీడీలు 75 శాతానికి పరిమితం.» పాలసీ ఐదేళ్ల గడువును మరింత పెంచే అవకాశం. సవరణలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. » కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలతో పాటు ఇప్పటికే పెట్టుబడులు పెట్టి.. కొత్తగా విస్తరణ చేపట్టే వారికి ఈ పాలసీ వర్తిస్తుంపు. » 2023–27 పాలసీ కింద అనుమతులు పొందిన వారికి పాలసీ కాల పరిమితి తీరే వరకు రాయితీల వర్తింపు. » రూ.50,000 కోట్ల పెట్టుబడి.. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పాలసీ 4.0.వైఎస్ జగన్ ప్రభుత్వ విజయాలివి..» గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సాధించిన విజయాలను పారిశ్రామిక పాలసీలో ప్రముఖంగా పేర్కొన్నారు. » లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్) 2023లో కోస్తా తీర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎచీవర్స్ స్థానంలో నిలిచింది.» నీతీ ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం ఎగుమతుల సన్నద్ధతలో రాష్ట్రం 8వ స్థానానికి ఎగబాకింది.» దేశ వ్యాప్తంగా టాప్ 100 ఎగుమతి జిల్లాల్లో 8 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి.» ఇందులో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు ఎగుమతుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి.» నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2023–24 నివేదిక ప్రకారం రాష్ట్రం 10వ స్థానంలో నిలిచింది. అందుబాటు ధరలో విద్యుత్ సరఫరాలో మొదటి స్థానం, నీటి లభ్యతలో రెండవ స్థానంలో నిలిచింది.» ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ 2023 ప్రకారం రాష్ట్రం ఏడవ స్థానంలో నిలిచింది.రాష్ట్ర ఎగుమతులు రూ.16,600 కోట్లేనట!» ప్రస్తుతం రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.16,600 కోట్లని, వీటిని 2028–29 ఆర్థిక సంవత్సరానికి రూ.33,200 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ఈ పాలసీలో పేర్కొనడం పట్ల అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.1.66 లక్షల కోట్లుగా ఉంటే వాటని కేవలం 16,600 కోట్లుగా పేర్కొనడం గమనార్హం. » భారీగా పెట్టుబడులను చూపించాలన్న తాపత్రయంలో వాస్తవాలను వదిలివేశారు. ఒకపక్క రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పుతున్నప్పుడు అంత తక్కువగా 5 లక్షల ఉద్యోగాలేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీ ప్రకారం రూ.7 కోట్ల పెట్టుబడికి ఒక్క ఉద్యోగం మాత్రమే వస్తుందా? అని అధికార వర్గాల నుంచే సందేహాలు వ్యక్తమయ్యాయి. -
Big Question: పెట్టుబడులు లేవు.. ఉద్యోగాలు లేవు.. బాబు సరికొత్త మోసం..
-
త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ
సాక్షి, హైదరాబాద్: ప్రజలు కోరుకున్న మార్పును తీసుకురావడంలో భాగంగా అందరి సలహాలు, సూచనలతో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) తోడ్పాటును అందిస్తామని భరోసానిచ్చారు. వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఎఫ్‌టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులతో బుధవారం శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. చైనా కంటే ఉత్తమంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజం కల్పించడంతోపాటు అర్బన్, రీజనల్, సెమీ అర్బన్ క్లస్టర్లుగా విభజించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. డ్రైపోర్ట్ విషయంలోనూ త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని, నల్లగొండ నుంచి పాత ముంబై హైవే ప్రాంతాలను అనుసంధానం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి న హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధితో లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ‘ప్లాన్ 2050’అమలు చేస్తామన్నారు. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన హైదరాబాద్‌ను అభివృద్ధి చెందిన దేశాలు కూడా గుర్తించేలా ‘ఫార్మా ఇండస్ట్రీ హబ్’గా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో తయారైన క్షిపణులు ఇజ్రాయెల్‌కు ఎగుమతి అవుతున్న వైనం రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి అద్దం పడుతోందన్నారు. అదానీ కంపెనీ వ్యవహారంలో కొంతమంది కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపైనే తమ ఆలోచన ఉంటుందని శ్రీధర్‌బాబు అన్నారు. -
Andhra Pradesh: పారిశ్రామిక అభివృద్ధిలో నూతన విప్లవం
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో నూతన విప్లవానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 2023–27 సంవత్సరాలకు రూపొందించిన ఈ పాలసీని పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆవిష్కరించడం విశేషం. పాత పాలసీ గడువు ముగియకముందే కొత్త పాలసీని ప్రకటించడం కూడా ఇదే తొలిసారి. సోమవారం విశాఖలో పారిశ్రామికవేత్తలతో కూడిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాధ్ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాత్మక ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. నూతన విధానం పారిశ్రామికాభివృద్ధిలో విప్లవాన్ని సృష్టిస్తుందని పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 31తో పాత విధానం ముగియనుండటంతో ఏప్రిల్ 1 నుంచి నూతన పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జేడీ రామలింగరాజు, డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీఐడీసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఏపీ :మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా, నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు పాలసీ కాల పరిమితి పూర్తయినప్పటికీ కూడా కొత్త పాలసీని తేవడానికి కొంత సమయం తీసుకుంటాయి. దీనివలన పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇకపై ఈ పరిస్థితి ఉండకూడదని, పాత పాలసీ ముగియకముందే కొత్తది అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనపై తనకున్న నిబద్ధతను సీఎం జగన్ చాటుకున్నారు. కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన రంగాలకు పెద్దపీట వేశాం. పారిశ్రామిక రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్, వైద్య పరికరాల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనవనరుల రంగాల్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో రూ.15 వేల కోట్ల జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు, వీటిని ఆనుకుని సుమారు 48 వేల ఎకరాలలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. జల రవాణాను కూడా ప్రోత్సహిస్తున్నాం. పీపీపీ కింద ఇండస్ట్రియల్ పార్కులతో పాటు ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నాం. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌ని అన్ని పరిశ్రమలకు తీసుకొస్తాం. ఇన్నోవేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు విశాఖలో ఐ స్పేస్ పేరుతో ఐకానిక్ టవర్ నిర్మించనున్నాం. నూతన పారిశ్రామిక విధానాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పడాలి. దుబాయ్ తరహాలో ఇండస్ట్రియల్ పార్క్ : స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు అన్ని వర్గాల పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే అత్యుత్తమ పారిశ్రామిక విధానమిది. పరిశ్రమల్ని ఏపీలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి, ఇక్కడి ప్రత్యేకతలు, వనరులు మొదలైన అంశాలన్నీ తెలిసేలా నూతన విధానాన్ని రూపొందించాం. కొత్త పాలసీ ద్వారా వైజాగ్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణల్ని, స్టార్టప్‌లకు చేయూతనందిస్తాం. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆర్ అండ్ డీ సెంటర్స్‌ని ప్రోత్సహిస్తాం. పాలసీ అద్భుతంగా ఉంది:సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ ప్రస్తుత పాలసీకంటే అద్భుతంగా కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఒక పారిశ్రామికవేత్త ఏం కోరుకుంటారో వాటన్నింటినీ ఇందులో పొందుపరిచారు. లాజిస్టిక్స్ రంగానికి ప్రాధాన్యమివ్వడం అద్భుతం : శ్రవణ్ షిప్పింగ్ ఎండీ సాంబశివరావు 2023–27 పారిశ్రామిక విధానంలో అనేక నూతన అవకాశాలు, వనరులు, ప్రోత్సాహకాలు అందించారు. ఇది పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసినట్లే. దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తన్న లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట : ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పైడా కృష్ణప్రసాద్ నూతన విధానం అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేలా రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతోపాటు ఎస్జీఎస్టీ 100 శాతం రీయింబర్స్మెంట్ మంచి సంకేతం. పరిశ్రమలకు కావాల్సింది మౌలిక వసతులే:ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర పరిశ్రమలు ఆర్థిక రాయితీలకంటే మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనికి అనుగుణంగా నూతన పాలసీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక మౌలిక వసతులు, సులభతర వాణిజ్యంకు పెద్ద పీట వేయడాన్ని స్వాగతిస్తున్నాం. పరిశ్రమలకు ఊతమిచ్చే పాలసీ :సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ ఎం.లక్ష్మీ ప్రసాద్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉంది. భారీ పరిశ్రమల నుంచి ఎంఎస్ఎంఈల వరకు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. పరిశ్రమలకు చెందిన 96 అనుమతులు ఒకే చోట లభించేలా వైఎస్సార్ ఏపీ వన్ యాప్‌ను తేవడం హర్షణీయం. పోర్టు ఆధారిత వ్యాపారాభివృద్ధి, ప్రపంస్థాయి మౌలిక వసతులు, రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీల నిర్మాణం, ప్రైవేటు రంగంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టార్టప్‌ల కోసం ఐ–స్పేస్ పేరుతో టవర్ నిర్మాణం వృద్ధికి దోహదం చేస్తాయి. నూతన విధానంలో ప్రధానాంశాలు.. ♦ ప్లగ్ అండ్ ప్లే విధానానికి అనుగుణంగా పాలసీ ♦ వనరుల ఆధారంగా అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ♦ వ్యాపారాన్ని సులభతరం చేయడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం ♦ పరిశోధనలకు చేయూత, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ♦ తయారీ, అనుబంధ రంగాలు సహా అన్ని రకాలపరిశ్రమల పెట్టుబడిదారులకు పలు రాయితీలు ♦ ఎర్లీబర్డ్ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ♦ ఎలాంటి ఆంక్షలు లేని పెట్టుబడుల వాతావరణం ♦ లో కాస్ట్, లో రిస్క్ బిజినెస్ ♦ పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి ♦ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ♦ అంతర్జాతీయ కనెక్టివిటీ, తయారీ రంగంలో ఎకో సిస్టమ్ ♦ దుబాయ్ తరహాలో బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి ♦ పర్యావరణ పరిరక్షణ, అన్ని జిల్లాల్లోనూ పారిశ్రామిక వికేంద్రీకరణ ♦ తొలిసారిగా ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌లో భూ కేటాయింపులు, రద్దు మొదలైనవి -
వైఎస్సార్ ఏపీ 1 పోర్టల్‌ను ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023- 27 వైఎస్ఆర్ ఏపీ 1 పోర్టల్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, డైరెక్టర్ సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నూతన ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనలో పారిశ్రామిక వేత్తల ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. ఎకనామికల్ గ్రోత్ అనేది ప్రధాన అంశంగా తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ ఏపీ పోర్టల్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో పాటు మూడు వారాల్లోనే పరిశ్రమలకు భూమి కేటాయింపు ఉంటుందన్నారు. దేశంలో 3 కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామన్నారు. విశాఖ వేదికగా జీ20 సదస్సుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు రేపట్నుంచి 30 వరకు జరగనుంది. ఇందుకు 40 దేశాల నుంచి 200 మంది దేశ, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖలో జీఐఎస్ విజయవంతం కాగా జీ20 సదస్సును కూడా అదే రీతిలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను అత్యంత సుందరంగా జీవీఎంసీ అధికారుల తీర్చిదిద్దారు. -
తొమ్మిది మిషన్స్‌తో ఏపీ కొత్త పారిశ్రామిక పాలసీ.. వివరాలు ఇవిగో..
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ 2023 – 27 పారిశ్రామిక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం తొమ్మిది మిషన్లను నిర్దేశించుకుని పూర్తిస్థాయి పారిశ్రామిక ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేలా పాలసీలో పలు ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమలకు తక్కువ వ్యయంతో అన్ని మౌలిక వసతులతో కూడిన భూములను అందుబాటు ధరల్లో అందించనున్నారు. ఇందుకోసం నాలుగేళ్లలో మూడు లక్షల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. పబ్లిక్, ఫ్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు స్టార్టప్‌లు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేలా ప్రత్యేక వ్యవస్థను ప్రోత్సహించనున్నారు. ఇదే సమయంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలతోపాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా పాలసీని రూపొందించారు. సమానంగా అభివృద్ధి చెందేలా.. నాలుగేళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023 – 27 పారిశ్రామిక పాలసీ ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి అమల్లోకి రానుంది. గత మూడేళ్లలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుంటూ అంతర్జాతీయ మార్కెట్లకు సేవలు అందించేలా కొత్త పాలసీని రూపొందించినట్లు పరిశ్రమలు, మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా పాలసీలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివరాలు సేకరించి పరిశ్రమలు తక్కువగా ఉన్న చోట్ల మరిన్ని ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతిపాదన నుంచి ఉత్పత్తి దాకా.. రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు సింగిల్ విండో విధానంలో త్వరితగతిన అన్ని అనుమతులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. భూముల కోసం పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే ఏపీఐఐసీ భూమిని కేటాయిస్తుంది. పరిశ్రమలకు 33-66 ఏళ్ల కాలానికి లీజు విధానంలో భూమిని కేటాయిస్తారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన 10 ఏళ్ల తర్వాత భూములను కొనుగోలు చేసుకునే హక్కును కల్పించనున్నారు. ప్రభుత్వ సేవలన్నీ ఒకే గొడుగు కింద అందించే విధంగా వైఎస్సార్ ఏపీ వన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఎంఎస్ఎంఈలు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి సామర్థ్యం, ఉపాధి కల్పనను బట్టి రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పిస్తారు. మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు సంబంధించి వేగవంతంగా కార్యరూపం దాల్చేలా సీనియర్ అధికారిని ప్రత్యేకంగా కేటాయిస్తారు. ప్రాజెక్టు అమలులో ఈ అధికారి అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలను త్వరితగతిన వాస్తవ రూపంలోకి తెచ్చేలా సీఎస్ అధ్యక్షతన కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఒప్పందం జరిగిన రోజు నుంచి ఆర్నెల్లలో నిర్మాణ పనులు ప్రారంభించే సంస్థలకు ఎర్లీ బర్డ్ కింద ప్రోత్సాహకాలను కల్పించనున్నారు. చదవండి: ఏపీలో రూ.1,750 కోట్ల పెట్టుబడులు ఇవీ 9 మిషన్లు ♦ఎకనామిక్ గ్రోత్: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులను ఆకర్షించే విధంగా పూర్తిస్థాయి ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం. ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక వసతులతో పాటు లాజిస్టిక్ కల్పన, సులభతర వాణిజ్యం, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించనున్నారు. ♦పోర్టు ఆధారిత అభివృద్ధి: పోర్టు ప్రాంతాలు అభివృద్ధికి మూల స్థంభాలుగా ప్రణాళికలు. వీసీఐసీ, సీబీఐసీ, హెచ్‌బీఐసీ కారిడార్స్‌తో పాటు రైలు, రోడ్డు, అంతర్గత జలరవాణా మార్గాలను ప్రస్తుత పోర్టులతో పాటు కొత్తగా నిర్మించే పోర్టులకు అనుసంధానిస్తారు. ♦లాజిస్టిక్స్ వ్యవస్థను పెంచడం: సరుకు రవాణా వ్యయం తగ్గించే విధంగా రోడ్ రైల్ నెట్‌వర్క్‌ను పెంచడం. కోస్టల్ షిప్పింగ్, అంతర్గత జలరవాణా మార్గాలను ప్రోత్సహించడం. లాజిస్టిక్ పార్కుల అభివృద్ధితో పాటు గిడ్డంగులు, శీతలీకరణ గిడ్డంగులు సౌకర్యాలను పెంచడం. ♦రెడీ టు బిల్డ్ పార్కులు: పరిశ్రమలు తక్షణం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ప్రస్తుత పారిశ్రామిక పార్కులతో పాటు కొత్తగా వచ్చే పార్కుల్లో రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ స్పేస్‌లు, స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీస్ను అభివృద్ధి చేయడం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేట్ పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ పార్కులను నెలకొల్పడం. ♦పారిశ్రామిక సేవలన్నీ ఒకేచోట: ప్రభుత్వ విభాగాలకు చెందిన సేవలు, అనుమతులన్నీ ఒకేచోట లభించే విధంగా వైఎస్సార్ ఏపీ వన్ను అభివృద్ధి చేస్తారు. ♦ఉద్యోగ కల్పన: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సహించడంతోపాటు ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు చేయూతనివ్వడం. లార్జ్, మెగా, అల్ట్రా మెగా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందించే విధంగా శిక్షణ, ఉపాధి కోసం ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు. ♦నైపుణ్యం కలిగిన మానవ వనరులు: కనీస చదువులు పూర్తి చేసుకున్న యువతకు పరిశ్రమల్లో అవసరమైన రంగాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించేలా నైపుణ్య శిక్షణ కోర్సులను అందుబాటులోకి తెచ్చి సాఫ్ట్ స్కిల్స్‌ను పెంపొందిస్తారు. ♦స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహించడం: యువతను నూతన పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దే విధంగా మెంటారింగ్ కార్యక్రమాలు, స్టార్టప్ జోన్స్, స్టార్టప్‌లకు రాయితీలు, స్టార్టప్ ఫైనాన్సింగ్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ♦మహిళలు, బడుగు వర్గాలకు ప్రోత్సాహం: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం. వారిని గుర్తించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయూతనివ్వడం. పెట్టుబడుల ఆకర్షణకు దృష్టిసారించే ప్రధాన రంగాలు ►కెమికల్స్–పెట్రోకెమికల్స్ ► ఫార్మాస్యూటికల్స్–బల్క్ డ్రగ్స్ ►టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్ ►ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ►ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ►ఆగ్రో, ఫుడ్ ప్రోసెసింగ్ ► ఇంజనీరింగ్ అండ్ మెడికల్ డివైసెస్ ►డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ ►మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ►భవిష్యత్తు నాల్గవ తర్గతి పరిశ్రమలు తయారీ రంగం, బయోటెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ►రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించిన పరికరాల తయారీ -
నూతన పారిశ్రామిక విధానంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
తాడేపల్లి : స్టార్టప్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో సుమారు మూడు లక్షల చదరపు అడుగులతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలనీ సీఎం జగన్ ఆదేశించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, గుల్జార్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...: పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయి పట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలి న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలి అంతర్జాతీయంగా మార్కెటింగ్ టైఅప్ చేయగలిగితే ఎంఎస్ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతాం ఎంఎస్ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయి కాన్సెప్ట్ నుంచి కమిషనింగ్ మొదలుకుని మార్కెటింగ్ వరకు హేండ్ హోల్డింగ్‌గా ఉండాలి అడ్వైజ్, అసిస్ట్ అండ్ సపోర్టివ్‌గా ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలి స్టార్టప్ కాన్సెప్ట్‌ను మరింత ప్రోత్సహించాలి విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలి అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాలయం కూడా ఉండాలి స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పన దిశగా దృష్టిసారించాలి -
Andhra Pradesh: 'ఇండస్ట్రీ' రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ప్రోత్సాహకాల ఫలితంగా కోవిడ్ సంక్షోభంలోనూ 2021–22లో పారిశ్రామిక రంగంలో భారీ వృద్ధి నమోదైంది. సాధారణ పరిస్థితులున్న వేళ టీడీపీ హయాంలో 2018–19లో పారిశ్రామిక రంగంలో వృద్ధి 3.17 శాతంతో కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా ఇప్పుడు నాలుగు రెట్లకుపైగా పెరగడం గమనార్హం. 2021–22లో ఏకంగా 12.78 శాతంతో రెండంకెల వృద్ధినమోదైంది. సేవల రంగంలో 2018–19లో కేవలం 4.84 శాతం వృద్ధి నమోదు కాగా ఇప్పుడు 9.73 శాతం వృద్ధి సాధించడం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిదర్శనంగా నిలుస్తోంది. కోవిడ్ సంక్షోభం నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పూర్వ స్థాయికి చేరుకుంటోంది. కరోనా విపత్తు వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో భారీగా వృద్ధి నమోదైందని సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలో విశ్లేషించింది. తయారీ, నిర్మాణం, మైనింగ్, రవాణా రంగాలన్నింటిలోనూ వృద్ధి కారణంగా పారిశ్రామిక రంగం వృద్ధి 12.78 శాతానికి చేరుకుంది. ఉత్తమ విధానాలు, రాయితీలు, బకాయిల చెల్లింపు.. పారిశ్రామికంగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని తేవడంతో పాటు రాయితీలను సకాలంలో విడుదల చేసింది. కష్టకాలంలో పరిశ్రమలను ఆదుకుంది. గత సర్కారు హయాంలోని బకాయిలు కూడా చెల్లించడంతోపాటు ప్రోత్సాహకాలు, రాయితీల కింద దాదాపు రూ.2,300 కోట్లు పరిశ్రమలకు అందచేసి కరోనా సమయంలో అండగా నిలిచింది. సాధారణ కేటగిరిలో 1,046 ఎంఎస్ఎంఈలకు రూ.191.10 కోట్లు రాయితీగా ఇచ్చింది. ఓబీసీ కేటగిరిలో 479 ఎంఎస్ఎంఈలకు రూ.101.31 కోట్లు రాయితీలను అందచేసింది. ఎంఎస్ఎంఈలకు వైఎస్సార్ నవోదయం ద్వారా ఊరట కల్పించి ఏకంగా 1,78,919 ఖాతాల రుణాలను పునర్వ్యవస్థీకరించింది. 2021–22లో రూ.1,762.31 కోట్ల పెట్టుబడితో 5,907 ఎంఎస్ఈలు ఏర్పాటు కావడంతో 37,604 మందికి ఉపాధి లభిస్తోంది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పాక్షిక ఆంక్షలు, నిబంధనలు అమలు చేయడంతో సేవా రంగంలో కూడా 2021–22లో 9.73 శాతం వృద్ధి నమోదైంది. 21 రోజుల్లోనే అనుమతులు.. 2021–22లో రాష్ట్రంలో పది పెద్ద మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.2,030 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన మెగా ప్రాజెక్టుల ద్వారా 3,889 మందికి ఉపాధి లభించింది. ఎస్సీలకు చెందిన 2018 ఎంఎస్ఈలకు రూ.111.84 కోట్ల రాయితీలను, ఎస్టీలకు చెందిన 384 ఎంఎస్ఎంఈలకు రూ.24.40 కోట్ల రాయితీలను ప్రభుత్వం విడుదల చేసింది. 46 పెద్ద మెగా టెక్టైల్స్ పరిశ్రమలకు రూ.242.12 కోట్ల రాయితీలను ఇచ్చింది. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) నిబంధనల మేరకు పరిశ్రమలకు అన్ని అనుమతులను 21 రోజుల్లోనే అందిస్తోంది. ఎగుమతుల పనితీరును 2019–20లో 7వ ర్యాంక్ నుంచి 2020–21లో నాలుగో ర్యాంకుకు చేరడం ద్వారా మెరుగుపరుచుకుంది. 2020–21లో ఎగుమతులు 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే 13.8 శాతం వృద్ధి సాధించింది. జాతీయ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 5.8 శాతంగా ఉంది. 2030 నాటికి ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను పది శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా క్షీణించినా.. కరోనా సంక్షోభంతో దేశ స్థాయిలో వృద్ధి రేటు క్షీణించినప్పటికీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మాత్రం వృద్ధి నమోదవుతూనే ఉంది. స్ధిర ధరల ఆధారంగా చూస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 11.48 శాతం నమోదైంది. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,70,913 కోట్లకు చేరింది. వ్యవసాయ రంగానికి, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి ఏకంగా 11.27 శాతం నమోదైంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ పారిశ్రామికోత్పత్తికి ఎలాంటి విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే ఈ స్థాయిలో భారీ వృద్ధి రేటు నమోదైంది. కరోనా సెకండ్, థర్ద్ వేవ్‌లో వ్యాపార వర్గాలకు నష్టం కలగకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. – నీరజ్ శారద, చైర్మన్, సీఐఐ, ఏపీ చాప్టర్ పూర్వ స్థితికి చేరుకుంటున్నాం కరోనా సమయలో పారిశ్రామిక రంగం దెబ్బ తినకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామ కృషి చేసింది. దీంతో భారీ వృద్ధి రేటు నమోదయ్యింది. పరిశ్రమలు, సేవల రంగాలు పూర్వ స్థితికి చేరుకుంటున్నాయి. –సీవీ అచ్యుతరావు, అధ్యక్షుడు, ఫ్యాప్సీ -
దళితులను పారిశ్రామికవేత్తలుగా...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని బలంగా ఆకాంక్షించిన విషయం విదితమే. అందులో భాగంగా 2005లో రూపొందించిన పారిశ్రామిక విధానంలో తన ఆకాంక్షలకు అంకురార్పణ చేశారు. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అభివృద్ధి పరచిన పారిశ్రామిక వాడలలోని ప్లాట్లను ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు. రిజర్వేషన్లతో పాటు గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించారు. గరిష్టంగా 50 లక్షల మేర పెట్టుబడి రాయితీతో పాటు, విద్యుత్, వడ్డీరాయితీలు, స్టాంప్ డ్యూటీ, రీయింబర్స్మెంట్, ఏపీఎస్ఎఫ్లలో అడ్వాన్స్ సబ్సిడీ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా వందల సంఖ్యలో దళితులు వినూత్న పథకాలతో పరిశ్రమల స్ధాపనకు ముందు కొచ్చారు. 2012 వరకు ఈ వర్గాలు నగదు మొత్తం చెల్లించి ప్లాట్లు పొందే పద్ధతి అమలయింది. (చదవండి: బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా?) 2012లో నాటి ప్రభుత్వం యిచ్చిన 102 జీఓలో ప్లాటు ధర మొత్తంలో 25 శాతం చెల్లించి, రెండు సంవత్సరాలు మారటోరియం సదుపాయం పొంది, 10 సంవత్సరాలలో 8 కిస్తీలలో చెల్లించాలని నిర్దేశించారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మార్గదర్శకాలు రూపొందించడంలో అలసత్వం, 16.6 శాతం వడ్డీ విధించడం, లీజు కాలం కేవలం 10 సంవత్సరాలు కావడం వల్ల బ్యాంకుల నుండి ఎదురయ్యే ఇబ్బందులు, అధిక వడ్డీ వంటి సమస్యలు లబ్ధిదారులకు ఎదురయ్యాయి. ఈ అంశాన్ని ప్రస్తుత పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కారికాల వలవన్, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, అధికారుల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం ఈ వర్గాలకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జీఓఎమ్ఎస్ నం. 7ను 2022 ఫిబ్రవరి 5న విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం 2008 నుండి 2020 మార్చి 31 వరకు పారిశ్రామికవాడ లలో ప్లాట్లు పొందిన వారందరూ ఎటువంటి అదనపు వడ్డీలు, అపరాధ రుసుములు చెల్లించే అవసరం లేకుండా పాత ధర ప్రకారమే ప్లాటును సొంతం చేసుకోవచ్చు. నగదు చెల్లించే విధానంలోనూ ఉదారతను చాటింది ప్రభుత్వం. (చదవండి: సమానత్వం దిశగా ముందడుగు) ప్లాటు యజమాని ఏపీఐఐసీకి చెల్లించాల్సిన నగదును 3 పద్ధతుల ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. 90 రోజుల లోపు చెల్లించే వారికి ఎలాంటి వడ్డీ ఉండదు. 91వ రోజు నుండి 180 రోజులు (6 నెలల లోపు) చెల్లించే వారికి 4 శాతం నామ మాత్రపు వడ్డీని ప్రకటించారు. 181వ రోజు నుండి 2 సంవత్సరాల లోపు చెల్లించే వారికి 8 శాతం వడ్డీని ప్రకటించారు. అయితే పరిశ్రమలు స్థాపించాలని ముందుకు వచ్చిన దళిత పారి శ్రామికవేత్తలు బ్యాంకు రుణం పొందడంలో విఫలమైతే ప్రభుత్వమే హామీ ఉండి రుణాలు ఇప్పిస్తే ఈ వర్గాలకు మరింత మేలు జరుగుతుంది. - వి. భక్తవత్సలం డీఐపీసీ సభ్యులు, ఒంగోలు -
లోకల్ ఐటీకి బూస్టింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సంస్థలను పెద్దఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు స్థానిక ఐటీ సంస్థల నుంచే సంబంధిత సేవలను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2020–23 కింద స్థానిక ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేవిధంగా పలు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగంలోనూ స్థానిక సంస్థలను పెద్దఎత్తున ప్రోత్సహించే విధంగా కీలక చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూని కేషన్స్ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక లోకల్ ఐటీ రంగం నుంచే కొనుగోళ్లు .. ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు రూ.కోటిలోపు విలువైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఐటీ సర్వీసులను స్థా నిక ఐటీ సంస్థల నుంచి కొనుగోలు చేసే విధంగా ఐటీ పాలసీ 2021–24లో నిబంధన విధించారు. ఏటా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు కలిపి ఐటీ సేవలకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్ల విలువైన కొనుగోళ్లు చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా బయట రాష్ట్రాల నుంచే ఉంటుండ టంతో స్థానిక ఐటీ కంపెనీలను ప్రోత్సహించే విధంగా పలు ప్రతిపాదనలు చేశారు. కంపెనీలు రాష్ట్రంలో నమోదై కనీసం 50 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే నిబంధన విధించింది. అంతేకాదు రూ.కోటి విలువ దాటిన టెండర్ల ఖరారు సమయంలో సాంకేతిక మదింపు సమయం లో స్థానిక ఐటీ కంపెనీలకు 5 శాతం అదనపు ప్రా ధాన్యత కల్పించాలి. ఇందుకోసం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ప్రత్యేక పోర్టల్‌ను అందుబా టులోకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో పలు ఐటీ కంపెనీలు రాష్ట్రంలో నమోదు చేసుకోవడం ద్వారా ఇక్కడే నుంచే సర్వీసులు అందిస్తాయని.. తద్వారా పెద్దఎత్తున ఐటీ కంపెనీలను ఆకర్షించవచ్చని సీఐఐ ఏపీ చాప్టర్ మాజీ చైర్మన్, ఎఫ్ట్రానిక్స్ సీఈవో దాసరి రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. డేటా భద్రతకు అధిక ప్రాధాన్యత ప్రభుత్వ విభాగాల్లో వినియోగించే ఐటీ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ నాణ్యత, భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా డేటా సెంటర్ ఏ ర్పాటు చేయడంతో పాటు ఐటీ ఉత్పత్తులు, సేవల విషయంలో కేంద్రీకృత వ్యవస్థను ఏ ర్పాటు చేస్తోంది. ఇకనుంచి ప్రభుత్వ విభాగా లు కొనుగోళ్లకు సంబంధించి ఏపీటీఎస్‌ను అధీకృత ఏజెన్సీగా ఐటీ శాఖ నియమించిం ది. రూ.10 లక్షలు దాటి కొనుగోలు చేసే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్, ఐటీ సేవలను ఇకపై ఏపీటీఎస్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.10 లక్షల లోపు కొనుగోలు చేసే వాటికి రేట్ కాంట్రాక్ట్‌ను ఏపీటీఎస్ నిర్దేశిస్తుంది. ఐటీ భద్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రభుత్వం ఏకీకృత నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. ఈ మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో త్వరోలోనే ఐటీ శాఖ వీటికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించనుంది. -
ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఒకటవ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. (ప్రత్యేక హోదా సాధనపై ధృడసంకల్పంతో ఉన్నాం: సీఎం జగన్) -
‘ఏపీ నూతన పారిశ్రామిక విధానం హర్షణీయం’
సాక్షి, గుంటూరు: ఏపీలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ రావడం శుభపరిణామమని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వెల్లడించారు. 'వైఎస్సార్ ఏపీ వన్' పేరుతో మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడంపై సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుమతుల వేగవంతానికి వైఎస్ఆర్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ పారిశ్రామిక విధానంలో మెగా ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా రాయితీలు కల్పించడం.. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉందన్నారు. (చదవండి: త్వరలో ఐటీ పాలసీ విడుదల) ఈ పాలసీ 2020-2023 వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు లక్ష్మణరెడ్డి తెలియజేశారు.దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేలా సులువైన నిబంధనలతో ఈ కొత్త విధానం తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వేత్తలను, నైపుణ్యం ఉన్న యువతను ఈ పరిశ్రమలకు అందించటమే లక్ష్యంగా నూతన విధానం ఉపకరిస్తుందని తెలిపారు. ప్రస్తుత పారిశ్రామిక విధానం ఈ ఏడాది మార్చితో గడువు పూర్తవుతుందని.. అమలు సాధ్యం కాని అంశాలను గత ప్రభుత్వం అందులో చొప్పించడం బాధాకరమని ఆయన అన్నారు. (చదవండి: సమగ్ర అభివృద్ధికి ‘వైఎస్సార్ ఏపీ వన్’: గౌతమ్‌రెడ్డి) ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని సరళంగా రూపొందించిందని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దే ఈ పాలసీ లక్ష్యమన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. పారిశ్రామిక రంగంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని.. మహిళల్ని ప్రోత్సహించేలా కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చారని తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన యువతను అందించడంతో పాటు, కొత్త పాలసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని లక్ష్మణరెడ్డి వివరించారు. -
రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విడుదల
సాక్షి, అమరావతి : 2020-23 పారిశ్రామిక విధానానికి సంబంధించి రేపు కొత్త ఇండస్ట్రియల్ పాలసీని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విడుదల చేయనున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఉ.11 గంటలకు పాలసీ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు..ఉపాధి కల్పించే పరిశ్రమలను బట్టే ప్రోత్సాహం అందనుంది. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులిచ్చే చర్యలు తీసుకుంటారు. భూముల కేటాయింపు, స్టాంప్ డ్యూటీ, రాష్ట్ర జీఎస్టీ, నాలా ఛార్జీలు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ అంశాలపై స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయనున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రెండు స్కిల్ వర్సిటీలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ల సమ్మిళితం కానున్నాయి. -
పారిశ్రామికాభివృద్ధికి దిక్సూచి
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. 2020–23కు రూపొందించిన పారిశ్రామిక విధానాన్ని సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా ఆవిష్కరించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంలో ప్రధానాంశాలు.. ► వెనుకబడిన వర్గాల మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి. ► ఇప్పటికే బాగా విస్తరించిన ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ రంగాలతోపాటు 10 కొత్త రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి. ► బొమ్మల తయారీ, ఫర్నీచర్, ఫుట్‌వేర్–లెదర్, మెషినరీ, ఎయిరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు. ► పెట్టుబడులు పెట్టినవారు నష్టపోకుండా పూర్తిగా హ్యాండ్ హోల్డింగ్ అందించేలా చర్యలు. అనేక రాయితీలు.. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు. ► కనీసం 10 మందికి ఉపాధి కల్పించే మహిళా పారిశ్రామికవేత్తలకు సగం ధరకే భూమి, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు, ఐదేళ్లపాటు విద్యుత్ సబ్సిడీతోపాటు అనేక రాయితీలు. ► సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు 100 శాతం స్టాంప్ డ్యూటీ, ఐదేళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ మినహాయింపుతోపాటు వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ, నాలా చార్జీలో కొంత మినహాయింపు. ► 2 వేల మందికిపైగా ఉపాధి కల్పించే పరిశ్రమలకు 100%, వెయ్యి నుంచి రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తే 75%, 1,000 మంది వరకు ఉపాధి కల్పిస్తే 50 శాతం జీఎస్టీ మినహాయింపు. ► మెగా ప్రాజెక్టులకు వాటి పెట్టుబడి ప్రతిపాదనలకనుగుణంగా అదనపు రాయితీలు. ► పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. ► నైపుణ్యం కలిగిన మానవవనరులను అందించడం కోసం 30 నైపుణ్య శిక్షణ కేంద్రాలు, రెండు స్కిల్డ్ వర్సిటీలు, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజ్. -
ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
-
ఉపాధి కల్పనే.. గీటురాయి
సాక్షి, అమరావతి: ఉపాధి కల్పనే పరిశ్రమల లక్ష్యం కావాలని, ఆ దిశగా ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలకే ప్రోత్సాహకాలు అందేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంత మందికి ఉపాధి లభించిందనే అంశం ఆధారంగానే వాటికి రాయితీలు ఇవ్వాలన్నారు. స్థానికంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే సూక్ష్మ, చిన్న పరిశ్రమలను మరింత ప్రోత్సహించాలని చెప్పారు. వాటికి పునరుద్ధరణ, చేయూత ఇవ్వడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో 2020–23 పారిశ్రామిక విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 2020–23 పారిశ్రామిక విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా విశాఖపట్నంలో హైఎండ్ ఐటీ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఐటీ రంగంలో ఈ యూనివర్సిటీ గొప్ప మలుపు అవుతుంది. ఈ యూని వర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, బోధన అంశాలపై ప్రఖ్యాత ఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎక్స్టెన్షన్ మోడల్స్‌పై దృష్టి పెట్టాలి. పరిశ్రమలు పెట్టే వారికి ఉద్యోగాల కల్పన ఆధారంగా రాయితీలు ఇచ్చేలా పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలి. స్థానికులను వాచ్మెన్, అటెండర్లుగా తీసుకుని.. వారికి శిక్షణ ఇచ్చి పై స్థాయికి తీసుకెళ్తే మరింత బోనస్ ఉండాలి. కాలుష్య నివారణ చాలా ముఖ్యం ►కాలుష్యం వెదజల్లే పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పరిశ్రమలకు ప్రోత్సాహం ఎంత ముఖ్యమో వాటి నుంచి కాలుష్య కారక పదార్థాలు వాతావరణంలోకి రాకుండా చూడడం కూడా చాలా ముఖ్యం. దీనికోసం బలోపేతమైన విధానాలను పాటించాలి. ► ఉద్యోగాల కల్పన, ప్రాంతాల మధ్య సమతుల్యత, పర్యావరణ సానుకూల అభివృద్ధిని సాధించడంపై పారిశ్రామిక పాలసీ దృష్టి సారిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు మరింత మెరుగ్గా నడిచేలా చేయడంతో పాటు విదేశీ పెట్టుబడులపైనా దృష్టి పెడుతున్నామన్నారు. ► మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కీలక చర్యల ద్వారా పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటునందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిశ్రమల స్థాపన కాలాన్ని తగ్గించడంలో భాగంగా మౌలిక సదుపాయాల వృద్ధి, వెనుకబడిన వర్గాల సామాజికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు పారిశ్రామిక పాలసీలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. -
పరిశ్రమలకు మంచి రాయితీలు
-
గొప్ప పాలసీని తీసుకొస్తున్నాం : మంత్రి మేకపాటి
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి చెప్పినట్లుగానే త్వరలో గొప్ప పారిశ్రామిక పాలసీని తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. పాలసీలో చెప్పిన ప్రతి ప్రోత్సాహకాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన సచివాలయంలో వైఎస్సార్ నిర్మాణ్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన పారిశ్రామిక పాలసీని సిద్దం చేసి సీఎం జగన్‌కు అందజేశామని చెప్పారు. సీఎం జగన్ చెప్పినట్లుగా గొప్ప పాలసీని రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు పారదర్శకంగా రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కువ ఉపాధి ఇచ్చే పరిశ్రమలకు మంచి రాయితీలు అందిస్తామన్నారు. మూడేళ్ల పాటు నూతన పారిశ్రామిక పాలసీ అమలులో ఉంటుందని, కోవిడ్ పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయని తెలిపారు. వైఎస్సార్ నిర్మాణ్ యాప్ ద్వారా సిమెంట్‌ను నిర్మాణ సంస్థలకు అందుబాటులోకి తెస్తామన్నారు. పరిశ్రమల శాఖలో ఐఏసీబీ నిపుణుల సేవలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ భవిష్యత్ కార్యాచరణపై నిపుణులతో అధ్యయనం చేయిస్తామని, రాబోయే ఏళ్లలో తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు సలహాలు ఇస్తారని మంత్రి తెలిపారు. -
పరిశ్రమల ఖిల్లాగా సింహపురి - మంత్రి మేకపాటి
సాక్షి, నెల్లూరు : నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. జిల్లాను పరిశ్రమల ఖిల్లాగా మార్చడమే కాకుండా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన కోసం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే అంశంపై దర్గామిట్టలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం రాష్ట్రానికి అదృష్టమన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమల స్థాపనలో ఎలాంటి విజన్‌లేకుండా పనిచేసిందని ఆరోపించారు. గడిచిన ఐదేళ్ల పరిపాలనలో, ల్యాండ్ పాలసీలోనూ విఫలం అయిందన్నారు. అన్ని శాఖలతో పాటు ఏపీఐఐసీ శాఖ తరుపున టీడీపీ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. ఈ అప్పును ఆ శాఖ ద్వారా ఉద్యోగాల కల్పన, పరిశ్రమల స్థాపన కోసం కాకుండా పసుపు–కుంకుమ వంటి పథకాలకు డైవర్ట్ చేసిందన్నారు. గత ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రస్తుతం మనమందరం ఆ భారాన్ని మోయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం ఒక పారిశ్రామిక వేత్తకు ఎకరా రూ.12లక్షలకు, పక్కనే మరో పారిశ్రామికవేత్తకు రూ.33 లక్షలకు అప్పగించిందన్నారు. ఇలాంటి తేడాలు గమనిస్తే పారిశ్రామికవేత్తలు ఎందుకు ముందుకు వస్తారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన పాలసీ తెస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలను అంబాని, అదాని, బిల్గేట్స్లాగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాలో ఏపీఐఐసీ వద్ద 26,688 ఎకరాల భూములు ఉండగా, 16,597 ఎకరాలు పారిశ్రామికవేత్తలకు ఇచ్చామని తెలిపారు. ఈ భూముల్లో 1275 కంపెనీలు పరిశ్రమలు పెట్టాయన్నారు. ఇంకా 12వేల ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉందన్నారు. పరిశ్రమల స్థాపనకు యువకులు ముందుకురావాలని కోరారు. పరిశ్రమ అంటే మాప్రాంతానికి తెలియదు ఉదయగిరి ప్రాంతంలో పరిశ్రమ అంటే ఏమిటో కూడా తెలియదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తమది మెట్టప్రాంతమన్నారు. బాగా వెనుకబడిన ప్రాంతమన్నారు. నీటి సౌకర్యం లేక పంటలు పండడం లేదని తెలిపారు. తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టే పనైతే తానొక్కడినే 30వేల ఎకరాల భూములు ఇప్పిస్తానన్నారు. ఇకనైనా తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. భూములు మావి...ఉద్యోగాలు మావి కావు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ పరిశ్రమలకు ఇచ్చిన భూములన్ని మావేనని తెలిపారు. అయితే ఉద్యోగాలు మాత్రం మావి కాదన్నారు. మంచి గాలిని మేము పరిశ్రమల వారికి అందజేస్తే వారు మాకు కలుషిత, దుర్గంధంతో కూడిన గాలిని ఇస్తున్నారని తెలిపా. నాయుడుపేటలో సీఎం జగన్మోహన్రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో తాను వినతి పత్రం అందజేస్తే అందుకు అనుగుణంగా స్థానికులకే 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించాడన్నారు. ఇకనైనా అందుకనుగుణంగా స్థానిక యువతకు ఉద్యోగాలు పరిశ్రమల్లో ఇవ్వాలన్నారు. అలాగే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. తడ ఐటీఐలో 10 ఎకరాల భూమి ఉందని ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దుగరాజపట్నం ఓడరేవును అభివృద్ధి చేయాలి తమ ప్రాంతంలో ఉండే దుగరాజపట్నం ఓడరేవును అభివృద్ధి చేసే ప్రాజెక్టు కేంద్రప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించి కేంద్రం వద్దకు పంపి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దుగరాజపట్నంను అభివృద్ధి చేయడం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. తమ ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాలని కోరారు. నీటి వసతి, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలి: పారిశ్రామికవేత్తలు పలువురు పారిశ్రామిక వేత్తలు మాట్లాడుతూ నాయుడుపేట, మేనకూరుసెజ్, అత్తివరం పరిశ్రమల ఏరియాలో పరిశ్రమలకు నీటి వసతి లేదన్నారు. పరిశ్రమలను విస్తరించడానికి తెలుగు గంగ ద్వారా నీటిని కేటాయిస్తూ గతంలో ఇచ్చిన జీఓను అమలు చేయాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల కోసం వేసిన పైపులైన్లు, రోడ్లు, తదితర నిర్మాణ పనుల్లో అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కృష్ణపట్నంపోర్టు పరిసర ప్రాంతాల్లోని ఆయిల్ పరిశ్రమల యజమానులు మాట్లాడుతూ తమకు విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉందన్నారు. రవీంద్రరెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ తాను సిలికా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు 25 ఎకరాలు కేటాయించాలని కలెక్టర్, వీఆర్వో, తహసీల్దార్ చుట్టూ నేటికి తిరుగుతున్నాన్నారు. తనకు భూములు కేటాయిస్తే 200 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. అయినా స్పందన లేదని తెలిపారు. మరికొంతమంది మందుల పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ హైదరాబాద్‌లో పొల్యూషన్ వల్ల ఇక అక్కడ పరిశ్రమలు విస్తరించేందుకు వీలులేదన్నారు. అందువల్ల నెల్లూరులో విస్తరించేందుకు మంచి అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇందుకు తమకు రాయితీలు కల్పించాలని కోరారు. ఇందుకు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమాధానమిస్తూ కృష్ణపోర్టు పరిశ్రమల యజమానులకు విద్యుత్తు ఇచ్చేందుకు అదనపు కండక్టర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మేనకూరు, నాయుడుపేట ప్రాంతాల్లోని సెజ్‌లకు జాతీయరహదారిని లింక్ చేస్తూ త్వరలోనే రోడ్లు నిర్మిస్తామన్నారు. తెలుగుగంగ నీటిని పరిశ్రమలకు కేటాయిస్తామన్నారు. విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వచ్చే సోమవారం మళ్లీ సమీక్షిస్తానని తెలిపారు. పరిశ్రమలకు దరఖాస్తు చేసుకున్న వారి 21 రోజుల్లోగా అనుమతులు ఇస్తామన్నారు. పరిశ్రమల వారికి ఎలాంటి ఇబ్బందులు రానీయబోమని తెలిపారు. జిల్లాను అటు చెన్నై, ఇటు బెంగళూరు కారిడార్లకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణ మంజూరు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్దార్ధజైన్ , ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌భార్గవ, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. బాహుబలి, సైరానరసింహారెడ్డిలాగా సీఎం, ఐటీ మంత్రి బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల పట్ల భారీ అంచనాలు ఉన్నట్టే యువకులైన సీఎం జగన్మోహన్రెడ్డి, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటì గౌతంరెడ్డిపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని ఏపీఐఐసీ చైర్మన్ రోజా పేర్కొన్నారు. ఆ అంచనాలకు తగిన విధంగానే ప్రజలకు మంచి సేవలు అందించేందుకు పని చేస్తున్నారన్నారు. ఒక్క దరఖాస్తు ద్వారానే పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు ఇస్తున్నారన్నారు. జిల్లాలో మేనకూరు సెజ్, నాయుడుపేట, అత్తివరం, తదితర 11 రకాల పరిశ్రమల పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 8 «థర్మల్ కేంద్రాలను స్థాపిస్తే వాటిలో 5 ప్రాజెక్టులకే 4823 ఎకరాలు కేటాయించామన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పరిశ్రమలు స్థాపించేందుకు ఉత్సాహం టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో వర్షాలే పడలేదని జలవనరుల శాఖామంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. సీఎంగా జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వర్షాలు కురుస్తున్నాయన్నారు. వర్షాలు కురిసినట్టే పరిశ్రమలు స్థాపించేందుకు అనేక మంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారన్నారు. ఇక్కడ రహస్యాలు ఉండవన్నారు. తమది పారదర్శక ప్రభుత్వమని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీశైలం నుంచి నెల్లూరుకు నీటిని తీసుకురావడంలో విఫలమయ్యామని ఆరోపణలు చేస్తున్న జిల్లా టీడీపీ నాయకులు కళ్లుతెరిచి చూడాలన్నారు. ఒక్క రోజులోనే సోమశిలకు 2.4 టీఎంసీల నీరు చేరుతున్నాయని తెలిపారు. సీఎం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారన్నారు. అందరం కలిసి కష్టపడి జిల్లాను పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో ఉంచుదామని తెలిపారు. -
బిల్‌గేట్స్, అంబానీలను తయారు చేస్తా: గౌతమ్ రెడ్డి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రపంచస్థాయి పరిశ్రమలు నెలకొల్పుతామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రెండు మూడు నెలల్లో తీసుకువచ్చే స్పష్టమైన పాలసీ విధానం ద్వారా పారిశ్రామికవేత్తలను త్వరలోనే బిల్ గేట్స్, అంబానీ, అదానీలుగా మారుస్తామని పేర్కొన్నారు. నెల్లూరులో బుధవారం జరిగిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' పారిశ్రామిక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ప్రతి మూడు నెలలకోసారి పరిశ్రమల సమస్యలు తెలుసుకుంటూ, వాటికి పరిష్కార మార్గాన్ని కనుగొంటామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణనిచ్చి శ్రామికశక్తి స్థాయిని పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కసరత్తు మొదలైందన్నారు. మాటలకే పరిమితమయిన గత ప్రభుత్వం రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వం ప్రజలను మాటలతో మభ్యపెట్టిందే తప్ప అభివృద్ధి చేయడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ లక్ష్యాలను, సాధించిన గణాంకాలను పరిశీలిస్తే వాళ్ల పాలన ఏ పాటిదో తెలుస్తుందన్నారు. పరిశ్రమలకు నీరు, విద్యుత్, ప్రోత్సాహకాలు ఏవీ చెల్లించకుండా మాట తప్పారని ఆరోపించారు. గత ప్రభుత్వ విధివిధానాల్లో లోపాల వల్లే ప్రస్తుత పారిశ్రామిక రంగంలో గందరగోళం నెలకొనడంతోపాటు పాలసీ ఆలస్యానికి కారణం అవుతోందన్నారు. వారికి ముందుచూపు లేకనే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. వాళ్లు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల ఒక తరం భవిష్యత్ అంధకారంలో పడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని అడ్డంకులను తొలగించి పరిశ్రమల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తయారు చేస్తామన్నారు. పరిశ్రమలు వెనక్కు వెళ్లట్లేదు: మంత్రి పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయనే వార్తలను మంత్రి ఖండించారు. పాత సమస్యలకు పరిష్కారం చూపాకే కొత్త పరిశ్రమలు స్థాపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం అదృష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. జలవనరుల శాఖ మంత్రిగా పదవి చేపట్టిన 2 నెలల్లోనే అనిల్ కుమార్ యాదవ్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా, ఎమ్మెల్యే వరప్రసాద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం.వీ శేషగిరి బాబు, ఇతర పరిశ్రమల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ : గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి : ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) మిల్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కి తరలిపోతుందన్న ప్రచారాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఖండించారు. పేపర్ మిల్లు వెనక్కి వెళ్లిపోయిందని వస్తున్న కథనాలు అవాస్తవమని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించవద్దని కోరారు. త్వరలోనే పరిశ్రమల శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసి ఇలాంటి దుష్ప్రచారాలకు తెరదించి నిజానిజాలేంటో ప్రజల ముందుంచుతామన్నారు. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానం తెస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సౌకర్యవంతమైన ప్రదేశం అని పెట్టుబడిదారులు భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అవినీతిరహిత, పారదర్శక పాలన దిశగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై పరిశ్రమల యాజమాన్యాలకు భరోసా ఉందన్నారు. ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఔట్ రీచ్ అవగాహన సదస్సులో దిగ్గజ పరిశ్రమలతో పాటు పలు పేరున్న సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచినట్లు మంత్రి వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల వ్యవధిలోనే ఏపీఐఐసీకి 800 పరిశ్రమల నుంచి దరఖాస్తులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేదిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పారదర్శక పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం కలిగించని రీతిలో పరిశ్రమలకు సానుకూలమైన విధానాలని ప్రవేశపెడతామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న అస్పష్టమైన విధానాలతో పరిశ్రమలశాఖ రూ.2500 కోట్లు బకాయిలు పడిందని దానివల్ల పెట్టుబడిదారులు గందరగోళంలో పడ్డారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని గత ప్రభుత్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలని మంత్రి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఆ బకాయిలు తీర్చే బాధ్యతను భుజాన వేసుకుందని, అంతేగాక రాబోయే రోజుల్లో ఇలాంటి లోపాయికారి ఒప్పందాలను, ఆచరణయోగ్యంకాని విధానాలను సహించబోమని మంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ విధానాలు నచ్చి అదాని కంపెనీ కృష్ణపట్నం పోర్టులో రూ.5500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడమే తమ ప్రభుత్వం పట్ల పరిశ్రమలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పరిశ్రమలకు, రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలగని రీతిలో తమ ప్రభుత్వం నూతన పాలసీ ప్రకటించేందుకు కొంత సమయం పడుతుందన్నారు. రెండు మూడు నెలల్లో ప్రకటించే కొత్త పాలసీ వల్ల ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు. పరిశ్రమలకిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందన్నారు. రాయితీలపై స్పష్టతనిచ్చి పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తామని చెప్పారు. ఐదేళ్లలో చేయాల్సిన పని చేయకుండా ఇప్పుడు కొందరు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాయితీలు చెల్లించకుండా రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చిన వారే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, వాటికిచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు అన్నింటిపై ఆర్థికశాఖ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా సమీక్షించిన అనంతరం మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. -
త్వరలో కొత్త కేంద్ర పారిశ్రామిక విధానం
సాక్షి, హైదరాబాద్: త్వరలో కేంద్రం కొత్త పారిశ్రా మిక విధానాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. తోలు పరిశ్రమ వంటి సంప్రదాయ రంగాల పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తు కలిగిన కొత్త రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడంపై కొత్త విధానం దృష్టి పెడుతుం దన్నారు. గురువారం రాయదుర్గంలో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. వస్తు ఉత్పత్తిలో ప్రత్యేకత సాధించిన జిల్లాలను గుర్తించి ఈ కొత్త విధానం ద్వారా ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. 100 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను అదనంగా విదేశీ మార్కెట్లకు పంపాలన్న లక్ష్యంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. దేశ తోలు పరిశ్రమల రంగాన్ని నవీకరించడం, పునరుద్ధరించడంలో భాగంగా ఎఫ్‌డీడీఐ భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సవాళ్ల ను ఎదుర్కొంటూ దశాబ్దాలుగా తోలు పరిశ్రమ దేశంలో మనుగడ సాధించగలిగిందని, విదేశీ పరిశ్రమల నుంచి ప్రస్తుతం ఎదురవుతున్న పోటీని సమర్థంగా అధిగమించాల్సి ఉందన్నారు. ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేలా.. తోలు పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం ఇప్పటికే రూ.2,600 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని సురేశ్ ప్రభు అన్నారు. ఆధునిక యంత్రాల కొనుగోళ్లు, శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నామన్నారు. కొత్త భవనంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించామని, దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇదొకటి అని చెప్పారు. తోలు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఆకర్షణీయ డిజైన్లు కీలకమని, ఇక్కడి విద్యార్థులు ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించే డిజైన్లకు రూపకల్పన చేసి తోలు వస్తువుల ఎగుమతుల పెంపునకు దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, వాణిజ్య శాఖ జాయింట్ సెక్రెటరీ అనిత, ఎఫ్‌డీడీఐ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్సిన్హా, కార్యదర్శి వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
-
ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల విప్లవం
-
ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల విప్లవం
సాక్షి, హైదరాబాద్: దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల కోసం ఒక ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొస్తా మని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలను ఆకర్షించడానికి పారదర్శక పారిశ్రామిక విధానాన్ని తెస్తామని, గ్రామ సచివాలయాల ద్వారా 1.5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి ‘జగన్ స్పీక్స్’ పేరుతో విడుదల చేసిన వీడియోను ‘ఫేస్బుక్’లో ఉంచారు. వివరాలు ఆయన మాటల్లో... ‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం సృష్టించాలని కృత నిశ్చయంతో ఉన్నాను. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే దాదాపు 22 సా ర్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ ఆయన పరిశ్రమలు, ఉద్యోగాల కోసం వెళుతున్నానని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. వాస్తవానికి ఆయన తన నల్లధనాన్ని దాచుకోవడానికే పోతున్నారు తప్ప నిజంగా పిల్లల ఉద్యోగాల కోసం మాత్రం కాదు. ఇన్నిసార్లు విదేశాలకు వెళ్లారు కదా! అసలు ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నిస్తున్నా. ఆయన నోరు తెరిస్తే అబద్ధం, మోసాలే. ఏపీలో అనువైన పరిస్థితులేవీ? ఆంధ్రప్రదేశ్‌కు ఏ పరిశ్రమ అయినా రావాలి అంటే... చంద్రబాబు మొహం చూసో, జగన్ మొహం చూసో పారిశ్రామికవేత్తలు రారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని రారు. తాము ఆంధ్రప్రదేశ్‌లో పెట్టే హోటల్, ఆసుపత్రి, పరిశ్రమకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా లేదా అని చూస్తారు. అసలు మన రాష్ట్రంలో ఇలాంటివి పెట్టడానికి అనువైన పరిస్థితులు ఎక్కడున్నాయి? విజయవాడ, గుంటూరు ప్రాంతానికి ఏ పారిశ్రామికవేత్తలైనా ఎందుకు వస్తారు? పెట్టుబడులు పెట్టేటప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో నెలకొన్న అనువైన పరిస్థితులతో బేరీజు వేసుకుంటారు. ఆ నగరాల్లో 60 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయి. అనువైన పరిస్థితులూ ఉన్నాయి. మరి అక్కడ కాకుండా మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారా? ఆ నగరాలన్నీ ఇప్పటికే ఒక దశ వరకూ అభివృద్ధి చెంది ఉన్నాయి. సహజంగానే అక్కడున్న పరిస్థితులను చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారు గానీ, మన దగ్గరకు ఎవరూ పెట్టుబడులతో రానే రారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి మన వద్దకు ఎవరైనా పెట్టుబడులతో రావాలంటే అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే సాధ్యమవుతుంది. ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ఆదాయపు పన్ను, జీఎస్టీలో మినహాయింపులు లభిస్తాయి. ఓ పదేళ్లపాటు ఆదాయపు పన్ను, జీఎస్టీలో మినహాయింపులు ఉన్నాయంటేనే ఎవరైనా వచ్చి ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు. చంద్రబాబు ఇప్పటికి 22 సార్లు విదేశాలకు పర్యటనలకు వెళ్లారు. అది కూడా ప్రత్యేక విమానాల్లో తన మందీ మార్బలంతో వెళ్లి సుమారు రూ.250 కోట్ల ప్రజాధనాన్ని నీటి పాలు చేశారు. విదేశాలకు వెళ్లడంలో చూపిన శ్రద్ధ, ఆసక్తి, చిత్తశుద్ధి, ప్రయత్నాల్లో కనీసం పది శాతం కనుక చంద్రబాబు ఇక్కడే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు వెళ్లి చేసి ఉంటే మన రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయా? అసలు చంద్రబాబు ప్రధానిని కలవనే కలవడు, అక్కడికి వెళ్లి అడగనే అడుగడు. ఇటీవల ఆయన మోదీని కలిసి ఏం అడిగారోనని ఆసక్తితో చూశాం. చంద్రబాబు మోదీకి రాసిన లేఖ, అంతకు రెండు రోజుల ముందు వారి పార్టీ ఎంపీలు రాసిన లేఖను కూడా చూశాం. కానీ ఎక్కడా ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే విషయంపై ఒక్క వాక్యమైనా ప్రస్తావించలేదు. రాష్ట్రాన్ని విభజించడానికి ముందుగా రాజ్యసభలో మనకు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ అది. కానీ ఈ హామీ అమలు కోసం చంద్రబాబు పది శాతం కూడా ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు గట్టి ప్రయత్నం చేసి ఉండి, ఆయన ప్రయత్నం వల్ల మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే చంద్రబాబు విదేశాలకు వెళ్లాల్సిన పనే లేదు. విదేశాల్లో ఉండే పరిశ్రమలే మన రాష్ట్రానికి వచ్చేవి. చంద్రబాబు సచివాలయంలో కూర్చుని ఉంటే విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వాళ్లంతట వాళ్లే వచ్చేవారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది పరిశ్రమలు వచ్చి ఉండేవి. ఈ పాటికే మన రాష్ట్రానికి లక్షలాది ఉద్యోగాలు వచ్చేవి. కానీ రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే... విశాఖపట్నంలో జరిగిన రెండు భాగస్వామ్య సదస్సుల్లో ఒకసారి రూ.5 లక్షల కోట్లు, మరోసారి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నపుడు నిజంగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీ’వద్ద ఎన్ని పరిశ్రమలు రిజిస్టర్ (నమోదు) అయ్యాయి అని చూస్తే... చంద్రబాబు పాలనలో ఈ మూడేళ్లలో సంవత్సరానికి సగటున రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు రాలేదని స్పష్టం అయింది. 2015లో రూ.4,500 కోట్లు, 2016లో రూ.9,500 కోట్లు, 2017లో రూ.4,450 కోట్లు పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్కలే ఇలా ఉంటే ఎక్కడ మన రాష్ట్రానికి రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఎక్కడి నుంచి వేల పరిశ్రమలు వచ్చాయి? బాబు నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలే చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే, మోసపూరితమైన మాటలే. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం రావాలంటే కచ్చితంగా ప్రత్యేక హోదా రావాల్సిందే. దానికోసం గట్టిగా పోరాడాలి. ఇవాళ కాకపోయినా రేపైనా సాధించి తీరుతాం. హోదా వచ్చినపుడు రాష్ట్రం ఒక్కసారి అభివృద్ధి పథంలోకి ఉన్నతస్థాయికి దూసుకెళ్తుంది. అందుకే వైఎస్సార్సీపీ దానికోసం పోరాడుతూనే ఉంటుంది. 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీ రాష్ట్రం విడిపోయేటపుడు ఏపీలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. కొన్ని పరీక్షలు పెట్టించారు. కానీ, అవి పోస్టింగ్‌ల వరకూ రాలేదు. కోర్టు కేసులనో... మరొకటనో ఆపేశారు. అసలు చంద్రబాబుకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశం, ఆలోచన లేవు. ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలను రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. ఎంపికైన వారిని ఖాళీల్లో నియమిస్తాం. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం చేపట్టాలని ఉంది. ఇవాళ గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. గ్రామ సర్పంచ్‌లకు విలువే లేకుండా పోయింది. ఇల్లు, పింఛను నుంచి మరుగుదొడ్డి మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటున్నాయి. రాజధాని భూములు, గుడి భూములు మొదలు అన్నింటా పై స్థాయిలో చంద్రబాబు లంచాలు తీసుకుంటుంటే కింది స్థాయిలో ఈ కమిటీలు దోచేస్తున్నాయి. అందుకే ఈ వ్యవస్థను మార్చేస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను ఏర్పాటు చేస్తాం. ఆ సచివాలయంలో ప్రతి గ్రామం నుంచి పది మంది పిల్లలను తీసుకుని వారి ద్వారా ప్రజలకు కావాల్సిన పథకాలను దరఖాస్తు చేసిన 72 గంటల్లో మంజూరయ్యేటట్లు చేస్తాం. అర్హత గల వారు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేస్తాం. 13,000 గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ప్రాంతాలు అన్నీ కలిపి సుమారు 15,000 వరకూ ఉంటాయి. వీటిలో 10 మందికి చొప్పున అవకాశం కల్పిస్తాం కనుక దాదాపు లక్షన్నర ఉద్యోగాలు ఈ గ్రామ సచివాలయాల్లోనే వస్తాయి. మరో విప్లవాత్మక మార్పు ఏమిటంటే మనం కష్టపడి తెచ్చే ఉద్యోగాలు స్థానికులకు దక్కడం లేదు. ఉదాహరణకు నెల్లూరు జిల్లా తడలో ఒక ఎస్ఈజెడ్ ఉంది. కానీ, మన పిల్లలకు విద్యార్హతలున్నా అందులో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఎక్కడో గుజరాత్‌లోనో మరొక చోటో ఉండే వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికులకు సెక్యూరిటీ గార్డు, ఇతర చిన్న ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక మన వద్ద పెట్టే పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా శాసనసభలో చట్టం తెస్తాం. చట్టం చేసి అన్ని పరిశ్రమలకూ సర్క్యులర్ పంపుతాం. మన పిల్లలకు 75 శాతం, స్థానికేతరులకు 25 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెబుతాం. పారదర్శక పారిశ్రామిక విధానం చంద్రబాబు పాలనలో తనకు నచ్చిన వారికే పారిశ్రామిక రాయితీలు ఇచ్చి, నచ్చని వారికి ఇవ్వడం లేదు. కానీ మనం వచ్చిన తరువాత తన, మన అనే భేదం లేకుండా పారిశ్రామికవేత్తలందరికీ రాయితీలు వచ్చేలా పారదర్శక పారిశ్రామిక విధానాన్ని తెస్తాం. ఈ విధానం చూడగానే పారిశ్రామికవేత్తలను ఆకర్శించేలా రూపొందిస్తాం. నిజంగా దేవుడు నా చేతులతో ఈ పనులు చేయిస్తాడని ఆశిస్తూ... నా చేతుల మీదుగా ఈ మంచి పనులు చేయాలని తపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. -
‘స్టార్టప్ ఇండియా’ ఇంకా స్టార్టింగ్‌లోనే !!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016, జనవరి నెలలో ‘స్టార్టప్ ఇండియా’ పేరిట కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించారు. పారిశ్రామిక రంగంలో ఔత్సాహికులను అన్ని విధాలుగా ప్రోత్సహించి భారత్‌ను అతిపెద్ద పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చేయడం ఈ విధానం లక్ష్యం. దీని కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు మోదీ ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలతో ఓ కార్పస్ నిధిని కూడా ఏర్పాటు చేసింది. స్టార్టప్ ఇండియా కింద పన్ను మినహాయింపులను ఇవ్వడంతోపాటు అనేక రాయితీలను కల్పించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుగుణంగా నిధులను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన కార్పస్ నిధి నుంచి నిధులను అందించే బాధ్యతను భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుకు అప్పగించింది. కార్పస్ నిధి కింద ఏర్పాటు చేసిన పదివేల కోట్ల రూపాయలను నాలుగేళ్ల కాలంలో ఖర్చుచేయాల్సి ఉంది. ఈ స్టార్టప్ ఇండియా పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్సాహాన్ని చూపాయి. దీన్ని ప్రారంభించి ఇప్పటికీ దాదాపు రెండేళ్లు కావొస్తుండగా, కేవలం 33 వేల స్టార్టప్‌ల ఏర్పాటుకే ఔత్సాహికవేత్తలు ముందుకు వచ్చారు. వాటిలో డిసెంబర్ 18వ తేదీ నాటికి 75 స్టార్టప్ కంపెనీలు మాత్రమే కార్యరూపం దాల్చాయి. వాటికి దాదాపు 605 కోట్ల రూపాయలను కార్పస్ ఫండ్ కింద విడుదల చేయడానికి అంగీకరించిన బ్యాంకు రూ.90.62 కోట్లను మాత్రమే విడుదల చేసింది. అందుకు బదులుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దాదాపు 337 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. ఈ వివరాలను వాణిజ్య, పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధరి ఈనెల 18న లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. నాలుగేళ్ల కాలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయంగా అందించేందుకు పదివేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించగా, రెండేళ్ల కాలంలో కేవలం రూ. 605 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు అందడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం 33 వేల స్టార్టప్ కంపెనీలు కార్యరూపం దాలుస్తాయని భావిస్తే 75 కంపెనీలే రావడాన్ని ఎలా పరిశీలించాలి? -
రోబోలు జాబ్‌లు మింగేయకుండా..
సాక్షి,న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్ ఉద్యోగాలను కొల్లగొట్టేస్తున్న క్రమంలో మానవ వనరులను కాపాడుకునేలా నూతన పారిశ్రామిక విధానాన్ని వెల్లడించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. 1991 పారిశ్రామిక విధానం, యూపీఎ సర్కార్ 2011లో ప్రకటించిన మ్యాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ స్ధానంలో నూతన పారిశ్రామిక విధానాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటిస్తామని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని చెప్పారు. దశాబ్ధాల కిందటి పారిశ్రామిక విధానాన్ని కాలానుగుణంగా ప్రక్షాళన చేయడంతో పాటు విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగి సంస్కరణల వేగం పెంచేందుకు నూతన విధానానికి రూపకల్పన చేస్తున్నట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో పారిశ్రామిక విధానం, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ చర్చా పత్రాన్ని జారీ చేసింది. భవిష్యత్‌కు సన్నద్ధంగా ఉండే పారిశ్రామిక విధానం అవసరమని పేర్కొంది. ఆటోమేషన్ దెబ్బతో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి..మరోవైపు వృద్ధి మందగమనంతో తగ్గుతున్న ఉపాథి అవకాశాల వంటి సవాళ్ల నేపథ్యంలో మెరుగైన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. -
తెలంగాణలో అత్యున్నత పారిశ్రామిక విధానం
హైదరాబాద్: తెలంగాణలో అత్యున్నత పారిశ్రామిక విధానం అమలులో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కె తారకరామారావు తెలిపారు. సోమవారం బేగంపేటలోని హరితప్లాజాలో పరిశ్రమలశాఖలో 2016-17లో జరిగిన కార్యక్రమాలపై వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. పరిశ్రమలశాఖ లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2016-17ఏడాదిలో గనులు, భూగర్భ వనరులు, చేనేత, జౌళిశాఖలకు సంబంధించిన పురోగతిని ఆయన వివరించారు. వివిధ క్యాటగిరీల్లో ఉత్తమ పారిశ్రామికవేత్తలను మంత్రి కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... టీఎస్ ఐపాస్‌కు నేటితో రెండేళ్లు పూర్తయ్యిందని, ప్రపంచంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసిన తరువాత సీఎం కేసీఆర్ టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పరిశ్రమలు తరలిపోతాయని కొందరు దుష్ప్రచారం చేశారని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. టీఎస్ ఐపాస్ విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమని, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లో అనుమతి ఇస్తున్నామని అన్నారు. టీఎస్ ఐపాస్‌తో ఇప్పటి వరకూ రెండు లక్షల 46 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
పరిశ్రమలకు ‘మహా’ ఆకర్ష!
► పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న మహారాష్ట్ర పారిశ్రామిక విధానం ► మహారాష్ట్ర పాలసీ నుంచి తెలంగాణ స్ఫూర్తి పొందాలి ► టీఎస్ఐపాస్ పారిశ్రామిక పురోగతిపై ఫ్యాప్సీ నివేదికలో సిఫారసు సాక్షి, హైదరాబాద్: ‘మహారాష్ట్ర పారిశ్రామిక విధానం కింద పరిశ్రమలకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. మహా రాష్ట్ర పారిశ్రామిక విధానం నుంచి తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తి పొందాలి. మహారాష్ట్ర ప్రభుత్వం తాలూకాలను ఏడు గ్రూపులుగా విభజించి తక్కువ అభివృద్ధి గల ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది’అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య సంఘాల సమాఖ్య (ఫ్యాప్సీ) పేర్కొంది. అభివృద్ధి స్థితిగతుల ఆధారంగా మహారాష్ట్రలో తాలుకాలను ఏ, బీ, సీ, డీ, డీ, పరిశ్రమలు లేని ప్రాంతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని ఏడు గ్రూపులుగా విభజించారని, సీ, డీ, డీ+, పరిశ్రమలు లేని గ్రూపుల్లోని ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలకు విద్యుత్ సుంకాన్ని సైతం ప్రభుత్వం మినహాయించిందని, యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్ సుంకం సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపింది. రాష్ట్రంలో రంగారెడ్డి, ఆ తర్వాత మరో నాలుగు జిల్లాల్లోనే పారిశ్రామికీకరణ కేంద్రీకృతమై ఉందని, మిగిలిన జిల్లాల్లో సైతం కొత్త పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర తరహా విధానాన్ని అవలంభించాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రా మిక అభివృద్ధిలో టీఎస్–ఐపాస్ ప్రభావంపై రూపొందించిన తాజా అధ్యయన నివేదికలో ఫ్యాప్సీ ఈ మేరకు కీలక సిఫారసులు చేసింది. ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు అరుణ్ లోకార్ఖ, కార్యదర్శి టీఎస్ అప్పారావు, సీనియర్ ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్‌తో కలసి అధ్యక్షుడు రవీంద్ర మోదీ మంగళవారం తమ కార్యాలయంలో ఈ నివేదికను ఆవిష్క రించారు. సమ్మిళిత పారిశ్రామికాభి వృద్ధి, సామాజిక సమానత్వం కోసం ఫ్యాప్సీ ఈ నివేదికలో సూచించిన ఇతర సిఫారసులు ఇలా ఉన్నాయి.. ♦ ప్రభుత్వం దృష్టిసారించాల్సిన 14 ముఖ్య రంగాలను గుర్తించాం. ఈ రంగాల్లో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సంబంధిత పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి నూతన విధానాలు రూపొందించాలి. ♦ వెనుకబడిన జిల్లాల ప్రజల్లో పారిశ్రామిక, వ్యాపార స్పృహ పెంపొందించేందుకు టీఎస్–ఐపాస్ ప్రయోజనాల పట్ల ప్రచార, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. ♦ టీ–ప్రైడ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రా మికవేత్తలకు అందిస్తున్న 50 శాతం సబ్సిడీని వెనకబడిన ప్రాంతాల జనరల్ కేటగిరీ పారిశ్రామికవేత్తలకూ విస్తరింపజేయాలి. ♦ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలను కాటన్ జోన్‌గా ప్రకటించి కొత్త స్పిన్నింగ్Š మిల్లుల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ♦ లెవీ విధానం రద్దుతో నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లులు మూతపడుతున్నాయి. ఫుడ్ పార్కులు, స్పైస్ పార్కుల ఏర్పాటుకు జిల్లా అనువైనది. ♦ గుజరాత్, మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పీపీపీ లేదా ప్రైవేటు యాజమాన్య విధానంలో ఉత్ప త్తుల(ప్రొడక్ట్) వారీగా పార్కులు ఏర్పాటును ప్రోత్సహించాలి. ♦ స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్‌ల్లో అందిస్తున్న కోర్సులు స్థానిక పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లు లేవు. అందుకు ఈ సంస్థల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేలా చూడాలి. ♦ ఉద్యోగులు, సిబ్బంది కొరతతో జిల్లా పారిశ్రామిక కేంద్రాల(డీఐసీ)న్నీ పరిశ్ర మలను ప్రోత్సహించడంలో విఫలమైపో తున్నాయి. జిల్లాలు 31కి పెరిగినా ఉద్యోగులను పెంచలేదు. అధికారుల పర్యటనలకు వాహనాలు లేవు. ప్రభుత్వం తక్షణమే నియామకాలు, సదుపాయాలు కల్పించాలి. టీఎస్–ఐపాస్‌తో వృద్ధి రేటు పెరిగింది.. టీఎస్–ఐపాస్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు అనూహ్యంగా పెరిగి రాష్ట్ర వృద్ధి రేటు(జీఎస్డీపీ) రెండంకెల మైలురాయికి చేరుకోడానికి దోహదపడిందని ఫ్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ కొనియాడారు. గతంలో 52 శాతం పరిశ్రమలు రంగారెడ్డి జిల్లాలోనే కేంద్రీకృతమై ఉండగా, టీఎస్ఐపాస్ రాకతో ఇతర జిల్లాల్లో కూడా కొత్త యూనిట్ల స్థాపన పెరుగుతోందన్నారు. టీఎస్ఐపాస్ కింద ఏర్పాటైన యూనిట్లలో 36 శాతం రంగారెడ్డి జిల్లాలో, 14 శాతం మెదక్, 12 శాతం కరీంనగర్, చెరో 9 శాతం వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటయ్యాయన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పరిశ్రమల స్థాపన ఆశించిన రీతిలో లేదన్నారు. -
పారిశ్రామిక విధానంలో లోపాలు
ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: పారిశ్రామిక విధానంలో లోపాలున్నాయని, చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి ఈ పారిశ్రామిక విధానం తోడ్పడటం లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల పునరుద్ధ రణకు జేఏసీ కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. శనివారం ఇక్కడ అఖిల భారత చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు 4,500 చిన్న, మధ్యతరహా పరిశ్ర మలు మూత పడితే, రాష్ట్రం వచ్చిన తర్వాత 2 వేలకుపైగా పరిశ్రమలను బ్యాంకులు బకా యిల పేరిట జప్తు చేసుకున్నాయన్నారు. వేల ఎకరాలను పెద్ద కంపె నీల కోసం సేకరిస్తున్న ప్రభుత్వం.. చిన్న పరిశ్రమల కు 250 గజాల స్థలం ఇవ్వడంలేదని ఆరోపించారు. -
ఐపాస్‌తో జొష్
ఆత్మకూరు, గీసుకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, రఘునాథపల్లి, సంగెం, జఫర్‌గఢ్, ములుగు, వెంకటాపురం, నెల్లికుదురు, మహబూబాబాద్, రేగొండ, మరిపెడ, కేసముద్రం, ఖానాపురం, కురవి, గణపురం, చేర్యాలలో పరిశ్రమల స్థాపనకు అనుకులించే స్థలాలు ఉన్నట్లుగా గుర్తించారు. రోడ్డు, రైలు రవాణా మార్గాలు ఉన్న ప్రాంతాలు ప్రామాణికంగా తీసుకున్నారు. - పారిశ్రామిక రంగం.. ఇక పరుగులు - నూతన పారిశ్రమికవేత్తల్లో చిగురిస్తున్న ఆశలు - 20 మండలాల్లో అనువైన ప్రాంతాలగుర్తింపు పోచమ్మమైదాన్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించిన నూతన పారిశ్రామిక విధానం జిల్లాలో పరిశ్రమల రంగానికి ఊతమివ్వనుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ సెల్ఫ్ సర్టిఫికేషన్(టీఎస్ ఐపాస్)తో జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే రెండో రాజధానిగా విరాజిల్లుతున్న వరంగల్‌లో పారిశ్రామికరంగం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడంతో జిల్లాలో దేశీయ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో నూతన పరిశ్రమలను నెలకొల్పేందుకు తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ) సమాయత్తమవుతోంది. ఈ సంస్థ ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక ప్రాంతాలకు అదనంగా 20 మండలాల్లో 24,679 ఎకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ములుగు రోడ్, ఆటోనగర్, మడికొండ, ధర్మసాగర్, జనగామ ప్రాంతాల్లో పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ఐపాస్‌తో.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐపాస్‌ను ప్రవేశ పెట్టింది. ఒకప్పుడు పరిశ్రమను స్థాపించాలంటే అన్ని అనుమతుల కోసం చాలా ఇబ్బందులు పడే వారు. ఇప్పుడు కొత్తగా ఐపాస్ తీసుకరావడంతో ఇబ్బందులు తగ్గా యి. ఒకప్పుడు జిల్లా పరిశ్రమల శాఖ, కాలుష్య ని యంత్రణ మండలి, విద్యుత్ ఇతర శాఖల నుంచి అనుతమలు తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు జిల్లా పరిశ్రమల కేంద్రంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూ ర్తి వివరాలతో కూడిన దరఖాస్తును అందజేయాలి. దీంతో ఆ శాఖ వారు వారంతో రెండు రోజులు ఐపాస్ కోసం ప్రత్యేకంగా అన్ని శాఖ అధికారులను ఒక వేదిక పైకి తీసుకొచ్చి దరఖాస్తులు అందజేసి చి న్న పరిశ్రమ అయితే 15 రోజులు లోపు, పెద్ద పరి శ్రమ అయితే 30 రోజుల లోపు అన్ని పూర్తి చేసి ఇ వ్వాలి. లేనిచో సంబంధిత ఉద్యోగిపై రోజుకు రూ. 1000 చొప్పున కలెక్టర్ జరిమాన విధించనున్నారు. మూడు రకాలుగా గుర్తింపు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం టీఎస్ఐ ఐసీకి అప్పగించింది. జిల్లా రెవెన్యూ అధికారుల స హకారంతో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉ న్న ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. జిల్లాలో మూడు గ్రేడ్లుగా స్థలాలను గుర్తించారు. ఏ గ్రేడ్ విభాగంలో 9,259, బీ గ్రేడ్ విభాగంలో 11,091, సీ గ్రేడ్ విభాగంలో 4,329 ఎకరాల స్థలాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ భూములను టీఎస్ఐసీసీకి బదిలి చేస్తే వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలకు అప్పగించనున్నారు. జిల్లాలో దాదాపు 40 వేలకు పైగా కొత్త పారిశ్రమిక విధానం ద్వారా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది. ఇక వలసలకు సెలవు ఉన్నత చదువులు చదివిన యువతకు జిల్లాలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో హైదారాబాద్, బెంగుళూరు, చెన్నయ్, ముంబయి, ఢిల్లీ, కోల్కత్త తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, జపాన్, శ్రీలంక, దూబయ్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలకు అప్పులు చేసి వలస వెళ్తున్నారు. ఇంకొంత మంది అంత దూరం వెళ్లలేక జిల్లాలో చిన్నచిన్న సంస్థల్లో పని చేస్తు కాలం వెళ్లదీస్తున్నారు. వీటన్నింటికి సెలవు పెట్టెయోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో జిల్లాకు పూనర్వైభవం రానుంది. ల్యాండ్ బ్యాంక్‌ను ప్రభుత్వంకు అందజేశాం.. జిల్లాలోని రెవె న్యూ అధికారుల సహాయంతో జిల్లాలో రవాణాకు అనుకుల ప్రాంతాలు గుర్తించి పరిశ్రమలు అనువైన ప్రాంతాల మండలాల పేర్లు, సర్వే నంబర్లతో కూడిన ల్యాండ్ బ్యాంక్‌ను ప్రభుత్వంకు అందజేశాం. ప్రభుత్వం కేటాయించగానే వాటిలో మౌలిక వసతులు కల్పించి పరిశ్రమల స్థాపనకు స్థలాలు కేటాయిస్తాం. జిల్లాలో 24,679 ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ బ్యాంక్‌గా గుర్తించాము. -డి.రవి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ -
ఆశీర్వదించండి
శుక్రవారం హెచ్ఐసీసీలో తెలంగాణ పారిశ్రామిక విధానం -2015ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు జూపల్లి, కేటీఆర్, అధికారులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు ♦ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ పారిశ్రామిక విధానం-2015 ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణకు ప్రత్యేక చరిత్ర, సంస్కృతి ఉంది. హైదరాబాద్ ఒక విశ్వనగరం. యవ్వనోత్సాహంతో ఉన్న నూతన రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా మంచి పనులు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పెట్టుబడులతో తరలిరండి’’ అని సీఎం చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం ‘తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్)’ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖులకు నూతన విధానంలోని ప్రత్యేకతలను వివరించారు. ‘‘మాకు సమర్థులైన అధికారుల బృందం ఉంది. మా సామర్థ్యమున్నంత వరకు పనిచేసి మీ అంచనాలకు తగినట్లుగా రాణిస్తాం. లేనిదానిని ఉన్నట్లుగా చూపుతూ పత్రికలు, మీడియాలో ప్రకటనలు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం కాదు. మేం చెప్పిన దాంట్లో సగం ఆచరణలోకి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలంగాణలో బారులు తీరుతారని పారిశ్రామిక ప్రముఖులు అంటున్నారు. మా పనితీరు ద్వారానే సమాధానం చెబుతాం..’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అవాంతరాలు, అవినీతి లేని రీతిలో, ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక విధానం ఉంటుందని.. పైరవీలు చేస్తూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రత్యేక’ స్వాగతం.. ‘‘ప్రపంచంలోని ఏమూల నుంచైనా అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకునేలా కొత్త విధానం ఉంటుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక ప్రోటోకాల్ అధికారుల బృందం పారిశ్రామికవేత్తలకు ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలుకుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారి చిత్తశుద్ధిని పరిశీలించి, అవాంతరాలు లేకుండా చూసేందుకు స్వయంగా భేటీ అవుతాను..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నీరు, భూమి, విద్యుత్ తదితర అనుమతులను 10 నుంచి 12 రోజుల వ్యవధిలో అన్నీ ఒకే ప్యాకెట్లో పెట్టి స్వయంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. అనుమతుల్లో ఆలస్యానికి బాధ్యులయ్యే ఉద్యోగులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామన్నారు. తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తుల్లో మూడింట ఒకవంతు ఫార్మా రంగానిదేనని... ఫార్మాను ప్రోత్సహించేందుకు ముచ్చెర్లలో ఫార్మా సిటీ, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఫార్మా అభివృద్ధికి రసాయన వ్యర్థాల నిర్వహణ అవరోధమనే భావన ఉందని, ఫార్మాసిటీలో వ్యర్థాల నిర్వహణకు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వ్యతిరేక భావన తొలగిస్తామని ప్రకటించారు. ఐటీసీ నుంచి రూ. 8 వేల కోట్లు.. నూతన పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ రాష్ట్రంలో రూ. 8 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఐటీసీ భద్రాచలం పేపరు మిల్లు సామర్థ్యాన్ని మరో లక్ష టన్నులు పెంచడం ద్వారా 90 మిలియన్ల పనిదినాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లోని సైబర్సిటీలో రూ. వెయ్యి కోట్లతో హోటల్, మెదక్‌లో రూ.800 కోట్లతో ప్రపంచ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తర లివచ్చిన ప్రముఖులు.. పారిశ్రామిక విధానం ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతోపన్యాసం చే శారు. కెనడా, ఫ్రాన్స్, టర్కీ, జపాన్ దేశాల కాన్సుల్ జనరల్‌లు సిడ్నీ ఫ్రాంక్, ఎరిక్ లావెర్టూ, మూరత్ ఒమెరోగ్లు, సీజీబాబాతో పాటు బీహెచ్ఈఎల్ ఎండీ ప్రసాద్‌రావు, మైక్రోమాక్స్ ఎండీ రాజేశ్ అగర్వాల్, వాల్‌మార్ట్ సీఈవో క్రిష్ అయ్యర్, జీఎంఆర్ చైర్మన్ మల్లికార్జున్‌రావు, జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి, నాస్కామ్ అధ్యక్షుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీసీఎస్ హెడ్ రాజన్న, సీఐపీ అధ్యక్షురాలు వనితా దాట్ల, ఫిక్కి తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు సంగీతారెడ్డి ప్రసంగించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, డైరక్టర్ మానిక్‌రాజ్ నూతన విధాన ప్రత్యేకతలను వివరించారు. టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్‌తో పాటు సోలార్ పవర్ పాలసీని సీఎం ఆవిష్కరించారు. అన్నీ ఒక్కచోటే.. టీఎస్ ఐపాస్ బిల్లును గత ఏడాది నవంబర్ 27న అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించగా.. మార్గదర్శకాలకు ఈనెల 10న రాష్ట్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. జూన్ 12 నుంచి టీఎస్ ఐపాస్ చట్టం అమల్లోకి వస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ విధానంలోని ప్రత్యేకతలు.. - వారంలో రెండు పర్యాయాలు దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల తరఫున అనుమతులు జారీ చేస్తారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఐపాస్ కమిటీ దరఖాస్తుల తీరుతెన్నులను పర్యవేక్షిస్తుంది. - రూ.200 కోట్లకుపైగా పెట్టుబడి, వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు సీఎస్ నేతృత్వంలోని ‘తెలంగాణ స్టేట్‌వైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ బోర్డు (టీ స్విఫ్ట్)’ అనుమతులు మంజూరు చేస్తుంది. - రూ. 5 కోట్ల కంటే తక్కువ పెట్టుబడులుండే పరిశ్రమలకు జీఎం, డీఐసీ నేతృత్వంలో జిల్లా స్థాయిలోనే అనుమతులు. - వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సాధారణ దరఖాస్తు (సీఎఎఫ్) ద్వారా సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు. - అనుమతుల మంజూరు ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నోడల్ ఏజెన్సీలు పర్యవేక్షిస్తాయి. రూ.200 కోట్లకు పైబడి పెట్టుబడి ఉండే మెగా ప్రాజెక్టులకు 15 రోజులు, అంతకంటే తక్కువ వ్యయమయ్యే ప్రాజెక్టులకు నెల రోజుల్లో అనుమతి. - టీఎస్ ఐపాస్ సెక్షన్ 13(1) ప్రకారం నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వకుంటే అనుమతులు వచ్చినట్లుగానే దరఖాస్తులు భావించాల్సి ఉంటుంది. - పరిశ్రమలకు కేటాయించే భూములకు టీఎస్ ఐఐసీ నోటిఫైడ్ అథారిటీగా వ్యవహరిస్తుంది. - లేఔట్, భవన నిర్మాణం తదితర అనుమతులను గ్రామ పంచాయతీ ద్వారా పొందాలనే నిబంధనను సవరిస్తూ టీఎస్ఐఐసీకి అధికారం అప్పగించారు. అయితే ఆదాయాన్ని మాత్రం గ్రామ పంచాయతీల ఖాతాలో జమ చేస్తారు. - అనుమతుల్లో జాప్యాన్ని ప్రశ్నించే అధికారాన్ని దరఖాస్తుదారుకు అప్పగిస్తూ.. నిర్దేశిత గడువులోగా అనుమతుల పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత విభాగాల అధిపతులకు అప్పగించారు. - నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వని అధికారులు, సిబ్బందికి జరిమానా విధిస్తారు. అనుమతులు పొందిన రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభించని పరిశ్రమల అనుమతి రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంటారు. -
రాష్ట్రంలో మొబైల్ తయారీ హబ్
రెండు లక్షల మందికి ఉపాధి ఖాయం: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొబైల్ తయారీ హబ్ ఏర్పాటు ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి దక్కుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో తైవాన్‌కు చెందిన ఫ్యాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్రెసిడెంట్ కాల్విన్ చిన్, ఫిహ్ మొబైల్ లిమిటెడ్ చైర్మన్ విన్సెంట్ టాంగ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ వారితో అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే పారిశ్రామిక విధానం వల్ల ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో మొబైల్ తయారీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక సెల్‌ఫోన్ తయారీ సంస్థల ప్రతినిధులు తమ యూనిట్లను తెలంగాణలో స్థాపించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మొబైల్ తయారీ హబ్‌కు అనువైన స్థలం కేటాయించడంతో పాటు, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలని తైవాన్ ప్రతినిధులను కేసీఆర్ కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న టీఎస్ ఐపాస్ చట్టం ఉదాత్తంగా ఉందని, తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐఫోన్ లాంటి అత్యాధునిక ఫోన్లను తయారు చేసే తమ కంపెనీ హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తైవాన్ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు. -
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానానికి తెలంగాణ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ ఇతర నిర్ణయాలు * పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి * ఆధీనంలోని లేని భూములు వేలం వేయాలని నిర్ణయం * గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నిర్ణయం * నిజామాబాద్ జిల్లా రుద్రారంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటుకు పచ్చజెండా * సర్వీసు కమిషన్ ద్వారా నియామకాలకు అనుమతి * ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అభ్యర్థుల వయసు సడలింపు పదేళ్లకు పెంపు -
చిన్న పరిశ్రమలకే పెద్దపీట
♦ కొత్త పారిశ్రామిక విధానంలో మార్గదర్శకాలు ♦ ఇండస్ట్రియల్ పార్కుల్లో 20 శాతం ప్లాట్లు ♦ కేంద్రం తరహాలో రుణసాయానికి ట్రస్టు ♦ జిల్లాల్లో పారిశ్రామిక పార్కులు ♦ వనరులు, భూ లభ్యతపై కసరత్తు కొలిక్కి సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నూతన పారిశ్రామిక విధానంలో పెద్దపీట వేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. టీఎస్ ఐపాస్ పేరిట నూతన విధానానికి రాష్ట్ర అసెంబ్లీ ఇదివరకే ఆమోద ముద్ర వేసింది. మార్గదర్శకాలను మాత్రం జూన్ 12న పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖుల సమక్షంలో సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణతో దెబ్బతిన్న చిన్న పరిశ్రమలను ఆదుకోవడంతో పాటు, పూర్వ వైభవం దిశగా నూతన విధానంలో ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడలతో పాటు, కొత్తగా ప్రతిపాదిస్తున్న ఇండస్ట్రియల్ పార్కుల్లో 20 శాతం ప్లాట్లను చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేటాయించనున్నారు. టీఎస్ఐఐసీ ద్వారా కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కుల్లో అవసరాలు, డిమాండును బట్టి 100 చదరపు గజాల విస్తీర్ణమున్న ప్లాట్లను కూడా కేటాయించనున్నారు. మినీ పారిశ్రామిక వాడల ఏర్పాటు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మోటారు మెకానిక్ షెడ్లు, మోటారు వైండింగ్ షాపులు వంటి సూక్ష్మ తరహా పరిశ్రమలను ఒకచోట చేర్చి మినీ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయనున్నారు. భారీ పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రెడిట్ గ్యారంటీ ట్రస్టు (సీజీటీఎంఎస్ఈ) తరహాలో రాష్ట్రంలోనూ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ప్రత్యేక పార్కులు హైదరాబాద్ సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం 28 కొత్త ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటును ప్రతిపాదించింది. అయితే కేవలం రాజధాని సమీపంలో ఉన్న జిల్లాలకే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోనూ పారిశ్రామిక వాడల ఏర్పాటుపై టీఎస్ఐఐసీ కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ లభ్యత (ల్యాండ్ బ్యాంక్), వనరులపై గతంలోనే టీఎస్ఐఐసీ నివేదిక సిద్ధం చేసింది. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు కోసం ఇప్పటికే 100 ఎకరాల భూమిని కేటాయించారు. ఇలాగే మిగతా జిల్లాల్లో అవసరమైన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణపై అధికారులు దృష్టి సారించారు. -
కొత్త పారిశ్రామిక విధానం లేనట్టే!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ఇప్పట్లో ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. కేంద్రం మనోగతం బహిర్గతమయ్యే వరకూ ఈ విషయంలో మౌనంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పారిశ్రామిక విధానంపై ఇప్పటివరకు చేసిన కసరత్తును కూడా మూలన పడేసింది. తాజా పరిణామాలతో పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించి ఇతర ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరుల్లో ఏర్పడిన వ్యత్యాసంపై అంతర్గత మంత్రుల కమిటీ పరిశీలిస్తుందని, మిగతా ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయానికొచ్చే ముందు తాత్కాలికంగా రూ.500 కోట్లు సాయంగా అందిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరుతో బుధవారం ప్రకటన జారీ చేయడం తెలిసిందే. దీంతో అంతర్గత మంత్రుల కమిటీ బృందం రాష్ట్రంలో పర్యటించి, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరిన్ని రాయితీలపై ఒక నిర్ణయానికి వచ్చే వీలుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదిలావుండగా కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెలలో ప్రారంభమవుతాయి. ఈలోగా ఈ ప్రక్రియ పూర్తి కావడం సాధ్యంకాదు. కాబట్టి ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక వెసులుబాటు ఉండే అవకాశం కన్పించడం లేదు. అదీగాక ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కనీసం 15 ఏళ్లపాటు రాయితీలు ఇవ్వాలని, పన్ను మినహాయింపు కల్పించాలని ప్రభుత్వం కోరింది. దీనిపైనా కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రతిపత్తి కల్పిస్తే కొన్నిరకాల పరిశ్రమలకు భారీగా రాయితీలందే వీలుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీస్‌తోపాటు భారీ పెట్టుబడులు(రూ.50 లక్షలు దాటిన) ఉండే పరిశ్రమలకు దిగుమతి, వాణిజ్య సుంకం నుంచి మినహాయింపు ఉండే వీలుంది. కేంద్రం ఇందుకు సుముఖంగా ఉన్నట్టుగా కనిపించడంలేదని తెలుస్తోంది. భరోసా ఇవ్వలేకపోతున్న రాష్ట్రప్రభుత్వం.. ఈ ఏడాది జనవరి వరకూ రాష్ట్రంలో దాదాపు 80 భారీ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. వారంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే సబ్సిడీల గురించే వివరాలు కోరుతున్నారు. మరో 175 మధ్యతరహా, 2000కుపైగా చిన్న పరిశ్రమలకు సంబంధించి ఔత్సాహికులు వివరాలు కోరారు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతోంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఏక గవాక్ష(సింగిల్‌విండో) విధానంలో అందిస్తామని, దీనికి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తామని మాత్రమే సర్కారు ప్రకటించింది. ఈ హామీని పారిశ్రామిక వర్గాలు ఎంతమాత్రం విశ్వసించలేదు. దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం ఒనగూరే అవకాశమూ లేదని చెబుతున్నారు. జపాన్, సింగపూర్‌కు చెందిన సంస్థలు సైతం ఇదే వాదన విన్పిస్తున్నట్టు తెలిసింది. విదేశీ యంత్ర సామాగ్రిని దిగుమతి చేసుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవడం, పలు మార్గాల్లో రాష్ట్రానికి వాటిని రప్పించడం భారంగా పేర్కొంటున్నారు. కేంద్రం ప్యాకేజీ దేనికి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పరిశ్రమలకు ఎంతమాత్రం మేలు చేయదనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాలనే ఈ పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా రాజధాని నగరం ఏర్పాటు చేసే గుంటూరు, దానికి ఆనుకునే ఉన్న కృష్ణాతోపాటు ఉభయగోదావరి జిల్లాలకు ఎలాంటి ప్రయోజనం లభించేందుకు అవకాశం లేదు. ఇచ్చిందికాస్తా వసతులకే సరిపోతుందని అంటున్నారు. -
తకరారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పారిశ్రామిక విధానం ఖరారు కావడంతో భూముల అన్వేషణపై సర్కారు దృష్టి సారించింది. ఈ క్రమంలో జిల్లాలో భూముల లెక్కలు తిరగేస్తూ.. కొత్త కేటాయింపులపై యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ శాఖలు/ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల లెక్కలు తేల్చడంలో తలమునకలైంది. పెట్టుబడులకు రెడ్‌కార్పెట్ పరచాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు.. ఖాళీ భూములపై ఆరా తీస్తోంది. వీలైనంత మేరకు వివాదరహిత భూములను కేటాయించడం ద్వారా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. భూ కేటాయింపులేగాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, వాటిలో వెలసిన ఆక్రమణలను కూడా గణిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లాలో 39వేల ఎకరాల మేర ల్యాండ్ బ్యాంక్ ఉందని జిల్లా యంత్రాంగం తేల్చింది. ఇవి తక్షణ కేటాయింపులు అనువుగా ఉన్నాయని గుర్తించింది. ఇదిలావుండగా, ఖాళీ స్థలాల గుర్తింపు అధికారగణానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. రోజుకో లెక్క తేలుతుండడంతో స్పష్టమైన వివరాలను రాబట్టడం యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. హెచ్ఎండీఏ, టీఐఐసీలు ప్రభుత్వ భూములను నేరుగా ఆయా కంపెనీలకు బదలాయించడం, ఎవరెవరికి, ఎంత మేర కట్టబెట్టారనే సమాచారం జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఇవ్వకపోవడం ఈ గందరగోళానికి కారణమవుతోంది. 39,443 ఎకరాలు కేటాయింపు! జిల్లాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు గత ప్రభుత్వాలు 39,443 ఎకరాలను కేటాయించాయి. దీంట్లో ప్రభుత్వ శాఖలకే 18,700 ఎకరాలను బదలాయించారు. వీటిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), రాజీవ్ స్వగృహ, దిల్, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఐఐసీ), తెలంగాణ హౌసింగ్ బోర్డు (టీహెచ్బీ) తదితర సంస్థలకు కట్టబెట్టారు. దీంట్లో సుమారు సగం విస్తీర్ణం ఇంకా వినియోగంలోకి రాలేదని రెవెన్యూ యంత్రాంగం సర్వేలో తేల్చింది. పరిశ్రమలు స్థాపించని సంస్థల నుంచి స్వాధీనం చేసుకోవడమేగాకుండా.. పారిశ్రామిక అవసరాలు పోను అట్టిపెట్టుకున్న మిగతా స్థలాలను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ద క్కన్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్(దిల్) సంస్థ అయితే ఏకంగా భూమిని తనఖా పెట్టి రుణాలు తీసుకుంది. భూ యాజమాన్య హక్కులు రానప్పటికీ, భూమిని కుదువపెట్టి రుణం తీసుకోవడంతో ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. కొన్ని సంస్థలు అత్యాశకు పోయి.. భూ సేకరణాస్త్రంతో అడ్డగోలుగా భూములను తీసుకున్నాయి. ఈ భూములను అట్టిపెట్టుకోవడమో... అవసరాలకు మించి సంస్థలకు కట్టబెట్టడమో చేశాయి. దీంతో విలువైన భూములు ఆయా సంస్థల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇలా ఆయా సంస్థలు నిరుపయోగంగా ఉంచుకున్న భూములు, వినియోగంలోకి రాని భూముల వివరాలను రాబట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ తరహా స్థలాల పై కూడా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అంచనాలను రూపొం దించింది. ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన భూమిలో కేవలం 8,304.03 విస్తీర్ణం మాత్రమే వినియోగంలోకి రాగా, 10,396.11 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు లెక్క తేల్చింది. ఈ భూములను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కేటాయించేందుకు వీలు గా వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రానికి తరలిరానుండడం, ఫిలింసిటీ, ఫార్మాసిటీ, ఐటీఐఆర్, కెమికల్ సిటీ పేర పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడమే కాకుండా.. దానికి అనుగుణంగా ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేయాలని ఆదేశించడంతో ఖాళీ భూములపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. పరిశ్రమలకు భూముల నోటిఫై! పరిశ్రమలకు కేటాయించే భూములను ప్రత్యేకంగా నోటిఫై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆయా సంస్థలకు నిర్ధేశించిన భూములను మాత్రమే కేటాయించేందుకు ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూముల లెక్క తీస్తు న్న సర్కారు... పరిశ్రమల స్థాపనకు అనువైన భూముల జాబితా రూపొం దించింది. జిల్లాలో బల్క్‌డ్రగ్, ఫార్మాసిటీ తదితర పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ల్యాండ్ బ్యాం కును సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడలకు గుర్తించిన భూములను నోటిఫై చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ శ్రీధర్‌ను ఆదేశించారు. ఫార్మాసిటీ, ఏరోస్పేస్ సిటీ, పరిశ్రమల స్థాపనకు రంగారెడ్డి జిల్లా అనువైన ప్రాంతమని సీఎం చెప్పారు. ఇందుకోసం 30 వేల ఎకరాల మేర రిజర్వ చేయాలని ఆయన ఆదేశించారు. -
పరిశ్రమలకు, పారిశ్రామిక వర్గాలకు అండగా..!
-
ప్రజల ఆశలను వమ్ము చేయకండి: ఎర్రబెల్లి
రైతులకు భరోసా ఇచ్చే చర్యలు చేపట్టండి: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంపై ప్రజలంతా గంపెడాశలతో ఉన్నారని, వాటిని వమ్ము చేయవద్దని టీడీపీపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చాల న్నారు. ముఖ్యంగా గిరిజనులు, దళితులకు ఉద్దేశించిన పథకాల అమలులో చిత్తశుధ్ధితో పనిచేయాలని సూచించారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఇవ్వాలని విన్నవించారు. కరెంట్ విషయంలో పక్క రాష్ట్రాలను విమర్శించడం మాని, చర్చలకు వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ‘ఇళ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చారు. వీటితో నియోజకవర్గానికి 36 నుంచి 40 ఇళ్లకు ఎక్కువ నిర్మించలేం. ఇందులో పాత ఇళ్లకు సంబంధించిన బకాయిలే రూ.1,500 కోట్లు ఉన్నాయి. అప్పుడు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం’ అని ప్రశ్నిం చారు. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకంలో రాజకీయ నేతలు కోట్లు గడించారని, వారంతా ఇప్పుడు మీ పక్కనే ఉన్నారని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఉద్యోగాల విషయంలో ఆందోళన చేస్తున్న ఉస్మానియా విద్యార్థులను పిలిచి మాట్లాడాలని సూచించారు. పారిశ్రామిక విధానంపై సీఎంలో మార్పు వచ్చినట్లు కనబడుతోందని కొందరు తనకు ఫోన్ చేశారని, ఇదే వైఖరిని ఇక ముందూ కొనసాగించాలని, రెచ్చగొట్టే, తిట్టే ధోరణిని మార్చుకోవాలని సూచించారు. అమర వీరుల కుటుంబాలు మొత్తంగా 1,600 ల వరకు ఉంటే వారికి ప్రస్తుత బడ్జెట్లో ఇచ్చిన రూ.100 కోట్ల బడ్జెట్ సరిపోదని అన్నారు. వీటిని పెంచాలన్నారు. మేము పాండవులం.. మీరు కౌరవులు చివరలో ఎర్ర బెల్లి అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ స్వయంగా తెలంగాణ ఇచ్చినా వారు 10 ఏళ్లలో చేసిన పాపాల కారణంగా వారిని పక్కన పెట్టారు. మేమంతా పాండవులం. టీడీపీకి ప్రస్తుతం వనవాసం నడుస్తోంది. 15 ఏళ్ల వనవాసం చేయాలని మాకు శని ఉంది. అందుకే తప్పు చేయకున్నా వనవాసం చేస్తున్నాం. మరో నాలుగేళ్లలో వనవాసం ముగిస్తే మేమే అధికారంలోకి వస్తాం. టీఆర్ఎస్ సభ్యులంతా కౌరవులు. వారు మా అర్జునుడైన రేవంత్‌రెడ్డిని చూస్తేనే దడదడలాడిపోతున్నారు. భయపడుతున్నారు. ఇప్పటికైనా కౌరవులు దౌర్జన్యాలు, కుట్రలు మానాలి’ అన్నారు. ప్రతిసారీ కేంద్రాన్ని, టీడీపీని, పక్క రాష్ట్రా నేతలను తిట్టడం మాని వారితో సఖ్యతతో మెలగండని సూచించారు. -
తెలంగాణా పారిశ్రామిక విధానమిదే!
-
కొత్త పరిశ్రమలు వచ్చేనా?
జిన్నారం: పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు టీఆర్ఎస్ సర్కార్ కొత్త విధానాలు రూపొందించడంతో జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి. వ్యవసాయ, వాణిజ్య రంగాలతో పాటు పరిశ్రమలకు కూడా పెద్దపీట వేస్తామంటూ సర్కార్ ప్రకటించింది. అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటుపై సింగిల్ విండో పథకాన్ని చూపొందించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ పథకంతో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ పారిశ్రామిక విధానంపై నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పాలసీపై పారిశ్రామిక వేత్తల నుంచి కొంత సానుకూలత, వ్యతిరేకతలు వస్తున్నాయి. ప్రోత్సాహాలన్నీ కొత్తగా పరిశ్రమలు స్థాపించబోయే వారికేనా అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమలను కాపాడేందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. మరి మా పరిస్థితి ఏమిటి? నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో 5 వేల ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఇందుకు సంబంధించి పనులను కూడా రెవెన్యూ అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే వారికి సింగిల్ విండో విధానాన్ని వర్తింపజేయటం పట్ల కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం ఈ పథకంపై కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. నూతన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిదే అయినప్పటికీ, ఉన్న పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలంటున్నారు. అవుటర్ రింగు రోడ్డులోపల ఉన్న పరిశ్రమలను బయటకు పంపేందుకు ప్రభుత్వం నుంచి వత్తిడిలు వస్తున్నాయని, అదే జరిగితే తమకు ఎలాంటి సాయం అందిస్తారో సర్కార్ తన నూతన పాలసీలో తెలపలేదని పలువురు పరిశ్రమల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసే వారికి మాత్రమే ప్రోత్సహాకాలను అందిస్తే, తమ పరిస్థితి ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నా, నూతన పరిశ్రమల స్థాపన జరుగుతుందో లేదోననే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగింల్ విండో పాలసీ బాగున్నప్పటికీ ఇది కేవలం నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలకేనా ? ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అనుమతులు కావాలంటే ఏంచేయాలనే దానిపై స్పష్టత లేదని, పరిశ్రమలను కేటగిరీలుగా విభజించే విషయంపై కూడా స్పష్టత లేదనినే అభిప్రాయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫార్మా, స్టీల్, ఇతర రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. వీటిని కేటగిరీల వారిగా విభజించే విషయంపై ప్రభుత్వం తగిన స్పష్టతను ఇవాల్సి ఉందని యాజమన్యాలు చెబుతున్నాయి. రెడ్, గ్రీన్, ఆరెంజ్ కేటగిరీలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఏదిఏమైనా సర్కార్ పారిశ్రామిక విధానంపై పారిశ్రామిక వేత్తలకు పలు అనుమానాలున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
పారిశ్రామిక పార్కులు
* ఆరు చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం * భూములు గుర్తించిన టీఎస్ఐఐసీ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : దేశంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో మరిన్ని పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆరు చోట్ల ఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నెన్నెల, సిర్పూర్(టి), అంకుసాపూర్(కాగజ్‌నగర్ మండలం), చెన్నూరు, చాట (కుభీర్ మండ లం), ఆలూరు(సారంగాపూర్)లో నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇం దుకోసం అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. నెన్నెలలో ఏర్పాటు చేయతలపెట్టిన పారిశ్రామిక పార్కు కోసం సుమారు వెయ్యి ఎకరాల భూములను గుర్తించారు. అలాగే సిర్పూర్ (టి) పార్కు కోసం సుమారు 700 ఎకరాలు, చెన్నూరు కోసం 461 ఎకరాలు, చాట కోసం 147 ఎకరాలు, ఆలూరు కోసం 239 ఎకరాల భూమిని ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ) అధికారులు సంయుక్తంగా ఈ ప్రక్రియ చేపట్టారు. సాగుకు యోగ్యంగా లేని ప్రభుత్వ భూములను మాత్రమే పారిశ్రామిక పార్కుల కోసం సేకరిస్తామని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పార్కుల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. ఈ భూములను అభివృద్ధి చేయడంతోపాటు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ లైన్లను నిర్మించడం, రోడ్లు, పారిశ్రామిక వ్యర్థాలను తరలించేందుకు అవసరమైన డ్రెయినేజీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వీటిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్సాహం చూపుతున్న పారిశ్రామిక వేత్తలకు ఈ పార్కుల్లో స్థలాలను కేటాయించడం ద్వారా వారికి తోడ్పాటునందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆశించిన ఫలితమివ్వని ఎస్టేట్లు.. జిల్లాలో ప్రస్తుతానికి మూడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. ఆదిలాబాద్‌తోపాటు, నిర్మల్, మంచిర్యాలల్లో ఎస్టేట్లను రెండు దశాబ్దాల క్రితం ఏపీఐఐసీ ఏర్పాటు చేసింది. అయితే.. ఈ పట్టణాలు దినదినాభివృద్ధి చెందడంతో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో పరిశ్రమల కంటే నివాస గృహాలు అధికంగా వెలిశాయి. ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) పరిధిలో కూడా మరో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉట్నూర్‌లో ఉంది. గిరిజనులు చిన్న, కుటీర పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి పొందేలా చేయూత నిచ్చేందుకు ఉట్నూర్‌లో ఈ ఎస్టేట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, సరైన పర్యవేక్షణ లేక ఈ ఎస్టేట్‌లో చాలా యూనిట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి.. జిల్లాలో కొత్తగా పత్తి ఆధారిత పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు మొగ్గు చూపుతున్నారు. స్పిన్నింగ్, జిన్నింగ్-ప్రెస్సింగ్, పారాబాయిల్డ్, సిరామిక్స్, కార్న్ (మొక్కజొన్న ఉత్పత్తులు) ప్రొడక్ట్స్ వంటి పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ప్రైవేటు సెక్టార్లో మొక్కజొన్న ఆధారిత భారీ పరిశ్రమలున్నాయి. జిల్లాతోపాటు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న చాలా మట్టుకు ఈ పరిశ్రమలకు వెళుతోంది. ఇలాంటి పరిశ్రమలు ఇక్కడే నెలకొల్పడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో పాటు, వెనుకబడిన జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
సింగిల్ విండోకి చట్టబద్ధత
-
‘ఒకే చోట అనుమతి’పై ఆర్డినెన్స్!
పారిశ్రామిక విధానంపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేయదలచిన పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులనూ ఒకే చోట అందించేందుకు ఉద్దేశించిన ‘రైట్ టు సింగిల్ విండో’ విధానంపై తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. దేశంలోనే అత్యుత్తమైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘రైట్ టు సింగిల్ విండో’ విధానం కింద పారిశ్రామికవేత్తల ప్రతిపాదనలపై పక్షం రోజుల్లోగా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సకాలంలో అనుమతులు ఇవ్వడంలో ఏ అధికారైనా జాప్యం చేస్తే... వారి వేతనంలో కోత విధించి ఆ మొత్తాన్ని పారిశ్రామికవేత్తలకు పరిహారంగా ఇస్తారు. ఈ విధానంపై శనివారం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ తదితరులు సచివాలయంలో సీఎంతో సమావేశమై చర్చించారు. ఈ విధానంపై ఆర్డినెన్స్ జారీ చేయాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
అవినీతికి తావివ్వం: కేసీఆర్
-
అవినీతికి తావివ్వం: కేసీఆర్
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెస్తాం పారిశ్రామిక వేత్తలను వేధించే అధికారులు, నేతలపై కఠిన చర్యలు.. ఇబ్బందులకు గురిచేస్తే సహించబోనని సీఎం హెచ్చరిక జిల్లాలో 2 పరిశ్రమలు ప్రారంభం, మరో దానికి శంకుస్థాపన సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ర్టంలో అవినీతికి తావులేని, పూర్తి పారదర్శకతతో కూడిన ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సింగిల్ విండో పద్ధతిలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేముల, కొత్తూరు మండలం పెంజర్ల గ్రామాల పరిధిలో పలు పరిశ్రమల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ మాట్లాడారు. నూతన పారిశ్రామిక విధానంపై సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేసి ముసాయిదాను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ‘కొత్త పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉంటుందని గర్వంగా ప్రకటిస్తున్నా. సీఎం కార్యాలయంలో చేజింగ్ సెల్ ఏర్పాటు చేసి.. పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అనుమతులు ఇస్తాం. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అన్ని రకాల అనుమతులతో కూడిన పత్రాలను కవర్లో పెట్టి అందజేస్తాం’ అని కేసీఆర్ తెలిపారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ‘హరితహారం’ కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామంలో 1.20 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. తద్వారా గ్లోబల్ వార్మింగ్, కాలుష్య సమస్యల పరిష్కారానికి, వాతావరణ సమతుల్యత కోసం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ‘రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ ఒక్కడితోనే సాధ్యం కాదు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు మొదలుకుని అన్నిస్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఎక్కడి వారక్కడ పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అధికారాలను అప్పగిస్తాం. అయితే అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలి’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ‘మన ఊరు-మన ప్రణాళిక’ల ద్వారా ప్రతిపాదనలు స్వీకరించామని, రాష్ట్ర స్థాయిలో ‘మన రాష్ట్రం - మన ప్రణాళిక’ సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మహబూబ్‌నగర్ లాంటి జిల్లా కేంద్రంలో కూడా వారం, పది రోజులకోసారి కూడా తాగునీరు సరఫరా కావడం లేదని, ఇలాంటి తాగునీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటర్ గ్రిడ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ. 4 వేల కోట్లతో మురుగునీటి కాలువలు, సిమెంటు రోడ్ల నిర్మాణాన్ని దశలవారీగా పూర్తి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. రూ. 20 వేల కోట్లతో పునరుద్ధరణ రాష్ర్టంలో చిన్న నీటి వనరుల పునరుద్ధరణను ఓ ఉద్యమంలా చేపట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ‘సమైక్య పాలనలో తెలంగాణలో నీటి పారుదల వ్యవస్థ దెబ్బతిన్నది. అందుకే ఇప్పుడు వాటి పునరుద్ధరణను ఉద్యమంలా చేపడుతున్నాం. చిన్న నీటిపారుదల వనరుల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు వెచ్చిస్తాం. ఏడాదికి రూ. 5 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో ఖర్చు చేస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు. ‘2016 నాటికి తెలంగాణలో మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలకు రెప్పపాటు కూడా కోతలు లేకుండా చూస్తా. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ కొరతను అధిగమించేందుకే ఆ శాఖను నా వద్దే పెట్టుకున్నా’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ తెచ్చుకున్నం. తెలంగాణ నిలబడాలి. తెలంగాణ మీద ఎలా కుట్రలు జరుగుతున్నయో మీరందరూ గమనిస్తున్నరు. కేసీఆర్ దేనికీ భయపడడు. 14 ఏళ్ల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నం. అంకిత భావంతో పనిచేస్తే బంగారు తెలంగాణ సాధ్యం. ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అడ్డాకుల మండలం వేములలోని స్పర్శ్ పారిశ్రామికవాడలో రూ. 200 కోట్ల పెట్టుబడితో నిర్మించిన అత్యాధునిక ఫార్మస్యూటికల్ గ్లాస్ తయారీ ప్లాంట్ ‘కోజెంట్ గ్లాస్’ను కేసీఆర్ ప్రారంభించారు. రూ. 300 కోట్లతో పరిశ్రమను విస్తరించే యోచనలో ఉన్న ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్, ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ ఎరిక్ లావెర్త్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం కొత్తూరు మండలం పెంజర్ల శివారులో జాన్సన్ అండ్ జాన్సన్ పరిశ్రమకు శంకుస్థాపన, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్(పీ అండ్ జీ) పరిశ్రమ ప్రారంభోత్సవంలోనూ సీఎం పాల్గొన్నారు. ఆయనతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, మహబూబ్‌నగర్ కలెక్టర్ ప్రియదర్శినితో పాటు పీఅండ్‌జీ సీఈవో శంతన్కోస్లా, జాన్సన్ అండ్ జాన్సన్ ఎండీ శ్రీవాస్తవ కూడా ఉన్నారు. అధికారులపై సీఎం ఆగ్రహం మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశ్రమల ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీ అండ్ జీ పరిశ్రమకు వెళ్లే రోడ్డును వేయడానికి ఆర్అండ్బీ అధికారులు సదరు కంపెనీ వారిని డబ్బులు అడగడం దారుణమన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే స్థానికులకు ఉద్యోగాలతో పాటు ఎంతో లాభం ఉంటుందన్నారు. ఇలాంటి పరిశ్రమలకు వచ్చే అవరోధాలను ముందుండి పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా వారు తమ తీరును తక్షణమే మార్చుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు, నేతలు ఏవైనా సమస్యలు సృష్టిస్తే వ్యాపారవేత్తలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పారిశ్రామికవేత్తలకు అధికారులు సహకరించాలే తప్ప ఇబ్బందులకు గురి చేయొద్దని హితవు పలికారు. -
ఐతే ఓకే
నూతన పారిశ్రామిక విధానానికి మంత్రి మండలి ఆమోదం సాక్షి, బెంగళూరు : నూతన పారిశ్రామిక విధానానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో గురువారం జరిగిన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఫలితంగా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 15 లక్షల మందికి ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి రంగాలలో విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయి. మంత్రి మండలి నిర్ణయాలను మీడియా సమావేశంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర వెల్లడించారు. నూతన విధానంలో ఉత్పాదన రంగానికి పెద్ద పీట వేసి ఇందులో 20 శాతం అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014 నుంచి 2019 వరకూ అమల్లో ఉండే ఈ నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగాల కల్పనలో స్థానికులకు పెద్ద పీట వేయనుంది. రాష్ట్రంలోని మొత్తం తాలూకాలను ఆరు జోన్లుగా విభజించడం ద్వారా స్థానికతకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు, రాయితీలు తదితర విషయాల్లో పారదర్శకత పెరుగనుంది. పరిశ్రమలు స్థాపించే ప్రాంతం, పెట్టుబడి పరిమాణాన్ని పరిగణలోకి తీసుకుని వడ్డీ రహిత రుణాలు ఇవ్వడంతో పాటు ఏడు నుంచి 14 శాతం వరకు వ్యాట్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వనున్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించే దిశగా ఆరహళ్లి, హుబ్లీ - ధార్వాడల్లో ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం భూములు ఇచ్చే కుటుంబంలో అర్హులైన ఒకరికి తప్పక ఉద్యోగం కల్పించడాన్ని చట్టబద్ధం చేయనున్నారు. మాతా శిశుమరణాలను అరికట్టడంలో భాగంగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మాత్రం అమల్లో ఉన్న ‘మడలు’ పథకాన్ని మిగిలిన అన్ని జిల్లాలకు విస్తరించడానికి మంత్రిమండలి అంగీకరించింది. రాష్ట్రంలో నూతనంగా మూడు ప్రైవేట్ వైద్య కళాశాలకు అనుమతి లభించింది. హగరి నదిపై వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.33.69 కోట్ల నిధుల విడుదలకు కూడా మంత్రి మండలి ఆమోదం దక్కింది. -
ఇంటర్నెట్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు: కేసీఆర్
హైదరాబాద్: ఇంటర్నెట్ ద్వారా సులభమైన పద్దతుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తామని పారిశ్రామిక వేత్తలలో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు 21రోజుల్లోగా అనుమతులు ఇస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారు. ఒకట్రెండు అనుమతులకు తప్ప ఒకే రోజు అన్ని రకాల అనుమతులకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుసింది. ప్రతి సాగునీటి ప్రాజెక్టులో పదిశాతం నీరు పరిశ్రమలకు కేటాయిస్తామని, పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. జెన్కో ద్వారా 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. చిన్న పరిశ్రమలకు జిల్లాల్లో అనుమతులిస్తామని కేసీఆర్ వెల్లడించారు. -
‘మహీంద్రా’జాలం!
* ఈసారి ఇన్పుట్ వ్యాట్ రాయితీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక విధానం 2010-15కు భిన్నంగా 100 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాయితీ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ... ఇప్పుడు ఏకంగా ఇన్పుట్ వ్యాట్ రాయితీ ఇవ్వాలని అడుగుతోంది. రాష్ట్రం వెలుపల విక్రయించే ట్రాక్టర్లకు కూడా వ్యాట్ రాయితీ కావాలని కోరుతోంది. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల తయారీ యూనిట్ కోసం ఈ కంపెనీ రాష్ట్ర పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకుంది. కంపెనీ ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. రూ.350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న జహీరాబాద్ యూనిట్‌కు 100 శాతం వ్యాట్ రాయితీ ఇచ్చేందుకు అనుమతినిస్తూ 2011 మార్చి 23న పరిశ్రమలశాఖ జీవో-26ను జారీ చేసింది. పారిశ్రామిక విధానం 2010-15 కేవలం 50 శాతం వ్యాట్ రాయితీ మాత్రమే ఇవ్వాలి. తాజాగా ఇన్పుట్ వ్యాట్ రాయితీ ఇవ్వాలని మహీంద్రా కంపెనీ కోరుతోంది. పారిశ్రామిక విధానం 2010-15 మేరకు రాష్ట్రంలో కేవలం అవుట్‌పుట్ ట్యాక్స్ రాయితీ విధానం మాత్రమే అమల్లో ఉంది. వాస్తవానికి ఇన్పుట్ ట్యాక్స్‌ను 14.5 శాతం నుంచి 5 శాతానికి ప్రభుత్వం తగ్గించివేసింది. అయితే కంపెనీ... ఈ 5 శాతం ట్యాక్స్‌ను కూడా తిరిగి రాయితీ రూపంలో వెనక్కి ఇవ్వాలని కోరుతోంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో విక్రయించే ట్రాక్టర్లకు కూడా వ్యాట్ రాయితీ ఇవ్వాలని అడుగుతోంది.