సాక్షి,న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్ ఉద్యోగాలను కొల్లగొట్టేస్తున్న క్రమంలో మానవ వనరులను కాపాడుకునేలా నూతన పారిశ్రామిక విధానాన్ని వెల్లడించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. 1991 పారిశ్రామిక విధానం, యూపీఎ సర్కార్ 2011లో ప్రకటించిన మ్యాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ స్ధానంలో నూతన పారిశ్రామిక విధానాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకటిస్తామని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని చెప్పారు.
దశాబ్ధాల కిందటి పారిశ్రామిక విధానాన్ని కాలానుగుణంగా ప్రక్షాళన చేయడంతో పాటు విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగి సంస్కరణల వేగం పెంచేందుకు నూతన విధానానికి రూపకల్పన చేస్తున్నట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో పారిశ్రామిక విధానం, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ చర్చా పత్రాన్ని జారీ చేసింది.
భవిష్యత్‌కు సన్నద్ధంగా ఉండే పారిశ్రామిక విధానం అవసరమని పేర్కొంది. ఆటోమేషన్ దెబ్బతో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి..మరోవైపు వృద్ధి మందగమనంతో తగ్గుతున్న ఉపాథి అవకాశాల వంటి సవాళ్ల నేపథ్యంలో మెరుగైన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment