
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేళ.. అన్ని రంగాల్లోనో రోబోట్స్ (Robots) హవా సాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో పనిచేయడానికి మనుషులు అవసరం లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే మనిషి చేయాల్సిన పనులను 'మర మనుషులు' చేసేస్తుంటే.. ఇక మనిషికి పనెక్కడుంటుంది. అయితే రోబోలను తయారు చేయడానికి.. వాటిలో కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడానికి మాత్రం మనిషి అవసరమే. ఇప్పటికే అనేక కంపెనీలు హ్యుమానాయిడ్ రోబోలను ప్రవేశపెట్టాయి. ఈ జాబితాలోకి 'ఫిగర్' (Figure) కూడా చేరనుంది.
ఫిగర్ తన హ్యూమనాయిడ్ రోబోట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే ఇంట్లో పనిచేయడానికి సంబంధించిన రోబోలను ఈ ఏడాది టెస్ట్ చేయనున్నట్లు.. కంపెనీ సీఈఓ 'బ్రెట్ అడ్కాక్' (Brett Adcock) ప్రకటించారు. మా ఏఐ హెలిక్స్ ఎవరూ ఊహించని దానికంటే వేగంగా ముందుకు వస్తోందని ట్వీట్ చేశారు.
ఫిగర్ హ్యూమనాయిడ్ రోబోలు తమ చుట్టూ ఏం జరుగుతోందో చూడటానికి, భాషను అర్థం చేసుకోవడానికి, ఇతరులతో మాట్లాడటానికి, ఏదైనా పనిని చేయడం నేర్చుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని పొందుతాయి. ఇంట్లో పనిచేసే రోబోలు మాత్రమే కాకుండా ఫ్యాక్టరీలలో పనిచేయడానికి ఉపయోగపడే రోబోలను కూడా కంపెనీ రూపొందిస్తోంది.
ఫ్యాక్టరీలలో పనిచేసే రోబోల కదలికలు, అవి ఎలా పనిచేస్తాయని అని చూపే వీడియో కూడా ఇక్కడ చూడవచ్చు. రోబోలు వాటికి కేటాయించిన ప్రాంతాల్లో వెళ్లి నిలబడి, బెల్ట్ కన్వేయర్ మీద వెళ్తున్న వస్తువులను పక్కకు తీయడం చూడవచ్చు. ఇలాంటి రోబోలు.. ఈ కామర్స్ లేదా లాజిస్టిక్ కంపెనీలలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఇక ఇంట్లో పనిచేసే రోబోల విషయానికి వస్తే.. ఇవి మనిషి మాదిరిగానే, ఇంట్లో ఉన్నవారికి సహాయం చేయడంలో ఉపయోగపడతాయి. ఫుడ్ అందించడం, గోడమీద పెయింటింగ్ ఫోటో సరిచేయడం.. యజమాని స్పందనకు ప్రతిస్పందించడం వంటివి కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డెలివరీలను తీసుకోవడం, మనిషిలాగే పని పూర్తయిన తరువాత రెస్ట్ తీసుకోవడం వంటివి చేస్తోంది. ఇంటి పనిలో సహకరించే రోబోలు.. ఫ్యాక్టరీలో పనిచేసే రోబోలు అందుబాటులోకి వచ్చిన తరువాత అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
Important update: Figure is launching robots into the home
Our AI, Helix, is advancing faster than any of us anticipated, accelerating our timeline into the home
Therefore, we've moved-up our home timeline by 2 years; starting Alpha testing this year pic.twitter.com/t1TU1TseJq— Brett Adcock (@adcock_brett) February 27, 2025
Source: Brett Adcock / X
Comments
Please login to add a commentAdd a comment