ప్రస్తుత అధునాతన సాంకేతిక యుగంలో రోబోల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. మనుషులతో మరమనుషులు కలిసి మనుగడ సాగించే రోజులు వస్తున్నాయి. ఇంటిని శుభ్రపరచడం, వంట చేయడం, షాపింగ్, ఇంటిని కాపలా కాయడం.. ఇలాంటి పనులన్నీ చకచకా చేసేసే హ్యూమనాయిడ్ రోబో వచ్చేసింది.
మానవ సమాజంతో మసలుకుంటూ వారికి అవసరమైన పనులన్నీ చేసి పెట్టే హ్యూమనాయిడ్ రోబోను 1X అనే నార్వేజియన్ కంపెనీ రూపొందించింది. దీని పేరు ఈవ్ (EVE). ఇది మనిషిలా కనిపిస్తుంది.. కదులుతుంది. ఇంకా ఇది ఏమేం పనులు చేయగలదు.. దీని ప్రత్యేకతలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం..
ఈవ్ ప్రత్యేకతలు
ఈవ్ ఒక అధునాతన హ్యూమనాయిడ్ రోబో. మనిషిలాగే కనిపిస్తుంది.. కదులుతుంది. అనేక ఫీచర్‌లు దీని సొంతం. పరిసరాలను గ్రహించడానికి, స్పందించడానికి చాలా కెమెరాలు, సెన్సార్‌లు ఉంటాయి. ఈవ్ 6 అడుగుల 2 అంగుళాల పొడవు, సుమారు 87 కేజీ బరువు ఉంటుంది. దీనికి ఉన్న చక్రాలతో గరిష్టంగా గంటకు 9 మైళ్ల వేగంతో కదులుతుంది. గ్రిప్పర్ చేతులతో సుమారు 15 బరువును మోసుకెళ్లగలదు. ఒక గంట ఛార్జ్‌తో ఆరు గంటలు పనిచేస్తుంది.
రుచికరంగా వంటలు
ఈవ్ స్మార్ట్, ఆండ్రాయిడ్ రోబో. వివిధ రకాల పనులను చేయడానికి చాట్‌జీపీటీ మాడిఫైడ్ వర్షన్ జీపీటీ-4 ఉపయోగిస్తుంది. ఇది మీరు చెప్పిన, మీకు నచ్చిన వంటకాలను రుచికరంగా చేసి వడ్డిస్తుంది. వంట చేసేందుకు ముందుగా కిచెన్‌లోని షెల్ఫ్‌లను స్కాన్ చేస్తుంది. ఏమేం పదార్థాలు, దినుసులు ఉన్నాయో గుర్తించి వాటితో రుచికరమైన వంటలు తయారు చేస్తుంది. ఇందుకోసం GPT-4V సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. అంటే వంటలో ఏది ఎంత వేయాలో అంత వేసి నోరూరించే పదార్థాలు చకచకా చేసేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment