cook
-
ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే.. ‘ఆహా ఏమి రుచి’ అనాల్సిందే!
వంట చేయడం ఒక కళ. ఇష్టంతో, నైపుణ్యం కలగలిస్తేనే వండిన ఏ ఆహారం అయినా రుచిగా ఉంటుంది. అందరూ వంట చేస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఆహా అనిపించేలా చేస్తారు. వంట కళలో ప్రావీణ్యం సంపాదించడానికి చాలా సమయం పడుతుంది. అన్ని సమపాళ్లలో కుదిరితేనే కదా మజా వచ్చేది. మీరు ఎంత గొప్ప ఛెఫ్ అయినా , కొన్ని చిట్కాలు పాటిస్తే మన వంట తిన్నవాళ్లు అద్భుతం అనాల్సిందే.! చికెన్, మటన్ కూరలు చేసేటపుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఉప్పు,కారం, పసుపుతోపాటు కాస్తంత నిమ్మరసం , పెరుగు కలిపి మారినేట్ చేసిన పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి, వండితే సూపర్ టేస్ట్ వస్తుంది.పులుసు కూరల్లో కాస్తం బెల్లం చేరిస్తే, దానికి వచ్చే రుచి అమోఘం. అలాగే పాయసం, క్షీరాన్నం లాంటి తీపి వంటకాల్లో కొద్దిగా ఉప్పు వేసి చూడండి.ఆలూ ఫ్రై, ఇతర వేపుళ్లు లాంటివి చేసేటపుడు పాన్ అంటుకోకుండా ఉండాలంటే, పాన్బాగా వేడెక్కే దాగా ఆగాలి. మూత పెట్టకుండా వేయించాలి. కొద్దిసేపు వేగాగా ఉప్పు వేసుకుంటే మూకుడుకి అంటుకోదు. పనీర్ కూరలకు చిటికెడు కార్న్‌ఫ్లోర్‌తో మెరినేట్ చేస్తే బెటర్అల్లం వెల్లులి పేస్ట్ తాజాగా ఉండాలంటే, ఈ పేస్ట్ చేసేటపుడు ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు చేర్చుకోవాలి. అలాగే తడి తగలకుండా జాగ్రత్త పడాలి. గాజు సీసాలో నిల్వ చేస్తే మంచిది. ఈ సీసాను ఎప్పటికపుడు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తాజాగా మంచి వాసనతో ఉంటుంది. అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా తాజాగాఉండాలంటే గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేసుకోవాలిపూరీలు, పకోడీలు వేయించే నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే పూరీలు, పకోడీలు పెద్దగా నూనె పీల్చవు. వీటిని వేయించడానికి తక్కువ నూనె పడుతుంది. కొత్తిమీర, పుదీనా, టార్రాగన్ లాంటి వాటిని కూరలు దింపేముందు వేస్తే రుచి బావుంటుంది. -
ఉడకబెట్టిన కూరలు : మెరిసే చర్మం, బోలెడన్ని పోషకాలు !
ఉడకబెట్టిన కూరగాయలు బరువు తగ్గాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడ తాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. అంతేకాదు అబ్బా, బోర్! ఏం తింటాంలే, రుచీ పచీ లేకుండా అని అస్సలు అనుకోకూడదు. దీని వల్ల బరువు తగ్గడంతోపాటు, అపారమైన ప్రయోజనాలనుతెలుసుకుంటే ఆశ్చర్య పోతారు.అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనాలు, కూరగాయలను ఉడకబెట్టడం వల్ల వాటి పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. మెత్తగా ఉడికి, తినడానికి సులువుగా ఉండటంతోపాటు, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఉడకబెట్టిన కూరగాయల వల్ల లాభాలుపచ్చివి తినడం కంటే ఉడకబెట్టినవి తింటే వాటిపైన ఉండే హానికరమైన సూక్ష్మక్రిములు నశిస్తాయి. తేలిగ్గా జీర్ణమవుతాయి.అసిడిటీ సమస్యకూడా ఉండదు. హెలికోబాక్టర్ పైలోరీ వంటి బాక్టీరియాతో సహా అనేక కారణాల వల్ల కడుపు మంట సంభవించవచ్చు. అందువలన ఉడకబెట్టి తింటే కడుపు మంటను నివారిస్తాయి. యాంటీఆక్సిడెంట్టు ఎక్కువగా అందుతాయి.ఉడక బెట్టడంలోపోషకాలు పెరుగుతాయి. ఉదా. క్యారెట్లను ఉడకబెట్టడం వల్ల చర్మ ఆరోగ్యానికి గొప్పగా ఉండే బీటా కెరోటిన్‌ను సంరక్షిస్తుంది.దీంతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడకబెట్టిన ఆహారం చాలా ఆక్సలేట్లను తొలగించి మూత్రపిండాల్లో రాళ్లను నిరోధించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇది మంచి చిట్కా.మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్త పోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. వీటన్నింటికీ మించి మేనిఛాయ మెరుగు పడుతుంది. బుజ్జాయిలకు మంచిదిఉడికించిన కూరగాయలు ఘనమైన ఆహారాన్ని తినడం ప్రారంభించే శిశువులకు గొప్ప ఎంపిక. చక్కటి పోషకాలు అందుతాయి. పిల్లలు జీర్ణం చేసుకోవడం సులభం. అంతేకాకుండా, రెడీమేడ్ బేబీ ఫుడ్స్‌తో పోలిస్తే ధర తక్కువ, పోషకాలు ఎక్కువ. ఏ యే కూరగాయలు తినవచ్చుమన రుచికి నచ్చే ఏ కూరనైనా తినవచ్చు. ఉడక బెట్టుకుని తినే కూరగాయల్లో అన్నీ ఒకే రకమైనవి కాకుండా, నీరు ఎక్కువగా ఉండే, బీరకాయ, సొరకాయ, ఉల్లి కాడలు లాంటివి కూడా చేర్చుకోవాలి. బీట్ రూట్, క్యారట్, ముల్లంగి, బీన్స్, క్యాప్సికమ్, బఠానీ లాంటివి ఆవిరి మీద ఉడక బెట్టుకొని తినవచ్చు. ఇంకా చిలగడదుంప, బ్రకోలీతోపాటు వివిధ ఆకుకూరలను చేర్చుకోవచ్చు. రుచికి కావాలనుకుంటే సన్నగా తరిగిన కొత్తిమీదర పచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలు, కొద్దిగా నిమ్మరసం కలుపు కోవచ్చు. బరువు తగ్గాలను కునేవారు దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ, దోసలు లాంటి స్థానంలో వీటిరి తింటే మంచి ఫలితం ఉంటుంది. -
ఇది కిచెన్‌లో ఉంటే.. టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు..
చాలామంది వేడివేడి రుచులను కోరుకుంటారు. కొన్నిసార్లు ఏదో కారణంతో ఆలస్యం అయినప్పుడు వంటకాల వేడి చల్లారిపోయి, తినాలన్న ఆసక్తి కోల్పోతారు. ఆ సమస్యను దూరం చేస్తుంది ఈ ఎలక్ట్రిక్ వార్మింగ్ ట్రే. ఇది కిచెన్ లో ఉంటే టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు స్నాక్స్ టైమ్‌లో కూడా వేడివేడి పదార్థాలనే అందుకోవచ్చు. అంతే కాకుండా, టీ, కాఫీ వంటి వేడి పానీయాలను ఫ్లాస్క్‌లో భద్రపరచుకోవాల్సిన పనిలేదు.పార్టీలు, ఫంక్షన్ల సమయంలో కూడా ఈ ట్రే ఉంటే, ఆరగించే రుచులు ఎప్పటికప్పుడు వేడివేడిగా పొగలు కక్కుతూ ఉంటాయి. కేవలం కొన్ని నిమిషాల ముందు ఈ ట్రే మీద వేడి చేయాలనుకున్న వంటకాలను, కాఫీ, టీ వంటి పానీయాలను ఉంచితే సరిపోతుంది. దీనిలో 216 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 316 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు త్రీ మోడ్స్ టెంపరేచర్ ఆప్షన్ ఉండటంతో, ఏది ఎంత వేడి కావాలో అంతే పెట్టుకునే వీలుంటుంది. దీనిపైన సిరామిక్ టేబుల్ వేర్, గ్లాస్ వేర్‌తో పాటు క్యాస్రోల్ మెటల్ కలిగిన ఏ పాత్రలోని ఆహార పదార్థాలనైనా, పానీయాలనైనా వేడి చేసుకోవచ్చు.శాండ్విచ్ అండ్ మోర్..ఈ రోజుల్లో ఇలాంటి ఒక మేకర్ ఇంట్లో ఉంటే, నచ్చిన అల్పాహారం, నచ్చిన చిరుతిళ్లను ఇట్టే సిద్ధం చేసుకోవచ్చు. మెల్ట్, టోస్ట్, ఫ్రై వంటి చాలా ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. దీని మీద ఆమ్లెట్, పాన్ కేక్స్, కట్లెట్స్తో పాటు శాండ్విచ్, బర్గర్స్ వంటివీ రెడీ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం ఏడు సెట్టింగ్స్ ఉంటాయి.దీన్ని ఓపెన్ చేసుకుని, రెండు వైపులా అధిక మోతాదులో ఆహారాన్ని వండుకోవచ్చు. లేదంటే ఫోల్డ్ చేసుకుని, ఒకేసారి నాలుగు శాండ్విచ్లను రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసుకున్నాక లాక్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. దాంతో ఇందులోని పదార్థాలు వేగంగా బేక్ అవుతాయి. దీనిలోని నాణ్యమైన నాన్–స్టిక్ ప్లేట్ డివైస్‌కి అటాచ్ అయ్యే ఉంటుంది. దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ మేకర్ని ఇతర ప్రదేశాలకు సులభంగా తీసుకెళ్లొచ్చు!టేబుల్‌టాప్ బార్బెక్యూ గ్రిల్..కుటుంబంతో లేదా స్నేహితులతో పిక్నిక్లకు, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు.. ఇలాంటి ఓ బార్బెక్యూ గ్రిల్‌ని వెంట తీసుకుని వెళ్తే, వేళకు క్రిస్పీ రుచులను అందుకోవచ్చు. ఇది బొగ్గులతో లేదా చెక్క ముక్కలతో పని చేస్తుంది. దీని అడుగున వాటిని వేసి, నిప్పు రాజేసి పైన గ్రిల్ అమర్చుకోవాలి. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా దీని మీద చాలా టేస్టీగా గ్రిల్ చేసుకోవచ్చు.పైగా దీనికి అదనంగా ఒక వుడెన్ ట్రే, ఫుడ్ స్టోరేజ్ ట్రే లభిస్తాయి. వుడెన్ ట్రే మీద వంట చేసుకునే ముందు ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇక స్టోరేజ్ ట్రేను వంట పూర్తి అయిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. దీనికి ముందువైపు కదలకుండా లాక్ చేసుకునే వీలుండటంతో ఈ గ్రిల్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఇరువైపులా హ్యాండిల్స్ ఉండటంతో వంట అవుతున్న సమయంలో కూడా ఒకచోట నుంచి మరోచోటికి సులువుగా కదల్చవచ్చు. -
Cris Comerford: ఆ రుచికి రిటైర్మెంట్
‘విందు భోజనం అంటే సరైన సమయంలో సరైన పదార్థం అందించడమే’ అంటుంది క్రిస్ కమర్‌ఫోర్డ్. అన్య జాతులకు ప్రవేశం లేని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వంటశాలలో ప్రవేశం సాధించిన మొదటి మహిళ ఆమె. తొలి శ్వేత జాతీయేతర మహిళ కూడా! 30 ఏళ్లు వైట్‌హౌస్‌లో పని చేశాక తన 61వ ఏట జూలై 31న ఆమె రిటైర్ అయ్యారు. ఎందరో దేశాధినేతలకు తన చేతి వంట తినిపించిన క్రిస్ కమర్‌ఫోర్డ్ పరిచయం.‘అమెరికాకు అనేక మంది రాయబారులు ఉంటారు. కాని క్రిస్ కమర్‌ఫోర్డ్ షెఫ్‌గా ఉండక శాకపాకాల రాయబారి వలే అలాంటి పనే చేశారు. అమెరికా రుచులను ప్రపంచనేతలకు పంచి ఎలా ఉత్సవభరితం చేయవచ్చో చూపించారు’ అని క్రిస్ కమర్‌ఫోర్డ్ రిటైర్మెంట్ సందర్భంగా ఆమె సమకాలిక షెఫ్ ఒకరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు జో బైడన్ సతీమణి జిల్ బైడన్ ‘క్రిస్ కమర్‌ఫోర్డ్ తన టీమ్‌తో కలిసి ప్రేమ, ఆ΄్యాయతలతో కూడిన రుచులతో మా ఆత్మలను నింపారు’ అని వీడ్కోలు సందేశంలో పేర్కొంది. క్రిస్ కమర్‌ఫోర్డ్ విజయగాథ...ఫిలిప్పైన్స్ నుంచిక్రిస్ కమర్ఫోర్డ్ది ఫిలిప్పైన్స్. మనీలాలో బాల్యం గడిచింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఫుడ్ టెక్నాలజీలో పి.జి. చేయాలనుకుంది. ‘నాకు సైన్స్ ఇష్టం. ఫుడ్ టెక్నాలజీలో పరిశోధన చేయాలనుకున్నాను. కాని మా నాన్న నువ్వు కలనరీ ఇన్స్టిట్యూట్లో చదివితే ఇంకా రాణిస్తావు అన్నాడు. నేను మా నాన్న సలహాను పాటించడం వల్లే పాకశాస్త్రం తెలుసుకొని వైట్‌హౌస్ దాకా వచ్చాను. కాబట్టి పెద్దల మాట వినండి’ అంటుంది క్రిస్ కమర్‌ఫోర్డ్. తన 23వ ఏట అమెరికా వలస వచ్చిన క్రిస్ మొదట షికాగో, తర్వాత న్యూయార్క్ రెస్టరెంట్లలో పని చేసింది. వైట్‌హౌస్‌లో వంటశాలలో మహిళలను తీసుకోక΄ోయినా, శ్వేతజాతీయేతర మహిళలను తీసుకునే అవకాశం అసలు లేక΄ోయినా 1995లో నాటి ఎగ్జిక్యూటివ్ షెఫ్ వాల్టర్ స్టాన్లీ ఆమెను అసిస్టెంట్ షెఫ్‌గా తీసుకున్నాడు.మన్మోహన్ సింగ్‌తో ప్రమోషన్నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2005లో అమెరికా సందర్శించినప్పుడు వైట్ హౌస్‌లో భారీ విందు జరిగింది. దానికి కావలసిన వంటా వార్పు అంతా క్రిస్ చూసింది. విందుకు హాజరైన వారంతా ఆహా ఓహో అన్నారు. క్రిస్ ప్రతిభ గమనించిన జార్జ్‌బుష్ సతీమణి లారా బుష్ ఆమెకు ఎగ్జిక్యూటివ్ షెఫ్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ షెఫ్ వైట్‌హౌస్‌లోని సకల వంటా వార్పులకు సర్వోన్నత అధికారి. ఆమె పర్యవేక్షణలోనే దేశాధినేతలు వచ్చినప్పుడు వైట్‌హౌస్‌లో ఇచ్చే గౌరవ విందు, హాలిడే ఫంక్షన్లు, రిసెప్షన్లు, అధికారిక విందులు జరుగుతాయి.ఆహారమే ఆరోగ్యం‘దేశ భవిష్యత్తు నిర్మించడమంటే నేటి బాలలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే’ అంటుంది క్రిస్. ‘పాకశాస్త్రం తెలిసిన వారు ఏది ఉత్తమమైన ఆహారమో ఏది ΄ûష్టికతతో నిండినదో తర్వాతి తరాలకు తెలియ చేయాలి. పిల్లలు మెచ్చుకునే రీతిలో ఆరోగ్యకరమైన వంటలు చేయగలగాలి. వారిని కూరగాయలతో గడపనివ్వాలి. కూరగాయల మడులకు తీసుకెళ్లాలి. వంట పట్ల అభిరుచి, అవగాహన కలిగించాలి’ అంటుందామె. వంట ఒక సవాలువైట్ హౌస్‌లో వంట ఒక సవాలు. జపాన్ దేశాధినేత వచ్చినప్పుడు ఒక మెనూ, కెన్యా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఒక మెనూ, భారత ప్రధాని వచ్చినప్పుడు మరో మెనూ తయారు చేయాలి. ఒకోసారి ఆయా దేశాలకు చెందిన వంటవాళ్లను రప్పించి వారితో కలిసి వండాలి. ‘ప్రతి విందుకు నాలుగు రోజుల ముందు నుంచే సిద్ధమవుతాం. సలాడ్లు తాజాగా ఉండేందుకు ఆ రోజున వైట్‌హౌస్‌లోని తోట నుంచి ఆకులు, దుంపలు సేకరిస్తాం. పండిన కూరగాయలు వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. వైట్ హౌస్‌లో ఉపయోగానికి రాక΄ోతే అవసరమైనవారికి పంపించేస్తాను’ అంది క్రిస్. -
యాపిల్ లో ఉద్యోగం కావాలా..?
-
మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
మంచి రుచికరంగా వంట చేయడం ఓ కళ. అయితే ఇప్పుడూ చాలా విభిన్నమైన కొత్త కొత్త రుచులు వచ్చేస్తునన్నాయి. అంతా వాటిని ట్రై చేస్తున్నారు కూడా. అయితే రుచికి మాత్రమే కాదు, వండే విధానానికి కూడా ప్రాధాన్యం ఇవ్వమని హెచ్చరిస్తోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్). వండేటప్పుడూ మూత పెట్టకుండా వండితే ఇక అంతే సంగతులను గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. దీని వల్ల ఎక్కవసేపు మంటమీద ఉడికించాల్సి రావడమే గాక ఆరోగ్యానికి హనికరమని చెబుతుంది. ఎలా వండితే మంచిదో కూడా వెల్లడించింది. అవేంటో సవివరంగా చూద్దామా..!ఓపెన్ మూత వర్సెస్ క్లోజ్డ్ వంట:మూత పెట్టి కూరలు వండితే సమయం ఆదా అవ్వడమే గాక పోషకాల నష్టం కూడా ఉండదని చెబుతోంది. అదే మూత లేకుండా వండితే..ఎక్కువసేపు పట్టడమేగాక ఆహార పదార్థాలు ఎక్కువ సేపు ఉష్ణోగ్రతలోనే ఉడకటంతో పోషకల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తోంది. అలాగే మూత పెట్టి వండే వంటలో త్వరితగతిన వండేయగలం, మంచి పోషకవంతంగా ఉంటుందని చెబుతోంది. ముఖ్యంగా ఆకుపచ్చ కూరలను మూతపెట్టి వండితే కూర రంగు మారి, పోషకాల నష్టాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. ఆరోగ్యకరమైన వంట పద్ధతులు..పప్పు దినులు పోషక నాణ్యత ఉండాలంటే మూత పెట్టి ఉడకించడం లేదా ప్రెజర్ కుక్కర్లో వంట చేయడం ఉత్తమం అని చెబుతోంది. అంటే మూతపెట్టి ప్రెజర్లో తగు మోతాదులో ఉడకించడం వల్ల పోషకాల నష్టం జరగకుండా కాపాడటమే గాక తొందరగా ఉడికిపోతాయి. పైగా ఆయా ఆహారపదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. అదీగాక ఇలా వంట చేయడం వల్ల ఆయా పదార్థాల ఆకృతిమారి, రుచికరంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి కూడా. దీని వల్ల హానికరమైన సూక్ష్మజీవులు ప్రమాదం కూడా ఉండదని, ఆహారం కలుషితం కాదని ఐసీఎంఆర్ పేర్కొంది. మైక్రోవేవ్‌లో వంట మంచిదేనా..ఇక్కడ మైక్రోవేవ్ కూడా త్వరితగతిన వండేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఎక్కువసేపు మంట మీద ఉడకించే పద్ధతులతో పోలిస్తే పోషకాలు విచ్ఛిన్నం కాకుండా తక్కవ టైంలోనే త్వరితగతిన వండేసే పద్ధతులు బెటర్ అని చెప్పకనే చెప్పింది. మైక్రోవేవ్‌లో తక్కువ టైంలోనే ఆహార పదార్థాలు ఉడికిపోతాయి కాబట్టి విటమిన్లు, ఇతర పోషకాలు నష్టపోకుండా చేయడంలో సహాయ పడుతుందని ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో పేర్కొంది.(చదవండి: రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..! ఇంటర్ ఫెయిల్ అవ్వడమే..!) -
వారెవ్వా..నీరజ!.. మొత్తానికి సాధించింది..!
మనం చదువు లేదా డ్యాన్స్ ఏదైనా కష్టపడి నేర్చుకుంటే ఏదో పెద్ద సాధించేశాం అనుకుంటాం. చాలా గర్వంగా కూడా ఫీలవ్వుతాం. తన తోటి వాళ్లకంటే మనమే బెటర్ అయితే ఇక మన ఆనందానికీ హద్దులే ఉండవు. కానీ ఇలాంటి అవకాశాలు ఏమిలేని కటిక దారిద్యం అనుభవిస్తున్న కడు పేదవారికి వారికి బతుకు పోరాటమే ఎన్నో అసామాన్యమైన నైపుణ్యాలనును అలవోకగా నేర్చకునేలా చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ నీరజ అనే పనమ్మాయి కథ..! పొట్టకూటి కోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చిన వేలాది మందిలో నీరజ అనే మహిళ ఒకరు. ఆమె పనిమ్మాయిగా ఇళ్లల్లో పనిచేసే పొట్ట పోషించుకుంటోంది. ఇక్కడ నీరజ ఏదో ఒక్క ఇంట్లో కాదు, రెండు మూడు ఇళ్లల్లో పనిచేస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే..ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లాలంటే కనీసం అరగంట పడుతుంది. అంటే రోజు మొత్తంలో రెండు గంటల నడకకే పట్టేస్తుంది. ఇంత ఇబ్బంది ఉన్నా ఆమె పని మానదు. పైగా ఈ బతుకు పోరులో ఈ పాట్లు తప్పవని రాజీపడిపోయింది నీరజ. ఇక్కడే అసలే కథ మొదలయ్యింది. తనకు వేళకింత వండిపెట్టే పనమ్మాయికి కష్టం తగ్గించాలని అనుకున్నాడో యజమాని. ఏమ్మా..! నువ్వు సైకిల్ నేర్చుకోవచ్చు కదా..! రోజూ నడుచుకుంటూ ఇంతలా కష్టపడకపోతే అన్నాడు యజమాని. ఆ మాటకు నీరజ ..చాల్లేండి సారు..ఇప్పుడూ ఈ వయసులో నేను నేర్చుకోవడం చూస్తే ఎవ్వరైన నవ్వరూ అంటూ నవ్వేసి ఊరుకుంది నీరజ. అయితే ఆ యజమాని మాత్రం వీలు చిక్కినప్పుడల్లా ‘‘సైకిల్ ఎప్పుడు నేర్చుకుంటున్నావు’ అని పోరు పెడుతూనే ఉండేవాడు. కొన్ని నెలలు తర్వాత ఆయన చేత అస్తమాను చెప్పించుకోవడం ఎందుకు? అస్సలు నేను ప్రయ్నత్నిస్తే ఏమవుతుంది అనుకుంది. వెంటనే యజమానితో నేర్చకుంటాను సార్ అని చెప్పేసింది. దీంతో ఆయన సైకిల్‌కు అయ్యే ఖర్చులో కొంత యజమాని పెట్టుకోగా మిగతా డబ్బు నీరజ పెట్టుకుని ఓ మంచి సైకిల్ కొనుక్కుంది. అలా పనులు అయిపోయాక అపార్ట్మెంట్ సెల్లార్లోనే సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేసేది. కొంతకాలానికి పర్ఫెక్ట్ అయిపోయింది. అయితే ఇందులో ఏముంది అని అని తేలిగ్గా తీసేయకండి. ఎందుకంటే..నీరజకు ఈ సైకిల్ పుణ్యామా అని రోజు మొత్తం మీద దాదాపు రెండు గంటల నడక తప్పింది. పైగా సులభంగా ఇంటింటికి వెళ్లి తొందరగా పనిచేసుకోగలుగుతోంది. ఇంకాస్త సమయం అనుకూలిస్తే ఇంకొక్క రెండిళ్లలో కూడా పనిచేసుకునే వెసులుబాటు దక్కుతుంది. నాలుగురాళ్లు వెనకేసుకోగలుగుతుంది కూడా. ఇక్కడ నైపుణ్యం అంటే ఏదో కోచింగ్ సెంటర్లు, కాలేజ్‌ల్లో నేర్చుకున్నదే అనుకుంటే పొరబడ్డట్టే. ఒక్కోసారి మన చుట్టు ఇలా చిన్న చితక పనులు చేసి బతికేవాళ్లకు ఆ యజమానిలా ప్రోత్సహం అందిస్తే వాళ్లు కూడా ఈజీగా నైపుణ్యాన్ని అందిపుచ్చుకోగలరు, సాధించగలరు అనేందుకు ఉదహారణ ఇది. అందుకు సంబంధించిన వీడియోని నరేష్ అనే హైదరాబాదీ ట్వీటర్లో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. My cook Neeraja, walks 25 minutes each way to work. She works another 2 homes too. Totally she spends almost 1.5 to 2 hours commuting daily by walk. Inspired by @sselvan I encouraged her to cycle. Her initial response was that everybody in her neighbourhood will laugh and tease… pic.twitter.com/ydse28ic5x — Naresh (@TopDriverIndia) April 17, 2024 (చదవండి: బిస్కెట్ జాత్రా..!: ఇదేం జాతర రా నాయనా..!) -
‘శెభాష్ ప్రజ్ఞ’.. సీజేఐ సన్మానం
న్యూఢిల్లీ: కలలు కనడం సులువే. వాటిని నెరవేర్చుకోవడమే కష్టం. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో కలలు సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో ఒకరే ప్రజ్ఞ. సుప్రీంకోర్టులో పని చేస్తున్న వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ(25) అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు ఇతర న్యాయమూర్తులు బుధవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశానికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగంపై రచించిన మూడు పుస్తకాలపై వారంతా సంతకాలు చేసి, ఆమెకు బహూకరించారు. స్వయంకృషి, పట్టుదలతో ప్రజ్ఞ ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో ఆమెకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. పిల్లలు వారి కలలు నెరవేర్చుకొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులపైనా ఉందని సూచించారు. సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రజ్ఞ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని కూడా న్యాయమూర్తులు సన్మానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో మాస్టర్స్ చదవడానికి ప్రజ్ఞకు అవకాశం దక్కింది. స్కాలర్షిప్ లభించింది. ఆమె తండ్రి అజయ్ సమాల్ సుప్రీంకోర్టు వంట మనిషి. న్యాయశాస్త్రంలో ఉన్నత చదవులు చదవడానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ తనకు స్ఫూర్తిగా నిలిచారని ప్రజ్ఞ చెప్పారు. ప్రజ్ఞ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్‌లో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. -
EVE: రుచికరమైన వంటలు చేసే రోబో!
ప్రస్తుత అధునాతన సాంకేతిక యుగంలో రోబోల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. మనుషులతో మరమనుషులు కలిసి మనుగడ సాగించే రోజులు వస్తున్నాయి. ఇంటిని శుభ్రపరచడం, వంట చేయడం, షాపింగ్, ఇంటిని కాపలా కాయడం.. ఇలాంటి పనులన్నీ చకచకా చేసేసే హ్యూమనాయిడ్ రోబో వచ్చేసింది. మానవ సమాజంతో మసలుకుంటూ వారికి అవసరమైన పనులన్నీ చేసి పెట్టే హ్యూమనాయిడ్ రోబోను 1X అనే నార్వేజియన్ కంపెనీ రూపొందించింది. దీని పేరు ఈవ్ (EVE). ఇది మనిషిలా కనిపిస్తుంది.. కదులుతుంది. ఇంకా ఇది ఏమేం పనులు చేయగలదు.. దీని ప్రత్యేకతలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం.. ఈవ్ ప్రత్యేకతలు ఈవ్ ఒక అధునాతన హ్యూమనాయిడ్ రోబో. మనిషిలాగే కనిపిస్తుంది.. కదులుతుంది. అనేక ఫీచర్లు దీని సొంతం. పరిసరాలను గ్రహించడానికి, స్పందించడానికి చాలా కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఈవ్ 6 అడుగుల 2 అంగుళాల పొడవు, సుమారు 87 కేజీ బరువు ఉంటుంది. దీనికి ఉన్న చక్రాలతో గరిష్టంగా గంటకు 9 మైళ్ల వేగంతో కదులుతుంది. గ్రిప్పర్ చేతులతో సుమారు 15 బరువును మోసుకెళ్లగలదు. ఒక గంట ఛార్జ్‌తో ఆరు గంటలు పనిచేస్తుంది. రుచికరంగా వంటలు ఈవ్ స్మార్ట్, ఆండ్రాయిడ్ రోబో. వివిధ రకాల పనులను చేయడానికి చాట్‌జీపీటీ మాడిఫైడ్ వర్షన్ జీపీటీ-4 ఉపయోగిస్తుంది. ఇది మీరు చెప్పిన, మీకు నచ్చిన వంటకాలను రుచికరంగా చేసి వడ్డిస్తుంది. వంట చేసేందుకు ముందుగా కిచెన్‌లోని షెల్ఫ్‌లను స్కాన్ చేస్తుంది. ఏమేం పదార్థాలు, దినుసులు ఉన్నాయో గుర్తించి వాటితో రుచికరమైన వంటలు తయారు చేస్తుంది. ఇందుకోసం GPT-4V సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. అంటే వంటలో ఏది ఎంత వేయాలో అంత వేసి నోరూరించే పదార్థాలు చకచకా చేసేస్తుంది. -
బాధ కాదు బాట చూడాలి..
బెంగళూరుకు చెందిన వీణా అంబరీష బస్సు ప్రమాదంలో కుడి కాలిని కోల్పోయింది. ఆ తరువాత డిప్రెషన్ బారిన పడింది. ఆ చీకటి నుంచి అతి కష్టం మీద బయటపడి అర్ధంతరంగా ఆగిపోయిన చదువును కొనసాగించింది. ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘కరీ దోశ’ పేరుతో ఫుడ్ స్టాల్ ప్రారంభించి తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది వీణా అంబరీష. కొన్ని సంవత్సరాల క్రితం.. భరతనాట్యం డ్యాన్సర్ అయిన వీణ తన ఆరంగేట్రం కోసం సన్నాహాలు చేసుకుంటోంది. కాలేజీకి వెళ్లడానికి రోడ్దు దాటుతున్నప్పుడు బస్సు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై కుడికాలు కోల్పోయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తరువాత వాకింగ్ స్టిక్‌తో నడవడం మొదలు పెట్టింది. చాలా కష్టంగా అనిపించేది. భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్న వీణ తనకు జరిగిన ప్రమాదాన్ని జీర్ణించుకోలేపోయింది. కలల రెక్కలు విరిగిన బాధ ఆమె కళ్లలో కన్నీరై కనిపించేది. ‘నాకు ఇలా జరిగిందేమిటి!’ అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల వీణ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందంటే.. ‘ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదు’ అని బలంగా అనుకునేంతగా. అయితే వీణ తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక దృశ్యం కారణం అయింది. ఆ దృశ్యం తనకు వేకప్–కాల్‌గా పనిచేసింది. ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవడానికి విక్టోరియా హాస్పిటల్‌కు వెళ్లిన వీణ అక్కడ ఒక మహిళను చూసింది. ఆమెకు రెండు కాళ్లు లేవు. ఆమె తన బిడ్డను లాలిస్తూ బువ్వ తినిపిస్తోంది. ఒక క్షణం ఆమె ముఖం వైపు చూసింది వీణ. రవ్వంత బాధ కూడా ఆమె ముఖంలో కనిపించలేదు. జీవనోత్సాహంతో ఆ ముఖం వెలిగిపోతోంది. తాను ఏవైతే పెద్ద సమస్యలు అనుకుంటుందో అవి గాలిలో దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఈ ఒక్క దృశ్యం వీణ ఆలోచనలో పూర్తిగా మార్పు తీసుకువచ్చింది. ‘ఏదో సాధించాలి’ అనే ఉత్సాహం మనసులోకి వచ్చింది. ఆగిపోయిన చదువును కొనసాగించింది. మంచి మార్కులతో పరీక్షలు పాసైంది. ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేసింది. బ్యాంకులలో సేల్స్ ఆఫీసర్‌గా, ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ టెస్టర్‌గా పనిచేసింది. ఒకవైపు గంటల కొద్దీ చేసే ఉద్యోగం.. మరోవైపు పిల్లల ఆలనా పాలనా కష్టమనిపించింది. ఒక సౌత్ అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎడతెగకుండా జరిగే మీటింగ్‌లు, పనిభారం వల్ల కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో పదిహేను రోజులు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది వీణ. దానికి ఫిట్నెస్ ట్రెయినర్ అయిన ఆమె భర్త ప్రోత్సాహం తోడైంది. గత సంవత్సరం బెంగళూరులో ‘కరీ దోశ’ పేరుతో దోశ స్టాల్ మొదలు పెట్టినప్పుడు ‘ఎంబీఏ చదివి ఇదేమిటీ’ అన్నట్లుగా మాట్లాడారు కొద్దిమంది. వారి మాటలేవీ పట్టించుకోలేదు వీణ. ప్రత్యేకత ఉంటేనే ఫుడ్ స్టాల్ అయినా పెద్ద వ్యాపారమైనా విజయం సాధిస్తుంది. మరి ‘కరీ దోశ’ స్పెషల్ ఏమిటి? కరీ దోశే! తమిళనాడులోని మధురై ప్రాంతంలో ‘కరీ దోశ’గా పిలిచే వేడి వేడి దోశ దానిపై ఆమ్లెట్, మటన్ కీమా చాలా ఫేమస్. కరీ దోశ బెంగళూరులో కూడా హిట్ అయింది. ఈ దోశ కోసం కస్టమర్లు పొద్దున్నే లైన్ కడతారు. స్టాల్ ప్రారంభించడానికి ముందు ‘కరీ దోశ’ రుచులలో ప్రావీణ్యం సంపాదించడానికి రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంది వీణ. వంటగది తన పాఠశాలగా, ప్రయోగశాలగా మారింది. ‘కరీ దోశ’ స్టాల్ పొద్దున ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అందుబాటులో ఉంటుంది. ఇక మిగిలిన సమయమంతా ఇంట్లోనే పిల్లలతో గడుపుతుంది వీణ. చిరునవ్వే సందేశం.. బాధ లేనిది ఎవరికి? బాధ పడుతూ కూర్చోవడం కంటే దాని నుంచి బయటపడడానికి కొత్తబాట వెదకాలి. మనకంటే ఎక్కువ బాధలు పడుతున్న వారు, పెద్ద పెద్ద సమస్యల్లో ఉన్న వారు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నారు. అంత కష్టంలోనూ వారి పెదవి మీద కనిపించే చిరునవ్వు మనకు సందేశాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. – వీణా అంబరీష ఇవి చదవండి: World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త! -
మల్టీఫంక్షనల్ పర్ఫెక్ట్ కుక్వేర్
శాండివిచ్ దగ్గర నుంచి వాఫిల్స్ వరకు అన్నింటినీ సిద్ధం చేయడంలో ఈ డివైస్ ప్రత్యేకం. వెజ్, నాన్‌వెజ్ అనే తేడా లేకుండా భోజన ప్రియులకు నచ్చిన రుచులను నిమిషాల్లో అందించే మల్టీఫంక్షనల్ బ్రేక్ ఫస్ట్ మేకర్ ఇది. అన్నివిధాలా సౌకర్యవంతంగా పనిచేస్తుంది. పైగా దీన్ని పట్టుకుని వెళ్లడానికి వీలుగా ఒకవైపు ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది. ముందువైపు లాక్ చేసుకునే వీలుతో పాటు టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి రెగ్యులేటర్ కూడా ఉంటుంది. డివైస్‌ను నిలబెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన స్టాండ్స్ ఉంటాయి. దానికే పవర్ కనెక్టర్‌ని చుట్టి పక్కకు స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్లెట్స్, కట్లెట్స్ ఇలా చాలానే వండుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాఫిల్స్ ప్లేట్, గ్రిల్ ప్లేట్లను మార్చుకుంటూ ఉండొచ్చు. (చదవండి: ఈ చీజ్ ధర వింటే ..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!) -
లాఠీ పట్టుకుని బోర్ కొట్టిందేమో! ఏకంగా గరిట పట్టుకుని..
కాసేపు లాఠీని పక్కనపెట్టి గరిటను పట్టుకుందాం అనుకుని కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ వారు ఈ వానల్లో వేడివేడిగా వంట చేశారు. వీడియో కూడా తీశారు. వాళ్లు లొట్టలేసుకు తింటుంటే నెటిజన్లు‘ఈ మాత్రం కళాపోషణ’ ఉండాలి అని మెచ్చుకున్నారు. కాని పోలీసు బాసులు మాత్రం వేరొకటి తలచారు. ఏమా వంట? ఏమా వైరల్? ఆ పోలీసులు ఇంట్లో వంట చేసుకుని ఉంటే బాగుండు. కాని వానాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించిందో ఏమో, కొంచెం బోర్ను బ్రేక్ చేద్దాం అనుకున్నారో ఏమో ఏకంగా స్టేషన్లోనే వంట చేశారు. ఆ చేయడం వీడియోలో షూట్ చేసి ఇన్‌స్టాలో పెట్టారు. చూసిన జనం ఈ మాత్రం సర్దా ఉండాల్లే అని ముచ్చట పడితే పోలీసు బాసులు మాత్రం కయ్యిమన్నారు. అసలేం జరిగిందంటే కేరళలోని ఇలవుంతిట్ట అనే స్టేషన్లో పోలీసులు వంట చేసుకు తిన్నారు. చికెన్‌ని తేవడం, ముక్కలు కొట్టించడం, కూర చేయడం, మటన్ కూర, దాంతో పాటు చిలగడదుంపల సంగటి కెమెరా ముందు అద్భుతంగా వండారు. పెద్ద పెద్ద అరిటాకులు తెచ్చి స్టేషన్ ఎస్.ఐతో పాటు అందరూ ఆరగించారు. దానికి మంచి పాట జత చేశారు. వీడియో సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది... జనం రకరకాల సరదా కామెంట్లు చేశారు. ‘అప్పుడప్పుడు తినండోయ్... ఎప్పుడూ డ్యూటీయేనా’ అన్నారు. కాని ఈ వీడియో పోలీస్ బాస్‌ల కంట పడింది. ఆ ఏరియా ఐ.జి ‘ఈ విధంగా డ్యూటీలో వండుకు తినడం ఏ విధంగా విధులకు భంగకరం కాదో’ వివరణ ఇమ్మని ఆదేశించాడు. మరి ఐ.జి గారికి ఎక్సప్లనేషనే పంపుతారో ఇంకో కూర వండి కూల్ చేస్తారో తెలియదు. (చదవండి: వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!) -
అవుట్డోర్ కుక్వేర్..ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు!
అలా సరదాగా పిక్నిక్ కు వెళ్లి.. ఆరుబయట ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వేడివేడిగా భోజనం తింటే ఎంత ఆనందంగా ఉంటుంది? చిన్నప్పుడు ఊళ్లలో వంటలకని వెళ్లేవాళ్లు. అక్కడే దొరికే కర్రముక్కలతో వంట పొయ్యి చేసి కుండల మీద వండి భోజనాన్ని సిద్ధం చేసుకునేవారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మయం. మరేం చేయాలి? ఇదిగో మా దగ్గర జవాబు ఉందంటున్నాయి కంపెనీలు. క్యాంపింగ్స్, పిక్నిక్స్, లాంగ్ డ్రైవ్స్ లాంటివి మెమొరీస్‌గా నిలిచిపోవాలంటే.. అక్కడ పరిసరాలతో పాటు చక్కటి ఆహారం దొరకాలి. లేదంటే ఆరోగ్యం చెడి.. ట్రిప్‌కి వెళ్లొచ్చిన ఆనందాన్ని మిస్ అవుతాం. అందుకే చాలా మంది.. మంచి కుక్వేర్ని వెంట తీసుకెళ్తుంటారు. చిత్రంలోని కుక్వేర్ అలాంటిదే. ఈ పరికరాన్ని చేత్తో సులభంగా పట్టుకెళ్లొచ్చు. దీని హ్యాండిల్స్ డివైస్‌కి ఇరువైపులా బల్ల మాదిరిగా ఉండి.. స్టోరేజ్‌కి ఉపయోగపడతాయి. outdoor cooking - something healthy & fresh ... my daughters volunteered to cook 👌 mahimahi slices, baigani tavu & roasted corn 🤙 pic.twitter.com/3yLBwMMTnr— Moira Vilsoni-Raduva (@mvilsoni_fj) July 8, 2023 గ్స్ కూడా ఫోల్డ్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. కిందవైపు సొరుగుల్లో చెక్కముక్కలు లేదా బొగ్గులు వేసుకుని నిప్పు రాజేసుకోవాలి. దానికి ప్రత్యేకమైన డోర్ ఉంటుంది. పొగవాసన బయటికి పోవడానికి వెనుకవైపు ప్రత్యేమైన గొట్టాన్ని అమర్చుకోవచ్చు. దీన్ని వేరుచేసి డివైస్ లోపల సొరుగులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరంపై అన్ని రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. అందుకు తగ్గ పాత్రలను మార్చుకోవచ్చు. లాంగ్‌డ్రైవ్‌లో చక్కగా ఉండటమేగాక హాయిగా ఇంటి భోజనం చేశామన్నా సంతృప్తి దొరకుతుంది కదా!. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మరీ. (చదవండి: ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..) ఔట్ డోర్ లో సులభంగా వండే 30 వంటలు 30 Picnic Recipes (and 6 Complete Menus) for a Perfect Outdoor Feast. Picnic as single person with my walker??? Not really, I cook/eat at home only.https://t.co/cTcHwkzWif pic.twitter.com/CAyMhdHqBE— Marion Friedl #ForUkraine #Boostered #PostVac (@marillion13) July 15, 2023 -
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు ఈనెల నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈనెల నుంచి ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్–కమ్ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. శనివారం తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యాసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం.... పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్.ఎం.సి) అప్పగించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. -
ఈ కూరగాయలు నేరుగా తింటున్నారా?ఇందులోని విషపూరిత బాక్టీరియా..
మనకు ఆహార పదార్థాలలో కొన్ని వండకుండా నేరుగా తినేయవచ్చు, మరికొన్నింటిని తప్పకుండా వండుకొనే తినాలి. మనలో చాలా మంది కొన్ని కూరగాయలను పచ్చిగా తినడమే ఆరోగ్యకరం అని నమ్ముతారు. అయితే అన్ని సందర్భాలలో.. అన్ని కూరగాయల విషయంలో అది మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా పచ్చిగా తినకూడని కూరగాయలేమిటో తెలుసుకుందాం. కొన్ని కూరగాయలలో సహజమైన విషపూరిత సమ్మేళనాలు, జీర్ణం కావడానికి కష్టతరమైన చక్కెరలు ఉంటాయి. ఇవి ఫుడ్ పాయిజన్, జీర్ణ సమస్యలు కలిగించడంతో పాటు గ్యాస్ట్రోనామికల్ వ్యాధులకు దారితీయవచ్చు. అంతేకాదు, కూరగాయలను పండించటానికి ఎరువులు, పురుగుమందులు ఎక్కువగా వాడుతున్నారు. మనం వాటిని ఎంత శుభ్రం చేసినా, వాటి లోపలి భాగంలో ఉండే హానికర సమ్మేళనాలు, బ్యాక్టీరియా వంటివి అలాగే ఉంటాయి. బాగా ఉడికించినపుడు మాత్రమే అవి క్రిమిసంహారం అవుతాయి, అప్పుడే అవి తినడానికి అనువైనవిగా ఉంటాయి. అయితే పచ్చిగా అస్సలు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం. చిలగడదుంప/ గెణుసుగడ్డ/ రత్నపురి గడ్డ వీటిని నేరుగా తిన్నా, రుచిగానే ఉంటుంది. అయితే ఇలా తినడం జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ఉండే పిండి పదార్థం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను నివారించడానికి వీటిని కాల్చడం లేదా ఉడికించడం మంచిది. బీన్స్ పచ్చిగా తినకూడని మరో వెజిటెబుల్ బీన్స్. కొన్నిరకాల బీన్స్ పచ్చిగా తింటే ప్రమాదకరం కూడా. బీన్స్ లోని కొన్ని రకాలు హానికరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. అందువల్ల వాటిలోని హానికరమైన టాక్సిన్ను తొలగించడానికి ముందు బీన్స్‌ను క్లీనర్ నీటిలో నానబెట్టండి. ఆపైన వండుకొని తినాలి. రెడ్ కిడ్నీ బీన్స్ ఉడికించని లేదా సరిగ్గా ఉడకని కిడ్నీ బీన్స్ (రాజ్మా) లో పెద్ద మొత్తంలో టాక్సిన్, గ్లైకో ప్రోటీన్ లెక్టిన్ ఉంటుంది. వీటిని తిన్న కొన్ని గంటల్లోనే వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు దారితీస్తుంది. లక్షణాల తీవ్రత కూడా మీరు తిన్నపరిమాణంపై ఉంటుంది. ఎక్కువగా తినేస్తే ఎక్కువ మొత్తంలో టాక్సిన్స్ మీ శరీరంలోకి చేరతాయి. కాబట్టి కిడ్నీబీన్స్ని ఎప్పుడయినా ఉడకబెట్టి తినాలి. ఆకు కూరలు ఆకుకూరల్లో కొన్నింటిని పచ్చిగా తినకూడదు. క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, బ్రోకలీ, అలాగే మొలకలను పచ్చిగా తినడం వల్ల అనేక గ్యాస్ట్రోనమికల్ సమస్యలు వస్తాయి. పుట్టగొడుగులు పుట్టగొడుగులను పచ్చిగా తినవచ్చు, అయితే ఎక్కువ పోషకాలను పొందడానికి ఉడికించిన వాటిని తీసుకోవడం మంచిది. కాల్చిన, వేయించిన లేదా ఉడికించిన పుట్టగొడుగుల్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. అంతేకాకుండా వాటి రుచికూడా పెరుగుతుంది. కాబట్టి వండుకొని తినండి. శాకాహారాలు కాకుండా ఏ రకమైన మాంసాహారాన్ని అయినా పచ్చిగా తినడం చాలా ప్రమాదకరం. పచ్చి మాంసంపై రకరకాల హానికర బ్యాక్టీరియాలు ఆవాసం ఏర్పర్చుకుంటాయి. కాబట్టి మాంసాన్ని బాగా ఉడికించుకొని తినాలి. అలాగే కోడిగుడ్లను కూడా పచ్చిగా తినడం హానికరమే! -
ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ కీలక నిర్ణయం.. ఈసారైనా
ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నెదర్లాండ్స్ ప్రధాన కోచ్ ర్యాన్ కుక్‌ను ఎస్ఆర్హెచ్ నియమించింది. గత ఏడాది సీజన్లో దారుణ ప్రదర్శన అనంతరం ఎస్ఆర్హెచ్.. తమ కోచింగ్ స్టాప్‌లో భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలోనే గతేడాది సీజన్లోనే బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. ఈ ఏడాది సీజన్లో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ర్యాన్ కుక్ విషయానికి వస్తే.. అతడు తొట్ట తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్ 16వ సీజన్ నేపథ్యంలో నెదర్లాండ్స్ తదుపరి రెండు ద్వైపాక్షిక సిరీస్‌లకు కుక్ దూరం కానున్నారు. అతడు ఒకట్రెండు రోజుల్లో ఎస్ఆర్ హెచ్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. అతడు హెడ్‌కోచ్ బ్రియాన్ లారాతో కలిసి పని చేయనన్నాడు. మార్క్రమ్ మ్యాజిక్ చేస్తాడా? గత ఏడాది సీజన్లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఎస్ఆర్హెచ్.. పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ తమ జట్టులో సమూల మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ను సన్‌రైజర్స్ నియమించింది. కాగా తొట్ట తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు కూడా మార్క్రమ్ సారథ్యం వహించాడు. దీంతో ఐపీఎల్లో కూడా మార్క్రమ్ సారథిగా విజయవంతమవుతాడని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా ఏప్రిల్2న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. చదవండి: IND vs AUS: మూడో వన్డేకు సూర్యకుమార్‌ను తప్పిస్తారా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ -
వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!
ఇటీవల స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మొబైల్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతున్నా క్షణాల్లో తెలిసిపోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వాసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏం చేసినా వెరైటీగా ప్రయత్నిస్తూ ఆ వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇవి యూజర్లకు నచ్చితే లక్షల్లో లైకులు, వ్యూస్‌తో వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం ఇదొక ట్రెండ్‌గా మారిందనే చెప్పాలి. కట్టెల మంటపై చేపల పులుసు వండుతున్న ఓ పెద్దావిడ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో.. ఒక బామ్మ కట్టెల మంట మీద నీటితో నిండిన ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఉంచి వంట చేయడం ప్రారంభించింది. అయితే ఈ వీడియో చూస్తున్న వారంతా మంటపై పెట్టిన ప్టాస్టిక్ కవర్ వెంటనే కరిగిపోతుందని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. వేడి ప్రభావం దాని మీద ఏ మాత్రం చూపించ లేదు. కాసేపు తర్వాత ఆ పెద్దావిడ కవర్లో ఉన్న నీటిలో పలు దినుసులు వేస్తూ చేప, కొద్దిగా మిర్చిని జోడిస్తుంది. ఈ వీడియోని ది ఫైజెజ్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేయగా ఇప్పటివరకూ 5 లక్షల మందిపైగా వీక్షించారు. దీన్ని చూసిన నెటిజన్ల మదిలో పలు ప్రశ్నలను లేవనెత్తింది. కొంతమంది వినియోగదారులు ప్లాస్టిక్‌లో వంట చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పగా, మరికొందరు ప్లాస్టిక్ నిప్పు వేడి తాకగానే కరిగిపోతుంది కదా అయినా ఇది ఎలా సాధ్యమైందని కామెంట్ చేస్తున్నారు. An elementary physics.pic.twitter.com/aqDuNa0Y5G — The Figen (@TheFigen_) February 23, 2023 చదవండి: మిస్టరీగా వైట్‌బాల్.. గాడ్జిల్లా గుడ్డేం కాదు! -
బిజీ లైఫ్‌కి బెస్ట్ ఛాయిస్.. ఏ వంటైనా నిమిషాల్లో రెడీ!
బీజీ లైఫ్‌లో వేళకు వంట కావాలన్నా.. వండిన వంటకం రుచికరంగా ఉండాలన్నా.. ఈ మల్టీఫంక్షనల్ డివైజ్‌ని వంటింట్లో పెట్టుకోవాల్సిందే. ఇందులో చాలా వెరైటీలను నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఒక వైపు శాండ్విచ్, ఆమ్లెట్స్, వాఫిల్స్, చికెన్ ఫ్రై.. మరోవైపు గుడ్లు ఉడికించుకోవడంతో పాటు తక్కువ మోతాదులో నూడుల్స్, రైస్ ఐటమ్స్, కర్రీస్, సూప్స్ వంటివీ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా బౌల్స్, ట్రేస్, గ్రిల్ ప్లేట్స్ ఇలా చాలానే డివైజ్‌తో పాటు లభిస్తాయి. ఇందులో పాలు కూడా కాగబెట్టుకోవచ్చు. స్వీట్స్, కేక్స్ వంటి ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు. ఇంకా ఈ డివైజ్ పింక్, మిల్కీ వైట్ రంగుల్లో కూడా లభిస్తున్నాయి. ఇది చూడటానికి కూడా.. మీ వంటగదికి ప్రత్యేకమైన లుక్‌ని తెచ్చిపెడుతుంది. ఇందులో ఫ్రైడ్ ఎగ్ ఒకే ఒక్క నిమిషంలో, కుడుములు 8 నిమిషాల్లో, శాండ్విచ్ 3 నిమిషాల్లో.. ఇలా ఒక్కో ఐటమ్ చాలా వేగంగా సిద్ధమవుతుంది. చదవండి: ‘ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు భారీ షాక్’ -
హిజ్రాలతో చీకటి ప్రదేశానికి వెళ్లిన వంటమాస్టర్.. చివరికి ట్విస్ట్
తిరువొత్తియూరు(తమిళనాడు): పుదుకొట్టై జిల్లాలో ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సంబంధించి ఐదుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుకొట్టై జిల్లా పొన్‌అమరావతి ఆలవాయిల్ ప్రాంతానికి చెందిన ధర్మలింగం (45) తుడియలూర్ బస్‌స్టాప్ సమీపంలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. 8వ తేదీ తీవ్రగాయాలతో కోవై ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో తొమ్మిదో తేదీ రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ ధర్మలింగం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో చొక్కలింగం కడుపుపై దాడిచేయడంతో మృతి చెందినట్లు తేలింది. దీంతో పెరియనాయకన్ పాలయం డీఎస్పీ రాజపాండియన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో హిజ్రాలు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. సంఘటన జరిగిన రోజున రాత్రి తుడియలూర్ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న హిజ్రాల్లో ఒకరు ధర్మలింగంను ఉల్లాసం కోసం చీకటి ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాగ్వాదం జరగడంతో మరో నలుగురు హిజ్రాలు అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ధర్మలింగం చికి త్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు.. గౌండంపాళ్యం మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన హిజ్రాలు రషి్మక (26), అరునిక (24), గౌతమి (20), రూబి (26), మమత (22)ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
బండి సంజయ్‌కు కృతజ్ఞతలు: వంటమనిషి యాదమ్మ
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధానికి వంటలు చేసే అవకాశం లభించడం జీవితంలో మరపురాని ఘట్టమని, ఇది తనకు దక్కిన అదృష్టమని వంటమనిషి యాదమ్మ తెలిపింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానితోపాటు మరో 500మందికి తెలంగాణ వంటకాలను రుచిచూపించబోతున్నట్లు వివరించింది. ఆదివారం గంగవాయిలి కూర, మామిడి కాయ పప్పు, తోటకూర ఫ్రై, ముద్దపప్పు, పచ్చి పులుసు, మసాల వంకాయ, గోంగూర చట్నీ, సొరకాయ చట్నీ, టమాట చట్నీ, టమాట రసం, సాంబారు, జొన్న రొట్టె, అరిసెలు, బూరెలు, సకినాలు, సర్వ పిండి, పులిహోర, పుదీనారైస్, వైట్ రైస్, బగారా తదితర వంటకాలు చేస్తానని శనివారం ‘సాక్షి’తో వెల్లడించింది. కాగా, వంటలు చేసేందుకు యాదమ్మతో పాటు పదిమంది వస్తారని కోరగా ఆరుగురికే అవకాశం ఇచ్చారు. న్యాక్‌గేట్ వద్ద యాదమ్మ, మరో ఐదుగురు పాస్ కోసం రెండు గంటల ఎదురుచూపు అనంతరం ఎంట్రీ పాస్‌ను అందుకున్నారు. ప్రధాని మోదీకి వంట చేసే అవకాశం కల్పించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (Narendra Modi: దోశ తెప్పించుకుని తిన్న మోదీ) -
సిద్దిపేట వంట రుచి చార్ దామ్‌లో..
సాక్షి,సిద్దిపేట జోన్: ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన తీర్థయాత్ర కేదార్నాథ్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో చిట్ట చివరిది కేదార్నాథ్. హిమాలయాల్లో అత్యంత భయానక, సాహసోపేత యాత్రగా పేరొందిన కేదార్నాథ్ యాత్రికులకు అమృతం లాంటి దక్షిణాది రుచులను ఉచితంగా అందిస్తూ సేవాభావంతో పనిచేస్తున్న సమితి సిద్దిపేట ప్రాంతానికి చెందింది కావడం విశేషం. గతంలో అమర్నాథ్ యాత్రికులకు భోజన వసతి కల్పించిన స్పూర్తితో నేడు కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది వంటకాలను అందుబాటులో తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే కేదార్‌నాథ్‌లో తొలి లంగర్ ఏర్పాటు చేసి, నిత్యం వేలాది మంది యాత్రికులకు ఉచితంగా భోజనం అందిస్తూ అందరి మన్నలను పొందుతోంది కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి. సిద్దిపేట ప్రాంత వాసులతో ఏర్పాటై ఎన్నో రాష్ట్రాల సరిహద్దులు దాటి అందిస్తున్న సేవలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అమర్నాథ్ యాత్రికులకు లంగర్ ఏర్పాటు చేసి అక్కడ దక్షిణాది యాత్రికులకు భోజనం అందించి అమర్నాథ్ సేవా సమితి దేశ వ్యాప్తంగా అందరి మన్నలను పొందింది. ఇదే స్పూర్తితో సిద్దిపేటకు చెందిన చీకోటి మధుసూదన్, ఐత రత్నాకర్ అధ్యక్ష కార్యదర్శులుగా కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటైంది. 2019లో తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికుల కోసం సొన్ ప్రయాగ్ బేస్ క్యాంపు వద్ద తొలి లంగర్ ఏర్పాటు చేశారు. ఎంతో సహోసోపేతంగా సాగే కేదార్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులలో 70 శాతం దక్షిణాది వారే. వారికి అక్కడ సరైన భోజన వసతి లేక 2019 వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తినడానికి సరైన తిండి లేక యాత్రికులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికుల కోసం లంగర్ ఏర్పాటు చేశారు. మే 4 తేదీ నుంచి జూన్ 15 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. పది రోజులుగా సిద్దిపేటకు చెందిన కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దక్షిణాది యాత్రికులకు భోజనాలు అందిస్తున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు లంగర్లో సేవలు అందుబాటులో ఉంటాయి. అక్కడ భోజనాలతోపాటు వసతి, హెల్ప్ సెంటర్ కూడా సేవా సమితి ఏర్పాటు చేసింది. దక్షిణాది రుచులు కేదార్నాథ్ యాత్రకు అత్యధికంగా దక్షిణాది ప్రాంత వాసులు వస్తుంటారు. వారికి ఉత్తరాఖండ్ రుచులు నచ్చవు. రోజుల కొద్ది యాత్రలో ఉండే యాత్రికులకు మన వంటకాలు కొంత ఊరట అందిస్తున్నాయి. ఉదయం టీ, అల్పాహారంగా ఇడ్లీ, చపాతి, వడ, ఉప్మా, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సిద్దిపేట ప్రేమ్‌పూరీ, పానీపూరి, కట్లీస్, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నారు. నిత్యం మూడు నుంచి నాలుగు వేల మంది యాత్రికులకు అన్నదాన సేవా సమితి భోజనాలు అందిస్తూ సేవలందిస్తోంది. సిద్దిపేట ప్రాంతంలో విరాళాలు సేకరించి అవసరమైన సామగ్రి, పరికరాలను ముందుగానే లంగర్‌కు సరఫరా చేశారు. అన్నదానం మహాదానం అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు వెళ్లే వారికి అక్కడ సరైన భోజన వసతి ఉండదు. పదేళ్ల క్రితం సిద్దిపేట తొలిసారిగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి పేరిట యాత్రికులకు భోజనాలు అందించాం. అదే స్పూర్తితో ఇప్పుడు తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికులకు లంగర్ ఏర్పాటు చేశాం. అన్నదానం మహాదానం. నిత్యం వేలాది మంది యాత్రికులకు దక్షిణాది రుచులతో కూడిన వంటకాలు అందిస్తున్నాం. – చికోటిమధుసూదన్, అధ్యక్షుడు, అన్నదాన సేవా సమితి దక్షిణాది రుచులు కరువు హిమాలయాల్లో కేదార్నాథ్ యాత్రలు చేసే వారిలో 70 శాతం దక్షిణాది వారే ఉంటారు. వారికి ఉత్తారాది వంట రుచులు నచ్చవు. మన వంటలు అందుబాటులోకి తెచ్చి ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్ట మొదటి లంగర్ సిద్దిపేట ప్రాంత సేవా సమితి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. నిత్యం భోజనాలు అందిస్తున్నాం. యాత్రికులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – రత్నాకర్, కార్యదర్శి, అన్నదాన సేవా సమితి చదవండి: ఒక్కటైన ప్రేమజంట.. దీని వెనక పెద్ద కథే నడిచింది! -
ఆ రాత్రి ఏం జరిగింది? వీడుతున్న వంటమాస్టర్ హత్య కేసు మిస్టరీ
సాక్షి,మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న వంట మాస్టర్ హత్య కేసు చిక్కుముడి వీడుతున్నట్లు తెలిసింది. దామరచర్లకు చెందిన కుర్ర లింగరాజు(38) ఈ నెల 12వ తేదీన రాత్రి మండల కేంద్రంలోని రైల్వే పట్టాల పక్కన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు.. దామరచర్లకు చెందిన లింగరాజుకు అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరితో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. లింగరాజు మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలోవంట మనిషిగా పనిచేస్తున్నాడు. కాగా, లింగరాజు మద్యానికి బానిసగా మారి అనుమానంతో మల్లీశ్వరిని వేధిస్తున్నాడు. అతడి ప్రవర్తనతో విసుగుచెందిన మల్లీశ్వరి, తన సోదరుడు వెంకటేశ్ కలిసి లింగరాజును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. లింగరాజు అడ్డుతొలగితే వచ్చే ఆస్తి, ఉద్యోగంతో సుఖంగా జీవించాలన్న ఉద్దేశంతో అతడి భార్య మల్లీశ్వరి, ఆమె సోదరుడు వెంకటేశ్ పథకం ప్రకారమే మరో ఇద్దరి సహకారంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఆ.. రాత్రి ఏం జరిగింది? లింగరాజు రోజూ మాదిరిగానే 12వ తేదీ రాత్రి 8గంటల ప్రాంతంలో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వంట వండి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న లింగరాజు ఇంటికి వచ్చాక భార్య మల్లీశ్వరితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య డబ్బులు, కుటుంబ వ్యవహారాలపై తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం లింగరాజు 9గంటల ప్రాంతంలో మళ్లీ మద్యం తాగేందుకు బయటికి వెళ్లినట్లు తెలిసింది. ఆత్మహత్యగా చిత్రీకరించాలని.. అయితే, ఇదే క్రమంలో లింగరాజు భార్య మల్లీశ్వరి ఇంట్లో జరిగిన గొడవ గురించి సోదరుడు వెంకటేశ్‌కు ఫోన్ చేసి వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి లింగరాజును హత్య చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి సోదరుడు వెంకటేశ్ మరో ఇద్దరితో కలిసి లింగరాజు వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తదనంతరం ఇంటి సమీపంలోనే రైల్వేట్రాక్ పక్కన మల్లీశ్వరి, లింగరాజు, వెంకటేశ్, వెంట వచ్చిన రాజ గట్టుకు చెందిన డ్రైవర్, హాస్టల్లో పనిచేసే మరో వ్యక్తి సమావేశమయ్యారు.అక్కడే మద్యం తాగుతూ గొడవలు పడితే పరువు పోతుందని లింగరాజుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే హత్య చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్ ఈ క్రజుమంలోనే తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో లింగరాజు గొంతు కోసినట్లు తెలుస్తోంది. తదనంతరం అతడి మృతదేహాన్ని రైలు పట్టాలపై వేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని పథకం కూడా రచించినట్లు తెలుస్తోంది. అయితే, అర్ధరాత్రి దాటిన ఆ సమయ ంలో సమీప కాలనీవాసులు, ఇసుక ట్రాక్టర్లు తిరుగాడుతుండడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలిసింది. పోలీసు జాగిలం అక్కడి వరకే వెళ్లి.. హత్యోదంతం వెలుగుచూడడంతో పోలీసులు జాగిలాన్ని రప్పించారు. మృతదేహం పడి ఉన్న కొద్ది దూరంలో ఉన్న నల్లా వద్దకు వెళ్లి జాగిలం ఆగిపోయింది. అక్కడే రెండు మద్యం బాటిళ్లు కూడా పోలీసులకు లభ్యమయ్యాయి. మద్యం తాపిన తర్వాతే లింగరాజును హత్య చేసి ఉంటా రని, అందుకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని అక్కడే నల్లా వద్ద శుభ్రం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లోతుగా పోలీసుల విచారణ లింగరాజును అతడి భార్య, బావమరిదే హత్య చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిశగానే పోలీ సులు లింగరాజు భార్య మల్లీశ్వరి, ఆమె సోదరుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకు హత్యోదంతానికి సహకారం అందించిన రాజగట్టుకు చెందిన డ్రైవర్, హాస్టల్లో పనిచేసే మరో వ్యక్తి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, లింగరాజును హత్య చేయడానికి గల బలమైన కారణాలు ఏమిటి..? హత్యోదంతంలో సూత్రధారులు వెంకటేశ్, మల్లీశ్వరినేనా ? అతడి వెంట వెళ్లిన మరో ఇద్దరు కూడా పాత్రధారులేనా..? ఈ మొత్తం వ్యవహారంలో లింగరాజు భార్య మల్లీశ్వరి పాత్ర ఎంత మేరకు ఉంది.? ఇలా పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు ఒకటి రెండు రోజుల్లో హత్యోదంతం కేసు చిక్కుముడిని విప్పి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలుస్తోంది. -
శ్రమ లేకుండా వంటలను వడ్డించే గాడ్జెట్ గురించి మీకు తెలుసా?
టెక్నాలజీ తెచ్చిపెట్టే హంగుల్లో.. అవసరాలను క్షణాల్లో తీర్చే మేకర్స్‌లో.. కుకింగ్ వేర్ చాలా ప్రత్యేకం. శ్రమ లేకుండా వంటలను వడ్డించే ఈ ఇండోర్ గ్రిల్.. ఏకకాలంలో చాలా రుచులని అందిస్తుంది. ఓ పక్కన కుకింగ్ బౌల్, మరో పక్క గ్రిల్ ప్లేట్ అటాచ్ అయ్యి ఉన్న ఈ మల్టీ మేకర్.. వండి వార్చేవారికి ఓ బహుమతి. చిన్న చిన్న ఫంక్షన్స్‌లో రెండు మూడు ఫ్యామిలీస్ కలసి చేసుకునే వంటకు ఇలాంటి మేకర్ చాలా చక్కగా సహకరిస్తుంది. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా నాన్ వెజ్ని గ్రిల్ చేసుకోవడంతో పాటు.. సూప్స్, స్వీట్స్, కట్లెట్స్, రైస్ ఐటమ్స్ మొదలు ఇంకా చాలానే వండుకోవచ్చు. టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి సహకరించే రెగ్యులేటర్.. పవర్ కనెక్ట్ చేసుకునే కనెక్టర్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక కుడివైపు ఆయిల్ లీకేజ్ హోల్ నుంచి కింద ఉండే సొరుగులోనికి వ్యర్థాలు చేరతాయి. ఇరువైపులా హీట్ రెసిస్టెంట్ హ్యాండిల్స్ ఉంటాయి. దాంతో ఒక చోటు నుంచి మరో చోటుకి గాడ్జెట్‌ని సులభంగా మూవ్ చేసుకోవచ్చు. -
సగ్గు బియ్యం పరాఠా.. ఈజీగా చేసేస్తారా!
వానలు పడుతుంటే వేడివేడిగా కరకరలాడే పదార్థాలు తినాలనిపిస్తుంది జిహ్వకు.. ఎప్పుడూ నూనెలో వేయించి తినాలంటే కొంచెం ఇబ్బందే.. తక్కువ నూనెతో కరకరలాడే సగ్గు బియ్యం వంటకాలు చేసుకుని... వాన బిందువులను చూస్తూ, తియ్యటి గుండ్రటి సగ్గు బియ్యం బిందువుల వంటకాలు ఆస్వాదిద్దాం.. పరాఠా కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పల్లీలు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4; ఉడికించిన బంగాళ దుంపలు – 2; కొత్తిమీర – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఉప్పు – తగినంత; నూనె/నెయ్యి – తగినంత తయారీ: ►ఒక పాత్రలో సగ్గు బియ్యం వేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నీరు వంపేయాలి ►స్టౌ మీద బాణలిలో పల్లీలు వేసి బాగా వేయించి చల్లార్చాలి ►మిక్సీ జార్లో పల్లీలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి వేసి బరకగా మిక్సీ పట్టి, సగ్గు బియ్యానికి జత చేయాలి ►ఉడికించిన బంగాళ దుంపలను తురుముతూ జత చేయాలి ►కొత్తిమీర, జీలకర్ర, ఎండు మిర్చి లేదా మిరప కారం, ఉప్పు జత చేసి బాగా కలపాలి ►పాలిథిన్ కవర్ మీద కానీ, బటర్ పేపర్ మీద కానీ కొద్దిగా నూనె పూయాలి ►తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, గుండ్రంగా రొట్టెలా ఒత్తాలి ►స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి తయారుచేసి ఉంచుకున్న పరాఠాను వేసి నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీద కాలాక, రెండో వైపు తిప్పి, అటు వైపు కూడా మూడు నాలుగు నిమిషాలు కాల్చాక, ప్లేట్లోకి తీసుకోవాలి ►పెరుగు చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. ఢోక్లా కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు (నానబెట్టాలి); సామలు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; మసాలా కారం – ఒక టీ స్పూను; (మిరప కారం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి కలిపితే మసాలా కారం) తయారీ: ► మిక్సీలో సగ్గు బియ్యం, సామలు, పెరుగు వేసి మెత్తగా చేయాలి ► ఉప్పు జత చేసి దోసెల పిండిలా అయ్యేలా కలపాలి ► స్టౌ మీద కుకర్‌లో నీళ్లు పోసి మరిగించాలి ► ఈ లోగా ఒక స్టీల్ ప్లేట్‌కి నూనె పూసి, మసాలా కారం చిలకరించాలి ► తయారు చేసి ఉంచుకున్న పిండిని సగం వేసి సమానంగా పరిచి, మరుగుతున్న నీళ్ల మీద ఒక ప్లేట్ ఉంచి, ఆ పైన ఈ ప్లేట్ ఉంచి, పైన పల్చటి వస్త్రం కప్పి, ఆ పైన మూత ఉంచాలి ► 20 నిమిషాల తరవాత మంట ఆపి, మూత తీయాలి ∙ఇదే విధంగా మిగతా సగ భాగం కూడా తయారు చేయాలి ► బాగా చల్లారాక ఒక ప్లేట్ లోకి ఆ ప్లేట్‌ను బోర్లించి జాగ్రత్తగా వేరు చేసి, ఆ పైన గ్రీన్ చట్నీ వేసి, ఆ పైన రెండో పొర ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు, పచ్చి మిర్చి తరుగు, ఇంగువ వేసి వేయించి దింపేయాలి ►కరివేపాకు జత చేసి, బాగా కలిపి, ఢోక్లా మీద సమానంగా పోసి, నలు చదరంగా కట్ చేయాలి. (గ్రీన్ చట్నీ: మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉప్పు, నల్ల ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►నిమ్మ రసం జత చేసి బాగా కలిపితే గ్రీన్ చట్నీ సిద్ధమవుతుంది) పొంగనాలు కావలసినవి: సగ్గు బియ్యం–ఒక కప్పు; ఉడికించిన బంగాళ దుంపలు – 2; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా సగ్గు బియ్యాన్ని రెండు నిమిషాలు ఆపకుండా కలుపుతూ వేయించాలి (తడి పోయి పొడి చేయడానికి వీలుగా ఉంటుంది) ∙ప్లేట్లో పోసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో సగ్గు బియ్యం పిండికి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, దోసెల పిండి కంటె కొద్దిగా గట్టిగా కలపాలి ►ఒక పాత్రలో బంగాళదుంపలు వేసి మెత్తగా చేయాలి ►సగ్గు బియ్యం పిండి జత చేసి కలపాలి ►కొత్తిమీర తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు కలపాలి ►అల్లం తురుము, జీలకర్ర, ఉప్పు జత చేసి మరోమారు బాగా కలపాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా అయ్యేలా కలిపి మూత ఉంచి, సుమారు అర గంట సేపు నానబెట్టాలి ►స్టౌ మీద పొంగనాల స్టాండ్ ఉంచి, నూనె పూసి, ఒక్కో గుంటలోను తగినంత పిండి వేసి, మూత ఉంచాలి ►మీడియం మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచాక, పొంగనాలను తిరగేసి, మరో ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి. -
పదేళ్ల చిన్నారి: గంటలో 30 రకాలు వండింది
తిరువనంతపురం: పదేళ్ల పిల్లలకు సరిగ్గా తినడమే రాదు.. ఇక వంట సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు అంత చిన్న పిల్లల్ని కిచెన్‌లోకి రానివ్వరు. ఒకవేళ వెళ్లినా మహా అయితే టీ, మ్యాగీ లాంటివి చేస్తారు తప్ప పెద్ద వంటకాంలే వండలేరు. కానీ కేరళకు చెందిన ఈ చిన్నారి మాత్రం అలా కాదు. దేశీయ వంటలతో పాటు విదేశీ వంటలను వండగలదు. మరో ప్రత్యేకత ఏంటంటే గంట వ్యవధిలో 30 రకాల వంటలు వండి రికార్డుల్లోకి ఎక్కింది. ఆ వివరాలు.. వింగ్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాజిత్ బాబు కూతురు శాన్వి ఎం ప్రాజిత్ గంటలో 30 కంటే ఎక్కువ వంటలు రెడీ చేయగలదు. ఊతప్ప, ఫ్రైడ్ రైస్, చికెన్ రోస్ట్ లాంటి వంటలన్నీ ఒకే చోట గంట సమయంలోనే తయారుచేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో స్థానం దక్కించుకుంది. పిల్లల పేరుతో ఇలా ఓ రికార్డు నమోదవ్వడం ఇదే తొలిసారి. (చదవండి: వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన) ఈ ఏడాది ఆగస్టు 29న 10సంవత్సరాల 6నెలల 12రోజుల వయస్సున్న శాన్వి ‘విశాఖపట్నంలోని తన ఇంట్లో వంట చేస్తుండగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అథారిటీ దీనిని ఆన్ లైన్లో పర్యవేక్షించింది. సాక్ష్యంగా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు ఆమె పక్కనే ఉన్నారు. గంటలో శాన్వి 30 ఐటెంలు రెడీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ.. ‘మా అమ్మ సాయంతోనే ఇది సాధించగలిగాను. స్టార్ చెఫ్ అయిన మా అమ్మ ఓ కుకరీ షోలో ఫైనల్ కంటెస్టెంట్‌గా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే ఇది సాధించగలిగాను’ అని తెలిపింది.శాన్వి చిల్డ్రన్ కుక్కరీ షోలలో కూడా చాలా సార్లు పాల్గొంది. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ.. రుచికరమైన వంటల రెసిపీలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. -
సుశాంత్‌కు ఆ అలవాటే లేదు.. కానీ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఎన్నో అనుమానాలు బయలుదేరిన విషయం తెలిసిందే. ఆయనది ఆత్మహత్య కాదు, హత్య అని ఎంతోమంది బలంగా విశ్వసిస్తున్నారు. సుశాంత్ చావుకు ఆయన ప్రేయసి రియా చక్రవర్తి, బాలీవుడ్ సెలబ్రిటీలే కారణమన్న వాదన కూడా ఉంది. అయితే చాలామంది అనుకున్నట్టుగా సుశాంత్‌ది హత్య కాదని ఆయన వంట మనిషి నీరజ్ స్పష్టం చేశారు. ఆయనపై హత్య జరిగే అవకాశమే లేదని వెల్లడించారు. శుక్రవారం నీరజ్ మీడియాతో మాట్లాడుతూ.. "సుశాంత్‌ది హత్య కాదు, ఆత్మహత్య. నేను కింద ఉన్నప్పుడు ఆయన గదికి గడియ పెట్టుకున్నాడు. కానీ, సాధారణంగా ఆయనకు గడియ పెట్టుకునే అలవాటే లేదు. ఐదు నిమిషాల తర్వాత నేను ఆయన గది దగ్గరకు వెళ్లి ఏం వండమంటారని అడిగాను. అటు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు" (రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’ ) "అయితే ఆ సమయంలో ఒకవేళ హత్య జరిగి ఉంటే ఎవరైనా వచ్చిపోవడాన్ని నేను చూసేవాడిని, ఆయన్ను చంపకుండా అడ్డుకునే వాడిని. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక గది బెల్ కొట్టినా కూడా తలుపు తీయకపోతే ఆయన పడుకున్నాడేమో అని డిస్టర్బ్ చేయలేదు. ఆ తర్వాత ఎంతసేపటికి సమాధానం లేకపోవడంతో మాకు అనుమానం వచ్చింది. వెంటనే నేను, సిద్ధార్థ్ పితానీ, దీపేశ్ గది తలుపు బద్ధలు కొట్టి లోనికి వెళ్లాం. అయితే అక్కడున్న దృశ్యం చూసి మేము షాక్‌కు గురయ్యాం. సుశాంత్ ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించారు" అని పేర్కొన్నారు. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు గూగుల్‌లో తన పేరుతో పాటు మరణం గురించి, మానసిక సమస్యల గురించి కూడా వెతికారు. ఇదిలా వుండగా సుశాంత్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సుశాంత్ ఇంటి పనిమనిషిని విచారిస్తున్నారు. (అమీర్, అనుష్క ఎందుకు నోరు విప్పలేదు?) -
‘ఫ్లాట్‌బ్రెడ్ ఉడికిస్తే ఉబ్బిపోతుంది’
సాధారణంగా పూరీలు, చపాతీలు తయరుచేసేటప్పుడు పొంగి తాజాగా కనిపిస్తే వెంటనే తినాలనిపిస్తుంది. అంతే కాకుండా కొన్నిసార్లు చపాతీలను పెనం మీద కాల్చినప్పుడు అవి ఒక్కసారిగా ఉబ్బిపోటం చూసి ఆశ్చర్యపోతాం. అచ్చం అలాంటి ఒక వీడియోను ఫుడ్ ఇన్సైడర్ అనే వెబ్సైట్ తన ట్వీటర్ఖాతాలో పోస్ట్ చేసింది. ‘భారతీయ ఫ్లాట్‌బ్రెడ్ ఉడికించినప్పుడు ఉబ్బిపోతుంది’ అని కామెంట్ జతచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విటర్లో 248వేల మంది లైక్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తూ.. సరదాగా మీమ్స్ తయారు చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో రెండు రోటీలను మంటపై వేసి కాల్చటంతో అవి ఒక్కసారిగా ఉబ్బిపోతాయి. అయితే వీటిని పుల్కా అంటారని, పుల్కాలు అధికంగా పొంగుతాయని ఫుడ్ ఇన్సైడర్ తెలిపింది. అదే విధంగా రోటీలు, చపాతీలు కూడా తయారు చేసేటప్పుడు ఉబ్బిపోతాయని తెలిపింది. ఈ పుల్కాలను అధికంగా గ్లూటెన్ ఉండే గోధుమ పిండి(అట్టా)తో చేశామని పేర్కొంది. అట్టా ఉపయోగిస్తే పిండి వంట చేసేటప్పుడు రొట్టెలు పగలకుండా ఉంటాయని ఫుడ్ ఇన్సైడర్ పేర్కొంది. దీనితో మెత్తగా రోటీలు పొంగి టేస్టీగా ఉంటాని పేర్కొంది. ‘నీరు తడిగా ఉంటుంది, ఐస్‌క్రీం చల్లగా ఉంటుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అదే విధంగా మేము చపాతీలు చేసినప్పుడు ఇలా పొంగవు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. This Indian flatbread puffs up when cooked 🤤 pic.twitter.com/rA1XWHnFD0— Food Insider (@InsiderFood) June 9, 2020 -
తెలంగాణ వంటల తాత ఇకలేరు..!
సంప్రదాయ వంటల నుంచి.. చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ వరకు అన్నింటినీ అవలీలగా వండి వార్చే యూట్యూబ్ వంటల తాత ఇకలేరు. ‘గ్రాండ్‌పా కిచెన్’ను యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్లందరికీ వంటల తాతగా పరిచయమున్న నారాయణరెడ్డి(73) అక్టోబర్ 27న అనారోగ్యంతో హైదరాబాద్‌కు సమీపంలోని తన సొంతూరులో మరణించారు. ఈ తెలంగాణ తాత 2017లో ప్రారంభించిన గ్రాండ్ పా కిచెన్ చానల్‌కు ఏకంగా 60 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన వంటలన్నీ కట్టెల పొయ్యి మీదే చేస్తారు. ఎక్కువ మోతాదులో వండిన వంటకాలను అనాథాశ్రమంలోని పిల్లలకు పంచుతారు. అంతేకాదు యూట్యూబ్ చానల్ ద్వారా వచ్చే ఆదాయంతో అనాథలకు బట్టలు, పుస్తకాలు, వాళ్ల పుట్టిన రోజు కానుకలు కొనిపెడు తుంటారు. చనిపోయే ముందు 6 రోజుల వరకు గ్రాండ్‌పా కిచెన్‌లో వంట చేశారు. నోరూరించే వంటకాలను తయారుచేసే విధానాన్ని చూపించి, వాటిని అనాథలకు పంచిపెట్టే నారాయణరెడ్డికి విదేశాల్లోనూ అభిమానులున్నారు. -
ప్రియున్ని చంపి.. కూర వండేసింది..!
అబుదాబి : యూఏఈకి చెందిన ఓ మహిళ తన ప్రియున్ని చంపడమే కాక అతని మాంసంతో ఓ మొరాకో వంటకాన్ని తయారు చేసింది. అనంతరం అక్కడ పని చేస్తోన్న భవన నిర్మాణ కార్మికులకు ప్రియుడి మాంసంతో వండిన వంటని వడ్డించింది. అబుదాబికి చెందిన ఓ వార్తాసంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. కానీ సదరు వ్యక్తి ఆమెను కాదని మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డాడు. దాంతో తనను తిరస్కరించిన వ్యక్తిమీద పగ తీర్చుకోవాలని భావించిన మహిళ అతన్ని హత్య చేసింది. అంతటితో ఆగకుండా అతని శరీరంలో కొన్ని భాగాలను ముక్కలు చేసి వండింది. మిగిలిన మృత దేహాన్ని కుక్కలకు వేసినట్లు స్వయంగా సదరు మహిళే కోర్టు విచారణలో తెలిపిందని ‘ఖలీజ్ టైమ్స్’ పేర్కొంది. నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తన సోదరుడు కనిపించడం లేదని మృతుడి తమ్ముడు.. సదరు మహిళ ఇంటి వద్ద తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. తొలుత మహిళను ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని చెప్పింది. అయితే ఆమె ఇంట్లో ఓ మనిషి దంతాలు కనిపించడంతో అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితురాలి ఇంట్లో దొరికిన దంతాలను డీఎన్ఏ పరీక్ష కోసం పంపగా అవి మృతుడివేనని తేలడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. -
వంట మనిషి దెబ్బలకు విద్యార్థిని మృతి
కర్నూలు సీక్యాంప్: వంట మనిషి విచక్షణా రహితంగా కొట్టడంతో ఓ విద్యార్థిని మృత్యువాత పడింది. ఈ ఘటన కర్నూలు మండలం భూపాల్‌నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. భూపాల్‌నగర్‌కు చెందిన హర్షిణి (8) స్థానిక ఎంపీపీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. గత శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేస్తూ.. టమోట, కరివేపాకు తొక్కలు తినకుండా హర్షిణి పారవేసింది. దీన్ని గమనించిన వంట మనిషి వరలక్ష్మి బాలికను విచక్షణా రహితంగా కొట్టి కిందకు పడేసింది. దీంతో అమ్మాయి మోకాలికి బలమైన గాయం అయింది. బాలిక తల్లిదండ్రులు అదేరోజు ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హర్షిణి మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులను నిర్బంధించి నిలదీశారు. హర్షిణి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
సాక్షి హెల్దీ కిచెన్.
-
వండిపెడుతూ చదువుకున్న వట్టికోట
వట్టికోట ఆళ్వారుస్వామి(1915)లో నల్లగొండ జిల్లా చెరువుమాదారం గ్రామంలో జన్మించారు. చిన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయాడు. మూడు శాతం అక్షరాస్యత మాత్రమే వున్న ఆ కాలంలో ఒక ఉపాధ్యాయునికి వండిపెడుతూ క్రమంగా అక్షరజ్ఞానం సంపాదించారు. చదువు నేర్చుకోవటానికే విజయవాడ వెల్కమ్ హోటల్లో సర్వర్‌గా పనిచేశారు. పదిహేను రూపాయల నెలజీతంలో సగం వెచ్చించి ఒక ట్యూషన్ మాష్టారు దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నారు. 1938లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు. సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, కాళోజీ వంటి గొప్ప రచయితలతో జ్ఞానదాయకమైన పుస్తకాలు రాయించారు. వాటిని ప్రచురించి, స్వయంగా ఊరూరు తిరుగుతూ సామాన్యులకు పుస్తకాలను అందించారు. నిజాం నిరంకుశపు రోజుల్లో సుమారు 40 పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేయటం చిన్న విషయం కాదు. సేకరణ: అమ్మంగి వేణుగోపాల్ 9441054637 -
చెన్నైలో జడేజాలం
► భారత్ 4... ఇంగ్లండ్ 0 ► ఏడు వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్ ► చివరి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం ► కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు ► వన్డే సిరీస్ జనవరి 15 నుంచి చేతిలో 10 వికెట్లున్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కుక్, రూట్, మొయిన్ అలీ, స్టోక్స్‌లాంటి హేమాహేమీలు ఒక రోజంతా ఆడలేరా? కచ్చితంగా మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందేమో! ఇదీ చెన్నై టెస్టులో చివరి రోజు సగటు క్రీడాభిమాని ఆలోచన. దీనికి తగ్గట్టుగానే లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. అయితే లంచ్ తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రత్యర్థి జట్టుకు అసలు సిసలు సినిమా రవీంద్ర జడేజా చూపించాడు. ఒక్కొక్కరినీ తన స్పిన్ ఉచ్చులో బిగించి ఊపిరిసలపకుండా చేయడంతో కుక్ సేన పూర్తిగా గల్లంతయ్యింది. ఎంతలా అంటే ఓ దశలో 192/4తో ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నా 15 పరుగుల వ్యవధిలోనే చివరి ఆరు వికెట్లు కోల్పోయి ఘోరంగా ఓడింది. దీంతో భారత్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను 4–0తో దక్కించుకోవడమే కాకుండా ప్రపంచ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఈ ఏడాదిని నంబర్‌వన్‌గా ముగించింది. చెన్నై: విరాట్ కోహ్లి సేన ఈ ఏడాదిని మరో గొప్ప విజయంతో ముగించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా అసమాన ఆటను ప్రదర్శించింది. సిరీస్‌ను 4–0తో సొంతం చేసుకుంది. మంగళవారం ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్‌పై భారత జట్టు ఓ సిరీస్‌ను 4–0తో నెగ్గడం ఇదే ప్రథమం. అజహరుద్దీన్ నేతృత్వంలోని భారత్ 1992–93లో ఇంగ్లండ్‌పై 3–0తో గెలువడం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. నాలుగో రోజు కరుణ్ నాయర్ ‘ట్రిపుల్ సెంచరీ’తో డీలాపడిన ఇంగ్లండ్.. మంగళవారం రవీంద్ర జడేజా (7/48) గింగరాలు తిరిగే బంతులతో గజగజా వణికింది. ఫలితంగా ఒక దశలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... జడేజాలంలో చిక్కుకొని 104 పరుగుల తేడాలో మొత్తం 10 వికెట్లను కోల్పోయింది. 88 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓపెనర్లు కీటన్ జెన్నింగ్స్ (121 బంతుల్లో 54; 7 ఫోర్లు), కుక్ (134 బంతుల్లో 49; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడి తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. మొయిన్ అలీ (97 బంతుల్లో 44; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.టీ విరామం తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఏడుగురు బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన ఇంగ్లండ్ చివరికి ఇన్నింగ్స్ ఓటమిని పొందినట్టే.. వరుసగా మరో మ్యాచ్ కూడా అదే తరహాలో ముగించినట్టయ్యింది. ఇషాంత్, ఉమేశ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. మొత్తం ఈ మ్యాచ్‌లో జడేజా పది వికెట్లు తీయగా, అశ్విన్‌కు కేవలం ఒక వికెట్ మాత్రమే దక్కింది. కరుణ్ నాయర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. క్రిస్మస్ సెలవుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లనున్న కుక్ బృందం జనవరిలో భారత్‌కు తిరిగి వస్తుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ జనవరి 15న మొదలవుతుంది. అమోఘం... ఆ క్యాచ్: 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో వివియన్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్‌ను అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ పట్టుకున్న తీరు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అచ్చం అదే తరహాలోనే రవీంద్ర జడేజా అద్భుత రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించుకున్నాడు. ఇషాంత్‌శర్మ వేసిన ఇన్నింగ్స్ 53వ ఓవర్లో బెయిర్‌స్టో లెగ్‌సైడ్ ఆడిన బంతి గాల్లోకి లేచింది. డీప్ మిడ్ వికెట్లో జడేజా వెనక్కి పరిగెత్తుతూ తీసుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సెషన్–1: ఓపెనర్ల నిలకడ 12 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా... మూడో ఓవర్లోనే కెప్టెన్ కుక్ ఇచ్చిన క్యాచ్‌ను పార్థివ్ వదిలేశాడు. పిచ్ ఫ్లాట్‌గా ఉన్నా ఎలాంటి భారీ షాట్లకు పోకుండా కుక్, జెన్నింగ్స్ క్రీజులో నిలదొక్కుకోవడంపైనే దృష్టి పెట్టారు. అప్పుడప్పుడూ ఫోర్లు బాదినా కూడా తొలి సెషన్లో ఇద్దరూ పూర్తి రక్షణాత్మక ఆటతీరును ప్రదర్శించడంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. అటు పిచ్ కూడా బౌలర్లకు ఎలాంటి సహకారాన్ని అందించకపోవడంతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ లంచ్ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 32, పరుగులు: 85, వికెట్లు: 0 సెషన్–2: జడేజా షో లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే జడేజా బౌలింగ్‌లో కుక్ ఎల్బీ అవుట్ కోసం భారత్ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే తన మరుసటి ఓవర్లోనే జడేజా ఇంగ్లండ్ కెప్టెన్‌ను అవుట్ చేయగలిగాడు. ఈ సిరీస్‌లో కుక్‌ను అవుట్ చేయడం జడేజాకిది ఆరోసారి. దీంతో తొలి వికెట్‌కు 103 పరుగుల కీల క భాగస్వామ్యం ముగిసినట్టయ్యింది. ఇక్కడి నుంచి జడేజా షో ప్రారంభమైంది. కొద్దిసేపట్లోనే మరో ఓపెనర్ జెన్నింగ్స్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఇక స్వీప్ షాట్‌కు యత్నించిన స్టార్ బ్యాట్స్‌మన్ రూట్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. కోహ్లి రివ్యూకు వెళ్లడంతో జట్టుకు అనుకూల ఫలితం వచ్చింది. ఇక ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను జడేజా అందుకున్న తీరు అపూర్వం. టీ బ్రేక్‌కు ముం దు ఓవర్లో మొయిన్ అలీ రెండు ఫోర్లతో జోరు చూపించాడు. ఓవర్లు: 27, పరుగులు: 70, వికెట్లు: 4 సెషన్–3: పతనం పరిపూర్ణం క్రీజులో ఫామ్‌లో ఉన్న మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ ఉండడంతో ఇంగ్లండ్ శిబిరంలో పెద్దగా ఆందోళన కనిపించలేదు. దీనికి అనుగుణంగానే వారు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే జడేజా మరోసారి తన స్పిన్ పవర్ చూపించి ఈ జోడిని విడదీశాడు. 72వ ఓవర్లో మొయిన్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను మిడాన్‌లో అశ్విన్ సులువుగా పట్టేశాడు. దీంతో ఐదో వికెట్‌కు 63 పరుగుల విలువైన భాగస్వామ్యం ముగిసింది. తన తర్వాత ఓవర్లోనే స్టోక్స్ (54 బంతుల్లో 23; 4 ఫోర్లు)ను పెవిలియన్‌కు పంపగా డాసన్‌ను అమిత్ మిశ్రా బౌల్డ్ చేశాడు. రెండో కొత్త బంతిని తీసుకున్న వెంటనే ఉమేశ్‌యాదవ్ ఆదిల్ రషీద్ (2) వికెట్‌ను పడగొట్టాడు. ఇక చివరి రెండు వికెట్లను ఒకే ఓవర్లో జడేజా తీయడంతో భారత్ సంబరాల్లో మునిగింది. ఓవర్లు: 24, పరుగులు: 40, వికెట్లు: 6 ఓ జట్టుగా ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్, స్వదేశంలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో మాత్రమే మాకు నిరాశ ఎదురైంది. ఆసియా కప్, కివీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు అన్ని టెస్టు సిరీస్‌లను గెలిచాం. మున్ముందు మేం సాధించబోయే విజయాలకు ఇది పునాదిగా భావిస్తున్నాం. ఇక ఈ సిరీస్ విజయం సమష్టి ఫలితం. తొలి మ్యాచ్‌లో మేం ఒత్తిడికి లోనయినా మిగతా నాలుగు మ్యాచ్‌లను గెలవగలిగాం. 3–0తో ఇప్పటికే సిరీస్ నెగ్గినా చివరి మ్యాచ్‌లో మేం ఆడిన తీరు చూస్తే జట్టులో ఎంత కసి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏదో ఒక దశలో ప్రతీ ఆటగాడు రాణించి విజయానికి కృషి చేశాడు. జడేజా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడం అభినందనీయం. – విరాట్ కోహ్లి ⇒ 4 తొలి ఇన్నింగ్స్‌లో 400 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోవడం ఇంగ్లండ్‌కిది నాలుగోసారి కావడం గమనార్హం. గతంలో పాకిస్తాన్ (2004లో భారత్ చేతిలో), శ్రీలంక (2011లో ఇంగ్లండ్ చేతిలో) ఈ విధంగా ఒక్కోసారి ఓటమి పాలయ్యాయి. ⇒ 5 భారత జట్టుకిది వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం. గతేడాది శ్రీలంకపై 2–1తో... ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై 3–0తో, వెస్టిండీస్‌పై 2–0తో, న్యూజిలాండ్‌పై 3–0తో, ఇంగ్లండ్‌పై 4–0తో భారత్ గెలిచింది. ⇒ 18 వరుసగా 18 టెస్టుల్లో భారత్‌కు ఓటమి లేకపోవడం ఇదే ప్రథమం. గతంలో (1985 నుంచి 1987 మధ్యకాలంలో) 17 టెస్టుల్లో భారత్ అజేయంగా నిలిచింది. తాజాగా కోహ్లి బృందం ఈ రికార్డును సవరించింది. ఓటమి లేకుండా వరుస టెస్టులు ఆడిన రికార్డు వెస్టిండీస్ (27 మ్యాచ్‌లు–1982 నుంచి 1984 మధ్యలో) పేరిట ఉంది. ⇒ 2 ఒక సిరీస్‌లో నాలుగు టెస్టుల్లో నెగ్గడం భారత్‌కిది రెండోసారి. ఇంతకుముందు 2012–2013 సీజన్లో టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాను 4–0తో ఓడించింది. ⇒ 1 ఒకే టెస్టులో పది వికెట్లు తీయడం రవీంద్ర జడేజాకిది తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 48 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టి తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ⇒ 6 ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్‌ను జడేజా ఆరుసార్లు అవుట్ చేశాడు. ఒకే సిరీస్‌లో ప్రత్యర్థి జట్టు ఒకే బ్యాట్స్‌మన్‌ను అత్యధికంగా ఆరుసార్లు అవుట్ చేసిన ఏకైక భారత బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు. ⇒ 1 సునీల్ గావస్కర్ (1976 నుంచి 1980 మధ్యలో) తర్వాత విరాట్ కోహ్లి నాయకత్వంలో మాత్రమే వరుసగా 18 టెస్టుల్లో పరాజయం పొందకుండా అజేయంగా నిలిచింది. ⇒ 1 ఒకే టెస్టులో అర్ధ సెంచరీ చేసి, 10 వికెట్లు తీసి, నాలుగు క్యాచ్‌లు కూడా పట్టిన ఏకైక క్రికెటర్‌గా రవీంద్ర జడేజా గుర్తింపు పొందాడు. 1979–1980 సీజన్లో చెన్నైలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో కపిల్ దేవ్ అర్ధ సెంచరీ చేయడంతోపాటు పది వికెట్లు తీశాడు. ⇒ 9 ఒకే ఏడాదిలో భారత్ అత్యధికంగా తొమ్మిది టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. 2010లో భారత్ అత్యధికంగా ఎనిమిది టెస్టుల్లో నెగ్గింది. ⇒ 1 ఒకే ఏడాదిలో 12 టెస్టులు ఆడి ఓటమి పొందని జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ (11 విజయాలు–2004లో), ఆస్ట్రేలియా (10 విజయాలు–2006లో) పేరిట ఉన్న ఘనతను భారత్ సవరించింది. ⇒ 25 ఓపెనింగ్ వికెట్‌కు 25 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి ఓపెనర్‌గా అలిస్టర్ కుక్ నిలిచాడు. గతంలో ఓపెనర్లు జాక్ హాబ్స్ (ఇంగ్లండ్), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) అత్యధికంగా 24 సెంచరీ భాగస్వామ్యాల్లో పాలుపంచుకన్నారు. -
జడేజా అరుదైన ఘనత
చెన్నై:ఇంగ్లండ్ తో చివరిటెస్టులో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చివరిరోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్(49)ను జడేజా అవుట్ చేశాడు. జడేజా సంధించిన ప్రమాదకరమైన బంతిని కుక్ ఆడటంలో విఫలమై లెగ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ 103 పరుగుల వద్ద తొలి వికెట్ ను నష్టపోయింది. అయితే కుక్ వికెట్ ను సాధించే క్రమంలో జడేజా ఒక అరుదైన ఫీట్ ను సాధించాడు. ఈ సిరీస్‌లో ఆరుసార్లు జడేజా బౌలింగ్ లో కుక్ అవుటయ్యాడు. ఇలా ఒక సిరీస్‌లో అత్యధికంగా ఒకే బౌలర్ చేతిలో కుక్ అవుట్ కావడం ఇదే తొలిసారి. అయితే ఈ సిరీస్‌లో జడేజా బౌలింగ్ వేసే క్రమంలో కుక్ యావరేజ్ 12.50 గా నమోదైంది. నాల్గో టెస్టులో రెండు సార్లు జడేజాకు చిక్కిన కుక్.. ఐదో టెస్టులో రెండు సార్లూ జడేజా బౌలింగ్ లోనే అవుటయ్యాడు. అంతకుముందు మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో జడేజా బౌలింగ్ లో కుక్ అవుట్ కాగా, తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో జడేజా బౌలింగ్ లో కుక్ పెవిలియన్ చేరాడు. ఈ రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే జడేజా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడు. ఉదయం సెషన్లో 19.0 ఓవర్ తరువాత జడేజా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడు. ఈ తన ప్రయోగంలో కోహ్లి మరోసారి సఫలమయ్యాడు. జడేజా వేసిని 39.0 ఓవర్ నాల్గో బంతికి కుక్ అవుటయ్యాడు. ఆ తరువాత జెన్నింగ్స్(54) ను కూడా జడేజా పెవిలియన్ కు పంపాడు. దాంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది. -
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్
-
కరుణ్ ది గ్రేట్
►ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్ ► అశ్విన్, జడేజా అర్ధ సెంచరీలు ► తొలి ఇన్నింగ్స్‌లో 759/7 డిక్లేర్డ్ ► టెస్టుల్లో భారత్‌కిదే అత్యధిక స్కోరు ► ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 12/0 బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కే సాధ్యం కాని ఫీట్ అది.. ఇప్పటి దాకా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక్కరంటే ఒక్కరే సాధించిన రికార్డు.. ఎంతో మంది మేటి బ్యాట్స్‌మెన్ కలలు కన్నా అందుకోలేని విన్యాసమది.. అలాంటి అరుదైన ట్రిపుల్ సెంచరీని యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ సాధించాడు. అదీ ఆడుతున్న మూడో టెస్టులోనే కావడం విశేషం. అంతేకాదు తన తొలి సెంచరీనే ట్రిపుల్‌గా మలుచుకున్న తొలి భారత ఆటగాడయ్యాడు. ఈ సిరీస్‌లో ఈ మ్యాచ్‌కు ముందు అతడు చేసిన స్కోర్లు 4, 13 మాత్రమే.. ఈ స్థితిలో ఎవరైనా ఈ ఆటగాడి గురించి ఎక్కువగా ఊహిస్తారా? కానీ ఎవరి అంచనాలకు అందకుండా ఈ కర్ణాటక స్టార్ అనూహ్య రీతిలో సాగించిన విజృంభణక్రికెట్ పండితులనే ఆశ్చర్యపరిచింది. కుటుంబసభ్యుల సమక్షంలో అసమాన ఆటను ప్రదర్శించి ఈ టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. మరోవైపు ఈ మరపురాని ఆటతీరుకు తోడు అశ్విన్, జడేజా అర్ధ సెంచరీలు సాధించడంతో భారత జట్టు తమ టెస్టు చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డునూ తమ ఖాతాలో వేసుకుంది.. చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత జట్టు రికార్డుల మోత మోగించింది. తన అరంగేట్ర సిరీస్‌లోనే కరుణ్ నాయర్ (381 బంతుల్లో 303 నాటౌట్; 32 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ అజేయంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఎప్పటిలాగే భారత టెయిలెండర్లు అశ్విన్ (149 బంతుల్లో 67; 6 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (55 బంతుల్లో 51; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగైన ఆటతో ఆకట్టుకోవడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 190.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 759 పరుగులకు డిక్లేర్ చేసింది. తమ టెస్టు చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. ద్విశతకం పూర్తి చేసుకున్న అనంతరం వన్డే తరహాలో రెచ్చిపోయిన నాయర్ 75 బంతుల్లోనే తన చివరి 103 పరుగులను సాధించడం విశేషం. అంతేకాకుండా సోమవారం ఒక్కరోజే తను 245 బంతుల్లోనే 232 పరుగులు సాధించడం అతని జోరును సూచిస్తోంది. జడేజా కూడా ఇదే స్థాయి జోరు చూపడంతో భారత ఇన్నింగ్స్‌లో పరుగులు వేగంగా వచ్చాయి. అలాగే అశ్విన్‌తో కలిసి నాయర్ ఆరో వికెట్‌కు 181 పరుగులు జత చేయగా, జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 138 పరుగులు అందించాడు. బ్రాడ్, డాసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం 282 పరుగులు వెనకబడిన దశలో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో కుక్ (3 బ్యాటింగ్), జెన్నింగ్స్ (9 బ్యాటింగ్) ఉన్నారు. సెషన్ – 1 తొలి సెంచరీ పూర్తి 391/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జోరును కనబరిచింది. చక్కటి నిలకడను ప్రదర్శిస్తూ కరుణ్, విజయ్ ఆటతీరు సాగింది. డాసన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదిన కరుణ్.. స్టోక్స్ బౌలింగ్‌లో మరో చక్కటి బౌండరీతో 185 బంతుల్లో కెరీర్‌తో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లోనే విజయ్ (76 బంతుల్లో 29; 4 ఫోర్లు) డాసన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. విజయ్ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 63 పరుగులు జత చేరాయి. అనంతరం నాయర్‌కు ఫామ్‌లో ఉన్న అశ్విన్ జత కలవడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చిన అశ్విన్ పరుగుల ఖాతా తెరిచేందుకు 20 బంతులు తీసుకున్నాడు. ఓవర్లు: 27, పరుగులు: 72, వికెట్లు: 1 సెషన్ – 2 నాయర్, అశ్విన్ జోరు లంచ్ విరామం అనంతరం భారత బ్యాటింగ్‌లో జోరు కనిపించింది. మూడో ఓవర్లో కరుణ్ ఫోర్ బాదగా ఐదో ఓవర్లో అశ్విన్ సిక్సర్‌తో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాతి ఓవర్లలోనూ ఇద్దరు బౌండరీల వర్షం కురిపిస్తూ సాగారు. రషీద్ వేసిన 155వ ఓవర్లో నాయర్ రివర్స్ స్వీప్ ఆడగా ఇంగ్లండ్ క్యాచ్ అప్పీల్‌కు వెళ్లింది. అయితే థర్డ్ అంపైర్ తిరస్కరించడంతో వారికి నిరాశే మిగిలింది. 115 బంతుల్లో అశ్విన్ సిరీస్‌లో నాలుగో అర్ధ సెంచరీని సాధించాడు. టీ బ్రేక్‌కు ముందు ఓవర్లో జెన్నింగ్స్ ఎల్బీ అవుట్ నిర్ణయాన్ని అశ్విన్ సవాల్ చేయగా రివ్యూలో అనుకూలంగా వచ్చింది. ఈ సెషన్‌ను వీరిద్దరు ఆటగాళ్లు ఓవర్‌కు నాలుగు పరుగుల చొప్పున సాధించారు. ఓవర్లు: 30, పరుగులు: 119, వికెట్లు: 0 సెషన్ – 3 నాయర్ తుఫాన్ ఇన్నింగ్స్ టీ బ్రేక్ అయిన రెండో ఓవర్లో మరోసారి ఫోర్‌తో నాయర్ తన సెంచరీని డబుల్‌గా మార్చాడు. అయితే కొద్దిసేపటికే అశ్విన్.. బ్రాడ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరుసటి ఓవర్లో నాయర్ ఇచ్చిన క్యాచ్‌ను రూట్ వదిలేసాడు. ఇక జడేజా వచ్చీ రాగానే బ్యాట్‌కు పనిచెప్పాడు. బాల్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. అటు నాయర్ కూడా మేనేజిమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇన్నింగ్స్‌లో దూకుడు చూపించాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ 185వ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత జడేజా సిక్సర్‌తో భారత్ టెస్టుల్లో అత్యధిక స్కోరును అందుకుంది. 52 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ చేసిన అనంతరం డాసన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాతే నాయర్ బౌండరీతో అరుదైన ట్రిపుల్ సాధించడంతో కెప్టెన్ కోహ్లి తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసింది. భారత్ ఓవర్లు: 25.4, పరుగులు: 177, వికెట్లు: 2 ఇంగ్లండ్: 5, పరుగులు 12, వికెట్లు 0 వికెట్ కోల్పోకుండా) 12. ఫోర్.. ఫోర్.. ఫోర్ కరుణ్ నాయర్ అద్భుత బ్యాటింగ్‌లో మరో అరుదైన ఫీట్ నమోదైంది. మామూలుగా ఏ ఆటగాడైనా సెంచరీకి అతి సమీపంలో ఉన్నప్పుడు సింగిల్ తీసేందుకు ప్రాధాన్యమిస్తాడే కానీ బౌండరీ కొట్టాలని ఏమాత్రం ప్రయత్నించడు. అయితే కరుణ్ ఒక్కసారి కాదు తన ‘మూడు’ సెంచరీలను ఇలాగే చేయడం విశేషం. 99 పరుగుల వద్ద ఫుల్ డెలివరీని ఆఫ్ సైడ్‌లో, 197 పరుగుల వద్ద కవర్స్ వైపు, 299 వద్ద పాయింట్ వైపు బౌండరీ కొట్టి అజేయంగా తన రికార్డు ఇన్నింగ్స్‌ను అందుకున్నాడు. 1 కెరీర్ మొదలయ్యాక తక్కువ ఇన్నింగ్స్ (3)లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2 భారత్ నుంచి ట్రిపుల్ సెంచరీలు సాధించిన రెండో ఆటగాడు కరుణ్. గతంలో సెహ్వాగ్ రెండు సార్లు ట్రిపుల్ సాధించాడు. 3 ప్రపంచ టెస్టు క్రికెట్లో తన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచిన మూడో బ్యాట్స్‌మన్ నాయర్ కరుణ్‌ను అభినందిస్తున్న కోహ్లి ఇతర సభ్యులు -
కొడితే రికార్డులే ...
-
కొడితే రికార్డులే ...
భారీ విజయమే భారత్ లక్ష్యం 4–0పై కోహ్లి సేన దృష్టి ∙పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్ నేటి నుంచి చెన్నైలో చివరి టెస్టు ∙ఉ.గం.9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్–1లో లైవ్ విరాట్ కోహ్లి మరో 135 పరుగులు చేస్తే ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడవుతాడు. అశ్విన్ మరో 9 వికెట్లు పడగొడితే ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇవి మన స్టార్ ఆటగాళ్లు చేరుకోగలిగే మైలురాళ్లు. భారత్ గెలిస్తే తొలిసారి ఇంగ్లండ్‌ను 4–0తో చిత్తు చేసినట్లవుతుంది. 2011 నాటి సిరీస్ ఓటమికి లెక్క సరిపోతుంది. భారత టెస్టు చరిత్రలో రెండోసారి ప్రత్యర్థిని 4–0తో ఓడించిన జట్టుగా కోహ్లి సేన నిలుస్తుంది. మ్యాచ్ గెలిచినా, ‘డ్రా’ అయినా మన జట్టు వరుసగా 18వ మ్యాచ్‌ను ఓటమి లేకుండా ముగించిన కొత్త రికార్డు నమోదవుతుంది. టెస్టు సిరీస్‌లో భారత్ చెలగాటం ఇంగ్లండ్‌కు ప్రాణసంకటంలా మారింది. వరుస విజయాల జోరుతో మరో మ్యాచ్ నెగ్గాలని, రికార్డులు బద్దలు కొట్టాలని టీమిండియా పట్టుదలగా ఉండగా... సిరీస్ కోల్పోయాక కనీసం పరువు దక్కించుకునేందుకు ఇంగ్లండ్ పోరాడుతోంది. ఇప్పటికే సమష్టి వైఫల్యంతో దెబ్బతిన్న ఇంగ్లండ్... ‘వర్దా’ తర్వాత సొంతగడ్డపై అశ్విన్ రూపంలో రానున్న పెను తుపానును ఎదుర్కోగలదా! చెన్నై: ‘వర్దా’ తుపాను తర్వాత నెలకొన్న ప్రశాంతత మధ్య భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లో ఐదో టెస్టుకు చెపాక్‌లో రంగం సిద్ధమైంది. ఎన్నో ప్రతికూలతల మధ్య మ్యాచ్ నిర్వహణ కోసం చిదంబరం స్టేడియం సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో అనుకున్న ప్రకారం నేటి (శుక్రవారం) నుంచి చివరి టెస్టు జరగనుంది. ఇప్పటికే 3–0తో సిరీస్ నెగ్గి తిరుగులేని ఆధిక్యం కనబరిచిన భారత్ దీనిని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. భారత్‌లో అడుగు పెట్టిన నాటినుంచి విజయానికి ఆమడ దూరంలో నిలిచిన ఇంగ్లండ్ ఒత్తిడి లేకుండా ఆడి కాస్త మెరుగ్గా సిరీస్ ముగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం ఈ టెస్టును ఆ జట్టు ‘డ్రా’గా ముగించగలిగినా వారికి గెలుపుతో సమానమే! మార్పుల్లేకుండానే... విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్ అయ్యాక గాయం కారణంగా గానీ, వ్యూహాల వల్ల గానీ ప్రతీ టెస్టు మ్యాచ్‌కు తుది జట్టులో కనీసం ఒక మార్పు అయినా జరిగింది. అయితే పెళ్లి తర్వాత జట్టుతో చేరిన ఇషాంత్ శర్మకు కనీసం ఒక మ్యాచ్‌లోనైనా అవకాశం ఇవ్వాలని భావిస్తే తప్ప... తొలిసారి కోహ్లి నేతృత్వంలో ఎలాంటి మార్పు లేకుండా జట్టు బరిలోకి దిగవచ్చు. తొమ్మిదో స్థానంలో వచ్చే ఆటగాడు కూడా సెంచరీ చేయగల స్థాయిలో ఉన్న భారత జట్టుకు ఎలాంటి బ్యాటింగ్ సమస్యలు లేవు. కోహ్లి తిరుగులేని ఆటకు విజయ్, పుజారా సహకారం ఉంటోంది. లోకేశ్ రాహుల్ నుంచి మాత్రం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. గత మ్యాచ్‌లో విఫలమైన అతని కర్ణాటక సహచరుడు కరుణ్ నాయర్ మెరుగ్గా ఆడితేనే మున్ముందు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. బౌలింగ్‌లో మన స్పిన్నర్లు అశ్విన్, జడేజా, జయంత్ ఎదురు లేకుండా సాగుతున్నారు. ఇక్కడా కొత్త రికార్డులు కొల్లగొట్టడానికి వీరు సిద్ధమయ్యారు. ఆరంభంలో పిచ్ సీమర్లకు అనుకూలిస్తే ఉమేశ్, భువనేశ్వర్ మంచి ప్రభావం చూపించగలరు. మొత్తంగా వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం టీమ్‌లో తొణికిసలాడుతోంది. ఈ జట్టును ఆపడం ప్రత్యర్థికి అంత సులువు కాదు. కోలుకుంటారా... నిజానికి ఇంగ్లండ్ భారత గడ్డపై అడుగు పెట్టినప్పుడు ఆ జట్టు ఇంత పేలవంగా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో పోలిస్తే టెస్టు స్పెషలిస్ట్ టీమ్ కావడం, భారత్‌లో కూడా గతంలో మెరుగైన రికార్డు ఉండటం వల్ల గట్టి పోటీ తప్పదనిపించింది. కానీ కోహ్లి సేన దూకుడు ముందు కుక్ బృందం తేలిపోయింది. ఇప్పుడు సిరీస్ ముగింపునకు వచ్చిన సమయంలోనైనా ఆ టీమ్ కాస్త గట్టిగా నిలబడితే మెరుగైన ఫలితం రాబట్టవచ్చు. రూట్ మినహా ఎవరూ బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. కుక్ ఆట కూడా ఆశించిన స్థాయిలో లేకపోగా, స్టోక్స్ గత రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన బెయిర్‌స్టో ఆట జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. మొయిన్ అలీ కూడా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ పట్టుదలగా ఆడాల్సి ఉంది. గత రెండు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అండర్సన్ గాయంతో ఈ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో మూడో స్పిన్నర్‌గా లియామ్ డాసన్ వస్తాడు. మ్యాచ్ రోజు ఉదయం ఫిట్నెస్ టెస్టులో నెగ్గితే వోక్స్ స్థానంలో బ్రాడ్ జట్టులోకి రానున్నాడు. సిరీస్‌లో 22 వికెట్లు తీసిన రషీద్‌కు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు మరో అవకాశం వచ్చింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజారా, నాయర్, పార్థివ్, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, భువనేశ్వర్/ఇషాంత్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), జెన్నింగ్స్, రూట్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, డాసన్, రషీద్, బాల్, బ్రాడ్/ వోక్స్. ⇒ 13 ఈ మైదానంలో ఆడిన 31 టెస్టులలో భారత్ 13 గెలిచింది ⇒ 3 ఇక్కడ 8 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ 3 గెలిచి, 4 ఓడింది. మా జట్టేమీ అజేయమైనది కాదు. ఈ విజయాలు ఒక దశ మాత్రమే. రాబోయే 7–8 ఏళ్ల పాటు అత్యుత్తమ జట్టుగా ఆధిపత్యం ప్రదర్శించడంలో భాగంగా సాగుతున్న ప్రక్రియ ఇది. ప్రపంచంలో ఇంకా చాలా చోట్ల ఆడాల్సి ఉందని నాకు తెలుసు. సిరీస్ సాధించినా దూకుడు తగ్గించం. 4–0తో గెలవాలని మేం పట్టుదలగా ఉన్నాం. నాకు అవకాశం లభిస్తే 2018లో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు కనీసం నెల రోజులు కౌంటీల్లో ఆడి అక్కడి పిచ్‌లు, వాతావరణానికి అలవాటు పడాలని భావిస్తున్నా. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ మా ప్రయత్నంలో లోపం లేదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ఓడినప్పుడు సహజంగానే విమర్శలు వస్తాయి. వేగంగా సాగిపోయే క్రికెట్లో ప్రతీకారం అనే మాటను నేను నమ్మను. 2014 సిరీస్ జరిగి కూడా చాలా రోజులైనట్లు అనిపిస్తోంది. నా ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ జరగని రోజు లేదు. అయితే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన చోట మా ప్రాక్టీస్ ముఖ్యం కాదు. మహా అయితే మేం హోటల్æనుంచి స్టేడియంకు వస్తున్నాము. చుట్టూ పరిస్థితి చూస్తే మేం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. – కుక్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సపరేటు... తుపాను కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో గురువారం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేకపోయారు. అయితే ఇంగ్లండ్ ప్రధాన బ్యాట్స్‌మన్ జో రూట్ మాత్రం తన సన్నాహాలకు బ్రేక్ వేయలేదు. అందుకోసం అతను మరో ‘దారి’ని వెతుక్కున్నాడు. చెన్నై గల్లీల్లోకి దూరి తన సాధన కొనసాగించాడు. స్టేడియం సమీపంలో ఉన్న సిమెంట్ రోడ్డుపైన అతను సహాయక సిబ్బందితో కలిసి సుదీర్ఘ సమయం పాటు సీరియస్‌గా సాధన చేయడం విశేషం. పిచ్, వాతావరణం చెన్నై నగరంలో వర్షం తగ్గుముఖం పట్టి గురువారం బాగా ఎండకాసింది. అయితే బొగ్గులతో ఆరబెట్టిన తర్వాత కూడా పిచ్‌పై కాస్త తేమ ఉంది. దాంతో ఆరంభంలో సీమ్‌కు సహకరించవచ్చు. కానీ మ్యాచ్ సాగినకొద్దీ ఇది స్పిన్‌కు అనుకూలంగా మారిపోతుంది. టెస్టు జరిగే రోజులు భారీ వర్ష సూచన లేకున్నా ఆకాశం మేఘావృతమై ఉండటంతో చినుకులు పడే అవకాశం ఉంది. -
పొగచూరిన బతుకులు
– తీరని మధ్యాహ్నభోజన వంట ఏజెన్సీల కష్టాలు – ఏళ్లు గడుస్తున్నా కట్టెలపొయ్యిలపైనే వంటలు – ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైన గ్యాస్ కనెక్షన్లు మధ్యాహ్నభోజనం పథకం వంట ఏజెన్సీల కష్టాలు తీరడం లేదు. అదిగో గ్యాస్ పోయ్యిలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్పడం తప్ప ఆచరణలో పెట్టింది లేదు. నేటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కట్టెల పోయ్యిలపైనే నిర్వాహకులు వంటలు చేస్తున్నారు. పొగ ఎఫెక్ట్‌కు ఇప్పటికే కొందరు కంటి, శా్వస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ యాజమన్య కింద ప్రాథమిక పాఠశాలలు1928, ప్రాథమికోన్నత పాఠశాలలు 481, ఉన్నత పాఠశాలలు 448 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు వారికి నాణ్యమైన షౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం 2003 నుంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ఆహార పదార్థాల తయారీ బాధ్యత పొదుపు మహిళల (వంట ఏజెన్సీ)కు అప్పగించింది. ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తూ మిగతా సరుకులకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు ఒక్కోరికి రూ. 5.13, హైస్కూల్ విద్యార్థులకు రూ. 7.18 ప్రకారం నిరా్వహకులకు చెల్లిస్తోంది. అందులోనే వంట చేసేందుకు అవసరమైన కట్టెలను కొనుగోలు చేయాల్సి ఉంది. దరిచేరని గ్యాస్‌పోయ్యిలు కట్టెల పొయ్యిలపై వంట చేస్తుండటంతో నిర్వాహకుల ఆరోగ్యం దెబ్బతింటుందని, గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే దాదాపు 13 ఏళ్లు గడస్తున్నా అమలు కాలేదు. ఇంత వరకు ఒక్కరికి కూడా ఒక్క కనెక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తుండడంతో అందులో నుంచి వచ్చే పొగకు చాలామంది కంటి చూపు తగ్గడం, తలనొప్పులు రావడం మొదలైంది. మరికొందరు ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అయినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఇటీవలే గ్యాస్ కనెక్షన్ల కోసం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ సారైనా అనుమతులు ఇస్తుందో లేదోననే వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కట్టెలపై వంటలు చేయలేకపోతున్నాం – లలితమ్మ, కల్లూరు జడ్పీ హైస్కూల్ వంట ఏజెన్సీ నిర్వాహకురాలు పిల్లలకు వంట చేసేందుకు గ్యాస్‌పొయ్యిలు లేకపోవడంతో కట్టెలపైనే చేస్తున్నాం. వానా కాలం కట్టెలు చిక్కని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వాటిపై వంట చేస్తుండటంతో అనారోగ్యం బారిన పడుతున్నాం. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకోపోయాం. -
భారత్‌ను మరో విజయం ఊరిస్తోంది..!
-
మరో విజయం ఊరిస్తోంది..!
► మళ్లీ స్పిన్ వికెట్ సిద్ధం ► ఆత్మవిశ్వాసంతో భారత్ ► ఒత్తిడిలో ఇంగ్లండ్ ► నేటినుంచి మూడో టెస్టు తొలి టెస్టు తర్వాత ఇంగ్లండ్ ఆట చూసి ‘సిరీస్‌లో భారత్‌కు గట్టిపోటీ ఖాయం’ అనిపించింది. కానీ భారత గడ్డపై ఆడటం ఎంత కష్టమో కుక్‌సేనకు వైజాగ్‌లో తెలిసొచ్చింది. స్పిన్ పిచ్‌పై ఆడలేక చేతులెత్తేసిన కుక్ బృందం భారీ విజయాన్ని భారత్‌కు అందించింది. ఇది ఒక్కసారిగా సిరీస్‌లో అంచనాలను మార్చేసింది. ఎప్పటిలాగే సొంతగడ్డపై మన టీమ్ మళ్లీ ఫేవరెట్‌గా మారిపోరుుంది.మొహాలీ పిచ్ పేసర్లకు స్వర్గధామంలాంటిది అనేది ఒకప్పటి మాట. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారి ఇప్పుడు పూర్తిగా స్పిన్పరమైపోరుుంది. కాబట్టి మరోసారి మన స్పిన్ చక్రబంధంలో తిప్పేసేందుకు అశ్విన్ అండ్ కంపెనీ సిద్ధంగా ఉంది. మళ్లీ టాస్ గెలిస్తే ఈ టెస్టు కూడా విశాఖ మ్యాచ్ స్క్రీన్‌ప్లేలోనే సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సిరీస్ కోల్పోని పటిష్ట స్థితిలో నిలుస్తుంది. మొహాలీ: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు ఒక్కసారిగా అన్నీ అనుకూలంగా మారిపోయారుు. రాజ్‌కోట్‌లో డ్రా అనంతరం విశాఖపట్నంలో దక్కిన భారీ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆశించినట్లుగానే మరో స్పిన్ వికెట్ కూడా సిద్ధమైంది. ఇక్కడి పీసీఏ మైదానంలో గత 11 టెస్టులలో ఒక్కటి కూడా ఓడని రికార్డు భారత్‌కు ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నేటినుంచి (శనివారం) జరిగే మూడో టెస్టుకు కోహ్లి సేన సిద్ధమైంది. సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్... ఇక్కడా గెలిచి దానిని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. మరో వైపు రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ఆట ‘పోరాటానికి’ పరిమితమైంది తప్ప వారికి అనుకూల ఫలితం రాలేదు. 2012లో 0-1తో వెనుకబడి సిరీస్‌ను గెలవగలిగిన ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది. ముగ్గురు స్పిన్నర్లతోనే... గాయపడిన సాహా స్థానంలో పార్థివ్ పటేల్... ఇది మినహా మన జట్టులో మరో మార్పు ఉండకపోవచ్చు. మూడో స్పిన్నర్ ఎంపికపై ముందుగా సందేహం తలెత్తినా మ్యాచ్‌కు ముందు రోజు పిచ్ పరిస్థితి చూస్తే జయంత్ ఆడటం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఏడాది క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్, జడేజా చెరో 8 వికెట్లతో చెలరేగారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు వారిద్దరూ సన్నద్ధమయ్యారు. వీరిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు శక్తికి మించిన పని కావచ్చు. మిగతా సిరీస్ కోసం భువనేశ్వర్‌ను ఎంపిక చేసినా షమీ, ఉమేశ్ చక్కటి ప్రదర్శన ఇవ్వడంతో అతనికి తుది జట్టులో అవకాశం కష్టం. సిరీస్‌లో 337 పరుగులతో చెలరేగిన విరాట్ కోహ్లిపైనే ప్రత్యర్థి గురి పెట్టిందనడంలో సందేహం లేదు. అతడిని అడ్డుకోకపోతే కష్టమని ఇంగ్లండ్‌కు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. మరో వైపు పుజారా కూడా వరుస సెంచరీలతో చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. విజయ్, రాహుల్ తమ గత వైఫల్యాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది. అరుుతే నాలుగు ఇన్నింగ్సలలో కలిపి 63 పరుగులే చేసిన రహానే కాస్త ఆందోళన పెంచుతున్నాడు. జట్టు గెలవాలంటే అతను కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లో ఒకరు తరచుగా విఫలం కావడం మంచి పరిణామం కాదు. కేవలం కోహ్లి, పుజారాలనే నమ్ముకోకుండా మిగతావారు బ్యాటింగ్‌లో రాణించాల్సి ఉంది. అశ్విన్ బ్యాటింగ్ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుండటం సంతోషం. ఎనిమిదేళ్ల తర్వాత పార్థివ్ టెస్టు ఆడుతుండటం విశేషం. వారిద్దరే కీలకం స్టోక్స్ దూకుడుగా ఆడగలడు, అలీ స్పిన్‌ను ఎదుర్కోగలడు... బెరుుర్‌స్టో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ కాగా హమీద్ డిఫెన్స దుర్బేధ్యం... ఇంగ్లండ్ బ్యాటింగ్ బలగం చూస్తే ఈ జాబితా బాగానే ఉందనిపిస్తుంది. కానీ వాస్తవంగా చూస్తే భారత్‌లో ఆ జట్టు నిలవాలన్నా, గెలుపుపై కనీసం ఆశలు పెంచుకోవాలన్నా ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఆటనే ప్రధానమనడంలో సందేహం లేదు. వారి బలమంతా కుక్, రూట్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. ఉపఖండంలో అత్యుత్తమ రికార్డు ఉన్న కుక్, ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్లలో ఒకడైన రూట్ మరింత మెరుగ్గా ఆడాలని జట్టు ఆశిస్తోంది. వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్సలో రూట్ నిర్లక్ష్యపూరిత షాట్ మ్యాచ్ గమనాన్ని మారిస్తే, రెండో ఇన్నింగ్సలో కుక్ ఉన్నంత వరకు ‘డ్రా’పై నమ్మకంగా ఉన్న ఇంగ్లండ్ అతను అవుటయ్యాక కుప్పకూలింది. కాబట్టి భారత్ కోణంలో కూడా ఈ రెండు వికెట్లు ఎంతో కీలకమైనవి. పరిమిత ఓవర్లలో మంచి పేరున్నా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పెద్దగా ఆకట్టుకోని బట్లర్ తుది జట్టులోకి వచ్చాడు. ఏడాది క్రితం తన చివరి టెస్టు ఆడిన అతను ఏ మాత్రం ఆకట్టుకోగలడో చూడాలి. అరుుతే డకెట్, బలాన్సల వైఫల్యం నేపథ్యంలో ఇంగ్లండ్‌కు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోరుుంది. గత టెస్టులో పిచ్ అనుకూలంగా లేకపోరుునా అద్భుతంగా బౌలింగ్ చేసిన బ్రాడ్ ఈ టెస్టుకు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అతని స్థానంలో వోక్స్ వస్తున్నాడు. గాయపడ్డ అన్సారీ స్థానంలో 39 ఏళ్ల ఆఫ్‌స్పిన్నర్ గారెత్ బ్యాటీ ఆడతాడు. అలీ, రషీద్ వికెట్లు తీసినా అనుకున్న స్థారుులో భారత బ్యాటింగ్‌ను కట్టడి చేయడం వారి వల్ల కావడం లేదు. ప్రస్తుతానికై తే ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తే కాస్త మ్యాచ్‌పై నమ్మకం పెట్టుకోవచ్చు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, పార్థివ్, జడేజా, జయంత్, షమీ, ఉమేశ్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హమీద్, రూట్, అలీ, స్టోక్స్, బెరుుర్‌స్టో, బట్లర్, వోక్స్, రషీద్, బ్యాటీ, అండర్సన్. ‘గత రెండేళ్లలో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి టెస్టులు గెలిచాం. దానిని కొనసాగించాల్సి ఉంది. ఆటగాళ్లంతా అంచనాలను అందుకోవడం పట్ల కెప్టెన్‌గా నేను సంతృప్తిగా ఉన్నాను. గాలే టెస్టులో ఓటమి తర్వాతే ప్రతీ మ్యాచ్‌కు ఆటగాళ్లను మారుస్తూ వస్తున్నాను. వ్యక్తుల కంటే జట్టు గెలుపే ముఖ్యమని అప్పుడే అందరికీ అర్థమవుతుంది. టెస్టు సిరీస్పైనుంచి నా ఏకాగ్రతను చెడగొట్టేందుకే బాల్ ట్యాంపరింగ్ వివాదం సృష్టించారు. ఓడిపోరుునప్పుడే ఇలాంటివి అన్నీ బయటికి వస్తారుు. నేనేదైనా తప్పు చేస్తే ఐసీసీ నేరుగా నన్నే ప్రశ్నించేది. నా దృష్టిలో ఒక పత్రికలో వచ్చిన వార్తకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. మేం ఐసీసీనే గౌరవిస్తాం. కొంత మంది సిరీస్ నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ అది సాధ్యం కాదు’ - విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ పిచ్, వాతావరణం పిచ్ పొడిగా ఉంది. ఇప్పటికే మొత్తం పచ్చికను తొలిగిం చారు. ఆరంభంలో కూడా సీమర్లకు అనుకూలించదు. మ్యాచ్ సాగిన కొద్దీ స్పిన్నర్లదే రాజ్యం. ఉత్తరాదిన వాతావరణం చల్లగా ఉన్నా, వర్షసూచన మాత్రం లేదు. తక్కువ వెలుతురు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. -
నీటి అడుగున అరవై గంటలు..!
ఈత రానివారే కాదు.. గజ ఈతగాళ్లు అరుునా సముద్రంలోకి దూకేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. పొరపాటున మునిగిపోతే తిరిగి ప్రాణాలతో బయటపడే అవకాశం లేకపోవడమే దీనికి కారణం. మరి, ఏకంగా మూడు రోజుల పాటు సముద్రపు అడుగున ఉండాలంటే..? శవమై తేలుతూ ఏ షార్కులకో ఆహారంగా మారిపోవాలి. లేదూ.. ప్రాణాలతో నిలిచి ఉండాలంటే..? మీరు ‘హ్యారిసన్ ఒకేనే’ అయ్యుండాలి! నిజం.. ఈయన దాదాపు మూడు రోజులు సముద్ర గర్భంలోనే ఉండి పోయాడు..! 29 ఏళ్ల హ్యారిసన్ ఒకేనే నైజీరియాకు చెందిన వంటవాడు. 2013లో ‘జాక్సన్-4’ బోటులో సముద్రంలోకి ప్రవేశించిన బృందానికి వంట చేసేందుకు పనికి కుదిరాడు. అప్పటికి మరికొద్ది నెలల్లో పెళ్లి చేసుకోనున్న ఒకేనే.. ఈ ట్రిప్పునే తన చివరి సముద్ర ప్రయాణంగా భావించాడు. తర్వాత ఎప్పుడూ సముద్రంలోకి వెళ్లనని కూడా కాబోయే భార్యకు మాటిచ్చాడు. అలా మొదలైన అతడి ప్రయాణం ఆ ఏడాది మే 26న ఊహించని మలుపులు తిరిగింది. ఉన్నట్టుండి ఉప్పొంగిన అలలు వీరి బోటును బలంగా తాకారుు. ఈ తాకిడికి బోటు అతలాకుతలమైపోరుుంది. ఊహించని విధంగా సముద్రంలోకి మునగడం మొదలుపెట్టింది. అప్పటికి బాత్రూమ్లో కాలకృత్యాలు తీర్చుకుంటున్న ఒకేనేకు బయట ఏం జరుగుతోందో కొద్దిసేపు అర్థం కాలేదు. మరోవైపు బోటు నీటిలో మునిగాక కూడా వేగంగా దూసుకుపోతోంది. బోటులోకి నెమ్మదినెమ్మదిగా నీరు చేరడం మొదలైంది. ఒకేనే మినహా సిబ్బంది సముద్రంలోకి కొట్టుకుపోతున్నారు. దీంతో అప్రమత్తమైన ఈ వంటవాడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు పరుగుపెట్టినా అప్పటికే ఆలస్యమైంది. బయటపడే దారే లేదన్నట్టుగా బోటులోనే ఇరుక్కుపోయాడు ఒకేనే. చుట్టూ చిమ్మచీకటి ఆవహించింది. నలువైపులా గదిలోకి నీరు దూసుకొస్తున్నారుు. నీరు ముంచుకొస్తుండటంతో ఈ క్యాబిన్‌లోని ఓ గాలి బుడగను ఆధారం చేసుకుని నిలబడసాగాడు ఒకేనే. తన కళ్ల ముందే ఒక్కొక్కరు బోటు నుంచి వెలుపలికి కొట్టుకుపోతుండటం, తాను మాత్రమే చిక్కుకుపోవడం చూసి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. తాను ఎంతగానో నమ్మే జీసస్కు కొన్ని వందల సార్లు ప్రార్థన చేశాడు. అదృష్టవశాత్తూ తన గది పూర్తిగా నీటితో నిండుకుపోవడంతో ప్రాణాలతో నిలిచిన ఒకేనే.. దాదాపు 60 గంటలు అలాగే గడిపాడు. శరీరం మీద బాక్సర్స్ తప్ప వేరే దుస్తులు లేకపోవడంతో అతడి ఒళ్లు హూనమైంది. వంద అడుగుల లోతులో చిక్కుకున్న ఈ బోటులోని మృతదేహాల వెలికితీతకు వచ్చిన డైవర్లకు ప్రాణాలతో కనిపించి, ఊహించని షాకిచ్చాడు ఒకేనే. ఆ ప్రమాదంలో ప్రాణాలతో నిలిచిన ఒకే ఒక్కడుగా మిగిలాడు. -
విశాఖ టెస్ట్‌లో భారత్ ఘన విజయం
-
సాగర తీరాన సగర్వంగా...
► రెండో టెస్టులో భారత్ ఘన విజయం ► ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం ► మూడో టెస్టు 26 నుంచి మొహాలీలో అనుకున్నట్లే విశాఖ నగరం అరంగేట్ర టెస్టులో భారత జట్టుకు విజయాన్ని ఇచ్చింది. రాజ్‌కోట్ టెస్టులో ఫ్లాట్ పిచ్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన భారత జట్టు... మన శైలికి సరిపోయే వికెట్‌పై అదరగొట్టింది. ఇంగ్లండ్ జట్టు అంత తేలికగా తలవంచకపోరుునా... ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోహ్లి సేన సాగరతీరాన సగర్వంగా ఘన విజయం సాధించింది. భారత్‌లో ఆఖరి రోజు పిచ్‌పై రోజంతా ఆడి టెస్టును కాపాడుకోవడం ఏ జట్టుకూ అంత తేలికకాదు. కాస్త పోరాడినా ఇంగ్లండ్‌కు కూడా అది అసాధ్యమే. రెండో టెస్టులో చివరి రోజు 90 ఓవర్ల పాటు ఆడితే మ్యాచ్‌ను రక్షించుకునే స్థితిలో... కుక్ సేన 38.1 ఓవర్ల పాటు పోరాడి చేతులెత్తేసింది. ఆఖరి రోజు 71 పరుగులకే ఇంగ్లండ్ మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోరుు ఓటమిని మూటగట్టుకుంది. విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి మూడు ఫార్మాట్లు.... ముగ్గురు ప్రత్యర్థులు... .మూడు విజయాలు... ఈ ఏడాది విశాఖ నగరంలో భారత్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఫిబ్రవరిలో శ్రీలంకపై టి20లో, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌పై వన్డేలో గెలిచిన భారత్... తాజాగా టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్ 246 పరుగులతో ఘన విజయం సాధించింది. సోమవారం ఐదో రోజు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్సలో 97.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటరుుంది. జో రూట్ (107 బంతుల్లో 25; 3 ఫోర్లు) 123 నిమిషాల పాటు పోరాడాడు. బెరుుర్‌స్టో (40 బంతుల్లో 34 నాటౌట్; 7 ఫోర్లు) ఒక ఎండ్‌లో నిలకడగా ఆడినా... రెండో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. భారత బౌలర్లలో అశ్విన్, జయంత్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా... షమీ, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రా కాగా... ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టెస్టు ఈనెల 26 నుంచి మొహాలీలో జరుగుతుంది. సెషన్-1 ఐదు వికెట్లు చివరి రోజు నాలుగో ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో రూట్ ఇచ్చిన క్యాచ్‌ను లెగ్ స్లిప్‌లో కోహ్లి వదిలేశాడు. అరుుతే తన తర్వాతి ఓవర్లోనే అశ్విన్... డకెట్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపి భారత్‌కు బోణీ వికెట్ అందించాడు. అశ్విన్ తర్వాతి ఓవర్లో రూట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చినట్లు భావించి అంపైర్ అవుట్ ఇచ్చారు. అరుుతే రూట్ రివ్యూ చేయగా నాటౌట్ అని తేలింది. రూట్, మొరుున్ అలీ తొమ్మిది ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడారు. అరుుతే జడేజా బౌలింగ్‌లో మొరుున్ డిఫెన్స ఆడబోరుు ఎక్స్ట్రా బౌన్సతో షార్ట్ లెగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. 80 ఓవర్లు పూర్తయ్యాక భారత్ కొత్త బంతిని తీసుకుని కూడా రెండు ఎండ్లలో స్పిన్నర్లను కొనసాగించింది. జడేజా స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన జయంత్... తన రెండో ఓవర్లో స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. మరో ఎండ్‌లో అశ్విన్ స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన షమీ... తన రెండో ఓవర్లో రూట్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. బ్యాట్స్‌మన్ రివ్యూ అడిగినా ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. 3 ఓవర్ల పాటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా... షమీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రషీద్ అవుట య్యాడు. తర్వాత బెరుుర్‌స్టో మూడు ఫోర్లు కొట్టి ఈ సెషన్‌ను ముగించాడు. ఓవర్లు: 33.4 పరుగులు: 55 వికెట్లు: 5 సెషన్-2 20 నిమిషాల్లోనే... ఈ సెషన్ రెండో ఓవర్లోనే అశ్విన్ బౌలింగ్‌లో అన్సారీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఓ ఎండ్‌లో బెరుుర్‌స్టో నిలబడినా... రెండో ఎండ్‌లో జయంత్ యాదవ్ వరుస బంతుల్లో బ్రాడ్, అండర్సన్లను ఎల్బీగా అవుట్ చేశాడు. ఈ రెండు వికెట్లూ రివ్యూకు వెళ్లినా ఫలితం ఇంగ్లండ్‌కు ప్రతికూలంగా వచ్చింది. లంచ్ తర్వాత కేవలం 20 నిమిషాల్లోనే ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ విజయం పూర్తరుుంది. ఓవర్లు: 4.3 పరుగులు: 16 వికెట్లు: 3 ►2 పరుగుల పరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇది రెండో (246) అతి పెద్ద విజయం. 1986లో హెడింగ్లీలో 279 పరుగుల తేడాతో గెలిచింది. ► 10 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు పది మంది ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యారు. ఆ జట్టు చరిత్రలో ఇదే అత్యధికం. ► 110 రెండు ఇన్నింగ్స్‌లలోనూ అండర్సన్ తొలి బంతికే డకౌట్ (కింగ్ పెయిర్) అయ్యాడు. 1906 తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇలా అవుటవడం ఇదే తొలిసారి. ఈ మైదానం నాకు బాగా కలిసొచ్చింది. ఇది నాకు ప్రత్యేకం. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ కూడా అంతే. ఎక్కువ మంది అభిమానులు మైదానానికి వచ్చి మద్దతిస్తే... కష్ట సమయంలోనూ ఉత్సాహం తగ్గదు. తొలి ఇన్నింగ్సలో భారీ స్కోరు చేయడం ఈ విజయంలో కీలకం. ఫాస్ట్ బౌలర్లతో పాటు అరంగేట్రంలోనే జయంత్ యాదవ్ రాణించడం చెప్పుకోదగ్గ అంశాలు. మేం మెరుగైన క్రికెట్ ఆడుతున్నాం. ఎలాంటి అలసత్వం లేకుండా సిరీస్‌ను కొనసాగిస్తాం. ఇంగ్లండ్ బలమైన జట్టు. ఆ జట్టును గౌరవిస్తాం. - విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించింది. రెండో రోజు ఐదు వికెట్లు కోల్పోయాక కూడా మేం పోరాడాం. ఈ విజయం కోసం భారత్ బాగా కష్టపడేలా చేశాం. మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. అరుుతే అది మ్యాచ్ మొత్తం జరగలేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలవడం కోసం మరింత కష్టపడతాం. - కుక్, ఇంగ్లండ్ కెప్టెన్ -
అంత వీజీ కాదు!
అన్ని విభాగాల్లో పటిష్టంగా ఇంగ్లండ్ ఇకపై భారత్ వ్యూహం మార్చాల్సిందే ఐదే ఐదు రోజులు... భారత్ నేలకు దిగింది. బంగ్లాదేశ్ లాంటి జట్టు చేతిలోనే మూడు రోజుల్లో ఓడిపోరుున జట్టు మనకు కనీసం పోటీ ఇస్తుందా అనే భావన నుంచి... ఇకపై అప్రమత్తంగా లేకపోతే ఓడిపోవాలేమో అనే సందేహం వచ్చేసింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ఒక రకంగా భారత జట్టు ఇన్నాళ్లూ సొంత గడ్డపై ప్రత్యర్థుల్ని ఎలా ఏడిపిస్తోందో.. ఈసారి ఇంగ్లండ్ మనల్ని అలా ఏడిపించేసింది. మొత్తానికి కష్టపడి తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్ ఇకపై వ్యూహాన్ని పూర్తిగా మార్చాలి. అదే సమయంలో మరింత అప్రమత్తంగా ఆడాలి. ఎందుకంటే ఇంగ్లండ్‌పై గెలవడం అంత ఈజీ కాదని తొలి టెస్టుతో అర్థమైపోరుుంది. క్రీడావిభాగం కోహ్లి కెప్టెన్ అయ్యాక సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క టాస్ కూడా ఓడిపోలేదు. టాస్ గెలిచిన ప్రతిసారీ భారత్ బ్యాటింగ్ చేసింది. భారత్‌లో ఏ వేదికలో క్రికెట్ ఆడినా ఆఖరి రెండు రోజులు స్పిన్ ట్రాక్‌లు ఉంటారుు కాబట్టి... నాలుగో ఇన్నింగ్సలో ఆడాల్సిన ప్రమాదం తప్పేది. కానీ ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో సీన్ రివర్స్ అరుుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అరుుతే టాస్ అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా అనే అంశంపై భారత్ దృష్టి పెట్టాలి. నిజానికి టాస్ కలిసి రావడం ఒక్కటే కాదు... ఇంగ్లండ్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా ఆడింది. అందరూ ఫామ్‌లో... ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్ కోసం 19 ఏళ్ల కుర్రాడు హమీద్‌ను తీసుకొచ్చింది. తను స్పిన్ బాగా ఆడతాడనే కారణంతోనే చిన్న వయసులోనే అరంగేట్రం చేరుుంచారు. తనకు లభించిన అవకాశాన్ని ఆ కుర్రాడు అద్భుతంగా వినియోగించుకున్నాడు. రెండు ఇన్నింగ్సలోనూ ఆకట్టుకున్నాడు. ఇక కుక్ కూడా భారత్‌లో తనకు అలవాటైన ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్సలో ఆఖరి రోజు పిచ్‌పై సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జో రూట్ మరోసారి తన విలువను నిరూపించుకుంటే... మొరుున్ అలీ ఉపఖండంలో సరిగా ఆడలేడనే అపప్రదను తొలగించుకున్నాడు. ఆల్‌రౌండర్ స్టోక్స్ బ్యాటింగ్ కూడా కొంత ఆశ్చర్యపరిచింది. ఓవరాల్‌గా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అందరూ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఎలాంటి పిచ్‌పై అరుునా అశ్విన్ బౌలింగ్‌ను ఆడటం అంత సులభం కాదు. కానీ ఈ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌లో అలవోకగా పరుగులు చేశారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు కూడా ఆశించిన రీతిలో బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ బాగా ఆకట్టుకున్నాడు. అనుభవం లేకపోరుునా జఫర్ అన్సారీ... ఎంతో కొంత అనుభవం ఉన్న మొరుున్ అలీ కూడా బాగా బౌలింగ్ చేశారు. స్పిన్ బాగా ఆడతారనే పేరున్న భారత బ్యాట్స్‌మెన్‌నే ఈ స్పిన్ త్రయం వణికించింది. మన కూర్పు సంగతేంటి? నిజానికి తొలి టెస్టుకు తుది జట్టు ఎంపికలో భారత్ సరైన వ్యూహం అవలంభించలేదనే భావించాలి. ముగ్గురు స్పిన్నర్లు పనికొచ్చే పిచ్ మీద ఆడుతున్నప్పుడు పేసర్లకు పెద్దగా పని ఉండదు. అలాంటప్పుడు హార్దిక్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకుని ఉంటే బ్యాటింగ్ విభాగం కూడా మరింత బలంగా కనిపించేది. ఆట పరంగా తొలి టెస్టులో భారత్‌కు కూడా కొన్ని సానుకూల అంశాలు ఉన్నారుు. విజయ్, పుజారా తొలి ఇన్నింగ్సలో అద్భుతంగా ఆడారు. రెండో ఇన్నింగ్సలో కోహ్లి ప్రతికూల పరిస్థితుల్లో తన శైలికి భిన్నంగా నాణ్యమైన టెస్టు ఆటతీరు కనబరిచాడు. రహానే రెండు ఇన్నింగ్సలోనూ విఫలమైనా... తను నైపుణ్యం ఉన్న క్రికెటర్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక అశ్విన్ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లో అత్యద్భుతం. ఆల్‌రౌండర్ అనే పదానికి తను అర్హుడని గతంలోనే నమ్మకం కుదిరినా... ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ద్వారా తన స్థారుుని మరింత పెంచుకున్నాడు. ఓవరాల్‌గా ఆటతీరు పరంగా భారత్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు లేవు. అరుుతే రెండో ఇన్నింగ్సలో ప్రతికూల పరిస్థితుల్లో మనవాళ్లు పడ్డ తడబాటు ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. స్పిన్ పిచ్లే పరిష్కారమా? నిజానికి భారత్‌లో టెస్టు అంటే నాలుగో రోజు ఉదయం సెషన్ నుంచే బంతి గిర్రున తిరగాలి. కానీ ఈసారి రాజ్‌కోట్‌లో బంతి కాస్త ఆలస్యంగా తిరగడం మొదలైంది. ఐదో రోజు ఆఖరి సెషన్లో బాగా ప్రభావం కనిపించింది. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు కావడం వల్ల ఆ రాష్ట్ర సంఘం పెద్దగా రిస్క్ తీసుకుని ఉండకపోవచ్చు. అందుకే తొలి మూడు రోజులు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించేలా ట్రాక్‌ను రూపొందించారు. నిజానికి భారత బలం స్పిన్. కాబట్టి పూర్తిగా స్పిన్ ట్రాక్‌లు వేసి మూడో రోజు నుంచే బంతి తిరుగుతుంటే మనకు అనుకూలంగా ఫలితాలు రావచ్చు. కాబట్టి రాబోయే నాలుగు టెస్టులకు స్పిన్ ట్రాక్‌లు సిద్ధం చేయాలనే ఆదేశాలు ఇప్పటికే వెళ్లి ఉండొచ్చు. రెండో టెస్టు జరిగే వైజాగ్ ఇటీవల కాలంలో స్పిన్నర్లకు స్వర్గధామంలా మారింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డే చూస్తే ఈ పిచ్‌పై స్పిన్నర్లు తప్ప మాట్లాడటానికి మరో అంశం ఉండదు. ఒకవేళ అదే తరహా పిచ్ వైజాగ్‌లో ఈ టెస్టుకు ఎదురైతే భారత్ అసలు బలమేంటో బయటకు వస్తుంది. ఒకవేళ అలాంటి వికెట్ ఎదురైనా ఇంగ్లండ్ గెలవడమో, డ్రా చేసుకోవడమో చేసిందంటే... భారత్ తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లడం ఖాయం. ఏమైనా రెండో టెస్టుకు ముందు భారత్ మరింత కష్టపడాలి. అటు వ్యూహాల్లో, ఇటు ఆటతీరులోనూ మార్పులు చేసుకోవాలి. లేకపోతే... నాలుగేళ్ల క్రితం నాటి పరాభవాన్ని మళ్లీ చూడాల్సి వస్తుంది. ఇంగ్లండ్‌కు సౌలభ్యం... జట్టు కూర్పు విషయంలో మనతో పోలిస్తే ఇంగ్లండ్‌కు మరింత సౌలభ్యత ఉంది. ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉండటం... ఈ ఆరుగురిలో ఇద్దరు నిఖార్సైన ఆల్‌రౌండర్లు కావడం వల్ల జట్టు కూర్పు విషయంలో ఆ జట్టు భారత్‌తో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఇక రెండో టెస్టుకు అండర్సన్ అందుబాటులోకి వస్తే ఆ జట్టు బౌలింగ్ మరింత బలపడుతుంది. వోక్స్ స్థానంలో అండర్సన్‌ను ఆడిస్తారు. అరుుతే కుక్‌ను బాగా ఆనందపరిచిన విషయం స్పిన్నర్ల ప్రదర్శన. ముఖ్యంగా భారత స్పిన్నర్లు బంతిని సరిగా స్పిన్ చేయలేకపోరుున పిచ్‌పై ఇంగ్లండ్ త్రయం ఆకట్టుకున్నారు. ఇది ఆ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. -
అండర్సన్ లేకుండా...
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన లండన్: భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. కుక్ సారథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆడుతున్న 16 మంది సభ్యుల బృందాన్ని భారత్‌తో సిరీస్‌కూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గాయంతో ఉన్న ఇంగ్లండ్ స్టార్ పేస్ బౌలర్ అండర్సన్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే ప్రకటించారు. అరుుతే తను తొలి మూడు టెస్టులూ ఆడకపోవచ్చని, డిసెంబరులో అందుబాటులో ఉంటాడని సమాచారం. నవంబరు 9న భారత్, ఇంగ్లండ్‌ల తొలి టెస్టు రాజ్‌కోట్‌లో జరుగుతుంది. ఆ తర్వాత వరుసగా విశాఖపట్నం, మొహాలీ, ముంబై, చెన్నైల్లో టెస్టులు జరుగుతారుు. ఇంగ్లండ్ జట్టు: కుక్ (కెప్టెన్), మొరుున్ అలీ, జఫర్ అన్సారీ, బెరుుర్ స్టో, జేక్ బాల్, గ్యారీ బ్యాలన్స, గ్యారెత్ బ్యాటీ, స్టువర్ట్ బ్రాడ్, బట్లర్, డకెట్, స్టీవ్ ఫిన్, హసీబ్, ఆదిల్ రషీద్, రూట్, స్టోక్స్, వోక్స్. -
అమ్మానాన్న అని ఏడ్చినందుకు..
* చిన్నారిని చితకబాదిన వంట మనిషి * పోలీస్‌స్టేషన్‌కు చేరిన చిన్నారులు ఆత్మకూర్: తల్లిదండ్రులు లేని అనాథలు అమ్మా నాన్నను గుర్తు చేసుకొని ఏడిస్తే.. ఆదరించి వారి కన్నీటిని తూడ్చాల్సిందిపోయి చితకబాదింది ఆ వంట మనిషి. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ బాల సదనంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ బాలసదనంలో 14 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇన్చార్జ్ మ్యాట్రిన్ వెంకటేశ్వరమ్మ ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుండటంతో వంట మనిషి ప్రమీలదే అక్కడ పెత్తనం. బాల సదనంలోని పాప పేరు మనీష. ప్రస్తుతం 3వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల పేర్లు పెట్టాలి కాబట్టి నాన్న సీతయ్య, అమ్మ చిట్టెమ్మలుగా రిజిస్టర్లో పేర్కొన్నారు. ఆ పాపకు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి బుధవారం రాత్రి ఓ మూలన ఏడ్చుకుంటూ కూర్చుంది. అప్పుడే వచ్చిన వంటమనిషి ప్రమీల నచ్చజెప్పాల్సిందిపోయి ఒక్కసారిగా విరుచుకుపడిందని విద్యార్థినులు తెలిపారు. మేం చెప్పినట్లు వినాలి.. నేనే ఇక్కడ బాస్‌ను అని, లేని తల్లిదండ్రులను ఎందుకు గుర్తుచేసుకున్నావంటూ మనీషను చితకబాదింది. దీంతో భయబ్రాంతులైన మిగతా విద్యార్థినులు గేటు దూకి ఎదురుగా ఉన్న ఇళ్లలోకి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు ఐ.శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అక్కడికు చేరుకొని ఆ విద్యార్థులకు నచ్చజెప్పి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. -
శ్రీలంక విజయ లక్ష్యం 362
లార్డ్స్: మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు శ్రీలంక ముందు 362 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 109/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 233 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అలెక్స్ హేల్స్ (94) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెప్టెన్ కుక్ (49 నాటౌట్) రాణించాడు. ఏకంగా 79 ఇన్నింగ్స్‌ల తర్వాత కుక్ ఈ మ్యాచ్‌లో సిక్సర్ కొట్టడం విశేషం. లంక బౌలర్లలో ఎరాంగా, ప్రదీప్ చెరో 3 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో లంక 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. -
ఇంగ్లండ్ 279/6
లండన్: బెయిర్ స్టో (107 బ్యాటింగ్) అజేయ సెంచరీతో చెలరేగడంతో... శ్రీలంకతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి బెయిర్‌స్టో, వోక్స్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను కుక్ (85), బెయిర్‌స్టో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించి ఆదుకున్నారు. -
'షా'వంట మనిషి కోసం 'మాయ' గాలింపు
లక్నో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దళితులతో కలిసి భోజనం చేసిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ కార్యక్రమంలో వంట చేసిన మనిషి దళితుడు కాదని, అగ్రకులస్తుడేనని, తద్వారా బీజేపీ తన దళిత వ్యతిరేకతను మరోసారి రుజువుచేసుకుందని బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపిస్తోంది. నిజాలు నిగ్గుతేల్చేందుకు సదరు వంటమనిషి కోసం గాలించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు తెలిసింది. (చదవండి: దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం) ఉత్తరప్రదేశ్ వారణాసి(ప్రధాని మోదీ నియోజకవర్గం)లోని జోగియాపూర్ లో జూన్ 1న ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్ షా దళితులతో కలిసి భోజనం చేసిన సంగతి తెలిసిందే. అయితే షాతోపాటు ఆ కార్యక్రమానికి 250 మంది బీజేపీ నేతలు తరలివచ్చారు. వారిలో 50 మంది మాత్రమే భోజనం చేశారని, ఎంపిక చేసిన ప్రదేశం.. వెనుకబడిన తరగతికి చెందిన బింద్ కులస్తుల ప్రాబల్యం ఉన్నదని, అలాంటప్పుడు దళితుల ఇళ్లలో భోజనం చేశామని ప్రచారం చేసుకోవడం ఏమేరకు సబబు? అని వారణాసి జోనల్ బీఎస్సీ నేత డాక్టర్ రామ్ కుమార్ కురేల్ విమర్శించారు. అతి త్వరలోనే వంటమనిషి జాడ తెలుస్తుందని, అప్పుడు అమిత్ షా ఆడిన నాటకం బయటపడుతుందని ఆయన అన్నారు. ఇక బీజేపీ నేతలు షా భోజనం వ్యవహరాన్ని రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడుతున్నారు. -
ఇసుక మీద వండేస్తున్నారు!
జైసల్మీర్: వేసవిలో సాధారణంగా ఎండ నిప్పులు చెరుగుతుందని అంటుంటారు కదా..! అవునే ఆ నిప్పులనే వంట సరుకుగా వాడేసుకుంటున్నారు రాజస్థాన్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవానులు. ఏకంగా ఇసుక మీద రొట్టెలు వేసి కాల్చుకుని ఆరగించేస్తున్నారు. అంతేకాదండోయ్.. నీటితో ఒక తపాలాలో బియ్యాన్ని కూడా అదే ఇసుక మీద పెట్టి.. అన్నం వండేసుకోవచ్చని జవానులు చేసి చూపించారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టోపీలు, రక్షణగా ముఖానికి గుడ్డలు కట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక మీద బూట్లతో నడిస్తే అవి కరిగిపోతున్నాయట. ఇసుకలో నడవాల్సి వస్తే ఒంటెలను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వారి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికారలతో ఎండ వేడిమిని కొలిచి చూస్తే 55 డిగ్రీలను చూపినట్లు వివరించారు. సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఫోకస్ ఎనర్జీ అనే ప్రైవేట్ కంపెనీ తమ థర్మామీటర్లు 54.5 డిగ్రీల వరకు వేడిమి ఉన్నట్లు చూపించాయని తెలిపారు. వీటిపై స్పందించిన వాతావరణ శాఖ 47.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వివరించింది. -
టిమ్ కుక్ ప్రేమలో పడిపోయారట!
న్యూఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్ ప్రేమలో పోయాడట. ఇక్కడి కల్చర్, హిస్టరీ తనను బాగా ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా జి నారాయణమ్మ మహిళా కాలేజీ విద్యార్థినిల ప్రతిభా పాటవాలపై ప్రశంసలు కురిపించారు. ఆ విద్యార్థినులను కలవడం తనకు చాలా షంతోషాన్ని పంచిందన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. హైదరాబాదీయుల ప్రతిభకు ముగ్ధుడైపోయిన కుక్ తన ఆనందాన్ని శుక్రవారం ఆ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతోపాటుగా ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశారు. జి నారాయణమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా ఇన్స్టిట్యూట్ ను సందర్శించిన ఆయన హైదరాబాద్ సంస్కృతి, చరిత్రకు ముగ్ధుడినయ్యానని ఇప్పటికే నగరం ప్రేమలో పడిపోయానని వ్యాఖ్యానించారు. జీఎన్ఐటీఎస్ మహిళా కళాశాలని కొత్త మ్యాక్ ల్యాబ్ దగ్గర అత్యుత్తమ ప్రతిభ , ఉత్సాహం ఉందని ట్విట్టర్ లో తెలిపారు. మిమ్మల్ని చూసి చాలా ఆనందించానని కుక్ ట్విట్ చేశారు. గురువారం కాలేజీని సందర్శించిన కుక్ అక్కడ కంప్యూటర్ సెంటర్ ని ప్రారంభించారు. అలాగే ఆపిల్ విద్యార్ధులకు శిక్షణ కు సంబంధించిన ఒక అవగాహనా పత్రంపై సంతకం చేశారు . కాగా భారతదేశంలో రెండో రోజు పర్యటనలో భాగంగా నిన్న హైదరాబాద్ వచ్చిన యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇక్కడ యాపిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. దీని ద్వారా భవిష్యత్తులో నాలుగువేలమంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. Lots of talent and enthusiasm at the new Mac Lab at GNITS women’s college. Enjoyed visiting you yesterday! pic.twitter.com/ZqCnVkBpii — Tim Cook (@tim_cook) May 20, 2016 -
మరో 36 పరుగులు చేస్తే...
► అరుదైన రికార్డు కుక్ సొంతం ► నేటి నుంచి లంకతో తొలి టెస్టు లీడ్స్: మరో 36 పరుగులు చేస్తే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్... టెస్టుల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డునూ అధిగమిస్తాడు. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్... శ్రీలంకతో తలపడుతుంది. గతంలో సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో పాకిస్తాన్ (2005)పై ఈ రికార్డును సాధించాడు. గతేడాది క్రిస్మస్తో కుక్కు 31 ఏళ్లు నిండాయి. -
ఆత్మహత్యే శరణ్యం
♦ ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇద్దరు కుక్ల మనస్థాపం ♦ కస్తూర్బా గాంధీ విద్యాలయం మేడపై నుంచి దూకేందుకు యత్నం అడ్డుకున్న తోటి సిబ్బంద నిరుపేద కుటుంబాలు.. ఆ చిరుద్యోగమే వారికి జీవనాధారం.. మీపై ఫిర్యాదులు వచ్చాయంటూ అధికారులు ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కనీసం దర్యాప్తు కూడా లేకుండా తమను రోడ్డున పడేయడం ఏమిటని మనస్తాపం చెందిన ఇద్దరు మహిళా కుక్‌లు ఆత్యహత్యకు యత్నించారు. తోటి సిబ్బంది అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. రోలుగుంట : అధికారులపై ఆరోపణలు వస్తే దర్యాప్తుల పేరుతో కాలయాపన చేసే ఉన్నతాధికారులు చిరుద్యోగులపై మాత్రం తమ ప్రతాపం చూపుతున్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పనిచేస్తున్న కురచ శాంతమ్మ, మడ్డు అమ్మాజీ అనే వంట పనివారిపై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నుంచి శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రత్యేక అధికారి వై.త్రివేణి కుక్‌లకు చెప్పి తక్షణం విద్యాలయం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు మహిళా కుక్‌లు విద్యాలయం మేడపైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. తోటి సిబ్బంది పరుగున వె ళ్లి వారి ప్రయత్నాన్ని అడుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రోలుగుంట ఎస్ఐ జి.గోవిందరావు విద్యాలయానికి వచ్చి ఎస్వో త్రివేణి, కుక్‌లతో చర్చించారు. కుక్‌లపై తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయని, ఆ మేరకు వారిద్దరినీ తొలగిస్తూ తమకు ఉత్తర్వుల అందాయని, వారిని కొనసాగించడం సాధ్యం కాదని ఎస్వో స్పష్టంచేశారు. బాధిత వంట పనివారు మాట్లాడుతూ తాము ఏ తప్పూ చేయలేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తాము కూడా తెలియజేశామన్నారు. జిల్లా కలెక్టర్ యువరాజుకు కుడా తాము వినతులు పంపుకున్నామని చెప్పారు. దీనిపై పాఠశాల కమిటీ, అధికారులు విచారణ చేసిన తరువాత నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా, ఎలాంటి విచారణ లేకుండానే తమను తొలగించడం అన్యాయమని వాపోయారు. తాము ఇక్కడ నుంచి వెళ్లబోమని అక్కడే ఎండలో ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండలోనే ఉండి నిరసన తెలిపారు. దీంతో శాంతమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మహిళా హోమ్‌గార్డు ఆమె ముఖంపై నీళ్లుచల్లి సపర్యలు చేశారు. తరువాతఎస్ఐ కుక్‌లకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. కొత్తగా వచ్చాను.. విషయం తెలియదు తన ముందు పనిచేసిన స్పెషలాఫీసర్ జానకి హయాంలో కుక్‌లపై ఫిర్యాదు చేశారు. తాను కొత్తగా రావడం వలన వారి సమస్య తనకు తెలియదు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకే కుక్‌లను తొలగించాం. -త్రివేణి, స్పెషలాఫీసర్, కస్తూర్బా గాంధీ విద్యాలయం, రోలుగుంట రాజకీయం చేశారు నేను తొమ్మిది సంవత్సరాలుగా ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా విధులు నిర్వహిస్తున్నాను. నేను, తోటి కుక్ అమ్మాజి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళ్లినపుడు సరుకులు పట్టుకొని పోయినట్లు ఒక పత్రికలో (సాక్షి కాదు) తప్పుడు వార్త వచ్చింది. స్థానికులు కొందరు మార్గంలో అడ్డగించి మా నుంచి సరుకులు పట్టుకున్నట్టు మూడు నెలల క్రితం కొందరు వార్త రాయించారు. రాజకీయం చేసి ఇపుడు తొలగించారు. మేము ఏ తప్పూచేయలేదు. - కురచ శాంతమ్మ, బాధితురాలు ఫిర్యాదులో వాస్తవం లేదు నాపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల్లో వాస్తవం లేదు. స్థానికుల రాజకీయానికి బలయ్యాను. వాస్తవాలపై ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలి. పాడి గేదెను అమ్మూకొని ఈ ఉద్యోగానికి పెట్టుబడి పెట్టి రెండేళ్ల కిందట చేరాను. స్కూల్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఫిర్యాదుదారులతో బహిరంగ విచారణ జరిపించండి. తప్పుచేసినట్లు తేలితే అప్పుడు చర్యతీసుకోండి. -మడ్డు అమ్మాజీ, బాధిత కుక్ -
కుక్, ఆమ్లా సెంచరీలు
* దక్షిణాఫ్రికా 329/5 * ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సెంచూరియన్: ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ ఆడుతున్న స్టీఫెన్ క్రెయిగ్ కుక్ (115; 14 ఫోర్లు), హషీం ఆమ్లా (109; 19 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. కుక్, ఆమ్లా రెండో వికెట్‌కు 202 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే 36 పరుగుల వ్యవధిలో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు. బవుమా (32 బ్యాటింగ్), డి కాక్ (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సెంచరీల ‘సెంచరీ’... సెంచూరియన్ టెస్టులో ఆసక్తికర రికార్డు నమోదైంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కెరీర్ తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 100వ ఆటగాడిగా కుక్ నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడు అతను. స్టీఫెన్ తండ్రి జేమ్స్ కుక్ 1992లో తన తొలి టెస్టులో మ్యాచ్ తొలి బంతికే డకౌట్ కాగా... దాదాపు పాతికేళ్ల తర్వాత అతని కొడుకు తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం మరో విశేషం. -
ముగ్గురు మొనగాళ్లు!
లండన్: టెస్టులో క్రికెట్ ఈ ఏడాది ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ సత్తా చాటారు. 2015లో ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్లు వెయ్యి పరుగులు పూర్తి చేయగా అందులో ఇద్దరు బ్రిటీష్ టీమ్ బ్యాట్స్ మెన్ ఉన్నారు. ఈ జాబితాలో ఆండీ కుక్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 24 ఇన్నింగ్స్ ఆడిన కుక్ 60.72 సగటుతో 1336 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 263. ఇక రెండో స్థానంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు రూట్ 61.33 సగటుతో 1288 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు బాదాడు. అతడి అత్యధిక స్కోరు 182. ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి మూడో ఆటగాడు ఆస్ట్రేలియా యువ బ్యాట్స్ మన్ స్టీవెన్ స్మిత్. 9 మ్యాచుల్లో 16 ఇన్నింగ్స్ ఆడి 77.61 సగటుతో 1009 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలు బాదాడు. అతడి అత్యధిక స్కోరు 215. పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్ మన్ యూనిస్ ఖాన్ 782 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి కోహ్లి(441) ఒక్కడే ముందున్నాడు. -
కుక్ డబుల్ సెంచరీ
అబుదాబి: పాకిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. కుక్(397 బంతుల్లో 201 బ్యాటింగ్, 16 ఫోర్లు), రూట్(76 బ్యాటింగ్) కూడా రాణించడంతో ఇంగ్లండ్ 144.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 405 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. 290/3 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మరో వికెట్ పడకుండా పాకిస్థాన్ కు దీటుగా బదులిస్తోంది. మూడో రోజు 168 పరుగులతో అజేయంగా ఉన్న కుక్.. ఈరోజు కూడా పాకిస్థాన్ బౌలర్లకు పరీక్షగా నిలిచి ద్విశతకాన్ని నమోదు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో వాహబ్ రియాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇంకా ఇంగ్లండ్ 118 పరుగులు వెనుకబడిఉంది. అంతకుముందు పాకిస్థాన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 523 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ డబుల్ సెంచరీ(245)తో రాణించి జట్టు భారీ స్కోరులో సహకరించాడు. ఆటకు రేపు మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. -
ఐటీ దిగ్గజాల అరుదైన కలయిక
వాషింగ్టన్: ఐటీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు ఒకో చోట కలుసుకోవడమే చాలా అరుదు. అటువంటిది ఇంటెర్నెట్ సామ్రాజ్యంలో మకుటంలేని రారాజులుగా రాణిస్తున్న 29 మంది ఒకచోట కలుసుకోవడమే కాకుండా కలిసి ఫొటో దిగడం మరింత అరుదు. అలాంటి అరుదైన సంఘటనకు వాషింగ్టన్, రెడ్మాండ్లోని మైక్రోసాప్ట్ ప్రధాన క్యాంపస్ వేదికైంది. చైనా, మైక్రోసాప్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సులో ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జూకర్బెర్గ్, ఆలీబాబాకు చెందిన జాక్ మా, మైక్రోసాప్ట్ కు చెందిన సత్య నాదెండ్ల, ఆపిల్‌కు చెందిన టిమ్ కుక్, అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్, మరో 24 మంది ఐటీ దిగ్గజాలు అమెరికా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌తో కలసి ఇలా ఫొటో దిగారు. చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ను కలుసుకొని, ఆయనతో మాట్లాడేందుకు మార్క్ జూకర్బెర్గ్ లాంటి దిగ్గజమే పోటీ పడడం విశేషం. పైగా ఆయన జింగ్‌పింగ్‌తో చైనా భాషలోనే మాట్లాడారు. ఓ ప్రపంచ అగ్ర నేతను తాను కలసుకోవడం, ఆయనతో విదేశీ భాషలోనే మాట్లాడడం తనకు ఇదే మొదటిసారంటూ జూకర్బెర్గ్ ఫేస్బుక్లో కామెంట్ పోస్ట్ చేశారు. ఈ పర్యటన విశేషాలను తాను ఎప్పటికప్పుడు ఫేస్బుక్ ద్వారా యూజర్లతో పంచుకుంటానని కూడా తెలిపారు. ఈ అరుదైన ఫొటోలో ఒక్కొక్కరిని పేరు పేరున పేర్కొనాలంటే....మొదటి వరుసలో ఎడమ వైపు నుంచి మార్క్ జూకర్బెర్గ్, జేడీ డాట్ కామ్- లియు క్వియాంగ్డాంగ్, సీస్కో- జాన్ చాంబర్స్, ఆలీబాబా- జాక్ మా, ఐబీఎం- జిన్నీ రొమెట్టీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, మైక్రోసాఫ్ట్- సత్య నాదెండ్ల, చైనా ఇంటర్నెట్- జార్ లూ వీ, ఆపిల్- టిమ్ కుక్, టెన్సెంట్-పోనీ మా, అమెజాన్-జెఫ్ బెజోస్. మధ్య వరుసలో ఎడమ నుంచి కుడికి....సోహు- ఝాంగ్ చయోయంగ్, ఏఎండీ-లీసా సూ, లెనోవ్స్- యాంగ్ యుయాంగింగ్, మైక్రోసాఫ్ట్-హారి శమ్, క్యుయాల్కమ్స్- స్టీఫ్ మొటెన్కోఫ్, సీఈటీసీ-జియాంగ్ క్యూన్లీ, ఇంటెల్-బ్రియాన్ క్రజానిచ్, కిహు 360-జౌ హోంగై, లింకెడిన్- రీడ్ హోఫ్మన్, సినా-కావో గూవీ. మూడవ వరుసలో ఎడమ నుంచి కుడికి....సుగాన్స్-లీ జున్, డీడీ కువైదీ-చెంగ్ వీ, బ్రాడ్‌బ్యాండ్ కాపిటల్-టియాన్ సునింగ్, సీఈసీ-లియు లీహాంగ్, బైదు-ఝాంగ్ యాకిన్, ఏఎంఈ క్లౌడ్స్-జెర్రీ యాంగ్, ఇన్స్పర్-సన్ పిషు, ఎయిర్బిన్బీస్-బ్రియాన్ చెస్కీ, సెకోయియా కాపిటల్-షెన్ నాన్పెంగ్. -
విద్యుత్‌షాక్‌తో హాస్టల్ కుక్ మృతి
బీసీ బాలుర ప్రభుత్వ కళాశాల హాస్టల్లో కరెంట్ షాక్‌తో వంట మనిషి మృతి చెందాడు. కర్నూలు జిల్లా కోడుమూరులోని ప్రభుత్వ కళాశాల హాస్టల్లో లద్దగిరి గ్రామానికి చెందిన శివన్న(38) కుక్‌గా పనిచేస్తున్నాడు. అతడు బుధవారం 10.30 గంటల సమయంలో బోరు మోటారు ఆన్ చేసేందుకు స్విచ్ ఆన్ చేయబోగా షాక్ కొట్టింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు ఎస్సై మహేశ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికా టు అనకాపల్లి... మిరపకాయ
తిండి గోల కొన్నివంటకాలను కొన్ని పదార్థాలు లేకపోయినా వండచ్చు. కానీ, కారం లేకుండా మాత్రం వండలేం. తెలుగువారి ఆహార సంస్కృతి చరిత్రను మిరపకాయల రాకకు ముందు యుగం, తరువాతి యుగం అని రెండుగా విభజించవచ్చు. విజయనగర సామ్రాజ్య కాలంలో పోర్చుగీసులు మిరపకాయల్ని భారతదేశానికి తీసుకురాగా, తెలుగువారు వాటిని అందుకొన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉండే విధంగా మిరపకాయల్ని పండిస్తున్నారు భారతీయలు. మిరపకాయలు పరిచయం అయ్యేవరకు మనకు తెలిసిన కారపు ద్రవ్యాలు మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, అల్లం, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క.. వీటినే ఆహారంలో కారంగా వాడుకునేవారు. మిరియాల్ని సంస్కృతభాషలో ‘మరీచి’ అంటారు. మిరియంపు కాయలు అనే మాట మిరపకాయలుగా రూపొందిందని భాషావేత్తలు చెబుతారు. అలాగే, మరీచి పదం ‘మిర్చి’గా మారి ఉండవచ్చు. ఇండియాకి దారి కనుక్కోవడానికి బయల్దేరిన కొలంబస్ పొరబాటున అమెరికా చేరినప్పుడు, మెక్సికో తీరంలో అతనికి ఈ కారపు కాయలు కన్పించాయట. అమెరికా నుంచి కొలంబస్ తెచ్చిన ఈ మిరపకాయల్ని పోర్చుగీసులు తెచ్చి భారతదేశానికి కారపు రుచిని అంటించారు. -
తియ్యటి పండుగలు
వరలక్ష్మీ వ్రతం, రాఖీ... రెండు పర్వదినాలు ... ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఏతెంచేందుకు సిద్ధంగా, సన్నద్ధంగా ఉన్నాయి... అమ్మవారికి నైవేద్యం పెడదాం... అన్నదమ్ముల నోరు తీపిచేద్దాం... అమ్మవారి ఆశీర్వాదాలు... అన్నదమ్ముల ఆదరాభిమానాలు అందుకుందాం... ఇక ఆలస్యం దేనికి, వంటకాలకు కావలసిన పదార్థాలు సిద్ధం చేసుకోండి... ఈ మధురపదార్థాలు తయారుచేయండి... పండుగలను తియ్యగా ఆస్వాదించ ండి... రబ్రీ స్వీట్ కావలసినవి: చిక్కటి పాలు - లీటరు; పంచదార - పావు కప్పు; బాదం పప్పులు - 7; పిస్తా పప్పులు - 7; కుంకుమ పువ్వు - కొద్దిగా; ఏలకుల పొడి - చిటికెడు; రోజ్ ఎసెన్స్ - 4 చుక్కలు తయారీ: వెడల్పాటి బాణలిలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మధ్యస్థం మంట మీద మరిగించాలి మరగడం ప్రాంభం కాగానే మంట సిమ్‌లో ఉంచి, పాలు బాగా చిక్కబడి, పాలు నాలుగో వంతు వచ్చేవరకు కలుపుతుండాలి బాదం పప్పులు, పిస్తా పప్పులను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి కుంకుమ పువ్వును చల్లటి పాలలో నానబెట్టాలి మరుగుతున్న పాలలో పంచదార, ఏలకుల పొడి వేసి ఆపకుండా కలపాలి నానబెట్టుకున్న కుంకుమపువ్వు పాలు జత చేయాలి బాదం పప్పులు, పిస్తా పప్పులను జత చేసి, బాగా కలిపి దించేయాలి చల్లారాక రోజ్ ఎసెన్స్ వేసి గిలక్కొట్టాలి ఫ్రిజ్‌లో సుమారు ఎనిమిది గంటలు ఉంచి తీశాక, డ్రైఫ్రూట్స్ తురుముతో అలంకరించి అందించాలి. అరటిపండు అప్పాలు కావలసినవి: బాగా పండిన అరటిపండు - 1; గోధుమ పిండి - కప్పు; బెల్లం తురుము - కప్పు; ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు; నెయ్యి - టేబుల్ స్పూను; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: అరటిపండును మెత్తగా గుజ్జు చేయాలి ఒకపాత్రలో గోధుమ పిండి, అరటిపండు గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, ఏలకుల పొడి, బెల్లం తురుము, నెయ్యి వేసి చపాతీ పిండిలా కలపాలి చేతికి నెయ్యి కాని నూనె కాని రాసుకుని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి బాణలిలో నూనె కాగాక ఈ ఉండలను చేతిలోకి తీసుకుని గుండ్రంగా అప్పాల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి. కొబ్బరి పాల పాయసం కావలసినవి: బియ్యం - అర కప్పు; బెల్లం తురుము - కప్పు; తాజా కొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు; పాలు - పావు కప్పు (మరిగించాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు - 10; కిస్మిస్ - టేబుల్ స్పూను; బేకింగ్ సోడా - చిటికెడు తయారీ: బియ్యం శుభ్రంగా కడిగి కప్పుడు నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దించేయాలి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి ముప్పావు కప్పు గోరు వెచ్చని నీళ్లు జత చేసి, మరో మారు మిక్సీ తిప్పాలి పల్చటి వస్త్రంలో కొబ్బరి పాలను వడకట్టి, కొబ్బరిని మళ్లీ మిక్సీలో వేసి ముప్పావు కప్పు నీళ్లు జత చేసి మరో మారు మిక్సీ పట్టాలి మళ్లీ ఆ పాలను వడ కట్టాలి ఈ పాలకు బేకింగ్ సోడా జత చేసి పక్కన ఉంచాలి అన్నంలో బెల్లం తురుము, కొబ్బరి పాలు వేసి స్టౌ మీద ఉంచాలి పాలు, ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి సన్న మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచాలి మిశ్రమం చిక్కబడుతుండగా దింపేయాలి నెయ్యి కరిగించి, అందులో జీడిపప్పులు, కిస్మిస్ వరుసగా వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, తయారు చేసి ఉంచుకున్న పాయసంలో వేసి కలపాలి వేడివేడిగా అందించాలి. బాదం కోవా కావలసినవి: బాదం పప్పులు - కప్పు; పంచదార - ముప్పావు కప్పు; పాల పొడి - అర కప్పు; నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - చిటికెడు; ఫుడ్ కలర్ - చిటికెడు; తురిమిన పిస్తా, బాదం, జీడిపప్పులు - తగినన్ని తయారీ: బాదం పప్పులను నీళ్లలో సుమారు అరగంటసేపు నానబెట్టి, తొక్క తీసి, మిక్సీలో వేసి, కొద్దిగా పాలు జత చేసి మెత్తగా చేయాలి పంచదార, పాల పొడి జత చేసి మరోమారు బ్లెండ్ చేయాలి ఒక పాత్రలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి తయారుచేసి ఉంచుకున్న బాదం పేస్ట్ ఇందులో వేసి ఆపకుండా చిక్కబడేవరకు కలుపుతుండాలి ఏలకుల పొడి, ఫుడ్ కలర్ జత చేసి బాగా కలిపి, ఉడికిన తర్వాత దించేయాలి చెక్క గరిటెతో సుమారు ఐదు నిమిషాలు కలపాలి ముద్దగా అయిన తర్వాత కోవా ఆకారంలో తయారుచేసుకుని పైన పిస్తా, బాదం, జీడిపప్పు తురుముతో అలంకరించి కొద్దిగా గట్టిపడ్డాక అందించాలి. -
ఆజానుబాహుబలి
హ్యూమర్ ఫ్లస్ ఆయన పేరు ఆజానుబాహుబలి. ఒకరోజు షవర్ కింద స్నానం చేస్తూ వుండగా ‘‘నేనెవర్ని?’’ అని అనుమానమొచ్చింది. నడుంకి టవల్ బిగించి బయటికొచ్చి ‘‘నేనెవర్ని?’’ అని అరిచాడు.‘‘ఇంట్లో కుక్వి, గెస్ట్లొస్తే చెఫ్‌వి. స్టయిల్‌గా చెప్పాలంటే బట్లర్వి, మోటుగా వంటాడివి’’ అని విడమరిచి చెప్పింది భార్య. ‘‘ఇంతకీ నేను ఇంటోడినా? వంటోడినా?’’ ‘‘అదంతా చెప్పాలంటే మీ నాన్న అమరేంద్ర నరబలి దగ్గరుంచి మొదలుపెట్టాలి. చాలా పెద్ద కథ. రెండు పార్టులుగా చెప్పాల్సి వుంటుంది. వెళ్లి బట్టలేసుకురా. లేదంటే ఆవేశంలో నరాలు పొంగి తువ్వాలు ఊడిపోవచ్చు.’’ కథ మొదలైంది. ‘‘ఎవరి పేరు చెబితే జనం కకావికలమవుతారో, ఎవరి వంట తింటే కంట కన్నీరు ఒలుకుతుందో ఆయనే అమరేంద్ర. ఆయన వండితే సగంమంది పైకి, మిగిలిన సగం ఆస్పత్రికి వెళ్ళేవాళ్ళు. దాంతో అందరూ అమరేంద్ర నరబలి అని పిలిచేవాళ్ళు. నిజానికి వంట ఆయన ఇంటావంటా లేదు. మీ అమ్మని చేసుకున్న తరువాత నేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన వంట తిన్న మీ అమ్మ జడుసుకుని భర్త వండింది తినకుండా ఉండడానికి సేఫ్టీకోసం తనను తాను గొలుసులతో బంధించుకుంది. ఇదిలావుండగా అకాలకేయుడు అనే ఆటవిక నాయకుడికి మీ నాన్న విషయం తెలిసింది. మనుషుల్ని సింగిల్ సింగిల్‌గా చంపడంకంటే ఒక మెస్సు పెట్టి మాస్‌గా చంపాలని పథకమేసి సైన్యంతో సహా వచ్చాడు. మీ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి ‘క్కిట్టమ్మప్ప, బ్రాష్కో, ట్టగ్గర్ర’ అని ప్రతి పదానికి ఒత్తునిచ్చే భాషలో మాట్లాడి లొట్టలేశాడు. మీ నాన్న ఒత్తులు, కత్తులకి లొంగేవాడు కాదు. వాడి భాష అర్థం కాకపోయినా లొట్టలేసింది తన వంటకోసమేనని అపార్థం చేసుకుని వండి వడ్డించాడు. సైన్యం అప్పుడే పోగా, అకాలకేయుడు డయేరియాతో వాడి పాపాన వాడే పోయాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా నువ్వు పుట్టావు. నీ క్షేమం కోసం మీ నాయనమ్మ చంటి బిడ్డతో నదిని దాటాలనుకుంది. అయితే నదిలో నీళ్ళు లేవు. ఖర్మగాలి కాళ్ళు కాలాయి. నిన్నో గూడెం వాళ్ళకి ఇచ్చి నీడకోసం ఆమె ఎక్కడికో పారిపోయి మళ్ళీ రాలేదు’’ అని ఆమె కథ ముగించింది. ‘‘అయితే ఇప్పుడు మా నాన్న ఎక్కడ?’’ ‘‘లేడు. వెళ్ళిపోయాడు పైకి’’ ‘‘కత్తికి లొంగడన్నావు. బల్లెం భయపెట్టదన్నావు.’’ ‘‘కత్తిపోటు, బల్లెంపోటు కంటే సాపాటు ప్రమాదకరమైంది. నేనే నా చేతులతో పళ్ళెంలో వడ్డించాను.’’ ‘‘ఎందుకని?’’ తల విదిలించి ఆవేశంగా అరిచాడు ఆజానుబాహుబలి. ‘‘నాకు మాత్రమేం తెలుసు? సెకెండ్ పార్ట్‌లో చెబుతా.’’ - జి.ఆర్. మహర్షి -
ఒంటికి నిప్పంటుకొని మహిళ మృతి
శంకర్పల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ-2 రామేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సింగాపూర్ గ్రామానికి చెందిన చిట్టి(30) ఓ పూరి గుడిసెలో ఉంటూ స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం ఉదయం ఆమె గుడిసెలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందింది. మృతురాలికి ఓ కూతురు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్ మరో వ్యాపకం
లండన్: వన్డే కెప్టెన్‌గా ఉద్వాసనకు గురవ్వడంతో పాటు ప్రపంచకప్ జట్టులో కూడా చోటు కోల్పోయిన ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ ఇప్పుడు తన రూట్ మార్చాడు. ఈ షాక్ నుంచి తేరుకునేందుకు మరో ఆటను ఎంచుకున్నాడు. ఇందులో తన సహచరుడు జేమ్స్ అండర్సన్‌ను ఓడించి సత్తా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ డార్ట్స్ చాంపియన్‌షిప్ ఐదో రోజు ఆటకు ముందు జరిగిన వన్ లెగ్ షూటౌట్లో అతను పాల్గొన్నాడు. ఇందులో కుక్ తొలి టర్న్‌లో 60 పాయింట్లు సాధించాడు. అయితే బ్యాటింగ్ ను ఎడమ చేతితో చేసే అతను ఇక్కడ చిన్నపాటి బాణాలను మాత్రం కుడి చేతితోనే విసిరాడు. ఓవరాల్‌గా అండర్సన్ 134 పాయింట్లు సాధించగా కుక్ 140 పాయింట్లతో నెగ్గాడు. -
హాస్టల్ విద్యార్థినులతో వ్యభిచారం!
-
షరా... మామూలే!
మళ్లీ అదే కథ... వేదిక మారినా రాత మారలేదు. భారత బ్యాట్స్‌మెన్ విఫలమైన వికెట్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఇంగ్లండ్ పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై భారత సీమర్లు తేలిపోయారు. దీనికితోడు ఎప్పటిలాగే క్యాచ్‌లు వదిలేశారు. ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమైన జట్టు ఓ టెస్టు మ్యాచ్‌ను కాపాడుకోవాలని అనుకోవడం అత్యాశే. ఓవల్‌లోనూ ధోనిసేన చతికిలపడింది. ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం అప్పగించింది. ఇక ఈ మ్యాచ్ ఎన్ని రోజుల్లో ముగుస్తుందనేదే ఆసక్తికరం. ఐదో టెస్టు ►విఫలమైన భారత బౌలర్లు ►తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 385/7 ►ప్రస్తుతం కుక్ సేన ఆధిక్యం 237 లండన్: బ్యాటింగ్‌లో నిలకడగా రాణించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదో టెస్టులో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కుక్ (183 బంతుల్లో 79; 9 ఫోర్లు), బ్యాలెన్స్ (117 బంతుల్లో 64; 13 ఫోర్లు), రూట్ (129 బంతుల్లో 92 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో రెండో రోజు శనివారం ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 ఓవర్లలో 7 వికెట్లకు 385 పరుగులు చేసింది. రూట్‌తో పాటు జోర్డాన్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది. బట్లర్ (73 బంతుల్లో 45; 9 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఇషాంత్, ఆరోన్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 148 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) విజయ్ (బి) ఆరోన్ 79; రాబ్సన్ (బి) ఆరోన్ 37; బ్యాలెన్స్ (సి) పుజారా (బి) అశ్విన్ 64; బెల్ (సి) ధోని (బి) ఇషాంత్ 7; రూట్ బ్యాటింగ్ 92; అలీ (బి) అశ్విన్ 14; బట్లర్ (సి) అశ్విన్ (బి) ఇషాంత్ 45; వోక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 0; జోర్డాన్ బ్యాటింగ్ 19; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: (105 ఓవర్లలో 7 వికెట్లకు) 385. వికెట్ల పతనం: 1-66; 2-191; 3-201; 4-204; 5-229; 6-309; 7-318 బౌలింగ్: భువనేశ్వర్ 24-3-86-1; ఇషాంత్ 24-8-58-2; ఆరోన్ 25-1-111-2; బిన్నీ 12-0-58-0; అశ్విన్ 20-2-55-2 లండన్: బ్యాటింగ్‌లో నిలకడగా రాణించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదో టెస్టులో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కుక్ (183 బంతుల్లో 79; 9 ఫోర్లు), బ్యాలెన్స్ (117 బంతుల్లో 64; 13 ఫోర్లు), రూట్ (129 బంతుల్లో 92 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో రెండో రోజు శనివారం ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 ఓవర్లలో 7 వికెట్లకు 385 పరుగులు చేసింది. రూట్‌తో పాటు జోర్డాన్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది. బట్లర్ (73 బంతుల్లో 45; 9 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఇషాంత్, ఆరోన్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు. సెషన్-1 : ఆరంభంలోనే ఝలక్ 62/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్... రెండో ఓవర్లోనే రాబ్సన్ (37) వికెట్‌ను కోల్పోయింది. అయితే కుక్, బ్యాలెన్స్ సమయోచితంగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో వీరిద్దరు సులువుగా పరుగులు చేస్తూ 31వ ఓవర్లో ఇంగ్లండ్‌ను 100 పరుగుల మైలురాయిని దాటించారు. సీమర్లు వికెట్లు తీయలేకపోవడంతో లంచ్‌కు కొద్ది ముందు అశ్విన్‌ను బరిలోకి దించారు. అయినా ఈ వ్యూహం ఫలించలేదు. స్పిన్‌ను తెలివిగా ఎదుర్కొన్న కుక్ 41వ ఓవర్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఓవర్లు: 26; పరుగులు: 86; వికెట్లు: 1 సెషన్-2 : 13 పరుగులకు 3 వికెట్లు లంచ్ తర్వాత భారత్ పుంజుకునే అవకాశాన్ని ఫీల్డర్లు జారవిడిచారు. ఆరోన్ (50వ ఓవర్), అశ్విన్ (55వ ఓవర్) బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను విజయ్, రహానేలు నేలపాలు చేశారు. మరికొద్దిసేపటికే ఆరోన్ బౌలింగ్‌లోనే కుక్ ఇచ్చిన లో క్యాచ్‌ను ఈసారి విజయ్ నేర్పుగా ఒడిసిపట్టుకున్నాడు. కుక్, బ్యాలెన్స్ రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం జోడించారు. తర్వాత విజృంభించిన భారత బౌలర్లు చకచకా బ్యాలెన్స్, బెల్ (7)లను అవుట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 33 బంతుల వ్యవధిలో 13 పరుగుల తేడాతో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మొయిన్ అలీ (14) వెంటనే అవుటైనా... రూట్, బట్లర్ క్రమంగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఓవర్లు: 28; పరుగులు: 98; వికెట్లు: 4 సెషన్-3 : రూట్ నిలకడ టీ తర్వాత రూట్, బట్లర్ నెమ్మదిగా ఆడారు. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ధోని బౌలర్లను తరచూ మార్చినా ఈ జోడిని మాత్రం విడదీయలేకపోయారు. దాదాపు 19 ఓవర్లపాటు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారైన ఈ ద్వయాన్ని చివరకు ఇషాంత్ విడగొట్టాడు. మామూలుగా వచ్చిన బంతిని లెగ్‌సైడ్ ఆడిన బట్లర్ షార్ట్ మిడ్ వికెట్లో అశ్విన్ చేతికి చిక్కాడు. దీంతో రూట్, బట్లర్‌ల మధ్య ఆరో వికెట్‌కు నెలకొన్న 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లోనే భువనేశ్వర్... వోక్స్ (0)ను అద్భుతమైన బంతితో డకౌట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జోర్డాన్... రూట్‌కు చక్కని సహకారం అందించాడు. బౌలర్లు ఒత్తిడి పెంచినా ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 67 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజు ముగించారు. ఓవర్లు: 32; పరుగులు: 139; వికెట్లు: 2 -
సమయాన్ని, జీవితాన్ని వృథా కానీయకండి!
వాయనం: గృహిణి అనగానే... ఇంట్లో ఉండి వంట చేసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, ఇల్లు చక్కబెట్టుకుంటూ ఉండే మహిళ అని ఠక్కున నిర్వచించేస్తారంతా. గృహిణులు ఇవి మాత్రమే చేయాలా? చేయడానికి వారికింకేమీ ఉండదా? అసలు వారు ఇవి తప్ప ఏమీ చేయలేరా? చేయగలరు. ఇంట్లో ఉంటూనే చాలా చేయగలరు. ఆ నిజాన్ని గ్రహించక చాలామంది మహిళలు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. పెళ్లి, కొత్త కాపురం, పిల్లలు, వారి పెంపకం అంటూ కొన్ని సంవత్సరాలు వేగంగా పరుగులు తీస్తాయి. అప్పుడు వేరేదాని గురించి ఆలోచించే తీరిక దొరకదు. కానీ పిల్లలు కాస్త ఎదిగి, బడికి వెళ్లిపోవడం మొదలుపెట్టాక జీవితంలో కాస్త మార్పు వస్తుంది. అందరూ బయటకు వెళ్లిపోయిన తరువాత ఇంటితో పాటు మనసు కూడా ఖాళీ అయిపోతుంది. బోర్ కొడుతుంది. ఏదైనా చేస్తే బాగుణ్ను అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి ఇంతేనా జీవితం అనిపిస్తుంది. నిజమే. జీవితమంటే అంతే కాదు. ఇంకా ఎంతో ఉంది. చదువు లేదని, తమకు ఉద్యోగం చేసే అర్హత లేకపోవడం వల్ల ఇంటికే పరిమి తమైపోయామని కుమిలిపోయే మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. అయితే జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే ఏ అర్హతలు కావాలి? డిగ్రీలు పుచ్చుకుని ఉద్యోగాలు చేయాలా? రోజూ ఆఫీసుకెళ్లి టార్గెట్లు అందుకోవడానికి పరుగులు తీయాలా? అవసరం లేదు. లేని దాని కోసం బెంగ పడాల్సిన పనిలేదు. మనకున్న అర్హత ఏంటో తెలుసుకుంటే చాలు... ఏదో ఒకటి సాధించడానికి. వంట బాగా చేస్తారా... ఇంట్లోనే కర్రీ పాయింట్ ఎందుకు పెట్టకూడదు? పచ్చళ్లు బాగా పెడతారా... పెట్టి ఎందుకు అమ్మకూడదు? కుట్లు వచ్చా... ఇంట్లోనే పదిమందికీ ఎందుకు నేర్పకూడదు? మీరే టైలరింగ్ పని చేసి ఎందుకు సంపాదించ కూడదు? అల్లికలు, బొమ్మల తయారీ వంటివి తెలుసా... తయారుచేసి చుట్టు పక్కలవాళ్లకు ఎందుకు అమ్మకూడదు? గోరింటాకు బాగా పెడతారా... ఫంక్షన్లకు మెహందీ పెడతానంటూ ఇంటిముందు ఓ బోర్డు ఎందుకు పెట్టకూడదు? కాస్తో కూస్తో చదువుకున్నారా... చిన్నపిల్లలకైనా ట్యూషన్లు ఎందుకు చెప్పకూడదు? చేసే ఓపిక, చేయాలనే మనసు ఉండాలే గానీ... చేసేందుకు ఎన్నో పనులు కనిపిస్తాయి. వాటిని చేసేందుకు మీలో మీకు ఎన్నో అర్హతలు కనిపిస్తాయి. అయితే ఇదేదో డబ్బులు సంపాదించడానికే కాదు. మీరు మధ్య తరగతి వారైతే మీ సంపాదన మీవారి సంపాదనకు తోడవుతుంది. ఇంటి అవసరాలను తీరుస్తుంది. ఆ అవసరం లేదు అనుకుంటే... మీరు చేసే పనితో మీ సమయం సద్వినియోగం అవుతుంది. మీరు చేసే పని పదిమందికీ తెలిసి ప్రశంసలు లభిస్తే కలిగే ఆనందమే వేరు. మీ పేరు మీ చుట్టుపక్కల మారుమోగితే ఆ తృప్తే వేరు. మీరు సంపాదించిన ఆ కాసింత సొమ్ముతో మీ ఇంటిలో ఓ చిన్న వస్తువును సమకూర్చగలిగినా లభించే సంతోషమే వేరు. కాబట్టి ఇక సమయాన్ని వృథా చేయకండి. సమయం వృథా అయితే... జీవితం వృథా అయినట్టే! గుడ్డు తినమంటే పిల్లలు గంతులేస్తారిక! రోజూ పొద్దున్నే పిల్లలకు ఓ గుడ్డు తినిపిస్తే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ పిల్లలతో ఏదైనా చేయించాలంటే అంత తేలిక కాదు కదా! ఒకట్రెండు రోజులు తింటారు, మూడో రోజు పేచీ పెడతారు. అలాంటి తుంటరి పిల్లలతో రోజూ గుడ్డు తినిపించడానికి ఓ మంచి మార్గం దొరికిందిప్పుడు. ఈ ఫొటోలో కనిపిస్తున్నవి ‘ఎగ్ మోల్డ్స్’. వీటికి ఉన్న గుంతలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్డును మోల్డ్‌లో ఉంచి, మూత పెట్టి గట్టిగా నొక్కి, తర్వాత బయటకు తీసి చూస్తే... మోల్డ్‌లో ఉన్న బొమ్మ ఆకారంలోకి గుడ్డు మారిపోతుంది. వాటిని చూస్తే పిల్లలు సరదా పడి చకచకా తినేస్తారు. కావాలంటే ట్రై చేసి చూడండి. రెండు మోల్డ్స్ ధర రూ. 720. ఆన్లైన్లో అయితే కాస్త తక్కువకు వస్తాయి. -
కవ్వింత: ఇప్పుడలా కాదే!
భార్య: ఏవండీ... పెళ్లయిన కొత్తలో, మీరు తింటూ నాక్కూడా గోరుముద్దలు పెట్టేవారు. ఇప్పుడలా చేయడం లేదేంటండీ.... భర్త: అప్పుడంటే నీ వంట దరిద్రంగా ఉండేది. ఇప్పుడు రుచిగానే ఉంటోంది కదా. భార్య: ఆ...! అతి తెలివి బాస్: నీకసలు బుద్ధుందా... ఆఫీసుకు స్విమ్ సూట్ వేసుకొస్తావా? రజిత: అదేంటి సార్... మన ఆఫీసు మునిగిపోయే దశలో ఉంది, అందరూ అలెర్ట్‌గా ఉండండి అని నిన్న మీరేగా చెప్పారు! బతకనేర్చాడు! రాజు, రవి అడవికి వేటకెళ్లారు. అంతలో పులి వచ్చి ఎదురుగా నిలబడింది. వెంటనే రాజు పరుగెత్తబోయాడు. రవి: నీకేమైనా పిచ్చా... తప్పించుకుందామనే, పులికంటే వేగంగా పరుగెత్తగలవా నువ్వు? రాజు: పులి కంటే ఎందుకు... నీకంటే వేగంగా పరుగెత్తితే చాలు కదా... అంటూ రయ్యిమన్నాడు రాజు. రూల్స్ పాటిస్తే... టీచర్: ఏంటింత లేటయ్యింది? బన్ని: రూల్స్ ఫాలో అయ్యాను మేడమ్. అందుకే లేటయ్యింది. టీచర్: స్కూలుకి లేటయ్యేంత రూల్సేం పాటించావ్ బాబూ? బన్ని: ఇక్కడ స్కూలు ఉంది, నెమ్మదిగా వెళ్లండి అని రోడ్డు పక్కన రాసుంది మేడమ్. అందుకే మెల్లగా వచ్చా. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మీరేగా చెప్పారు! -
నవ్వింత: పేదకుటుంబం అంటే...
ఒక ధనవంతుడి కొడుకుని స్కూల్లో ‘పేదకుటుంబం’ అనే విషయం మీద వ్యాసం రాయ మన్నారు. అతడు ఇలా రాయసాగాడు. ‘‘అనగనగా ఓ బీద కుటుంబం. తండ్రి చాలా బీదవాడు. తల్లి కూడా ఎంతో పేదది. వాళ్ల పిల్లలు కూడా అంతే. పాపం వాళ్ల కారు డ్రైవరు, వంటమనిషి, తోటమాలి... అంతా పేదవాళ్లే. చివరకు వాళ్లింట్లో పనిచేసే వాచ్‌మేన్ కూడా బీదవాడే. ఒక రోజున వాళ్లు తినడానికి తిండిలేక, ఆహారం వెతుక్కంటూ కారులో బయలుదేరారు...’’ పెళ్లాడేదెవరిని? అతడు: ఇక మన పెళ్లి జరగదు రాధా... ఆమె: ఎందుకు గోపీ? అతడు: పొద్దున మీ ఇంటికి వెళ్లాను. ఆమె: మా నాన్నను కలిశావా? వద్దన్నాడా?! అతడు: కాదు మీ చెల్లిని చూశా! వార్నీ... ఏం చెప్పావ్! టీచర్: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? స్టూడెంట్: డాక్టర్నవుతా. దాని కోసం ఇప్పటి నుంచే జీవశాస్త్రం, గణిత శాస్త్రం బాగా నేర్చుకొంటున్నా. టీచర్: డాక్టర్ అవ్వాలంటే జీవశాస్త్రం నేర్చుకొంటే చాలుగా, గణితం ఎందుకు? స్టూడెంట్: బిల్స్ రాసివ్వడానికి! నాకూ రాదులే! స్విమ్మింగ్‌పూల్‌లోకి దూసుకెళ్తున్న గణేష్‌ని అక్కడి గార్డ్ అడ్డుకొన్నాడు. గార్డ్: అందులో నీళ్లు లేవు సార్.. గ ణేష్: నాక్కూడా ఈత రాదు లేవయ్యా! -
‘మిస్సైల్’ జాన్సన్
అడిలైడ్: కనీసం రెండో టెస్టులోనైనా రాణించి యాషెస్ సిరీస్‌ను సమం చేయాలనుకున్న ఇంగ్లండ్ ఆశలపై ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ (7/40) నీళ్లు చల్లాడు. నిప్పులు చెరిగే బంతులతో కుక్ సేనను వణికించాడు. దీంతో అడిలైడ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై క్లార్క్ సేన పట్టు బిగించింది. జాన్సన్ దెబ్బకు శనివారం మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. దీంతో కంగారూలకు 398 పరుగుల ఆధిక్యం లభించింది. బెల్ (72 నాటౌట్), కార్‌బెరీ (60) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా 530 పరుగుల ఆధిక్యంలో ఉంది. వార్నర్ (83 బ్యాటింగ్), స్మిత్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 35/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రూట్ (15), పీటర్సన్ (4) వెంటనే అవుటయ్యారు. కార్‌బెరీ, బెల్ నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే జాన్సన్ బంతులకు మిడిల్, లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. బెల్ క్రీజులో నిలదొక్కుకున్నా... రెండోఎండ్‌లో ఆసీస్ పేసర్ వరుస పెట్టి వికెట్లు తీస్తూ పోయాడు. దీంతో ఇంగ్లండ్ 61 పరుగులకు చివరి 7 వికెట్లు కోల్పోయింది. లియోన్, సిడిల్, వాట్సన్ తలా ఓ వికెట్ తీశారు. -
టీవీక్షణం: రోజంతా ఘుమఘుమలే!
మహిళలకు వంట చేయడమంటే ఎంత ఇష్టమో, వంటల కార్యక్రమాలు చూడటమన్నా అంతే ఇష్టం. అందుకే ప్రతి చానెల్లోనూ ఏదో ఒక సమయంలో వంటల కార్యక్రమాలు వచ్చేలా చూసుకుంటారు నిర్వాహకులు. ఆ సమయానికల్లా అన్ని పనులూ మానేసుకుని టీవీల ముందు హాజరైపోతారు ఇల్లాళ్లు. మరి ఆ సమయానికి కరెంటు పోతే? ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే? ఆ కార్యక్రమాలు మిస్ అవ్వాల్సిందేనా? ఈ టెన్షన్ లేకుండా ఉండాలనే... ఖానా ఖజానా చానెల్‌ను తెచ్చారు ‘జీ’వారు. ఒకప్పుడు సూపర్ హిట్టయిన సంజీవ్ కపూర్ కుకరీ షో పేరునే ఈ చానెల్‌కు పెట్టారు. మన దేశంలో ఇదే తొలి 24 గంటల వంటల చానెల్. ఇందులో వరల్డ్ ఆఫ్ ఫుడ్ అంటూ విదేశీ వంటలను పరిచయం చేస్తున్నారు. సింప్లీ సౌత్‌లో దక్షిణాది వంటకాల రుచి చూపిస్తున్నారు. చెఫ్ స్పెషల్ అంటూ దేశంలోని ప్రముఖ చెఫ్‌లు తమ స్పెషల్ రెసిపీలను నేర్పుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో టిఫిన్లు, స్నాక్ అటాక్‌లో వైవిధ్యభరితమైన స్నాక్స్ గురించి చెబుతున్నారు. కోస్టల్ కర్రీలో సీఫుడ్ వెరైటీలు, హౌ సే వావ్ తక్లో వంటల చిట్కాలు, బచ్చా పార్టీలో పిల్లల కోసం ప్రత్యేక వంటకాలు, ఫిల్మీ రసోయీలో సినీ తారల ఫేవరేట్ డిష్‌లు... చూడాలే కానీ బోలెడు! ‘అబ్ హర్ కోయీ చెఫ్’ పేరుతో సాధారణ గృహిణులకు కూడా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వంట బాగా చేయగలిగిన ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రాంతంతో సంబంధం లేదు. కాకపోతే హిందీ చానెల్ కాబట్టి హిందీ వచ్చి ఉండాలి. ఇలా వంట నేర్చుకోవడానికి, వంట నైపుణ్యాన్ని ప్రదర్శించడానికీ కూడా అవకాశం కల్పించడం వల్లే... ఖానా ఖజానా వీక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది!